హైబీపీకి కారణాలు

BP-Blood Pressure Levels

Blood Pressure CategorySystolic mm Hg (upper #)and/orDiastolic mm Hg (lower #)
Normalless than 120andless than 80
Prehypertension120 – 139or80 – 89
High Blood Pressure
(Hypertension) Stage 1
140 – 159or90 – 99
High Blood Pressure
(Hypertension) Stage 2/td>
160 or higheror100 or higher
Hypertensive Crisis
-Emergency care needed
Higher than 180orHigher than 110

ప్రతి వ్యక్తి రక్తనాళాల్లోనూ రక్తం ఒక నిర్దిష్టమైన రీతిలో, కొంత వేగంతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వేగం కొనసాగాలంటే రక్తనాళాల్లో రక్తం కొంత ఒత్తిడితో ప్రవహించాలి. ఇలా రక్తానికి ఒత్తిడి ఉండాలంటే అది గుండె స్పందనల వల్లనే  సాధ్యమవుతుంది. రక్తాన్ని  గుండె పంప్‌ చేసినప్పుడు మంచి రక్తనాళాల్లో (ఆర్టరీస్‌) లో రక్తం ఎంత పీడనంతో ప్రవహిస్తుందో తెలుసుకునే కొలత (రీడింగ్‌)ను ‘సిస్టోలిక్‌ ప్రెషర్‌’ అంటారు. అలాగే రెండు సిస్టోలిక్‌ ప్రెషర్స్‌ మధ్యన రక్తనాళాల్లో రక్త పీడనాన్ని డయాస్టోలిక్‌ ప్రెషర్‌ అంటారు. ఇలా రక్తపోటుకు రెండు విలువలు ఉంటాయి. దీన్నే సాధారణంగా 120/80 గా పేర్కొంటుంటారు.

ప్రీ–హైపర్‌టెన్షన్‌ 
సాధారణంగా డాక్టర్‌ దగ్గరికి రోగి వెళ్లగానే కొలత రక్తపోటును పరిశీలిస్తారు. ఒకవేళ అది 120/80 ఉంటే ఇక దాని గురించి ఆలోచించరు. కానీ ఈ కొలతలు ఎప్పుడూ ఒకేలా ఉండకుండా కొంత మారుతూ ఉండవచ్చు. ఉదాహరణకు సిస్టోలిక్‌ రక్తపోటు విలువ 120కి బదులుగా 121 నుంచి 139 ఉందనుకోండి. అలాగే కింది విలువ 80కి బదులుగా 81 నుంచి 89 వరకు ఉందనుకోండి. ఆ కొలతలు ఉన్న దశను పూర్తిగా రక్తపోటు ఉన్న దశగా చెప్పడం కుదరదు. అందుకే డాక్టర్లు ఆ దశను ‘ప్రీహైపర్‌టెన్షన్‌’ (రక్తపోటు రాబోయే ముందు దశ)గా పేర్కొంటారు. ఈ ‘ప్రీహైపర్‌టెన్షన్‌’ దశ భవిష్యత్తులో ‘హైబీపీ’కి దారితీయవచ్చు.

ప్రీ–హైపర్‌టెన్షన్‌ దాటి ఇక బీపీ నిర్ధారణ ఇలా…
బీపీ ఉన్నట్లుగా నిర్ధారణ కోసం తరచూ రక్తపోటును చెక్‌ చేసుకుంటూ ఉండాలి. బీపీ ఎక్కువగా ఉన్నట్లు తెలిపే కొలతలు రెండు / మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు వస్తే దాన్ని హైబీపీగా నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడిక ప్రీ–హైపర్‌టెన్షన్‌ విషయాన్ని మరచిపోయి… తప్పక బీపీ నియంత్రణ మందులను డాక్టర్‌ సూచించిన విధంగా వాడాలి.

ఇక పెరుగుతున్న వయసు, స్థూలకాయం, హైబీపీ ఉన్న కుటుంబచరిత్ర, ఒకే చోట కుదురుగా కూర్చుని పనిచేసే జీవనశైలి, ఆహారంలో ఎప్పుడూ పొటాషియమ్‌ ఎక్కువగా ఉండేలా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, పొగాకు నమిలే అలవాటు, మద్యం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అనేక అంశాలు హైబీపీకి రిస్క్‌ ఫ్యాక్టర్లు.

మనందరికీ రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్‌ అంటే తెలుసు. కానీ రక్తపోటు వచ్చేందుకు ముందు మన దేహం కొన్ని హెచ్చరికలు చేస్తుంటుంది. వాటిని జాగ్రత్తగా గమనిస్తే అసలు రక్తపోటును నివారించడమో లేదా మరింత ఆలస్యంగా వచ్చేలా జాగ్రత్తపడటమో చేయవచ్చు. అలా హెచ్చరించే ఆ దశను ‘ప్రీ–హైపర్‌టెన్షన్‌’ దశగా చెప్పవచ్చు. ప్రీ హైపర్‌టెన్షన్‌ దశలోనే జాగ్రత్త పడితే మనం మనకెన్నో ఆరోగ్య అనర్థాలూ, కిడ్నీ, బ్రెయిన్‌ లాంటి కీలక అవయవాలు దెబ్బతినే పరిస్థితిని నివారించవచ్చు. ఆ ‘ప్రీ–హైపర్‌టెన్షన్‌’ దశపై అవగాహన కోసమే ఈ కథనం.

ఈ జాగ్రత్త తీసుకోండి
అంతగా హైబీపీ లేకుండా కేవలం ప్రీహైపర్‌టెన్షన్‌ ఉన్నప్పుడు… అది ప్రమాదకర దశ కాదని రిలాక్స్‌ కాకూడదు. అది పంపే హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని అప్రమత్తం కండి. వెంటనే జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే అప్పటికీ జాగ్రత్త తీసుకోకపోతే అది గుండెపోటు, పక్షవాతం, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు.

%d bloggers like this: