Logo Raju's Resource Hub

చక్రవర్తులు…రాజులు

శ్రీ హర్షుడు..హర్షవర్ధనుడు

శ్రీ హర్షుడుని హర్షవర్ధనుడు అని కూడా అంటారు. మొట్టమొదట స్థానేశ్వర్యం రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. తరువాత క్రీ.శ.606 వ సం.లో తన రాజధానిని కన్యాకుబ్జంలో ఏర్పాటు చేసుకున్నాడు.ఉత్తర భారతంలో హిమాలయా పర్వత పాదాలనుండి దక్షిణాన నర్మదా నదివరకు, పశ్చిమాన వల్లభి నుండి తూర్పున గంజాం వరకుగల ప్రాంతాలను తన ఏలుబడిలోనికి తెచ్చుకొని పరిపాలించిన మహాచక్రవర్తి శ్రీహర్షుడు.హర్షుని యంత్రాంగం పటిష్టమైనది. పరిపాలనలో ప్రధానోద్యోగి ‘మహాసంధి విగ్రహాధికారి’. ఇతర సిబ్బంది ఇతనికి సహాయం చేస్తారు. రాష్ట్రపాల రాజప్రతినిధుల ద్వారా జరిగేది. […]

శ్రీ హర్షుడు..హర్షవర్ధనుడు Read More »

సముద్రగుప్తుడు

భారతదేశాన్ని పాలించిన గుప్తరాజ వంశీయులలో ప్రముఖ చక్రవర్తి సముద్రగుప్తుడు. క్రీ.శం.330 నుండి 375 వరకు ఈయన పరిపాలన సాగింది. తన తండ్రి ఒకటవ చంద్రగుప్తుని తరువాత క్రీ.శ.330 సం.లో పట్టాభిషక్తుడైనాడు.పరాక్రమవంతుడు, వీరుడైన సముద్రగుప్తుడు ఉత్తరభారత దేశాన్ని జయించి దక్షిణిపథంవైపు తిరిగాడు. అప్పట్లో వేంగి దేశాన్ని హస్తివర్మ, కాంచీపురాన్ని విష్ణుగోపుడు పరిపాలించేవారు. వీరిని కూడా జయించాడు.సముద్రగుప్తుడు అశ్వమేధయాగం చేశాడని దానికి గుర్తుగా బంగారు నాణాలను ముద్రించి వాటిపై రాజాధి రాజ, అప్రతిహత యోధానుయోధ అని తన బిరుదనామాలు చెక్కించాడని

సముద్రగుప్తుడు Read More »

శ్రీకృష్ణ దేవరాయలు

1336 సంవత్సరంలో విద్యారణ్య స్వామి ఆశీస్సులతో కాకతీయ ప్రతాపరుద్రుని సుబేదారు ఐన హరిహర రాయలుచే తుంగభద్రా నదీ తీరంలో స్థాపించబడ్డది విజయనగర సామ్రాజ్యం.వీరిలో తుళువ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు ప్రముఖుడు. ఇతని పరిపాలనా కాలం 1509 సం. నుండి 1530 సంవత్సరం వరకు. పరిపాలనా కాలం తక్కువైననూ కళలను, సాహిత్యాన్ని పోషించిన వాడుగా పేరు తెచ్చుకున్నాడు. గొప్ప యుద్దవీరుడు కూడా. ఇతని తండ్రి తుళువ నరసనాయకుడు, తల్లి నాగలా దేవి. 17 జనవరి 1471 సంవత్సరంలో హంపిలో

శ్రీకృష్ణ దేవరాయలు Read More »

రంజిత్ సింగ్

పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్. సిక్కురాజ్య కూటమిలో సుకార్ చకియా శాఖకు నాయకుడు. తన ప్రతిభతో ఆఫ్గన్ రాజు జమాన్షాను ఓడించి 1799 సం.లో లాహోర్ ను తన రాజ్యంలో కలుపుకున్నాడు.1822 సం.లో అమృత్ సర్ ను జయించి రెండు సిక్కు రాజధానులను తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు.ఇతని రాజ్యం ఉత్తరాన కాశ్మీర్ వరకూ, పశ్చిమాన ముల్తాన్ వరకు, వాయువ్యంలో పెషావర్ వరకు విస్తరించింది.తన సైనికులకు విదేశీ నిపుణలచే శిక్షణ ఇప్పంచి బలపరచుకున్నాడు. పంజాబీ భాషను పోషించుటయే గాక

రంజిత్ సింగ్ Read More »

రాజరాజ చోళుడు

చోళ రాజవంశ చక్రవర్తులలో ప్రముఖుడు రాజరాజ చోళుడు. క్రీ.శ. 985 సం.లో తంజావూరు (నేటి తమిళనాడులోని) రాజధానిగా చోళ సింహాసనాన్ని అధిష్టించి 1018 సం. దాకా పరిపాలించాడు.చేర, పాండ్య, తూర్పు చాళుక్య (వేంగి), ఓఢ్ర దేశాలను జయించి బెంగాల్ నుండి సింహళం వరకు తన ఆధిపత్యంలోనికి తెచ్చుకున్నాడు. రాజరాజ చోళుడు దేశ భాషలను ఆదరించి, స్థానికసంస్కృతులను ఆదరించి, దేవాలయ వాస్తు శిల్ప కళను పోషించి పేరుపొందాడు. తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇతని కాలంలో నిర్మించినదే. రాజరాజ చోళుని పరిపాలనలో

రాజరాజ చోళుడు Read More »

రెండవ ప్రతాప రుద్రుడు

కాకతీయ రాణి రుద్రమ దేవి మనుమడు. రుద్రమదేవికి పుత్ర సంతానం లేకపోవటంతో పెద్ద కుమార్తె ముమ్మడమ్మ పుత్రుడైన ప్రతాప రుద్రుని దత్తపుత్రునిగా స్వీకరించింది. ఇతని తండ్రి మహాదేవరాయలు. రుద్రమదేవి మరణానంతరం 1295 లో సింహాసనం అధిష్టించాడు. అప్పటికి ఇతని వయస్సు 35 సంవత్సరాలు. పరిపాలనా విధానాన్ని కట్టుదిట్టం చేసి 77 గురు నాయకులు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల పరిపాలనా బాధ్యతలను వారికి అప్పగించాడు. ప్రతారుద్రుని సైన్యం చాలా శక్తివంతమైనది. ఢిల్లీ నుండి అల్లావుద్దీన్ ఖల్జీ ఏడు

రెండవ ప్రతాప రుద్రుడు Read More »

పృధ్వీరాజ్

ఢిల్లీని కేంద్రంగా పాలించిన చివరి హిందూ రాజు. పృధ్వీరాజు చౌహాన్ వంశీయుడు. క్రీ.శ. 1179 సం.లో సింహాసనం అధిష్టించాడు. అప్పట్లో కనౌజ్ ను పరిపాలిస్తున్న జయచంద్రుని కుమార్తె రాణీ సంయుక్తను అపహరించి వివాహమాడాడు. ఘోరీ మహ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసినప్పుడు స్థానేశ్వరానికి సమీపంలో ఉన్న తరాయి అనే ప్రాంతం వద్ద రాజపుత్ర యోధుల సాయంతో ఘోరీ మహ్మద్ సేనలను ఒడించాడు. కానీ తరువాత సంవత్సరం ఘోరీ మహ్మద్ దాదాపు 1,20,000 సైన్యంతో దండెత్తి వచ్చినపుడు ఓడిపోయి

పృధ్వీరాజ్ Read More »

Raja Purushotham, Porus, Puru….. పురుషోత్తముడు

పురుషోత్తముడు…. దేశభక్తుడు, పరాక్రమశాలి. క్రీస్తు పూర్వం 256-323 మధ్యకాలంలో గ్రీకు దేశంలోని మాసిడోనియా రాజైన అలగ్జాండర్ ప్రపంచాన్నంతటిని జయించాలని దండయాత్రలు చేస్తూ భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత జీలం నది ఒడ్డున అలగ్జాండర్ సేనలతో యుద్ధం చేసాడు. కానీ ఓడిపోవటం జరిగింది. ఐతే అలగ్జాండర్ పురుషోత్తముని పరాక్రమాన్ని మెచ్చుకుని ఇతని రాజ్యం ఇతనికి ఇచ్చాడు. ఇతని రాజ్యం పంజాబ్ లోని జీలం – చీనాబ్ నదుల మధ్య ప్రాంతమని గ్రీకు రచనల బట్టి తెలుస్తుంది. పురుషోత్తమునికే పూరువు, పోరస్

Raja Purushotham, Porus, Puru….. పురుషోత్తముడు Read More »

గణపతి దేవుడు

గణపతి దేవుడు కాకతీయ చక్రవర్తి. 1999 నుండి 1262 వరకు ఒరుగల్లు (నేటి వరంగల్) ను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఇతను గొప్ప వీరుడు కూడా. వెలనాటి పృధ్వీశ్వరునని, నెల్లూరు పాలకుడు తమ్ముసిద్దిని, తూర్పు గాంగ రాజైన అనియంక భీముణ్ణి, కంచి పాలకుడు రాజేంద్రచోళున్ని జయించాడు. దాదాపు తెలుగు ప్రాంతాలన్నిటిని తన ఏలుబడిలోకి తెచ్చుకున్నాడు. ఒకటవ ప్రతాప రుద్రుడు ప్రారంభించిన ఓరుగల్లు కోటను పూర్తిచేశాడు. గణపతి దేవుని భార్య సోమలా దేవి. ఇతనికు కుమారులు లేరు. తన

గణపతి దేవుడు Read More »

గౌతమీపుత్ర శాతకర్ణి

ఆంధ్రదేశాన్ని పరిపాలించి శాతవాహన రాజులలో పేరుగాంచినవాడు శాతవాహన రాజులలో 28వ వాడు గౌతమీపుత్ర శాతకర్ణి తల్లికి గౌరవస్థానం ఇచ్చి తల్లి పేరైన గౌతమిని తన పేరు ముందు చేర్చుకున్నాడు. గౌతమీపుత్ర శాతకర్ణి క్రీ.శ. రెండవ శతాబ్దానికి చెందినవాడు. భారతదేశానికి వాయువ్య దిశనుండి వచ్చిన మధ్య ఆసియా తెగవారైన కుషాణులను, శక, పహ్లవులను, యవనులను జయించి తెలుగు రాజ్యాన్ని సుస్థిరం చేశాడు.ఈయన తల్లి గౌతమీ బాలశ్రీ శాతకర్ణిని ‘శాతవాహన కీర్తి వైభవ పునరుద్ధారకుడు’ క్షత్రీయ గర్వాపహారకుడు, అసమాన బ్రాహ్మణుడు

గౌతమీపుత్ర శాతకర్ణి Read More »

చంద్రగుప్త విక్రమాదిత్యుడు

భారతీయ మహా చక్రవర్తులలో గుప్తవంశానికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్యడు ఒకడు. భారతదేశ చరిత్రలో గుప్తుల పరిపాలనను స్వర్ణయుగంగా చెబుతారు. గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి చంద్రగుప్తుని కుమారుడు సముద్రగుప్తుడు. ఈ సముద్రగుప్తుని కుమారుడే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. క్రీ.శకం 375 నుండి 413 వరకు సుమారు 38 సంవత్సరాలపాటు ఈయన పరిపాలన సాగింది.ఇతని రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం వరకూ వ్యాపించటంతో విదేశాలతో సంభంధాలు పెరిగాయి. చంద్రగుప్తుని రాజ్యకాలంలో గుప్త సామ్రాజ్యం అత్యున్నత స్థితిని పొందింది. ప్రఖ్యాత చైనా

చంద్రగుప్త విక్రమాదిత్యుడు Read More »

చంద్రగుప్త మౌర్యుడు

మగధ రాజ్యాన్ని పరిపాలించే నందరాజులచే అవమానించబడ్డ మహాజ్ఞాని, విద్యాంసుడు, పండితుడు ఐన చాణుక్యుని సాయంతో మౌర్య సామ్రాజ్యానికి చంద్రగుప్తుడు చక్రవర్తి అయ్యాడు. క్రీ.శ. 313లో పట్టాభిషక్తుడయ్యాడు.నందవంశానికి చెందిన మహాపద్మనందునికి ముర అనే శూద్ర స్త్రీ వలన జన్మించాడంటారు. ముర పుత్రుడు కావటంవలన మౌర్య అనే పేరువచ్చింది. క్రీ.పూర్యం 340 సం.లో పాటలీపుత్రంలో జన్మించాడు. ఇతను తన తల్లి పేరుమీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇతని రాజధాని నగరం పాటలీపుత్రం (బీహార్ లోని నేటి పాట్నా). ఈ చక్రవర్తి

చంద్రగుప్త మౌర్యుడు Read More »

ఛత్రపతి శివాజీ

ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర రాజ్య స్థాపకుడు మహావీరుడు శివాజీ.బీజపూర్ సంస్థానంలో జాగీర్దార్ గా పనిచేసిన షాజీ భాంస్లే ఇతని తండ్రి. జిజియాబాయ్ శివాజీ తల్లి. జిజియా బాయి గొప్ప దైవ భక్తురాలు. చిన్నతనంలో తల్లి ద్వారా చెప్పబడిన పురాణ కథలు, వీరగాధలు విని శివాజీ ప్రభావితుడయ్యాడు. శివాజీ 19 ఫిబ్రవరి 1630 సంవత్సరంలో జన్మించాడుహిందువులు ముస్లింల కొలువులో పనిచేయడం ఇష్టంలేక వారిని దాస్య విముక్తులను చేయటానికి, హిందూ ధర్మం కాపాడాటానికి జీవితాంతం కృషి చేసాడు.1646 సం.లో శివాజీ 17వ

ఛత్రపతి శివాజీ Read More »

అశోక చక్రవర్తి

భారతదేశ చక్రవర్తులలో ఆగ్రగణ్యుడు అశోక చక్రవర్తి. ఇతను మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడు. బింబిసారుని పుత్రుడు. ఇతని పరిపాలన క్రీ.పూర్వం 268 సం.నుండి 232 సం.దాకా సాగింది. దాదాపు భారతదేశమంతా (తమిళనాడు, కేరళ, కర్ణాటకలలోని కొన్ని ప్రాంతాలు తప్ప) అశోకుని ఏలుబడిలోకి వచ్చింది. అశోకుని కాలంలో భారతదేశం ఉన్నత స్థితికి చేరుకుంది.అశోకుని రాజధాని పాటలీపుత్రం (ప్రస్తుతం పాట్నా). అశోకుడు ప్రధమంలో హిందూ మతాభిమాని. చాలా పరాక్రమవంతుడు. తాత చంద్రగుప్తుని శౌర్య పరాక్రమాలకు వారసుడు. తన పరాక్రమంతో

అశోక చక్రవర్తి Read More »

Google ad
Google ad
Scroll to Top