అష్టదిగ్గజాలు

తెనాలి రామలింగ కవి (రామకృష్ణ)

ఇతని స్వస్థలం తూములూరు(పెరిగిన ఊరు) తెనాలి (గుంటూరు జిల్లా) తల్లి లక్ష్మమ్మ. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధుడు. తొలుత సామాన్య వ్యక్తి అయిన ఇతడు కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరుడు అయ్యాడు. హాస్యకవిగా, వికటకవిగా పేరు పొందాడు. సత్తెనపల్లి మండలానికి చెందిన లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్యాంబ దంపతులు ఇతని తల్లితండ్రులు. తాత, సుదక్షిణా పరిణయం వ్రాసిన అప్పన్నకవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడులోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ …

తెనాలి రామలింగ కవి (రామకృష్ణ) Read More »

దూర్జిటి (పెద దూర్జటి)

దూర్జటి పేరుతో ఇంకో నలుగురున్నారు. అందువలన ఇతనిని పెద దూర్జటి అని కూడా అంటారు. దూర్జటి (పొత్తసీమ) ప్రస్తుతం చిత్తూజిల్లా శ్రీకాళహస్తి నివాసి. తల్లి దండ్రులు నారాయణ, సింగమ్మ దంపతులు. తాత జక్కయ నారాయణ. దూర్జటి కాళహస్తీశ్వర భక్తుడు. భక్తి ప్రబంధమైన శ్రీ కాళహస్తీర మహాత్యం మరియు శ్రీకాళహస్తీశ్యర శతకం దూర్జటి యొక్క ప్రధాన రచనలు. దూర్జటి చెప్పినవి, మరియు చెప్పబడినవిగా అనేక చాటువులు ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నవి. క్రీ.శ. 1480 నుండి 1545 వరకు జీవించాడని …

దూర్జిటి (పెద దూర్జటి) Read More »

పింగళి సూరన

తెలుగు సాహిత్యమును ఏలిన కవులలో పింగళి సూరన ఒకరు. సూరన రాఘవ పాండవీయము అనే ఒక అత్యుద్భుతమైన శ్లేష కావ్యమును రచించెను. ఈ కావ్యంలోని ప్రతి పద్యమును రామాయణంలోని కధకు, భారతంలోని కధకు ఒకేసారి అన్వయించుకోవచ్చును. పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయము దక్షిణ ఆసియాలోనే మొట్టమొది నవలగా భావిస్తారు. మరియు తెలుగు సాహిత్యంలో మొట్ట మొదటి కావ్యంగా పరిగణిస్తారు. కళాపూర్ణోదయము ప్రేమకావ్యము. ఇతని తల్లి అబ్బమాంబ తండ్రి అమరన్న. ఇతను నంద్యాలలోని కనాల గ్రామములో నివసించేవాడని భావిస్తున్నారు. …

పింగళి సూరన Read More »

మాదయ్య గారి మల్లన

ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్తావన సాహిత్యములో తొలిసారిగా చేసినది మల్లన్న. లగ్నము పెట్టటం దగ్గరనుండి గృహప్రవేశము వరకు 75 గద్య పద్యములలో ఆనాటి పెళ్ళితంతు గురించి తన ”రాజశేఖర చరిత్రలో” వర్ణించాడు. ఇతను 516 గద్య పద్యములతో కూడిన రాజశేఖర చరిత్ర అనే కావ్యమును రాయల ఆస్థానములో చేరక ముందే రచించినాడు. తన కావ్యమును వినుకొండ-గుత్తిసీమలను పరిపాలించిన నాదెండ్ల అప్పన మంత్రికి అంకితమిచ్చాడు. అప్పన మంత్రి తిమ్మరుసు మేనల్లుడు మరియు అల్లుడు కూడా. …

మాదయ్య గారి మల్లన Read More »

రామరాజ భూషణుడు (భట్టుమూర్తి)

రామరాజ భూషణుడుగా పేరుగాంచిన భట్టుమూర్తి తెలుగు కవి మరియు సంగీత విద్యాంసుడు.శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళీయ రామరాయలు ఆస్థానమునకు ఆభరణము వలె ఉండుట వలన ”రామరాజ భూషణుడు” అనే పేరు వచ్చినది. భట్టుమూర్తి నెల్లూరు ప్రాంతమునకు చెందినవాడుగా భావించుచున్నారు. ఇతని రచనలు వసుచరిత్రము, నలోపాఖ్యానము మరియు సరస భూపాలీయము (కావ్యాలంకార సంగ్రహము మరోపేరు) అనే కావ్యములు. వసుచరిత్ర వీటన్నిలోని ప్రసిద్ధమైనది. కావ్యాలంకార సంగ్రహము భట్టుమూర్తి రచించిన మొది గ్రంధము. సరసభూపాలీయమని దీనికి మరోపేరు. కావ్యధ్వని రసాలంకారములను గురించి, నాయికా …

రామరాజ భూషణుడు (భట్టుమూర్తి) Read More »

అయ్యలరాజు రామభద్రుడు

ఈయన కడప జిల్లాకు చెందిన వాడు. క్రీ.శ 1500 నుండి క్రీ.శ 1565 కాలానికి చెందినవాడుగా భావిస్తున్నారు. అయ్యaరాజు వంశానికి చెందిన అయ్యరాజు తిప్పయ్యగారి మనుమడుని ఆరుద్ర గారు చెప్పారు. ఈ అయ్యలరాజు తిప్పగారే ఒంటిమిట్ట రఘువీర శతకకర్త. రామభద్రుడు వ్రాసిన ”రామాభ్యుదయాన్ని” శ్రీకృష్ణ దేవరాయల అల్లుడైన అళీయ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితమిచ్చాడు. రామాభ్యుదయము ఎనిమిది ఆశ్యాశాల ప్రబంధము. ఇందులో కొన్ని చమత్కారాలు శూర్పణఖ ముక్కు చెవులు కోసింది లక్ష్మణుడు కాదని చెప్పడం. ఈ …

అయ్యలరాజు రామభద్రుడు Read More »

నందితిమ్మన

నంది తిమ్మనను ముక్కుతిమ్మన అనికూడా అంటారు. ముక్కు పెద్దదిగా ఉండటం వలన మరియు కవితలలో ముక్కును చక్కగా వర్ణించడం వలన ఇలా పిలుస్తారు.తిమ్మన, రాయలు భార్య తిరుమలదేవితో అరణంగా వచ్చినవాడు. ఇతను అనంతపురానికి చెందినవాడని అంటారు. తల్లిదండ్రులు సింగన్న, తిమ్మాంబ దంపతులు. తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడు. ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (మలయ మారుత కవి) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయ ఆస్థానంలో ఉండేవారు. తిమ్మన తన …

నందితిమ్మన Read More »

అల్లసాని పెద్దన

15-16 శతాబ్డాల మధ్య కాలంలో ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఆగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత గండపెండేరం తొడిగించుకున్నవాడు. పెద్దన రచించిన మనుచరిత్ర ప్రధమ ప్రబంధంగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో రాయలవారికి సలహాలు ఇచ్చేవాడు. అందుచేత ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా పిలుస్తారు. పెద్దన రచనలు : మనుచరిత్ర (స్వారోచిపమనుసంభవము)లభ్యంకాని రచనలు : హరికథా సారము, …

అల్లసాని పెద్దన Read More »