వేసవిలో మొక్కలు – జాగ్రత్తలు

Special Story On Protect Your Indoor Plants From Strong Summer - Sakshi

వేసవిలో మొక్కలను చాలా జాగ్రత్తగా కంటిపాపలా చూసుకోవాలి. కొన్ని మొక్కలు వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఆకులు రాలి, కొత్తగా చిగురుస్తాయి, మరికొన్ని మొక్కలు ఎండిపోతాయి. అయితే ఎక్కువ కాలం ఉండే మొక్కలు పెరగడానికి వేసవికాలం అనువుగా ఉంటుంది. అందువల్ల వేసవిలో పెరిగే మొక్కల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెంచుకొనే మొక్కలు వేసవిలో వడిలిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండోర్‌ ప్లాంట్స్‌ ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వీటిని సూర్యరశ్మి నేరుగా తగలని ప్రాంతాలలో ఉంచాలి.

బాగా ఎండలు మొదలు కాకుండా అంటే మార్చి, ఏప్రిల్‌ మాసాలలో మొక్కలను ట్రిమ్‌ చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మలను తీసేయాలి. మొక్కలకు నీళ్లు ఎంత అవసరం అన్న సంగతి కుండీలోని మట్టిని తాకగానే తెలిసిపోతుంది. తాకగానే ఎండినట్లు అనిపిస్తే వెంటనే నీళ్లు పోయాలని అర్థం. నెలకి ఒకసారి ఏదైనా ఎరువుల రసాయనాన్ని నీళ్లలో కలిపి తగు మోతాదులో మొక్కలకు పోయాలి. అలా చేయటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తాయి. అలాగని మోతాదు పెరిగితే మాత్రం మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది.

మొక్కలు పెద్దవయ్యేకొద్దీ వేళ్లు విస్తరిస్తుంటాయి. కాబట్టి మొక్కల సైజును బట్టి చిన్న కుండీలో ఉన్న మొక్కలను పెద్ద కుండీలలోకి మార్పు చేయటానికి ఇది అనువైన కాలం. ఇండోర్‌ మొక్కలను సూర్యరశ్మి నేరుగా పడకుండా చూసుకోవాలి. గదిలో ఉండే ఉష్ణోగ్రత సరిపోతుంది. ఈ మొక్కలకు చెదలు పట్టవు. పురుగుల బెడద కూడా ఉండదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా రెండు చుక్కల వేప నూనెను నీళ్లలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల మట్టి నుంచి  సంక్రమించే తెగుళ్లు రాకుండా నివారించుకోవచ్చు. మొక్కలను ఎప్పుడూ ఒకేచోట ఉంచకూడదు. ఒకటి లేదా రెండు వారాలకు ఒకసారి స్థలం మారుస్తూ ఉండాలి.

నిమ్మ ఆకులతో ప్రయోజనాలు

నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. 

మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది.

నిమ్మ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకనే నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు. నిమ్మ ఆకుల పేస్టును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖ పర్చస్సు పెరుగుతుంది. ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. 

నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. 

నిమ్మ ఆకుల్ని హ్యాండ్‌వాష్‌లా  వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూసుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. 

వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు. 

ఆఫీస్ టేబుల్ మీద చిన్నగా, బుజ్జిగా, అందం గా ఉండే చిన్న మొక్కలు

 • అలోవెరా

అదేంటీ? నర దిష్టి కోసం ఉపయోగించే మొక్కను ఇంట్లోను ఆఫీస్ లోనూ పెట్టుకుంటారా …? అని తిట్టుకోవద్దు. ఆ నమ్మకాల సంగతి అటు ఉంచితే, ఇది చాలా మంచి మొక్క, గాలిని కూడా పరిశుభ్రం చేస్తుంది. నాసా వారి క్లీన్ ఎయిర్ స్టడీ లో కూడా ఈ మొక్క ఉన్నది. పెద్ద జాగ్రత్తలు కూడా అవసరం లేదు ఈ మొక్కకు, ఒకసారి నీళ్ళు పోసిన తరువాత పూర్తిగా మట్టి ఎండిన తరువాత మాత్రమే మళ్ళీ నీళ్ళు పోయాలి.మట్టిలో నీరు నిలవ ఉండకుండా చూసుకోండి. వారానికి ఒకసారైనా ఎండలో పెట్టండి.

ఐనా కూడా దీనిని మీ ఆఫీస్ లో పెట్టుకోడానికి మీ మనసు ఒప్పుకోక పోతే ఇందులో రెడ్, వైట్ అని రెండు రకాలు ఉన్నాయి… వాటిని పెట్టుకోండి, వాటి చిత్రాలు కింద ఉన్నవి.

 • లక్కీ బాంబూ

వెలుపల పెంచుకొనే మొక్కలలో నాకు నచ్చిన మొక్కలలో ఇది ఒకటి. ఆఫీస్ టేబుల్ మీద అద్భుతంగా ఉంటుంది.

దీనికి, మట్టి కూడా అవసరం లేదు… నీళ్ళలోను బతుకుతోంది. ప్రతి రెండు రోజులకు ఒకసారి నీళ్ళు మారిస్తే సరిపోతుంది. ఎండ కూడా అవసరం లేదు… కేవలం వెలుగు ఉంటే చాలు…

 • సక్యులేంట్

చూసారా ఎంత అందం గా ఉన్నాయో..! పెంచడం సులువు… నేను చూసిన వాటిల్లో అందమైన మొక్కలు

మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి ఎండలో పెట్టాలి

వీటికోసం మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి… ఆ మట్టి మిశ్రమం లో నీరు నిలవ ఉండకుండా ఇసుక, perlite, బొగ్గు, ఎండిన ఆవు పేడ లను ఉపయోగించాలి.

వీటికి నీళ్ళు అంటే నచ్చవు… మొక్క మీద నీళ్ళు పడకుండా కేవలం మట్టి లో మాత్రమే నీరు పోయాలి…

నేను వీటికి నీళ్ళు పోయాలంటే, సిరంజీ (ఇంజెక్షన్) ఉపయోగిస్తాను. వేసవిలో 7 నుంచి 10 రోజులకు, చలి కాలం లో ఐతే సుమారు 20 రోజులకు నీళ్ళు పోయాలి.

 • కాక్టస్

నీటితో ఎక్కువ పని లేదు, ప్రతి రెండు ,మూడు రోజులకు ఒకసారి ఎండ లో పెట్టండి.

 • పోతస్ / డెవిల్స్ ఐవి / మని ప్లాంట్

అందరికీ తెలిసిన మొక్కే కదా… మట్టి లోనే కాదు, నీటిలో కూడా పెరుగుతుంది .

 • స్పైడర్ ప్లాంట్

నాసా వారి క్లీన్ ఎయిర్ స్టడీ లో కూడా ఈ మొక్క ఉన్నది.

 • స్నేక్ ప్లాంట్ / మదర్ ఇన్ లా టంగ్

ఇందులో చాలా రకాలు ఉంటాయి.నాసా వారి క్లీన్ ఎయిర్ స్టడీ లో కూడా ఈ మొక్క ఉన్నది.

 • Z Z ప్లాంట్

వీటిలో తక్కువ మొత్తం లో విష పదార్థాలు ఉంటాయి. చిన్న పిల్లలకి , పెంపుడు జంతువు లకు హానికరం.

 • స్టింగ్స్ ఆఫ్ పెరల్స్

చాలా అందం గా ఉంటుంది. వీటిలో తక్కువ మొత్తం లో విష పదార్థాలు ఉంటాయి. చిన్న పిల్లలకి , పెంపుడు జంతువు లకు హానికరం.

 • జాడే ప్లాంట్

స్నేహానికి గుర్తు గా ఈ మొక్క బహుమతి గా ఇచ్చుకొంటారు. వీటిని బోన్సాయ్ గా కూడా మార్చవచ్చు.

 • ఎయిర్ ప్లాంట్స్

వీటికి మట్టితోను, నీళ్ళ తోను పనిలేదు. నీటిని పిచికారి ( water spray) చేస్తే సరిపోతుంది. ఇంకో విషమేమిటంటే ప్రతి వారం రోజుల కొకసారి, మొక్కల ఆకులను కాటన్ టవల్ తో తుడవాలి.

మిద్దె తోట

ఇప్పుడు మిద్దె తోట అనేది ఒక ఆరోగ్యమంత్రం. ఒక స్టేటస్‌ సింబల్‌గా మారింది. ఇది శుభపరిణామం. ఇందుకు ప్రత్యక్ష, పరోక్ష కారకులకు అందరికీ అభినందనలు తెలుపుతూ.. మిద్దె తోటల లేదా ఇంటిపంటల అవసరం గురించి, వాటి నిర్మాణ, నిర్వహణల గురించి కొన్ని విషయాలను చర్చిద్దాం. మిద్దె తోటల సాగు వల్ల నూరు లాభాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన లాభం పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, పండ్లు, ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాల సాగు ఉత్పత్తి. ప్రధాన ఆహారమైన వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వగైరా మిద్దె తోటల్లో పెరటి తోటల్లో సాగు చెయ్యలేం. కారణం? తగినంత విస్తీర్ణంలో మిద్దె కానీ పెరడు భూమి కానీ అందుబాటులో ఉండకపోవడం.

స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగంలో హైబ్రిడ్‌ విత్తనాలు రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం క్రమంగా పెరిగింది. ఓ దశాబ్దం క్రితం వరకు కేవలం పైర్ల మీద మాత్రమే పురుగుమందులను స్ప్రే చేసే వారు! క్రమంగా కలుపు నివారణ కోసం విషపూరిత రసాయన మందులను భూమి మీద స్ప్రే చెయ్యడం ప్రారంభం అయింది. ఒకప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన వారు బెండ, వంగ వంటి కూరగాయలను కొనేముందు పురుగు పుచ్చు ఉందో లేదో అని ప్రతీ కాయను పరీక్షగా చూసి తీసుకునే వారు. అయినా ఒకటో రెండో పుచ్చు కాయలు వచ్చేవి. ఇటీవల అటువంటి పురుగు, పుచ్చు కాయలు కనబడటమే లేదు. ఎందుకని? అంతగా పురుగుమందుల వాడకం పెరిగింది. వారం వారం ఏదో ఒక పురుగుమందును కూరగాయల మొక్కల మీద స్ప్రే చేస్తుంటారు. అదీ సంగతి!

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రంలో సుమారు అయిదు వందల పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. సాలీనా వాటి టర్నోవర్‌ అయిదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది.
ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో జరుగుతున్న పురుగుమందుల వ్యాపారం ఏ లెవల్లో సాగుతోందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లెక్క. ఇది స్వయంగా ఓ జిల్లా కేంద్రంలోని పురుగుమందుల వ్యాపారి చెప్పిన లెక్క. అంటే నిత్యం ముప్పూటలా మనం పురుగుమందులనే పళ్లాలలో పెట్టి మన పిల్లలకు, తల్లిదండ్రులకు తినమని పెడుతున్నాం– మనమూ అదే విషాహారం తింటున్నాం. ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికన్నా, ఎంత నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాం అనేది ముఖ్యమైన విషయం.

మనం తినే ఆహారంలో సగభాగమైన కూరగాయలను పండ్లను ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాలను మనమే మన ఇంటిపంటలుగా ఇంటి మీదనే పండించుకోవచ్చు. అందుకు మిద్దె తోటలే సరైన సాధనాలు. ప్రకృతి జీవన విధాన సాధనకు, మిద్దె తోట సరైన సాధనం.

ఓ సజృనాత్మక ప్రక్రియ!
కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్ళవలసిన అవసరం తప్పుతుంది– అందుకు వాడే వాహనం దానికి ఇంధనం తద్వారా వెలువడే వాయు కాలుష్యం, సమయం వగైరా తప్పుతాయి. రోడ్ల మీద ట్రాఫిక్‌ కూడా తగ్గుతుంది. రోజూ ఓ అరగంట మిద్దెతోటలో లేదా పెరటి తోటలో పని చేసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన వ్యాయామం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మిద్దెతోట లేదా పెరటితోట లేదా వ్యవసాయం అనేది ఓ సజృనాత్మక ప్రక్రియ! పిల్లల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒక కాలంలో ఒక పద్ధతిలో ఒక విత్తనాన్ని నాటితే ఇలా సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇలా ఉత్పత్తి వస్తుంది అని ఒక ఉత్పత్తి క్రమం పిల్లలకు అర్థం అవుతుంది. అదే క్రమం పిల్లలకు బ్రతుకు క్రమాన్ని కూడా తెలియచేస్తుంది.

ఇంటి మీద ఒక తోట ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉమ్మడి సబ్జెక్టుగా మారి అందరి మధ్యా ఒక బంధం ఏర్పడుతుంది. పిల్లలు పెద్దవారై ఉద్యోగాలకు ఎటు వారు అటు పోయి ఒంటరితనానికి లోనయ్యే గృహిణులకు మిద్దెతోట ఒక ఆలంబనగా మారుతుంది. ఉపశమనం కలిగిస్తుంది. రిటైర్డ్‌ ఉద్యోగులకు మిద్దె తోట ఒక పునర్జన్మను ఇస్తుంది. మీ మిద్దెతోట మూలంగా తిరిగి వారికి ఒక సోషౖల్‌ లైఫ్‌ ప్రారంభం అవుతుంది.సమస్యలు తగ్గుతాయి!
మిద్దె తోటల సాగు విస్తీర్ణం ఎంత పెరిగితే, ఉష్ణోగ్రతలు వాయు, ధ్వని కాలుష్యాలు అంత తగ్గుతాయి, ఆ మేరకు ప్రజలకే కాదు పరోక్షంగా ప్రభుత్వాలకు కూడా సమస్యలు తగ్గుతాయి. మిద్దె తోటల సాగు మూలంగా ప్రజల ఆరోగ్యాలు బాగు పడతాయి– ఆ మేరకు ఖర్చులు తగ్గుతాయి, ఆ డబ్బును ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించ వచ్చు. ఇంటిపంట/మిద్దెతోట అనేది ఓ నాలుగు అక్షరాల చిన్నపదం మాత్రమే కాదు, అది బహుళార్థ సాధక సాధనం.

బరువు సమస్యే కాదు!
’ఇంటి మీద మిద్దెతోట నిర్మాణం జరిపితే బరువు మూలంగా ఇంటికి ప్రమాదం కాదా?’ అని కొందరికి అనుమానం కలుగుతుంది. ’ఇంటి మీద మొక్కల పెంపకం చేపడితే, నీటి ఉరుపు సమస్య ఏమైనా ఏర్పడుతుందా?’ అని మరికొందరు అనుమానపడతారు. మిద్దె తోట బరువు ఒక ఇంటిమీద పెద్ద బరువు కాదు. కాలమ్స్‌ పద్ధతిలో కట్టిన ఆర్సీసీ బిల్డింగ్‌ అయితే, అది స్టాండర్డ్‌ బిల్డింగ్‌ అయితే, మనం భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు. మిద్దె మీద వర్షపు నీరు నిలవకుండా ఒక వైపు వాలు ఉంటుంది. పై కప్పు వేసేటప్పుడు ఆ వాలును సరిగా మెయింటైన్‌ చెయ్యమని మేసన్‌ పని వారికి, బిల్డర్‌కు చెప్పాలి.

ఖర్చు ఎక్కువ అక్కర్లేదు 
’మిద్దె తోటల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది’ అని కొందరు అనుకుంటున్నారు– అదీ నిజం కాదు. మీరు ఎంత బడ్జెట్లో అయినా ఓ మిద్దెతోటను ప్రారంభం చెయ్యవచ్చు. ఓ వంద రూపాయల సిమెంట్‌ లేదా మట్టి కుండీలో ఓ కరివేపాకు మొక్కను పెంచవచ్చు. అలాగే చిన్న చిన్న ట్రేలలో ఆకుకూరల పెంపకం చేపట్టవచ్చు. ఓ నెలలోనే ఆకుకూరలను పొందవచ్చు. ఓ ఖాళీ సిమెంట్‌ సంచిని నీళ్లలో ఝాడించి ఉతికి, సగానికి మడిచి మట్టి ఎరువుల్ని కలిపి నింపుకుని ఓ రెండు వంగ మొక్కలను నాటుకుని వారంలో ఒకసారి వంకాయలను ఉత్పత్తి చెయ్యవచ్చు. అది అన్నిటి కంటే చవకైన పద్ధతి. ఓ పదివేల రూపాయల నుండి ఓ లక్ష రూపాయల వరకు వ్యయం చేసుకుని చక్కని మిద్దెతోట నిర్మాణం చేసుకోవచ్చు. పురుగుమందుల దృష్టి కోణం నుంచి చూస్తే, ఇవాళ ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద తోట కూడా అంతే ముఖ్యం. మిద్దె తోటల నిర్మాణం విషయంలో పీనాసితనం పనికి రాదు.

సరైన సాధనం ఎంపిక ముఖ్యం 
మునుపు మిద్దె తోటల నిర్మాణానికి సరైన సాధనం లేదు. ఎవరికి తోచిన పాత్రలను వారు పెట్టుకుని, అరకొర ప్రయత్నాలు చేసే వారు. పగిలిన ప్లాస్టిక్‌ బకెట్‌ లేదా సంచులు మట్టి సిమెంట్‌ కుండీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అందమైన పటిష్ఠమైన ఇటుకల మడుల నమూనాలు అందుబాటులో ఉన్నాయి. మడుల కింద చీపురుతో ఊడ్చుకోవచ్చు. అంత సౌకర్యవంతమైన మడుల నమూనాలు అభివృద్ధి చెయ్యబడ్డాయి. మిద్దెతోట నిర్మాణం విషయంలో సరైన సాధనాన్ని ఎన్నుకోవడం ముఖ్యమైన విషయం. ఏవో చిప్పా దొప్పా మొక్కలను నాటడానికి వాడితే , సరైన ఉత్పత్తులు రావు. పైగా నిరాశ ఉత్పత్తి అవుతుంది. మొదటికే మోసం వస్తుంది.

ఇటుకల మడులు శ్రేయస్కరం
మిద్దెతోట నిర్మాణానికి ఇటుకల మడులు శ్రేయస్కరం. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు, ఒక ఫీటు లోతు కలిగిన మడులు అవసరం ఉంటుంది. ప్రతీ మడి లేదా బెడ్‌ కింద ప్రత్యేకంగా రెండు అంగుళాల మందం కలిగిన ’సిమెంట్‌– ఐరన్‌ రాడ్‌ – బిళ్లను పోత పోసి వేస్తారు. క్యూరింగ్‌ తరువాత ఆ బిళ్లను ఒక ఫీటు ఎత్తుపైకి లేపి దిగువన నాలుగుౖ వెపులా నాలుగు ఇటుకలనే కాళ్లుగా పెట్టి, బిళ్ల మీద చుట్టూ నాలుగుౖ వెపులా ఫీటు ఎత్తు ఇటుకల గోడ కట్టాలి. మడి అడుగున నీరు నిలవ కుండా ఒక వైపు కాస్తా వాలుగా సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చెయ్యాలి. మడి గోడలకు లోపల బయట కూడా సిమెంట్‌ ప్లాస్టరింగ్‌ చేయించాలి. టెర్రకోట రంగు చేయించుకున్న తరువాత చక్కగా నచ్చిన ముగ్గులను మడుల గోడల మీద వేసుకోవాలి. అందమైన పటిష్ఠమైన ఇటుకల మడులు సిద్దం అవుతాయి. భూమి మీద చేసే వ్యవసాయానికి మిద్దె మీద చేసే వ్యవసాయానికి ప్రధానమైన తేడా ఇటుకల మడులు అమర్చుకునే విషయంలో మాత్రమే. తక్కిన వ్యవసాయం అంతా ఒక లాగే ఉంటుంది. ఇటువంటి ఇటుకల మడులను మిద్దె మీద మొత్తం ఎన్ని పడతాయో ఒకేసారి లెక్కవేసుకుని కట్టించాలి. దారులు వదులుకుని చక్కగా సిస్టమెటిగ్గా కట్టుకోవాలి. మడుల వరుసలు అన్నీ బీమ్‌ల మీద కట్టుకోవాలి.

ఇటుకల మడుల నిర్మాణానికి దాదాపు ఓ వారం పని దినాలు అవుతాయి. ఇనుపరాడ్‌ –సిమెంట్‌ –ఇటుకలు ఇసుక – కంకర వంటి మెటీరియల్‌ను తాపీ మేస్త్రీతో కలిసి కొనుగోలు చెయ్యాలి. లేదా వారికే గుత్తకు ఇవ్వవచ్చు. స్టాండర్డ్‌ పని చెయ్యమని చెప్పాలి. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతు కలిగిన ఒక మడి నిర్మాణానికి సుమారు మూడు వేల రూపాయలు వ్యయం కావచ్చు. మట్టి ఎరువులకు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రతీ రెండు మడుల తరువాత మూడవ మడిని మాత్రం మరో ఫీటు లోతు ఎక్కువగా పెట్టి కట్టించాలి. వాటిని పండ్ల మొక్కల పెంపకానికి వాడాలి. మిద్దెతోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. అన్ని రకాల కూరగాయల మొక్కల సాగుకు నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీటు లోతు మడులు సరిపోతాయి.

మూడవ ప్రత్యామ్నాయం గ్రోబ్యాగులు– ఇవి ప్లాస్టిక్‌ సంచులు
తక్కువ ఖర్చు– బరువు తక్కువ– ఎక్కువ కాలం మన్నికగా ఉండవు. నాలుగైదు సంవత్సరాల తరువాత పనికిరావు! ఎండలకు పాడౌతాయి. పైగా ప్లాస్టిక్‌ సంచులు వాడకూడదు అని విజ్ఞులు చెప్తున్నారు.

మట్టి కుండీలు 
తరువాత సిమెంట్‌ లేదా మట్టి కుండీలు ఉన్నాయి. అవి కేవలం పూల మొక్కల పెంపకానికి మాత్రమే పనికి వస్తాయి. లేదా ఒక సిమెంట్‌ కుండీలో ఒక వంగ మొక్కను పెంచవచ్చు. 
కూరగాయలను పండ్లను కుటుంబ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చెయ్యాలంటే ఇటుకల మడులు తప్పకుండా ఉండాలి. సొంత ఇల్లు ఉన్న ప్రతీ వారు ఇటువంటి మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు కూడా ఇటువంటి ఇటుకల మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫైబర్‌ మడులు 
ఇటుకల మడులు కట్టడానికి ఓ వారం రోజుల పని దినాలు అవుతాయి. కొంత రిస్క్‌ ఉంటుంది. మరో చోటకు మార్చడానికి కుదరదు. బరువు ఎక్కువ అనే భావన ఉంటుంది. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఫైబర్‌ మడులను కూడా డిజైన్‌ చెయ్యడం జరిగింది. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు కలిగి ఒక ఫీటు లోతు ఉన్న మడులతో పాటు వివిధ రకాల డిజైన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫైబర్‌ టబ్బులతో ఒక్క రోజులోనే మిద్దె తోట నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు.
స్థూలంగా మిద్దె తోట నిర్మాణం విషయంలో మడుల నమూనాల గురించి సమాచారం ఇది.

నిలువు పందిళ్లు
మిద్దెతోట నిర్మాణం విషయంలో మడులను అమర్చుకోవడంతో ప్రధానమైన దశను దాటుతాం. తరువాత రెండోదశలో టెర్రస్‌ మీద చుట్టూ నాలుగు వైపులా నిలువు పందిరి నిర్మించుకోవాలి. టెర్రస్‌ మీద చుట్టూ నాలుగు వైపులా రక్షణ గోడ ఉంటుంది. మూడు ఫీట్ల ఎత్తుతో ఉంటుంది. ఆ గోడనుబేస్‌ చేసుకుని ఎనిమిది ఫీట్ల ఎత్తుతో పందిరి వేసుకోవాలి. పందిరి అంటే మనకు అడ్డంగా వేసే పందిరి తెలుసు. మిద్దె మీద అడ్డంగా పందిరి వేస్తే దిగువన నీడపడి మొక్కలు ఎదగవు– స్థలం వృథా అవుతుంది. అందుకని నిలువు పందిరి కట్టాలి. ప్రతీ పది ఫీట్లకు రక్షణ గోడను సపోర్ట్‌ చేసుకుని ఒక ఐర న్‌ పోల్‌ బిగించి అడ్డం పొడవు తీగలు కట్టుకుని చక్కని పందిరి కట్టు కోవాలి.
కూరగాయల జాతుల్లో సగం తీగజాతి కూరగాయల మొక్కలే ఉన్నాయి– నిలువు పందిరి చుట్టూ ఒక ఇటుకల మడి వరుస కట్టిస్తే తీగ జాతులన్నిటినీ అటువైపు పెంచి పందిరికి పాకించవచ్చు.
ఈ విధంగా మిద్దెతోట నిర్మాణంలో మడులను కట్టుకోవడం – నిలువు పందిరి వేసుకోవడంతో రెండు దశలు పూర్తి అవుతాయి.

సిమెంటు కుండీలు 
మూడవ దశ – సిమెంట్‌ లేదా మట్టికుండీలను అమర్చుకోవాలి. ఇటుకలతో ప్రధాన మడులు కట్టించుకున్న తరువాత , మిగిలిన చిన్న చిన్న ప్లేసులు బయటపడతాయి. వాటిలో సిమెంట్‌ లేదా మట్టికుండీలను తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా పూల మొక్కలు పెంచడానికి వాడాలి. మిద్దె తోటల్లో పెరటి తోటల్లో పొలాలలో పూల మొక్కలు తప్పకుండా ఉండాలి. రోజు పూలు పుయ్యాలి. పూలు తేనెటీగలను ఆకర్షించి మొక్కల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరగడానికి దోహదం చేస్తాయి. పుష్పాల ఫలదీకరణ చెందిన తరువాత సంపూర్ణ ఉత్పత్తి జరుగుతుంది.

ఎర్రమట్టి మేలు 
ఈ మూడు దశల తరువాత మట్టి గురించి ఎరువుల గురించి ఆలోచించాలి. మట్టిలో ఎర్రమట్టి నల్లమట్టి అని రెండు రకాల మట్టి లభిస్తుంది. నగరాలలో భవన నిర్మాణ పనులు సాగుతున్న ఏరియాలలో రోడ్లపక్కన అక్కడక్కడా కొందరు మట్టిని కుప్పులుగా పోసి అమ్ముతుంటారు. అది సాధారణంగా ఎర్రమట్టి అయుంటుంది. మొక్కలకు అని చెప్పాలి. ఇసుక శాతం తక్కువ ఉండాలి. సారవంతమైన మట్టి కావాలి. మొరం లేదా చవుడు మట్టి పనికి రాదు. ప్రస్తుత అవసరం కంటే ఎక్కువ మట్టిని తెచ్చుకోవాలి. మాటిమాటికి మట్టిని తేలేం. ఎక్కువ తెచ్చుకోవాలి. టెర్రస్‌ మీద ఓ మూలన నిల్వ చేసుకుని ఓ షీట్‌ కప్పాలి. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మట్టిని వాడుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు మంచిది. గొర్రెల మేకల కోళ్ల ఎరువులు కూడా వాడుకోవచ్చు. అవి కూడా విష రసాయనాలు కలువని ఎరువులు అయి ఉండాలి. మాగిన లేదా చివికిన ఎరువులు మట్టిలో కలపాలి. తాజా పచ్చి ఎరువులు కలపకూడదు. మట్టి రెండు భాగాలుగా ఎరువు ఒక భాగంగా తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మడులను కాస్తా వెలితి ఉండేలా నింపుకోవాలి. మట్టి ఎరువుల మిశ్రమాన్ని మడుల్లో నింపడంతో మిద్దెతోట నిర్మాణం దాదాపు పూర్తి అవుతుంది.

మిగిలింది విత్తనాల విషయం.

విత్తనాలలో దేశీ విత్తనాలు హైబ్రిడ్‌ విత్తనాలు ఉన్నాయి. దేశవాళీ విత్తనాలు మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఎక్కడపడితే అక్కడ అవి దొరికే అవకాశం లేదు. ఓపికగా సేకరించాలి. అందరికీ అందుబాటులో హైబ్రిడ్‌ విత్తనాలు మాత్రమే ఉన్నాయి. పరవాలేదు. వాటిని కూడా వాడుకోవచ్చు. వాటి నుండి తిరిగి విత్తనాలను కట్టుకుని తిరిగి వాటిని వాడవచ్చు. క్రమంగా అవీ దేశవాళీ విత్తనాల వలె మారతాయి. సంవత్సరంలో మూడు కాలాలు ఉన్నాయి. ఆ మూడు కాలాల ప్రారంభ రోజుల్లో విత్తనాలను నాటుకోవాలి. నారు మొక్కలను నాటు కోవాలి. కొన్ని మొక్కలను కొన్ని కాలాలలో పెంచలేం.పెంచినా కాపు కాయవు. ఆ గ్రహింపు ఉండాలి. శీతాకాలపు పంటలైన మిర్చి, టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి వంటి వాటిని ఎండాకాలంలో పండించలేం. శ్రద్ధ తీసుకుంటే వర్షాకాలంలో మాత్రం కొంత పండించవచ్చు.

ఈ జాగ్రత్త వహించాలి.
గుమ్మడి – బూడిద గుమ్మడి – దుంపలు వంటి వాటిని వర్షాకాలం ప్రారంభంలో నాటు కోవాలి.
మిగతా అన్ని మూడు కాలాల్లో కూడా ఉత్పత్తి చెయ్యవచ్చు. నీటి యాజమాన్య విషయంలో మిద్దె తోటల్లో పెరటి తోటల్లోఎక్కువ నీరు పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోతాయి. వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది.
మట్టి పొడిగా ఉంటేనే నీరు
మొక్కలకు నీరు అవసరం ఉండదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది. తేమ ద్వారా మాత్రమే మట్టిలో ఉన్న సూక్ష్మ, స్థూల పోషకాలను గ్రహిస్తాయి.
ప్రతిరోజూ మిద్దెతోటలో ఉదయం ఓ రౌండ్‌ తిరగాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ముట్టుకుంటే తేమ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తేమ ఉంటే నీరు పెట్టడం అవసరం లేదు.
తేమ లేకుంటే– మట్టి పొడిగా ఉంటే నీరు పెట్టడం అవసరం ఉంటుంది. మనం పెట్టిన నీరు మడుల్లోంచి బయటకు రాకుండా– తగు మాత్రమే పెట్టాలి. 
నాలుగైదు గంటల పాటు ఎండ
మొక్కల మీద కనీసం ప్రతీ రోజూ నాలుగైదు గంటల పాటు ఎండ తప్పకుండా పడాలి. మొక్కల మొలిచిన తరువాత పది రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. మొక్కల మధ్య మట్టిని లూజ్‌ చెయ్యాలి. చేసేటప్పుడు మొక్కల వేర్లు దెబ్బతినకుండా సున్నితంగా మట్టిని లూజ్‌ చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అంది బలపడుతుంది. మొక్కల ఎదుగుదల బాగుంటుంది. ప్రతీ అంతర కృషి తరువాత స్వల్పంగా వర్మీకంపోస్టు చల్లి తగినంత నీరు పెట్టాలి.

చీడపీడల సమస్యలు తక్కువే
చీడపీడల సమస్యలు కూడా మిద్దెతోటల్లో ఉంటాయి. సమృద్ధిగా పశువుల ఎరువులు పోసి మొక్కలను పెంచుతాం కనుక మొక్కలు బలంగా ఎదిగి సహజంగా రోగనిరోధకశక్తి కలిగి ఉంటాయి. చీడపీడల సమస్యలు తక్కువ ఉంటాయి.
వాటిలో పేను సమస్య ముఖ్యమైనది. పేను అనేది నల్లగా పచ్చగా ఉంటుంది. కంటికి కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాలను పీల్చి ఆకులు ముడుచుకు పొయ్యేలా చేసి మొక్కను ఎదగకుండా చేసి గిడస బారుస్తాయి.
పేనును గమనించాలి.
మొక్కల మీద చీమలు పారడాన్ని గమనిస్తే, పేను ఉందని అర్థం చేసుకోవాలి. ఆకుల అడుగు భాగం చెక్‌ చెయ్యాలి.పేనును చేతి వేళ్లతో నలిపి కూడా నివారణ చెయ్యవచ్చు.పేను సోకిన ఆకులను తెంపి తోట నుండి దూరంలో పారెయ్యాలి. మిగిలిన లేత ఆకుల కింద ఉన్న పేను నివారణకు లీటరు నీటిలో అయిదు మిల్లీ లీటర్ల వేప నూనె బాగా కలిపి నురగ వచ్చే దాకా షేక్‌ చేసి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చెయ్యాలి. మొక్క సాంతం తడిసేలా స్ప్రే చెయ్యాలి. నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి స్ప్రే చెయ్యాలి. బీర, సోర, కాకర, బెండ, వంగ, పొట్ల, గుమ్మడి వంటి మొక్కల మీద ఎక్కువగా సోకుతుంది.
తెల్లనల్లి 
పేను తరువాత తెల్లనల్లి మరో సమస్య. బెండ, వంగ, మందార, టొమాటో, మొక్కల మీద ఎక్కువ సోకుతుంది. దీన్ని కూడా చేతి వేళ్లతో నలిపి నివారణ చెయ్యాలి. దీనికి ఏ వేపనూనె కూడా అవసరంలేదు.
పచ్చ పురుగులు
చుక్కకూర, పాలకూర వంటి ఆకుకూరల మీద వన్‌ ఇంచ్‌ పొడవు, పెన్సిల్‌ సైజ్‌ పచ్చని పురుగులు వస్తాయి. రాత్రి బయటకు వచ్చి ఆకులను తిని తెల్లవారుతుంటే కిందకు జారుకుంటాయి. ఉదయాన్నే చెక్‌ చేస్తే పురుగులు దొరుకుతాయి. ఏరి అవతల పడెయ్యాలి. అలా వరుసగా రెండు మూడు రోజుల పాటు చెయ్యాలి.
బీర, సొర మొక్కలు పూత దశలోకి రాగానే పిందెలు పండుబారి ఎండిపోయే సమస్య ఎదురవుతుంది. దానికి కొన్ని కారణాలుఉన్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం– మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడం– పాలినేషన్‌ సరిగ్గా జరగకపోవడం వగైరా కారణాలు.
పువ్వులు పూసే సాయంత్రం వేళల్లో వెళ్లి మగ పువ్వును తెంపి సమీపంలో ఉన్న ఆడపువ్వు కేసరాల మీద మగపువ్వు కేసరాలను సున్నితంగా రుద్దాలి. ఫలదీకరణ శాతంపెరుగుతుంది.
బూడిద తెగులు
ఆకుల మీద బూడిద తెగలు సోకుతుంది. తెగలు సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. పుల్లని మజ్జిగను మిగిలిన ఆకుల మీద స్ప్రే చెయ్యాలి. కొంత కంట్రోల్‌ అవుతుంది. చీడపీడల నివారణలో చేతిని మించిన సాధనం లేదని గ్రహించాలి. ఈ విధంగా కొంచెం ఖర్చు కొంచెం శ్రద్ధా శ్రమతో చక్కగా మిద్దెతోటల సాగు చెయ్యవచ్చు. ఇంటిల్లి పాదికీ సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. మిద్దెతోటల నిర్మాణం విషయంలో సౌందర్య దృష్టి కూడా ఉండాలి. అందంగా తీర్చిదిద్దుకోవాలి. మిద్దె మీద ఓ అందమైన తోటగా మార్చుకోవాలి. ఆయురారోగ్య రహస్యాలు, మిద్దె తోటల్లో దాగి ఉన్నాయి!

ప్రకృతికి సంక్షిప్త రూపం మిద్దె తోట!

ప్రకృతికి మనిషికి ఎటువంటి సంబంధం కలిగి ఉంటుందో, మిద్దెతోట కూడా అటువంటి బంధాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతికి దూరమై పలువ్యాధులకు దగ్గరైన ఆధునిక సమాజానికి మిద్దె తోట సరైన ఆయురారోగ్య పరిరక్షణా సాధనం. ఇలా చెప్పుకుంటూ పోతే మిద్దెతోటల సాగు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తుంది.

నిర్వహణ సులభం
మిద్దెతోట నిర్వహణ చాలా కష్టం అని కొందరు భావిస్తున్నారు. కానీ, అది నిజం కాదు. మిద్దెతోట లేదా పెరటి తోట చాలా సులభంగా చెయ్యగల పని. సుమారు రోజూ ఒక అర గంటసేపు పనిచేసినా సరి పోతుంది. ఇంటికి సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంటిపంటల రుచి అమోఘమైన రుచి. ఏ రోజు ఉత్పత్తిని ఆ రోజే వాడుకోవడం వల్ల వాటిలోని సంపూర్ణ పోషకాలు మనకు అందుతాయి. ఎంతో విలువైన జీవశక్తి పూరితమైన ఉత్పత్తి అది. జీవశక్తి పూరితమైన ఆహారమే మనల్ని బలోపేతం చేస్తుంది. మనం ఎంత బలంగా ఉంటే, మనకు అంతగా రోగనిరోధకశక్తి ఉంటుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం.

పూల మొక్కలు

 • దేశీయ మందారం ( నాటు మందార)

ఇది రేఖ మందారం… ఇందులో ముద్ద మందారం ఉంటుంది.

ప్రత్తి మందారం

పొద్దున్న తెల్లగా… సాయంత్రానికి గులాబీ రంగులోకి మారిపోతుంది.

సముద్ర మందార ( sea hibiscus)

ఇది కూడా ఇంతే …పొద్దున్న పసుపు రంగులో.. సాయంత్రానికి కుంకుమ రంగులో కి మారుతుంది.

పైన చెప్పిన మందార రకాలు చాలా సులభంగా పెంచవచ్చు… ఒకసారి మనం వేస్తే, ఇంకో పాతిక, ముప్పై సంవత్సరాలు చూసుకోవలసిన అవసరం రాదు.

వీటికి వచ్చే చీడ పీడలు గురించి సమాధానం చివరలో వివరిస్తాను.

గమనిక:

కొత్తగా అన్ని రకాల రంగులలోను మందారాలు దొరుకుతున్నాయి…ఇవన్నీ కూడా చైనా దేశం నుంచి వచ్చినవి. వాటిని చైనా రోజ్ అని పిలుస్తారు. వాటికి రోగ నిరోధకశక్తి తక్కువ గా ఉండటం వల్ల 2 లేదా 3 సంవత్సరాలకే రోగాల బారిన పడి చనిపోతున్నాయి. కాబట్టి వాటిని గుర్చి ఇక్కడ ప్రస్తావించడం లేదు.

 • నంది వర్ధనం / గరుడ వర్ధనం

ఈ మొక్కను చాలా చోట్ల చూసే ఉంటారు…

 • చుక్క మల్లి
 • కరివేరు

ఇవి 5 లేదా 6 రకాల రంగులలో దొరుకుతాయి

 • బిళ్ళ గన్నేరు

ఇవి కూడా చాలా రంగులలో దొరుకుతాయి… వీటికి ఎరువులు ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉంది… వీటిని ఆయుర్వేదం లో కూడా ఉపయోగిస్తారు.

 • చామంతి

ఇవి కేవలం చలికాలం లోనే పూస్తాయి… కానీ పెంచడం చాలా తేలిక…NASA వాళ్ళు చేసిన CLEAN AIR STUDY లో మొత్తం 10 మొక్కలను ప్రస్తావించారు… అందులో చామంతి ఒకటి…

ఇది వాతావరణం లో ఉండే అన్ని రకాల రసాయనాలను, విష గాలులను (బెంజీన్ ,ఫార్మాల్డిహైడ్ , ట్రైక్లోరెథైలీన్ , జిలీన్, టోలున్ , అమ్మోనియం) వడపోసి చక్కని గాలిని వదులుతుంది.

 • పీస్ లిల్లీ

ఇది కూడా సులభం గా పెరుగుతుంది NASA CLEAN AIR STUDY లో ఈ మొక్క కూడా ఉన్నది.

 • శంకు పుష్పం

ఇందులో కూడా 3 లేదా 4 రకాల రంగులు ఉంటాయి…

ఈ పూలను ఎండపెట్టి , టీ చేసుకొంటారు. అలాగే చామంతి పూలను కూడా ఎండపెట్టీ టీ చేసుకొంటారు…

విదేశాల్లో ఈ టీ లకు చాలా గిరాకీ ఉంది,

ఇప్పుడు ఇప్పుడే ఈ టీ లకు మన దేశం లో గిరాకీ పెరుగుతుంది.

 • బౌగైన్విల్లే (Bougainville)

మనం కాగితం పూలు అంటాం కదా… అవి

ఇందులో చాలా రంగులు ఉంటాయి…

 • గుత్తి పువ్వుల చెట్టు

ఇందులో చాలా రంగులు , మరగుజ్జు రకాలు కూడా ఉన్నాయి.

 • పారిజాతం

పురాణాల ప్రకారం క్షీర సాగర మధనం లో, పాల కడలి నుంచి ఉద్భవించినది.

సాక్షాత్తు లక్ష్మి స్వరూపం గా ఈ చెట్టు నీ బావిస్తారు. ఈ చెట్టు పువ్వులు కోయరు, కింద పడినవి మాత్రమే తీసి దేవుడికి అలంకరిస్తారు.

పెంచడం చాలా సులభం…

ఇకపోతే పై మొక్కలను ఆశించే చీడ పీడల గురించి

ఈ పై మొక్కలను ఎక్కువ గా ఆశించే కీటకాలు రెండు ఉన్నాయి

 • గొంగళి పురుగు
 • పిండి నల్లి

గొంగళి పురుగు తీసి దూరంగా పారవేయవచ్చు. అలా చేయలేక పోతే, ఈ రెంటికీ వాడే రసాయన మందు ఒకటి తేపుతాను propinophos ఇది అన్ని పురుగు మందుల కొట్టులలో దొరుకును. 5ml మందును 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. వీటికి పట్టే అన్ని రకాల పురుగులకు చాలా సమర్థవంతంగా పనిచేయును.

వేప నూనె లాంటి సేంద్రియ పురుగు మందులు పని చేస్తాయి గానీ, సమయం ఎక్కువ తీసుకొంటాయి.

అశ్వగంధ, శిలాజిత్‌ల ఆరోగ్య ప్రయోజనాలు

అశ్వగంధ, శిలాజిత్‌ల ను ఆయుర్వేదంలో ముఖ్యంగా వీర్య వృద్ధికి ఉపయోగిస్తారు. వీటి వల్ల శారీరక సామర్థ్యం పెరిగి శ్రంగార సమస్యల కూడా తగ్గుతాయి. నేడు మగవారిలో ఎంతగానో వేదించే సమస్యలలో ఒకటి అంగస్తంభన సమస్య. కానీ అశ్వగంధ, శిలాజిత్‌ల ను వాడటం వల్ల ఈ సమస్యను సులువుగా తగ్గించుకోవచ్చు.

రోజూ అశ్వగంధ పొడి ఒక అర స్పూన్ పాలలో కలిపి రాత్రి పూట తాగండి. ఇలా ఒక 90 రోజులు చేయడం వల్ల వీర్య వృద్ధి కలిగి, అంగస్తంభన సమస్యలు కూడా దూరం అవుతాయి. లేదా శిలాజిత్‌ 250ంగ్ టాబ్లెట్ను రాత్రి పూట పాలతో తీసుకోండి. వీటి వాడకం వల్ల శరీరంలోని ఇంకా ఎన్నో రుగ్మతలను కూడా తగ్గించుకోవచ్చు.

మెడిసినల్ హెర్బ్స్

1. అలోవెరా:

కిచెన్ లో పనిచేసేటప్పుడు చిన్న చిన్న కాలిన గాయాలు సహజం. అటువంటి మైనర్ ప్రాబ్లెమ్స్ ను డీల్ చేయడానికి మీ గార్డెన్ లో ఉన్న అలోవెరా ప్లాంట్ ఉపయోగపడుతుంది. నిజానికది మంచి ఆప్షన్. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. అలోవెరా జెల్ కాలిన గాయాలను సూత్ చేస్తుంది. అంతేకాక ఇన్ఫ్లమేషన్‌ని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ అరికడుతుంది. డ్యామేజ్ నుంచి త్వరగా కోలుకునేందుకు స్కిన్ హీలింగ్ ను ప్రమోట్ చేస్తుంది. 2007లో బర్న్స్ అనే జర్నల్ లో పబ్లిష్ ఐన ఓ స్టడీ అలొవెరా అనేది బర్న్స్ ను ప్రభావవంతమైన ట్రీట్మెంట్ అని వెల్లడించింది. ఫస్ట్ నుంచి సెకండ్ డిగ్రీ బర్న్స్ కు ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుందని స్పష్టం చేసింది.

ఎలా వాడాలి?

అలోవెరా మొక్కనుంచి ఆకును తీసుకుని జెల్ ను తీసుకోవాలి. ఈ స్వచ్ఛమైన జెల్ ను కాలిన గాయంపై అప్లై చేయాలి. వారం పాటు ఈ ప్రాసెస్ ను రోజూ పాటించాలి.

2. సేజ్:

విపరీతమైన దగ్గు బాధిస్తోందా? ఐతే, గార్డెన్ లోకి వెళ్లి కొంత సేజ్ ను తీసుకోండి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి నిరంతర దగ్గుతో అనుసంధానమై ఉన్న లక్షణాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అలాగే హోపింగ్ కాఫ్ నుంచి కూడా రిలీఫ్ ను అందిస్తాయి. సేజ్ అనేది దగ్గును తగ్గించడంతో పాటు గొంతు నొప్పిని, లో ఫీవర్ని, ఇరిటేషన్ని అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ లో ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గిస్తుంది. హీలింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది.

1. ఒక టీస్పూన్ తాజా సేజ్ ఆకులను తీసుకోవాలి. ఎండినవైనా పరవాలేదు. వీటిని కప్పుడు నీళ్ళల్లోకి తీసుకుని బాగా మరిగించాలి. పదినిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ ను ఆఫ్ చేయాలి. టీ ను వడగట్టి తేనెను కలపాలి. దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాలి.

2. తాజా సేజ్ లీవ్స్ ను బాగా కడిగి ఒక గ్లాస్ జార్ లో పెట్టాలి. అందులో ఒక కప్పుడు తేనెను కూడా కలపాలి. దీన్ని మూతతో క్లోజ్ చేయాలి. వారం పాటు దీన్ని అలాగే ఉంచాలి. ఆ తరువాత ఈ లిక్విడ్ ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని వెచ్చటి నీళ్ళల్లో కలపాలి. టేస్ట్ కోసం తేనెను కలిపితే మరిన్ని సూతింగ్ ప్రాపర్టీస్ కూడా యాడ్ అవుతాయి. దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాలి. గర్భిణీలు దీన్ని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

3. థైమ్:

గొంతునొప్పి ఎంతో అసౌకర్యం కలిగిస్తుంది. ఎనర్జీ లెవెల్స్ ను పడిపోయేలా చేస్తుంది. ఈ లక్షణాలను తగ్గించి ఇమ్యూనిటీను బూస్ట్ చేసేందుకు గార్డెన్ లో ఉన్న థైమ్ హెల్ప్ ను మీరు కోరాలి. క్రష్ చేసిన థైమ్ లీవ్స్ తాజావి అయినా లేదా ఎండినవైనా రెండు టీస్పూన్లను తీసుకుని వాటిని కప్పుడు బాయిలింగ్ వాటర్ కు కలపాలి. కవర్ చేసి వాటిని పదినిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత వడగట్టాలి. ఈ టీను వేడివేడిగా తీసుకోవాలి.

4. పెప్పెర్మింట్:

తలనొప్పి సాధరణ సమస్యగా మారిపోయింది. టెన్షన్ తలనొప్పి లేదా మైగ్రైన్ తలనొప్పి వంటివాటికి పెప్పెర్మింట్ మంచి సొల్యూషన్ గా పనిచేస్తుంది. కప్పుడు మరిగే నీటిలో ఒక టీస్పూన్ ఎండిన పెప్పెర్మింట్ ను కలపాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూతతో కవర్ చేసి పదినిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత వడగట్టి కాస్తంత తేనెను కలపాలి. ఈ టీను స్లోగా తాగితే తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే, కాసిన్ని తాజా పెప్పర్మింట్ ఆకులను నీళ్ళల్లో మరిగించి ఆ స్టీమ్ ను ఇంహేల్ చేస్తే తలనొప్పి మటాష్.

5. చమోమైల్:

విరేచనాల వల్ల బాత్రూంకు ఎన్నో సార్లు ట్రిప్ వేయాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో ఉన్న పోషకాలు ఎన్నో కోల్పోతాము. చమోమైల్ తో అప్సెట్ స్టమక్ సమస్యను సాల్వ్ చేయడం సులభం. ఒక టీస్పూన్ ఎండిన చమోమైల్ ఫ్లవర్స్ ను కప్పుడు హాట్ వాటర్ లోకి తీసుకోవాలి. ఐదునిమిషాల పాటు ఇవి వేణ్ణీళ్ళల్లో ఉండాలి. ఆ తరువాత వడగట్టి కాస్తంత తేనెను కలిపి తాగాలి. అప్సెట్ స్టమక్ కు సంబంధించిన లక్షణాలు తగ్గిపోయేవరకు ఈ రెమెడీ ను పాటించాలి. రోజుకు రెండు లేదా మూడు సార్లు ఈ టీ తాగాలి.

6. తులసి:

ఒత్తిడనేది జీవితంలో ఓ భాగమైపోయింది. ఇది శారీరక అలాగే మానసిక ఆరోగ్యంపై ప్రభావంచూపుతోంది. స్ట్రెస్ ను ఫైట్ చేయడానికి తులసి ఆకులను ప్రయత్నించవచ్చు. ఇది సహజసిద్ధమైన యాంటీ స్ట్రెస్ ఏజెంట్ గా పనిచేస్తుంది. పది నుంచి పన్నెండు తాజా తులసి ఆకులను రోజులో ఒకటీ లేదా రెండు సార్లు నమిలితే స్ట్రెస్ నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తులసి ఆకులను కప్పుడు బాయిలింగ్ వాటర్ లో కలిపి ఐదు నిమిషాలపాటు మరిగిస్తే తులసి టీ రెడీ అవుతుంది. వడగట్టి దీనిలో తేనెను కలిపి స్లోగా సిప్ చేయాలి. రోజుకు రెండు లేదా మూడు కప్పులు తాగాలి.

7. లెమన్ బామ్:

తగినంత నిద్ర ఉంటే ఆరోగ్యసమస్యలు దూరంగా ఉంటాయి. నిద్రలేమి వల్ల కూడా అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉంటాయి. నిద్రలేమికి మీ గార్డెన్ లో ఉన్న లెమన్ బామ్ హెల్ప్ చేస్తుంది. కొన్ని సెంచరీలుగా నిద్రకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఈ హెర్బ్ ను వాడుతున్నారు.
రెండు టీస్పూన్ల తాజా లెమన్ బామ్ ను లేదా ఒక టీ స్పూన్ ఎండిన లెమన్ బామ్ ను కప్పుడు హాట్ వాటర్ లోకి తీసుకోవాలి. ఐదు నుంచి పదినిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత వడగట్టాలి. ఈ టీను ఉదయం పూట ఒకసారి నిద్రపోయే ముందు ఒకసారి తాగితే నిద్రానాణ్యత ఇంప్రూవ్ అవుతుంది.

8. ప్లాంటైన్:

ప్లాంటైన్ లో లభించే టానిన్స్ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తాయి. పెయిన్ మరియు ఇన్ఫ్లమేషను తగ్గిస్తాయి. దురదను కూడా తగ్గిస్తాయి. కొన్ని ప్లాంటైన్ లీవ్స్ ను తీసుకుని పేస్ట్ ను తయారు చేయండి. ఈ పేస్ట్ ను గాయాలపై అప్లై చేయండి. ఆరాక వార్మ్ వాటర్ తో కడగండి. ఈ రెమెడీను రోజులో కొన్ని సార్లు పాటిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.

9. క్యాలెండులా:

ఈ ఫ్లవర్ పెటల్స్ లో స్కిన్ సూతింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ. ఇవి క్విక్ రిలీఫ్ ను అందిస్తాయి. ఇన్సెక్ట్ బైట్స్ తో పాటు ర్యాషెస్, ఎగ్జిమా, డ్రై స్కిన్ మరియు గాయాల నుంచి రిలీఫ్ ఇస్తాయి. కొన్ని క్యాలెండులా ఫ్లవర్స్ ను గ్రైండ్ చేసి పేస్ట్ ను తయారుచేయాలి. ఈ పేస్ట్ ను ఇరిటేటెడ్ స్కిన్ పై అప్లై చేయాలి. ఆరాక, వెచ్చటి నీళ్లతో కడిగేయాలి. ఈ రెమెడీను రోజులో ఎన్నో సార్లు పాటించాలి.

10. రోజ్ మేరీ:

మెల్లగా మతిమరుపు ప్రారంభమైన సూచనలు మీరు గమనిస్తున్నారా? ఐతే, రోజ్ మేరీ ను మీరు తప్పక వాడాలి. నర్థంబ్రియా యూనివర్సిటీ వారు కండక్ట్ చేసిన స్టడీలో రోజ్ మేరీ మెమరీను బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందని తేలింది. రోజ్ మేరీ ఆరోమా కలిగిన రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ మెమరీ టెస్ట్ లో బెటర్ రిజల్ట్స్ ను పొందారని స్టడీ వెల్లడిస్తోంది.

Banyan tree మర్రి చెట్టు

Banyan tree మర్రి చెట్టు

మర్రి చెట్టు గొప్పదనాన్ని గుర్తించి భారత దేశం మర్రి చెట్టును దేశ జాతీయ వృక్షంగా ప్రకటించింది.
పొడవైన ఊడలతో ఎంతో పెద్దగా ఉండే మర్రి చెట్టు బంగ్లాదేశ్‌, భారత్‌, శ్రీలంక దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఫిగ్‌ చెట్లలో 750కిపైగా వృక్ష జాతులుంటాయి. అందులో మర్రి చెట్టును ఒకటి.
ఈ చెట్టును వటవృక్షం అని కూడా పిలుస్తారు. ఇంకా బెంగాల్‌ ఫిగ్‌, ఇండియన్‌ ఫిగ్‌ అంటూ రకరకాల పేర్లు ఉన్నాయి. మర్రి చెట్టు శాస్త్రీయ నామం ‘ఫైకస్‌ బెంగాలెన్సిస్‌’. ఒకప్పుడు బాటసారులు, వ్యాపారులు ప్రయాణాలు చేస్తూ ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకునేవారు. ఆ వ్యాపారుల్నే బనియాలు అనే వారు. అలా ఈ చెట్లకు బనియన్‌ ట్రీ అనే పేరు వచ్చిందంటారు.
ఈ చెట్ల విత్తనాలు చాలా చిన్నవి. చెట్లు మాత్రం మహావృక్షంగా మారిపోతాయి. మర్రి చెట్ల నీడలో దాదాపు పదివేల మంది ఒకేసారి విశ్రాంతి తీసుకునేంత పెద్దవిగా పెరుగుతాయి. ఈ చెట్ల వేర్లు భూమిపైకి కనిపిస్తుంటాయి. కొమ్మలు ఊడలుగా మారి కిందికి దిగి నేలలోకి చొచ్చుకుపోతాయి. లావుగా ఉండే మాను, అనేక శాఖలు, చిన్న చిన్న ఎర్రని పండ్లు, పెద్ద ఊడలతో ఉంటుంది.
ఈ చెట్టు వయసు పెరిగే కొద్దీ ఊడల్ని నేలలో దింపుతూ ఎకరాలకు ఎకరాలు వ్యాపించుకుంటూ పెరుగుతుంది. పక్షులు నా గింజల్ని వేరే చెట్టు పగుళ్లలో లేదంటే పెద్ద పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ల సందుల్లో పడేస్తే అక్కడ మర్రి చెట్లు చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతాయి. మర్రి చెట్ల నీడలో వేరే చెట్లు పెరగవు. ఈ చెట్టు చాలా విశాలంగా దట్టంగా ఉంటుంది
దృఢంగా ఉండే ఈ చెట్ల కలపతో తలుపులు, పెద్ద పెట్టెలు తయారుచేస్తారు. ఈ చెట్ల బెరడు ద్వారా వచ్చే జిగురును పంటి నొప్పులు, కాలి బొబ్బలకువాడతారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ చెట్ల బెరడును, ఆకులను, పండ్లను రకరకాల ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో తిమ్మమ్మ మర్రిమాను అని పిలువబడే మర్రి చెట్టు దాదాపు 5 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి. 1989లో ఇది గిన్నీస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఈ స్థలం పర్యాటక స్థలంగా మారింది.
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పిల్లల మర్రి చెట్టు అని పిలువబడే మర్రి చెట్టు కూడా చాలా పెద్దిది. ఈ చెట్టును చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెట్టుకి 700 ఏళ్లు.
కోల్‌కతా దగ్గర్లో ఆచార్య జగదీశ్‌ చంద్రబోస్‌ ఇండియన్‌ బొటానిక్‌ గార్డెన్‌లో ‘గ్రేట్‌ బనియన్‌ ట్రీ’ ఉంది. అతి పెద్ద మర్రిచెట్లలో ఇదీ ఒకటి.

Bamboo Plants….వెదురు

 Bamboo Plants….వెదురు

వెదురు వృక్ష (చెట్ల) జాతికి చెందినది కాదు, గడ్డి జాతికి చెందినది …వెదురును ఆంగ్లంలో బాంబూ అంటారు. ఈ మొక్కలు చెరకు గడలులాగా నిలువుగా పెరుగుతాయి చెరకు గడలకంటే లావుగా ఉంటాయి.
వెదురు పోయేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల, ఉపఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆఫ్రికా, ఆసియా, అమెరికాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది. వెదురులో రెండు రకాలున్నాయి. ఒకటి రన్నింగ్ బాంబూ, రెండోది క్లాంపింగ్ బాంబూ. రన్నింగ్ బాంబూ బాగా పొడుగ్గా పెరుగుతుంది. పొడవైన వేర్లతో ఉంటుందిది. క్లాంపింగ్ బాంబూ పొట్టి వేర్లతో ఉంటుంది
వెదురులో ఇంచుమించు 1575 రకాల జాతులున్నాయి. కొన్ని జాతుల మొక్కలు చాలా ఎత్తు పెరుగుతాయి. మోసో అనే వెదురు మొక్క రోజులో ఒకటిన్నర అడుగుల ఎత్తు పెరుగుతుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగేవి వెదురు మొక్కలు. ఇవి గిన్నిస్ రికార్డులో ఎక్కాయి. వెదురులో ఒక్కో జాతిది ఒక్కో ఎత్తు. జెయింట్ బాంబూ రకం 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.
వెదురు కాండం మొత్తం చెరకు గడలలాగా కణుపులు కణుపులతో ఉంటుంది. కాండం గుల్లబారి ఉంటుంది. వీటి ఆకుల్ని మీరూ చూసే ఉంటారు. సన్నగా పొడుగ్గా జాలువారుతూ ఉంటాయి.వెదురులో కొన్ని జాతుల్లో పువ్వులూ పూస్తాయి.
వెదురు కలప చాలా చాలా దృఢంగా ఉంటుంది. వెదురుతో కొన్ని ప్రాంతాల్లో వంతెనలూ కట్టేస్తారు. స్తంభాల్లా పాతేస్తారు. ఇళ్ల నిర్మాణానికి, సంగీత వాద్య పరికరాల తయారీలోనూ వెదురును వాడతారు. పార్కులలో వెదురుతో వంతెనలు కట్టటం చూసే ఉంటారు. ఇంకా వెదురుతో నిచ్చెనలు, బల్లలు, కుర్చీలు, బుట్టలు, చేటలు ఇలా ఎన్నో వస్తువుల్ని తయారుచేస్తుంటారు. కాగితం తయారు చేయాలంటే వెదురు తప్పనిసరి, దుస్తుల తయారీలోనూ. వెదురు జిగురుని అలంకార వస్తువులు, మందులు, తోళ్ల పరిశ్రమలో ఉపయోగిస్తారు.
మిగతా చెట్ల కన్నా వెదురు మొక్కలనుండి ఎక్కువ ఆక్సిజన్ విడుదల అవుతుంది. వెదురుకు సహజంగానే యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియా గుణాలున్నాయి. రకరకాల వైద్యాల్లోనూ వెదురు వాడేస్తారు. కఫం, మధుమేహం లాంటి వ్యాధులు తగ్గడానికి వెదురు లేత చిగుళ్ల రసాన్ని తాగుతారు. పాండాలు, రెడ్ పాండాలు, లెమర్లు వెదురు ఆకుల్ని ఇష్టంగా తింటాయి
వెదురులో చాలా రకాలున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రెండు వెదుళ్లు బాగా పెరుగుతాయి. ఒకటి అడవుల్లో పెరిగే ముల్లం. ఇది లోపల గుల్లగా ఉండి మందంగా ఉంటుంది. ఎక్కువ ఎత్తే పెరిగుతుంది. వెదురు తేమ నేలల్లో బాగా ఎదుగుతుంది. దీన్నే బాంబుసా అరండనేసియా అంటారు. ఇంకో రకం సాధనం ఇది పొట్టిగా తక్కువ మందంగా ఉంటుంది. పొడి నేలల్లో ఎదుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలలోని కోనసీమలో వెదురు బొంగులలో వండే ‘బొంగూ చికెన్’ చాలా ప్రసిద్ధి పొందిన నాన్ వెజ్ వంటకం. ఈ మధ్య కాలంలో వెదురు బియ్యం కూడా తింటున్నారు.

Indian Bael Tree … మారేడు చెట్టు

Indian Bael Tree … మారేడు చెట్టు

మారేడు, బిల్వవృక్షం చెట్లను ఇండియన్ క్విన్స్గోల్డెన్ యాపిల్ స్టోన్ యాపిల్ వుడ్, యాపిల్ అంటూ రకరకాల పేర్లూ ఉన్నాయి. ఎగెల్ మార్మలోస్ దీని శాస్త్రీయనామం(Aegle Marmelos). రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు ఇది. సిట్రస్ జాతులైన బత్తాయి, నిమ్మ చెట్లు ఈ జాతివే.
ఆధ్యాత్మికంగానూ, ఔషధగుణాలపరంగానూ ఈ వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే శివరాత్రి రోజున శివుణ్ణి, వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మారేడు ఆకులతో పూజిస్తారు. ఈ మారేడు దళాలు అంటే మహాదేవుడికి ఇష్టం. హిందువులంతా పవిత్ర వృక్షంగా భావిస్తుంటారు. అందుకే చాలా ఆలయాల్లో మారేడు మొక్కల్ని పెంచుతుంటారు. రుగ్వేదంలో ఈ చెట్టు ప్రస్తావన ఉంది
ఈ వృక్షానికి భారత దేశంతో పాటు, శ్రీలంక, నేపాల్ మయన్మార్, థాయ్‌లాండ్‌ దేశాల్ని పుట్టిళ్లుగా చెబుతారు. థాయ్‌లాండ్‌ ఆలయాల్లోనూ ఈ చెట్లు కనిపిస్తాయి. దాదాపుగా అన్ని రకాల వాతావరణాల్లోనూ, నేలల్లోనూ పెరుగుతుంది.
సుమారుగా 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి నెమ్మదిగా ఎదిగే చెట్లు. వీటి ఆకులు ఒకే తొడిమకు మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఈ మారేడులోనే మరో రకం ఏకబిల్వం. ఈ చెట్టుకు ఒకే తొడిమకు ఒకే ఆకు ఉంటుంది. అయితే ఈ మూడు పత్రాలూ కలిసే ఉంటాయి.
పువ్వులేమో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి కమ్మని వాసనను వెదజల్లుతాయి. బెరడు పాలిపోయిన గోధుమ రంగులో కనిపిస్తుంది. మారేడు కాయలు గట్టిగా కాస్త వెలగ పండ్లని పోలి ఉంటాయి. పండు లోపల గుజ్జుతోపాటు విత్తనాలుంటాయి
వేల సంవత్సరాల క్రితం నుంచే మారేడు చెట్టు భాగాల్ని ఆయుర్వేదంలో, సంప్రదాయ వైద్యవిధానాల్లో ఉపయోగిస్తున్నారు.
వేసవిలో ఈ పండు రసం తాగితే చాలా మంచిదంటారు. శరీరంలో వేడి పోవడంతో పాటు తక్షణశక్తి వస్తుందంటారు. అందుకే పశ్చిమబెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో ఈ పండ్ల షర్బత్‌లు చేసుకుంటారు. ఒడిశా రకపు మారేడు పండ్లు గుమ్మడికాయంత పరిమాణంలో పెద్దగా ఉంటాయి. బిల్వ ఫలాల్లో ప్రోటీన్లు, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, క్యాల్షియం, పొటాషియం, పీచు, ఇనుము ఎక్కువగా ఉంటాయి.

Peepal Tree…రావి చెట్టు

Peepal Tree…రావి చెట్టు...

రావి చెట్టు శాస్త్రీయ నామం ఫైకల్ రెలీజియెసా.. రావిచెట్లును పిప్పల, అశ్వర్ధ వృక్షం అని కూడా పిలుస్తారు. రావి చెట్లు సుమారు 100 అడుగుల ఎత్తు పెరుగుతాయి. కొన్ని వందల సంవత్సరాల పాటు జీవిస్తుంది.
పట్టణాలలో రావిచెట్లు ఎక్కువగా కనపడవు. పల్లెలలో దేవాలయాలలో, చెరువు గట్ల దగ్గర, ఊరి బయట, రోడ్ల వెంట రావి, మర్రిచెట్లు తప్పక ఉంటాయి.
ఈ చెట్లు హిందువులకు, బౌద్ధులకు కూడా పవిత్రమైనదే. బౌద్ధమత స్ధాపకుడైన బుద్ధునికి జ్ఞానోదయమైనది రావిచెట్టు క్రిందే. అందుకే రావి చెట్టును బోధివృక్షం అని పిలుస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెట్లలో రావిచెట్టును నేను అని చెబుతాడు.
రావిచెట్టుకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. ఈ పండ్లను కీటకాలు, పక్షులు ఆహారంగా తింటాయి. రావి ఆకులను ఒంటెలు, ఏనుగులు, పశువులకు మేతగా వేస్తారు.
శ్రీలంకలోని అనురాధపురంలో 2000 సంవత్సరాల వయసున్న రావిచెట్టు ఉంది. ఈ చెట్టు అతిపురాతనమైన చెట్టుగా గుర్తింపు పొందింది.
భారతీయులు రావిచెట్టును విష్టుమూర్తిగానూ, వేపచెట్టును లక్ష్మీదేవికి ప్రతిరూపాలుగా భావిస్తారు.
రావిచెట్లు, మర్రిచెట్ల నుండి వీచేగాలి అత్యంత ఆరోగ్యం అంటారు. రోజూ ఒక గంటసేపే ఈ చెట్ల క్రింద గడిపితే మంచి ఆరోగ్యం చేకూరుతుందని అంటారు. మన పల్లెలలో రావి, మర్రి చెట్ల చుట్టూరా గుండ్రంగా, ఎత్తుగా వేదిలాగా కడతారు.

Watermelon Plants… పుచ్చ కాయల మొక్కలు

Watermelon Plants… పుచ్చ కాయల మొక్కలు

తీపి రుచి గల ఎర్రటి కండభాగం గల పుచ్చకాయల జన్మస్థలం ఆఫ్రికా దేశంలోని ఉష్ణమండల ప్రాంతాలు. ప్రస్తుతం పుచ్చకాయలను ప్రపంచమంతటా సాగు చేస్తున్నారు. ఇవి Cucurbitace జాతికి చెందిన మొక్కలు.
పుచ్చకాయలను 4000 సంవత్సరాల నుండే సాగుచేస్తున్నట్లు ఆధారాలు లభించాయి. ఇవి తీగజాతికి చెందినవి. నేలమీద వ్యాపించే తీగలకు పుచ్చకాయలు కాస్తాయి. పుచ్చకాయలు పండించాలంటే నీటి వసతి ఎక్కువగా ఉండాలి. మరియు నేల కూడా ఎక్కువగా ఉండాలి. ఎండ ఎక్కువ ఉండాలి. మంచి రకం పుచ్చవిత్తనాలను సేకరించి నేరుగా నేలలో నాటవచ్చు. .
పుచ్చకాయలలో విటమిన్ A మరియు విటమిన్ C లు ఉంటాయి. ఒకప్పుడు పుచ్చకాయలు వేసవి కాలంలో లభించేవి. ప్రస్తుతం అక్టోబర్ నెల నుండి మార్కెట్ లో లభిస్తున్నాయి.

Sapodilla Fruit Trees… సపోటా పండ్ల చెట్లు

Sapodilla Fruit Trees… సపోటా పండ్ల చెట్లు...

సంవత్సరమంతా పచ్చటి ఆకులతో ఉండే ఈ చెట్ల జన్మస్థలం దక్షిణ మెక్సికో, సెంట్రల్ అమెరికా మరియు కరేబియన్ దీవులు. సపోటా చెట్లు Sapotacea కుటుంబానికి చెందినవి. ఈ చెట్ల ఎత్తు మధ్యస్తంగా ఉండి నెమ్మదిగా పెరుగుతాయి.
ఈ చెట్ల కలప ఎరుపు రంగులో ఉండి ధృఢంగా ఉంటుంది. సపోటా కాయలు కోలగా లేక గుండ్రంగా ఉంటాయి.
ఈ కాయల ఉపరితలం గరుకుగా ఉండి లేత బ్రౌన్ కలర్ లో ఉంటాయి. సపోటా కాయలలో రెండు నుండి ఐదు నల్లని మెరిసే గింజలు ఉంటాయి. సపోటాలలో గుజ్జు ఒకరకమైన తీపి వాసనతో దగ్గర దగ్గర బ్రౌన్ షుగర్ వాసన కలిగి ఉంటుంది. సపోటాలు పక్యానికి రాగానే కోసి మాగపెడతారు. చెట్టునే ఉంచితే ఎంతకాలమైన మగ్గవు.
సపోటా చెట్లను విత్తనాల ద్వారా, కొమ్మల గ్రాఫ్టింగ్ ద్వారా ఉత్పత్తి చేస్తారు.

Pomegranate fruit tree…… దానిమ్మ పండ్ల చెట్లు

 Pomegranate fruit tree…… దానిమ్మ పండ్ల చెట్లు..

దానిమ్మ చెట్ల జన్మస్థానం ఇరాన్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలు. పూర్వకాలం నుండి దానిమ్మ చెట్లను భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా, చీలీ దేశాలలో పెంచుతున్నారు. దానిమ్మ చెట్లు Lythracea చెట్ల జాతికి చెందినవి. దానిమ్మ చెట్లు దాదాపు 23 అడగుల ఎత్తు దాకా పెరుగుతాయి.
.
దానిమ్మ కాయల గింజలలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ కె లు ఉన్నాయి. మరియు వీటిలో అరిగే పీచు (dietary fibre) పుష్కలంగా లభిస్తుంది. దానిమ్మ కాయలు గుండ్రంగా గట్టి తొక్కతో ఉంటాయి. ఈ తొక్కను తీయాలంటే చాకును ఉపయోగించాల్సిందే. దానిమ్మ గింజలు మాత్రం లేత ఎర్రరంగులో మెరుస్తూ జ్యూసీగా, తీపిరుచిని కలిగి ఉంటాయి.

పైన్ యాపిల్ పండ్ల చెట్లు

Pineapple Fruit Trees… పైన్ యాపిల్ పండ్ల చెట్లు...

పైనాపిల్ జన్మస్థలం అమెరికాలోనీ ఉష్టమండల ప్రాంతాలు. అమెరికా నుండే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. ఇవి Bromeliaceae చెట్ల జాతికి చెందినవి.
పైన్ యాపిల్ పండ్లను మాంసాహార వంటకాలలోనూ, చేపల, కూరగాయల వంటకాలలోనూ కలిపి వాడతారు. సిట్రస్ జాతికి చెందిన ఈ పండ్ల ఉపరితలం సన్నని ముళ్లతో గట్టిగా ఉంటుంది. ఈ ఉపరితలాన్ని పూర్తిగా చాకుతో తొలగించుతారు. లోపలి భాగం కొంచెం పుల్లగా, తీయగా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఈ భాగాన్నే తింటారు. ఈ భాగాన్నే ముక్కలుగా చేసి డబ్బాలలో ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఈ పండ్లను వైన్ తయారీలో ఉపయోగిస్తారు.
పైన్ యాపిల్ మొక్కను నాటిన రోజు నుండి 15 నుండి 20 నెలలలోపు ఎదిగి దిగుబడి వస్తుంది. ఈ చెట్లు మూడు నుండి నాలుగున్న అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా పండే ఈ పంటలో 60 శాతం హావాయిలోనే పండుతాయి.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట మండలంలోని గిరిజనులు పైన్ యాపిల్ ను ఎక్కవగా పండించి, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.
పైనాపిల్ చెట్లు అన్ని చెట్లలాగా ఉండవు. నేలపైన విచ్చుకున్న కలువపూవులా ఉండి వాటి పొడవైన ఆకుల మధ్య ఈ కాయలు కాస్తాయి.

Papaya Trees…బొప్పాయి చెట్లు

 Papaya Trees…బొప్పాయి చెట్లు

బొప్పాయి చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. చెట్లు నాటిన తర్వాత ఇంచుమించు ఓ ఏడాదిలోనే కాయలుకాస్తాయి. మొదట్లో ఈ కాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. కాయలు పండాక పసుపు రంగులోకి మారిపోతాయి. బొప్పాయి జీవిత కాలం సుమారు 5 సంవత్సరాలు. బొప్పాయి చెట్లలో మగవి, ఆడవి రెండు రకాలుంటాయి. 16 నుంచి 33 అడుగుల ఎత్తు దాకా పెరుగుతుంది. పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. బొప్పాయి కాండం మీద లేక పచ్చి కాయ మీద గాటుపెడితే పాలు కారుతుంటాయి. వీటి భాగాలన్నింట్లో ఉండే పపైన్ అనే ఎంజైమే దీనికి కారణం

బొప్పాయిని ఆంగ్లంలో పపాయ అని పిలుస్తారు. ఇంకా పాపా, ట్రీ మెలన్ పప్వ అంటూ వేరే పేర్లూ ఉన్నాయి. బొప్పాయిది కారికేసి కుటుంబం. మెక్సికో బొప్పాయి పుట్టిల్లు . అక్కడి నుంచి ఇతర ప్రాంతాల్లోకి వ్యాపించింది.

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అసోం, పంజాబ్, రాష్ట్రాల్లో ఎక్కువగా పండుతుంది. సారవంతమైన ఎర్రనేలలు, ఒండ్రు నేలలు, సాధారణంగా ఉండే నేలలలో కూడా పండుతుంది.

బొప్పాయిలో చాలా విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఉపయోగపడుతుంది. ఈ పండులో ఉండే కెరోటినాయిడ్లూ, పీచు చాలా మేలు చేస్తాయి.

బ్యూటీక్రీమ్ లు, బ్యూటీ లోషన్లు లాంటి సౌందర్య ఉత్పత్తుల్లోనూ బొప్పాయిని ఉపయోగిస్తారు. ఈ చెట్టు పండ్లే కాకుండా ఆకులు కూడా ఔషధాల తయారీలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా డెంగీ జ్వరం వలన రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది. బొప్పాయి ఆకులు, పండ్లు ప్లేట్ లెట్స్ ను త్వరగా పెంచుతాయి. డయాబెటిక్ వ్యాధివారు బొప్పాయి పండ్లను మితంగా రోజూ తినవచ్చంటున్నారు ఆహార నిపుణులు.

Orange Fruit Tree…కమలా పండ్ల చెట్లు

Orange Fruit Tree…కమలా పండ్ల చెట్లు..

ఆరెంజ్ ఫ్రూట్ గా పిలువబడే కమాలా కాయలు సిట్రస్ జాతికి చెందిన Rutacea జాతికి చెందినవి. ఆరెంజ్ చెట్ల మూలం ఆఫ్రికా ఖంఢంలోని తూర్పు తీర ప్రాంతాలు.
ఈ పండ్ల లోపల భాగం తొనలతో ఉండి జ్యూసీగా తీయగా పుల్లగా ఉంటాయి. వీటి మందమైన తోలు చర్మంలాగా ఉండి చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఈ తొక్కల నుండి నూనెను తయారు చేస్తారు.
ఈ చెట్లు 20 అడుగుల ఎత్తుదాకా పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు 365 రోజులు పచ్చగా ఉంటాయి. ఈ చెట్ల పూలు 5 రేకలు కలిగి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఆరెంజ్ తొనలను నేరుగా తింటారు మరియు ఆరెంజ్ డ్రింక్స్ కూడా తయారు చేస్తారు. ఈ చెట్ల జీవితకాలం సుమారు 50 నుండి 80 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈ చెట్లను నర్సరీల నుండి కొనవచ్చు.

Mango Trees…మామిడి చెట్లు

mango tree

చిన్న పిల్లల నుండి పెద్దలు దాకా మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. మామిడి చెట్లను ప్రపంచమంతా పెంచుతున్నా కూడా ఇవి ఉష్ణమండల పంటలు. వీటి జన్మస్థలం తూర్పు ఆసియా, మయన్నార్, భారతదేశాలుగా చెబుతారు. మామిడి చెట్లు 50 నుంచి 60 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మామిడి కాయలు సీజనల్ ఫ్రూట్స్ అనగా ఒక ప్రత్యేకమైన కాలం(వేసవి కాలం) లో మాత్రమే లభిస్తాయి(సుమారుగా ఏప్రియల్ నెల నుండి జులై నెల వరకు)
మామిడి కాయలలో అనేక రకాలున్నాయి. బంగినిపల్లి, పెద్ద రసాలు, చిన్నరసాలు, చిత్తూరు (కలెక్టర్) మామిడి, పునాస, ముంతమామిడి(కొబ్బరి మామిడి), గులాబీలు సాధారణంగా అందరికి తెలిసినవి. మామిడి చెట్లను అంట్లు కట్టి తయారు చేస్తారు. విత్తనాలు నాటితే నాటిని విత్తనం రకం కాకుండా వేరే రకం చెట్టు మెలకెత్తవచ్చు.
మామిడి కాయలలో విటమిన్ ఎ, సి, డిలు పుష్కలంగా ఉంటాయి. మామిడి కాయలను నేరుగా తినడమే కాకుండా పుల్ల మామిడి కాయలతో ఊరగాయ పచ్చడి తయారు చేస్తారు. ఇది తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ. మామిడి కాయల గుజ్జుతో జామ్స్, జెల్లీలు, మామిడి తాండ్ర తయారవుతాయి. పెద్ద రసాలు, చిన్నరసాలు పచ్చిగా ఉన్నపుడు పచ్చళ్లు పెట్టటానికి పనికి వస్తాయి. ఇవి బాగా పండినపుడు రసాలుగా తయారై తీయని రుచి కలిగిగి ఉంటాయి.

Lemon Tree…నిమ్మకాయ చెట్టు

Lemon Tree…నిమ్మకాయ చెట్టు

నిమ్మ పుట్టిల్లు దక్షిణ ఆసియా. కానీ ఇండోనేషియా, భారత దేశంలోని అసోంలో మొదటిసారిగా పండించారని చెబుతారు. ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి.
ప్రస్తుతం నిమ్మను ఎక్కువగా మెక్సికోలో పండిస్తున్నారు. ఆ తరువాత భారత్ చైనా, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో నిమ్మను ఎక్కువగా పండిస్తున్నారు
నిమ్మ చెట్టు దాదాపు 16 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పొదలా ఉండే చిన్నపాటి చెట్టు ఇది. నిమ్మ ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అంచుల్లో కాస్త వంకర తిరిగి కనిపిస్తాయి. నిమ్మ ఆకులు కూడా సువాసనగా ఉంటాయి. ఈ చెట్లకు తెల్లని పూలు గుత్తులుగా పూస్తుంటాయి. కమ్మని వాసన వెదజల్లుతాయి.నిమ్మకాయలు చెట్టుకు కాసినపుడు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండిన తరువాత లేత పసుపు రంగులోకి మారతాయి. ఈ కాయలు తెల్లని చిన్న గింజలతో పుల్లని రసంతో ఉంటాయి. సంవత్సరం అంతా నిమ్మకాయలు కాస్తాయి. ఒక చెట్టు నుంచి ఏడాదికి దాదాపు 270 కిలోల నిమ్మకాయలు కాస్తాయి. ఉష్ణమండలాలు. ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. నిమ్మచెట్లు బాగా పెరగాలంటే సూర్యరశ్మి ఎక్కువగా ఉండాలి. వీటి జీవిత కాలం సుమారు 50 సంవత్సరాలు
నిమ్మకాయలలో పసుపు పచ్చ, ఆకుపచ్చ. ఎర్ర, తెల్ల, గులాబి రంగులున్నవీ, దొండకాయల్లాగా పొడవుగా ఉండే నిమ్మకాయలూ ఉన్నాయి. నిమ్మ చెట్టుది రూటేసి కుటుంబం. సిట్రస్ జాతులైన నిమ్మ, బత్తాయి, నారింజ, పంపరపనస, గజనిమ్మ, కమలాలు… ఈ జాతిలోకే వస్తాయి.
నిమ్మ కాయలతో ఊరగాయ పచ్చడి పెట్టుకుంటారు. తెలుగు రాష్ట్రాలలో చింతపండుకు బదులు నిమ్మరసంతో పులిహోర తయారు చేస్తారు. ఇంకా రకరకాల వంటల్లో వాడతారు. వేసవిలో నిమ్మ కాయరసంలో నీళ్లు, పంచదార కలుపుకుని తాగుతారు.. సి విటమిన్ అందించే వాటిల్లో మొదటి స్థానం నిమ్మకాయలదే.. సి విటమిన్ వలన రోగనిరోధక శక్తి ఎక్కువగా అందుతుంది.
ఇంకాఎ, ఇ, బీ6, విటమిన్లూ ఉంటాయి. ఇంకా ఇనుము, రాగి, మెగ్నీషియం, క్యాల్షియం, రైబో ప్లేవిన్, జింక్ ఉంటాయి. నిమ్మ కాయల్ని ఆయుర్వేదంలోనూ ఉపయోగిస్తారు

Guava Trees….జామచెట్లు

Guava Trees….జామచెట్లు

జామ చెట్లు ఉష్ణమండలానికి చెందిన చెట్లు. ప్రపంచమంతా జామను పండిస్తున్నా వీటి జన్మస్థలం అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతం. ఇవి మిర్టాసియా కుటుంబానికి చెందినవి. జామ చెట్లను విత్తనాలు మరియు గ్రాఫ్టింగ్ పద్ధతుల ద్వారా పెంచుతారు. జామ కాయలను నేరుగా తినటానికే కాక జెల్లీలు, జామ్ తయారీలో కూడా వాడతారు.
జామ ఆకులు పచ్చగా సుమారుగా ఒకటి నుండి మూడు అంగుళాల వెడల్పుతో ఉంటాయి. వీటిపూలు చాలా చిన్నగా ఉంటాయి. తెల్లగా నాలుగు రేకలతో ఉంటాయి. ఈ పూలే జాయకాయలుగా మారుతాయి. జామకాయలు గుండ్రంగా లేక కోలగా ఉంటాయి. జామకాయ పైభాగం ఆకుపచ్చగా ఉండి లోపలి కండభాగం తెల్లగా లేక లేత గులాబీ రంగులో ఉంటుంది.
జామకాయలు సంవత్సరమంతా కాస్తాయి. కానీ వర్షాకాలం ముగిసిన తరువాత వీటి దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
జామ కాయలలో A,B,C విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Goose Berry Tree …ఉసిరి చెట్టు

Goose Berry Tree …ఉసిరి చెట్టు...

ఉసిరి చెట్లు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో పెరుగుతాయి. అయితే ఇండోనేషియా… ఉసిరి చెట్లను ఎక్కువగా పెంచే దేశాల్లో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెంచుతారు.
ఉసిరి చెట్లలోచాలా రకాలు ఉన్నాయి . ఎక్కువగా బలవంత్ నీలమ్ అమ్రిత్ కాంచన్ కృష్ణ, చక్కియా, బనారసి ఉసిరి జాతుల్ని పెంచుతుంటారు. ఉసిరి కాయలలో రెండు రకాలున్నాయి. చిన్న చిన్న కాయలను తినే ఉసిరి అంటారు. వీటిని పిల్లలు, పెద్దలు ఉప్పు, కారం అద్దుకుని ఇష్టంగా తింటారు. ఇవి పులుపు, కొంచెం వగరు రుచితో ఉంటాయి. చ్వవనప్రాస తయారీలో రాతి ఉసిరిని వాడతారు. .
మరోరకం కాయలు కొంచెం పెద్దగా గుండ్రంగా, గట్టిగా ఉంటాయి. వీటిని రాతి ఉసిరి అంటారు. వీటి నేరుగా తింటానికి కొంచెం కష్టపడాలి. బాగా పుల్లగా, వగరుగా ఉంటాయి. వీటిని ఎక్కువగా ఆయుర్వేద వైద్యంలో వాడతారు. పచ్చళ్లుగా పెట్టుకుంటారు. .
ఉసిరి చెట్లనే . ఆమ్ల, అమలక, భూమి ఆమ్ల, ఇండియన్ గూస్ బెర్రీ ట్రీ కూడా పిలుస్తారు. ఉసిరి శాస్త్రీయ నామం ఫిలాంథస్ ఎంబ్లికా. ఈ చెట్లు మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఎదిగే చెట్లు. సుమారు 26 అడుగుల నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఆకులు చిన్నగా చింతచెట్టు ఆకులులాగా ఉంటాయి. పూలు ఆకుపచ్చ పసుపు రంగుల్లో ఉంటాయి. .
ఉసిరికాయలు ఆరు నిలువుచారలతో గుండ్రంగా ఉంటాయి. లోపలంతా పీచు ఉంటుంది. ఒకే కొమ్మకి బోలెడన్ని గుత్తులుగుత్తులుగా కాస్తాయి.
ఒకప్పుడు అడవుల్లోనే ఉసిరి చెట్లు ఉండేవి. ఇప్పుడు తోటలుగానూ పెంచుతున్నారు.భారత దేశంలో ఉత్తర్ ప్రదేశ్ తమిళనాడు, రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెంచుతున్నారు. .
ఉసిరి వలన చాలా ప్రయోజనాలున్నాయి.వీటి వలన మంచి ఆరోగ్య చేకూరుతుంది. ఆయుర్వేదంలోను ఇతర ఔషధాల్లో ఎక్కువగా వాడతారు. ఈ కాయలు, పువ్వులు, బెరడు, వేరు ఇలా అన్నీ ఔషధగుణాలున్నవే. ఈ పండ్లలో విటమిన్ సి చాలా ఎక్కువ. రోగనిరోధక శక్తి పెంచడానికి చాలా అవసరం. ఇంకా కెరోటినాయిడ్స్ గ్లూకోజ్ క్యాల్షియం, ప్రోటీన్లూ ఉంటాయి. అంతేకాక చాలా సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. షాంపూల్లో, హెయిర్ ఆయిల్స్ లో నా కాయల్ని ఉపయోగిస్తారు. .
తెలుగు రాష్ట్రాలలో రాతి ఉసిరితో ఊరగాయ, తొక్కు పచ్చళ్లు పెట్టుకుంటుంటారు. జామ్స్, సాస్ లు, క్యాండీలు, చిప్స్, జెల్లీలూ తయారుచేస్తుంటారు. ఈ చెట్ల కలపని టపాకాయల్లో వాడుతుంటారు.
హిందువులు ఉసిరిచెట్టును ఆరోగ్యదాయినిగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాల్లో ఉసిరి చెట్టుకింద భోజనం చేయడం సంప్రదాయం.

Dates Tree….ఖర్జూరం

Dates Tree….ఖర్జూరం...

ఖర్జూరం చెట్టు నాటినప్పటి నుండి మూడవ సంవత్సరం నుండి దిగుబడి మొదలవుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండే ఉష్టప్రాంతాలలోని అన్నిరకాల నేలలోనూ ఈ చెట్లు ఎదుగుతాయి. Arecaceae చెట్ల జాతికి చెందినది
ఖర్జూర పంటకు చీడపీడలు తక్కువే. ఒకో చెట్టుకు 300 నుంచి 500 వందల కిలోల దాకా దిగుబడి వస్తుంది. ఈ చెట్లు 75 అడుగుల దాకా ఎదుగుతుంది. ఈ చెట్ల జీవితకాలం 150 సంవత్సరాలు అంటారు. ఈ చెట్టులోని ప్రతిభాగం విలువైనదే. కాండంను కలపగా వాడతారు. పొడవైన వీటి ఆకులను బుట్టలు తయారు చెయటానికి ఉపయోగిస్తారు.
ఈ చెట్ల జన్మస్థానం ఇరాక్ దేశమని చెబుతారు. మరియు ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లోని ఎడారి ప్రాంతాలలో ఖర్జూర చెట్లను ఎక్కువగా సాగుచేస్తారు. ఇంకా పాకిస్తాన్, ఇండియా, మెక్సికో దేశాలలో కూడా ఈ చెట్లను పెంచుతున్నారు. ఈజిప్ట్, ఇరాన్, సౌది అరేబియా, ఇరాక్ దేశాలలో ఖర్జూరం ఎక్కువగా పండుతుంది. ఈ దేశాల నుండి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు.
ఖర్జూరంలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి మెండుగా లభిస్తోంది. పాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు ఖర్జూరంలో ఎక్కువగా లభిస్తాయి. చిన్నపిల్లల ఎదుగుదలకు మంచి ఆహారం. చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది కనుక మధుమేహంతో బాధపదేవారు ఖర్జూరాలకు దూరంగా ఉండటమే మంచిది.

Custard Apples….సీతాఫలం చెట్టు

Custard Apples….సీతాఫలం చెట్టు

శీతకాలంతో పాటు సీతాఫలం పండ్లు కూడా వస్తాయి. సీతాఫలాలను షుగర్ యాపిల్, కస్టర్డ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా. అనోనేసి కుటుంబానికి చెందినవి. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లోనే ఈ చెట్లు పెరుగుతాయి. రకరకాల ఇసుక నేలలలోనూ, కొండప్రాంతాలలోనూ ఈ చెట్లు పెరుగుతాయి. దక్షిణ అమెరికా దేశాలతో పాటు భారతదేశంలోనూ ఎక్కువగా ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.
ఈ చెట్లకు చిన్న చిన్న కొమ్మలుంటాయి. సుమారు 10 నుంచి 26 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ చెట్లకు రెండేళ్లు వచ్చినప్పటి నుంచే పూత పూస్తుంది. తర్వాత నుంచి మధురమైన పండ్లుకాస్తాయి.
ఈ పండ్లు గుండ్రంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. లోపల నల్లని కోల ఆకారంలోని గింజలతో తెల్లని గుజ్జుతో ఉంటాయి. ఈ గుజ్జు తియ్యగా రుచిగా ఉంటుంది
సీతాఫలాలో విటమిన్ సి, విటమిన్ బీ6, ఇంకా పీచు పదార్థాలు ఉంటాయి.
ఈ చెట్ల ఆకులు, బెరడు, వేర్లు, గింజలు ఇలా అన్నిభాగాల్ని ఔషధాల తయారీలో వాడతారు
ఈ పండ్ల గుజ్జుతో స్వీట్లు, జెల్లి, ఐస్ క్రీమ్ జామ వంటివి తయారుచేస్తుంటారు
ప్రపంచవ్యాప్తంగా ఈ చెట్లలో చాలా రకాలున్నాయి. వాటిల్లో పింక్స్ మముత్ ఆఫ్రికన్ ప్రైడ్ ముఖ్యమైనవి.
రామా ఫలం, లక్ష్మణ ఫలం, హనుమా ఫలం ఈ పండ్లు కూడా. ఇవి సీతాఫలం కుటుంబానికి చెందినవే. చిన్న పిల్లలు ఇష్టంగా తినే పండ్లు సీతాఫలం పండ్లు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం వీటికి దూరంగా ఉండాల్సిందే.

Coco Nut Trees….కొబ్బరి చెట్లు

Coco Nut Trees….కొబ్బరి చెట్లు

కొబ్బరి చెట్లలో రెండు రకాలున్నాయి. మొదటిది పొట్టిరకం చెట్లు. రెండవవి పొడుగు చెట్లు. కొబ్బరి చెట్లు నాటిన 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలో కొబ్బరి కాయలు కాయటం మొదలవుతుంది. ఒక్కో కొబ్బరి చెట్టుకు 50 నుండి 100 కాయల వరకు దిగుబడి ఉంటుంది.
కొబ్బరి చెట్లు ఉష్ణమండలపు చెట్లు. ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. పొడుగు కొబ్బరి చెట్లు 80 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇసుక నేలలోనూ, సముద్రతీర ప్రాంతాలలోనూ, అన్నిరకాల నేలలోనూ కొబ్బరి చెట్లు పెరుగుతాయి.
కొబ్బరి కాయలలో రెండు రకాలున్నాయి. మొదటి రకం కొబ్బరి బోండాలు. వీటిలో కొబ్బరి నీరు నిండుగా ఉండి తాగటానికి ఉపయెగిస్తారు.
రెందవ రకం కొబ్బరి కాయల వలన అనేక ప్రయోజనాలున్నాయి. ఈ కొబ్బరి కాయలను సాధారణంగా దేవాలయాలలో, ఇండ్లలో పూజలు చేసేటపుడు కొడతారు. ఈ కొబ్బరి కాయలనుండే ఎండు కొబ్బరి తయారవుతుంది. ఎండిన కొబ్బరి చిప్పలనుండి కొబ్బరి నూనె తీస్తారు.
కొబ్బరి చెట్లలో ప్రతి భాగం ఉపయోగకరమైనది. కొబ్బరి ఆకుల నుండి ఈనెలను వేరుచేసి ఇళ్లు, రోడ్లు ఊడ్చే చీపురులు తయారు చేస్తారు. కొబ్బరి పీచును సోఫాలు, పరుపుల తయారీలో ఉపయోగిస్తారు.
కొబ్బరి చాలా బలవర్ధకమైన ఆహారం. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎదిగే పిల్లలకు కొబ్బరితో చేసిన ఆహారాలు పుష్టికరమైనవి. భారతదేశంలో కేరళలో తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కొబ్బరి చెట్లు ఉన్నాయి. బెంగుళూరు కొబ్బరి బోండాలు కొబ్బరి నీటికి పేరుపొందినవి. వీటిలో నీరు ఎక్కువగా ఉంటుంది.

Cahew Apple Tree.. … జీడి చెట్టు

Cahew Apple Tree.. … జీడి చెట్టు...

జీడి చెట్ల జన్మస్థానం బ్రెజిల్ దేశం. 16వ శతాబ్ధంలో పోర్చుగీసు నావికుల ద్వారా తూర్పు ఆఫ్రికా మరియు భారతదేశానికి తేబడ్డాయి. ప్రస్తుతం వీటిని వ్యాపార పరంగా బ్రెజిల్, భారతదేశాలలో ఎక్కువగా ఈ చెట్లను పెంచుతున్నారు. జీడి చెట్లు సుమారు 40 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కువగా సముద్రతీరాలలోనూ, ఇసుక నేలలోనూ పెరుగుతాయి.
అత్యధికంగా ప్రొటీన్లు గల జీడి పప్పును నేరుగా తినవచ్చు. మాంసాహార, శాఖాహార వంటకాలలో ఉపయోగిస్తారు. జీడి చెట్లనుండి జీడికాయలు కాస్తాయి. ఈ జీడికాయల కింద జీడిగింజలు ఏర్పడతాయి. వీటిలోని జీడిపప్పు ఉంటుంది. ఈ జీడికాయలు పండిన తరువాత జీడిగింజలను వేరుచేస్తారు. జీడికాయను నేరుగా తింటారు. కానీ వీటి అడుగుభాగాన్ని కొద్దిగా తొలగించి తినాలి లేని ఎడల గొంతులో నస వస్తుంది. ఇంకా ఈ పండ్లను బెవరేజెస్, జామ్ లు, జెల్లీల తయారీలో ఉపయోగిస్తారు.
ఇక జీడిగింజలను కాల్చి, పగలకొట్టి వీటిలోని గింజలను వేరుచేస్తారు. జీడిపప్పు చాలా ఆరోగ్యకరమైన స్నాక్స్. జీడి పప్పు ఖరీదు ఎక్కువ. అరుదుగా జీడిపప్పు వీటి ఉత్పత్తులు కొందరిలో ఎలర్జీని కలిగిస్తాయి. జీడి చెట్ల కలప కూడా ఉపయోగకరమైనది. ఈ చెట్ల కలపతో చెక్క పెట్టెలు, బొగ్గు తయారు చేస్తారు.

Black Plum Tree….నేరేడు చెట్టు

Black Plum Tree….నేరేడు చెట్టు

నేరేడు చెట్టుకు గిన్నె చెట్టు అనే మరో పేరూ ఉంది. ఇంగ్లీషు భాషలో మలబార్‌ ప్లమ్‌, జావా ప్లమ్‌, బ్లాక్‌ ప్లమ్‌.. అంటూ అంటారు. ఈ చెట్లను ఎక్కువగా పండ్ల కోసమే పెంచుకుంటారు.
నేరేడు చెట్టు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని. ఇంకా మిర్టేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. భారత్ తోపాటు శ్రీలంక, పాకిస్థాన్ ఇండోనేషియాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా ఫిలిప్పీన్స్ మయన్మార్ ఆస్ట్రేలియా, ఫిజి, చైనాలోనూ కొద్దిగా ఈ చెట్లు కనబడుతాయి.
ఆషాఢం మాసంనుండి నేరేడు పండ్లు మార్కెట్ లో లభిస్తాయి.
నేరేడు చెట్లు చాలా త్వరగా పెరుగుతాయి. దాదాపు 90 అడుగుల వరకూ పెరుగుతాయి. ఆకులు దళసరిగా ఉంటాయి. నేరేడు చెట్లు నీరులేని కరవు పరిస్థితుల్లోనూ తట్టుకుని బతకగలదు. ఈ చెట్ల జీవితకాలం వంద సంవత్సరాలు.
నేరేడు కాయ ఏర్పడినపుడు పచ్చగా ఉంటుంది. తర్వాత ఎర్రగా మారుతుంది. పక్వానికి వచ్చేసరికి నిగనిగలాడుతూ నల్లగా తయారవుతుంది.
నేరేడు జాతిలో ఉన్న రకాల్ని బట్టి కాయల పరిమాణంలోనూ తేడాలుంటాయి. కొన్ని గుండ్రంగా పెద్దగా ఉండే రకానివి. ఇంకొన్ని కోలగా పెద్దగా ఉంటాయి. కొన్ని గుండ్రంగా చిన్నగా ఉంటాయి. వీటిని చిట్టి నేరేడు అంటుంటారు
ఈ పండ్లు పోషకాల గనులు. ఔషధ గుణాలు కలవి. వీటిలో విటమిన్ సీ, ఇనుము పుష్కలం. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కడుపునొప్పి, గుండె జబ్బులు, ఆస్తమా, మధుమేహం, క్యాన్సర్లతోపాటు ఎన్నో వ్యాధులు నియంత్రణలో ఉండటానికి సహాయపడతాయి
ఈ చెట్ల ఆకులూ, బెరడూ ఔషధ విలువలున్నవే. ఈ చెట్ల కలపను వ్యవసాయ పరికరాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎడ్ల బండికి చక్రాలూ తయారు చేస్తారు. ఇళ్లకు కిటికీలు, తలుపుల్లాంటివీ తయారు చేస్తారు

Banana Plants…అరటి మొక్కలు

Banana Plants…అరటి మొక్కలు...

సాధారణంగా అరటి మొక్కను అరటి చెట్టు అంటారు. కానీ ఇది చెట్టు కాదు. ఒక రకంగా మొక్కే. ఈ మొక్కకు ప్రత్యేకంగా కాండం అంటూ ఉండదు! ఆకుల భాగాలే పొరలుపొరలుగా కలిసిపోయి కాండంగా మారతాయి. అరటి శాస్త్రీయ నామం… మూసా అక్యునిమిటా(అడవి అరటి). అరటి పండ్లను సంస్కృతంలో రంభాఫలం, కదలీఫలం అనీ హిందీలో ఖేలా, ఇంగ్లిష్ లో బనానా అంటారు.
అరటి మొక్కలు సాధారణంగా.. 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.. వీటికి సీజన్ అంటూ లేకుండా.. సంవత్సరం పొడవునా పంట వస్తుంది. అరటి మొక్కకు చాలా బరువున్న అరటిగెలలు కాస్తాయి. కానీ తుపానులు, బలమైన గాలులకు తట్టుకోలేవు. పడిపోతాయి. అరటి మొక్కలో అన్ని భాగాలు పనికివస్తాయి. పచ్చి అరటి కాయలు, పువ్వులు, మొవ్వ (లేతకాండం)ను కూడా కూరలుగా వండుకుంటారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరటిలో చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా కూర అరటి, పండు అరటి (తినే) రకాలు పండుతాయి. పసుపు రంగు అరటిపండే ఎక్కువగా కనబడుతుంది. కానీ వీటిలో ఆకుపచ్చ, నీలం, ఎరుపు రంగులో ఉన్న అరటి పండ్లూ ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, యూరప్ లోఎక్కువగా పెరుగుతుంటాయి. పక్వానికి రాగానే అరటి మొక్కల నుంచి గెలలను కోసి మాగబెడుతుంటారు.
ఒకవేళ గెలలను కోయకుండా అలాగే ఉంచినా.. పండటానికి చాలా ఆలస్యమవుతుంది. తొక్క రంగూ బాగుండదు. పండు అంత రుచి ఉండదు. సాధారణంగా కొద్దిగా పక్యానికి వచ్చేదాకా ఉంచి సహజ పద్ధతులలో మాగపెట్టే అరటి కాయలు చాలా రుచిగా ఉంటాయి. కానీ ప్రస్తుతం అరటిగెలలను ద్రావణంలో ముంచి మాగపెడుతున్నారు. అడవి అరటిలో విత్తనాలుంటాయి. ప్రస్తుతం మర్కెట్ లో లభించే అరటిపండులో విత్తనాలుండవు. మొదళ్ల నుంచి కొత్త పిలకలు వచ్చి మరలా అవి అరటి మొక్కలుగా తయారవుతాయి.
అరటి పండు తింటే వెంటనే శక్తి వస్తుంది. 75 శాతం నీరు ఉంటుంది. అరటి పండులో కెలోరీలు తక్కువే. సాధారణంగా ఓ పండులో దాదాపు 95 కెలోరీలు ఉంటాయి. ఈ పండ్లలో సోడియం, పొటాషియం, విటమిన్, సి, ఫైబర్, విటమిన్ బీ6 ఉంటాయి.
పూజలు, పెళ్లిళ్లు, పేరంటాలు.. ఇలా ఏ శుభకార్యం జరిగినా అరటిపండ్లు ఉండాల్సిందే . మధుమేహ వ్యాధితో బాధపడేవారు అరటి పండ్లను తినకూడదని పరిశోధనలు తెలుపుతున్నాయి. అరటి మొక్కలు పెరగాలంటే సారవంతమైన నేల కావాలి. నీరూ ఉండాలి. ఒకసారి గెలవేశాక… ఆ చెట్టు ఇంక పనికిరాదు. అదే చెట్టు మొదలులో వచ్చిన పిలకలు పెరిగి పెద్దవవుతాయి. ఒకప్పుడు భోజనం చేయాలన్నా పార్సిల్ కట్టాలన్నా అరటి ఆకులను వాడేవారు.. ఇప్పుడు మాత్రం కేవలం పండగలలో, పర్వదినాలలో మాత్రమే అరటి ఆకులలో తింటున్నారు. కానీ అరటి ఆకులలో వేడి వేడి పదార్ధాలు వడ్డించుకుని తింటే అరోగ్యం చేకూరుతుందంటారు మన పెద్దలు. ప్రస్తుతం అరటి కాండాన్ని ఉపయోగించి పర్యావరణానికి హాని చేయని ప్లేట్లు, సంచులు తయారు చేస్తున్నారు.

ఆవకాడో చెట్టు

Avacodo Fruit Trees… ఆవకాడో చెట్టు ...

అవకాడో పండును వెన్నపండు, అలగేటర్పియర్ అని కూడా అంటారు. ఈ పండు జన్మస్థానం మధ్య మెక్సికో ప్రాంతం. ఈ పండు శాస్త్రీయ నామం పెర్సీ అమెరికానా.. ఈ చెట్టు సుమారు 66 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అవకాడో చెట్లు సారవంతమైన ఎర్రనేలల్లో పెరుగుతాయి.

ఈ పండ్లను క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల నుంచే తింటున్నారు. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా.. ఇప్పుడిప్పుడే ఈ చెట్లను పెంచుతున్నారు

విత్తనం నాటిన 4 నుంచి 6 సంవత్సరాలకు కాయలు కాస్తాయి చొక్వెట్ హాస్ గ్వెన్ లుల, పింకర్టన్ రీడ్ బెకాన్ బ్రాగ్డెన్ ఏట్టింగర్ వీటిలోని రకాలు. ఇందులో కొన్నికాయలు ఆకుపచ్చగా, కొన్ని నలుపురంగులో ఉంటాయి. నలుపు రంగులో కనిపించే హాస్ ఆకుపచ్చ రంగులో కనిపించే గ్వెన్రకాలు ఎక్కువగా సాగుచేస్తున్నారు. పండు మధ్యలో ఒకేఒక గింజ ఉంటుంది. వీటిని కొన్ని ఔషధాల తయారీలో వాడుతారు

ఈ పండు లోపల పదార్థం వెన్నలా మెత్తగా ఉంటుంది. తింటే కొద్దిగా ఆవు వెన్న రుచిలా అనిపిస్తుంది. చిరు చేదుగానూ ఉంటుంది

ఈ పండ్లలో ఎక్కువశాతం కొవ్వు ఉన్న ప్పటికీ గుండెకు మేలు కలుగుతుంది. వీటిలో బీ6, ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది 100 గ్రాముల పండు గుజ్జు తింటే 160 కిలో కేలరీల శక్తి వస్తుంది

అరటి పండులో కంటే ఎక్కువ పొటాషియం అవకాడో పండులో ఉంటుంది. ఇంకా ఈ పండ్లలో ఎ, బి, ఇ విటమిన్లూ ఉంటాయి. వీటితో పాటు సమృద్ధిగా పీచుపదార్థం, ఖనిజాలుఉంటాయి వెన్నకు బదులుగా ఈ పండ్లలోని గుజ్జును కొన్ని హోటళ్లలో మాంసాహార వంటకాల్లో వాడతారు. ఇంకా ఈ పండుగుజ్జును సలాడ్లు, ఐస్ క్రీంల తయారీలోనూ వాడతారు

ఈ పండు తినడంవల్ల గుండెకు, చర్మానికి మంచిది. ఇన్సులిన్ ఉత్పత్తి సమన్వయం అవుతుంది. కీళ్లనొప్పులు తగ్గుతాయి

కానీ ఈ చెట్ల ఆకులు, బెరడు కాస్త విషపూరితం. ఇవి..ఆవులు, గేదెలు, మేకలు, కుందేళ్లు, పక్షులు, గుర్రాలకు హానిచేస్తాయి

కేలరీలు, ఆరోగ్యవంతమైన కొవ్వు అధికంగా ఉండటంవల్ల సహజసిద్ధంగా బరువు పెరగాలనుకునే వారికి అవకాడో తింటే ప్రయోజనం ఉంటుంది.

Almond Tree…బాదం చెట్లు

Almond Tree…బాదం చెట్లు

బాదం చెట్లు 13 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి జీవిత కాలం సుమారు 25 సంవత్సరాలు. బాదం ఆకులు మూడు నుంచి ఐదు అంగుళాల పొడవు ఉంటాయి. ఈ చెట్లకు సూర్యరశ్మి, నీళ్లు ఎక్కువగా కావాలి. ఇసుక, బంకమట్టి నేలలో పెరుగుతాయి.
ఆంగ్లంలో ఆల్మండ్ ట్రీ అంటారు . ఈ చెట్లు రోసేసి కుటుంబానికి చెందినవి. ప్రునస్ డల్సిస్ ఈ చెట్ల శాస్త్రీయ నామం. ఇవి ఎక్కువగా మధ్య ఆసియా దేశాల్లో పెరుగుతాయి. తరువాత అమెరికా, స్పెయిన్, ఇటలీ, మొరాకో, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ పెరుగుతాయి
బాదం ఆకులతో విస్తరాకులు కూడా తయారు చేస్తారు. 80శాతం బాదం అమెరికాలోనే పండుతుంది
దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాల తర్వాత నుంచి బాదం చెట్లకు కాయలు కాస్తాయి. అవి పండాక పగలగొడితే వచ్చేదే బాదం పప్ఫు. బాదం పప్పు చాలా ఖరీదైనవి మరియు బలవర్థకమైనవి కూడా
బాదంలో తీపిబాదం, చేదుబాదం అనే రెండు రకాలున్నాయి. తీపి బాదాన్ని మిఠాయిల్లో, బాదం పాల కోసం ఎక్కువగా వాడుతుంటారు. బాదం పప్పును నేరుగా తింటారు. రెండోదాన్ని బాదం నూనె తయారీకి ఉపయోగిస్తారు
బాదం పప్పుల నుండి పాలు, పప్పు, నూనె వంటివి తయారు చేస్తారు. ఈ పప్పులో ఉండే మెగ్నీషియం కండరాల నొప్పుల్ని దూరం చేస్తుంది. క్యాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. బాదం పాలలో విటమిన్ ఈ ఉంటుంది. ఇంకా ప్రొటీన్ ఫాస్ఫరస్ పొటాషియం, జింక్, కాపర్, బి విటమిన్లు, పీచు పదార్థం వంటివెన్నో బాదం గింజలలో ఉంటాయి
బాదం నూనెల్ని సౌందర్య ఉత్పత్తుల్లో, కొన్ని రకాల ఔషధాల్లో వాడుతుంటారు.
బాదం గింజల్ని మెదడుకు మేత అంటారు. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంచడానికి బాదం పప్పులు తినిపిస్తుంటారు. బాదా పప్పును నేరుగా కాకుండా రాత్రంతా నానబెట్టు ఉదయాన్నే బాదం పైన ఉన్న తొక్కను తొలగించి తింటే ఇంకా ఎక్కువ పోషకాలు అందుతాయి.

Tomoto -టొమాటోలు

టొమాటోలో పోషకాలు ఎక్కువ. గుండె జబ్బులూ, క్యాన్సర్ను నిరోధించే లైకోపిన్ అధికం. విటమిన్లు – బి, సి, కె లతోపాటు పొటాషియం కూడా ఎక్కువే. కొలెస్ట్రాల్ను తగ్గించడం, రక్తప్రసరణను క్రమబద్ధం చేయడం, మూత్రపిండాలను సంరక్షించడం… లాంటి ఎన్నో ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయి.
ప్రపంచంలో అత్యధికంగా సాగులో ఉన్న కూరగాయల్లో అధిక పోషకాలున్న కూరగాయ టొమాటో. దీని శాస్త్రీయ నామం లైకోపెర్సికమ్ ఎస్క్యులెంటమ్. అధిక వర్షాలూ, అత్యధిక ఉష్ణోగ్రతలు టొమాటో పండించడానికి ఆటంకాలైనా… ఈ పరిస్థితులను తట్టుకునే రకాల రూపకల్పన వల్ల దీన్ని అన్ని కాలాల్లోనూ పండించవచ్చు.
టొమాటోకు సాధారణంగా చీడపీడల బెడద ఎక్కువ. సేంద్రియ పద్ధతిలో పెంచుకునేటప్పుడు దేశవాళీ రకాలు లేదా తెగుళ్లను తట్టుకోగలిగిన సంకర రకాలను ఎంచుకోవాలి. మనమే నారు పోసుకోదలచుకున్నప్పుడు ట్రైకోడెర్మా పొడి కొద్దిగా విత్తనాలకు కలిపి నారు పోసుకోవాలి. సాధారణంగా 20-25 రోజుల వయసున్న నారును నాటుకుంటే మంచిది. నాటిన రెండు నెలలకు కాపు మొదలై మరో రెండో నెలల వరకూ కొనసాగుతుంది. నేలలో అయితే పశువుల ఎరువూ, జీవ ఎరువులు కలిపి చక్కగా తయారుచేసిన మళ్లలో, బోదెల మీదా అడుగున్నర దూరంతో నాటుకోవచ్చు. అదే కుండీలో అయితే ముందే తయారుచేసి పెట్టుకున్న సారవంతమైన మట్టి మిశ్రమంలో కుండీ సైజును బట్టి 2 – 3 మొక్కలు నాటుకోవాలి.
మూడు రకాల్లో
టొమాటోలో నిలువుగా పెరిగేవి, కొద్దిగా సాగేవి, ఎక్కువగా సాగేవి అని మూడు రకాలుంటాయి. సాగే రకాలైనా కొద్దిగా పెరగ్గానే వెదురు బద్దలు లేదా కర్రలను ఆధారంగా కట్టుకుంటే చక్కగా పెరుగుతాయి. 2-3 రోజులకొకసారి నీళ్లు పోస్తే చాలు. ఎరువులు ముందే కలుపుతాం కాబట్టి నాటిన వారం, పది రోజులకోసారి జీవామృతం, వర్మివాష్, వీలైతే పంచగవ్వ లాంటివి ఇస్తుంటే మొక్క ఆరోగ్యంగా పెరిగి బాగా కాస్తుంది. సేంద్రియ పద్ధతిలో పెంచుకునేటప్పుడు ఒకసారి టొమాటో నాటిన మట్టిలో రెండోసారి వేరే కూరగాయలేవైనా అంటే… వంగా, మిరపా, క్యాప్సికమ్, (ఒకే కుటుంబానికి చెందినవి) కాకుండా నాటుకోవాలి. ఫ్రెంచ్ బీన్స్, గుట్టచిక్కుడూ, గోరు చిక్కుడు లాంటివి నాటుకుంటే నేల సారవంతం కావడమే కాదు, తెగుళ్ల సమస్యా తగ్గుతుంది. ఈ పంటలు తీసేశాక మళ్లీ టొమాటోను అదేచోట నాటుకోవచ్చు.
మొక్కలే రక్షణగా
ఎండుటాకులు ఎప్పటికప్పుడు తీసేసి మొక్క చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. కుండీలయితే దూరం దూరంగా అమర్చి మొక్కలకు సరిగా గాలి తగిలేలా చూసుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు కుండీల్లో నీరు నిలవనివ్వకూడదు. పురుగులూ, తెగుళ్లు ఆశిస్తున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఈ జాగ్రత్తల వల్ల పురుగు మందులు ఎక్కువ వాడనవసరం లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెంచుకోవచ్చు. తీపి జొన్న మొక్కలు కొన్ని, బంతి మొక్కలు కొన్ని టొమాటో మొక్కలతో కలిపి పెంచుకోవడం వల్ల కాయ తొలిచే పురుగు ఆశించే ప్రమాదం తగ్గుతుంది. అలాగే తోటకూరా, పుదీనా వంటివి కలిపి నాటుకోవడం వల్ల కూడా చాలా పురుగులు దూరంగా ఉంటాయి. వేప కషాయం, కానుగ కషాయం అప్పుడప్పుడూ చల్లుతూ ఉండాలి. వెల్లుల్లి కషాయం వాడటం వల్ల ఆకుమచ్చ ఎండుతెగులు లాంటివి అదుపులో ఉంటాయి. స్టికీట్రాప్స్ రెండు-మూడూ అమర్చుకోవడం వల్ల రసం పీల్చే పురుగుల సమస్య తగ్గుతుంది.
టొమాటోలోనూ చాలా రకాలున్నాయి. మనదగ్గర పులుపు ఎక్కువ ఉండే రకాలు కొందరికి నచ్చితే, తక్కువ కండతో తియ్యగా ఉన్నవాటికి మరికొందరు ప్రాధాన్యం ఇస్తారు.
పుల్లని రకాలు పూసారూబీ, పూసా ఎర్లీ డ్వార్ఫ్, స్వీకార్, అర్క విశాల్, సెలెక్షన్ 12.
తీపి రకాలు మనీషా, సదా బహార్, గుల్ మొహర్, రూపాలీ, అర్క రక్షక్.
బాగా పండిన కాయల నుంచి విత్తనాలు తీసి కడిగి నీడలో ఆరబెట్టి మళ్లీ పంటకు వాడుకోవచ్చు.
క్యారెట్లను టొమాటోతో కలిపి నాటుకుంటే, వాటి రుచి పెరుగుతుందట. మీ ఇంట్లో గులాబీ మొక్కలుంటే టొమాటో ఆకుల రసాన్ని నీళ్లలో కలిపి వాటిపై చల్లండి. అలా చేస్తే గులాబీ ఆకుల మీద వచ్చే నల్ల మచ్చ తగ్గుతుంది.

Snake Gourd ,Bottle Gourd, Ridge Gourd పొట్ల..సొర…బీర..కాకర

ఎక్కువ కెలొరీలూ, ఎక్కువ విటమిన్లూ, ఖనిజ లవణాలతో ఆరోగ్యానికి మారుపేరు పందిరి కూరగాయలు. ఇవి సులువుగా జీర్ణమవుతాయి. పైగా శరీరానికి చల్లదనం కూడా.
పందిరి కూరగాయల్లో ముఖ్యమైనవి సొరా, బీరా, పొట్లకాయా, కాకర. వీటిని అన్ని కాలాల్లో పెంచుకోవచ్చు. కుండీల్లోనూ నాటుకోవచ్చు. వీటికి పందిరి లేదా జాలీ వంటి సరైన ఆధారం ఇవ్వగలిగితే పెంచుకోవడం సులువే. ఈ పాదులకు ఆరేడు గంటలపాటు ఎండా, సారవంతమైన మట్టి మిశ్రమం అవసరం. వీటిని పెంచే కుండీలు అడుగున్నర లోతూ, పెంచుకునే మొక్కల సంఖ్యను బట్టి కనీసం అడుగు వ్యాసంతో ఉండాలి. పెద్ద ప్లాస్టిక్‌ పెయింట్‌ బకెట్లు బాగుంటాయి.
ఏడాదంతా కాసేలా… సొరా, బీరా, పొట్లకాయా, కాకర… ఏదయినా సరే కుండీకి లేదా పాదుకు నాలుగైదు గింజలు నాటుకోవాలి. ఇవి మొలకెత్తాక రెండు మొక్కలుంచుకుని బలహీనంగా ఉన్నవాటిని తీసేయాలి. నాటే ముందు విత్తనాలను బీజామృతంతో కలిపి ఆరబెట్టాలి. నాటిన 45-70 రోజుల్లో రకాన్ని బట్టి కాపు కొస్తాయి. ఇలా రెండుమూడు నెలలపాటు కాస్తూనే ఉంటాయి. వీటిని రకానికో కుండీలో ప్రతినెలా నాటుకుంటే ఏడాదంతా తాజా కూరగాయలు అందుతాయి.
పిందె వేసిన పది రోజుల్లోపు కోసుకుంటే కాయలు లేతగా ఉంటాయి. ఈ కూరగాయలను పందిరీ/జాలీ/కంచె మీదికి అల్లించేటప్పుడు పది కణుపుల వరకూ పక్కకొమ్మలూ, నులితీగలు తీసి తల తుంచివేయాలి. మొక్క ఆధారం కోసం కర్ర లేదా జాలీకి పురికొసతో కట్టి, తరువాత వచ్చే ప్రతి పక్క కొమ్మనూ 10-12 కణుపుల తరువాత తుంచేస్తే ఎక్కువ కాపు ఉంటుంది. నులితీగలను తీసేస్తే పూతా, పిందె ఎక్కువగా వస్తుంది.
విత్తనాల్లో రకాలు… పదిరోజులకొకసారి జీవామృతం, వర్మివాష్‌ లాంటివి పోస్తూ ఉంటే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. పొగాకు కషాయం, పచ్చిమిర్చి కషాయం, గోమూత్రం చీడపీడలను అదుపులో ఉంచుతాయి. మజ్జిగా, వంటసోడా నీళ్లూ, బూడిద తెగులును చాలా వరకూ దూరంగా ఉంచుతాయి. ఫిరమోన్‌ ట్రాపు ఒకటి పెట్టుకోవడం వల్ల పండు ఈగ ప్రమాదం ఉండదు. స్టిక్కీట్రాపులు రెండుమూడు పెట్టుకుంటే రసం పీల్చే పురుగులు చాలావరకు అదుపులో ఉంటాయి. ముదిరిపోయి తీగ మీదే ఎండిపోయిన సొరా, బీరకాయలను దాచుకుంటే… కావాల్సినప్పుడల్లా విత్తనాలు నాటుకోవచ్చు.
కాకర, పొట్ల మాత్రం ముదిరి, పండిపోయిన కాయల నుంచి గింజలు తీసి, శుభ్రంచేసి, బూడిద కలిపి నీడలో ఆరబెట్టి వాడుకోవాలి. లేదంటే ఈ కిందివాటిని ఎంచుకోవచ్చు.
సొర – పొడవు కాయలకు ఇండమ్‌204 (ఇండో అమెరికన్‌), నరేంద్రజ్యోతి(విఎన్‌ఆర్‌), పీకేఎం1, సీవో1, కోలగా ఉండేవి: కోహినూర్‌ (విజ్ఞాన్‌), పూర్ణిమ (విఎస్‌ఆర్‌), గుండ్రని కాయలకు: నం.85
బీర – సన్నగా, పొడవుగా ఉండే కాయలకు జగిత్యాల లాంగ్‌, ఆర్తి, సురేఖ, మహిమ…
గుత్తుల్లో కాసేవి సాత్పూలియా
పొట్ల – తెల్లపొట్టి కాయలకు సీవో 2, శ్వేత, తెల్ల పొడవు కాయలకు: పీఎల్‌ఆర్‌1, కౌముది, ఆకుపచ్చ మీద తెల్లచారలుండే పొడవు కాయలకు సీవో1, ఎండీయూ1
కాకర – పొడవాటి ఆకుపచ్చ కాయలకు ఇండమ్‌ కోహినూర్‌, విఎస్‌ఆర్‌ 28,
తెల్ల కాయలకు ఇండమ్‌ తాజ్‌, చాందిని,
పొట్టిగా, గుండ్రంగా ఉండే ఆకుపచ్చ కాయలకు విఎస్‌ఆర్‌ కన్హయ్య

Pumpkin – గుమ్మడి కాయ

గుమ్మడి కాయని చాలామంది కూరగాయ అనే దృష్టితోనే చూడరు. కానీ ప్రపంచంలో గుమ్మడిని అధికంగా పండించే దేశాల్లో చైనా తరువాత స్థానం మనదే! గుమ్మడిలో చాలా రకాలున్నాయి. రకరకాల ఆకారాల్లో, పరిమాణాల్లో, గోధుమా, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంది. మనం ఎక్కువగా పులుసూ, కూర చేసుకుంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా దీంతో ఎన్నో రకాల స్వీట్లూ, కేకులూ, ఇతర బేకింగ్‌ పదార్థాలూ, పానీయాలు తయారు చేస్తారు. విదేశాల్లో హాలోవీన్‌ పండగకు ముఖ్య అలంకరణ దీంతోనే.
గుమ్మడిలో పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కంటిచూపు మెరుగవడం మాత్రమే కాదు నిద్ర కూడా బాగా పడుతుంది. దీని కాయలే కాదు ఆకులూ, పూలూ, కొమ్మలూ, గింజలు… ఇలా అన్నీ ఔషధ గుణాలున్నవే.
ఎప్పుడు నాటుకోవచ్చు!
గుమ్మడిని దాదాపు సంవత్సరం పొడవునా పండించొచ్చు. రకాన్ని బట్టి నాటిన దగ్గర్నుంచి కాయ పూర్తిగా తయారవడానికి 70 నుంచి 120 రోజులు పడుతుంది. అన్ని నేలల్లోనూ పండినా, నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. కుండీలో పెంచుకునేటప్పుడు ఎర్రమట్టి, పశువుల ఎరువులతోపాటు ఇసుక కూడా కలిపిన మట్టి మిశ్రమం తయారు చేసుకుంటే మంచిది. దీనిలో పిండి ఎరువులూ, ఎముకల పొడి కూడా కలిపితే రసాయన ఎరువుల అవసరం ఉండదు. కుండీల కంటే పెద్దపెద్ద రీపర్‌ చెక్కపెట్టెలు గుమ్మడి పాదుకు అనువుగా ఉంటాయి.
పాదులో లేదా కుండీలో మూడునాలుగు గింజలు నాటుకోవాలి. మొలకలు పెరిగి నాలుగైదాకులు వేశాక ఆరోగ్యంగా ఉన్న మొక్కను ఉంచి మిగిలిన వాటిని తీసేయాలి. సాధారణంగా నాటిన 10-12 రోజుల్లో గుమ్మడి విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాలను బీజామృతం లేదా ట్రైకోడెర్మా పేస్టుతో కలిపి, నీడలో ఆరబెట్టి నాటుకోవడం మంచిది. ఇప్పుడు జులై-ఆగస్టులో నాటుకోవచ్చు.
తొట్టెలో లేదా నేలలో దీంతోపాటు మొక్కజొన్నా, గోరుచిక్కుడూ, ముల్లంగి కూడా ఒకటి రెండు మొక్కలు కలిపి నాటుకుంటే మంచిది. ఇవి చక్కని స్నేహితుల్లా చీడపీడల నుంచి ఒకదానినొకటి రక్షించుకుంటాయి. అయితే అన్ని మొక్కలు నాటినప్పుడు అన్నిటికీ సరిపడా పోషకాలు ఇస్తుండాలి. అన్నిటి వేరు వ్యవస్థకూ సరిపడేలా తొట్టె పరిమాణం ఉండాలి.
మొక్కకు పది కాయలు!
గుమ్మడికి క్రమం తప్పకుండా నీళ్లు పోయాలి. కుండీల్లో మట్టి త్వరగా పొడిబారుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. గుమ్మడిలో ఆడపూలూ, మగపూలు వేర్వేరుగా ఉంటాయి. పూత వచ్చే సమయంలో పలచగా చేసిన పుల్లటి మజ్జిగను చల్లుతూ ఉండటం వల్ల ఆడపూలు ఎక్కువగా వస్తాయి. గుమ్మడి పాదు ఆరు నుంచి పది కాయలు కాస్తుంది. జీవామృతం, పంచగవ్వ, వర్మివాష్‌ లాంటివి మొదట్లో పదిరోజులకు ఒకసారి, పిందె పడ్డాక వారానికొకసారి ఇస్తూ ఉంటే చక్కగా పెరిగి పెద్దకాయలు వస్తాయి. అర్క సూర్యముఖి, అర్క చందన్‌, సరస్‌, సువర్ణ, సూరజ్‌, అంబి… గుమ్మడిలో అభివృద్ధి పరచిన రకాలు.
కషాయాలు చల్లాల్సిందే!
మిరపా, గన్నేరు, జట్రోపా ఆకుల కషాయాలు చల్లుతూ ఉండటం వల్ల ఆకు తినే పురుగులూ, రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. లాంటానా ఆకుల కషాయం పొడ తెగులును తగ్గిస్తుంది. వెల్లుల్లీ, పుదీనా, లేదా మునగాకు కషాయాలు ఆకుమచ్చను, ఇతర తెగుళ్లను అదుపులో ఉంచుతాయి. ఈ కషాయాలన్నీ అప్పుడప్పుడూ చల్లుతూ ఉండటం వల్ల చీడపీడలు మొదట్లోనే అదుపులో ఉండి మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. వేప కషాయం మాత్రం గుమ్మడి మీద వాడకపోవడమే మంచిది. దీనివల్ల ఒక్కోసారి ఆకులు మాడిపోతాయి.
రసాయన పురుగు మందులు వాడకుండా ఉన్నప్పుడు సీతాకోక చిలుకలూ, తేనెటీగలే పరాగ సంపర్కపు బాధ్యత తీసుకుంటాయి. గుమ్మడిలో కొవ్వుశాతం చాలా తక్కువ ఎ, సి, ఇ, బి1, బి2, బి6, బి12 విటమిన్‌లతోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌, ఇనుము, రాగి లాంటి ఖనిజ లవణాలూ అధికంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఒమేగా3 ఫ్యాటీ ఆసిడ్లు అపారంగా ఉంటాయి. సరిగ్గా చెప్పాలంటే ఇదో పోషకాల గని. ఆరోగ్యంగా, నాజుగ్గా ఉండాలనుకుంటే వెంటనే గుమ్మడిని తినడం అలవాటు చేసుకోండి.

Chillies – మిరప కాయలు

మిరపను సంవత్సరం పొడవునా పెంచుకోవచ్చు. కుండీలోనూ చక్కగా పెరుగుతాయివి. ఒకవేళ అవసరానికి మించి కాసినా వృథా అయిపోవు. కోయడం కొంచెం ఆలస్యమైతే ముదిరి, పనికి రాకుండా పోతాయనే భయం లేదు. పచ్చిమిర్చిగా కాకుంటే పండు మిరప, ఆ తరువాత ఎండుమిర్చిలా హాయిగా వాడుకోవచ్చు.
మిరప అనగానే ఘాటే గుర్తుకొస్తుంది కానీ ఆ ఘాటుకు కారణం వాటిలో ఉండే ‘క్యాప్సిసిన్‌’ అనే రసాయనమే. దీన్ని చాలా ఔషధాల్లో వాడతారు. మనకు మిర్చి అంటే కారం కోసం అనుకుంటాం కానీ అది చాలా రకాలుగా మేలు చేస్తుంది. మిరపలో కెలొరీలు తక్కువ. జీవక్రియలను వేగవంతం చేస్తుంది. అంటే సులువుగా బరువు తగ్గుతామన్నమాట. బోలెడన్ని విటమిన్లూ, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. ప్రోస్టేట్‌ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచుతుంది.
వీటిలోని రకాలు
మిరప కూడా వంగా, టొమాటోల కుటుంబానికి చెందిందే. కొన్నిచోట్ల నేరుగా విత్తనాలే నాటుకుంటారు గానీ సాధారణంగా నారు పెంచుకుని నాటుకోవచ్చు. ఈ నారుని ఎత్తుగా చేసిన బెడ్లలో లేదా ప్రోట్రేలలో తయారు చేసుకుంటారు. మన పెరటి తోట కోసం కొన్ని గింజలు చాలు కాబట్టి రంధ్రాలు చేసిన మూడు అంగుళాల లోతు ప్లాస్టిక్‌ ట్రేలో కూడా నారు పోసుకోవచ్చు. లేదా దగ్గరలోని నర్సరీ నుంచి కొంచెం నారు తెచ్చుకోవచ్చు. మిరపలో ఎన్నో రకాలుంటాయి. బజ్జీలుగా, కూరలా చేసుకునేవీ, కారం ఎక్కువగా ఉన్నవీ, వివిధ రంగుల్లో అందంగా ఉండేవి…
ఇలా ఎన్నో. వాటిల్లో జి3, భాగ్యలక్ష్మి, కిరణ్‌, ప్రకాష్‌, జ్వాల రకాలు బాగా కాయడంతోపాటు చీడపీడలనూ కొంతవరకు తట్టుకుంటాయి. తక్కువ కారం ఉండాలంటే సూర్య (ఇండో అమెరికన్‌), గాయత్రి (సిరిజెంటా), సోనాక్షి (విఎస్‌ఆర్‌) బాడగి రకాలు బాగుంటాయి. మీ దగ్గర నాటు రకాలున్నా, ఒకటి రెండు ఇంట్లో వాడే మిరపకాయలైనా నారుపోసుకోవచ్చు. .
వారం రోజుల్లో… .
మీరే నారు పోసుకునేటట్లయితే ఇసుకా, కోకోపీట్‌, వర్మికంపోస్టు కలిపిన మిశ్రమాన్ని ట్రే లేదా ప్రో ట్రేలలో నింపి బాగా తడపాలి. ట్రేలో అయితే పల్చగా, ప్రోట్రేలలో అయితే గుంటకు ఒకట్రెండు విత్తనాలు తీసుకుని పైన మళ్లీ పల్చగా ఇసుక చల్లి షేడ్‌ నెట్‌తో కప్పాలి. విత్తనాలు నాటిన వారం రోజుల్లో మొలుస్తాయి. 40-45 రోజుల వయసున్న నారును ఒకట్రెండు గ్రాముల ట్రైకోడెర్మా పొడి కలిపిన నీళ్లలో అరగంట ఉంచి మొక్కకు మొక్క మధ్య అడుగున్నర దూరం ఉండేలా బోదెల మీద నాటుకోవాలి.
అదే కుండీల్లో అయితే కుండీ సైజును బట్టి 1 నుంచి 3 మొక్కలు నాటుకోవాలి. మిరపకు కనీసం ఆరు గంటలపాటు ఎండ ఉండాలి. నీరు నిలిచే మట్టి మిశ్రమం వాడాలి. ఎక్కువగా నీళ్లు పోయకూడదు. 3 నుంచి 4 రోజులకోసారి లేదా సాయంత్రంపూట ఆకులు వడలినట్లు కనిపిస్తే నీళ్లు పోయాలి. మిర్చికి నేల బాగా సారవంతంగా ఉండాలి. మట్టి మిశ్రమంలో ముందే జీవ ఎరువులూ, పశువుల ఎరువూ, వేరుశనగ పిండి ఎరువులూ, ఎముకల పొడి కలిపి పెట్టుకుని ఉంటారు కాబట్టి 15 రోజుల కొకసారి జీవామృతం, వర్మివాష్‌ లాంటివి పోస్తుంటే సరిపోతుంది. .
చీడపీడలూ ఆశించకుండా పది రోజులకొకసారి వేపకషాయం చల్లుతూ ఉండాలి. స్టిక్కీట్రాపులు ఒకట్రెండు పెట్టుకుంటే రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. దానివల్ల వైరస్‌ తెగులు కూడా అదుపులో ఉంటాయి. ఫిరమోన్‌ ట్రాపులు కూడా 1 నుంచి 2 పెట్టుకుంటే (స్థలాన్ని బట్టి ) అన్ని మొక్కలకూ కాయ తొలిచే పురుగుల నుంచి రక్షణ ఉంటుంది.
ఒకసారి మిర్చి నాటుకున్న స్థలంలో లేదా కుండీలో ఇంకోసారి ఆకుకూరలూ, బెండా, చిక్కుడూ, బీన్స్‌ – ఇంకేదైనా (వంగ, టొమాటో కాకుండా) వేసుకోవచ్చు. దీనివల్ల తెగుళ్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. మిర్చి సాధారణంగా రకాన్ని బట్టి విత్తినం నుంచి పంట పూర్తవడానికి 150 నుంచి 180 రోజులు పడుతుంది. నారు నాటిన 30 నుంచి 40 రోజుల్లో కాపు రావడం మొదలై 2 నుంచి 3 నెలలపాటు కాస్తుంది. ఇంకా త్వరగా కాపు వచ్చే హైబ్రిడ్‌ రకాలు కూడా ఉన్నాయి. .
– బోడెంపూడి శ్రీదేవి, ల్యాండ్‌స్కేప్‌ కన్సల్టెంట్‌…సౌజన్యంతో
Different Chilli Plants …Mirch Plants…పచ్చి మిర్చి… రోజువారీ వాడే మిర్చి మాదిరిగానే అనేక రకాల మిరపకాయలు ఉన్నాయి…వాటి ఎలా పెంచుకోవాలి ..?
బ్లాక్‌పెరల్‌ ముదురు ఊదా లేదా నలుపురంగు ఆకులతో ఉండే ఈ మొక్కకి చిన్నసైజు రేగు పండ్ల మాదిరిగా నల్లని మిర్చి కాసి, అవి పండేకొద్దీ ఎరుపురంగులోకి మారతాయి. సాధారణ జలపెనో రకంతో పోలిస్తే వీటి ఘాటు ఎక్కువే. ఈ రకాన్ని ఉద్యానవనం అంచుల్లో పెంచుకోవచ్చు.
చిల్లీ చిలి ఏనుగు దంతం లేదా లేత పసుపు రంగు నుంచి క్రమంగా ఎరుపురంగులోకి మారే ఈ రకం, అస్సలు కారం లేకుండా మిరియాల ఘాటుతో మంచి రుచిగా ఉంటాయి.
చైనీస్‌ ఫైవ్‌ కలర్‌: చెట్టునిండుగా గులాబీలో మందారాలో విరబూసినట్లుగా పూసే ఈ మొక్క చూడ్డానికి చాలా బాగుంటుంది. ఊదా రంగులో కాసిన కాయలు క్రమంగా లేతపసుపు, నారింజ, ఎరుపు, ముదురు ఎరుపు రంగుల్లోకి మారుతూ పంచ రంగుల్లో కనువిందు చేస్తుంటాయి.
పొయిన్‌సెటియా మధ్యలో ఎర్రని ఆకులతో ముద్దొచ్చే పొయిన్‌సెటియా క్రోటన్‌ మొక్కలానే మధ్యలో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తుంటాయి. ఆకుపచ్చనుంచి ఎరుపు, నారింజ వర్ణాల్లోకి మారుతుంటాయివి.
ప్రెయిరీ ఫైర్‌: నింగిలోని చుక్కల్లా మొక్కంతా గుండ్రని కాయలు కాయడమే కాకుండా అవి తెలుపు నుంచి నారింజ, ఎరుపు, ముదురు గులాబీ, ఊదా, వంకాయ వర్ణాల్లోకి మారుతుంటాయి.
ఇంకా చిన్నగా గుండ్రంగా ఉండే హాట్‌పాప్‌, కాస్త పెద్ద సైజులో మెరిసే విక్‌డ్‌ క్యాప్సికమ్‌, నారింజరంగులోని టాంజరిన్‌ డ్రీమ్‌, సన్నగా పొడవుగా ఉండే మెడుసా, పొట్టిగా రంగురంగుల్లో ఉండే న్యూమెక్స్‌ ట్విలైట్‌, మరీ పొట్టీ పొడవూ కాకుండా ఉండే బొలీవియన్‌ రెయిన్‌బో, ఊదా రంగు ఆకులతో అదే రంగులో కాసే పర్పుల్‌, ఒకేదాంట్లో రెండుమూడు రంగుల్లో కనిపించే అజి ఓమ్నికలర్‌… ఎన్నో రకాలు. రకాల్ని బట్టి వీటిల్లోనూ అంతో ఇంతో కారం ఉంటుంది. బ్లాక్‌ పెరల్‌, బొలీవియన్‌ రెయిన్‌బో, న్యూమెక్స్‌ ట్విలైట్‌, ప్రెయిరీ ఫైర్‌… వంటి వాటిల్లో సాధారణ మిర్చి కన్నా ఘాటెక్కువే.

Micro Greens…చిట్టిమొక్కలు

కేవలం రెండు, మూడు వారాలలోనే పంట దిగుబడి అందించేవి మైక్రోగ్రీన్స్. అని రకాల మొక్కలను మైక్రో గ్రీన్స్ గా పెంచవచ్చు. అయితే ఎక్కువగా ఆవకూర, ఎర్రతోటకూర, క్యాబేజీ, ముల్లంగి, బీట్ రూట్, తెల్లముల్లంగి, ఉల్లి రకాలను ఎక్కువగా పెంచుతున్నారు.
కొద్దిపాటి స్థలం ఉంటే మైక్రోగ్రీన్స్ ను పెంచవచ్చు. ఏదైనా కంటైనర్, మట్టి, విత్తనాలు ఉంటే చాలు. నాటిన పదిహేను రోజులలోనే చిట్టిమొక్కలు వస్తాయి. అయితే వీటికి గాలి, వెలుతురు తప్పనిసరి కాబట్టి డాబాల మీద పెంచుకోవచ్చు.
వీటిని మూడు, నాలుగు అంగుళాల దాకా పెరగనిచ్చి అన్నిరకాల వంటలలో వాడుకోవచ్చు, లేక నేరుగా తినవచ్చు. ఆకుకూరల కంటే 40శాతం పోషకాలు ఎక్కువంటున్నారు పోషకాహార నిపుణులు.
వీటిని పెంచే మట్టి కలుషితం కాకుండా చూసుకోవాలి. మనదేశంలో క్యాన్సర్లు పెరగటానికి కారణం పురుగుమందులతో కలుషితమైన నేలే అని అనేక అధ్యయనాలలో తేలింది. మొలకలకన్నా పెద్దగాను ఆకుల కన్నా చిన్నగాను ఉండే మైక్రో గ్రీన్స్ లో విటమిర్ కె,ఇ,సి తో పాలు కెరటోనాయిడ్లు నాలుగు నుండి ఆరుశాతం దాకా ఎక్కువని పరిశోధనలలో తేలింది. ఎర్ర క్యాబేజీ, ఎర్రతోటకూర, ఆకపచ్చ ముల్లంగి వీటి మైక్రో గ్రీన్స్ లో ఎక్కువ పోషకాలు ఉన్నాయంటారు పోషకాహార నిపుణులు.
రెండు, మూడు అంగుళాలు పెరిగిన ఈ చిట్టి మొక్కలు ఘూటైన సువాసన కలిగి ఉన్నందున రుచిగా ఉంటాయి. ముఖ్యంగా మైక్రోగ్రీన్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాలిక్ పదార్ధాలు, కెరటోనాయిడ్లు …క్యాన్సర్లు, హృద్రోగాలు, ఊబకాయం, హార్మోన్ల కొరత, మధుమేహం, ఆల్జీమర్స్, బి.పి వంటి అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయని జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్ లు వీటి నుండి లభిస్తాయని పరిశోధనలు తెలియచేస్తున్నాయి.

Yam Growing….చేమదుంపల సాగు

దుంపజాతికి చెందిన అధిక పోషకాలుండే కూరగాయల్లో చేమదుంప (చేమగడ్డ) ప్రముఖంగా చెప్పొచ్చు. సాధారణంగా దుంపల్లో పిండిపదార్థాలు ఎక్కువ. దాంతో బరువు పెరుగుతామనుకుంటాం. కానీ చేమదుంపలో పీచు అధికంగా ఉండటంతో బరువు తగ్గడం కూడా సులువే.
చేమదుంపను ఆర్వి, టారో, ఎలిఫెంట్‌ ఇయర్‌ అని రకరకాలుగా పిలుస్తారు. మూడు అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్క లేతాకు పచ్చరంగులో ఉండే పెద్దపెద్ద ఆకులతో అలంకరణ మొక్కలా కనిపిస్తుంది. ఎండతోపాటు కొద్దిపాటి నీడ ఉన్నా చేమదుంపను చక్కగా నాటుకోవచ్చు. లావుగా, గుండ్రంగా ఉండే తల్లి దుంపల కంటే, కొంచెం పొడవుగా, కోలగా ఉండే పిల్ల దుంపలే నాటుకోవడానికి శ్రేష్ఠమైనవి.
నేలలో నాటుకునేటప్పుడు అడుగున్నర దూరంతో బోదెల మీదా, అదే కుండీలో అయితే వెడల్పాటి కుండీలో నాటుకోవాలి. కుండీ కనీసం అడుగులోతు ఉండాలి. దుంపల్ని 2-3 అంగుళాల లోతులో నాటుకోవాలి. దుంపలను బీజామృతం లేదా ట్రైకోడెర్మా విరిడి కలిపిన నీళ్లలో అరగంట నానబెట్టి, ఆ తరువాత ఆరబెట్టి నాటుకోవాలి. దుంపలు నాటిన దగ్గర్నుంచి పంట తీసుకోవడానికి ఆరేడు నెలలు పడుతుంది. అందువల్ల మట్టిమిశ్రమంలో పశువుల ఎరువు, పిండి ఎరువులు కలిపి సారవంతంగా ఉండేలా చూసుకోవాలి.
సాధారణంగా జూన్‌-జులై, ఫిబ్రవరి-మార్చి నెలల్లో నాటుకుంటారు. ఇంటిల్లిపాదికీ సరిపడా చేమదుంపలు కావాలంటే మనిషికి రెండుమూడు కుండీల్లో చొప్పున (10-15 మొక్కలు) నాటుకోవాలి. ఆకులూ ఉపయోగమే!
చేమదుంపకు నేల సారవంతంగా, తేమగా ఉండాలి. ఇసుక పాలు ఎక్కువగా ఉంటే దుంపలు బాగా తయారవుతాయి. ఆమ్లతత్వం ఉన్న నేల అనుకూలం. అందువల్ల వాడేసిన టీపొడి, కాఫీ పొడి, మట్టి మిశ్రమంలో కలపడంతోపాటు ఎరువుగా కుండీలో కూడా వేయచ్చు. చేమదుంపలో దుంపలే కాకుండా ఆకులు కూడా కూరగాయగా వాడుకోవచ్చు. దుంపలో కంటే ఆకుల్లోనే విటమిన్లు అధికం. అన్ని ఆకులు ఒక్కసారిగా కోయకుండా ఉంటే కొత్త ఆకులు మళ్లీ మళ్లీ వస్తుంటాయు.
కషాయాలు తప్పనిసరి!
చేమదుంపకు ఎక్కువ బలం కావాలి. వర్మికంపోస్టు, ఆముదం పిండి, వేరుశనగ పిండి, వేప పిండి కలిపిన మిశ్రమాన్ని నెలకొకసారి వేయడంతోపాటు పది రోజులకోసారి పంచగవ్వ, జీవామృతం, వర్మివాష్‌లను మార్చి మార్చి చల్లాలి. చేమదుంపను దుంపకుళ్లు తెగులు ఆశించకుండా నిమ్మగడ్డి లేదా బొప్పాయి ఆకులు మరగించి చల్లార్చిన నీళ్లను చల్లుతూ ఉండాలి. అలాగే ఆకుమచ్చ రాకుండా మునగాకు కషాయం, మందార ఆకు కషాయం చల్లాలి. వేప, మిరప కషాయాలు చల్లుతుంటే రసం పీల్చే పురుగులు తగ్గుముఖం పడతాయి. చేమదుంపలో అనేక ఖనిజలవణాలు, విటమిన్లు ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, పీచు అధికం, కెలొరీలు బాగా తక్కువ.

Brinjal – వంకాయలు

మరీ చల్లని ప్రాంతాల్లో తప్ప ప్రపంచమంతటా విరివిగా పండే వంకాయ శాస్త్రీయ నామం సొలానమ్‌ మెలాంజినా. బ్రింజాల్‌ అనే పేరు మనదేశంలో ఎక్కువగా వాడుకలో ఉంది. అబర్‌గెన్‌ అన్నా ఇదే. దీన్ని ఎగ్‌ ప్లాంట్‌ అనీ అంటారు. ఒక రకం వంకాయలు తెల్లగా, అండాకారంలో అచ్చంగా కోడిగుడ్లు మొక్కకు వేలాడుతున్నాయా అన్నట్లు ఉంటాయి మరి. మనదేశంలో ఎన్నో రకాల వంకాయలు – రంగూ, ఆకారం, పరిమాణం, ప్రాంతం, అభిరుచిని బట్టి ఎవరి ఎంపిక వారిదే. అలాగే కొన్ని వంటలు కొన్ని రకాలతో చేస్తేనే బాగుంటాయి కూడా.
వంకాయల్ని అన్ని కాలాల్లోనూ పండించుకోవచ్చు. వర్షాకాలం పంటగా జూన్‌-జులై నెలల్లో నాటుకోవాలి. కావాల్సిన రకం విత్తనాలు తెచ్చి నారు పోసుకోవడమో లేదా షేడ్‌నెట్లలో పెంచి అమ్ముతున్న నారు తెచ్చి నాటుకోవడమో చేయాలి. నారు వయసు 25-30 రోజుల మధ్య ఉన్నప్పుడు కుండీల్లో లేదా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మళ్లలో నాటుకోవాలి. నేలలో నాటుకుంటే, మొక్కకూ మొక్కకూ మధ్య అడుగున్నర దూరం ఉండేలా చూసుకోవాలి. కుండీలో అయితే దాని పరిమాణాన్ని బట్టి 2-3 మొక్కలు నాటుకోవచ్చు.
ఎప్పుడైనా సరే సాయంత్రం పూట మట్టిని తడిపి నాటుకుంటే తెల్లారేసరికి చక్కగా కుదురుకుని ఉంటాయి. వంగకు ఎండ సరిగ్గా తగలాలి. మట్టి పూర్తిగా పొడిబారి పోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి. వంగ నాటిన 45-50 రోజుల్లో కాయడం మొదలెట్టి రెండు నెలలపాటు బాగా కాస్తుంది. మళ్లీ అక్టోబరు-నవంబరు నెలల్లో నాటుకుని కాపు వచ్చేవరకూ కావాలంటే అలాగే ఉంచి నీళ్లూ, ఎరువులు సరిగా ఇవ్వాలి. మొక్క మీదే ముదిరిన కాయలను అలాగే ఉంచి, పండాక విత్తనాలు తీసి బాగా కడిగి నీడలో ఎండబెట్టి దాచుకుంటే మళ్లీ నాటుకోవడానికి పనికొస్తాయి.
ఎరువూ ఉండాలి: కుండీలో లేదా మడిలో ముందుగానే తగినంత పశువుల ఎరువూ, ఎముకల పొడీ, పిండి ఎరువులూ, జీవ ఎరువులు కలపడం వల్ల తరువాత పోషకాలను ఇవ్వాల్సిన అవసరం అంతగా రాదు. అప్పుడప్పుడూ జీవామృతం, వర్మీవాష్‌ వంటివి అందించడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. కుండీలో లేదా మడిలో పుదీనా కొమ్మలు నాటుకోవడం వల్ల పురుగులు దరిచేరవు. అలాగే బంతి మొక్కలు ఒకటి రెండింటిని అదే కుండీలో నాటుకుంటే నులిపురుగుల నుంచి రక్షణ దొరుకుతుంది.
మునగాకు రసాన్ని 24 గంటలు నిల్వ ఉంచి 2-3 సార్లు చల్లడం వల్ల వడలు తెగులూ, సీతాఫలం ఆకు కషాయం చల్లడం వల్ల కాండం లేదా కాయతొలిచే పురుగు అదుపులో ఉంటాయి. వంగకు ప్రమాదం కలిగించే సమస్యలు ప్రధానంగా ఇవే. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే – సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పెంచదలుచుకున్నప్పుడు సమస్యను ముందుగానే గుర్తించాలి. అంటే తప్పకుండా మీరు తీరిక చేసుకుని మీ మొక్కలతో రోజూ ముచ్చటించాలి.
దేశవాళీ రకాలతోపాటు ప్రతి విషయంలోనూ అధిక దిగుబడిని ఇచ్చే సంకర రకాలున్నాయి. సంకర రకాల్లో ఈ కిందవి
దొరుకుతాయోమో చూడండి. ఇవి అధిక దిగుబడిని ఇవ్వడంతోపాటు కొన్ని రకాల చీడపీడలను తట్టుకుంటాయి .
ఊదారంగు సన్నని, పొడవు కాయల కోసం – పూసాపర్పుల్‌ లాంగ్‌, పూసా పర్పుల్‌ క్లస్టర్‌, హైబ్రిడ్‌ 5
ఊదారంగు లావు, పొడవు కాయల కోసం – పూసాక్రాంతి
ఊదారంగు గుండ్రని కాయలకు – శ్యామల, అర్కనవనీల్‌, అంబారా
చారల అండాకారపు కాయలకు – మహి సూపర్‌ 10, కల్పతరు, మంజుశ్రీ
ఆకుపచ్చని అండాకారపు కాయలకు – ఆర్తి, మహి99, అర్క కుసుమాకర్‌
ఆకుపచ్చని పొడవు కాయలకు – అర్క షిరీన్‌
తెల్లని అండాకారపు కాయలకు – వైట్‌ పొన్ని

బ్రకోలి

పోషక విలువల్లో ప్రథమస్థానంలోనూ, రుచికీ, ఆరోగ్యానికీ మారుపేరుగా ఉండే కూరగాయల కోసం వెతికే వారికి మొదటి ఎంపిక బ్రకోలి. దీని శాస్త్రీయ నామం బ్రాసికా ఒలరేషియా ఇటాలికా. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లెవ్వరూ మరిక వదలరు. ఇంతకు ముందు ఎక్కడో తప్ప దొరకని ఈ కూరగాయ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సులువుగా దొరుకుతోంది. అంటే దీన్ని మనం కూడా పెంచుకోవచ్చన్నమాట.
బ్రకోలీ రుచికరమైందే కాకుండా పోషకాలకూ, ఔషధ గుణాలకూ సాటిలేనిది కూడా. రొమ్మూ, గర్భాశయ క్యాన్సర్లు రాకుండా చేయడంలో దీని పాత్ర అమోఘం. ఇది కొలెస్ట్రాల్‌తోపాటు ఎలర్జీలూ, కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేరనివ్వదు. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్టియోపొరోసిన్‌ను రానివ్వదు.
విటమిన్లూ, ఖనిజలవణాలు సమృద్ధిగా ఉండటంతో పసిపిల్లలూ, పాలిచ్చే తల్లులూ, వృద్ధులకు ఎంతో మంచిది. కళ్లకూ, చర్మానికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న బ్రకోలీని మన ఆహారంలో ఈ రోజునుంచే భాగం చేసుకుందాం. సేంద్రియ పద్ధతిలో మనమే పెంచుకుందాం.
ఆవాల్లాంటి విత్తనాలు!
బ్రకోలీ తక్కువ ఉష్ణోగ్రతలోనే పెరుగుతుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్‌లాగానే పెంచుకుంటాం. కానీ ఇది ఇంకొంచెం సున్నితమైంది కాబట్టి మన ప్రాంతాల్లో పెంచుకునేటప్పుడు మరి కాస్త జాగ్రత్త తీసుకోవాలి.
బ్రకోలీ పూర్తి ఎండలో పెరిగినా, మన ప్రాంతంలో కొద్దిపాటి నీడ దీనికి అనువుగా ఉంటుంది. నీరు నిలవని తేలికపాటి నేలలు దీనికనువుగా ఉంటాయి. పెరటి తోటలో పెంచుకునేటప్పుడు ఒక వంతు వర్మీకంపోస్టూ, రెండు వంతులు కోకోపీట్‌, ఒక వంతు ఇసుక కలిపిన సారవంతమైన, తేమగా ఉండే, నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటుకోవాలి.
దీని గింజలు చూడటానికి పెద్ద ఆవాల్లా ఉంటాయి. ఇవి వారంలోపే మొలకెత్తుతాయి. నీడలో ఉంచిన ట్రేలలో నారు పోసుకుని 20-30 రోజుల తరువాత నాలుగైదు ఆకులున్నప్పుడు అడుగున్నర దూరంతో నాటుకోవాలి. కుండీల్లో కాకుండా నేలలో నాటుకునేటప్పుడు ఎత్తయిన బెడ్లు ఎంచుకోవాలి. కుండీలో మట్టిని గానీ, ఈ బెడ్లను గానీ నారు నాటుకునే ముందు పూర్తిగా తడిపి సాయంత్రంపూట నారు నాటుకోవాలి. నాటిన వారానికి ఒకసారి, ఆ తరువాత పదిహేను రోజులకోసారి వర్మీవాష్‌ లేదా వేరుశనగ పిండీ, బోన్‌మీల్‌ లాంటివి ఆవుపేడతో కలిపి నానబెట్టిన స్లర్రీని గానీ పోస్త్తుండాలి. నేల పూర్తిగా పొడారిపోకుండా నీళ్లు పోస్తూ ఉండాలి.
వెల్లుల్లి కషాయంతో
బ్రకోలీకి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండకూడదు. కాబట్టి బెడ్‌ని లేదా కుండీలో మొక్క చుట్టూ ఎండుటాకులతో కప్పితే నేల త్వరగా పొడారిపోకుండా ఉండటమే కాకుండా చల్లగా ఉంటుంది కూడా. బ్రకోలీకి వేళ్లు పైపైనే ఉంటాయి. అందువల్ల చుట్టూ మట్టిని ఎక్కువగా కదిలించకూడదు. ఈ మొక్కకు ఆకు తినే పురుగులు, రసం పీల్చే పురుగులు ఇబ్బంది కలిగించకుండా వారం, పదిరోజులకొకసారి పచ్చిమిరపకాయల కషాయం, వెల్లుల్లి కషాయం లాంటివి చల్లుతూ ఉండాలి.
నీళ్లు పోసేటప్పుడు నీళ్లు మొక్క మీద పోయకుండా నేల తడిచేలా పోస్తే కుళ్లు తెగులు రాకుండా ఉంటుంది. నాటిన రెండు నెలల్లో బ్రకోలీని కోసుకోవచ్చు. పక్క కొమ్మలను పెరగనిస్తే వాటి నుంచి కూడా బ్రకోలీ తయారవుతుంది కానీ పరిమాణం కొంచెం చిన్నగా ఉంటుంది.

Ladies Fingers….. Okra… బెండకాయలు

బెండకాయలను పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అందరూ ఇష్టపడతారు. తక్కువ కెలొరీలూ, ఎక్కువ పోషకాలతో ఉండే బెండ క్రమం తప్పకుండా తినాల్సిన కూరగాయ. ఇంట్లో పెంచుకుంటే తాజాగా, లేతగా, పురుగు మందులు లేని రుచికరమైన బెండకాయలు సొంతమవుతాయి.
బెండకాయను లేడీస్‌ ఫింగర్‌ అనే కాదు, ఓక్రా అనీ అంటారు. ఇది గోంగూర కుటుంబానికి చెందింది. బెండను ఏడాది పొడవునా పండించుకోవచ్చు. దీనికి ఎండ బాగా కావాలి. కనీసం 5-6 గంటలన్నా ఎండ పడేలా చూసుకోవాలి. బలంగా పెరిగే తల్లివేరు వల్ల నారు కాకుండా నేరుగా విత్తనాలే నాటుకోవాలి. దీనికి నీరు నిల్వకూడదు. నేలలో అయితే అడుగున్నర దూరంతో బోదెల మీద నాటుకోవాలి. విత్తనాలను అంగుళం లోతులో నాటుకోవాలి.
నేల తయారు చేసుకునేటప్పుడే పశువుల ఎరువూ, వేపపిండి వంటివి కలిపి మట్టిని బాగా తిరగేసి సారవంతంగా చేసుకోవాలి. కుండీలయితే లోతు ఎక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి. 20 లీటర్ల పాత పెయింట్‌ బక్కెట్లు కూడా బెండను పెంచుకోవడానికి బాగా అనువుగా ఉంటాయి. పాదుకు 2-3 విత్తనాల చొప్పున నాటుకుని 3-4 ఆకులు వచ్చాక బలహీనమైన మొక్కలను తీసేసి ఒక్కో బలమైన మొక్క చొప్పున ఉంచుకోవాలి. కుండిలోనైనా 1-2 మొక్కలకు మించి నాటుకోకపోవడం మంచిది.
రెండు నెలలకో కాపు… నాటిన 5-8 రోజుల్లో బెండ గింజలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన నెలరోజులకు పూత రావడం మొదలవుతుంది. పూత వచ్చిన వారానికే కాయలు తయారవుతాయి. అప్పటి నుంచి దాదాపు రెండు నెలలపాటు కాపు ఉంటుంది. బెండకాయలు లేతగా ఉంటేనే రుచిగా ఉంటాయి. అందుకే రెండురోజులకోసారి కోస్తుండాలి. ఓ పది మొక్కలుంటే చాలు, ఇంటి అవసరానికి సరిపోతాయి. పూత రావడం మొదలయ్యాక 10 రోజులకొకసారి జీవామృతం పోస్తూ ఉంటే కాపు బాగా వస్తుంది. మనం ముందుగానే మట్టి మిశ్రమంలో వేపపిండీ, ఆముదం పిండీ, జీవ కీటక, శిలీంద్ర నాశనులను పశువుల ఎరువు లేదా వర్మికంపోస్టుకలుపుతాం కాబట్టి చీడపీడలు ఆశించే ప్రమాదం చాలా తక్కువ. అప్పుడప్పుడూ వేపకషాయం చల్లుతూ ఉంటే ఆ భయం కూడా ఉండదు.
రకాలున్నాయి… ఇంట్లో పెంచుకునే మొక్కలే కాబట్టి పూర్తిగా నేల పొడారిపోకుండా 2 – 3 రోజులకోసారి నీళ్లు పోస్తుంటే సరిపోతుంది. ఏడాది పొడవునా బెండకాయలు మనింట్లో ఉండాలంటే రెండు నెలలకొకసారి గింజలు నాటుకుంటే ఒక పంట అయ్యేలోపు మళ్లీ కొత్త మొక్కల నుంచి కాపు రావడం మొదలవుతుంది.
మీకు నాణ్యమైన నాటు విత్తనాలు దొరికితే సరే, లేకపోతే హైబ్రిడ్‌ రకాలైన జనార్ధన్‌, హరిత, అర్క అభయ్‌, అర్క అనామిక లాంటి వాటికోసం ప్రయత్నించండి. ఈ రకాలు వైరస్‌ తెగుళ్లను కూడా తట్టుకుంటాయి. కో1 రకం బెండకాయలు గులాబి ఎరుపు రంగులో ఉంటాయి. రుచిలో తేడా ఏమీ ఉండదు. కానీ ఆకుపచ్చ కాయలతో పాటు చూస్తే అందంగా ఉంటాయి కదా. కాయలు ముదిరిపోతే వాటిని మొక్క మీద అలానేఉంచి ఎండిన తరువాత విత్తనాలు తీసి మళ్లీ వాడుకోవచ్చు. 

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద

fruity kojaFruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద సీతాకోక చిలుకలకు ప్రియనేస్తం…
స్వచ్ఛమైన లేత గులాబీ రంగు పూలతో విభిన్నంగా, మనోహరంగా కనిపించే పొద గులాబీ గరుడవర్థనం. దీన్ని గులాబీ కాప్సియా అనీ, బిళ్లగన్నేరు పొద అనీ అంటారు. దీని శాస్త్రీయనామం కాప్సియా ఫ్రూటీకోజా లేదా సెర్బెరా ఫ్రూట్‌కోజా.
గులాబీ గరుడవర్థనం నెమ్మదిగా పెరిగే పెద్దపొద. సుమారు పది అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. గుబురుగా కాకుండా వ్యాపించినట్లుండే కొమ్మలతో ఉంటుంది. దీని ఆకులు కోలగా, లేతాకుపచ్చరంగులో ప్రస్ఫుటంగా కనిపించే ఈనెలతో ఉంటాయి. దీని పూలు లేత గులాబీ రంగులో ఐదురెక్కలతో, ముదురు గులాబీ కంఠంతో నాజూగ్గా ఉంటాయి. ఇవి గరుడవర్థనాలను, బిళ్లగన్నేరు(వింకారోజియా)పూలను తలపించడమే కాదు. చిన్న సైజులో ఉన్న స్వర్ణగన్నేరు (ఫ్లుమేరియా) పూలా అని భ్రమింపచేస్తాయి కూడా.
వెలుతురు కావాలి
గులాబీ గరుడ వర్థనానికి సారవంతమైన మట్టి మిశ్రమం కావాలి. నేల ఎప్పుడూ తేమగా ఉంటే ఈ మొక్క అంత ఆనందంగా ఉంటుంది. నీరు సరిగా లేకున్నా సర్దుకుపోతుంది కూడా. ఎక్కువగా కత్తిరించడాన్ని ఈ మొక్క ఇష్టపడదు. అలా చేస్తే గిడసబారిపోయి బలహీనంగానూ, వికారంగానూ తయారవడమే కాదు, పూలు పూయడం కూడా బాగా తగ్గిపోతుంది. దీనికి సూర్యకాంతి కూడా ఎక్కువే కావాలి. కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది గానీ రోజులో సగంసేపైనా వెలుతురు సరిగా సోకకపోతే పూలు సరిగారావు. ఏడాదంతా పూస్తుంది…
కొమ్మల చివరన వదులుగా ఉండే చిన్న చిన్న గుత్తుల్లో పూసే ఈ మొక్క సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. గులాబీ గరుడవర్థనం గుంపుల్లో నాటుకోవడానికి చాలా బాగుంటుంది. కుండీలోనూ దీన్ని చక్కగా పెంచుకోవచ్చు. దీన్ని గొంగళి పురుగుల వంటివి తప్ప మరీ ఇబ్బంది పెట్టే చీడపీడలేవీ ఆశించవు. వాటిని కూడా వేపకషాయం అప్పుడప్పుడూ చల్లుతూ నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనికి రెండునెలలకోసారి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరవును కొద్దిగా వేస్తుంటే సరిపోతుంది. వాడేసిన టీ పొడి, కాఫీ పొడి మట్టి మిశ్రమంలో కలిపితే మంచిది. దీన్ని విత్తనాల ద్వారానూ, కొమ్మంట్లు కత్తిరింపుల ద్వారానూ ప్రవర్థనం చేయవచ్చు. మరోవిషయం ఈ గులాబీ గరుడవర్థనం సీతాకోక చిలుకలకు కూడా ప్రియనేస్తమే!

సొగసరి సాల్వియా

సొగసరి సాల్వియా

వర్షాకాలపు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రకాశవంతమైన రంగుల సొగసుని జోడించే మొక్కల్లో ఎర్రసాల్వియా ప్రధానమైనది. ఎర్ర సాల్వియా శాస్త్రీయనామం సాల్వియా స్పెండెన్స్‌. అడుగు నుంచి రెండడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ మొక్కను అన్ని రుతువుల్లోనూ నాటుకోవచ్చు.
సీజనల్‌ మొక్కలో ఎక్కువకాలం పూసే మొక్క ఇది. కొన్ని ప్రాంతాల్లో బహువార్షికంగానూ పెరుగుతుంది. ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులు, మురిపించేఎరుపు రంగులో కంకుల్లో పూసే పూలతో సాల్వియా కనువిందు చేస్తుంది. బాగా వెలుతురులో పెరిగే ఈ మొక్క కొద్దిపాటి నీడలోనూ చక్కగా పెరుగుతుంది.
సారవంతమైన, నీరు నిలవని మట్టి మిశ్రమం దీనికి అనువుగా ఉంటుంది. నేల పొడిబారినా, నీళ్లు నిలిచినా సాల్వియాకు నచ్చదు. వర్షాలు పడగానే సాల్వియాను నాటుకోవచ్చు. దీనిని ముందుగా నారు పోసుకుని కావలసిన చోట నాటుకుంటారు. బెడ్‌ను ఆరు అంగుళాల లోతువరకూ తవ్వుకొని పశువుల ఎరువు లేదా వర్మీకంపోస్టు, వేపపిండి, కొద్దిగా సూపర్‌ఫాస్ఫేటు, కలుపుకోవాలి. చదునుచేసుకొని మొక్కను నాటుకోవాలి. పది నుంచి పన్నెండు అడుగుల ఎడంతో నాటాలి. ఆపై రెండు అంగుళాల లోతువరకూ తడిచేలా నీరు పెట్టుకోవాలి.
వరుసల్లో అందంగా...
దీనికి ఎన్‌పీకే ఉండే సమగ్ర ఎరువును అందించాలి. కొబ్బరిపొట్టు లేదా ఎండాకులతో మల్చింగ్‌ వేసుకుంటే తేమ ఆవిరైపోదు. కలుపూరాదు. బెడ్‌ల్లో నాటినప్పుడు నిటారుగా పెరిగే చిన్న చిన్న కంకుల్లో, ఎర్రని పూలతో నిండుగా ఎర్ర తివాచీలా కనిపిస్తుంది బోర్డరుగాను, కుండీల్లోకి, మిశ్రమాల్లో నాటడానికీ ఇది బాగుంటుంది.
ఎన్నో రంగుల్లో
పూలు పూయడం అయిపోయాక కంకులను ఎప్పటికప్పుడు కత్తిరించేస్తుంటే ఎక్కువ పూలతో పాటు ఎక్కువ రోజులూ పూస్తుంది. అలాగే ఈ అయిపోయిన కంకులను తీసేయకపోతే, బోట్రైటిస్‌ తెగులతో పాటు, రసం పీల్చే పురుగులు ఆశించే ప్రమాదం ఎక్కువే. సేంద్రియ కషాయాన్ని క్రమం తప్పకుండా చల్లుకోవాలి. ఆకులు పసుపుపచ్చగా మారి వాలిపోతుంటే కొంచెం నీళ్లు ఎక్కువ ఇవ్వాలి.
దీన్ని ఎర్ర సాల్వియా అని పిలిచినా తెలుపు, గులాబీ, లావెండర్‌, వూదా, నారింజ వంటి అనేక రంగుల్లో పూసే రకాలున్నాయి. నిండు రంగులు వేడి ప్రదేశాలకు అనువుగా ఉంటాయి. శీతల ప్రాంతాల్లో అన్ని రంగుల రకాలూ చక్కగా పెరుగుతాయి. గొట్టాలవంటి సాల్వియా పూలు మకరందానికి నెలవులు. అందుకే సీతాకోక చిలుకలూ, హమ్మింగ్‌ పిట్టలూ సాల్వియాల చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటాయి. తాజాపూలనే కాదు, పూలకంకులను నీడలో ఎండబెట్టి కూడా అలంకరణలో వాడవచ్చు.
సాల్వియాలను విత్తనాలతో సులువుగా ప్రవర్థనం చేసుకోవచ్చు. సంచుల్లో పెంచిన మొక్కలతోపాటు పెద్ద నర్సరీలలో నారు కూడా దొరుకుతుంది.

డిసెంబరాలు

డిసెంబరాలు

డిసెంబరాలు ఊదా, లావెండర్ రంగులలో ఊదా తెలుపు చారలతో ఉండే నాజూకైన పూలతో సంక్రాంతి సమయంలో విరగబూసే డిసెంబరాలు తెలియని తెలుగు ఆడపడుచులుండరేమో. వీటిని గొబ్బిపూలు, పెద్దగోరింట అని కూడా అంటారు. ఫిలిఫైన్స్ వయోలెట్, బ్లూబెల్, బర్లేరియా అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా. డిసెంబరాల జన్మస్థానం మనదేశమే. పల్లెటూళ్లలో ఇళ్లముందు రోడ్లపక్కగా ఎక్కువగా కనిపించే మొక్కలు ఇవి. ఈ పూలను ఎక్కువగా మాలలు కట్టి జడలో అంకరించుకోవడానికి, దేవుడికి అర్పించడానికీ వాడతారు. విపరీతంగా పూసే ఈ పూలు లేత రంగులో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా ఎన్ని పెట్టుకున్నా బరువనిపించవు. ఇక చాలనిపించవు. డిసెంబరాలు రెండు నుంచి మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్న పొద. ఆకులపైవైపు కంటే కిందివైపు లేత రంగులో ఉంటాయి. గరాటు ఆకారంలో గుత్తులుగా పూసే పూలుసాధారణంగా ఊదా, గులాబీ రంగుల్లో ఉంటాయి. అలాగే తెలుపు రంగులోపూసే అల్ఫారకం కూడా సాధారణమే. ఇది ఎండతోపాటు కొద్దపాటి నీడలో కూడా పెరుగుతుంది. చీడపీడలు తక్కువే……. డిసెంబరాలు తేమగా ఉన్నచోట చక్కగా పెరుగుతాయి. అయితే నీళ్లు నిలవకూడదు. పూలు పూసిన వెంటనే కత్తిరిస్తూ ఉంటే మంచిది. ఎండలలో తప్ప సంవత్సరం అంతా పూసే ఈ మొక్క డిసెంబరు మాసంలో విపరీతంగా పూయడం వల్ల దీనికి డిసెంబరాలు అనే పేరు వాడుకలో ఉంది. దీన్ని అప్పుడప్పుడూ కత్తిరిస్తూ ఉంటే క్రమపద్ధతిలో గుబురుగా పెరుగుతుంది. అలాగే కత్తిరించి వేర్వేరు ఆకారాల్లో పెంచుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. బోర్డరుగా పెంచుకున్నా చక్కగా ఉంటుంది. రెండు మొక్కలు కుండీల్లో నాటుకుంటే పూజకు పూలగురించి ఆలోచించనవసరం లేదు. డిసెంబరాలుకు చీడపీడలు తక్కువే. రసంపీల్చే పురుగులు ఆశించకుండా అప్పుడప్పుడూ ఆకు కషాయం చల్లుతూ ఉంటే సరిపోతుంది. అక్టోబర్ నుంచి రెండు వారాలకోసారి పాలీఫెడ్ వంటి సమగ్ర ఎరువును నీళ్లలో కలిపి పోస్తుంటే బాగాపూస్తుంది. వర్మీకం పోస్టు ఎముకలపొడి, వర్మీవాష్ వంటి సేంద్రియ ఎరువులను ఉపయోగించినా ఫరవాలేదు. డిసెంబరాలను గింజలు, కొమ్మ కత్తిరింపులు, పిలకలు, ఇలా వేటి ద్వారానైనా సరే సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. తేనెటీగలను, సీతాకోకచిలుకలను, హమ్మింగ్ పక్షులను విపరీతంగా ఆకర్షించే డిసెంబరాలకు ఔషధగుణం కూడా ఎక్కువే. ఆకుల రసాన్ని కాలిన గాయాలకు వాపు తగ్గడానికి రాస్తారు. దీని గింజలను పాముకాటుకు విరుగుడుగా వాడతారు.

Firespike……అగ్నిశిఖ

firespikeఅగ్నిశిఖ మెరిసే నిండాకుపచ్చరంగులో సున్నితమైన పెద్ద పెద్ద ఆకులతో ప్రకాశవంతమైన పండుమిరప ఎరుపు రంగులో కంకుల్లో పూసే గొట్టాలాంటి సన్నని పూలతో లాంటి స్థలాన్నైనా వర్ణభరితం చేయగల మొక్కలే అగ్నిశిఖ ఒకటి. దీని శాస్త్రీయనామం బడాంటోనియా లాంగిఫోలియం లేదా జస్టీషియా ట్యూబిఫార్మస్ . దీన్ని ఫైర్ స్పైక్ అని, స్కార్లెట్ ఫ్లేమ్ అనికూడా అంటారు.
అగ్నశిఖ లేత కొమ్మలతో మూడు నుంచి నాలుగు అడుగల ఎత్తువరకు పెరిగే బహువార్షికం. సరైన మట్టిమిశ్రమంలో ఒకసారి నాటితే తర్వాత అట్టే పట్టించుకోనవసరం లేని మొక్క ఇది. కంపోస్టు లేదా పశువుల ఎరువు ఎక్కుగా ఉండే సారవంతమైన నీరు నిలవని మట్టి మిశ్రమంలో ఇది బాగా పెరుగుతుంది. నీటి ఎద్దడిని తట్టుకున్నా కొంచెం తేమ ఉంటే దీనికి సరిపోతుంది. వేగంగా పెరిగే ఈ మొక్క సూటిగా ఎండపడనిచోట చక్కగా పెరుగుతుంది.
పెద్ద పెద్ద తొటల్లో చెట్లకింద గుంపుగాను, బోర్డరుగానూ పెంచుకోవడానికి ఇది అత్యంత అనువుగా ఉంటుంది. కుండీల్లో ఇతర మొక్కలతో కలిపి నాటుకుంటే చాలాబాగుంటుంది. బోర్డరుగా నాటుకునేటప్పుడు రెండేసి అడుగుల దూరంతో ఉండేలా చూసుకుంటే రెండుమూడు సంవత్సరాల్లో ఆకుపచ్చని గోడలాగా పెరిగి ప్రకాశవంతమైన ఎర్రని పూలతో అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి నేలయినా…..
అగ్నిశిఖ దాదాపు ఎలాంటి నేలలోనైనా పెరుగుతుంది. వర్షాకాలం, చలికాలం అంతా పూస్తూనే ఉంటుంది. ఒక సారి పూస్తే ఈ పూలు ఎక్కువకాలం తాజాగా నిలిచి ఉంటాయి. నీడను తట్టుకునే మొక్కల్లో ఇంత నిండురంగుల్లో పూలుపూసే మొక్కలు సాధారణంగా అరుదు. ఈ పూల కంకులను ఫ్లవర్ వాజులలో కూడా చక్కగా అమర్చుకోవచ్చు. ఇది వేగంగా పెరుగుతుంది. కనుక ఇతరమొక్కల మీద ఆధిక్యత ప్రదర్శించకుండా దీన్ని అదుపులో ఉంచడం తప్పనిసరి. క్రమం తప్పకుండా తేలిగ్గా గానీ, సంవత్సరానికి రెండు మూడుసార్లు బాగా కిందకి కత్తిరిస్తూ ఉంటే ఒక క్రమపద్ధతిలో పెరిగి అందంగా ఉంటుంది. అంతేకాదు. ఈ మొక్కకు పూలు కొమ్మల చివర్లలో, ఆకు గ్రేవాల్లో రావటం వల్ల కత్తిరిస్తే ఉంటే ఒక ఎక్కువపూలు పూస్తాయి.
చీడపీడలు అంతగా ఆశించని ఈ మొక్కకు ఆకుకషాయాలు అప్పడప్పుడూ చల్లుతూ ఉంటే రసం పీల్చే పురుగులు కూడా పెద్దగా నష్టం కలిగించలేవు. పూలు పూసే సమయంలో వర్మీవాష్ వంటి సేంద్రీయ ఎరువులు నెలకోసారి చల్లుతూ ఉంటే పూలు విపరీతంగా వస్తాయి. పూలు పూయడం మొదలెట్టగానే అద్భుతంగా మారిపోతుంది. ఆకుపచ్చని నిండు ఎరుపులతో ప్రకాశవంతమైన వర్ణ మిశ్రమంతో ప్రత్యేకంగా కనిపించడంతో పాటు సీతాకోక చిలుకలు, హమ్మింగ్ పిట్టలు, తేనెటీగల సందడితో ఒక్కసారిగా పరిసరాలను సమ్మోహనం చేస్తుంది. అలాగే బట్టర్ ఫ్లై గార్డెన్లలలో నాటటానికి ఈ మొక్క ఒక మంచి ఎంపిక.
సులువుగా పెంచగలిగిన ఈ మొక్క ప్రవర్ధనానికి కూడా కష్టపడక్కరలేదు. కొమ్మ కత్తిరింపులను నాటినా, కుదురును విడదీసి నాటినా మరుసటి సంవత్సరానికే పూలతో మీ తోటకు రంగులు వేసేందుకు సంసిద్ధమైపోతుంది.

కోలియస్

Koliasరకరకాల వర్ణాల్లో, వర్ణమిశ్రమాలతో, అలరారే ఆకులుండే జాతి కోలియస్. ప్రకృతి శ్రద్ధతో గీసిన వర్ణచిత్రాల్లా మనోహరంగా ఉండే మొక్కలజాతి ఇది. దీని శాస్త్రీయనామం కోలియన్ బ్లూమి
వివిధ ప్రత్యేక వర్ణాల్లోనూ, బోలెడు రంగులతో హోలీ ఆడినట్టు గీతలు గీసినట్లు అంచులు వైవిధ్యంగా ఈనెలు వేరే వర్ణంలో ప్రస్పుటంగా ఇలా ఎన్నెన్నో సొగసులతో….లేత పసుపు మొదలుకుని ముదురు చాక్లెట్ రంగువరకూ…. ఇన్ని వన్నె చిన్నెలు ప్రదర్శించగల మొక్క ఇది ఒక్కటేమోనేమో. అలాగే ఆకుల ఆకారం, పరిమాణంలో కూడా ఎంతో వైవిధ్యం మొత్తంమీద మీరు ఎక్కువ పెంచదలుచుకున్నా అందుకు సరిగ్గా అనువైన రకం. తప్పనిసరిగా దొరికే మొక్క కోలియస్. అందమైన ఆకులుండే మొక్కలలో బిగోనియాలు, ఫిటోనియాలు, ఫోల్రాడాట్ లకు సరిజోడి ఈ మొక్క.
ఎండతట్టుకునే లేతరంగు ఆకుల రకాలు
కోలియస్ అడుగున్నర నుంచి రెండడుగుల ఎత్తువరకూ మొత్తని కాండంతో పెరిగే మొక్క బహువార్షికమైనా ప్రతి సంవత్సరం కత్తిరింపులను నాటుకుని పెంచుకుంటే అందంగా ఉంటుంది. ముదిరిన మొక్కలు అంత చక్కగా ఉండవు. ఎండ సూటిగా తగలకుండా కొద్దిగా నీడగా ఉండే చోటు కోలియస్ లకు బాగా అనుకూలం. పూర్తినీడలో పెంచినప్పుడు కొమ్మలు సాగిపోయి అందవిహీనంగా ఉంటుంది. ముదురు రంగు ఆకులుండే రకాలు లేతరంగు రకాలకంటే ఎండను తట్టుకోగలవు. నీరునిలవని సారవంతమైన మట్టిమిశ్రమంలో కోలియస్ బాగా పెరుగుతుంది. నీళ్లు క్రమం తప్పకుండా పోయాలి. నీటి ఎద్దడిని అసలు తట్టుకోలేని మొక్క ఇది. సులభంగా వాడిపోయి తలవేలాడేస్తుంది. మళ్లీ కొద్దిగా నీళ్లుపోయగానే పుంజుకుని చైతన్యంతో తుళ్లిపడుతుంది.
గుబురుగా అందంగా
పూలు వచ్చిన మొక్క త్వరగా పాకి ముదిరిపోయి అందవిహీనంగా మారుతుంది. రెండు మూడు వారాలకోసారి కొమ్మల చివర్లు తుంచివేస్తుంటే పూలు రాకుండా ఉంటాయి. ఎక్కువ కొమ్మలతో గుబురుగా, అందంగా పెరుగుతాయి కూడా కోలియస్ ను కుండీలలో పెంచుకునేటపుడు క్రమం తప్పకుండా పాలీసీడ్ వంటి సమ్రగ ఎరువును నెలకోసారి నీళ్లలో కలిపి పోస్తూ ఉండాలి. నేలలోనైతే వర్మీకంపోస్టు కానుగ పిండి ఆముదం పిండి వంటివి అప్పుడప్పుడూ కలుపుతూ వుంటే సరిపోతుంది. ఎరువులు మరీ ఎక్కువైతే ఆకు రంగులు ప్రకాశవంతంగా ఉండవు. ఎరువులు ఎక్కువగాకుండా జాగ్రత్తపడాలి. కోలియస్ కొమ్మ కత్తిరింపులతోనూ, గింజలతోనూ సులువుగా ప్రవర్ధం చేయవచ్చు. తగినంత వెలుతురు, సరిపడా నీళ్లు ఉంటే కోలియస్ ను పెంచడడం సులభం. చీడపీడలు పెద్దగా ఆశించవు కూడా. అయినా ముందుజాగ్రత్తగా ఆకుకషాయాలు అప్పుడప్పుడూ చల్లుతూ ఉంటే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కోలియస్ ను బోర్డరుగా నాటుకున్నా, కుండీలలోనైనా, హ్యంగింగ్ తొట్లలోనైనా, అస్పరాగ్ లు, పెరన్ లు, లిల్లీలు, రిబ్బన్ గ్రాస్ వంటివాటితో కలిపి నాటుకున్నా బాగుంటుంది. లెఫోమియా గ్రౌండ్ కవర్ తో కలిపి కుండీల్లో నాటుకున్నా, చెట్లకింద పెంచుకున్నా ముచ్చటగా ఉంటుంది. తోటను తక్కువ సమయంలో, సులువుగా వర్ణభరితం చేసుకోవడానికి కోలియస్ ను మించినది మరొకటి ఉండదు. మీరూ ప్రయత్నించి చూడండి. కోలియస్ తో ప్రేమలో పడకుండా ఉండటం అసాధ్యం.

జాకోబినియా

jacobiniaనీడలో కూడా అతితక్కువ అందమైనే పూలతో కనువిందుచేయగల అతితక్కువ రకాలలో జాకోబినాయా కూడా ఒకటి. మన ప్రాంతానికి అనువైన మొక్క ఇది. జాకోబినియాను బ్రెజీలియన్ ఫ్లూమ్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం జస్తీషియా కార్నియా. ఇది నీడలో పెరిగే చిన్నపొద. రెండు నుండి మూడు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది.
అండాకారంలో ఉండే పెద్ద పెద్ద ఆకులతో ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కంకులవంటి పూల గుత్తులు, ఆకర్షణీయమైన తెలుపు, లేత గులాబీ, నిండుగులాబీ, పసుపువంటి రంగులతో ముచ్చటగా ఆకట్టుకుంటాయి. నీరు నిలవని సారవంతమైన తేమగా ఉండే మట్టిమిశ్రమం జాకోబినియాలకు అత్యంత అనుకూలం. క్రమం తప్పకుండా నీళ్లుపోయాలి. కానీ మరి ఎక్కువ పోయకూడదు. నీరు మరీ ఎక్కువైనా తక్కువైనా ఆకులు కాలిపోయి మొక్క దెబ్బతింటుంది.
ఎండలో పెరిగినా నీడకూడా దీనికి ఎక్కువ అనువుగా ఉంటుంది. ఇది వేగంగా పెరిగే మొక్క. జాకోబినియాను గుంపులుగా వాడటానికి బొర్డరుగా నాటడానికి చాలా బాగుంటుంది. ఇది హైడ్రాంజియా ఫ్లెక్లాంధస్, ఫెరన్, కమేలియాలతో కలిపి నాటినపుడు చక్కగా ఉంటుంది. ధవళ వర్ణంలో పూలు పూసే రకమైతే వెండి రంగు ఆకులుండే ఫ్లెక్లాంధస్ ఫైలియా రకాలతో కలిపితే అద్భుతంగా కనిపిస్తుంది.
ఏడాదంతా….
జాకోబినియా సంవత్సరమంతా పూస్తూనే ఉంటుంది. కొత్తగా వచ్చే కొమ్మలకే పూలు వస్తాయి. అందుకే పూలు పూయడం అయిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటే చిగుళ్లు వచ్చి పూలు బాగా రావడమే కాకుండా మొక్కకూడా ముద్దుగా గుబురుగా పెరుగుతుంది.
బాల్కనీలకు, వరండాలకు చెట్లకింద నీడలో పెంచుకోవటానికి అత్యంత అనుబైన మొక్కను కుండీలలో పెంచుకున్నపుడు అప్పుడప్పుడూ గదుల్లో కూడా అమర్చుకోవచ్చు. ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువును నెలకోసారి వేస్తుంటే సరిపోతుంది. అశ్రద్ధ చేసినా తట్టుకునే ఈ మొక్క చక్కగా ఎరువులు వేసి నీళ్ళుపోస్తే ఆనందంగా పెరిగి విరగబూస్తుంది. అప్పుడప్పుడూ నీళ్లు పిచికారీ చేస్తూ ఉంటే తాజాగా ఉంటుంది.
జాకోబినియాలను కత్తిరింపులతో సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. గింజలు మొలకెత్తడానికి వెలుతురు కావాలి. అందుకే గింజలను మట్టితో కప్పకూడదు. ఇరవై నుంచి ఇరవై అయిదు రోజుల్లో మొలకలు వస్తాయి. ఏ తోటకైనా అందాన్నిచ్చే జాకోబినియాలు సీతాకోక చిలుకలకు సైతం ఆప్తబంధువులే

గడ్డిగులాబి

portulaka, Gross Roseపోర్చులక, నాచుమొక్క, గడ్డిగులాబి….. ఈ మొక్కలు ఎలాంటి ల్యాండ్ స్కేప్ లోనైనా అత్యంత సహజంగా పెరిగి అందరినీ ఆకట్టుకొంటుంది. దీన్నే సన్ రోజ్ మాస్ రోజ్ అనికూడా అంటారు. ఈ మొక్కలు పూర్తిగా సూర్యకాంతిలో పెరుగుతాయి. గడ్డిగులాబీ శాస్త్రీయనామం పోర్చులక. వీటిలో గ్రాండీఫ్లోరా. ఒలరేషియా రకాలుంటాయి. గ్రాండీఫ్లోరా ఆకులు సన్నగా సూదుల్లాగా ఉంటాయి. ఒలరేషియా ఆకులు కొంచెం కోలగా ఉంటాయి. ఒలరేషియా ఆకులను సలాడ్లలో కూడా వాడతారు. వీటి గింజలను కూడా సలాడ్లలో సూపులలో వాడతారు. మనం ఆకుకూరగా వాడే గంగపాయల కూరకు ఇది సమీప బంధువు.
నీటిని నిల్వ ఉంచుకుంటుంది
ఈ మొక్కలు అన్ని నేలల్లోనూ పెరిగినా ఇసుక కలిసిన, నీరు, నిలవని మట్టి మిశ్రమం దీనికి అనుకూలం. నిస్సారమైన నేలల్లో కూడా ఈ మొక్కలు చక్కగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకోవడంలో కూడా దీనికిదే సాటి. ఒకసారి చిన్నమొక్కనో, గింజనో నాటితే దానంతట అదే చుట్టూ వ్యాపిస్తుంది. మందంగా ఉండే దీని ఆకులు నీటిని నిల్వ ఉంచుకుంటాయి. కనుక తరచూ నీళ్లు పోయనవసరం లేదు. నీళ్లు పోసినప్పుడు కూడా పైపైన పోస్తే చాలు. ఎందుకంటే దీని వేళ్లు ఎక్కువ లోతుకు వెళ్లవు. రాళ్లమధ్య కొంచెం మట్టిలో నాటినా చక్కగా పెరిగి అందమైన పూలతో కనువిందు చేస్తాయి. గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపూవు రంగు, మీగడ రంగు, తెలుపు ఇలా ఈ పూలు ఎన్నో రంగులలో విరబూస్తాయి. వాటన్నింటిని కలిపి నాటితే ఇంద్రధనస్సు మీ ముంగిట్లో పరచుకున్నట్లే కనువిందు చేస్తుంది.
ఎడాదంతా పూలు
ఈ మొక్క మూడునుంచి నాలుగు అంగుళాల ఎత్తులో పెరిగి దాదాపు రెండు అడుగుల వరకూ వ్యాపిస్తుంది. నిజానికి ఏకవార్షికం. అయితే ఎప్పటికప్పుడే విత్తనాలు పడి పెరుగుతూ బహువార్షికాన్ని తలపిస్తుంది. దీని ఆకులు ముదురు రంగుల్లోనూ కొమ్మలు కొద్దిగా ఎరుపురంగు కలిసిన పసుపు రంగులోను ఉంటాయి. పగలు విచ్చుకుని రాత్రికి ముడుచుకునే వీటిపూలు ఆకారంలో కాక్టస్ పూలను పోలి ఉంటాయి. ఈ పూలు ఒంటి రెక్కలతో ఉన్నా ముద్దగా ఉన్నా ఒకే రంగులోనైనా, మిశ్రమ రంగులలోనైనా వీటికివే సాటి. ఈ మొక్కలను లాన్ పక్కన, బోర్డరుగాను, గ్రౌండ్ కవర్ గాను, బెడ్లలో, రాకరీల్లో, కుండీలలో, వేలాడే కుండీలలో, మిశ్రమ అమరికల్లో పెంచినా కూడ ఇట్టే ఒదిగిపోతుంది. సులువుగా పెంచుకోవచ్చు
కటింగ్ ద్వారాగానీ, గింజల ద్వారాగానీ, దీన్ని సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. దీన్ని నాటినప్పుడు కొద్దిగా డి ఏ పి, తర్వాత పూలు పూస్తున్నప్పుడు సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువుని కొద్దికొద్దిగా వేస్తే చాలు. లేదా వర్మీకం పోస్టు, కోడిగుడ్డు పెంకులను మట్టిలో కలిపినా సరిపోతుంది. ఈ మొక్కకు చీడపీడలు పెద్దగా ఆశించవు. వేరుకుళ్లు మాత్రం ఆశించవచ్చు. అందుకే నీళ్లు నిలవకుండా చూసుకోవడం చాలా అవసరం. మరీ గుబురుగా అల్లుకుపోతుంది. కనుక మధ్య మధ్య కొన్ని కొమ్మలు తీసేస్తే గానీ గాలి సరిగా తగలదు. అప్పుడే తెగుళ్లు రాకుండా ఉంటాయి. ఈ గడ్డి గులాబీలు అతిసాధారణమైనవైనా వీటిని చూస్తుంటే ఆ విషయమే గుర్తుకు రాదు. ఎవరి చూపులనైనా ఇట్టే కట్టిపడేస్తాయనవి. వీటి అందం మిరుమిట్లు గొలిపేలా కాకుండా పసిపిల్లల్ని చూసినంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక గడ్డి గులాబీలున్నప్పుడు తోటను సీతాకోకచిలుకలు ఇట్టే శాశ్వతస్థావరం చేసుకుంటాయి.

ముచ్చటైన మోండోగ్రాస్

monda grassఎలాంటి ల్యాండ్ స్కేప్ లో అయినా సులువుగా ఇమిడిపోయి అదనపు ఆకర్షణను అందించే మోండోగ్రాస్….. మోండోగ్రాస్ ఎలాంటి నేలలో అయినా మూడునుండి ఆరు అంగుళాల ఎత్తుమాత్రమే పెరుగుతుంది. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే బహువార్షికం. ఇది కాడలు లేని నిండాకుపచ్చ రంగు గడ్డిలాంటి ఆకులతో కుదురులా పెరుగుతుంది. ఇది పెద్దగా శ్రద్ధ చూపనవసరం లేకుండా సులువుగా పెరిగే మొక్క.
మోండోగ్రాస్ ఎలాంటి నేలల్లో ఐనా పెరుగుతుంది. కానీ నీళ్లు నిలవకుండా ఉంటే చాలు. ఎండను తట్టుకున్నా నీడ దీనికి అనుకూలం. పూర్తినీడలో చాలా తక్కువ నీటితోనూ చక్కగా పెరుగుతుంది. మట్టిమిశ్రమంలో కోకోపిట్, వాడేసిన కాఫీపోడి, టీపొడి వంటివి కలిపి నాటితే దీనికి మంచిది. దీన్ని చిన్న గ్రౌండ్ లో కవర్ గానూ, పొట్టి బోర్డరుగానూ, పేవింగ్ రాళ్లమధ్య కూడా నాటుకోవచ్చు. లాన్ కు, పూలబెడ్ల మధ్య నాటుకోవచ్చు. కుండీలలో పెద్ద మొక్కలు నాటినప్పుడు కింద వరకుసగానూ పెంచుకోవచ్చు. మోండోగ్రాస్ ను చిన్న చిన్న కుదుళ్లలాగా నాటితే కొంతకాలానికి మొత్తం కలిసిపోయి లాన్లాగా కనిపిస్తుంది. నిజానికి మోండోగ్రాస్ లాన్ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. పైగా దీనికి మోవింగ్ అంటే కత్తిరించడం అవసరం లేదు. చాలా తక్కువ నీటితో పెరుగుతుంది. ఇంకా పూర్తి నీడకు కూడా ఎంతో అనుకూలం. కానీ ఒకే ఒక్క సమస్య…ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది.
నీళ్లు నిలవకూడదు…
మోండోగ్రాస్ లో వరిగేటెడ్ రకాలు, నల్లరకం కూడా ఉన్నాయి. బ్లాక్ మోండోగ్రాస్ తక్కువ గుబురుగా ఎనిమిది నుండి తొమ్మిది అంగుళాల ఎత్తులో పెరుగుతుంది. కుండీలలో ఇతర మొక్కలతో కలిపి నాటడానికి లాండ్ స్కేప్ గానూ అద్భుతంగా ఉంటుంది. దీనికి వర్షాకాలంలో చిన్న చిన్న ఊదారంగుపూలు గుత్తులు గుత్తులుగా వస్తాయి. కానీ ఇవి కనపడకుండా ఆకులతో కప్పివేయబడతాయి. మోండోగ్రాస్ ను సాధారణంగా చీడపీడలేవి ఆశించవు. నీళ్లు ఎక్కువైతే వేరు కుళ్లుతుంది.
కనుక నీళ్లునిలవకుండా చూసుకోవాలి. తక్కువగా పోయాలి. దీనికి ఎరువులు పెద్దగా అవసరం లేదు. మూడు నాలుగు నెలలకోసారి ఎన్ పీ కె ఉండే పాలీఫీడ్ వంటి నీటిలో కరిగే ఎరువును లీటరుకు ఐదుగ్రాముల చొప్పున కలిపి చల్లితే సరిపోతుంది.
మోండోగ్రాస్ కుదుళ్లను విడదీసి చక్కగా ప్రవర్ధనం చేయవచ్చు.

పున్నమి చంద్రుడు

punnami chandruduతక్కువ శ్రద్ధతో, సులువుగా పెంచుకోగలిగిన అందమైన మొక్కల్లో మరొకటి పున్నమి చంద్రుడు. దీన్ని ‘‘మ్యూజికల్ నోట్’’ అనీ, ‘‘మార్నింగ్ కిస్’’ అనికూడా అంటారు. దీని శాస్త్రీయనామం క్లీరో డెండ్రమ్ ఇన్సిజమ్
పున్నమి చంద్రుడు 2 నుంచి 3 అడుగుల ఎత్తువరకు పెరగగల చిన్నపొద. పచ్చని ఆకులతో గుబురుగా పెరుగుతుంది. దీని ఆకులు రంపపు పళ్లవంటి అంచులతో ఉంటాయి. ఈ మొక్క ప్రత్యేకత అంతా దీని పూలు, మొగ్గలే. ఈ మొగ్గల సన్నని పొడవాటి కాడల చివర గుండ్రని బిళ్ళల్లాగా ‘‘మ్యూజికల్ నోట్’’ ఆకారంలో ఉండటం వల్ల దీనికా పేరు వచ్చింది. దీని పూలు అందంగా, తెల్లగా ఉండి గుత్తులుగా విరగబూస్తాయి. ఇవి రాత్రిపూట విచ్చుకుంటాయి. పున్నమి వెన్నెలను తలపించేలా రాత్రిపూట తెల్లని పూలు, మొగ్గలతో నిండి ఉండటవం వలన దీన్ని ‘‘పున్నమి చంద్రుడు’’ అంటారు. దీని కేసరాలు సన్నగా, పొడవుగా, ఎరుపురంగులో పూలలో నుంచి బయటకు వచ్చి అందంగా కనిపిస్తాయి.
డాది పొడవునా….
పున్నమిచంద్రుడు తక్కువ శ్రద్ధతో పెరిగే మొక్క. పూర్తి సూర్యకాంతిలో పెరిగినా కొద్దిపాటి నీడను తట్టుకుంటుంది కూడా. నీరు నిలవని సారవంతమైన మట్టి మిశ్రమంలో చక్కగా పెరుగుతుంది. తక్కువగా అయినా క్రమం తప్పకుండా నీరు పోయడం మంచిది. ఈ మొక్కను విడిగా నాటుకున్నా గుంపుగా నాటుకున్నా బోర్డరుగా పెంచుకున్నా, ఇతర రంగుపూల మొక్కలతో కలిపి పెంచుకున్నా చక్కగా ఉంటుంది. కుండీల్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. ఇది సంవత్సరం పొడవునా పూస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా అనిపించే తెల్లని మొగ్గలు, పూలవల్ల రాత్రిపూట ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎక్కువగా పూస్తుంది. కనుక నెలకోసారి ఎన్ పీ కె ఉండే సమగ్ర ఎరువుని వేస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది. వేప, కానుగ, లేదా పొగాకు కషాయం వంటి కషాయాలను తరచుగా చల్లుతూ ఉంటే పిండి పురుగులు, రసం పీల్చేపురుగులు ఆశించకుండా ఉంటాయి. ఈ మొక్కను విత్తనాలు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా సులువుగా ప్రవర్థనం చేయవచ్చు. ప్రత్యేకంగా కనిపించే మొక్కలు కోరుకునే వారికి ఇది కూడా ఒక చక్కని ఎంపిక.