తెలుగు నెలలు

మాఘమాసం

సనాతన హిందూ ధర్మంలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం రోజూ చేసే స్నానం దేహాన్ని శుద్దిచేసి మనలోని ప్రకోపాన్ని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తాయి.మాఘమాసంలో చేసే స్నానాలకు ప్రత్యేకత ఉంది. దేవతలు తమ శక్తులను తేజస్సులను మాఘమాసంలో జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘస్నానం చాలామంచిది. పౌర్ణమి చంద్రుడు మఘ (మఖ) నక్షత్రంలో ఉండే మాసమే మాఘమాసం. ఈ సమయంలో సూర్యోదయం వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాల్లో భూమిపై పడతాయి. అందువల్ల సాధారణ సూర్యకిరణాలకంటే వీటి సాంద్రతలో చాలా …

మాఘమాసం Read More »

భాద్రపద మాసం

భాద్రపద మాసంలో రెండు విశేషాలున్నాయి. ఒకటి వరాహ జయంతి. దశావతారాల్లో ఇది మూడవది. కల్పాంత సమయంలో భూమి జలమయమైపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు మనువును పిలిచి… భూమిని పాలించమన్నాడు. భూమి నీటిలో ఉంది..ఎవరు పైకి తెస్తారు అంటాడు మనువు. సరిగ్గా అదే సమయంలో బ్రహ్మకు తుమ్ము వచ్చింది. ఆయన ముక్కులోంచి యజ్ఞవరాహమూర్తి పుట్టాడు. యజ్ఞవరాహము అంటే యజ్ఞంలో వాడే పదార్థాన్నీ శరీరంలో భాగాలుగా ఉన్నవాడు. అందుకే ఆయనది మంగళ స్వరూపం. బొటన వేంత దేహంతో పుట్టిన అతడు క్షణకాంలోనే …

భాద్రపద మాసం Read More »

శ్రావణమాసం

శ్రావణమాసంలో ప్రతి ఇల్లూ లక్ష్మీనివాసమే. పెళ్ళిప్రయత్నాలు, సేద్యపు పనులు …మంచి పనులు ప్రారంభించటానికి ఇదే మంచిమాసమంటారు వేదపండితులు. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణా నక్షత్రంలో ఉంటాడు. అందుకే శ్రావణమాసమని పేరు. మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. దశావతారాల్లో కృష్ణావతారం ఈ మాసంలోనే మెదయ్యింది. శ్రీకృష్ణుడు శ్రావణబహుళ అష్టమినాడు దేవకీ వసుదేవు అష్టమగర్భంలో జన్మిస్తాడు. శ్రావణపౌర్ణమి నాడు హయగ్రీవ జయంతి. శ్రావణ శుక్రవారాలు : శ్రావణం దేవుడికి, భక్తుడికి అనుసంధానం కావించే మాసం.ఉపవాసం అంటే పరమాత్మకు …

శ్రావణమాసం Read More »

మార్గశిరమాసం

మార్గశిరమాసం మార్గానాం మార్గశీర్షోహం అర్జునా మాసాలలో మార్గశిరాన్ని నేను అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ప్రకటించుకొన్నాడు. మార్గశిరంలో వ్రతాలకు, పూజలకూ కొదవలేదు. చంద్రుడు ఈ మాసానికి అధిపతి. ధనుర్మాసం సూర్యుడు వృశ్ఛికరాశి నుండి ధనూరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ధనుస్సంక్రమణం అంటారు. సూర్యడు మరలా మకరరాశిలోకి ప్రవేశించేదాకా ఉన్న 30 రోజులూ పరమ పవిత్రం. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం. గోదాదేవిది మధురభక్తి. తండ్రి విష్ణుచిత్తుడు శ్రీరంగనాధునికి పూజకోసం సిద్ధం చేసిన మాలలను మెడలో వేసుకొని మురిసిపోయేది. ఆ సంగతి తండ్రికి …

మార్గశిరమాసం Read More »

వైశాఖ మాసం

తెలుగునెలల్లో రెండో మాసం వైశాఖం. వసంత రుతువులో వచ్చే ఈ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా వుంటుంది. నిర్మలమైన ఆకాశంతో పాటు రాత్రిళ్లు ఆహ్లాదకరంగా వుంటాయి. ఈ మాసంలో పండ్లకు రాజైన మామిడిపండు దిగుబడులు ఎక్కువగా వస్తుంటాయి. వైశాఖంలోనే మహామహులు జన్మించడం విశేషం. ప్రపంచానికి శాంతి మార్గం ప్రబోధించిన గౌతమబుద్దుడు, అద్వైత సిద్ధాంతాన్ని ఆ సేతు హిమాచలం ప్రచారం చేసి హైందవ మత పటిష్టతకు కృషి చేసిన శంకర భగవత్పాదులు, విశిష్టాద్వైత ప్రచారకర్త రామానుజాచార్యులు, పదకవితా పితామహుడు …

వైశాఖ మాసం Read More »

ధనుర్మాసం

ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలో ప్రవేశించే పుణ్యసమయం (డిసెంబర్‌ 16 నుండి) అదే ధనుస్సక్రమణం. నాటి నుంచి భోగి పండగ వరకూ పరమపవిత్ర కాలం తెలుగు వారి లోగిళ్లలో దీనిని నెలగంట అంటారు. ఈ మాసంలోనే పరమాత్ముడు గోదాదేవిని ప్రేమగా స్వీకరించింది. గోదాదేవిని ఆండాళ్‌ అని పిలుస్తారు. ఈమె తమిళనాడులోని శ్రీవిల్లీపుత్తూరులో తులసి మొక్కలమధ్య దర్శనమిచ్చింది. ఈమెకు గోదాదేవి అని పేరుపెట్టి విష్ణుచిత్తుడనే పరమభక్తుడు పెంచి పెద్దచేశాడు. గోదాదేవి బాల్యం నుంచి శ్రీరంగనాధుడే సర్వస్వమని భావించింది. ఆ భగవంతుడే …

ధనుర్మాసం Read More »

తెలుగు నెలలు (తెలుగు మాసములు)

తెలుగు నెలలు పన్నెండు. ప్రతి నెల శుక్ల పక్ష పాడ్యమి (అమావాస్య తర్వాత వచ్చే తిథి) తో మొదలై అమావాస్యతో ముగుస్తుంది.     ప్రతి నెలలో రెండు పక్షాలు ఉంటాయి:     శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం (ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పున్నమి వరకు): రోజు రోజుకూ చంద్రుడి తో పాటు వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. (శుక్ల అంటే తెల్లని అని అర్థం). కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం (ప్రతి నెల పున్నమి …

తెలుగు నెలలు (తెలుగు మాసములు) Read More »