అలంకరణ మొక్కలు

ఆఫీస్ టేబుల్ మీద చిన్నగా, బుజ్జిగా, అందం గా ఉండే చిన్న మొక్కలు

అదేంటీ? నర దిష్టి కోసం ఉపయోగించే మొక్కను ఇంట్లోను ఆఫీస్ లోనూ పెట్టుకుంటారా …? అని తిట్టుకోవద్దు. ఆ నమ్మకాల సంగతి అటు ఉంచితే, ఇది చాలా మంచి మొక్క, గాలిని కూడా పరిశుభ్రం చేస్తుంది. నాసా వారి క్లీన్ ఎయిర్ స్టడీ లో కూడా ఈ మొక్క ఉన్నది. పెద్ద జాగ్రత్తలు కూడా అవసరం లేదు ఈ మొక్కకు, ఒకసారి నీళ్ళు పోసిన తరువాత పూర్తిగా మట్టి ఎండిన తరువాత మాత్రమే మళ్ళీ నీళ్ళు పోయాలి.మట్టిలో …

ఆఫీస్ టేబుల్ మీద చిన్నగా, బుజ్జిగా, అందం గా ఉండే చిన్న మొక్కలు Read More »

కోలియస్

రకరకాల వర్ణాల్లో, వర్ణమిశ్రమాలతో, అలరారే ఆకులుండే జాతి కోలియస్. ప్రకృతి శ్రద్ధతో గీసిన వర్ణచిత్రాల్లా మనోహరంగా ఉండే మొక్కలజాతి ఇది. దీని శాస్త్రీయనామం కోలియన్ బ్లూమివివిధ ప్రత్యేక వర్ణాల్లోనూ, బోలెడు రంగులతో హోలీ ఆడినట్టు గీతలు గీసినట్లు అంచులు వైవిధ్యంగా ఈనెలు వేరే వర్ణంలో ప్రస్పుటంగా ఇలా ఎన్నెన్నో సొగసులతో….లేత పసుపు మొదలుకుని ముదురు చాక్లెట్ రంగువరకూ…. ఇన్ని వన్నె చిన్నెలు ప్రదర్శించగల మొక్క ఇది ఒక్కటేమోనేమో. అలాగే ఆకుల ఆకారం, పరిమాణంలో కూడా ఎంతో వైవిధ్యం …

కోలియస్ Read More »

ముచ్చటైన మోండోగ్రాస్

ఎలాంటి ల్యాండ్ స్కేప్ లో అయినా సులువుగా ఇమిడిపోయి అదనపు ఆకర్షణను అందించే మోండోగ్రాస్….. మోండోగ్రాస్ ఎలాంటి నేలలో అయినా మూడునుండి ఆరు అంగుళాల ఎత్తుమాత్రమే పెరుగుతుంది. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే బహువార్షికం. ఇది కాడలు లేని నిండాకుపచ్చ రంగు గడ్డిలాంటి ఆకులతో కుదురులా పెరుగుతుంది. ఇది పెద్దగా శ్రద్ధ చూపనవసరం లేకుండా సులువుగా పెరిగే మొక్క.మోండోగ్రాస్ ఎలాంటి నేలల్లో ఐనా పెరుగుతుంది. కానీ నీళ్లు నిలవకుండా ఉంటే చాలు. ఎండను తట్టుకున్నా నీడ దీనికి …

ముచ్చటైన మోండోగ్రాస్ Read More »

కెలాధియా

కెలాధియా మరాంతాలను, అగ్లోనిమాలను పోలి ఉండి, ఇంట్లో పెంచుకోవడానికి అనువైన అందమై మొక్క కెలాధియా. ఆకుల మీద ఉండే మచ్చలు లేదా చారల వల్ల దీన్ని నెమలిమొక్క, జీబ్రా మొక్క అని కూడా అంటారు. వీటిని సాధారణంగా అందమైన ఆకులకోసం పెంచుతారు. ఈ ఆకులు రకాన్నిబట్టి వివిధ పరిమాణాల్లో ఆకారాల్లో ముచ్చట గొలుపుతాయి. ఏ రకానికదే మనోహరంగా, సహజమైనది కాదు కృత్రిమమైనదేమో అనిపిస్తూ ఎవరైనా చేయి తిరిగిన కళాకారుడి అద్భుతమైన సృష్టేమో అని భ్రమింప చేస్తుంది.రెండడుగుల వరకూ …

కెలాధియా Read More »

సైకస్

సైకస్ అలంకరణ మొక్కలలో అత్యంత ఆదరణ పొందినది సైకస్. అతి పురాతనమైనది ఈ మొక్క శాస్త్రీయనామం సైకస్ రెవల్యూటా. దీనినే కింగ్ సాగో పామ్ అని కూడా అంటారు. ఇది కోనిఫర్ జాతికి చెందినది. సుమారు 20 కోట్ల సంవత్సరాల నుండి మొక్క ఉన్నట్లు చెబుతారు. అందుకే సజీవ శిలాజం అంటారు. సైకస్ లోని అనేక రకాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా తూర్పు ఆసియా ప్రాంతానికి చెందిన సైకస్ రెవల్యూటా మాత్రమే శతాబ్ధాలుగా తోటల రూపకల్పనలో ఉపయోగపడుతుంది. ఏ …

సైకస్ Read More »

పోల్కాడాట్

చూడచక్కని పోల్కాడాట్ చూడచక్కని పోల్కాడాట్ గులాబీ, ఎరుపు లేదా తెలుపు మచ్చలూ, చుక్కలతో కూడిన చిత్రపటం లాంటి ఆకులు దీని సొంతం. అందుకే దీన్ని పోల్కాడాట్ అని పిలుస్తుంటారు.పోల్కాడాట్ శాస్త్రీయనామం హైపోస్టెస్ ఫైలోస్టాకియా. ఇది ఏకవార్షికం. ఆరు అంగుళాల నుంచి అడుగున్నర ఎత్తువరకూ పెరిగే ఈ సుకుమారమైన ముచ్చటైన మొక్క కొద్దిపాటి నీడలో చక్కగా పెరుగుతుంది. అయినా ప్రకాశవంతమైన వెలుతురు మాత్రం తప్పనిసరి. పోల్కాడాట్ కు గాలిలోనూ, నేలలోనూ తేమ ఎక్కువగా ఉండాలి. మట్టి మిశ్రమం నీరు …

పోల్కాడాట్ Read More »