మన దేశం లోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయిని మన దేశం లో ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయిని పరందపుకాయ, పరమాత్మునికాయ, మదన ఆనపకాయ అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు. వైద్య పరమైన ఉపయోగములు. బొప్పాయి పండులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగు మోతాదులో నున్నాయి. తరచూ బొప్పాయి పండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగాలభిస్తాయి.ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు బొప్పాయిపండు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు ఆరోగ్యనిపుణులు. 100 గ్రాముల బొప్పాయి ముక్కల్లో లభించేవి: 40 క్యాలరీలు,1.8గ్రా. పీచు,9.8గ్రా కార్బోహైడ్రేట్లు,0.6గ్రా ప్రోటీన్లు,10మి.గ్రా. మెగ్నీషియం,257మి.గ్రా. పొటాషియం,03 మి.గ్రా. సోడియం,24 మి.గ్రా. కాల్షియం,61.8 మి.గ్రా. విటమిన్-సి,విటమిన్ ఎ (6%),బీటాకెరోటిన్ (3%),విటమిన్ బి1 (3%),బి2 (3%),బి3 (2%),బి6 (8%)ఉంటాయి పోషకవిలువలు కెరోటిన్, ఎ, బి, సి, ఇవిటమిన్‌లు, ఖనిజాలు, ఫ్లేవొనాయిడ్‌లు, ఫొలేట్‌లు, పాంతోనిక్ …
బొప్పాయి Read More »
You must be logged in to post a comment.