మెఘల్ చక్రవర్తులు

ఔరంగజేబ్

భారతదేశపు చిట్టచివరి మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్. షాజహాన్ పుత్రులలో మూడవవాడు, ఢిల్లీలో జన్మించాడు. ఇతనికి మతాభిమానం ఎక్కువ. దురహంకారి. సింహాసనం కోసం సొంత సోదరులను హతమార్చిన క్రూరుడు. ఇతని పెద్ద అన్న దారాషుకో ఆధ్యాత్మికపరుడు, పరమత సహనం కలవాడు. రాజ్యం కోసం అన్న దారా, తమ్ముడు మురాద్, ఇంకో అన్నతో చేతులు కలిపి తండ్రిమీదనే దండయాత్ర చేసి తండ్రిని కారాగృహంలో బంధిస్తాడు. దారాను, మురాద్ ను చంపిస్తాడు. ఇంకో అన్నను రాజ్యం నుండి తరిమివేసి 1658 సం.లో …

ఔరంగజేబ్ Read More »

షాజహాన్

భారతదేశానికి ఐదవ మొగల్ చక్రవర్తి షాజహాన్. జహంగీరు కుమారుడు. షాజహాన్ అసలు పేరు ఖుర్రమ్. నూర్జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ కుమార్తె ఐన ముంతాజ్ మహల్ ను పెండ్లిచేసుకుంటాడు. ముప్పై సంవత్సరాల పాటు శాంతి భద్రతలను రక్షిస్తూ గొప్ప పరిపాలనా దక్షుడుగా పేరుతెచ్చుకున్నాడు. ఇతని కాలంలోనే మొగల్ సామ్రాజ్యం పతాకస్థాయిలో విస్తరించింది. శిస్తు వసూళ్లు పుష్కలంగా ఉండటంతో రాజ్యం ఐశ్వర్యవంతమైనది. ఇతను గొప్ప కళాపోషకుడు. సుందరమైన భవన నిర్మాణాలు, కళాసాహిత్య పోషణకు ఎక్కువగా ఖర్చుపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి …

షాజహాన్ Read More »

జహంగీర్

భారతదేశపు నాలుగవ మొగలాయి చక్రవర్తి జహంగీర్. ఇతను అక్బర్ కుమారుడు. 1605లో జహంగీర్ పరిపాలన ప్రారంభమయింది. జహంగీర్ కాలంలో పోర్చుగీసువారితో వర్తకవ్యాపారాలు అభివృద్ధి చెందాయి. దేశం కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. న్యాయపాలనకు, కళాపోషణకు, మతసహనానికి పేరుపొందాడు. జహంగీర్ భార్య నూర్జహాన్. ఇతని చిన్నప్పటి ప్రియురాలు. వీరి వివాహానికి అక్బర్ సమ్మతించకపోవటంతో, అక్బర్ మరణానంతరం ఈమెను వివాహం చేసుకున్నాడు. అప్పటికే నూర్జహాన్ కు వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. నూర్జహాన్ స్వతహాగా తెలివితేటలు కలది. తన …

జహంగీర్ Read More »

అక్బర్

అక్బర్ భారతదేశాన్ని పాలించిన మూడవ చక్రవర్తి. ఇతను మొగల్ రాజ్య స్థాపకుడైన బాబర్ మనుమడు, హుమయూన్ కుమారుడు. తండ్రి మరణానంతరం చిన్నతనంలోనే 1556 సం.లో తన 13వ ఏట సింహాసనం అధిష్టిస్తాడు. అప్పటికి రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉండేది. తన మంత్రి బైరాం ఘాన్ సహాయంతో అల్లర్లను అణచివేశాడు. అక్బర్ యువకుడై పూర్తిగా రాజ్యాధికారం చేపట్టేదాకా బైరాంఖాన్ దే పెత్తనమంతా. అక్బర్ రెండవ పానిపట్ యుద్ధంలో హేమూని జయించాడు. 1576 సం.లో హల్దీఘాట్ వద్ద రాణా ప్రతాపసింహుణ్ణి జయిస్తాడు. …

అక్బర్ Read More »

హుమయూన్

భారతదేశానికి హుమయూన్ రెండవ మొగల్ చక్రవర్తి. ఇతని పరిపాలనా కాలం క్రీ.శకం 1530 నుండి 1556 వరకు. 1530 సం.లో తన 23వ ఏట మొగల్ సింహాసనాన్ని అధిష్టించాడు. సూర్ వంశీయుడైన షేర్షా చేతిలో ఓడిపొయి దేశం విడిచి పోయాడు. ఈ సమయంలో ఇతని భార్యకు అక్బర్ జన్మిస్తాడు. 1555 సంలో పర్షియా రాజు సాయంతో అప్పటి ఢిల్లీ పరిపాలకుడు షెర్షా వంశీయుడైన ఆదిల్ నూర్ ను, ఇతని మంత్రి హేమూను జయించి తిరిగి ఢిల్లీ పిఠం …

హుమయూన్ Read More »

బాబర్

భారతదేశంలో మొగల్ సామ్రాజ్యానికి పునాది వేసినవాడు బాబర్. ఇతని తల్లివైపు వారు ప్రపంచంలోనే అత్యంత క్రూరుడుగా పేరుపొందిన చెంఘీజ్ ఖాన్ వంశానికి చెందినవారు. తండ్రి వైపువారు తైమూర్ వారసులకు చెందినవారు. బాబర్ చిన్నతనంలోనే సామర్కండ్ రాజై తన ప్రతిభతో తన సామ్రాజ్యాన్ని కాందహార్ వరకు వ్యాపింపచేశాడు. అప్పటికి భారతదేశాన్ని ఇబ్రహీం లోడి పరిపాలిస్తున్నాడు. అప్పటి పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ ఇబ్రహింలోడీ మీద తిరుగుబాటు ప్రకటించి బాబర్ ను భారతదేశానికి ఆహ్వానిస్తాడు. బాబర్ తన సైన్యంతో భారతదేశంలోకి …

బాబర్ Read More »