📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

పండ్లు

లిచి పండు (Litchi fruit)

Litchi (also spelled lychee) is a tropical fruit known for its sweet, floral flavor and juicy, translucent flesh. It grows on the evergreen tree Litchi chinensis, native to the Guangdong and Fujian provinces of southeastern China. Here’s a breakdown of the fruit’s characteristics: Appearance Nutritional Benefits లిచి పండు (Lychee) ఒక రసభరితమైన, తీపి ఫలము. ఇది భారతదేశంలో ముఖ్యంగా […]

లిచి పండు (Litchi fruit) Read More »

కొత్తపల్లి కొబ్బరి మామిడి

ఈ రోజు 26-05-2023, కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు ముగ్గ వేసినవి తిన్నాను. ఆహా ఏమి రుచి. రసం చాలా ఉంది లోపల. పీచు పదార్థం . పీచు ని చీకే కొలది చాలా రసం వచ్చింది. నా జీవితం లో మొదటి సారి తిన్నా అనుకుంట. అద్భుతం గా ఉంది. దీనికి కారణమైన మా ఆవిడ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మా ఆవిడ చెప్పింది ఈ చెట్టు దరియాలతిప్ప లో ఉన్న వాళ్ళ తాత గారి ఇంటి

కొత్తపల్లి కొబ్బరి మామిడి Read More »

కివి పండు

ముందుగా పైన , కిందా అడ్డంగా సన్నని ముక్కను కొయ్యండి. దీని ఆధారంగా(base) కాయను నిలబెట్టండి. ఇప్పుడు బంగాళాదుంప మీద తొక్క తీసినట్టు కొద్ది కొద్దిగా తీస్తూ ఉండండి. తొక్క మొత్తం తియ్యడం అయ్యాక ఈ విధంగా మీకు నచ్చినట్టు కోసుకోవచ్చు. మొత్తానికి కొయ్యడం అయింది. ఇప్పుడు తినడం మొదలు పెట్టాలి. చివరిగా మీకోసం నేను చేసిన ఒక అందమైన ఆకృతి 😄

కివి పండు Read More »

పుచ్చకాయ

పుచ్చకాయను కొనుక్కునేప్పుడు ఏది బావుందో, ఏది బాలేదో ఎలా కనిపెట్టడం? పొడవుగా వున్నా కాయ కన్నా గుండ్రం వున్నా కాయ ను ఎన్నుకోండి కాయ క్రింద భాగం చూడండి.. పసుపు రంగులో ఉంటే అది చాలా తీపిగా ఉంటుంది, తెల్లగా ఉంటే మీడియం స్వీట్ అన్నమాట తోడిమను చూడండి అది ఎండిపోయి ఉంటే అది బాగా పక్వానికి వచ్చింది అని గుర్తు (తోడిమ పచ్చగా ఉంటే తీస్కుకోకండి ) తోడిమకు ఒప్పొసిట్ లో అదే పువ్వు వచ్చే

పుచ్చకాయ Read More »

passion fruit – తపన ఫలం

ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే… పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే… తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే… తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A,

passion fruit – తపన ఫలం Read More »

తేగలు & బుర్రగుంజు

తాటి పండ్లను భూమిలో పాతర వేస్తారు ల. (తక్కువ లోతు గుంటలో లేదా భూమి మీది తాటి పండ్ల పరిచి మీద మట్టి కప్పుతారు). ఒక్కో తాటి పండులో సాధారణంగా మూడు బుర్రలు ఉంటాయి, ఒక్కో బుర్ర ఒక్కో తాటి చెట్టు విత్తనం. కొన్ని రోజులకు తాటి పండ్ల లోని ముట్ల/బుర్రల నుంచి మొలకలు వచ్చి వేరు భూమిలోకి దిగుతుంది,ఈ వేరునే మనం తేగ అని పిలుస్తాం. ‘తేగoటి బిడ్డ’ అంటే తేగ కావాలన్నడట- అనేది సామెత.

తేగలు & బుర్రగుంజు Read More »

తాటి తాండ్ర

తాటి కాయలు కోయకుండా అలానే చెట్టుకు వదిలేస్తే పండిపోతాయి. బాగా పండిన తాటి పండు ఈ పండ్ల పైన కండను కోసి ఉడకబెడితే తీయ్యని పీచుతో కూడిన తాటి తాండ్ర వస్తుంది.

తాటి తాండ్ర Read More »

తాటి ముంజలు

తాటి చెట్టుకు తాటి కాయలు కాస్తాయి. ఈ తాటికాయలు లేతగా ఉన్నపుడు కొస్తే మనకు తాటి ముంజలు లభిస్తాయి. పైన చిత్రంలోలా ఒక్కో తాటి కాయలో మూడు ముంజలు ఉంటాయి, ఈ ముంజల పైన తెల్లని మందమైన పోర ఉంటుంది , ఈ పొర వగరుగా ఉంటుంది, ముంజను ఈ పొరతో పాటు గా తింటే బాగా అరుగుతుంది అనే చెప్పే వాళ్ళు. ఈ ముంజలు ముదిరితే గట్టిగా తయారయి చివరికి గట్టి ముట్టెలుగా తయారవుతాయి. ఈ

తాటి ముంజలు Read More »

కొబ్బరి పువ్వు

బాగా పండిన కొబ్బరికాయకు తేమ తగిలినప్పుడు కొబ్బరికాయ నుండి మొలక వస్తుంది కొబ్బరికాయ కన్నుల నుంచి అన్ని విత్తనాల లాగానే. ఆలా కొబ్బరికాయలో మొలక వచ్చినపుడు కొబ్బరి కాయలోపల పువ్వులాంటి తెల్లని పదార్థం కొబ్బరికాయ లోపల పెరుగు తుంది, దీన్నే కొబ్బరి పువ్వు అంటారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే అదృష్టం అని చెబుతారు.

కొబ్బరి పువ్వు Read More »

డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) – పోషకాల గని

ఇంటిపనీ వంటపనీ చేసేసరికి ఎక్కడలేని నిస్సత్తువ ఆవరిస్తుంది. ఉద్యోగినుల సంగతి అయితే అసలే చెప్ప నక్కర్లేదు. ఇలాంటప్పుడు కాసిని డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు తింటే సరి. ఇవి ఒంట్లోని శక్తి స్థాయుల్ని పెంచుతాయట. ఈ పండులో కనీసం 102 కెలారీల శక్తి ఉంటుందట. అలాగని బరువు పెరుగుతామనే భయం అస్సలు అక్కర్లేదు. ఎందుకంటే దీనిలో కొవ్వులు చాలా మితంగానే లభిస్తాయి మరి. డ్రాగన్ ఫ్రూట్లో పొట్ట ఆరోగ్యానికి తోడ్పడే ప్రొట యాటిక్స్ పుష్కలం ఇవి జీర్ణసమస్యల్ని తగ్గించి

డ్రాగన్ ఫ్రూట్ (Dragon Fruit) – పోషకాల గని Read More »

రాంబుటాన్ (rambutan)

పేరు వెరైటీ గా ఉంది కదా? ఇది చూడటానికి ఉమ్మెత్తకాయ లాగా ఉంటుంది.ఇది జపాన్, మలేషియా, ఫిలిపిన్స్, తైవాన్ దేశాలలో పండుతుంది. పశ్చిమగోదావరి జిల్లా లోని వెంకట్రామన్న గూడెం లో వైస్సార్ ఉద్యాన విశ్వ విద్యాలయం లో ఈ పండు మొక్కల సాగు కు రీసెర్చ్ చేస్తున్నారు. ఇది ఎర్రపు, పసుపు రెండు రంగుల్లో దొరుకుతుంది. పులుపు, తీపి కలిపి రుచి ఉంటుంది. పై తోలు తీసేసి తింటారు. పండు లోపల తెల్లగా ముంజు కాయల లాగా

రాంబుటాన్ (rambutan) Read More »

పెర్సిమోన్ (persimmon fruit)

ఇది చూడటానికి పెద్ద సైజ్ టొమాటో లాగా ఉంటుంది. దీని రుచి ఆపిల్ రుచి ని పోలి తీయగా ఉంటుంది. లోపల గింజ ఏమి ఉండదు. పండు లోపల జెల్లీ లాంటి టెక్చర్ గా ఉంటుంది. పండు పై తోలు తీసేసి, లేదా అలానే తినేయచ్చు.ఈత కాయల సువాసన కలిగి ఉంటుంది. తెలుగు లో తున్నిక్కాయ అంటారని విన్నాను.

పెర్సిమోన్ (persimmon fruit) Read More »

Scroll to Top