Intermediate Courses… Guidelines to Students

విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరాలి? ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా? టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో మన విద్యార్ధుల కోసం తెలియజేస్తున్నాం. పదవ తరగతి తరువాత ….
ఇంటర్మీడియట్

సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా మెడికల్ కోర్సులు చేయాలన్నా, ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక కోర్సులు చదవాలన్నా, ఇంటర్మీడియట్‌తోనే మొదలవుతుంది.

ఇంటర్లో ఏయే గ్రూపులు ఉంటాయి? ఏ గ్రూపు చదివితే ఎలాంటి ఫలితం ఉంటుంది? గ్రూపులను ఎలా ఎంచుకోవాలి? ఇంటర్ తర్వాత ఏం చేయాలి?”
గ్రూపు ఎంపికలో విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండేందుకు అందిస్తున్న పూర్తి సమాచారమిది.
• విద్యార్థులు కాస్త తక్కువస్థాయిలోనైనా సాంకేతిక నైపుణ్యం సాధించడానికి ఐటీఐ, దీర్ఘకాలిక సాంకేతిక కోర్సులు చేయాలంటే ఇంటర్ వృత్తి విద్యాకోర్సులు, సాంకేతిక విద్యలో డిప్లొమా కోసం పాలిటెక్నిక్ రంగాలను ఎంచుకోవచ్చు.
• ఉన్నత విద్యలోకి ప్రవేశించేందుకు మాత్రం సాధారణ ఇంటర్మీడియట్ వైపు మొగ్గు చూపుతారు. విద్యారంగానికి ఇది రహదారి లాంటిది.
• ఉన్నత విద్యకు వారధి లాంటి ఇంటర్మీడియట్‌లో గ్రూపును ఎంచుకోవడమే ప్రధానమైన అంశం. ఎందుకంటే ఈ గ్రూపుమీదే మిగిలిన విద్య అంతా ఆధారపడి ఉంటుంది. విద్యార్థిజీవితాన్ని నిర్దేశించే కీలకమైన మలుపు కూడా ఈ కోర్సే. గ్రూపును ఎంచుకోవడంలో తప్పటడుగు ఏ మాత్రం పనికిరాదు. విద్యార్థులు ఇంటర్లో చేరేముందు వివిధ గ్రూపుల గురించి తెలుసుకుని, వారు ఏ రంగంలో రాణించగలరో ముందే ఒక నిర్ధరణకు రావాలి.

విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరేముందు ………….
విద్యార్థి ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు ముందే పూర్తి అవగాహన సంపాదించాలి. అంతకంటే ముందు తన సామర్థ్యాన్ని, తెలివితేటలను అంచనా వేసుకుని గ్రూపును ఎంపిక చేసుకోవాలి. విద్యార్థి తెలివితేటలు, అభిరుచి, సామర్థ్యం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడా ఏ గ్రూపులో చేరాలనే విషయమై అతడికి సలహా ఇవ్వాలి.
ఇంటర్మీడియట్ బోర్డు వివిధ కాంబినేషన్లలో సుమారు 85 గ్రూపులను రూపొందించింది. కానీ ఏడెనిమిది కాంబినేషన్లలో మాత్రమే చాలామంది విద్యార్థులు చేరుతున్నారు. కాలేజీలూ వీటిపైనే దృష్టి సారిస్తున్నాయి.
కొన్ని ముఖ్యమైన గ్రూపులు * ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* బీపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)
* సీఈసీ (కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్)
* ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనమిక్స్, కామర్స్)
* హెచ్ఈసీ (హిస్టరీ, ఎకనమిక్స్, సివిక్స్)
వీటిలో ఏ గ్రూపు ఎంచుకోవాలో నిర్ణయించుకునే ముందు విద్యార్థి వివిధ కోణాల్లో ఆలోచించాలి. ముందుగా ‘తన అభిరుచి, సామర్థ్యం, తెలివితేటలు ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఆ తర్వాత తన లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న గ్రూపును ఎంచుకోవాలి.
ఎంపీసీ ఇంజినీరింగ్ వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తీసుకునే గ్రూపు ఇది. రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకునేవారు;
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఏరోనాటిక్స్, అగ్రికల్చర్/ ఇండస్ట్రియల్ తదితర రంగాల్లో ఇంజినీరింగ్ చేయాలనుకునేవారికి ఎంపీసీ పునాది.
జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో ప్రవేశానికి పరీక్ష (జేఈఈ – మెయిన్) రాసేందుకు ఈ గ్రూపులో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.
బిట్స్‌పిలానీల్లో ప్రవేశానికి జరిగే ‘బిట్‌శాట్’ రాసేందుకు ఎంపీసీ విద్యార్థులే అర్హులు.
ఎంసెట్: ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా విద్యార్థికి నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సులో సీటు వస్తుంది. సుమారు 27 ఇంజినీరింగ్ బ్రాంచ్‌లలో ప్రవేశానికి ఎంసెట్ పునాదిలాంటిది.


బి.ఎస్‌సి. ఇంటర్మీడియట్ తర్వాత బి.ఎస్‌సి.లో చేరాలనుకుంటే మ్యాథ్స్-ఫిజిక్స్-కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-ఎలక్ట్రానిక్స్, మ్యాథ్స్-ఫిజిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-స్టాటిస్టిక్స్-కంప్యూటర్‌సైన్స్, మ్యాథ్స్-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, మ్యాథ్స్-ఫిజిక్స్-జియాలజీ, మ్యాథ్స్-ఎలక్ట్రానిక్స్-జియాలజీ, కెమికల్ టెక్నాలజీ, మర్చంట్ నేవీ, డైరీ టెక్నాలజీ, సుగర్ టెక్నాలజీ, జియాలజీ-ఫిజిక్స్-కెమిస్ట్రీ, బీఎస్సీ ఫోరెన్సిక్…. ఇలా వివిధ రకాల కాంబినేషన్లతో కోర్సులున్నాయి.

బైపీసీ
డాక్టర్‌గా లేదా వైద్యసంబంధిత ఇతర వృత్తులు, ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునేవారు బీపీసీ వైపు మొగ్గు చూపుతారు. అగ్రికల్చరల్ కోర్సులకూ ఈ గ్రూపే ప్రాతిపదిక. ఓపిగ్గా చదవడం, చక్కగా బొమ్మలు వేయడం ఈ గ్రూప్ విద్యార్థులకు ఉండాల్సిన లక్షణాలు. బయోలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఇంటర్మీడియట్ చేస్తే ఉన్నత విద్యావకాశాలకూ కొదవ లేదు. బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, జెనెటిక్స్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఆస్ట్రానమీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫుడ్‌టెక్నాలజీ అండ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్ రేంజర్, జియాలజీ, హార్టికల్చర్, హోంసైన్స్, మాలిక్యులార్ బయాలజీ, ఓషనోగ్రఫీ, ప్లాంట్‌పాథాలజీ తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఈ శతాబ్దపు పరిశోధనా రంగాలుగా పేర్కొనవచ్చు. రానున్న యుగం బయాలజీదే.

వైద్య విభాగంలో AIIMS, JIPMER, MGIMS, BHU లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాలయాల్లో ప్రవేశం కోసం బయాలజీ విద్యార్థులు ఆయా సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇక మన రాష్ట్రంలో ఎంసెట్ (ఇంజినీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష తప్పనిసరి. తద్వారా రాష్ట్రంలోని వైద్యకళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశం పొందవచ్చు. గత అయిదేళ్లతో పోలిస్తే మెడికల్ సీటుకు పోటీ తగ్గింది. బీపీసీ ఆధారిత కోర్సులను ఎంచుకోవడం ఉత్తమం. ఈ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని బయాలజీలో చేరే విషయాన్ని ఆలోచించాలి. మొత్తంమీద వెంటనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేని విద్యార్థులు ఎంపీసీ, బీపీసీలను ఎంచుకోవచ్చు.


ఎంఈసీ, సీఈసీ
సేవారంగం వైపు చూసేవారు, సైన్స్, ఆర్ట్స్ గ్రూపులపై పెద్దగా ఆసక్తి లేనివారు లెక్కలు, గణాంకాలు, కామర్స్ సబ్జెక్టులతో కూడిన ఎంఈసీ; కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్టులున్న సీఈసీల్లో చేరవచ్చు. చార్టెర్డ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రెటరీలు, కమర్షియల్ లాయర్లు, బ్యాంకు మేనేజర్, చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ట్యాక్స్ ఆడిటర్ లాంటి వృత్తుల్లో స్థిరపడాలనుకునేవారు; ఇన్స్యూరెన్స్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు ఈ గ్రూపులను ఎంచుకోవచ్చు.


గణనీయంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం ప్రధానపాత్ర పోషిస్తోంది. దీంతో కామర్స్ విద్యార్థులకు ఎంతో గిరాకీ పెరిగింది. మ్యాథమేటిక్స్, కామర్స్ సబ్జెక్టులు రెండూ అధ్యయనం చేయడం మరింత మెరుగైన ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తుంది. సీఏ, ఐసీడబ్ల్యూఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ రంగాల్లో ఉన్నత విద్యకూ అవకాశం ఉంది. ఈ రంగాలపై గత అయిదారేళ్లుగా ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఇంటర్లో కామర్స్ ఒక సబ్జెక్టుగా గ్రూపులు ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది.


ఆర్ట్స్ గ్రూపులు
పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకునేవారు గతంలో ఆర్ట్స్ గ్రూపుల్లో చేరేవాళ్లు. తర్వాత ఈ గ్రూపులకు ఆదరణ తగ్గింది. అయితే, ఇంజినీరింగ్ కోర్సులు చేసినవారిలో ఎక్కువమంది ఉపాధికి చేరువ కాకపోవడం, ఐటీ రంగానికి కష్టకాలం రావడం లాంటి కారణాలతో మళ్లీ ఆర్ట్స్ గ్రూపుల ప్రాధాన్యం పెరుగుతుంది. కార్పొరేట్ జూనియర్ కళాశాలలూ యూపీఎస్‌సీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్ నుంచే శిక్షణనిస్తూ ఉండటం జరుగుతుంది.

యూపీఎస్‌సీ నిర్వహించే కొన్ని పోటీ పరీక్షల్లో మంచి స్కోర్లు సాధించేందుకు ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ గ్రూపుల్లో చేరతారు. డిగ్రీలో సోషల్ సైన్సెస్ (సోషల్, కల్చరల్, పొలిటికల్, ఎకనమిక్స్ సబ్జెక్టుల్లో) చేరేందుకు కూడా ఈ గ్రూపులు అనుకూలం. విదేశీ భాషల్లో పరిజ్ఞానం సాధించడం ద్వారా ఎన్నెన్నో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. కొరియన్, చైనీస్, స్పానిష్ లాంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారికి అనువాదకులుగా ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉంది.

వృత్తివిద్య(ఇంటర్మీడియట్)
ఉన్నత విద్యకు సాధారణ ఇంటర్మీడియట్ వారధిలాంటిదైతే, ఉపాధికి ఇంటర్మీడియట్ వృత్తి విద్యాకోర్సులు నిచ్చెనల్లాంటివి. పదోతరగతి తర్వాత డాక్టర్, ఇంజినీర్ వృత్తుల్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియట్‌లో బీపీసీ, ఎంపీసీ చదువుతారు. పోటీ పరీక్షలను, కొన్ని రకాల వృత్తులను దృష్టిలో ఉంచుకునే వారు సీఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ లాంటి గ్రూపుల్లో చేరతారు. రానున్న రోజుల్లో ఇంటర్మీడియట్ వృత్తివిద్యాకోర్సులకు మరింత ప్రయోజనాన్ని కల్పించే దిశగా అధికారులు కొత్త రూపునిచ్చారు.ఈ కోర్సులకు అవసరమైన సిలబస్‌ను పూర్తి స్థాయిలో రూపొందించారు. ఇప్పటివరకూ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలే లేని ఈ కోర్సులకు తొలిసారిగా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తున్నారు. రాష్ట్రంలో వృత్తి విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

సీఈసీ ఇంటర్

ఇంటర్‌లో సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు బీకాం రెగ్యులర్, బీకాం కంప్యూటర్స్‌తో పాటు బీబీఏ వంటి కోర్సుల్లో చేరొచ్చు.
 1.  ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి కొంత కష్టమైనా ప్రొఫెషనల్ కోర్సులైన చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కంపెనీ సెక్రటరీ (సీఎస్), సీఎంఏ వంటివి చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.
 2.   ముఖ్యంగా కంపెనీల్లో, వ్యాపార వాణిజ్య రంగాలలో ఉజ్వల అవకాశాలున్న కోర్సు  చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ). ఈ కోర్సును ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉండగా, అన్ని ప్రధాన నగరాల్లో శాఖలు ఉన్నారుు. సీఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్ (ఐపీసీసీ), సీఏ ఫైనల్స్ స్థారుులు ఉంటారుు. ప్రణాళిక ప్రకారం చదివితే నిర్ణీత వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఈ కోర్సు చేసినవారు ట్యాక్స్ కన్సల్టెంట్, ఆడిటర్, సలహాదారు, ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సేవలు అందించవచ్చు. సీఏ చదివినవారు కార్పొరేట్ రంగంలో ప్రవేశించవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ సైతం చేసుకోవచ్చు. 
 3.   సీఈసీ విద్యార్థులకు అనుకూలమైన మరో ప్రొఫెషనల్ కోర్సు.. కంపెనీ సెక్రటరీ (సీఎస్). ఈ కోర్సును ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. కంపెనీ సెక్రటరీ సంస్థ పర్యవేక్షణతో పాటు అన్ని ఆర్థిక వ్యవహాలు చూసుకుంటాడు. అంతర్గత న్యాయ నిపుణుడిగా పనిచేస్తారు. సీఎస్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. త్వరగా ఉద్యోగం లేదా ఉపాధి పొందలంటే చాలామంది కామర్స్ విద్యార్థులు తమ తొలి ప్రాధాన్య కోర్సులుగా సీఏ, సీఎస్‌ను ఎంచుకుంటున్నారు.
 4.   అలాగే సీఈసీ విద్యార్థులు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ) కోర్సులోనూ చేరొచ్చు.  ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్థులకు దీటుగా సీఎంఏలకు అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఈ కోర్సును అందిస్తోంది. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్.. ఇలా మూడు దశల్లో కోర్సు ఉంటుంది.
  ఐటీ రంగంలో కెరీర్ ఎంచుకోవాలకున్నవారికి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌‌స (ఎంసీఏ) సరైన కోర్సుగా పేర్కొనొచ్చు. ఎంసీఏతో సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్, బ్యాంకింగ్, నెట్‌వర్కింగ్, ఐటీ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.  ఈ కోర్సు చేయాలంటే తొలుత డిగ్రీ బీకామ్ కంప్యూటర్స్ లేదా బీసీఏ పూర్తి చేయాలి. తర్వాత ఐసెట్ వంటి ఎంట్రన్‌‌స టెస్ట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఎంసీఏ చేయవచ్చు. సీఈసీ అభ్యర్థులు ఎవర్‌గ్రీన్ కోర్సు అరుున ఎల్‌ఎల్‌బీ కూడా చేయవచ్చు. ఇటీవల కాలంలో నైపుణ్యాలున్న లా అభ్యర్థులకు కార్పొరేట్ రంగంలోనూ అవకాశాలు లభిస్తున్నాయి.

After M.P.C

ఇంజనీరింగ్ vs   డిగ్రీ

పస్తుతం బీటెక్, బ్యాచిలర్ డిగ్రీలో ఏది బెస్ట్ అంటే.. జాబ్ మార్కెట్ కోణంలో బీటెక్‌కే తొలి ప్రాధాన్యం అని చెప్పొచ్చు. బీటెక్‌లో మీరు ఎంపిక చేసుకునే బ్రాంచ్ కూడా కెరీర్ పరంగా కీలకం. తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. బీటెక్‌లో సీఎస్‌ఈ, ఈసీఈ బ్రాంచ్‌ల విద్యార్థులకు జాబ్ మార్కెట్‌లో కొంత ప్రాధాన్యం ఉంటోంది. ఈ బ్రాంచ్‌ల విద్యార్థులు అకడమిక్స్‌కే పరిమితం కాకుండా.. తాజా ట్రెండ్స్‌కు అనుగుణంగా నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. బీటెక్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3-డి డిజైన్ ప్రింటింగ్ తదితర అంశాలపై అవగాహన పొందాలి. ఇలాంటి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. బీటెక్‌లో ఏ బ్రాంచ్‌లో చేరినా ఉద్యోగం పొందడం సులభమే. ఈ విద్యా సంవత్సరంలో బీటెక్‌లో చేరాలనుకుంటే.. సీఎస్‌ఈ లేదా ఈసీఈ బ్రాంచ్‌లను ఎంపిక చేసుకొని.. ఏఐ, ఎంఎల్, ఐఓటీ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే కోర్సు పూర్తి చేసుకునే సమయానికి చక్కటి అవకాశాలు లభిస్తాయి.

 1.  బ్యాచిలర్ డిగ్రీ పరంగా ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మార్గం.. బీఎస్సీ. ప్రస్తుతం బీఎస్సీలోనూ వినూత్న కాంబినేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి జాబ్ ఓరియెంటెడ్ సబ్జెక్టులు బోధిస్తున్నారు. వీటిని పూర్తి చేసి.. ఆ తర్వాత పీజీ స్థాయిలో సంబంధిత స్పెషలైజేషన్ పూర్తి చేస్తే జాబ్ మార్కెట్‌లో ముందంజలో నిలవొచ్చు. ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితులు, ఇండస్ట్రీ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఏ కోర్సు బెస్ట్ అనేది ఎప్పటికప్పుడు మారుతోంది. సంప్రదాయ బీఎస్సీ కోర్సుపై ఆసక్తి ఉంటే ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీపై పట్టు సాధించి.. ఆ తర్వాత పీజీ పూర్తి చేయండి. వాటి ఆధారంగా జియాలజీ, మైనింగ్, రీసెర్చ్ ల్యాబ్స్, ఫార్మా కంపెనీల్లో అవకాశాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
 2. ఏ కోర్సు అయినా తొలుత మీ ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. దానికి అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోండి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సైన్స్, ఇంజనీరింగ్ బ్యాచిలర్ కోర్సులు చేసిన వారికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

కెరీర్ ఆఫ్టర్ 10.. ప్లస్ టు

మెడిసిన్ మధ్యలోనే మానేసి.. సింగర్‌గా మారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారున్నారు.. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో చదువు వదిలేసి.. లాలో చేరి గొప్ప లాయర్లుగా పేరు గడించినవారున్నారు.. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మనలో చాలా మంది టెన్త్ అయ్యాక బైపీసీ కాకుండా ఎంపీసీలో చేరాల్సింది… ఎంపీసీ కాకుండా సీఈసీలో చేరాల్సింది.. హెచ్‌ఈసీ కాకుండా ఎంఈసీలో చేరాల్సింది అని బాధపడుతుంటారు… ఈ కోర్సు కాకుండా ఇంకో కోర్సులో చేరాల్సింది… ఈ జాబ్ కాకుండా మరో జాబ్ కోసం ట్రై చేయాల్సింది అని..! ఎందుకు అలా చేశారు… మీకు నచ్చిన కోర్సులో ఎందుకు చేరలేదు. ఇష్టమైన కెరీర్‌ను ఎందుకు ఎంచుకోలేదు.. అని అడిగితే నూటికి 99 శాతం మంది చెప్పే సమాధానం ఒక్కటే…అదే సరైన గెడైన్స్ లేకపోవడం. సో! టెన్త్, ఇంటర్ పూర్తయ్యాక తీసుకునే నిర్ణయం ఎంతో కీలకం.. అందుకే అడుగేసే ముందే ఆలోచించాలి!!

ఎన్నో కెరీర్లు
10+2 తర్వాత ఐఐటీలు… ఇంజనీరింగ్.. మెడిసిన్… వీటిల్లో చేరకపోతే భవిష్యత్ లేదనే ఆలోచన సరికాదు.. ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు, డాక్టర్లు కానవసరం లేదు. ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, హాస్పిటల్స్ మాత్రమే లేవు. మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్… స్కూల్ డ్రాప్‌అవుట్! ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం డెల్ కంప్యూటర్స్‌ను స్థాపించిన మైకెల్ డెల్… చదువు మధ్యలోనే ఆపేశారు. ఐపాడ్, ఐఫోన్‌లతో టెక్నాలజీ రంగాన్ని ఉర్రూతలూగించిన యాపిల్ కంపెనీ స్థాపకుడు స్టీవ్ జాబ్స్‌ది అరకొర చదువే! కాబట్టి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి టాప్ కాలేజీలు, కోర్సులొక్కటే మార్గంకాదు. ఐఐటీలు, ఇంజనీరింగ్, మెడిసిన్‌లో చేరడమనేది జీవన్మరణ సమస్య ఎంతమాత్రం కాదు. సంప్రదాయ కోర్సులతోపాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఇంటీరియర్ డెకరేషన్, హెల్త్‌కేర్, పారామెడికల్, లాంగ్వేజెస్, అడ్వర్‌టైజింగ్, మైక్రోఫైనాన్స్, ఎడ్యుకేషన్, మీడియా, టెలివిజన్, స్పోర్ట్స్, ట్రావెల్ అండ్ టూరిజం, ఏవియేషన్, కమర్షియల్ పెలైట్, యానిమేషన్, కంపెనీ సెక్రటరీ, క్యాబిన్ క్రూ, హాస్పిటాలిటీ… ఇలా… కెరీర్ ప్రపంచం ఆకాశమంత విశాలంగా ఉంది! అంతరిక్షంలో నక్షత్రాలెన్ని ఉన్నాయో.. అంతకుమించిన అవకాశాలున్నాయ్!! ఆరంభంలోనే ఐదంకెల జీతాలందించే కోర్సులున్నాయి. ప్లేస్‌మెంట్స్‌లో కార్పొరేట్ జాబ్ ఖాయం చేసే కాలేజీలూ ఉన్నాయి. సేవతోపాటు సంపాదన, సం తృప్తిని మిగిల్చే కెరీర్స్ ఉన్నాయి. సృజనాత్మకతకు పదునుపెట్టే కోర్సులకూ కొదవలేదు. స్వయం ఉపాధితో పైకొచ్చే మార్గమూ లేకపోలేదు.

అందుబాటులో ఉన్న కోర్సులు.. ఏ కోర్సులో చేరితే భవిష్యత్‌లో అవకాశాలు బాగుంటాయి? ఏ కెరీర్ ఎంచుకుంటే.. ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటుంది. ఏ కోర్సులో ఎక్కడ చేరాలి. ఆయా కోర్సుల్లో అడ్మిషన్‌కు ఏ పరీక్షలు రాయాలి. వినూత్న కోర్సులందించే ఇన్‌స్టిట్యూట్‌లు.. అరుదైన కెరీర్ అవకాశాలపై కొన్ని రోజుల పాటు సాక్షి కెరీర్స్ విస్తృత సమాచారం అందించనుంది.

ఆఫ్టర్ టెన్త్ఎంపీసీఎంపీసీ అనగానే తల్లిదండ్రులు, విద్యార్థులు చేసే భవిష్యత్తు ఆలోచన.. ఇంజనీరింగ్. వాస్తవానికి ఇంజనీరింగ్ అనేది ఎంపీసీ తర్వాత ఉన్న వంద దారుల్లో ఒక దారి మాత్రమే. డిగ్రీలో బీఎస్సీ చేయొచ్చు.. ఫ్యాషన్ టెక్నాలజీ.. లా.. చార్టర్డ్ అకౌంటెన్సీ.. యానిమేషన్, మీడియా కోర్సులు.. ఉన్నత విద్యకు వీల్లేకుంటే.. తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సివస్తే.. డిప్ల మో కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులతో తక్షణ ఉపాధి, ఉద్యోగావశాలెన్నో.. ఇంజనీరింగ్, లేదా డిగ్రీ తర్వాత సివిల్స్, ఐఎఫ్‌ఎస్, ఐఈఎస్‌లతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్స్, రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు పుష్కలం.

బైపీసీతల్లిదండ్రులు, విద్యార్థుల ఆశలు, ఆశయాలకు రూపం.. బైపీసీ. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ వంటి వైద్య కోర్సులతోపాటు వెటర్నరీ సెన్సైస్ కోర్సులు, అగ్రికల్చర్, ఫార్మసీ, పారామెడికల్… ఇలా ఎన్నో అవకాశాలు బైపీసీ విద్యార్థుల సొంతం. ఆధునిక ప్రపంచ పోకడలు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎక్స్ రే టెక్నాలజీ, రేడియాలజీ, ప్రోస్తటిక్స్, ఆర్థోటిక్స్, డయాలసిస్ వంటి కోర్సులను ముందుకు తెచ్చింది. సంప్రదాయకంగా ఇంటర్ తర్వాత లైఫ్ సెన్సైస్‌లో… బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనిటిక్స్, జెనిటిక్ ఇంజనీరింగ్, బోటనీ, జువాలజీలతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని… పీజీ, పీహెచ్‌డీలతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. బోటనీ, జువాలజీలను ఆఫ్షన్స్‌గా తీసుకొని ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికైనవారెందెరో. బైపీసీ అంటే.. ఎంబీబీఎస్, అగ్రికల్చరల్ కోర్సులేకాదు.. అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి.

సీఈసీఇంటర్‌లో సీఈసీ పూర్తి చేయడం ద్వారా.. సహజంగా అందుబాటులో ఉండే బీకాం, బీబీఏ, బీబీఎంల్లో చేరొచ్చు. వీటి తర్వాత ఎంబీఏ చదివి సంస్థల నిర్వహణలో పాలుపంచుకునే కీలక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మేనేజ్‌మెంట్ నిపుణులుగా ఎదగొచ్చు. మరోవైపు చార్టర్డ్ అకౌంటెంట్, ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ(సీఎస్) వంటి జాబ్ గ్యారెంటీ కోర్సులూ చదవొచ్చు. ఏ కంపెనీకైనా వీరి అవసరం ఉంటుంది. ఇవి కష్టమనుకుంటే.. కాదనుకుంటే.. క్లాట్ రాసి జాతీయస్థాయిలోని ప్రతిష్టాత్మక లా కాలేజీల్లో న్యాయవిద్యను అభ్యసించొచ్చు. అకౌంటింగ్ ప్యాకేజెస్.. కామర్స్ విద్యార్థుల కోసమే. దాంతోపాటు బ్యాంక్ జాబ్స్, షేర్ మార్కెట్ కొలువులు, గ్రూప్-1,2,4వంటి ఉద్యోగాలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి సంప్రదాయ అవకాశాలతోపాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఆర్గనైజేషన్స్, ఫైనాన్షియల్ విభాగాల్లోనూ కామర్స్ అభ్యర్థులు కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

హెచ్‌ఈసీఇంటర్మీడియెట్‌లో హెచ్‌ఈసీ పూర్తిచేసిన అభ్యర్థులు డిగ్రీలో బీఏలో చేరొచ్చు. హెచ్‌ఈసీ విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ కోర్సులు మినహాయించి… యానిమేషన్, ట్రావెల్ అండ్ టూరిజం, అడ్వర్‌టైజింగ్, జర్నలిజం, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి అన్నిరకాల క్రేజీ కోర్సుల్లో చేరిపోవచ్చు. వీటితోపాటు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులూ తెరపైకి వస్తున్నాయి. గ్రూప్స్, సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా నిర్ణయించుకున్న వాళ్లకు హెచ్‌ఈసీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఆఫ్టర్ 10+2…10+2 పూర్తికాగానే ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా కళ్లముందు కనిపించేది బీఎస్సీ/బీకామ్/బీఏ. వందల సంఖ్యలో కాలేజీలు.. వేల సంఖ్యలో సీట్లు. నేటి ఐటీ యుగంలో.. ప్రస్తుత మార్కెట్ ఎకానమీకి తగ్గట్లు కొన్ని ప్రత్యేక స్కిల్స్‌ను మెరుగుపరచుకుంటూ ఈ కోర్సుల్లో ఏది పూర్తిచేసినా.. అవకాశాలకేమీ కొదవలేదు. లా వంటి ప్రొఫెషనల్ కోర్సులతోపాటు రీసెర్చ్‌కూ బాటవేసుకోవచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్బ్యాచిలర్ డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సైన్స్ సబ్జెక్టుల పట్ల ప్రత్యేక ఆసక్తితో రీసెర్చ్ దాకా వెళ్లాలనుకునేవారు నిశ్చింతగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో చేరొచ్చు. అంతేకాదు.. గ్రాడ్యుయేషన్ తర్వాత క్లైమెట్, ఎర్త్ సిస్టమ్ సెన్సైస్, వైల్డ్‌లైఫ్ సెన్సైస్‌లో అరుదైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐతే ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో భారీ జీతాలతో జాబ్స్.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రీటైల్, మెడికల్, హెల్త్‌కేర్, ఫార్మారంగాల్లో అవకాశాలు ఊపందుకోవడంతో.. గత కొన్నేళ్లుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల కంటే ఇంజనీరింగ్, మెడికల్, మెడికల్ అనుబంధ ఫార్మా వంటి కెరీర్స్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)లు సైన్స్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టినా… సాధారణ కాలేజీల్లో సైన్స్ కోర్సులకు పెద్దగా ఆదరణ పెరగలేదు. దాంతో సైన్స్, ఆర్ట్స్ కోర్సులకు పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు సైతం కరిక్యులంలో పాలిమర్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వంటి అనుబంధ అంశాలను చేరుస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు సైన్స్ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేదిశగా ప్రాజెక్టు వర్క్‌లను ప్రవేశపెడుతున్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ఏడు లక్షల వార్షిక ప్యాకేజీ.. ఈ వేతన ప్యాకేజీ ఏ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలోనో క్యాం పస్ ప్లేస్‌మెంట్స్‌లో వచ్చింది కాదు. ఇది బీకామ్ హానర్స్ చదివిన విద్యార్థికి ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఇచ్చిన ఆఫర్! ఇది శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ యూనివర్సిటీ లాంటి కామర్స్ కోర్సులకు పేరుగాంచిన కాలేజీల్లో సాధ్యమైంది. అంటే.. జాబ్ మార్కెట్‌లో కామర్స్ కోర్సులకు కావల్సినంత డిమాండ్ ఉంది. కాకపోతే సబ్జెక్ట్, స్కిల్స్ ఉన్నవాళ్లు మాత్రమే జాబ్ ఆఫర్స్ అందుకుంటున్నారు. సబ్జెక్ట్ ఏదైనా కెరీర్ ఏదైనా రాణిస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని యూనివర్సిటీల్లో, అన్ని కాలేజీల్లో కామర్స్ కోర్సులున్నాయి. సంప్రదాయ బీకామ్ కామర్స్‌తోపాటు మార్కెట్ అవసరాలకు తగ్గట్లు బీకామ్ విత్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బీకామ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ వంటి కోర్సులను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. బీకామ్‌తో చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్ వంటి ఏ ప్రొఫెషనల్ కోర్సును పూర్తిచేసినా వెనక్కు తిరిగి చూసుకునే పనే ఉండదు. ఇవి కాదనుకుంటే కంపెనీ సెక్రటేరియల్ ప్రాక్టీస్, యాక్చూరియల్ సెన్సై స్ వంటి వినూత్న అవకాశాలూ ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ఆర్ట్స్ విభాగంలో ఉన్నన్ని సబ్జెక్టులు వేరే ఏ స్ట్రీమ్‌లోనూ లేవని చెప్పొచ్చు. దేశంలో ఎక్కువమంది చేరేది కూడా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లోనే. కొంతకాలం వరకూ బీఏ అంటే…ఏదో ఒక డిగ్రీ కోసం చేరడమనే అభిప్రాయం ఉండేది. కాని ఇప్పుడు ఎకనామిక్స్, సైకాలజీ వంటి సబ్జెక్టులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా.. ఆర్ట్స్ అభ్యర్థులకు కెరీర్ అవకాశాలు మెరుగవుతున్నాయి. బీఏతోనే ఆగిపోకుండా… ఎంబీఏ, లా, మీడియా, టీచింగ్, హెచ్‌ఆర్, అడ్వర్‌టైజింగ్… విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్‌కు దీటైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ఆకాశంలో ఎగిరే విమానం.. రోడ్డుపై తిరిగే వాహనాలు.. పట్టాలపై పరుగులుపెట్టే రైళ్లు.. సముద్రంలో ప్రయాణించే ఓడలు.. చివరకు నిత్యకృత్యమైన సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లుఅన్నీ ఇంజనీరింగ్ ఆవిష్కరణలే! పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. ఐఐటీలు, నిట్‌లు, ఐఐఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసినవారితోపాటు సబ్జెక్టుపై పట్టున్న ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి అవకాశాలు అనేకం. ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, ఎంసెట్ మార్గాలు. ఈ ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి బ్రాంచ్‌ల్లో దేశవ్యాప్తంగా పది లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లుంటే…ఒక్క మన రాష్ట్రంలోనే 3 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మెడిసిన్తెల్లకోటు, స్టెతస్కోప్.. డాక్టర్ డ్రెస్ కోడ్. ఈ డ్రెస్ కోడ్ లక్షల మంది కల. కానీ నిజం చేసుకోగలిగేది కేవలం 30వేల మందే. దేశంలో ఎంబీబీఎస్ కోర్సుకున్న డిమాండ్‌కు ఇదే నిదర్శనం. సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ కోర్సు ఏదంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అంటే-బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఇంటర్‌లో బైపీసీ తర్వాత మెడిసిన్‌లో చేరడానికి మెడికల్ ఎంట్రన్స్ రాయాలి. మన రాష్ట్రంలో దాదాపు 4500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్న్‌షిప్‌తో కలుపుకొని 5 ఏళ్లకు పైగా సాగే ఎంబీబీఎస్ తర్వాత అవకాశాల గురించి ఆలోచించాల్సిన పనేలేదు. ఈ ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కామన్ ఎంట్ర న్స్ ఎగ్జామ్‌ని ‘నీట్’ నిర్వహించనున్నారు.

ఫార్మసీదేశంలో ఫార్మా రంగం ఉజ్వలంగా దూసుకుపోతోంది. ఔషధ తయారీ కంపెనీలు…బల్క్ డ్రగ్స్ యూనిట్లు.. బహుళజాతీ కంపెనీలు… రాన్‌బాక్సీ, అరబిందో, రెడ్డి ల్యాబ్స్, నాట్కో, దివిల్యాబ్స్-ఇలా అనేక ఫార్మా కంపెనీలు.. రోగాలను సమర్థంగా ఎదుర్కొనే మందుల తయారీపై దృష్టిసారించాయి. దాంతో ఫార్మా నిపుణులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. డిఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మ్‌డి, ఎంఫార్మసీ, ఫార్మసీలో పీహెచ్‌డీ వరకూ విద్యను అభ్యసించవచ్చు. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి కనీస అర్హత: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ.

హెల్త్‌కేర్హెల్త్‌కేర్‌లో భారత్ బాగా వెనుకబడి ఉందనేది అన్ని సూచీల సారాంశం. విస్తరణకు అన్ని విధాల స్కోప్ ఉన్న రంగం హెల్త్‌కేర్. హెల్త్‌కేర్‌లో అనేక విభాగాలు.. పబ్లిక్ హెల్త్, మెంటల్ హెల్త్, యాక్సిడెంట్స్/ట్రామ్, డ్రగ్ అబ్యూస్/డీఅడిక్షన్, హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్ సెంటర్లు, మెడికల్ లేబొరేటరీ సర్వీసెస్‌ల్లో అనేక రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

గ్రేట్ కెరీర్‌కు కేరాఫ్ ఎంపీసీ

జియాలజిస్టుగా విలువైన గనులను కనుక్కోవాలనుందా? ఐఫోన్ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్‌ను మించిన గుర్తింపును కోరుకుంటున్నారా? ప్రపంచంలోనే అపర కుబేరుడిగా కీర్తికెక్కిన బిల్‌గేట్స్‌లా పేరు తెచ్చుకోవాలనుందా? లేదా సివి రామన్‌లా నోబెల్ బహుమతిని పొందాలనుందా? ఈ ప్రశ్నలకు మీ సమాధానం ‘ఎస్’ అయితే మీరు ఇంటర్‌లో ఎంపీసీ గ్రూపును ఎంచుకోవాలి.

పదో తరగతి తర్వాత… ఏంటి? అనే ప్రశ్న ఎదురైతే ఎన్నో కోర్సులు.. ఐటీఐ, పాలిటెక్నిక్, హోటల్ మేనేజ్‌మెంట్, సెట్విన్ కోర్సులు, స్వయం ఉపాధినందించే వివిధ కోర్సులు పదో తరగతి పాసైన విద్యార్థికి స్వాగతం పలుకుతున్నాయి. ఎక్కువ మంది చూపు మాత్రం ఇంటర్మీడియెట్‌లో చేరి ఎంపీసీ గ్రూప్‌ను ఎంచుకోవడం. ఈ గ్రూప్‌కు ఉన్నటువంటి ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మరే గ్రూప్‌కు లేవంటే అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలో ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ను తీసుకున్న విద్యార్థికి ఉండే అవకాశాల విశ్లేషణ..

ఎంపీసీ గ్రూప్ ప్రాధాన్యత:ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనే ఆసక్తి ఉంటే.. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌లో చేరాలి. తద్వారా భవిష్యత్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, మెట్లర్జీ, కంప్యూటర్స్.. ఇలా ఏ బ్రాంచ్‌లో చేరినా రాణించడానికి పునాది ఏర్పడుతుంది. ఇంటర్ ఎంపీసీతో ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, బిట్‌శాట్.. తదితర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాసి.. ప్రతిష్టాత్మక ఐఐటీలతోపాటు బిట్స్ పిలానీ వంటి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో విద్యను అభ్యసించొచ్చు. ఎన్‌డీఏ ద్వారా డిఫెన్స్ రంగంలో ప్రవేశించవచ్చు. ఇంజనీరింగ్ పూర్తయ్యాక బ్రాంచ్‌ను బట్టి ఉద్యోగంలో చేరొచ్చు. లేదంటే.. గేట్ రాసి ఎంటెక్, క్యాట్‌తో ఐఐఎంలలో ఎంబీఏ, జీమ్యాట్‌తో ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించవచ్చు. బహుళజాతి కంపెనీల్లో కీలకమైన ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంటుంది. ఇంజనీరింగ్‌లో సీటు రాకపోయినా, చేరడం ఇష్టంలేకపోయినా… బీఎస్సీలో చేరిపోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, జియాలజీ, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ వంటి సబ్జెక్టులతో బీఎస్సీ పూర్తిచేయడం ద్వారా.. మంచి జాబ్స్ సొంతం చేసుకోవచ్చు. గేట్, సీఎస్‌ఐఆర్-నెట్, జామ్ రాసి మరింత ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేయడం ద్వారా అధ్యాపక వృత్తిలో ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. ఇవేకాకుండా వివిధ యూనివర్సిటీలు అందిస్తోన్న ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో చేరొచ్చు. ఆ తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేసుకొని ప్రొఫెసర్‌గా, రీసెర్చ్ స్కాలర్‌గా ఎదగొచ్చు. ఫ్యాషన్ టెక్నాలజీ, లా, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, హోటల్ మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్‌మెంట్, ఫొటోగ్రఫీ, ఇంటీరియర్ డిజైన్, పెయింటింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ, ప్యాకేజింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, పెలైట్, ఫైర్ ఇంజనీరింగ్ ఇలా అనేక ప్రత్యామ్నాయాలు ఎంపీసీ విద్యార్థుల సొంతం. డిగ్రీ పూర్తయ్యాక సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ:ఇంటర్మీడియెట్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు… ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో చేరొచ్చు. రాష్ట్రంలోని చాలా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా ఆయా వర్సిటీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల ఆధారంగా వీటిలో చేరొచ్చు. ఐదేళ్ల కోర్సు వ్యవధిలో.. మొదటి మూడేళ్లు పూర్తయ్యాక బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ కూడా విద్యార్థుల చేతికందుతుండటం ఈ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల ప్రత్యేకత.

బీఎస్సీ:ఇంటర్ ఎంపీసీ విద్యార్థికి ఇంజనీరింగ్‌లో చేరడానికి వీలుకాకుంటే… తక్షణ ప్రత్యామ్నాయం… బీఎస్సీ! మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ, జియాలజీ, బయోకెమిస్ట్రీ వంటి పలు కాంబినేషన్లు బీఎస్సీలో అందుబాటులో ఉన్నాయి. మూడేళ్ల బీఎస్సీ పూర్తిచేయడం ద్వారా అనేక ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.

ఎంఎస్సీ:రాష్ట్రంలో ఆయా యూనివర్సిటీలు నిర్వహించే పీజీసెట్‌ల ద్వారా ఎంఎస్సీలో అడ్మిషన్ లభిస్తుంది. ఇందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ, జియాలజీ, మెరైన్ జియాలజీ, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ, ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్ వంటి అపార అవకాశాలున్న కోర్సులున్నాయి. ఇవి పూర్తయ్యాక టీచింగ్, లేదా రీసెర్చ్ రంగంవైపునకు వెళ్లొచ్చు. పీహెచ్‌డీ కూడా పూర్తిచేస్తే ఈ రెండు రంగాల్లోనూ ఎవరికీ తీసిపోసి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు.

డీఈడీ, బీఈడీ:ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి ఉంటే.. ఇంటర్ పూర్తికాగానే డైట్‌సెట్ రాసి డీఈడీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. కోర్సు పూర్తై తర్వాత డీఎస్సీ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి వివిధ ప్రాథమిక పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా జాబ్ సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ తర్వాత ఎడ్‌సెట్ రాసి బీఈడీలో చేరి డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేయొచ్చు.

అపార అవకాశాల ‘లా’:ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారింది. ఇదే సందర్భంలో వివిధ కంపెనీలు తమ కార్యాలయాలను ఇతర దేశాల్లో సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. వివిధ ఉత్పత్తుల తయారీ నుంచి పేటెంట్ హక్కుల వరకు ఎన్నో వివాదాలు. ఈ నేపథ్యంలో లా కోర్సులు అభ్యసించిన విద్యార్థులకు బహుముఖ రూపాల్లో అవకాశాలున్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశించాలంటే మన రాష్ట్రంలో లాసెట్ రాయాలి. జాతీయస్థాయిలో పేర్కొన్న లా స్కూల్స్‌లో ప్రవేశం పొందాలంటే జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో మంచి ర్యాంకు సొంతం చేసుకోవాలి. దీని ద్వారా వివిధ స్పెషలైజేషన్లతో లా కోర్సులు అభ్యసించి కెరీర్‌ను సుసంపన్నం చేసుకోవచ్చు. అర్హత: 10+2 లేదా తత్సమానం.

గేట్:గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)… ప్రతిష్టాత్మక ఐఐఎస్‌సీ, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, యూనివర్సిటీలలో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రాజమార్గం. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించడానికి ఇది కీలక మెట్టు. అర్హత: నాలుగేళ్ల ఇంజనీరింగ్, లేదా తత్సమానం.

ఎంబీఏక్యాట్:
ఇంజనీరింగ్+మేనేజ్‌మెంట్… ఇక కార్పొరేట్ ప్రపంచంలో తిరుగుండదు..! కామన్ అడ్మిషన్ టెస్ట్.. క్యాట్‌తో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో ప్రవేశం పొందొచ్చు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ.
వెబ్‌సైట్: www.catiim.in

ఎక్స్‌ఏటీ:ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ-జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్. ఇది మన దేశంలో ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్. ఎక్స్‌ఏటీ ద్వారా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో అడ్మిషన్ పొందొచ్చు. దీంతోపాటు దాదాపు మరో 70కిపైగా బిజినెస్ స్కూల్స్‌లో ఎక్స్‌ఏటీ ద్వారా అడ్మిషన్ లభిస్తుంది.
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, లేదా తత్సమానం
వెబ్‌సైట్: www.xlri.edu

మ్యాట్:మేనేజ్‌మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్-మ్యాట్‌ను ఆల్‌ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. సంవత్సరానికి నాలుగుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 200 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశం పొందొచ్చు.
వెబ్‌సైట్: www.aima-ind.org

ఇవే కాకుండా ఏటీఎంఏ, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ (ఎండీఐ), ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, నిర్మా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు అందించే మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరొచ్చు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వయా ఎంసీఏ:రాష్ట్రంలో ఎంసీఏలో చేరేందుకు మార్గం… ఐసెట్. ఇందులో ర్యాంకు సాధించడం ద్వారా మూడేళ్ల ఎంసీఏ పూర్తిచేసుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా స్థిరపడొచ్చు లేదా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశానికి నిర్వహించే నిమ్‌సెట్ ద్వారా మూడేళ్ల ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలుసివిల్స్:
ఇంటర్ ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్, లేదా బీఎస్సీ (డిగ్రీ) పూర్తికాగానే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరుకావచ్చు. కొన్ని ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్టులు ఆఫ్షన్లుగా కూడా ఉన్నాయి. దాంతోపాటు మ్యాథ్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు దాన్ని కూడా ఆఫ్షన్‌గా తీసుకొని విజయం సాధిస్తున్నారు.

బీఎస్సీ పాస్ కాగానే సివిల్స్‌పై దృష్టి సారించి సర్వీస్ సాధించినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. సివిల్స్ ప్రతిఏటా డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదలవుతుంది. ప్రిలిమ్స్ మేలో, మెయిన్స్ అక్టోబర్-నవంబర్‌లలో నిర్వహిస్తారు. సివిల్స్‌లో విజయం సాధించడం ద్వారా ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్‌తోపాటు పలు సెంట్రల్ సర్వీసుల్లో ఛాలెంజింగ్ ఉద్యోగాలు లభిస్తాయి.
వెబ్‌సైట్: www.upsc.gov.in

ఏపీపీఎస్సీ గ్రూప్స్:మన రాష్ట్రంలో ఇంజనీరింగ్, బీఎస్సీ అభ్యర్థులు పోటీ పడే జాబ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్స్. డిప్యూటీ కలెక్టర్, డీఎస్‌పీ, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, ఆర్‌టీవోతోపాటు మరికొన్ని స్టేట్ సర్వీసు పోస్టులకు గ్రూప్-1 ద్వారా నియామకాలు చేస్తారు. అంతేకాకుండా గ్రూప్-2 ద్వారా డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్, ఎక్సైజ్ ఎస్‌ఐ వంటి పోస్టులను సాధించవచ్చు.
వెబ్‌సైట్: www.apspsc.gov.in

ఐఎఫ్‌ఎస్:ఇంజనీరింగ్ పూర్తిచేసిన వాళ్లతోపాటు బీఎస్సీ సైన్‌‌స అభ్యర్థులు కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్షను యూపీఎస్‌సీ ప్రతిఏటా నిర్వహిస్తోంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో విడుదలవుతుంది. పరీక్ష జూలై మొదటివారంలో నిర్వహిస్తారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికలు పూర్తిచేస్తారు.
వెబ్‌సైట్: www.upsc.gov.in

సీడీఎస్:
యూపీఎస్‌సీ ప్రతిఏటా రెండుసార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తోంది. దీనికి ఇంజనీరింగ్ అభ్యర్థులు హాజరుకావచ్చు. అదేవిధంగా సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్స్)లో కూడా చేరిపోవచ్చు.
వెబ్‌సైట్: www.upsc.gov.in

డిఫెన్స్:ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నావీ, ఇండియన్ ఆర్మీలో… షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు; ఎలక్ట్రికల్, ఏరోనాటికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు; ఇస్రో, డీఆర్‌డీవో, ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, ఎన్‌ఎఫ్‌సీ, డీఆర్‌డీఎల్ వంటి రక్షణ రంగ సంస్థల్లోనూ ఇంజనీర్లకు పలు ఉద్యోగాలు లభిస్తాయి.

జాబ్స్ ఇన్ పీఎస్‌యూ:ఏయిర్ ఇండియా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బీఈఎంఎల్, బీఈఎల్, బీహెచ్‌ఈఎల్, బీపీసీఎల్, ఈసీఐఎల్, ఈఐఎల్, ఎఫ్‌సీఐ, గెయిల్, హెచ్‌ఏఎల్, ఎన్‌హెచ్‌పీసీ, ఓఎన్‌జీసీ, సెయిల్, పవర్ గ్రిడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్స్ లభిస్తున్నాయి.

ఐఈఎస్:ఇంజనీరింగ్ అభ్యర్థులు ప్రతిఏటా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కైవసం చేసుకోవచ్చు. ఐఈఎస్ నోటిఫికేషన్ జనవరి మొదటివారంలో విడుదలవుతుంది. పరీక్ష జూన్‌లో ఉంటుంది.
వెబ్‌సైట్: www.upsc.gov.in

ఇంటర్‌ తర్వాత దారులెన్నో..!

ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్‌ కీలక దశ. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తొలి అడుగులు పడేది ఇక్కడే. ఇటీవలే ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ముగిశాయి. రెండేళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ పూర్తి చేసిన వారిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్‌ వైపు.. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మెడిసిన్‌ వైపు ఆసక్తి చూపుతున్నారు.
Edu news

కామర్స్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ వంటి కోర్సులు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. సదరు కోర్సులో మెరుగ్గా రాణించి మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. చక్కటి కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్‌ల వారీగా భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ..

ఎంపీసీతో..
ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్‌ చదివిన విద్యార్థుల్లో అధిక శాతం మంది ఆలోచన ఇంజనీరింగ్‌(బీఈ/బీటెక్‌)లో చేరడం. బీటెక్‌లో సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ మొదలైన కోర్‌ బ్రాంచ్‌లతోపాటు వినూత్న బ్రాంచ్‌లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల్లో చేరాలంటే.. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌.. లేదా రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష ఎంసెట్‌ రాయాల్సి ఉంటుంది. ప్రయివేట్‌ రంగంలో పేరున్న పలు విద్యాసంస్థలు ప్రత్యేక ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి. ఆయా పరీక్షల్లో సాధించిన ర్యాంకుల ఆధారంగా కోరుకున్న ఇంజనీరింగ్‌ కళాశాల, మెచ్చిన బ్రాంచ్‌లో అడ్మిషన్‌ లభిస్తుంది. ఇంజనీరింగ్‌ తర్వాత ఆన్‌ క్యాంపస్‌/ఆఫ్‌ క్యాంపస్‌ మార్గాల ద్వారా ఉద్యోగ అవకాశాలను దక్కించుకోవచ్చు. ఉన్నత విద్యపరంగా బీటెక్‌ తర్వాత ప్రస్తుతం ఎంటెక్‌/ఎంబీఏ స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్న మరో మార్గం.. బీఎస్సీ. 

బీఎస్సీ:
ఇంజనీరింగ్‌లో కోరుకున్న కాలేజీలో, బ్రాంచ్‌లో ప్రవేశం లభించకుంటే… ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం.. సంప్రదాయ డిగ్రీ కోర్సుగా భావించే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ). బీఎస్సీలోనూ పలు కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌కు సరితూగేలా బీఎస్సీలో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కాంబినేషన్లతో గ్రూప్ సబ్జెక్ట్‌లు ఎంచుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్‌కు చక్కటి ప్రత్యామ్నాయంగా బీఎస్సీని పలువురు విద్యార్థులు ఎంచుకుంటున్నారు.
ఐఐఎస్సీ–బెంగళూరు.. దేశంలోనే పేరున్న విద్యాసంస్థ.. నాలుగేళ్ల వ్యవధి గల బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(రీసెర్చ్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తోంది. దీనిలో బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఎనిమిది సెమిస్టర్‌లుగా జరిగే ఈ కోర్సులో చివరి సెమిస్టర్‌లో పూర్తిగా రీసెర్చ్‌ ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన(కేవీపీవై)/జేఈఈ–మెయిన్‌/జేఈఈ–అడ్వాన్స్‌డ్‌/నీట్‌ –యూజీ ద్వారా ప్రవేశం పొందొచ్చు.


మరో ప్రతిష్టాత్మక సంస్థ.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఈఆర్‌) క్యాంపస్‌ల్లో.. బీఎస్, బీఎస్‌–ఎంఎస్‌(డ్యూయల్‌ డిగ్రీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కిశోర్‌ వైజ్ఞానిక్‌ ప్రోత్సాహన్‌ యోజన(కేవీపీవై)/జేఈఈ–అడ్వాన్స్‌డ్‌/స్టేట్‌ అండ్‌ సెంట్రల్‌ బోర్డ్స్‌ చానల్‌–ఐఐఎస్‌ఈఆర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ద్వారా వీటిలో ప్రవేశించొచ్చు.
ఈ బీఎస్సీ, బీఎస్, బీఎస్‌–ఎంఎస్‌ వంటి కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఉన్నతవిద్య/పరిశోధన కోర్సుల్లో చేరడం ద్వారా శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(సీయూసెట్‌–2020) ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 14 సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు 4 రాష్ట్ర స్థాయి +విశ్వవిద్యాలయాల్లోని ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు/అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

ఉద్యోగ అవకాశాలు
ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకునే వీలుంది. ప్రధానంగా యూపీఎస్సీ–నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) అండ్‌ నేవల్‌ అకాడమీ(ఎన్‌ఏ) ఎగ్జామినేషన్‌ ద్వారా త్రివిధ దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అకడమిక్‌ శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ నుంచి డిగ్రీ పట్టాలు చేతికందుతాయి. శిక్షణ సమయంలో ఆకర్షణీయ స్టైపెండ్‌ కూడా లభిస్తుంది.
రక్షణ దళాల్లో 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ విధానంలోనూ.. ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ విద్యార్థులు అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ(10+2) లెవల్‌(ఎస్‌ఎస్‌సీ–సీహెచ్‌ఎస్‌ఎల్‌) ఎగ్జామినేషన్‌ ద్వారా చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ కొలువులను చేజిక్కించుకోవచ్చు.
ఎన్‌డీఏ:
ఎంపీసీ గ్రూప్ ఉత్తీర్ణతతో.. సుస్థిర కెరీర్, సమున్నత హోదాను అందించేత్రివిధ దళాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకోసం యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) ఎగ్జామినేషన్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. విజేతలు తాము ఎంపిక చేసుకున్న విభాగం(ఇండియన్ ఆర్మీ/ ఎయిర్‌ఫోర్స్/ నేవల్ అకాడమీ)లో శిక్షణ పూర్తి చేసుకోవాలి. శిక్షణ కాలంలో స్టైఫండ్ సైతం లభిస్తుంది. ఆర్మీ కేడెట్స్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ/బీఏ డిగ్రీ; నేవల్, ఎయిర్‌ఫోర్స్ కేడెట్‌గా శిక్షణ పొందిన వారికి బీటెక్‌తోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది.

డిఫెన్స్‌లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్:
ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో మంచి అవకాశం.. ఇండియన్ ఆర్మీలోని 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఎంపీసీ అభ్యర్థుల అకడెమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో ప్రతిభ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు త్రివిధ దళాలలకు చెందిన మిలటరీ అకాడమీలలో శిక్షణ లభిస్తుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే.. బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. వీటికోసం ఇండియన్ ఆర్మీ, నేవీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.

బైపీసీ.. వైద్య విద్యే కాకుండా..బైపీసీ పూర్తిచేసుకున్న విద్యార్థుల్లో చాలామంది లక్ష్యం.. ఎంబీబీఎస్‌/బీడీఎస్‌. కానీ, పోటీపడుతున్న వారితో పోల్చితే అందుబాటులో ఉన్న సీట్లు చాలా తక్కువ. కాబట్టి విద్యార్థులు మెడిసిన్‌కు ప్రత్యామ్నాయ అవకాశాలపైనా దృష్టిసారించాలి.

బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌(బీవీఎస్సీ), బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ తదితర కోర్సుల్లో చేరడం ద్వారా.. బైపీసీ విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు.
ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా ‘ఆయుష్‌’ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. అందువల్ల బీహెచ్‌ఎంఎస్‌(బ్యాచిలర్‌ ఆఫ్‌ హోమియోపతిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీఏఎంఎస్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ యునాని మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీయూఎంఎస్‌); బ్యాచిలర్‌ ఆఫ్‌ నేచురోపతి అండ్‌ యోగిక్‌ సైన్స్‌(బీఎన్‌వైఎస్‌) తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలకు కొదవలేదు.

బీ ఫార్మసీ, ఫార్మా–డి కోర్సులు పూర్తిచేసిన వారికి ఫార్మాస్యూటికల్, క్లినికల్‌ రీసెర్చ్‌ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. వీటి తర్వాత డాక్టోరల్‌ కోర్సులు పూర్తిచేసి రీసెర్చ్‌ లేబొరేటరీల్లో అత్యున్నత హోదాలు అందుకోవచ్చు.

ఇంటర్మీడియెట్‌ బైపీసీ తర్వాత గ్రాడ్యుయేషన్‌ కోర్సులు అనగానే గుర్తుకొచ్చేది.. బీఎస్సీ(బీజెడ్‌సీ–బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ). ప్రస్తుత ఆధునిక అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల గ్రూపు సబ్జెక్టులతో బీఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. బీఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ; న్యూట్రిషన్‌ అండ్‌ డైటీటిక్స్‌), బీఎస్సీ (ఫుడ్‌సైన్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌) వంటి కోర్సులను పలు కళాశాలలు అందిస్తున్నాయి. ఆసక్తిని బట్టి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ తదితర సబ్జెక్టులున్న గ్రూప్‌లను కూడా ఎంపిక చేసుకోవచ్చు.

బైపీసీ ఉత్తీర్ణులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(బీపీటీ), బీఎస్సీ(మెడికల్‌ లేబొరేటరీ టెక్నాలజీ), బీఎస్సీ(నర్సింగ్‌) తదితర కోర్సులు తక్షణ ఉపాధికి మార్గం వేస్తున్నాయి.
బైపీసీ విద్యార్థులు తమ ఆసక్తి మేరకు ఎంచుకున్న కోర్సును అనుసరించి నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌), ఎంసెట్‌ తదితర ప్రవేశ పరీక్షలకు హాజరై అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఫార్మసీ కోర్సులు:బైపీసీ విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఫార్మసీ కోర్సులు. బీఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా-డి), డిప్లొమా ఇన్ ఫార్మసీ.. ఇలా మూడు స్థాయిల కోర్సులకు బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. బీఫార్మసీ, ఫార్మా-డికి ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తి చేసుకున్న వారికి ఫార్మాస్యుటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి.

విభిన్న కోర్సులు: బైపీసీ విద్యార్థులకు మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ, డైరీటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (బీజెడ్‌సీ)తోపాటు బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్,బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సుల్లో చేరే వీలుంది.

మెడికల్, పారామెడికల్: బైపీసీ విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సెన్సైస్ తదితర మెడికల్ కోర్సులనూ ఎంచుకోవచ్చు. వీటితోపాటు.. పారామెడికల్ కోర్సులుగా పేర్కొనే ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్‌ల్యాబ్ టెక్నీషియన్‌లలో డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేస్తే.. ప్రభుత్వ వైద్య విభాగాలతోపాటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా.. నర్సింగ్ కూడా చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం బైపీసీ ఉత్తీర్ణులకు డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కెరీర్ అవకాశాలు: బైపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే.. బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. దీనిద్వారా నాలుగేళ్లపాటు శిక్షణనిచ్చి బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్‌తోపాటు ఇండియన్ ఆర్మీకి చెందిన హాస్పిటల్స్‌లో పర్మనెంట్ హోదాలో ఉద్యోగం ఖరారు చేస్తుంది.

సీఈసీ/ఎంఈసీ….
సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌(సీఈసీ); మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌(ఎంఈసీ) గ్రూపుల్లో ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసిన వారికి ఉన్నత విద్య, ఉపాధి మార్గాలకు కొదవలేదు. అన్ని రంగాలూ ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉండడం, ఆర్థిక వనరుల సక్రమ నిర్వహణపైనే కంపెనీల విజయం ఆధారపడి ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కామర్స్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న బీకామ్, ఎంబీఏ కోర్సులు కూడా ఉన్నత కెరీర్‌కు దారి చూపుతున్నాయి. విద్యార్థులు ఏ కోర్సులో చేరినా.. ఉజ్వల కెరీర్‌ సొంతం కావాలంటే.. నైపుణ్యాలను పెంచుకోవాలి

సీఏ, సీఎస్, సీఎంఏ: కామర్స్‌ విభాగంలో ప్రొఫెషనల్‌ కోర్సులు.. చార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్‌), కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ(సీఎంఏ). ఇతర గ్రూపుల వారూ ఈ కోర్సుల్లో చేరొచ్చు. సీఈసీ, ఎంఈసీ గ్రూపుల విద్యార్థులకు ఈ కోర్సులు మరింత అనుకూలమనే అభిప్రాయం ఉంది. ప్రతి కోర్సులోనూ ఉండే మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్‌ సంస్థల్లో అకౌంటింగ్, ఫైనాన్స్, జనరల్‌ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఆఫీసర్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభించొచ్చు.

ఇంటర్‌ సీఈసీ/ఎంఈసీ విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో బీకామ్‌ కోర్సు అందుబాటులో ఉంటుంది. బీకామ్‌(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) వంటి కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఉన్నతవిద్య/ఉద్యోగం పరంగా మంచి అవకాశాలుంటాయి.

 • బీకాం: ఉన్నత విద్య పరంగా సీఈసీ విద్యార్థులకు మొదట గుర్తొచ్చేది బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకామ్). కామర్స్, అకౌంటింగ్ వంటి కాంబినేషన్లతోపాటు జాబ్ మార్కెట్ అవకాశాలకు తగ్గట్లు.. ఈ-కామర్స్, టాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ వంటి విభిన్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
 • పొఫెషనల్ కోర్సులు: సీఈసీ విద్యార్థులు కామర్స్ విభాగంలో ప్రొఫెషనల్ కోర్సులుగా పేర్కొనే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కాస్ట్ అకౌంటెన్సీ(సీఎంఎస్), కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని పూర్తి చేయడం ద్వారా కార్పొరేట్ కొలువులు ఖాయం చేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగా ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సులు, ఎంకామ్ వంటి పీజీ కోర్సులూ చేసే అవకాశముంది.


ఉద్యోగావకాశాలు: కామర్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసిన వారికి తక్షణం ఉపాధి కల్పించే అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ట్యాలీ, వింగ్స్, ఫోకస్, పీచ్‌ట్రీ వంటి అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల సర్టిఫికెట్స్‌ సొంతం చేసుకుంటే.. సంస్థల్లో జూనియర్‌ స్థాయిలో అకౌంటెంట్స్‌గా కొలువు సాధించే అవకాశం ఉంది.

జీఎస్‌టీతో జాబ్స్: ప్రస్తుతం జీఎస్‌టీ అమలవుతున్న నేపథ్యంలో కామర్స్ విద్యార్థులకు ఇది కూడా కలిసొచ్చే అంశంగా మారుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఆయా కంపెనీల్లో జీఎస్‌టీ కన్సల్టెంట్స్‌గా వ్యవహరించొచ్చు.

హెచ్‌ఈసీ.. పోటీ పరీక్షలకు మేటి
హెచ్‌ఈసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య పరంగా బీఏలో చేరొచ్చు. బీఏలో చదివే సబ్జెక్టులపై పట్టుసాధించడం ద్వారా పలు పోటీ పరీక్షల్లో ముందుండేందుకు ఆస్కారం లభిస్తుంది. అత్యున్నత సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్-4 వరకూ.. అన్ని పోటీ పరీక్షల్లోనూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర సబ్జెక్ట్‌లు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని హెచ్‌ఈసీ విద్యార్థులు ఇంటర్మీడియెట్‌తోపాటు బీఏ స్థాయిలోనూ చదువుతారు. కాబట్టి హెచ్‌ఈసీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిగతా అభ్యర్థులతో పోల్చితే కొంత ముందంజలో నిలుస్తారని చెప్పొచ్చు.

 • బీఏలో ఆధునికత: బీఏ కోర్సు కూడా ఆధునికత సంతరించుకుంటోంది. బీఏలో మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో చేరడం ద్వారా మీడియా, మార్కెటింగ్ విభాగాల్లో ఉపాధి పొందొచ్చు.

సీబీసీఎస్‌.. భిన్న నైపుణ్యాలు
ప్రస్తుతం ఇంటర్మీడియెట్‌ అర్హతగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు.. తాము ప్రొఫెషనల్‌ కోర్సుల విద్యార్థులకు దీటుగా రాణించలేమని ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే.. యూజీసీ అమల్లోకి తెచ్చిన సీబీసీఎస్‌(చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌) విధానం ప్రకారం.. బ్యాచిలర్‌ డిగ్రీలో ఏదైనా ఒక గ్రూప్‌లో చేరిన అభ్యర్థులు తమ మేజర్‌ సబ్జెక్ట్‌తోపాటు అందుబాటులో ఉన్న మైనర్‌ సబ్జెక్ట్‌లను కూడా చదవొచ్చు. తద్వారా జాబ్‌ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు అందిపుచ్చుకోవచ్చు. మైనర్‌ సబ్జెక్టులను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలి. కారణం.. వీటికి కూడా క్రెడిట్స్‌ ఇచ్చే విధానం అమల్లో ఉంది. కేవలం మార్కెట్‌ డిమాండ్‌ కోణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆసక్తి లేకున్నా సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటే వాటితో రాణించడం కష్టమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ప్రస్తుతం సంప్రదాయక డిగ్రీ కోర్సుల్లోనే పలు వినూత్న కాంబినేషన్లతో గ్రూప్‌ సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంచుకునే క్రమంలో భవిష్యత్తు అవకాశాలను బేరీజు వేసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.

ఇంటర్‌తో ఇంటిగ్రేటెడ్‌ పీజీ!

ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఇంటిగ్రేటెడ్ పీజీ).. ఇటీవల కాలంలోవిస్తృతంగా వినిపిస్తున్న మాట! సంప్రదాయ విభాగాల నుంచి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల వరకు.. పలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటివైపు దృష్టిసారించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.
After Interఇంటర్‌తోనే పీజీలో చేరేందుకు వీలుండటమే అందుకు కారణం! ఇంటర్ పరీక్షలు పూర్తయి.. ఉన్నత విద్య దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లపై విశ్లేషణ...
ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ :ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో చేరి.. పీజీ సర్టిఫికెట్‌తో బయటికి వచ్చే అవకాశం కల్పించే ప్రోగ్రామ్‌లు.. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్. వాస్తవానికి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాలని 2008లోనే జాతీయ స్థాయిలో నిర్ణయించారు. క్రమేణా వీటిని అందిస్తున్న వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అమల్లోకి వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ.. పీజీ స్థాయిలో కొత్త సబ్జెక్ట్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు.
అర్హత… ఇంటర్ :
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులతో విద్యార్థులకు ప్రధాన ప్రయోజనం.. ఇంటర్మీడియెట్‌తోనే పీజీలో ప్రవేశం పొందే అవకాశం ఉండటం. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల వల్ల విద్యార్థులకు కలిగే మరో ఉపయోగం… సమయం ఆదా అవడం. ఉదాహరణకు టెక్నికల్ కోర్సుల పరంగా ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు. అదే సంప్రదాయ విధానంలో.. బీటెక్ నాలుగేళ్లు, ఆ తర్వాత ఎంటెక్‌కు మరో రెండేళ్లు చదవాలి. అంటే.. రెగ్యులర్ విధానంలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేయాలంటే ఆరేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ ద్వారా ఐదేళ్లలోనే అటు బీటెక్ పట్టాతోపాటు ఇటు ఎంటెక్ సర్టిఫికెట్ కూడా చేతికి అందుతుంది. ఎంతో విలువైన ఒక ఏడాది సమయం కలిసొస్తుంది. ఇది వారు తమ కెరీర్ పరంగా ముందంజలో నిలిచేందుకు అవకాశం కల్పిస్తుంది.
రెండు డిగ్రీలు :
అయిదేళ్ల వ్యవధి ఉండే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల్లో అడుగుపెట్టిన విద్యార్థులు.. తొలి మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్లు పీజీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించాలి. తొలి మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదివిన విద్యార్థులు.. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, అయిదేళ్ల తర్వాత పీజీ సర్టిఫికెట్ లభిస్తుంది. మూడేళ్ల తర్వాత పీజీ ప్రోగ్రామ్‌లో కొనసాగడం ఇష్టం లేకపోతే.. బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ అందుకోవచ్చు.
బీటెక్+ఎంబీఏ :
ప్రస్తుతం మన దేశంలో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల పరంగా మేనేజ్‌మెంట్ కోర్సులు ముందంజలో నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్ పూర్తికాగానే.. ఎంబీఏ వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే పలు ఇన్‌స్టిట్యూట్‌లు, బీస్కూల్స్‌లో బీటెక్+ఎంబీఏ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుట్టాయి. ఫలితంగా విద్యార్థులకు ఒకవైపు టెక్నికల్ స్కిల్స్, మరోవైపు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు రెండూ లభిస్తున్నాయి.
సైన్స్ కోర్సులు :
సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలు.. సైన్స్ విభాగంలో.. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ+ఎంఎస్సీ వంటి ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా విద్యార్థులకు ఐ.ఎమ్మెస్సీ పేరుతో సర్టిఫికెట్ లభిస్తోంది. ఈ విధానంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు.. సదరు యూనివర్సిటీలోనే పీహెచ్‌డీ ప్రవేశంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ విధానం అమలవుతోంది.
సోషల్ సెన్సైస్ :
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల పరంగా క్రమేణా క్రేజ్ పెరుగుతున్న మరో విభాగం.. సోషల్ సెన్సైస్. సంప్రదాయ బీఏ కోర్సుల ఔత్సాహికులు.. భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. టిస్, జేఎన్‌యూ వంటి ప్రముఖ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు.. ఇంటిగ్రేటెడ్ ఎంఏ పేరుతో పలు ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో ఎంఏ స్థాయిలో సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డెవలప్‌మెంట్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందిస్తున్నాయి.
అయిదేళ్ల ‘లా’ కోర్సు :
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు కెరీర్ పరంగా చక్కటి బాట వేస్తున్న మరో కోర్సు.. అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ. ఇంటర్మీడియెట్ అర్హతతో లాసెట్, క్లాట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయశాస్త్ర పట్టా చేతికందుతుంది. ఇటీవల కాలంలో విద్యార్థుల వైపు నుంచి కూడా ఈ కోర్సుల పట్ల ఆదరణ పెరుగుతోంది.
ఐఐటీలు, ఐఐఎంల్లోనూ..
టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అంతర్జాతీయంగా మంచి పేరున్న ఐఐటీలు, ఐఐఎంలు కూడా పలు ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి.
 • ఐఐటీ-చెన్నై 2006లోనే ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
 • ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
 • ఐఐటీ-కాన్పూర్, రూర్కీలు కూడా ఈ తరహా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
 • ఐఐఎం-ఇండోర్ కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ పేరుతో ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది.
 • సైన్స్ కోర్సులకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఐఐఎస్‌ఈఆర్‌ల్లో సైతం బీఎస్+ఎంఎస్ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది.
లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్..లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్‌లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఆయా లాంగ్వేజ్ కోర్సుల పరంగా ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలు ముందంజలో నిలుస్తున్నాయని చెప్పొచ్చు.
ప్రముఖ యూనివర్సిటీలు :
 • సెంట్రల్ యూనివర్సిటీలు
 • ఐఐటీ-ఖరగ్‌పూర్, చెన్నై, రూర్కీ
 • ఐఐఎం-ఇండోర్
 • ఢిల్లీ యూనివర్సిటీ
 • బిట్స్-పిలానీ
 • ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ
 • నేషనల్ లా యూనివర్సిటీస్
 • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
ఎన్నో ప్రయోజనాలు..
ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్‌తో విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే వారు పీజీ స్థాయిలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్లకు సంబంధించిన కోర్సులను చదివే వెసులుబాటు లభిస్తుంది. అలాగే ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తే.. బ్యాచిలర్ స్థాయి నుంచే విద్యార్థుల్లో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ పెరుగుతుంది.
మరికొన్ని కోర్సులు….
ఇంటర్‌ తర్వాత లా, పర్యాటకం, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌/స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్‌ అండ్‌ డైటీటిక్స్, ఫ్యాషన్‌ డిజైన్‌/టెక్నాలజీ, మాంటిస్సోరి టీచింగ్, లైబ్రరీ సైన్సెస్, ఇంటీరియర్‌ డిజైనింగ్, హోంసైన్స్, ఫారెన్‌ లాంగ్వేజెస్, మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లయ్‌చైన్‌ మేనేజ్‌మెంట్, హోటల్‌ మేనేజ్‌మెంట్,ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, ఫైన్‌ఆర్ట్స్‌ తదితర విభాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఆసక్తి, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌ కెరీర్‌ అవకాశాలు తదితరాలను పరిగణనలోకి తీసుకొని కోర్సు ఎంపికపై నిర్ణయం తీసుకోవాలి.
ఆసక్తికి అనుగుణంగా కోర్సు…
ఇంటర్మీడియెట్‌ తర్వాత విద్యార్థులు తమ గ్రూపులకు అనుగుణంగా పలు బ్యాచిలర్‌ కోర్సుల్లో చేరొచ్చు. ఎంపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో చేరి మంచి అవకాశాలు అందుకోవచ్చు. ఆసక్తి ఉంటే రీసెర్చ్‌ దిశగా అడుగులు వేయొచ్చు. బైపీసీ అభ్యర్థులు మెడికల్‌ కోర్సుల్లో చేరితే వైద్య రంగంలో స్థిరపడొచ్చు. టాప్‌ కాలేజీలో, నచ్చిన బ్రాంచిలో సీటు సాధించాలంటే.. ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలి. ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా జేఈఈ, నీట్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో సివిల్‌ సర్వీసెస్‌తోపాటు రాష్ట్ర స్థాయి గ్రూప్స్‌ తదితర పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటొచ్చు. ఎంచుకునే కోర్సు ఏదైనా కమ్యూనికేషన్‌ స్కిల్స్, అనలిటికల్‌ నైపుణ్యాలు పెంచుకుంటే మంచి కెరీర్‌ సొంతం అవుతుంది.

‘లా’: హెచ్‌ఈసీ విద్యార్థులకు అందుబాటు ఉన్న ముఖ్య కోర్సు.. లా. జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్, రాష్ట్ర స్థాయిలో జరిపే లాసెట్ ద్వారా అయిదేళ్ల బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. లా కోర్సులో కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లా తదితర కొత్త సబ్జెక్టులు ప్రవేశపెడుతున్నారు. ఆయా సబ్జెక్టుల అధ్యయనం ద్వారా ‘లా’ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు.. న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా.. కార్పొరేట్ కొలువులు సైతం సొంతం చేసుకునే వీలుంది.