కరోనా సెకండ్‌ వేవ్‌

Difference Between Corona First Wave Second Wave - Sakshi

ఫస్ట్‌ వేవ్‌లో కరోనా పట్ల విపరీతమైన భయం ఉండేది. దానికి తోడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు పూర్తిగా అప్రమత్తతతో ఉన్నారు. ఈ రెండు అంశాలు ఉన్నప్పటికీ… అప్పటివరకు కరోనా ఇన్ఫెక్షన్‌కి ఎవరికీ రెసిస్టెన్స్‌ లేకపోవడం తో లాక్‌డౌన్‌ తర్వాత, అప్పటి పాండమిక్‌ విపరీతంగా సాగింది. అయితే మరణాల సంఖ్య మొదట్లో 3 శాతం ఉండగా పోనుపోను మరణాల సంఖ్య తగ్గుతూ 1.5 శాతానికి వచ్చింది. అయితే ఇప్పటి తాజాపరిస్థితిలో ఫస్ట్‌వేవ్‌లో ఉన్న భయం రెండవ వేవ్‌ నాటికి ప్రజల్లో లేదు. అనేక మందికి కరోనా వచ్చి తగ్గిపోవడంతో అదే విధంగా తమకు కూడా తగ్గిపోయే అవకాశం ఉందనీ, ఒకసారి తగ్గిపోయినట్లయితే ఇక అది రెండోసారి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ప్రజల భావన. దీంతో కోవిడ్‌ పట్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు కొంత మేరకు ప్రజలు గాలికొదిలేసినట్లుగా కనబడుతోంది. దాంతో సెకండ్‌ వేవ్‌లో చాలా ఎక్కువ మందికి చాలా తక్కువ సమయంలో వ్యాధి వస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మొదటిసారి 10 వేల కేసులు నుండి 80 వేల కేసులు దాకా రావటానికి 84 రోజులు పట్టినట్లయితే ఈసారి అది 42 రోజుల్లోనే రావటం చూస్తున్నాం. ఇంతేకాకుండా రెండో వేవ్‌లో యుక్తవయస్కులూ, పిల్లలు కూడా కొంచెం ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడటం కనిపిస్తోంది. 

దీనికి రెండు ప్రధానమైన కారణాలున్నాయి. మొదటిది… డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం వైరస్‌ రూపాంతరం చెందినప్పుడు ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందగలిగిన వేరియంట్స్‌ బలపడే అవకాశం ఉంటుంది. ఇది అన్ని వైరస్‌ వ్యాధుల్లోనూ కనబడుతుంటుంది. కాబట్టి కరోనా కూడా పోను పోను ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్స్‌ గా మారే అవకాశం ఉంటుంది. బ్రిటిష్‌ వేరియంట్‌ దీనికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో కనబడుతున్న డబల్‌ మ్యుటేషన్‌ వైరస్‌ కూడా ఇదే విధంగా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

ఇక రెండవ కారణం మానవ ప్రవర్తనకి సంబంధించింది. పాండమిక్‌ మొదట్లో ఉన్న భయం ఈ రెండో వేవ్‌ నాటికి లేదు. కాబట్టి ఎక్కువమంది కోవిడ్‌ కి సరైన మార్గదర్శక నియమాలు పాటించడంలేదు. మాస్క్‌ ధరించడం లేదు సరికదా ఫిజికల్‌ డిస్టెన్స్‌ కూడా పాటించడం లేదు. కొంతమేరకు పాండమిక్‌ ఫాటిగ్‌ అనేది ఇందుకు కారణం. పాండమిక్‌ ఫాటిగ్‌ అంటే మనం తీసుకునే జాగ్రత్తలు పోను పోను తీసుకోలేని పరిస్థితి వస్తుంది. జాగ్రత్తల గురించి ఎవరు చెప్పినా వినటానికి కూడా చిరాకు వస్తుంది. ఇంకెంతకాలం ఈ జాగ్రత్తలు తీసుకుంటాం అన్న భావన అందరిలోనూ వచ్చేస్తుంది. లాక్‌ డౌన్‌ విధించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండవు. ఒకసారి వ్యాధి వచ్చి తగ్గిపోయిన వాళ్లు, వారితో పాటు అప్పటికే టీకా తీసుకొని ఉన్నవాళ్లు పెద్దగా జాగ్రత్తలు తీసుకోరు. వాళ్లను చూసి మిగతావాళ్లు కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల రెండవ తరంగంలో వ్యాధి మరింత ఉధృతంగా వ్యాప్తి చెందే అవకాశం కనబడుతోంది. ఈ కారణాలు మాత్రమే కాకుండా మనకి తెలియని కారణాలు అనేకమైనవి ఉండవచ్చు అనేవి నిపుణుల అభిప్రాయం.

వ్యాక్సిన్‌ తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత అంటే మొదటి డోస్‌ వేసుకున్న తర్వాత సుమారు గా 45 నుంచి 50 రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి కోవిడ్‌ నుండి రక్షణ కలిగే అవకాశం ఉంటుంది. అంటే వ్యాక్సిన్‌ ఇవాళ వేసుకున్నప్పటికీ… సుమారు రెండు నెలల తర్వాత మాత్రమే పూర్తి రక్షణ లభించే అవకాశం ఉంది. అయితే ఈ సెకండ్‌ వేవ మొదలయ్యే సమయానికి భారతదేశంలో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే టీకా సంపూర్ణంగా ఇచ్చారు. అంటే పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు కేవలం 1 నుంచి 2 శాతమే కాబట్టి… వారిని మినహాయించి మిగతావారందరి విషయంలో వారు మొదటిదో, రెండోదో డోస్‌ తీసుకున్నా… దాని ప్రభావం పూర్తిగా అమల్లోకి ఇంకా వచ్చి ఉండనందున దాని పనితీరు ప్రభావపూర్వకంగా ఉండే అవకాశం తక్కువ. అయితే దాంతో మరో ప్రయోజనం మాత్రం ఉంది. సెకండ్‌ వేవ్‌ ఎక్కువకాలం ఉండకుండా వ్యాక్సిన్‌ మనల్ని కాపాడే అవకాశం ఉంటుంది. అంతేకాదు… మూడవ వేవ్‌ రాకుండా కూడా వ్యాక్సిన్‌ మనల్ని రక్షించే అవకాశం ఉంది.

రెండవ వేవ్‌లో వ్యాక్సిన్‌ ఇంకొక రకమైన మార్పు కూడా తీసుకొస్తోంది. ‘పెల్జ్‌ మెన్‌ ఎఫెక్ట్‌’ అంటే ఒక వ్యాధికి సంబంధించిన రక్షణ మనకి వస్తుంది అని తెలియగానే మనం తీసుకునే నివారణ చర్యలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది కోవిడ్‌ వ్యాక్సిన్‌ సందర్భంగా మనం చూస్తున్నాం. అనేకమంది కోవిడ్‌ వ్యాక్సిన్‌కి వెళ్లగానే కోవిడ్‌ నిబంధనలను గాలికి వదిలేస్తున్న సంగతి మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కోవిడ్‌ వాక్సినేషన్‌ సెంటర్‌కి వెళ్లి అక్కడ అ జబ్బు తెచ్చుకుంటున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. దీని ఉద్దేశం వ్యాక్సింగ్‌ చేయించుకో వద్దని కాదు. వ్యాక్సిన్‌ మాత్రమే మనల్ని కాపాడుతుంది. అయితే వ్యాక్సిన్‌ కోసం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా కోవిడ్‌ నివారణ చర్యలు పాటించాల్సిందే. వాక్సిన్‌ అయిపోయిన తర్వాత రెండు నెలల పాటు కూడా మనం తీసుకోవలసిన జాగ్రత్తలు పూర్తిస్థాయిలో తీసుకోవాల్సిందే. దాదాపు ఏడాది నుంచి అస్సలు బయటకు రాని వాళ్ళు కూడా వ్యాక్సిన్‌ కోసం బయటకు వచ్చి ఆ సమయంలో మాస్క్‌ సరిగ్గా ధరించక జబ్బు తెచ్చుకుంటున్న దృష్టాంతాలు మనం చూస్తున్నాం.

ఇక చికిత్స విషయానికి వస్తే… సెకండ్‌ వేవ్‌లో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొదటి వేవ్‌లో మాదిరిగానే ఆక్సిజన్, స్టెరాయిడ్స్, రెమ్డెసివిర్, హెపారిన్‌లు… కోవిడ్‌ చికిత్సలో ప్రధాన భూమిక ని నిర్వహిస్తాయి. అయితే కొత్తగా వస్తున్న బారిసిటనిబ్, మోల్నుపిరావిర్, కోవిడ్‌ సింథటిక్‌ యాంటీబాడీస్, ఇంటర్ఫెరాన్‌లు కోవిడ్‌ చికిత్సను మరింత ఆధునీకరించే అవకాశం ఉంది.

ఇప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
పోయిన సంవత్సరం ఫస్ట్‌ వేవ్‌ సమయంలో తీసుకున్న జాగ్రత్తల కంటే మనం ఇప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పోయిన సంవత్సరం మాస్క్‌ పెట్టుకుంటే మనకి ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం తక్కువ ఉండేది. ఇప్పుడు మాస్క్‌ ఖచ్చితంగా సరిగ్గా పెట్టుకుంటే తప్ప మనకి ఇన్ఫెక్షన్‌ వచ్చే రిస్కు తగ్గడం లేదు. అంటే మాస్కు పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆ మాస్క్‌ ముక్కు పైకి ఉండేటట్లు చూసుకోవడం, ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే వరకూ మాస్క్‌ కంపల్సరీగా ధరించటం, కుటుంబ సభ్యులు కాని వారితో మూసి ఉన్న గదుల్లో ఉన్నప్పుడు అసలు మాస్కు తీయకుండా ఉండటం చాలా అవసరం.

గత ఏడాది లాక్‌ డౌన్‌ పెట్టినప్పుడు కోవిడ్‌ ని ఎదుర్కోవడానికి మనదేశం సన్నధ్ధం కాలేదు. అప్పుడు లాక్‌డౌన్‌ సహాయంతో మనం వ్యాధిని కొన్ని రోజులు వాయిదా వేసుకుని, ఈలోపల మన ఆక్సిజన్‌ ఫెసిలిటీ, మన వెంటిలేటర్స్, మరియూ మన ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచుకున్నాం. అయితే ఒకసారి మన ఆసుపత్రులూ, సౌకర్యాలూ సమకూర్చుకున్న తర్వాత లాక్‌డౌన్‌ వల్ల స్వల్పకాలిక ప్రయోజనాలు తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండవు. ప్రజలు తాము తీసుకోవాల్సిన కోవిడ్‌ ప్రమాణాలు, నియమనిబంధనలు తూ.చ. తప్పకుండా పాటిస్తే లాక్‌ డౌన్‌ మళ్లీ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. లేనిపక్షంలో లాక్‌ డౌన్‌ లేదా కఠిన నిబంధనలు తప్పనిసరి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉందని గ్రహించి… ఆ మేరకు జాగ్రత్తలూ, కోవిడ్‌ నియమనిబంధనలూ, ఇతర సూచనలూ తప్పక పాటించాలి

పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను

Natural Foods to Boost your Kids Immunity - Sakshi

పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది.

నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్‌ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది.

నట్స్‌: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా తయారవుతారు. వారికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. 

క్యారెట్లు: పిల్లలకు విటమిన్‌ ఎ, జింక్‌ సమద్ధిగా లభించాలంటే వారికి నిత్యం క్యారెట్లను తినిపించాలి. వీటితో కంటి చూపు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. 

ఫేషియల్‌ పెరాలసిస్‌

Facial Paralysis: Causes Symptoms Diagnosis - Sakshi

ముఖంలో ఒక పక్క పక్షవాతం వచ్చినట్లుగా వాలిపోయే పరిస్థితే ఫేషియల్‌ పెరాలసిస్‌. పక్షవాతంలో కనిపించే లక్షణాలైన దేహంలోని ఒక పక్క ఉండే భాగాలు అచేతనంగా మారిపోయినట్లే…. కొందరికి కేవలం ముఖం వరకే ఒక భాగం చచ్చుబడినట్లుగా అయిపోతుంది. దీన్నే సాధారణ భాషలో ‘ఫేషియల్‌ పెరాలసిస్‌’ అనీ, వైద్యపరభాషలో ‘బెల్స్‌పాల్సీ’ అని అంటారు.  

ఇది చాలా మందిలో కనిపించే సాధారణ  జబ్బే. మన మెదడునుంచి బయల్దేరిన వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అవి పుర్రె భాగం నుంచి బయటకు వస్తాయి కాబట్టి వాటిని క్రేనియల్‌ నర్వ్స్‌ అంటారు. ఇందులో ఏడవ నరం దెబ్బతినడం వల్ల ఒకవైపున ముఖం కండరాలు పనిచేయవు. దీనివల్ల ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎక్కువగా కనిపిస్తుంది. 

ఇది కూడా హెర్పిస్‌ సింప్లెక్స్‌ లాంటి ఏదైనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చాక, ఆ పరిణామం వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్‌ ఫేషియల్‌ నర్వ్‌ అనే ముఖానికి సంబంధించిన నరాన్ని దెబ్బతీస్తాయి. దాంతో ఆ నరం వాపు వచ్చి, అది అనుసంధానం చేసే ముఖ భాగాలు చచ్చుబడిపోతాయి. 

లక్షణాలు : మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తుంటే ఒకవైపు నుంచే సమర్థంగా పుక్కిలించగలగడం… ఫలితంగా నోటికి ఒకవైపు నుంచే నీళ్లు చిమ్మినట్లుగా బయటకు రావడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్సగానూ ప్రెడ్నిసలోన్‌ వంటి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేస్తారు. ఇది కేవలం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. పూర్తిగా తగ్గిపోయే ఈ సమస్యతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు.  

చిలగడదుంప

Eat Sweet Potato With Skin - Sakshi

చిలగడదుంప పొట్టుతో సహా తినడం మేలు

సాధారణంగా చిలగడదుంప తినేవారు, దాన్ని ఉడకబెట్టిగానీ లేదా కాల్చిగానీ తింటుంటారు. ఇలా ఉడకబెట్టడం/ కాల్చడం చేశాక తినేటప్పుడు దానిపైన పింక్‌ రంగులో కనిపించే పొట్టును ఒలిచి తింటుంటారు. కానీ చిలగడదుంప పైన ఉండే పొట్టులో కెరటినాయిడ్స్‌ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నోరు, ఫ్యారింగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి బాగా తోడ్పడతాయి.

వాటితోపాటు ఇందులోనే ఉండే బీటా కెరోటిన్‌ అనే మరో పోషకం ఈసోఫేగల్‌ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందున ఈ పింక్‌ రంగులో ఉండే పొట్టును ఒలిచిపారేయకుండా తినేయండి.

హెయిర్‌ ఫాల్‌ నివారణ కోసం చికిత్సలు

What is the latest treatment for hair loss - Sakshi

జుట్టు రాలడం నెమ్మదిగా దిండు మీద ఒకటి రెండు వెంట్రుకలతో మొదలవుతుంది. తర్వాత వేగం పుంజుకుంటుంది. ఇల్లూ ఒళ్లూ ఎక్కడచూసినా జుట్టే(హెయిర్ లాస్) కనిపించే స్థాయికి పెరుగుతుంది. మరి ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి?

ట్రాన్స్‌ప్లాంట్‌…
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయడం అనేది ఒక సర్జికల్ ప్రక్రియ. దానిలో ముఖ్యంగా నెత్తిమీద ఆరోగ్యంగా ఉన్న ప్రాంతం నుంచి తీసిన వెంట్రుకలను హెయిర్‌లాస్‌ అయిన చోట నాటుతారు. దీనిలో కొన్ని నెలలపాటు, కొంత ఇబ్బంది కరమైన, బాధాకరమైన సెషన్లను భరించాల్సి ఉంటుంది. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన చోట రక్తస్రావంతో పాటూ పొక్కుకట్టడం, ముఖం ఉబ్బడం, ఇన్పెక్షన్, వాపు, తలనొప్పి, నాటిన చోట మచ్చలు లాంటి సైడ్ ఎపెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. 

పిఆర్సీ.. 
ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ(పీఆర్పీ) అనేది ఒక కాలం చెల్లిన చికిత్సా ప్రక్రియ. దీనిలో నెత్తి మీది చర్మం ఫోలికల్స్‌ను పెంచడానికి, స్వయంగా రోగి రక్తంలో ఉన్న సహజ పెరుగుదల కారకాలను ఉపయోగిస్తారు. రోగి రక్తాన్ని తీసి రిచ్ ప్లాస్మాను వేరు చేయడానికి దాన్ని ఒక సెంట్రిఫ్యూజ్‌లో తిప్పుతారు. దీనిలో ఒక చికిత్స సెషన్‌కు ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే 8 నుంచి 12 ఎంఎల్ పీఆర్పీ అవసరం అవుతుంది. పీఆర్పీని సూదుల సాయంతో నెత్తిమీదున్న చర్మం లోలోపలి పొరల్లో ఇంజెక్ట్ చేస్తారు. ఒక్కో పీఆర్పీ సెషన్‌కు రూ.10 వేల నుంచి, రూ.12 వేలకు పైగా ఖర్చు అవుతుంది. పీఆర్పీ ఫలితాల్లో వ్యత్యాసం కూడా ఎక్కువగా ఉంటుంది. 

ఎందుకంటే ఇంజెక్షన్, చికిత్స పద్ధతిలో ప్రామాణీకరణ అనేది ఉండదు. ఆరు నెలల చికిత్స తర్వాత జుట్టు చిక్కదనంలో కేవలం 19.29 శాతం పెరుగుదలను చూపించే పీఆర్పీ ఫలితాలకు మూడు నెలల సమయం పడుతుంది. ఈ ఫలితాలు కొనసాగేలా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బూస్టర్ డోస్ కూడా అవసరమవుతుంది. దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (దుష్ప్రభావాలు)లో..పీఆర్పీ చికిత్సలో సున్నితత్వం, ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి, నెత్తిమీద చర్మం బిగుతుగా కావడం, తలనొప్పి, మచ్చ కణజాలం ఏర్పడడం, ఇంజెక్షన్ వేసిన చోట కాల్షియం పేరుకుని గట్టిపడడం లాంటి సాధారణ సైడ్ ఎఫెక్టులు ఉంటాయి.

నాన్‌సర్జికల్‌ గ్రోత్ ఫ్యాక్టర్ ట్రీట్‌మెంట్స్..
సంప్రదాయ చికిత్సలకు ఇవి కొత్త ఒరవడి అని చెప్పాలి. ఇవి సురక్షితమైన, సులభమైన, అత్యంత ప్రభావవంతమైన, సర్జరీ అవసరం లేని చికిత్సలుగా ఇప్పుడు బాలీవుడ్, హీరోలు సైతం హెయిర్ ఫాల్ సమస్యను అదుపు చేయడానికి దీనిని ఎంచుకుంటున్నారు. ఇది అమెరికా పేటెంట్ పొందిన, మొక్కల నుంచి ఉత్పన్నమైన సహజమైన  కాయకల్ప చికిత్స. ఒక తరహా జుట్టు రాలడానికి పీసీఓఎస్ కారణం అయితే, కీమోథెరపీ, సెబొర్రిక్ డెర్మటైటిస్, అలోపీసియా అరీయాటా వల్ల అలోపీషియా వస్తుంది. పురుషులు, మహిళల్లో ఆండ్రోజెనెటిక్ అలోపీషియా చికిత్సకు ఇది చాలా సమర్థవంతమైనదని నిరూపితమైనది. 

కొలెస్ట్రాల్‌ vs గుడ్డు

Cholesterols Impact On Your Healthy - Sakshi

కొలెస్ట్రాల్‌ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్‌ అయినా, మంచి కొలెస్ట్రాల్‌ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్‌ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్‌ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌), హెచ్‌డీఎల్‌ (మంచి కొలెస్ట్రాల్‌) మోతాదులు తెలుస్తాయి. ఎల్‌డీఎల్‌ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్‌’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్‌ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్‌ ను ‘‘ మంచి కొలెస్ట్రాల్‌’’ అని అంటారు.

మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్‌ ఎక్కువగా, ఎల్‌డీఎల్‌ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్‌ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్‌ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్‌ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్‌ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్‌ ను అదుపులో పెట్టుకోవచ్చు.   

పేను కొరుకుడు – అలోపేషియా ఏరియేటా

Head Louse Special Story In Telugu - Sakshi

పేను కొరుకుడు సవుస్యను వైద్య పరిభాషలో అలోపేషియా ఏరియేటా అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో జుట్టు గుండ్రగా ప్యాచెస్‌ ప్యాచెస్‌ గా రాలిపోతూ ఉంటుంది. అంటే జుట్టు రాలిపోయిన చోట… అది గుండ్రంగా ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి రాలిన చోట జుట్టు దానంతట అదే వస్తుంది కూడా. ఈ జుట్టురాలిన  ప్యాచెస్‌ ఎన్ని ఉన్నాయనే దానిపైనే చికిత్స ఆధారపడి ఉంటుంది. అంటే… ప్యాచెస్‌ పరివూణం, సంఖ్య తక్కువైతే కేవలం పూతవుందులు (టాపికల్‌ ట్రీట్‌మెంట్‌) సరిపోతాయి.  దానికితోడు వెంట్రుకలు రాలిపోయిన ఆ ప్యాచెస్‌లో ఒక్కోసారి ఇంట్రా లీజనల్‌ స్టెరాయిడ్స్‌ అనే ఇంజెక్షన్స్‌ కూడా ఇవ్వాల్సిరావచ్చు.

అదే ప్యాచెస్‌ సంఖ్య ఎక్కువైతే నోటి ద్వారా కూడా వుందులు (ఓరల్‌ మెడికేషన్‌) తీసుకోవాల్సి ఉంటుంది. అలొపేషియా ఏరియేటా సవుస్య ఉంటే  చికిత్స తప్పక తీసుకోవాలి. లేకపోతే ఒక్కోసారి జుట్టుమెుత్తం రాలిపోయే ప్రవూదం ఉంది. దీన్నే వైద్య పరిభాషలో అలొపేషియా టోటాలిస్‌ అంటారు. ఆ పరిస్థితి రాకముందే చికిత్స తీసుకోవడం మంచిది.

కరోనావైరస్: వ్యాక్సీన్ల గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

వ్యాక్సీన్ అంటే ఏమిటి?

ఇన్ఫెక్షన్, వైరస్, లేదా వ్యాధితో పోరాడేలా శరీరాన్ని వ్యాక్సీన్ సిద్ధం చేస్తుంది. ఈ వ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను అచేతనం లేదా బలహీనం చేసే విధంగా వ్యాక్సీన్లను తయారుచేస్తుంటారు. కొన్నిసార్లు ఈ సూక్ష్మజీవుల తరహాలో స్పందించే డమ్మీ సూక్ష్మజీవులనూ వ్యాక్సీన్ల తయారీలో ఉపయోగిస్తుంటారు. వ్యాధి కారక సూక్ష్మజీవులు దాడి చేసినప్పుడు వాటిని గుర్తించి, పోరాడే సామర్థ్యాన్ని రోగ నిరోధక శక్తికి ఈ వ్యాక్సీన్లు అందిస్తాయి. వీటి వల్ల మనకు పెద్ద అనారోగ్య సమస్యలు రాకపోవచ్చు. కొంతమందిలో మాత్రం తాత్కాలిక జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి దుష్ప్రభావాలు కనిపిస్తుంటాయి. ఈ వ్యాక్సీన్లు చాలా శక్తిమంతమైనవని అమెరికాలోని ద సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది. సాధారణంగా ఔషధాలు వ్యాధులతో పోరాడతాయి. కానీ వ్యాక్సీన్లు మాత్రం వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.

వ్యాక్సీన్లు సురక్షితమైనవేనా?

తొలినాటి వ్యాక్సీన్లను 10వ దశాబ్దంలో చైనావాసులు తయారుచేశారు. అయితే, ఆధునిక వ్యాక్సీన్లకు ఆద్యుడు మాత్రం ఎడ్వర్డ్ జెన్నర్. 1796లో ‘‘కౌపాక్స్ ఇన్ఫెక్షన్’’తో మశూచి నుంచి తప్పించుకోవచ్చని ఆయన గుర్తించారు. ఆయన తన వాదనను ప్రయోగపూర్వకంగా నిరూపించారు. రెండేళ్ల తర్వార పరిశోధనల రూపంలో ప్రచురించారు. వ్యాక్సీన్ అనే పదం ‘‘వ్యాక్కా’’అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. వ్యాక్కా అంటే ఆవు అని అర్థం.

ఆధునిక ప్రపంచంలో వ్యాక్సీన్లను వ్యాధులపై శక్తిమంతమైన అస్త్రాలుగా భావిస్తున్నారు. ఏటా 30 లక్షల మంది మరణించకుండా ఈ వ్యాక్సీన్లు అడ్డుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. 20కిపైగా వ్యాధుల నుంచి ఈ వ్యాక్సీన్లు రక్షణ కల్పిస్తున్నాయని వివరిస్తోంది.

ఈ వ్యాక్సీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేముందు పక్కాగా పరీక్షలు చేపడతారని సీడీసీ చెబుతోంది. తొలుత ప్రయోగశాలల్లో, తర్వాత జంతువులపై ఈ వ్యాక్సీన్లను ప్రయోగిస్తారు. చివరగా మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేపడతారు. ఆ తర్వాత సంబంధిత దేశాల్లోని ఆరోగ్య ప్రాధికార సంస్థలు వీటికి ఆమోదం తెలుపుతాయి. వీటి వల్ల కొన్ని ముప్పులు కూడా ఉంటాయి. అయితే, ఆ ముప్పులను అడ్డుకోవడానికి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల కలిగే ముప్పులతో పోలిస్తే, ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు ఒకప్పుడు లక్షల మంది ఆఫ్రికా చిన్నారులను బలిగొన్న వ్యాధులు ఇప్పుడు దాదాపుగా కనుమరుగు అయ్యాయి. లక్షలాది మంది మృతులకు కారణమైన మశూచి నేడు పూర్తిగా నిర్మూలన కావడానికి వ్యాక్సీన్లే కారణం.

అయితే, కొన్నిసార్లు ఈ ఫలితాలు పూర్తిస్థాయిలో కనిపించడానికి దశాబ్దాలు పడుతుంది. ఉదాహరణకు గత ఆగస్టులోనే ఆఫ్రికాలో పోలియో అంతరించింది. దీనికి 30ఏళ్ల ముందు పోలియో టీకాల కార్యక్రమం మొదలైంది. అంటే వ్యాధి పూర్తిగా నిర్మూలన కావడానికి ఇక్కడ దాదాపు 30ఏళ్లు పట్టింది.

వ్యాక్సీన్లు ఎలా తయారుచేస్తారు?

బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు.. వాటిలోని యాంటీజెన్లతో పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి. సంప్రదాయ వ్యాక్సీన్లలో క్రియాశీలంగాలేని లేదా బలహీనమైన యాంటీజెన్లు ఉంటాయి. సూక్ష్మజీవులు మన శరీరంలోకి ప్రవేశించకముందే ఇవి పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయి. ఫలితంగా వ్యాధి సంక్రమించే స్థితి వచ్చినప్పుడు పోరాడేందుకు మన శరీరం సిద్ధంగా ఉంటుంది. అయితే, కొన్ని కరోనావైరస్‌లపై పోరాడే వ్యాక్సీన్లను సిద్ధంచేసేందుకు కొత్త విధానాలను కూడా అభివృద్ధి చేశారు.

కొన్ని వ్యాక్సీన్లు భిన్నంగా...

ఫైజర్-బయోఎన్‌టెక్, మోడెర్నా వ్యాక్సీన్లను మెసెంజెర్ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ) వ్యాక్సీన్లుగా పిలుస్తున్నారు. అంటే కరోనావైరస్ జెనిటిక్ కోడ్ సాయంతో వీటిని తయారుచేశారు. వైరస్ ఉపరితలంపై ఉండే ఓ స్పైక్ ప్రోటీన్‌తో కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. అయితే, ఈ స్పైక్ ప్రోటీన్లను తయారుచేసే శక్తిని మన శరీరంలోని కణాలకు అందించడమే లక్ష్యంగా ఈ వ్యాక్సీన్లను తయారుచేశారు. ఫలితంగా శరీరానికి కోవిడ్-19తో పోరాడే శక్తి లభిస్తుంది. ఈ విధానం.. క్రియాశీలంగాలేని లేదా అచేతనమైన వైరస్‌లను ఉపయోగించే విధానం కంటే భిన్నమైనది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ కూడా భిన్నమైనదే. చింపాంజీల్లో సాధారణ జలుబుకు కారణమయ్యే ఓ వైరస్‌కు కోవిడ్-19 జెనిటిక్ కోడ్ జోడించి శాస్త్రవేత్తలు దీన్ని తయారుచేశారు. ఈ మూడు వ్యాక్సీన్లకు బ్రిటన్, అమెరికా ఆమోదం తెలిపాయి. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్‌కు భారత్ కూడా ఆమోదం తెలిపింది. మెక్సికో, చిలీ, కోస్టారికాల్లో ఫైజర్ వ్యాక్సీన్లను భారీగా ప్రజలకు ఇచ్చే కార్యక్రమాలు మొదలయ్యాయి. మరోవైపు బ్రెజిల్ ప్రభుత్వం.. ఆక్స్‌ఫర్డ్, సినోవ్యాక్ వ్యాక్సీన్లకు ఆమోదించింది.

ఇతర వ్యాక్సీన్లు ఇవి..

చైనాకు చెందిన ‘‘కరోనావ్యాక్’’ వ్యాక్సీన్‌ను సినోవ్యాక్ సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని చైనా, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లలో ప్రజలకు ఇవ్వడం మొదలపెట్టారు. ఈ వ్యాక్సీన్‌ను క్రియాశీలంగా లేని వైరస్‌లతో సంప్రదాయ విధానంలో తయారుచేశారు. అయితే, దీని సామర్థ్యంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. టర్కీ, ఇండోనేసియా, బ్రెజిల్‌ల్లో తాజా ప్రయోగపరీక్షల ప్రకారం ఇది కేవలం 50.4 శాతం సామర్థ్యంతో పనిచేస్తోందని వార్తలు వచ్చాయి. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్‌ ‘‘కోవిషీల్డ్’’తోపాటు దేశీయ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘‘కోవాగ్జిన్’’ను కూడా ప్రజలకు ఇస్తున్నారు. వైరస్‌లో మార్పులు చేస్తూ తయారుచేసిన వైరల్ వెక్టర్ వ్యాక్సీన్ స్పూత్నిక్ వీని రష్యా ప్రజలకు ఇస్తోంది. దీన్ని అర్జెంటీనాలో కూడా ఇస్తున్నారు. రష్యా నుంచి అర్జెంటీనా 3,00,000 డోసులకు ఆర్డరు ఇచ్చింది. మొత్తంగా 27 కోట్ల ఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ (ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది) వ్యాక్సీన్లు ఆఫ్రికా యూనియన్ ఆర్డరు చేసింది. అల్పాదాయ దేశాలకు కోవాక్స్ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తున్న 60 కోట్ల వ్యాక్సీన్లకు ఇవి అదనం.

నేను వ్యాక్సీన్ తీసుకోవాలా?

ఇది తప్పనిసరనే నిబంధన ఎక్కడా లేదు. అయితే, ఆరోగ్యపరమైన కారణాలతో వైద్యులు వేసుకొవద్దని సూచిస్తే తప్పితే, మిగతా అందరూ వ్యాక్సీన్ వేసుకోవడమే మంచిది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ సోకకుండా అడ్డుకోవడంతోపాటు ఇతరులకు కూడా మన నుంచి ఈ వైరస్ సోకకుండా ఈ వ్యాక్సీన్లు రక్షణ కల్పిస్తాయని సీడీసీ చెబుతోంది. ముఖ్యంగా ఈ మహమ్మారి నుంచి మనం బయటపడటానికి వ్యాక్సీన్లు అస్త్రంలా పనిచేస్తాయని వివరిస్తోంది. కరోనావైరస్ వ్యాప్తికి కళ్లెం వేయాలంటే ప్రపంచంలో 65 నుంచి 70 శాతం మందికి వ్యాక్సీన్లు ఇవ్వడం తప్పనిసరని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అంటే ప్రజలు వ్యాక్సీన్లు వేసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ప్రోత్సహిస్తోంది. అయితే, సరైన విధానాలను అనుసరించకుండా ఆగమేఘాలపై ఈ వ్యాక్సీన్లను తయారుచేశారని కొందరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నిజమే, వ్యాక్సీన్లు సంప్రదాయ విధానంలో తయారు చేయడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. అయితే, ఈ ప్రక్రియలు వేగంగా, సక్రమంగా జరిగేలా చూసేందుకు ప్రపంచ పరిశోధకులు, వ్యాక్సీన్ తయారీ సంస్థలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కలిసి పనిచేసింది. దీంతో వేగంగా వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, కోట్ల మందికి ఈ వ్యాక్సీన్లు ఇవ్వడం ద్వారా కోవిడ్-19 సోకకుండా అడ్డుకోవచ్చు. ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ కూడా వస్తుంది. మనం సాధారణ పరిస్థితికి రావడానికి ఇది తోడ్పడుతుంది.

బ్రక్సిజం – చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్

Teeth Grinding: Diagnosis And Treatment - Sakshi

చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సమస్య ఉండవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందనేందుకు నిర్ణీతంగా కారణాలు తెలియదు. సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా పిల్లల్లో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర వాళ్లను ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నించాలి.

వాళ్లతో ఎక్కువగా సంభాషిస్తూ ఉండాలి. ఆ చిన్నారుల వునసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా పెద్దలు వ్యవహరించాలి. వాళ్ల పట్ల కన్సర్న్‌ చూపాలి. పిల్లలు నిద్రకు ఉపక్రమించే సవుయంలో కెఫిన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) పెట్టకూడదు. సమస్య వురీ ఎక్కువగా ఉంటే నోట్లో అవుర్చే మౌత్‌ గార్డ్స్, మౌత్‌పీసెస్‌ వాడితే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు పళ్ల (డెంటల్‌) సమస్యలు – వూల్‌ అక్లూజన్, పళ్లు వదులుకావడం (లూజెనింగ్‌), పళ్లు పడిపోవడం, దడవ ఎముక జాయింట్‌ (టెంపోరో వూండిబులార్‌ జాయింట్‌) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణలను కలవాల్సి ఉంటుంది.

ఆహార నియమాలు

జబ్బుని బట్టీ, శరీర తత్వాన్నిబట్టీ ఆహారం ఉండాలని పూర్వం అనుకునేవారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. ఎవరికైనా ఆహారనియమాలు స్థూలంగా ఒకటే.

 1. తక్కువగా తినండి
 2. తక్కువగా వండండి
 3. బయటి ఆహార పదార్ధాలు తినకండి
 4. ప్రకృతిలో తయారైనవి తినండి. మనుషులు తయారు చేసినవి (processed foods) తగ్గించండి.

తక్కువగా తినండి.

తినటానికి అనేక కారణాలు:

జంతువులు అవసరమైన దానికన్నా ఎప్పుడూ ఎక్కువ తినవు. చంటిపిల్లలూ అంతే. వయసు పెరిగినకొలదీ, అనేక కారణాల వలన మనం అవసరమైన దానికన్నా ఎక్కువ తింటాం. దీనిని ఒక చెడు పరిణామం. (degradation or corruption) అని చెప్పవచ్చును.

ఆకలి తీర్చుకోవటానికి మాత్రమే తినాలి. ఐతే అలా జరగటల్లేదు. ఆకలి కాకుండా మనకి తినటానికి ఇంకా అనేకమైన ఇతర కారణాలు ఉంటున్నాయి. సంతోషం వస్తే తింటాము. నీరసంగా ఉంటే తింటాము. మనసులో బాగోక పోతే తింటాం. బోరు కొడితే తింటాము. టీవీ చూస్తూ తినేస్తుంటాము. లావెక్కటానికి ఒక ప్రధాన కారణం డిప్రెషన్.

వ్యసనం: త్రాగుడు, సిగరెట్టు లాగానే తిండి కూడా చాలా మందికి ఒక వ్యసనం. దురదృష్టవశాత్తూ ఇది సమాజానికి తప్పుగా కనిపించని వ్యసనం. (Socially acceptable addiction). ఇతర వ్యసనాల్లాగానే, తిన్నకొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. తిండి తగ్గిస్తే ఇతర వ్యసనాల్లాగానే నీరసం (withdrawal symptom) వస్తుంది, శరీరంలో అవసరానికి మించి నిలువలు ఉన్నప్పటికీ.

సమాజ ప్రభావం: తిండికి పెద్ద సామాజిక కోణం ఉంది. ఏ వేడుకైనా విందులేకుండా ఉండదు. ఎవరైనా బంధువులు వస్తే వారికి తినిపించకుండా ఉండలేము. చిన్న పిల్లలను తినమని పీడిస్తాము.

అలవాటులో పొరపాటు: పెరిగే వయసులో అంటే 12-20 సంవత్సరాల మధ్య శరీరానికి తిండి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఆ వయసులో బరువు తక్కువగా ఉంటారు. 25 దాటిన తరవాత శరీరానికి ఆహారం అవసరం క్రమేపీ తగ్గిపోతుంది. కండ (muscle mass) క్షీణిస్తూ ఉంటుంది. ఐతే అలవాటు ప్రకారం మనం ఎప్పుడూ తిన్నట్లే తింటాము. తగ్గించం. అందుకే మనందరికీ వయసుతో బాటూ నడుము చుట్టుకొలత విషవృక్షం లాగా పెరుగుతూనే ఉంటుంది. కండ (muscle mass) తగ్గటం వలన వయసుతో బాటు బరువు తగ్గవలసినది పోయి పెరుగుతున్నాం. వయసుతోపాటు బరువు తగ్గితే మంచిది, కనీసం పెరగకుండా ఉండాలి.

చిన్నప్పటి అలవాట్లు: తిండి అలవాట్లు (eating habbits) చిన్న వయసులోనే (5 సంవత్సరాలలోపులోనే) ఏర్పడతాయి. అంటే ఆ వయసులో తీపి అలవాటు ఐతే జీవితాంతం తీపి మీద ప్రీతి (sweet tongue) ఉంటుంది. చిన్నప్పుడు తినని పదార్ధాలమీద పెద్దైనాక ఆసక్తి ఎక్కువ ఉండదు. ఉదాహరణకు శాకాహార కుటుంబాల్లో పుట్టిన వాళ్లకు మాంసం సాధారణంగా రుచించదు.

ఆకలి ఉన్నప్పుడే తినాలి. పిల్లలు తినేటప్పుడు వారి దృష్టి తిండిమీదే ఉండాలి. పిల్లలకు టీవీ చూపిస్తూ తినిపిస్తూ ఉంటే, వాళ్లకు మనం ఎంత అన్యాయం చేస్తున్నామో గ్రహించండి. చిన్న పిల్లలు ఇంకా చెడిపోలేదు. ఎలా తినాలో మనం వాళ్ళనుండి నేర్చుకోవాలి. మన దురలవాట్లు వాళ్లకు నేర్పకూడదు.

వినిమయతత్వం (consumer culture): మనకి రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బిస్కట్ కంపెనీలు, హార్లిక్స్ కంపెనీలు ఎందుకు ఉన్నాయి? మనని ఎదో రకంగా మభ్యపెట్టి తినిపించడానికే . లేకపోతె వాటికీ మనుగడ లేదు.

పూర్వం మనవాళ్ళు గుహల్లో బతికినప్పుడు, పిల్లలని పులులనుండి తోడేళ్ళనుండి నుండి రక్షించుకునే వారు. ఇప్పుడు మీరు మీ పిల్లలని TV నుండి, junk food (పిచ్చితిళ్లు) నుండి రక్షించుకోవాలి.

ఇంకా తక్కువగా వండండి, బయటివి తినకండి, ప్రకృతిలో తయారైనవి తినండి, మనుషులు తయారు చేసినవి తగ్గించండి.

మనిషి భూమి మీదకి వచ్చి సుమారుగా 100000 సంవత్సరాలు అయిఉంటుంది. వ్యవసాయం మొదలు పెట్టింది, మహా ఐతే 10000 సంవత్సరాల క్రితం. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార సంబంధమైన పరిశ్రమలు వచ్చింది 200 లేదా 300 సంవత్సరాల క్రితం. (wikipedia)

అంటే 90000 సంవత్సరాలు మానవ జాతి తిండికి కాయలు, ఆకులు, పళ్ళు, దుంపలు, వేట మీద ఆధారపడింది. (hunter/gatherer stage). ఆ దశలో మనుషులు సన్నగా ఉండేవారు. వాళ్లు ఎలా ఉండేవారు, ఏం తినేవారు తెలుసుకోవాలంటే ఎక్కడైనా మారుమూల అడవులకెళ్లి అక్కడ ఉండే కొండవారిని చూడండి. మనిషి 60 కెజిలు ఉంటే ఎక్కువ.

10000 సంవత్సరాల క్రితం వ్యవసాయం వచ్చినప్పటికీ జనబాహుళ్యానికి ఆహారం సమృద్ధిగా ఉండేది కాదు. ఊబకాయం బహుతక్కువగా ఉండేది.

పారిశ్రామిక విప్లవం తరవాత అంటే గత 200 సంవత్సరాల్లోనూ ప్రజలు తినే ఆహారంలో పెనుమార్పులు వచ్చినయ్యి. శరీరానికి శ్రమ తగ్గిపోయింది. ఊబకాయం పెరిగిపోయింది. ఈ మార్పు కంప్యూటర్ యుగంలో మరీ ఎక్కువైపోయింది.

ప్రకృతి మన శరీరాలను తిండి లేమికి, కందమూలాలు, కాయగూరలు, గింజలు తిని బతకడానికి అనువుగా నిర్మించింది. దీనిని genetic and epigenetic selection in evolution అని అంటారు. మిఠాయిలు తినటానికి అనువుగా నిర్మించలేదు. అలాగే మన శరీర నిర్మాణం బరువు ఎక్కువ ఉంటే తట్టుకోలేదు. గత రెండు వందల ఏళ్లలోను మార్పులు వచ్చినయ్యి కదా అని 100000 సంవత్సరాలనుండి ఏర్పడిన శరీర నిర్మాణం వేగంగా మారదు.

అందుకని food processing అంటే ఆహారం తయారీలో పొయ్యి, యంత్రాల వాడకం సాధ్యమైనంత తక్కువగా ఉండాలి.

ఆధునిక ఆహారంలో ఇంధన శక్తి అంటే క్యాలోరీ డెన్సిటీ ఎక్కువ. దీని వలన బరువు ఎక్కువ పెరుగుతుంది. యాంటిఆక్సిడెంట్ల లాంటి పోషకపదార్ధాలు తక్కువ. వీటి వలన శరీరం రోగగ్రస్తం కావటానికి అవకాశాలు ఎక్కువ. ఈ జబ్బు ఆ జబ్బు అని కాదు. ఆహారం సరిగా లేకపోతె అన్ని జబ్బులూ ఎక్కువే.

ఐతే పొయ్యి, యంత్రాల వాడకం పూర్తిగా లేకుండా వీలు కాదు. వంట అనేది సుమారుగా 50000 సంవత్సరాల క్రితం వచ్చిన తరవాతనే మనం తిన అరిగించుకోగలిగిన పదార్ధాలు పెరిగినయ్యి . తృణధ్యాన్యాలు మన ఆహారంలో భాగమయ్యాయి. మానవ జాతి నశించకుండా మనగలిగింది.

మనకు మేలు చేసే యంత్రాలు (technology) వాడవచ్చును. ఉదాహరణకు ఫ్రిజ్, గ్రైండర్ లాంటివి వాడటంలో తప్పు లేదు.

ఇతర విషయాలు:

చక్కర: పంచదార, బెల్లంలాంటివాటిలో ఇంధన శక్తి అంటే కెలొరీ డెన్సిటీ ఎక్కువ. ఇతర విలువలు సున్నా. పూర్వం మనుషులకి ఆహారం కరువుగా ఉండేది. శారీరక శ్రమకి ఇంధనశక్తి అవసరం ఎక్కువగా ఉండేది. పంచదార అమృతం లాగా పనికి వచ్చేది. పంచదార ఇష్టంలేని వారు పరిణామక్రమంలో అంతమైపోయారు. పంచదార రుచి మరిగిన వాళ్ళు మిగిలిపోయారు. (genetic and epigenetic selection). అందుకే మనందరికీ తీపి అంటే మహా ప్రీతి.

గత 200 సంవత్సరాలోనూ మారిన పరిస్థితుల్లో పంచదార చెడ్డదైపోయింది. ఇప్పుడు మద్యం ఎలా చెడ్డదో, తీపి పదార్ధ్యాలు కూడా ఇంచు మించుగా అంతే చెడ్డవి అని చెప్పవచ్చును. ఐతే శ్రమ జీవులకు పంచదార, బెల్లం అంత చెడ్డవి కావు. మిగిలిన వాళ్ళు వీటిని మద్యం లాగానే వదులుకోవాలి.

మాంసాహారం: మాంసాహారం మంచిదా చెడ్డదా అనేది విజ్ఞాన శాస్త్రంలో చాల చర్చ జరుగుతున్నది. ఇది ఇంతలో తేలే విషయం కాదు. మాంసం తినవచ్చును. మాంసం చెడ్డదని రుజువులు ఏమీ లేవు. శాకాహారులు మాంసం తినే అవసరం లేదు. మాంసంలో అధికంగా వాడే ఉప్పు వలన అనర్ధం ఉండవచ్చును.

నెయ్యి, వెన్న: ఇవి చెడ్డవి. జంతు సంబంధమైన కొవ్వు పదార్ధాలన్నీ చెడ్డవి. ఆవు నెయ్యి ఏమీ ఎక్కువ కాదు. వెన్నతక్కువ పాలు వాడటం మెరుగు.

నూనెలు: పరిమితులలో వాడితే అన్నీ మంచివే. కానీ గడ్డ కట్టే నూనెలు అంటే కొబ్బరి నూనె లాంటి వాటి గురించి విజ్ఞాన శాస్త్రంలో కొన్ని సందేహాలున్నాయి. కొబ్బరి నూనెను వాడితే, అతిగా వాడకండి. కొబ్బరితో సహా నూనె గింజలన్నీ ఆరోగ్యానికి మంచివే. సుమారుగా 20-35 శాతం ఆకలిని నూనెల(Fats)తో తీర్చుకోవాలి. నూనె గింజలలో విలువైన పోషకపదార్ధాలు ఉంటాయి. నూనె వలన ఆకలి బాగా తీరుతుంది. ఎప్పుడైనా నూనె కన్నా నూనె గింజలు మంచివి.

కాక నూనె, డాల్డా మంచివి కావు. నూనెతో ఏదయినా అతిగా వేయించడం (deep fry) కూడా మంచిది కాదు.

బియ్యం, ఇతర తృణధాన్యాలు: ఇవి పూర్వం నుండీ చౌక. మన భారత దేశ చరిత్రలో కరువులు ఎక్కువగా ఉండటం వలన వీటిని ఎక్కువగా తినటానికి అలవాటు పడ్డాం. దీనికి వీలుగా అవకాయలు సృష్టించుకున్నాము. కూరలు కారంగా వండుకుంటున్నాము. సాధారణంగా మన తెలుగు వారి ఆహారంలో బియ్యం వాడకం అవసరమైన దానికన్నా ఎక్కువ. బియ్యం ఎక్కువగా వాడేవాళ్లు తగ్గించాలి. తెల్లబియ్యంకన్నా ముడి బియ్యం మెరుగు. బియ్యంతో పాటు ఇతర గోధుమ, జొన్న లాంటి ఇతర తృణధాన్యాలుకూడా వాడి వైవిధ్యం పెంచుకుంటే మంచిది.

పప్పులు: అన్నిరకాల పప్పులు, చిక్కుళ్ళు, నూనె గింజలు మంచివే. వీటిని మనం తక్కువగా వాడుతున్నామేమోనని నా అనుమానం. బియ్యం స్థానంలో వీటి వాడకం పెంచుకోవాలి.

పళ్ళు: పళ్ళు మంచివే. ఐతే మరీ తియ్య్యగా ఉండే పళ్ళను అతిగా వాడకపోతే మంచిది. డయాబెటిస్ ఉంటె పళ్ళు మానెయ్యనక్కరలేదు.

కూరగాయలు: కూరగాయలు మంచివి. ఐతే మంచితనం వంటలో కొంత పోతుంది. వీలైనంతవరకు పచ్చివి లేదా తక్కువగా వండినవి వాడండి. పచ్చి కూరలు తిన్నప్పుడు బాగా కడగవలసి ఉంటుంది.

గుడ్లు: తెల్లసొన అందరికీ మంచిదే. పచ్చసొన గురించి కొన్ని సందేహాలున్నాయి. పచ్చసొనలు సగటున రోజుకి ఒకటి కన్నా తక్కువ తింటే ఇబ్బంది ఏమీ ఉండదు. శాకాహారులు గుడ్లు తినకపోయినా ఫరవాలేదు.

ఉప్పు: ఉప్పు లేకుండా మనిషి బ్రతకటం కష్టం. ఐతే రక రకాల కారణాల వలన మనం తినే తిండిలో ఉప్పు బాగా ఎక్కువైపోయింది. వీలైనంత తగ్గించండి. బీపీ ఉంటె ఇంకా తగ్గించండి.

మసాలాలు: పసుపు, కారం ఇంకా ఇతర మసాలా దినుసులు మంచివే, అవి ప్రక్రుతి సిద్ధంగా దొరికే ఆహార పదార్ధాలు కాబట్టి. చాలా మందికి మసాలా దినుసుల్లో ఔషధ గుణాలున్నాయని నమ్మకం. అమెరికా వాళ్ళకి ఈ నమ్మకం ఎక్కువ. దీనికి రుజువులు లేవు.

సమతుల్యం (Balanced diet): ఆహారంలో పిండి పదార్ధాలు (carbohydrates), నూనె పదార్ధాలు (fats) మాంసకృత్తులు (proteins), విటమిన్లు సమ పాళ్ళలో ఉండాలి. అలా అని మనం లెక్క వేసుకుని తిననక్కర లేదు. పైన చెప్పిన నియమాలు పాటించి మిశ్రమాహారం తినే వాళ్లకు సమతుల్యం ఖచ్చితంగా ఉంటుంది.

బొమ్మలో చూపించిన నిష్పత్తులకు కాస్త అటూ ఇటూ గా ఉండవచ్చును.

మిశ్రమాహారం అంటే బియ్యం లాంటి తృణ ధాన్యాలు, పప్పుగింజలు, ఆకు కూరలు, కాయగూరలు, పళ్ళు, నూనె గింజలు లాంటివి. వైవిధ్యం మంచిది. రకరకాలైన తృణధాన్యాలను, పప్పుగింజలను, నూనె గింజలను వాడవచ్చును. వైవిధ్యం అంటే రక రకాలైన బిస్కట్లు, చాకోలెట్లు, ఐస్క్రీములు, హల్వాలు, పిండి వంటలు అనుకోవద్దు.

ఎంత మంచి పదార్దాన్నైనా అతిగా తిన కూడదు.

బాదం పప్పులు, సబ్జిగింజలు, ఆలివ్ నూనె, కొర్ర గింజలు, ఆపిల్ పళ్ళూ వాడాలా?

వీటివలన ప్రత్యేకించి లాభం ఏమీ ఉండదు. స్థానికంగా చౌకగా లభించేవి తినికూడా మంచి ఆరోగ్యాన్ని పొంద వచ్చును.

డయాబెటిస్ ఉన్నవాళ్లకు ప్రత్యేకించి జాగ్రత్తలు: డయాబెటిస్ ఉన్నా, ఉండకపోయినా ఆహారానియమాలు ఒక్కటే.

కీటోడైట్(ketodiet): కీటోడైట్ వలన తాత్కాలికంగా బరువు తగ్గవచ్చును. దీర్ఘకాలంలో ఆచరణ సాధ్యం కాదు. అంతే కాకుండా సమతుల్యం (కీలకమైన పోషక పదార్ధాలు) లోపించటం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. కీటోడైట్ కి వైద్యశాస్త్రం వ్యతిరేకం. చెదురు మదురు డాక్టర్లు ఇది మంచిదని చెప్పవచ్చును. అది వారి వ్యక్తిగత అభిప్రాయం.

Mediteranian diet మంచిదా? మంచిదే, కానీ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే ఆంధ్రా డైట్ దీనికి ఎంతమాత్రం తీసిపోదు.

Organic food: ఆర్గానిక్ ఆహారం వలన ప్రయోజనం ఏమీ ఉండదని అనేక పరిశోధనలలో తేలింది. ఐతే నష్టం కూడా ఏమీ ఉండదు.

ఆయుర్దాయం కేవలం తిండి మీదే ఆధార పడిఉండదు. శరీర తత్త్వం ప్రధానం. వ్యాయామం, మనశ్శాంతి కూడా ఆవరమే. సరైన ఆహారం తినటం వలన ఆరోగ్యం, ఆయుర్దాయం ఎంతో కొంత పెరుగుతాయనేది ఖాయం. ఖచ్చితంగా ఎంతనేది లెక్కల్లో ఇంకా తేలలేదు.

హెయిర్ ప్రాబ్లెమ్ లను పరిష్కరించగలిగే 5 రకాల నూనెలు

hair-oils-for-all-hair-problems-in-telugu

ఆవ నూనె :

ఆవ నూనె అనేది హెయిర్ ని మృదువుగాను మరియు సాఫ్ట్ గాను ఉంచడానికి ఈ ఆవ నూనెను మన పురాతన కాలం నుండే ఉపయోగించేవారు. హెయిర్ కి సరిపడే ఆవ నూనె ని తీసుకొని గోరువెచ్చగా వేడి చేయండి. తర్వాత నెత్తిమీద మరియు జుట్టుకు ఆ నూనె రాయండి, జస్ట్ 30 నిమిషాలు అలా నానబెట్టండి, ఆ తర్వాత హెయిర్ ని తేలికపాటి షాంపూతో మరియు గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోండి.

నువ్వుల నూనె :

నువ్వుల నూనె అనేది చాలా ప్రాధాన్యం ఉన్న నూనె. ఈ నువ్వుల నూనె కూడా పురాతన కాలం నుండి వంటలలో వాడేవారు, అంతేకాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చడానికి ఉపయోగించేవారు. నువ్వుల నూనె అన్ని రకాల హెయిర్ కి మంచిది. ఒలియోరెసిన్తో (oleoresin) 2-3 స్పూన్ ల పెరుగుని కలపి హెయిర్ పై అప్లై చేయండి, 30-45 నిమిషాల పాటు నానపెట్టండి, తర్వాత షాంపూతో తలంటుకుంటే సరిపోతుంది.

కొబ్బరి నూనె :

కొబ్బరి నూనె అనేది ప్రపంచంలో చాలా అత్యంత శక్తివంతమైనది ఉన్న నూనెలలో కొబ్బరి నూనె కూడా ఒకటి. ఈ కొబ్బరి నూనెలో సాధారణంగా “విటమిన్ ఇ” మరియు ఇతర రకాల పోషకాలు బాగా పుష్కలంగా ఉన్నాయి. అట్లాగే ఈ నూనెని మీ హెయిర్ చాలా సులభంగానే గ్రహిస్తుంది. ఈ కొబ్బరి నూనెని మీ తలకు వారానికి 2సార్లు అప్లై చేయండి, తర్వాత బాగా మసాజ్ చేసుకుని షాంపూ తో తలంటుకుంటే శుభ్రం చేసుకోండి.

రోజ్మేరీ ఆయిల్ :

రోజ్మేరీ ఆయిల్ అనేది చాలా ముఖ్యమైన నూనెలలో ఇది కూడా ఒకటి. ఈ రోజ్మేరీ ఆయిల్ లో విటమిన్ బి మరియు ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేలాది సంవత్సరాలుగా ఈ రోజ్మేరీ ఆయిల్ ని ఉపయోగిస్తున్నారు. దీన్ని కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్తో కలపండి, తర్వాత తలకు అప్లై చేయండి, కొంతసేపు తలకు మసాజ్ చేయండి, ఒక 20 నిమిషాలు హెయిర్ ని నానబెట్టండి, ఆ తరువాత షాంపూతో తలంటుకుని క్లీన్ చేసుకోండి.

జోజోబా ఆయిల్ :

జోజోబా నూనె అసలు నూనెలా అనిపించదు. జోజోబా నూనె ఒక విధంగా మైనం లా ఉంటుంది. దెబ్బతిన్న మరియు పాడైన హెయిర్ ని రిపేర్ చేయడానికి జోజోబా ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. కొత్త జుట్టు పెరగడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. జోజోబా ఆయిల్ కొద్దిగా తీసుకొని, తలపై మసాజ్ చేసుకుని 20 నిమిషాలు పాటు నానపెట్టండి, తర్వాత హెయిర్ ను మాములు షాంపూతో తలంటుకుని క్లీన్ చేసుకోండి.

passion fruit – తపన ఫలం

Nutritional Value and Health Benefits of Passion Fruit | HerbBreak

ఇవి జామకాయల కంటే చిన్నసైజులో ఉండే… పర్పుల్, ఎరుపు రంగులో కనిపించే… తియ్యటి, పుల్లటి పండ్లు. నిండా పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎక్కువగా వేడి ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి. ప్రధానంగా వియత్నాం ప్రజలు ఈ పంటను ఎక్కువగా పండిస్తున్నారు. ప్యాషన్ పండ్ల తోటల్లోకి వెళ్లామంటే… తియ్యటి వాసన వస్తుంది. అందువల్ల ఈ పండ్లపై పరిశోధనలు చేశారు. ఇవి ఎంతో మంచివని తేలింది. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ (మన బాడీలో విష వ్యర్థాల్ని తొలగించే గుణాలు), విటమిన్ A, విటమిన్ C, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ పండ్లను మందుల తయారీలో ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే ఇవి తింటే రిలాక్స్ ఫీల్ కలిగిస్తున్నాయి. ఒత్తిడి దూరం చేస్తున్నాయి. మంచిగా నిద్ర పట్టేలా చేయగలుగుతున్నాయి.

ఇవి కంటిచూపును మెరుగుపరుస్తున్నాయి. రేచీకటికి చెక్ పెడతాయి. వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకానికి చెక్ పెడుతుంది. ఈ పండ్లలో ఐరన్ ఎక్కువ. అందువల్ల ఇవి మన రక్తంలో ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుతాయి. వీటిలోని కాపర్, పొటాషియం వల్ల రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. పొటాషియం, సోడియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. మన ఎముకలు బలంగా ఉండేందుకు కూడా ఈ పండ్లు సహకరిస్తాయి.

Covid-19 vaccine – How to Register

కోవిన్ వెబ్‌సైట్

వెబ్ సైటు ద్వారా నమోదు చేసుకోవడం ఎలా?

www.cowin.gov.in అనే వెబ్ సైటులోకి లాగ్ ఇన్ అవ్వాలి. అందులో మొబైల్ నెంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్సినేషన్ ప్రక్రియ నమోదు పేజీ కనిపిస్తుంది. అందులో అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

వ్యాక్సీన్ వేసుకోవాలనుకునే వారి వ్యక్తిగత ధ్రువీకరణ పత్రం, వాటి వివరాలు, పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలను నింపాలి. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వివరాలు పొందుపరచాలి. అన్ని వివరాలు పొందుపరిచిన తర్వాత వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే దానిని ధ్రువీకరిస్తూ మొబైల్ ఫోన్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మరో ముగ్గురు సభ్యులను కూడా ‘యాడ్ మోర్’ అనే ఆప్షన్ ద్వారా నమోదు చేయవచ్చు. ఆ వ్యక్తుల వివరాలు కూడా పైన వివరించిన పద్దతిలోనే నమోదు చేయాలి.

కోవిన్ వెబ్‌సైట్

ప్రతీ వ్యక్తి రిజిస్ట్రేషన్ పూర్తవగానే కన్ఫర్మేషన్ మెస్సేజ్ వస్తుంది. ఎవరి పేరునైనా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కసారి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత షెడ్యూల్ అపాయింట్మెంట్ పేజీ నుంచి వ్యాక్సీన్ తీసుకునే తేదీని నిర్ణయించుకోవచ్చు.

మనం నివసించే రాష్ట్రం, జిల్లా, బ్లాక్, పిన్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు.

మనకు దగ్గరలో ఉన్న వ్యాక్సీన్ కేంద్రాలన్నీ అక్కడ కనిపిస్తాయి. అందులోంచి వ్యాక్సీన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అందుబాటులో ఉన్న తేదీని ఎంపిక చేసుకోవచ్చు. ఒక్క సారి వ్యాక్సీన్ కేంద్రం, తేదీని ఎంపిక చేసుకున్న తర్వాత అక్కడ నుంచి తిరిగి అకౌంట్ డీటెయిల్స్ పేజీకి వెళ్ళాలి. ఆ తర్వాత బుక్ అపాయింట్మెంట్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా వ్యాక్సీన్ కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.

ఒక సారి పొందుపర్చిన వివరాలను సరి చూసుకుని కంఫర్మ్ బటన్ ప్రెస్ చేయగానే వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే. రిజిస్ట్రేషన్ పూర్తయితే, “అపాయింట్మెంట్ సక్సెస్ఫుల్” అనే పేజీ కనిపిస్తుంది. ఈ పేజీని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి

ఈ వివరాలను, ఇతర దీర్ఘ కాలిక ఆరోగ్య సమస్యలను ధృవీకరించే సర్టిఫికేట్ లతో సహా వ్యాక్సీన్ కేంద్రానికి తీసుకుని వెళ్లాలి. వీటిని పరిశీలించిన తర్వాత వ్యాక్సీన్ ఇస్తారు. వ్యాక్సీన్ తీసుకునే తేదీని, యాప్, లేదా వెబ్ సైటులోకి లాగిన్ అయి ఎప్పుడైనా మార్చుకోవచ్చు.

వ్యాక్సీన్ ప్రక్రియ పూర్తి అయిన 28 రోజులకు రెండో డోసు తీసుకోవడానికి కూడా యాప్‌లో తేదీ ఖరారు అయిపోతుంది.

ఒక వేళ మొదటి డోసు తీసుకున్న తర్వాత వేరే నగరానికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, అక్కడ నుంచి కూడా వ్యాక్సీన్ తీసుకునే కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

గ్రహణ మొర్రి

Cleft Palate Disease Special Story - Sakshi

గర్భవతులు గ్రహణం సవుయంలో బయట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. అది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ గ్రహణం మెుర్రి ఏర్పడుతుంది.

శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మెుర్రి సవుస్యను సమర్థంగా చక్కదిద్దవచ్చు. అయితే ఎంత చిన్నవయసులో ఈ శస్త్రచికిత్స చేస్తే ఫలితాలు కూడా అంత బాగుంటాయి. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. కాబోయే తల్లిదండ్రులు చేయాల్సిందల్లా ఒకటే… వీలైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కు ముందునుంచీ ఫోలిక్‌ యాసిడ్‌ టాబ్లెట్లు క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరల్లోనూ ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గ్రహణం మొర్రినీ, న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌నూ చాలావరకు నివారిస్తుంది.

పుదీన – ఉపయోగాలు

 1. జీర్ణశయ ఎంజైములు ఉత్పేరితమై జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.

2.యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, లక్షణాలు ఉంటాయి. సాలీశైలీక్ ఆసిడ్ అనే ఎంజాయ్ వుండటం వలన ముఖం మీద మచ్చలు పోతాయి.

3.ఆస్తమా కి బాగా పనిచేస్తుంది.

4.నోటిలో దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.

5.రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

మొటిమలు వల్ల కలిగే మచ్చలు పోవాలంటే పుదీనా రసం కొంచెం హనీ రెండు కలిపి ముఖానికి నైట్ పూసుకొండి. ఇలా 1 నెల దాకా అప్లై చేసి గోరువెచ్చని నీటితో కడుక్కోండి

పుదీనా వాటర్ కూడా బాగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఒక గ్లాసు లొ పుదీనా ఆకులు, హనీ, చెక్క,గోరు వెచ్చటి వాటర్ కలుపుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.

బీట్‌రూట్ – ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits Of Beetroot - Sakshi

బీట్‌రూట్‌లో ఫైటోన్యూట్రియంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. అంతేగాక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటీస్‌ వల్ల కలిగే నొప్పులు తగ్గుతాయి.

మనం తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం కావాలంటే అవసరమయ్యే డైటరీ ఫైబర్‌(పీచుపదార్థం) బీట్‌రూట్‌లో దొరుకుతుంది. ఒక కప్పు బీట్‌రూట్‌లో గ్లుటమైన్, ఎమినో యాసిడ్స్, 3.4 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరచడంతోపాటు, మలబద్దకాన్ని నిరోధిస్తాయి. కోలన్‌ క్యాన్సర్‌ ముప్పును తొలగిస్తుంది. అంతేగాక జీవక్రియలను మెరుగుపరుస్తాయి. 

బీట్‌రూట్‌లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల తిన్న తరువాత ఎక్కువసేపు ఆకలికూడా వేయదు.
బీట్‌రూట్‌లో ఉన్న నైట్రేట్స్‌ రక్తప్రసరణను మెరుగు పరిచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణ మంచిగా జరిగినప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపీడనం(బీపీ) నియంత్రణలో ఉండడం వల్ల హార్ట్‌ ఎటాక్స్‌ వంటి సమస్యలేవి తలెత్తవు.

బీట్‌రూట్‌లో యాంటీ క్యాన్సర్‌ గుణాలు సమద్ధిగా ఉన్నాయి. తెల్లరక్తకణాల ఉత్పత్తిని బీట్‌రూట్‌ ప్రేరేపిస్తుంది. ఫలితంగా అసాధారణంగా జరిగే కణవిభజనను నిరోధిస్తుంది. ఫలితంగా ఇది యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు.

బీట్‌రూట్‌ను రోజూ డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో చెడుకొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ను తాగితే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

డీహైడ్రేషన్‌ సమస్యతో బాధపడేవారికి బీట్‌రూట్‌ ఒక వరంలాంటిది. బీట్‌రూట్‌ను జ్యూస్‌రూపంలో డీ హైడ్రేషన్‌ బాధితులు తీసుకుంటే వారి సమస్య పరిష్కారమవుతుంది. మన శరీరానికి అవసరమైన నీరు బీట్‌రూట్‌ నుంచి దొరుకుతుంది.

రక్తహీనత ఉన్నవారికి బీట్‌రూట్‌ ఒక దివ్యౌషధం. బీట్‌రూట్‌ను ప్రతిరోజూ తినడం వల్ల రక్త హీనత తగ్గుతుంది.
విటమిన్‌ బీ6, విటమిన్‌ సి, ఫోలిక్‌ యాసిడ్, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

ర్యాడిక్యులోపతి

Radiculopathy Treatment Special Story In Telugu - Sakshi

మెడలో ఉన్న వెన్నుకు సంబంధించిన ఎముకలు అరిగిపోయి… అవి దగ్గరగా రావడంతో వెన్నుపూసల నుంచి వచ్చే నరాలపై ఒత్తిడి పడటం వల్ల వచ్చే నొప్పిని ‘స్పాండిలోసిస్‌’ అంటారు. తొలిదశల్లో అందరూ ఈ నొప్పిని స్పాండిలోసిస్‌ అని గుర్తించక నొప్పినివారణ మందులు వాడుతుంటారు. అయితే వాటి వల్ల తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే వస్తుంది. ఆ తర్వాత నొప్పి యధావిధిగా మొదలై మళ్లీ మళ్లీ వస్తుంటుంది. కొద్దికాలం తర్వాత అంటే కొన్ని నెలలు లేదా ఏడాదీ రెండేళ్లలో ఈ నొప్పి మెడలోనే కాకుండా భుజానికి, చేతికీ పాకుతుంది. చివరగా అది బొటనవేలు, చూపుడువేలు లేదా మధ్యవేలు వంటి చోట్లకు కూడా పాకుతుంది. కొందరిలోనైతే వేళ్లలో కాస్తంత స్పర్శ తగ్గినట్లుగా కూడా అనిపించవచ్చు.

తొలిదశలో అంటే మెడనొప్పి ఉన్న సమయాల్లోనే చికిత్స కొనసాగించి ఉంటే వ్యాధి మెడనొప్పికే పరిమితమవుతుంది. అలా వ్యాధి ముదిరినప్పుడు చేతులకూ, వేళ్లకూ పాకడం జరుగుతుంది. ఇలా చేతులకూ, వేళ్లవరకూ నొప్పి పాకుతూ స్పర్శ్ష కోల్పోయేంతవరకూ ముదిరిన పరిస్థితినీ, ఆ దశనూ వైద్యపరిభాషలో సీ–5, సీ–6 ర్యాడిక్యులోపతి గా చెప్పవచ్చు. ఇది స్పాండిలోసిస్‌ సవుస్య మరింత తీవ్రతరం కావడం వల్ల వచ్చే పరిణావుం. 

రాడిక్యులోపతి అంటే…
వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలు వెన్నెవుుకల వుధ్యన నలిగిపోవడాన్ని ర్యాడిక్యులోపతి అని అంటారు. స్పాండిలోసిస్‌ సవుస్య తీవ్రం కావడంతో ఈ పరిస్థితి వస్తుంది. స్పాండిలోసిస్‌ సవుస్య స్టేజ్‌–1లో నొప్పి– భుజానికీ, చేతికీ పాకుతుంది. అదే స్టేజ్‌–2లో అయితే… ఆ నరం నుంచి సంకేతాలు అందే భుజం, చేయితాలూకు చర్మభాగం, చేతిలోని వేళ్లకు స్పర్శ కొంతమేర తగ్గిపోతుంది. ఇక అది స్టేజ్‌–3కి చేరితే ఆ నరం నుంచి సంకేతాలు అందే చేతి కండరాలు ఒకింత చచ్చుబడినట్లుగా అయిపోవడం, కొన్నిసార్లు మునపటి అంత చురుగ్గా వేళ్లు కదిలించలేకపోవడం వంటివి జరుగుతాయి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ సవుస్య ప్రస్తుతం స్టేజ్‌–2లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. 

చికిత్స: ర్యాడిక్యులోపతి చికిత్సలో భాగంగా నొప్పి నివారణ కోసం గాబాపెంటిన్‌–300ఎంజీ వంటి వూత్రలను నొప్పితీవ్రతను బట్టి రోజూ 2–3 వూత్రలు డాక్టర్‌ సలహా మేరకు వాడాల్సి ఉంటుంది. దీంతోపాటు అవసరాన్ని బట్టి, లక్షణాలను బట్టి డోలోకైన్‌ ఎస్సార్‌–200ఎంజీ వంటి నొప్పినివారణ వూత్రలనూ వాడాల్సి ఉంటుంది. నొప్పి నివారణ కోసం వాడే వుందులు చికిత్సలో ఒక ఎత్తయితే… ఈ సవుస్య ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వురొక ఎత్తు. నిజానికి ఈ జాగ్రత్తలే ఈ ర్యాడికలోపతి చికిత్సలో చాలా  ప్రధానం. 

రాడిక్యులోపతిలో పాటించాల్సిన జాగ్రత్తలు 

 • బరువైన వస్తువ#లు ఎత్తకూడదు. అంటే నీళ్లబక్కెట్లు, సూట్‌కేసులు, బ్రీఫ్‌కేసులు, ల్యాప్‌టాప్‌లు మోయడం, పిల్లలను ఎత్తుకోవడం వంటి పనులు చేయకూడదు
 • బరువ#లు ఎత్తే క్రవుంలో తలపైన బరువ#లు (వుూటలు, గంపలు వంటి అతి బరువైనవి)  పెట్టుకోకూడదు  పడుకునే సవుయంలో తలగడ కేవలం తల కింది వరకే కాకుండా భుజాల వరకూ ఉండేలా చూసుకోవాలి. దాంతో మెడకు కొంత సపోర్ట్‌ ఉంటుంది
 • తలగడ అందుబాటులో లేకపోతే కనీసం ఒక బెడ్‌షీట్‌ నాలుగు ఇంచుల ఎత్తుగా ఉండేలా వుడత వేసి తల కింద పెట్టుకోవాలి. దాని మీద ఓ టర్కీ టవల్‌ను రోల్‌ చేసినట్లుగా చుట్టి మెడకింద పెట్టుకోవాలి. ఇలా వుూడు నెలల నుంచి ఆర్నెల్ల వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
 • ఈ సవుస్య ఉన్నప్పుడు తలగడ లేకుండా పడుకోవడం అన్నది సరికాదు. తలగడ ఉండటం వల్లనే తప్పనిసరిగా మెడకూ, భుజాలకు సపోర్ట్‌ ఉంటుంది
 • ఖాళీ సవుయాల్లో కూర్చుని ఉండేబదులు పడుకొని ఉండటం వుంచిది. 

ప్రస్తుతం మీరు స్టేజ్‌–2లో ఉన్నా… వుందులు, పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ సవుస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అయితే మీకు ఉన్న సవుస్య అదేనని నిర్ధారణ చేసుకునేందుకు వుుందుగా ఒకసారి ఎవ్మూరై సర్వైకల్‌ స్పైన్‌ పరీక్ష చేయించాల్సి ఉంటుంది. దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.

స్వచ్ఛమైన తేనె గుర్తించడం ఎలా

How to Check if Your Honey is Pure With Full Details - Sakshi

వెనుకటి రోజుల్లో పెరట్లోనో, పోలాల్లోనో, పండ్ల తోటల్లోనో, అడవుల్లో తేనె తుట్టెలు విరివిగా కనిపించేవి. తేనె పక్వానికి వచ్చినప్పుడు తేనెటీగలు కుట్టకుండా జాగ్రత్తగా ఒడిసిపట్టి ఇంట్లో నిల్వచేసేవారు. మాటలు రాని చిన్నపిల్లలకు ఈ స్వచ్ఛమైన తేనెను నాకించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడంతా ఎటుచూసినా కాంక్రీట్‌ జంగిల్‌ మాత్రమే కనిపిస్తుంది. దీనితోడు మార్కెట్లలో పేరుమోసిన అనేక బ్రాండ్లు స్వచ్ఛమైన తేనె అని చెప్పి ఒక బాటిల్‌ కొంటే మరో బాటిల్‌ ఫ్రీ అని అమ్మెస్తున్నాయి. 

వీటిని గమనించండి..
► స్వచ్ఛమైన తేనె కాస్త నల్లగా ఉంటుంది. పసుపుగా అందంగా కనిపించదు. కల్తీలేని తేనెను గాజుసీసాలో పోస్తే సీసాకు అవతల ఉన్న వస్తువులేవీ కనిపించవు. కాలం గడిచేకొద్ది కల్తీ తేనెలు కూడా నల్లగా ముదురు రంగులోకి మారతాయి. అలా అని అది స్వచ్ఛమైన నిఖార్సైన తేనె అనుకోలేము. తయారీ తేదీని బట్టి రంగును గుర్తించాలి.

► తేనెలో 18 శాతం కంటే తక్కువ వాటర్‌ ఉంటే అది స్వచ్ఛమైన తేనెగా గుర్తించాలి. 

► ఒక స్పూన్‌తో కొద్దిగా తేనె తీసి దానిని ప్లేటుపై ఒక చుక్క వేయాలి. అప్పుడు ఆ తేనె చుక్కలు ముద్దగా లేదా ధారలా జారాలి. అప్పుడు అది మంచి తేనె అని నిర్ధారించుకోవాలి. అలా కాకుండా చుక్కలు చుక్కలుగా విడిపోతూ ఉంటే అది కల్తీకలిసిన తేనెగా గుర్తించాలి.

► నాణ్యమైన తేనె అంటే ఆర్గానిక్‌ మాత్రమే. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లు ఉండడం వల్ల అది పంచదార కంటే తియ్యగా ఉంటుంది. 

► తేనెను ప్రాసెస్‌ చేసే క్రమంలో వేడిచేస్తారు. ఇలా వేడిచేసేటప్పుడు తేనెలోని ఎంజైమ్‌లు, ప్రోబయోటిక్స్‌ తోపాటు ఇతర పోషకాలు దెబ్బతింటాయి.

► తీపిదనంతో పాటు తేనెలో 20 శాతం కంటే తక్కువగా నీరు కూడా ఉంటుంది. అందువల్ల తేనెలో సూక్ష్మజీవులు పెరగలేవు. 

► ఎక్కువ కాలం తేనె తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అలా చేస్తే అది చక్కెరలా మారిపోతుంది. శుభ్రమైన పొడి గాజుసీసాలో పోసీ గాలిపోకుండా టైట్‌గా మూతపెట్టి భద్రపరిస్తే ఎన్నేళ్లైనా తేనెకు శల్యం ఉండదు. 

వెలగపండు

Variet recipes with Wood Apple - Sakshi

100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. అల్సర్‌తో బాధపడే వారికి ఈ పండు వల్ల ఉపశమనం కలుగుతుంది. వెలగపండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధి అవుతుంది. రక్తహీనతను నివారించే గుణం వెలగపండులో ఉంది. ఆగకుండా ఎక్కిళ్లు వస్తుంటే, వెలగ పండు జ్యూస్‌ తాగిస్తే తగ్గుతాయి. అలసటగా, నీరసంగా ఉన్నప్పుడు వెలగపండు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది.

మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం మంచిది. మూత్రపిండాల్లో రాళ్లు తొలగిపోతాయి. వెలగపండు గుజ్జుకి తగినంత గోరువెచ్చని నీళ్లు, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది ∙స్త్రీలు వెలగ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగపండు గుజ్జు తినడం వల్ల ప్రొటీన్లు సమపాళ్లలో అంది కండరాలు వేగంగా వృద్ధి చెందుతాయి ∙వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. ∙వెలగ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది ∙నోటి పుండ్లనీ తగ్గిస్తుంది ∙పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది.

రెక్టమ్‌ క్యాన్సర్

Anal Cancer Symptoms Or Rectum Cancer - Sakshi

మల విసర్జన సమయంలో రక్తం పడగానే అది క్యాన్సరేనేమో అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలా రక్తం పడడం అన్నది మూడు ప్రధాన సమస్యల కారణంగా జరగవచ్చు. మొదటిది యానల్‌ ఫిషర్‌ అనే సమస్య. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు కూడా రక్తం పడటంతో పాటు నొప్పి కూడా ఉంటుంది. రెండోది హెమరాయిడ్స్‌ అనే సమస్య. దీన్నే పైల్స్‌ అని కూడా అంటారు. తెలుగులో ఈ సమస్యనే తెలుగులో మొలలు లేదా మూలశంక అని వ్యవహరిస్తుంటారు. ఈ సమస్యలో కూడా రక్తస్రావం కనిపిస్తుంది. మొలలు ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు.

ఇక మూడో సమస్య క్యాన్సర్‌ కూడా కావచ్చు. ఎవరిలోనైనా మలద్వారం నుంచి రక్తం పడుతున్నప్పుడు ఆ సమస్యకు ఈ మూడింటి లో ఏది కారణమన్నది తెలుసుకోవడం కోసం కొన్ని నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదాహరణకు పెద్దపేగు, మలద్వారం వంటి భాగాలను పరీక్షించేందుకు చేసే కొలనోస్కోపీ వంటివి పరీక్షలు చేస్తారు. ఒకవేళ ముందు చెప్పిన సమస్యల్లో యానల్‌ ఫిషర్‌ లేదా పైల్స్‌ అనే రెండు సమస్యల్లో దేనినైనా సాధారణ శస్త్రచికిత్సలు లేదా ఇతరత్రా మరింత అడ్వాన్స్‌డ్‌ ప్రక్రియలతో పరిష్కరించవచ్చు.

పైగా ఆ రెండూ ప్రాణాంతకాలు ఎంతమాత్రమూ కావు. అయితే ఒకవేళ క్యాన్సర్‌ ఉన్నట్లుగా ప్రాథమిక రిపోర్టులు వస్తే…  అక్కడి గడ్డ నుంచి కొంత ముక్క సేకరించి, వ్యాధి నిర్ధారణ చేస్తారు. ఆ వచ్చిన రిపోర్టుల ఆధారంగా ఎలాంటి చికిత్స తీసుకోవాలో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఒకవేళ అది క్యాన్సరే అయినప్పటికీ… ఇప్పుడు పెద్దపేగు క్యాన్సర్లకూ, మలద్వార క్యాన్సర్లకూ మంచి చికిత్స ప్రక్రియలే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పై మూడు సమస్యల్లో ఏదైనప్పటికీ ఎవరూ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్‌ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

క్యాన్సర్ రకాలు

Types Of Cancers In Humans Symptoms Ways To Recognize - Sakshi

శరీరంలోని ఏదైనా ఒక కణం… నిరాటంకంగా, నిర్విరామంగా, నిరుపయోగంగా పెరుగుతూ పోయేదే క్యాన్సర్‌. అలా పెరిగాక రోగిని నిస్సత్తువగా చేసేస్తుంది. అలా ఓ పరిమితీ పాడూ లేకుండా అనారోగ్యకరంగా, అసాధారణమైన పెరిగే ఈ క్యాన్సర్‌ కణం మొదట ఒకే కణంతోనే మొదలవుతుంది. అది రెట్టింపు అయ్యే ప్రక్రియలో 20వ సారి రెట్టింపు అయ్యే సమయంలో ఒక మిలియన్‌ కణాలుగా వృద్ధిచెందుతుంది. మిలియన్‌ కణాల సముదాయంగా పెరిగిన ఆ సమయంలోనూ దాన్ని కనుక్కోవడం కష్టసాధ్యం. అదే 30వసారి రెట్టింపు అయ్యే సమయంలో అందులో బిలియన్‌ కణాలుంటాయి. ఆ సమయంలో దాన్ని ఓ గడ్డ (లంప్‌)లా గుర్తించడం సాధ్యం.

అంటే… చేత్తో గడ్డను తాకి గుర్తించే సమయంలో అందులో బిలియన్‌ కణాలుంటాయన్నమాట. ఇక 40వ సారి రెట్టింపయ్యాక అందులో ఒక ట్రిలియన్‌ కణాలుంటాయి. అప్పటికీ చికిత్స లభించక 42–43వ సారి రెట్టింపయినప్పుడు రోగి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాడు. అన్ని రెట్టింపులు కాకముందే… అంటే కేవలం 20వ సారి రెట్టింపయ్యే లోపు కనుక్కోగలిగితే నయం చేసే అవకాశాలు  చాలా ఎక్కువే. మరి ఆ దశలో కనుక్కోవడం ఎలా? తల నుంచి మన దేహంలోని కింది భాగాల్లోని ఏదైనా అవయవంలో క్యాన్సర్‌ను ముందే ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. క్యాన్సర్‌ లక్షణాలు అవయవానికీ అవయవానికీ మారిపోతాయి. అయితే క్యాన్సర్‌ రోగులందరిలో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యవంతుల్లోనూ అప్పుడప్పుడూ కనిపించేవి కావడంతో వాటిని గుర్తించడం కష్టం.  

క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని సాధారణ అంశాలు… 

 • ఆకలి తగ్గడం
 • కారణం తెలియకుండా / ఏ కారణమూ లేకుండా బరువు తగ్గడం
 • ఎడతెరిపి లేకుండా దగ్గు 
 • లింఫ్‌ గ్లాండ్స్‌ (బాహుమూలాల్లో, గజ్జల్లో, గొంతుదగ్గర) వాపు
 • (కొన్నిసార్లు కొన్ని అవయవాలలో మాత్రమే) అవయవాలనుంచి రక్తస్రావం… 

ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. అయితే ఈ లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌వే కానక్కర్లేదు. కాబట్టి వీటిలో ఏదో ఒకటి కనిపించిన మాత్రాన అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ప్రాథమిక చికిత్స తీసుకున్న తర్వాత కూడా, అదేపనిగా కనిపిస్తున్నప్పుడు మాత్రం ఒకసారి డాక్టర్‌చేత పరీక్ష చేయించుకుని అది క్యాన్సర్‌ కాదని నిర్ధారణ చేసుకొని నిశ్చింతగా ఉండాలి.  తల నుంచి శరీరం కింది భాగం వరకు ఆయా అవయవభాగాల్లో తొలి దశలోనే క్యాన్సర్‌ను గుర్తించేందుకు కొన్ని ప్రాథమిక లక్షణాలివి… 

బ్రెయిన్‌ క్యాన్సర్‌… 
తలనొప్పి, అకస్మాత్తుగా మతిమరపు రావడం, కొన్నిసార్లు సామాజిక సభ్యత మరచి ప్రవర్తించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనిషి మెదడులో మాట్లాడటానికీ, దృష్టికీ, వినికిడి కీ, కాళ్లూచేతుల కదలిక ల నియంత్రణకు… ఇలా వేర్వేరు ప్రతిచర్యలకు వేర్వేరు కేంద్రాలు (సెంటర్స్‌) ఉంటాయన్న విషయం తెలిసిందే. క్యాన్సర్‌ అభివృద్ధి చెందిన సెంటర్‌ దేనికి సంబంధించినదైతే ఆ అవయవం చచ్చుబడటం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. ఇవీ ఆయా అవయవాలకు సంబంధించి తొలిదశలో క్యాన్సర్‌కు లక్షణాలు.  

గొంతు భాగంలో… 
దీన్ని ఓరో ఫ్యారింజియల్‌ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ గొంతులో ఏదో ఇరుక్కుని ఉన్న భావన ఉంటుంది. అన్నవాహిక మొదటి భాగంలో అయితే మింగడంలో ఇబ్బంది. 

కడుపు (స్టమక్‌)లో… 
అదే కడుపు (స్టమక్‌)లో అయితే మంట పుడుతున్నట్లుగా ఉండే నొప్పి. పొట్టలో మంట. కొన్నిసార్లు పొట్టలో రక్తస్రావం అయినప్పుడు ఆ రక్తం వల్ల విసర్జన సమయంలో మలం నల్లగా కనిపిస్తుంది. రక్తస్రావం వల్ల రక్తహీనత (ఎనీమియా) కూడా కనిపించవచ్చు. దాంతో పాటు కొన్ని సార్లు కొద్దిగా తినీతినగానే కడుపునిండిపోయిన ఫీలింగ్‌. 

తల భాగంలో… 
ఈ క్యాన్సర్స్‌ నోటిలో, దడవ మీద, నాలుక మీద లేదా చిగుళ్లు (జింజివా) మీదా ఇలా తలభాగంలో ఎక్కడైనా రావచ్చు. ఆయా భాగాల్లో ఎరుపు, తెలుపు రంగుల ప్యాచెస్‌ ఉన్నా, దీర్ఘకాలంగా మానని పుండు (సాధారణంగా నొప్పి లేని పుండు, కొన్ని సందర్భాల్లో నొప్పి ఉండవచ్చు కూడా) ఉంటే క్యాన్సర్‌ అయ్యేందుకు అవకాశం ఎక్కువ. అదే నాలుక మీద అయితే నాలుక కదలికలు తగ్గవచ్చు. నాలుక వెనక భాగంలో అయితే స్వరంలో మార్పు. మరింత వెనకనయితే మింగడంలో ఇబ్బంది. ఇక స్వరపేటిక ప్రాంతంలో అయితే స్వరంలో మార్పు. మెడ దగ్గరి లింఫ్‌ గ్రంధుల వాపు. 

సర్విక్స్‌ క్యాన్సర్‌… 
దక్షిణ భారతదేశంలోని తీరప్రాంతాల్లోని మహిళల్లో అత్యధికంగా కనిపించే క్యాన్సర్‌ ఇది. రుతుస్రావం సమయంలో గాక మధ్యలోనూ రక్తం రావడం, రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్‌) మహిళల్లో అసాధారణంగా రక్తస్రావం కావడం, మహిళల్లో సెక్స్‌ తర్వాత రక్తస్రావం (పోస్ట్‌ కాయిటల్‌ బ్లీడింగ్‌), ఎరుపు, తెలుపు డిశ్చార్జీ వంటివి దీని లక్షణాలు. 

రొమ్ము క్యాన్సర్‌… 
మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ రకం క్యాన్సర్‌లో… రొమ్ములో ఓ గడ్డ చేతికి తగలడం, రొమ్ము పరిమాణంలో మార్పు, రొమ్ము మీది చర్మం ముడతలు పడటం, రొమ్ము చివర (నిపిల్‌) నుంచి రక్తంతో కలిసిన స్రావం లాంటివి రొమ్ము క్యాన్సర్‌ లక్షణాలు. 

ఊపిరితిత్తులు…  
పొగతాగేవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఎక్కువ.  ఈ క్యాన్సర్‌ ఉన్నవాళ్లలో దగ్గు, కళ్లెలో రక్తం పడటం వంటì  లక్షణాలు కనిపిస్తాయి. ఎక్స్‌–రే, సీటీ స్కాన్‌ పరీక్ష ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. 

రెక్టమ్‌ క్యాన్సర్‌లో… 
మలద్వారం (రెక్టమ్‌) క్యాన్సర్‌ విషయంలోనూ మల విసర్జన తర్వాత కూడా ఇంకా లోపల మలం మిగిలే ఉందన్న అనుభూతి ఉంటుంది. దీనికో కారణం ఉంది. విసర్జించాల్సిన పదార్థం మామూలుగా మలద్వారం వద్దకు చేరగానే అక్కడి నాడులు స్పందించి అక్కడ మలం పేరుకుని ఉన్నట్లుగా మెదడుకు సమాచారమిస్తాయి. దాంతో దాన్ని విసర్జించాల్సిందిగా మెదడు ఆదేశాలిస్తుంది. కానీ విసర్జన తర్వాత కూడా అక్కడ క్యాన్సర్‌ ఓ గడ్డలా ఉండటంతో ఏదో గడ్డ మిగిలే ఉందన్న సమాచారాన్ని నాడులు మెదడుకు మళ్లీ మళ్లీ చేరవేస్తుంటాయి. దాంతో ఇంకా అక్కడేదో ఉందన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ లక్షణంతో పాటు కొందరిలో బంక విరేచనాలు, రక్తంతో పాటు బంక పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. 

ఒవేరియన్‌ క్యాన్సర్‌… 
దాదాపు 50, 60 ఏళ్ల మహిళల్లో పొట్ట కింది భాగంలో నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఈ భాగానికి క్యాన్సర్‌ వస్తే ఒక్కోసారి ఏ లక్షణాలూ కనిపించకుండానే ప్రమాదకరంగా పరిణమించవచ్చు. 

టెస్టిస్‌ క్యాన్సర్‌… 
పురుషుల్లో వచ్చే ఈ క్యాన్సర్‌లో వృషణాల సైజ్‌ పెరగడం, దాన్ని హైడ్రోసిల్‌గా పొరబాటు పడటం వల్ల పెద్దగా సీరియస్‌గా తీసుకోకపోవడంతో అది సైజ్‌లో పెరిగి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఎక్కువ. 

ప్రోస్టేట్‌ క్యాన్సర్‌… 
సాధారణంగా 50, 60 ఏళ్లు దాటిన పురుషుల్లో తరచూ కనిపించే క్యాన్సర్‌ ఇది. దాదాపు లక్షణాలు ఏవీ పెద్దగా కనిపించకుండా వచ్చే ఈ క్యాన్సర్‌లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా ఉండవచ్చు. పీఎస్‌ఏ అనే పరీక్ష ద్వారా దీన్ని తేలిగ్గా గుర్తించవచ్చు. 

కిడ్నీ అండ్‌ బ్లాడర్‌ క్యాన్సర్స్‌..
మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించడం, మాటిమాటికీ మూత్రం రావడం మూత్రపిండాలు, మూత్రాశయ క్యాన్సర్లలో కనిపించే సాధారణ లక్షణం. 

చర్మ క్యాన్సర్‌… 
చర్మ క్యాన్సర్‌ను ఏ,బీ,సీ,డీ అనే నాలుగు లక్షణాలతో తేలిగ్గా గుర్తించవచ్చు. శరీరంపై ఏదైనా మచ్చ తాలూకు ఏ– అంటే… ఎసిమెట్రీ (అంటే మచ్చ సౌష్టవం మొదటికంటే మార్పు వచ్చినా, బీ– అంటే… బార్డర్‌ అంటే అంచులు మారడం, మందంగా మారడం జరిగినా, సీ– అంటే కలర్‌ రంగు మారినా, డీ అంటే డయామీటర్‌… అంటే వ్యాసం (సైజు) పెరిగినా దాన్ని చర్మం క్యాన్సర్‌ లక్షణాలుగా భావించవచ్చు. 

కొంతమందిలో తమ తాత తండ్రుల్లో, పిన్ని వంటి దగ్గరి సంబంధీకుల్లో క్యాన్సర్‌ ఉన్నప్పుడూ, అలాగే స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారూ… ఇక జన్యుపరంగా అంటే… జీరోడెర్మా, న్యూరోఫైబ్రమాటోసిస్‌ వంటి  వ్యాధులున్నవారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి హైరిస్క్‌ వ్యక్తులంతా మిగతావారికంటే మరింత అప్రమత్తంగా ఉంటూ, మరింత ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలి. 

అందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే… ఇక్కడ ప్రస్తావించిన లక్షణాలన్నీ తప్పనిసరిగా క్యాన్సర్‌కు సంబంధించినవే అని ఆందోళన వద్దు. కాకపోతే తొలిదశలో తేలిగ్గా గుర్తిస్తే క్యాన్సర్‌ తగ్గుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ఏవైనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఒకసారి డాక్టర్ల సూచన మేరకు పరీక్ష చేయించుకోవాలి.ఇక అది క్యాన్సర్‌ కాదని నిర్ధరించుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. 

బ్లడ్‌ క్యాన్సర్స్‌… 
రక్తం కూడా ద్రవరూపంలో ఉండే కణజాలమే కాబట్టి… బ్లడ్‌ క్యాన్సర్‌ కూడా రావచ్చు. రక్తహీనత, చర్మం మీద పొడలా (పర్ప్యూరిక్‌ ప్యాచెస్‌) రావడం, చిగుళ్లలోంచి రక్తం రావడం, బరువు తగ్గడం, జ్వరం రావడం వంటివి బ్లడ్‌ క్యాన్సర్‌ లక్షణాలు. లింఫ్‌ గ్లాండ్స్‌ అన్నవి బాహుమూలాల్లో, దవడల కింది భాగంలో మెడకు ఇరువైపులా, గజ్జెల్లో ఉండే ఈ గ్రంథులకూ క్యాన్సర్‌ రావచ్చు. దాన్ని లింఫోమా అంటారు. 

మిషన్ ఇంద్రధనస్సు ( శిశువులకు ఏడు రకాల టీకాలు వేయడం)

2014 డిసెంబర్ 25 న శిశువు కు ఏడు రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది.

1. B.C. G : అనగా బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ శిశువు పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఇస్తారు.

ఒకసారి మాత్రమే ఇస్తారు ఈ టీకా క్షయవ్యాధి అనగా టీబీ వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది.

2. O. P. V, I. P. V:

ఓ పి వి అనగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది పోలియో వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది.అలాగే ipv కూడా ఇస్తారు ఇది కూడా పోలియో రాకుండా కాపాడుతుంది.

3. హెపటైటిస్ బి వ్యాక్సిన్.

ఈ వ్యాక్సిన్ను కామెర్ల వ్యాధి రాకుండా శిశువుకు ఇస్తారు. ఇది కూడా శిశువు పుట్టినప్పుడు మొదటిసారిగా ఇస్తారు ఈ వ్యాక్సిన్ను తయారుచేసిన దేశాలలో నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది.

4.పెంట వ్యాక్సిన్:

ఇది ఐదు రకాల వ్యాధులు శిశువుకు రాకుండా ఇస్తారు.

1. కంఠసర్పి

2. కోరింత దగ్గు.

3. ధనుర్వాతము.

4. కామెర్లు.

5.మెదడు వాపు మరియు నిమోనియా వ్యాధులు రాకుండా ఇస్తారు.

5. M R వ్యాక్సిన్

ఇది రెండు వ్యాధులు శిశువుకు రాకుండా కాపాడుతుంది.

 1. తట్టు (మీజిల్స్ )అంటారు. పొంగు రాకుండా శిశువును కాపాడుతుంది.
 2. రూబెల్లా. చర్మానికి సంబంధించిన వ్యాధి రాకుండా ఇది కాపాడుతుంది.

6. D. P. T వ్యాక్సిన్.

ఇది మూడు రకాల వ్యాధులు శిశువుకు రాకుండా కాపాడుతుంది.

1. డిప్తీరియా. దీనిని అంగడ వాపు వ్యాధి అని అంటారు. గొంతుకు వచ్చే వ్యాధి.

2. పెర్టుసిన్. కోరింత దగ్గు రాకుండా ఇస్తారు దీనిని ఉఫింగ్ కాఫ్ అని అంటారు.

3. టెటానస్. ధనుర్వాతము ఇనుప ముక్కలు గుచ్చుకోవడం ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.

7. J. E వ్యాక్సిన్.

దీనిని మెదడువాపు వ్యాధి నివారణకు ఇస్తారు.

తల్లిదండ్రులు ఈ ఏడు వ్యాక్సిన్లను తప్పనిసరిగా తమ పిల్లలకు వేయించాలి.

రక్తహీనత

Health Tips Remedy For Controlling Anemia - Sakshi

జున్ను నుంచి బీ–12 లభిస్తుంది. పాలు, పన్నీరు, పాల ఉత్పత్తులు, ముడిబియ్యం వాడాలి.  రక్తహీనత ఎక్కువగా ఉండేవాళ్లు.. పాలకూరతో జ్యూస్‌ చేసుకుని తాగాలి. బీట్‌రూట్‌, క్యారట్‌, ఉసిరి కలిపి జ్యూస్‌ చేసుకుని ఉదయాన్నే తాగితే.. ఐరన్‌ పుష్కలంగా వస్తుంది. ఐరన్‌ సమృద్ధిగా ఉంటే రక్తహీనత రానే రాదు. రోజూ దానిమ్మ రసం తీసుకోవాలి. 

గుప్పెడు కరివేపాకును దంచి మజ్జిగలో వేసుకుని తాగితే మంచిది.  మధ్యాహ్నం పూట ప్రతిరోజూ తోటకూర, గోంగూర, పాలకూర ఏదో ఒకటి తినేలా చూసుకోవాలి. వారంలో ఆరురోజులు ఆకు కూరలు తినాలనే నిబంధన తప్పని సరిగా పెట్టుకోండి. 

మెడ పట్టడం ( రై నెక్‌ )

Get Relief From Neck Pain Simple Tips To Follow - Sakshi

ఒక మెత్తటి టర్కీ టవల్‌ను తీసుకుని, దాన్ని గుండ్రంగా రోల్‌ చేసుకుని మెడ కింద దాన్ని ఓ సపోర్ట్‌గా వాడాలి. లేదా తలగడనే భుజాల వరకు లాగి పడుకోవాలి.  తలగడ అన్నది కేవలం తలకు మాత్రమే కాకుండా… భుజాలకు కూడా సపోర్ట్‌ ఇచ్చేలా అమర్చుకోవాలి. దీనివల్ల మెడ నొప్పి ఒకటి రెండు రోజుల్లో తగ్గుతుంది. 

వ్యాయామాలు చేస్తుండేవారు మెడకు సంబంధించిన ఎలాంటి ఎక్సర్‌సైజ్‌ చేయకూడదు. పైగా మెడ పట్టేయడం సర్దుకునేందుకు అంటూ ఎలాంటి వ్యాయామాలూ చేయకూడదు. ఇలా చేస్తే పరిస్థితి మరింత తీవ్రతరమవుతుంది. కుడి చేత్తోగాని లేదా ఎడమ చేత్తో గానీ ఐదు కిలోలకు మించి బరువు అకస్మాత్తుగా ఎత్తకూడదు. అంతకు మించిన బరువులు అసలే ఎత్తకూడదు. 

కొందరు సెలూన్‌ షాప్‌లో మెడను రెండువైపులా అకస్మాత్తుగా కటకటమని శబ్దం వచ్చేలా విరిచేస్తున్నట్లుగా తిప్పిస్తుంటారు. ఇది మొరటు పద్ధతి. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుసరించకూడదు. 

నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమల్‌ లేదా ప్రమాదం లేని సాధారణ నొప్పి నివారణ మందును రెండు రోజుల కోసం మాత్రమే వాడాలి. సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోయే ఈ సమస్యలో అప్పటికీ ఉపశమనం లేకపోతే అప్పుడు డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. 

శరీర భంగిమ ( గుడ్‌ పోశ్చర్)

అసలు గుడ్‌పోశ్చర్‌ అంటే…

వెన్నెముక చుట్టూ ఉండే కండరాలన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం, కండరాలకు ఎలాంటి నొప్పులు రాకుండా శరీరాన్ని తీరుగా ఉంచడమే గుడ్‌ పోశ్చర్‌. మన డైలీ లైఫ్‌లో ఎదురయ్యే శారీరక ఒత్తిడి కండరాలు, ఎముకలపై పడకుండా జాగ్రత్తపడడమన్నమాట!

ఎలా చెక్‌ చేయాలి..
మనం సరైన భంగిమ లేదా పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నామో లేదో సింపుల్‌గా తెలుసుకోవచ్చు. కూర్చున్నప్పుడు రెండు పాదాలు సమాంతరంగా నేలపై ఉన్నాయా? రెండు పిరుదులపై సమాన భారం పడుతోందా? వెన్నెముక నిటారుగా ఉందా? భుజాలను చెవులకు సమాంతరంగా రిలాక్స్‌గా ఉంచామా? నిలుచున్నప్పుడు మోకాలి జాయింట్లు లాక్‌ అవకుండా నిల్చుంటున్నామా? పడుకున్నప్పుడు శరీరం సమాంతరంగా ఉంటోందా? వంటివి చెక్‌ చేయడం ద్వారా పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ అవుతుందా, లేదా తెలిసిపోతుంది.

హెల్త్‌పై ప్రభావం..
సరైన పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేయకపోతే, వెన్నెముక పెళుసుగా మారి, ఈజీగా దెబ్బతింటుంది. కండరాల నొప్పులు ఆరంభమై క్రమంగా పెరిగిపోతాయి. మెడ, భుజం, వెన్ను నొప్పులు పర్మినెంట్‌గా ఉండిపోతాయి. కీళ్ల కదలికలు దెబ్బతింటాయి. క్రమంగా ఈ మార్పులు జీర్ణవ్యవస్థను మందగింపజేస్తాయి. ఆపైన శ్వాస ఆడడం ఇబ్బందిగా మారుతుంది. ఈ ఇబ్బందులన్నీ మరీ ముదిరిపోతే తీవ్ర వ్యాధుల పాలు కావాల్సిఉంటుంది.

మెరుగుపరుచుకోవడం ఎలా..
► మనం చేసే ప్రతి దైనందిన కార్యక్రమాల్లో సరైన భంగిమలో శరీరాన్ని ఉంచడం చాలా అవసరం అని గుర్తించండి. 
► చురుగ్గా ఉండడం, తేలికపాటి వ్యాయామాలు, యోగాలాంటి అభ్యాసాలు, అధిక బరువు పెరగకుండా చూసుకోవడం చాలా అవసరం. 
► దీంతో పాటు హైహీల్స్‌ అలవాటు మానుకోవడం, ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం చేయకుండా శరీరాన్ని అప్పుడప్పుడు కదిలించడం, కంప్యూటర్, టీవీ వంటివి చూసేటప్పుడు లేదా టేబుల్‌ మీల్స్‌ చేసేటప్పుడు మెడను సరైన ఎత్తులో ఉంచుకోవడం ద్వారామెడపై భారం లేకుండా చేయాలి.


► ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవాల్సివస్తే మధ్యలో నడుస్తుండడం లేదా శరీరాన్ని మెల్లగా స్ట్రెచ్‌ చేయడం, కూర్చున్నప్పుడు పాదాలు మెలికవేసుకోకుండా భూమిపై సమాంతరంగా ఉంచడం, భుజాలను రిలాక్స్‌ మోడ్‌లో ఉంచడం, కూర్చున్నా లేదా పడుకున్నా నడుముకు తగిన సపోర్ట్‌ ఇచ్చే ఏర్పాటు చేసుకోవడం అవసరం.
► సెల్‌ మెసేజ్‌ చూసేటప్పుడు, గేమ్స్‌ ఆడేటప్పుడు తల వంచకుండా (ఇలా ఎప్పుడూ తలొంచుకొని మొబైల్‌లో మునిగిపోతే మెడ పట్టేస్తుంది. దీన్ని టెక్ట్స్‌ నెక్‌ అంటారు) తలకు సమాంతరంగా ఫోన్‌ను పైకి లేపి చూడడం, నడిచేటప్పుడు నిటారుగా తలెత్తుకు నడవడం వంటి పద్ధతులతో సరైన పోశ్చర్‌ పాటించవచ్చు.
► బాడీ పోశ్చర్‌ బాగా దెబ్బతిన్నదనిపిస్తే డాక్టర్‌ సలహాతో కాల్షియం, విటమిన్‌ డీ సప్లిమెంట్స్, తేలికపాటి పెయిన్‌కిల్లర్స్‌ వాడవచ్చు. బాడీ భంగిమను నిలబెట్టే ఉపకరణాలు(పోశ్చర్‌ బెల్ట్స్‌ లాంటివి) వాడవచ్చు.
► మరీ ఎక్కువగా ఇబ్బందులుంటే అలెగ్జాండర్‌ టెక్నిక్‌ టీచర్స్, ఫిజియోథెరపిస్ట్, ఖైరోప్రాక్టర్, ఓస్టియోపతీ ప్రాక్టీషనర్‌ సహాయం తీసుకోవాలి. అవసరమైతే వీరు సూచించే ఎలక్ట్రోథెరపీ, డ్రైనీడిలింగ్, మసాజింగ్, జాయిట్‌ మొబిలైజేషన్‌ లాంటి విధానాలు పాటించాలి. 
► స్మార్ట్‌ పోశ్చర్, అప్‌రైట్‌ లాంటి మొబైల్‌ యాప్స్‌లో సరైన భంగిమల గురించి, గుడ్‌పోశ్చర్‌ మెయిన్‌టెయిన్‌ చేయడం గురించి వివరంగా ఉంటుంది.

వ్యాక్సిన్‌ రేస్‌లో టాప్‌టెన్‌లో‌ భారత్‌

కోవిడ్‌ మహమ్మారిని తరిమికట్టడంలో ప్రపంచదేశాలతో భారత్‌ పోటీపడుతోంది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మనదేశం తొలి పది దేశాల సరసన నిలిచింది. ప్రజలకు అత్యధిక వ్యాక్సిన్‌ డోసులను వేసి, అంతర్జాతీయ రికార్డు సృష్టించింది. వ్యాక్సిన్‌ ఆవిష్కరించిన తొలివారం రోజుల్లోనే కోవిడ్‌–19 వ్యాప్తని అడ్డుకునేందుకు 12 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ చేసినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెపుతున్నాయి. మన దేశ ప్రజలకు వి్రస్తుతంగా టీకా పంపిణీ చేయడమే కాదు. నేపాల్, బాంగ్లాదేశ్, బ్రెజిల్, మొరాకోలతో సహా అనేక ఇతర దేశాలకు సైతం కోవిడ్‌ వ్యాక్సిన్‌ని సరఫరా చేయడంలో భారత్‌ ముందుంది.  

వారం రోజుల్లో 12 లక్షల డోసులు 
భారత్‌లో జనవరి 16న తొలుత ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పటి వరకు 12 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. ఈ లెక్కన సరాసరి రోజుకి 1.8 లక్షల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. తొలి రోజు 2 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. ఆ తరువాత శుక్రవారం సాయంత్రానికి 10.4 లక్షలకు పైగా మంది పౌరులకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, డ్రైరన్‌ నిర్వహణను ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిస్టం ద్వారా పర్యవేక్షించడం ఈ చారిత్రాత్మక కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ఎంతగానో ఉపకరించింది. దాదాపు 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.  

భారత్‌లో రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి     
భారత దేశం రెండు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లకు అనుమతిచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనికా అభివృద్ధిపరుస్తోన్న కోవిడ్‌–19 వ్యాక్సిప్‌ని కోవిషీల్డ్‌ అనిపిలుస్తున్నారు. దీన్ని పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఔషధ దిగ్గజ కంపెనీ తయారు చేస్తోంది. ఇక భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం పొందిన మరో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ భారత్‌ బయోటెక్‌ తయారు చేస్తోన్న కోవాగ్జిన్‌.

తొలి దశలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ భారత్‌ లక్ష్యం 
ప్రభుత్వం తొలుత 1.1 కోట్ల కోవిషీల్డ్‌ డోసులను, 0.55 కోట్ల కోవాగ్జిన్‌ డోసులను కొనుగోలు చేసింది. తొలి దశలో ఆగస్టు 2021 నాటికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ముందుగా పోలీసులు, సైనికుల్లాంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌తో సహా ఒక కోటి మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సినేషన్‌ వేయాలని భావించింది. రెండో దశలో 50 ఏళ్ళు దాటిన 27 కోట్ల మందికి వ్యాక్సినేషన్‌ ఇస్తారు. అనేక ఇతర దేశాలు సైతం భారత్‌లో చవకగా దొరుకుతోన్న కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత దేశం కరోనా ఇన్‌ఫెక్షన్‌ సోకిన దేశాల్లో ద్వితీయ స్థానంలో ఉంది. కోవిడ్‌తో అత్యధికంగా సతమతమైన దేశం అమెరికా. ఆ తరువాతి స్థానం మన దేశానిది. ప్రస్తుతం మన దేశంలో తాజాగా నమోదౌతోన్న కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. జనవరి 22 వరకు గతవారంలో భారతదేశంలో రోజుకి 14,000 కొత్త కరోనా కేసులు నమోదౌతూ వచ్చాయి.  

అంతర్జాతీయంగా 53 దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 
ప్రపంచవ్యాప్తంగా ఈ చారిత్రాత్మక వ్యాక్సినేషన్‌ ప్రక్రియని చాలా దేశాల్లో ప్రారంభించారు. జనవరి 22, 2021 వరకు ప్రపంచవ్యాప్తంగా 53 దేశాల్లో 5.7 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఇచ్చారు. భారత్‌నుంచి నేపాల్, భూటాన్, బాంగ్లాదేశ్, మయన్మార్‌ దేశాలు సహా బ్రెజిల్, దక్షిణాఫ్రికా, గల్ఫ్‌ లాంటి పొరుగు దేశాలకు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు ప్రజలకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రాధాన్యతను పదే పదే తెలియజేస్తూ, చైతన్య పరుస్తున్నారు. కోవిడ్‌ –19 టీకా వేయించుకునేందుకు ప్రజలను సంసిద్ధం చేస్తున్నారు.

భారత్‌ వ్యాక్సిన్‌ మైత్రిని కొనియాడుతోన్న ప్రపంచ దేశాలు 
కోవిడ్‌–19కి వ్యతిరేకంగా ‘సంజీవని బూతి’ని పంపారంటూ హనుమంతుడి ఫొటోను పోస్ట్‌ చేస్తూ, బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సోనారో భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ నుంచి కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ని అందుకున్న ఆరు దేశాల్లో భూటాన్, మాల్దీవ్స్‌ మొదటి స్థానంలో ఉన్నాయి. భారత దేశం కోవిడ్‌ –19 వ్యాక్సిన్‌ వాణిజ్య సరఫరాని కూడా ప్రారంభించింది.   

బోదకాలు (Filariasis)

బోదకాలు (Filariasis) సమస్య క్యూలెక్స్‌ రకం దోమ కుట్టటం వల్ల వస్తుంది.ఈ వ్యాధి ఫైలేరియా అనే సూక్ష్మక్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఇంటి పరిసరాల్లో ఉన్న మురుగునీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందే క్యూలెక్స్‌ దోమ ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలోని ‘మైక్రోఫైలేరియా‘ క్రిములు మన శరీరంలో ప్రవేశించి మన లింఫ్‌ నాళాల్లో పెరిగి పెద్దవవుతాయి. అవి లింఫ్‌ గ్రంథుల్లో చేరి ఉండిపోతాయి. ఇవి అక్కడ పెద్దగా పెరగటం వల్లే మనకి బోదకాలు వస్తుంది. వీటి నుంచి వచ్చే కొన్ని విషతుల్యాల (Toxins) వల్ల లింఫు నాళాల్లో వాపు వస్తుంది. అలాగే ఈ క్రిములు చనిపోయి లింఫు నాళాల్లో అవరోధంగా మారటం వల్ల వీటికి బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లు కూడా తోడవటం వల్ల కాలు వాపు, జ్వరం, గజ్జల్లో బిళ్లల వంటి బాధలు మొదలవుతాయి. ఈ బాధలు వచ్చిన ప్రతిసారీ నాలుగైదు రోజులుండి తగ్గిపోతాయి. కానీ మళ్లీమళ్లీ వస్తూనే ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్ళకు మాత్రమే కాకుండా చేతులు, రొమ్ము, పురుషాంగాలకు, హైడ్రోసిల్‌, రొమ్ము భాగానికి, స్త్రీ మర్మాంగాలకు కూడా రావచ్చును.

మన శరీరంలో ధమనులు, శిరలే కాక లింఫ్ నాళాలు ఉంటాయి. రక్తనాళాలు సిమెంటు లేదా ఇనుప గొట్టాలవంటివి కావు. రక్తనాళాల పల్చని గోడలనుంచి వెలుపలికి స్రవించిన ద్రవం లింఫ్ నాళాలద్వారా మళ్ళీ రక్తంలోకి చేరుకొంటుంది. గజ్జలు, చంకలు వంటి చోట్ల లింఫ్ గ్లాండ్లు ఉన్నాయి. ఇవి కోటలో కాపలా లేదా పహరా పెట్టిన కవాటాలవంటివి. కొంతకాలం రోగకారక క్రిములను ఇవి నిలవరించ గలవు. ఫైలేరియా పేరసైట్ లింఫ్ గ్లాండ్ కు అడ్డపడడంవల్ల లింఫు నాళాలద్వారా ప్రవహించిన పోషక ఆహారం కలిగిన ద్రవాన్ని సమీప కండరాలు పీల్చుకొని అస్తవ్యస్తంగా పెరుగుతాయి. అట్లా పెరిగిన కాలినే ఏనుగు కాలు అనేవారు. స్త్రీలలో రొమ్ములు, చేతి కండరాలు, పురుషుల పురుషాంగం పెరిగి పోవడం కూడా సంభవమే.

మన ప్రభుత్వాలు నిరంతరం శ్రమించి పనిచేయడంవల్ల, రోగులకు వైద్యం అందడం వల్ల చాలావరకు ఇప్పుడు రోగగ్రస్తులు కనిపించడం లేదు. ఈ క్రిమి రాత్రి మనం నిద్రలో ఉన్నపుడు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. 1980దశకంలో ఫైలేరియా శాఖవారు పెట్రోమాక్సుదీపాలు తీసుకుని రాత్రి వేళ ఇంటింటికి తిరిగి రక్తనమూనాలు తీసి, పరీక్షలు చేసి ఇన్.ఫెక్షన్ ఉన్నవారికి హెట్రొజాన్ మందు బిళ్ళలు ఇంటికి తెచ్చి ఇచ్చేవారు.

బోదకాలు - వికీపీడియా

(తెలుగు వికీపీడియాలో నుంచి)

కరోనావైరస్ వ్యాక్సిన్ భారత్ లో ప్రారంభం

మోదీ

కరోనావైరస్‌కు కళ్లెం వేయడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా తొలి దశ టీకాల కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ( 16-01-2021) వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ కేంద్రాలన్నింటినీ వర్చువల్‌గా అనుసంధానించారు. తొలి రోజు శనివారం ఒక్కో కేంద్రంలో వంద మందికిపైగా టీకాలు తీసుకోనున్నారు. ఈ వ్యాక్సినేషన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు.

వ్యాక్సినేషన్

‘దేశమంతా ఎదురుచూసిన రోజు ఇది’

వ్యాక్సినేషన్ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

”ఈ రోజు కోసం మనం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం. వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్న ఎప్పటినుంచో మనల్ని తొలచేస్తుండేది. ఇప్పడు టీకా వచ్చేసింది. చాలా తక్కువ సమయంలోనే పరిశోధకులు టీకాను అభివృద్ధి చేశారు. దీని కోసం రాత్రి, పగలు తేడా లేకుండా పరిశోధకులు కష్టపడ్డారు” అని మోదీ అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్

”ఒకటి కాదు.. రెండు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సీన్లను పరిశోధకులు సిద్ధం చేశారు. కరోనావైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉండేవారికి మొదట ఈ వ్యాక్సీన్లు ఇస్తాం. వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మొదట వ్యాక్సీన్లు ఇస్తాం. వైద్య సిబ్బంది ప్రైవేటులో ఉన్నా.. ప్రభుత్వంలో పనిచేస్తున్నా.. అందరికీ ఈ వ్యాక్సీన్ ఇస్తాం” అని మోదీ స్పష్టం చేశారు.

కోవిడ్ వ్యాక్సినేషన్

‘చరిత్ర సృష్టిస్తున్నాం’

”చరిత్రలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ టీకాలు వేయలేదు. 3 కోట్ల కంటే తక్కువ జనాభా ఉండే దేశాలు వందకుపైనే ఉన్నాయి. కానీ భారత్ తొలి దశలోనే మూడు కోట్ల మందికి టీకాలు వేస్తోంది. రెండో దశలో ఈ సంఖ్యను 30 కోట్లకు తీసుకెళ్తాం. తొలి డోసు టీకా తీసుకున్న తర్వాత మాస్క్ పెట్టుకోకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం లాంటి తప్పులు చేయొద్దు. ఎందుకంటే రెండో డోసు టీకా తీసుకున్న తర్వాతే పూర్తి రక్షణ లభిస్తుంది. వ్యాక్సీన్ రెండు డోసులు పూర్తిగా వేసుకోవడం చాలా ముఖ్యం. రెండు డోసుల మధ్య ఒక నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు” అని మోదీ చెప్పారు.

మోదీ భావోద్వేగం

”ఈ కరోనావైరస్ మనుషుల మధ్య దూరాన్ని పెంచింది. పిల్లల్ని దూరం చేసుకొని తల్లులు ఏడ్చారు. ఆసుపత్రుల్లో చేర్పించిన వృద్ధులను కలవలేకపోయాం. కరోనాతో మరణించిన వారికి సరిగా అంతిమ వీడ్కోలు కూడా చెప్పలేకపోయాం’ అన్నారు ప్రధాని. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆరోగ్య సేవల సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్ల ఇబ్బందుల గురించి మాట్లాడుతూ మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

‘దేశ మంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి’

మోదీ తన ప్రసంగంలో తెలుగు కవి గురజాడ అప్పారావు కవితను చదివారు. ‘సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడుపడవోయి.. దేశమంటే మట్టి కాదోయి.. దేశమంటే మనుషులోయి’’ అని గురజాడ చెప్పిన మాటలను మోదీ గుర్తు చేశారు.

Image

నోట్లో పొక్కులు

Solutions For Mouth Ulcers In Telugu - Sakshi

కొందరికి నాలుక మీద పగులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు నోట్లో పొక్కులు రావచ్చు. ఏవైనా వేడిపదార్థాలో లేదా కారంగా ఉన్నవో తింటే మామూలు కంటే ఎక్కువగా మంట, బాధ ఉంటాయి. నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి (అఫ్తస్‌ అల్సరేషన్‌) చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా… విటమిన్‌–బి లోపంతో ఈ సమస్య రావచ్చు. దీనికి తోడు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగై్జటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అరుదుగా కొన్ని సిస్టమిక్‌ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొక్కులకు సరైన కారణం తెలుసుకుని దానికి తగిన చికిత్స చేయించాలి. అందుకే నోట్లో పొక్కులు వచ్చే వారు ముందుగా విటమిన్‌–బి కాంప్లెక్స్‌ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారంపాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి.

సరిగా బ్రష్‌ చేసుకుంటున్నారా?
మనం బ్రష్‌ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవి మన దంతాల, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచి, కేవలం దంతాలను మాత్రమే కాకుండా మన పూర్తి దేహానికి ఆరోగ్యాన్నిస్తాయి. వాటిలో కొన్ని  ముఖ్యమైనవి… 
► బ్రష్‌ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్‌ ఉన్న బ్రష్‌నే వాడాలి. మరీ బిరుసైనవీ, గట్టివి అయితే పళ్లు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు… చిగుళ్లు గాయపడే అవకాశమూ ఉంది.  
►కిందివరసలో చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్‌ చేసుకోండి. ఇలా బ్రష్‌ చేసుకునే సమయంలో బ్రష్‌ను పైకీ, కిందికీ నేరుగా కాకుండా… గుండ్రగా తిప్పుతున్నట్లుగా మృదువుగా బ్రష్‌ చేసుకోవాలి. రఫ్‌గా బ్రష్‌ చేసుకుంటే చిగుళ్లు గాయపడి, త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. 
►బ్రషింగ్‌తో పాటు ముఖం కడుకున్న తర్వాత చివర్లో చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్‌ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బర్డ్ ఫ్లూ

బర్డ్ ఫ్లూ

పక్షులకు ఈ వైరస్ ఎలా సోకుతుంది?

హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది.

ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది.

పక్షుల రెట్టల నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు… అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి.

కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే వీటి వల్ల ఇతర పక్షులకు వైరస్ వ్యాపించే ముప్పు ఉంటుంది. వలస పక్షుల వల్ల ఇవి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంటాయి.

బర్డ్ ఫ్లూ

మనుషులకు ఎలా సోకుతుంది?

ఈ వైరస్ సోకిన పక్షులకు సమీపంలో ఎక్కువ సేపు గడిపినప్పుడు ఎక్కువగా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసేవారికి ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా బర్డ్ ఫ్లూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.

వైరస్

అయితే, ఏదో ఒకరోజు ఈ వైరస్ కూడా జన్యు పరివర్తన చెంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధించొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1918లో లక్షల మంది మరణాలకు కారణమైన స్పానిష్ ఫ్లూ ఇలానే పక్షుల నుంచి మనుషులకు సంక్రమించిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

తాజా కోవిడ్-19 వైరస్ కూడా జన్యుపరివర్తన చెందడంతో మనుషుల మధ్య వ్యాపించగలిగే సామర్థ్యాన్ని సంపాదించగలిగింది.

బర్డ్ ఫ్లూ

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, జలుబు, వణుకు లాంటి లక్షణాలతో మనుషుల్లో బర్డ్ ఫ్లూ మొదలవుతుంది.

సాధారణ ఫ్లూ లక్షణాలే బర్డ్ ఫ్లూ సోకినప్పుడూ కనిపిస్తాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి.

చికిత్స ఏమిటి?

లక్షణాలు తగ్గేందుకు యాంటీవైరల్ ఔషధాలను వైద్యులు సూచిస్తారు. పారాసిటమాల్ లాంటి నొప్పి నివారిణులను కూడా ఇస్తుంటారు.

బర్డ్ ఫ్లూ

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎలాంటి ఫ్లూలు విజృంభిస్తున్నప్పుడైనా.. తరచూ చేతులు కడుక్కోవడం; దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు గుడ్డలు అడ్డుపెట్టుకోవడం లాంటి చర్యలతో ముప్పును తగ్గించుకోవచ్చు.

ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించేటప్పుడు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలు కనిపించే వారి నుంచి సామాజిక దూరం పాటించాలి.

కోళ్లు, బాతులకు మీరు ఆహారం వేయొచ్చు. అయితే ఆహారం వేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చనిపోయిన, జబ్బు పడిన పక్షుల దగ్గరకు పోకూడదు.

చికెన్ తినొచ్చా?

శుభ్రంగా వండితే వైరస్ చనిపోతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు.

చికెన్, గుడ్లు శుభ్రంగా, పూర్తిగా వండేలా జాగ్రత్తలు తీసుకునేంత వరకు వీటి నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు.

అసలు మనకి జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి?

జ్వరం అనేది వ్యాధి కాదు. వ్యాధి లక్షణం. శరీరం లో ఏదయినా భాగానికి ఇన్ఫెక్షన్ సోకి నప్పుడు, కొన్ని సందర్భాలలో వైరస్ ల కారణం గాను జ్వరం వస్తుంది. ఇన్ఫెక్షన్ బాక్టీరియా వల్ల, కలుషితం అయిన ఆహారం, నీరు, వాతావరణం లో మార్పు ల వలన వస్తుంది. ముందు గా డాక్టర్ లు చేయవలసినది, ఎందుకు జ్వరం వచ్చింది పరిశీ లించడం.తరువాత తగిన వైద్యం చెయ్యడం.

జ్వరం అంటే ఏమిటి? మన శరీర ఉష్ణోగ్రత సాధారణ పరిస్థితుల్లో 98.6° F, .37°C (సాధారణoగా కొద్దిపాటి తేడా ఉండచ్చు ) అది ఏ మాత్రం పెరిగినా జ్వరం అంటారు. శరీరం కాస్త వేడిగా ఉంటుంది. ఇది మరింత పెరిగితే వేడి మరికాస్త ఎక్కువ. దీనికి తోడుగా ఉండేది తలనొప్పి.ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దానితో పోరాడ డానికి రక్తం లోని సైన్యం (తెల్ల రక్త కణాలు )రడీ గా ఉంటుంది. ఆ పోరాటం లోనే జ్వరం వస్తుంది.

శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే మంచి మందు పారాసెటామోల్ (paracetamol ). ఇది crocin, Dolo, calpol తదితర పేర్ల తో దొరుకుతుంది. దీనితో పాటు ఇన్ఫెక్షన్ తగ్గటానికి ఆంటిబయోటిక్ ను డాక్టర్ లు వ్రాస్తారు. ఇవి పెన్సిలిన్ (amoxy cyllin, cipro floxacin etc) తరహా మందులు, సల్ఫా డ్రగ్స్ (septran etc )cefexime etc. వీటిని డాక్టర్ సలహా మీదే వాడండి.సాధారణ జ్వరం తగ్గుతుంది. ఏంటి బయోటిక్స్ 5 నుండి 7 రోజులు వాడాలి. జ్వరం తగ్గింది అని పూర్తి కోర్స్ వాడక పొతే ఇన్ఫెక్షన్ తిరగ బెడుతుంది. మందులు పూర్తి కోర్సు వాడాలి.

చుండ్రు సమస్యలు

బూడిద గుమ్మడి రసం తలకు రాసుకుంటే,బట్టతల ,జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఈ రసం చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది. బూడిద గుమ్మడి ఆకులూ , నేలవుసిరి ఆకులు తో కామెర్ల మందు తయారు చేస్తారు. గుమ్మడి కాయ రసం బాగా చలువ చేస్తుంది. గాస్ ట్రబుల్స్ పోగొడుతుంది.

మధుమేహం తగ్గిస్తుంది. మానసికంగా చాలా బలహీన పడినప్పుడు, బూడిద గుమ్మడి రసం తలకు పట్టించడం పూర్వం నుండి వాడుక లో వుంది. గింజలు కూడా చాలా బల వర్ధక మైనవి. వీటిలో కూడా ఔషధ గుణాలున్నాయి.

Keep Walking

The calf muscle in your legs is your second heart.


Everyone knows that the heart pumps blood, right? But did you know that your body has a second blood pump? It’s your calf muscles! That’s right, the calf muscles in your legs are your second heart!

The human body is engineered such that when you walk, the calf muscles pump venous blood back toward your heart.

The veins in your calf act like a reservoir for blood your body does not need in circulation at any given time. These reservoir veins are called muscle venous sinuses. When the calf muscle contracts, blood is squeezed out of the veins and pushed up along the venous system. These veins have one-way valves which keep the blood flowing in the correct direction toward the heart, and also prevent gravity from pulling blood back down your legs.

Walking or running enables your foot to play a major role in the pumping mechanism of the calves. The foot itself also has its own (smaller) venous reservoir. During the first motion of taking a step, as you put weight on your foot, the foot venous reservoir blood is squeezed out and ‘primes’ the calf reservoir. Then, in the later stages of a step, the calf muscle contracts and pumps the blood up the leg, against gravity. The valves keep the blood flowing in the right direction and prevents gravity from pulling the blood right back down.

Thus, when you are immobile for long periods of time (sitting in an airplane, car seat, or chair for hours) your calf muscle is not contracting much and the blood stagnates.

That’s why walking or running is so good for overall blood circulation. It prevents blood pooling and helps prevent potentially dangerous blood clots called deep vein thrombosis(DVT).

Another condition called venous insufficiency, or venous reflux can cause blood to pool in your legs due to the failure of the valves to work properly. In this condition, the valves fail to prevent the backflow of blood down your legs. Symptoms of venous insufficiency can include heavy, tired, throbbing, painful legs, ankle swelling, bulging varicose veins, cramps, itching, restless leg, skin discolouration and even skin ulceration. Venous insufficiency is a very common disorder, affecting over 40 million people in the U.S.

In cases when a person is even more immobile, such as laying in a hospital bed, the pooled blood can become stagnant and develop into a blood clot. This is called a deep vein thrombosis (DVT). DVT can cause leg pain and swelling and is dangerous because a blood clot can break off and travel in your blood stream and get lodge in your lungs.

కడుపులో పురుగులు

కడుపులో పురుగులు ఉన్నాయంటే అవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా మొదలుకొని, ఏకకణ జీవులైన ప్రోటోజోవా నుంచి బద్దెపురుగులూ (ఫ్లాటీహెల్మెంథిస్‌), వానపాముల జాతికి చెందిన నిమటోడ్స్‌ వరకు ఎన్నెన్నో రకాలైనవి ఉండవచ్చు. కడుపులోకి చేరి బాధించే ఏకకణజీవులైన ప్రోటోజోవా వర్గానికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉండే హెల్మింథిస్‌ (ఫ్లాటీ అండ్‌ నిమటీ హెల్మెంథిస్‌) వర్గానికి చెందిన పరాన్నజీవులివి.

► ప్రోటోజోవాకి చెందిన జియార్డియా
ఇది జీర్ణవ్యవస్థలోని చిన్న పేగుల్లో (డియోడినమ్‌ అనే భాగంలో) ఉండే పరాన్నజీవి. ఇది ఏకకణ జీవి. మైక్రోస్కోప్‌ కింద చూసినప్పుడు చిత్రంగా పెద్దపెద్ద కళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చిన్నపేగుల్లో జీవిస్తుంది కాబట్టి దీన్ని జియార్డియా ఇంటెస్టినాలిస్‌ అని కూడా అంటారు. డియోడినమ్‌లో ఉండే దాన్ని జియార్డియా డియోడినాలిస్‌ అంటారు. కలుషితమైన ఆహారం తినేవారిలో ప్రధానంగా పరిశుభ్రత పాటించని హాస్టళ్లు, హోటళ్లలో తినేవారిలో ఇది ఉంటుంది. ఇది కడుపులో పడ్డవారిలో నీళ్ల విరేచనాలు, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కడుపులోని క్రిములను నిర్మూలించాకే ఆ ల„ý ణాలు దూరం అవుతాయి.

► ఎంటమీబా హిస్టొలిటికా
ఇది కూడా ప్రోటోజోవాకే చెందిన ఏకకణ సూక్ష్మజీవి. ఇది అపరిశుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాపిస్తుంది. దీని వల్ల అమీబియాసిస్‌ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల… నీళ్ళ విరేచనాలు, కడుపులో నొప్పి, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో అప్పుడప్పుడు ఆకస్మికంగా జ్వరం రావచ్చు. ఇంకొందరిలో దగ్గు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, అనీమియాకు గురికావడం లాంటి లక్షణాలూ ఉంటాయి. అరుదుగా కొన్ని సందర్భాలలో పురుగులకు సంబంధించిన లార్వాలు మెదడులోకి వెళ్ళడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

► ఫ్లాట్‌ వార్మ్‌ (టీనియా సోలియమ్, టీనియా సాజినెటా): ఇవి మూడు మీటర్ల కంటే పెద్దగా ఉంటుంవి. ఇవి పొడవులను కొలిచే టేప్‌లా ఫ్లాట్‌గా ఉండటంతో టేప్‌ వార్మ్స్‌ అనీ, ఫ్లాట్‌ వార్మ్స్‌ అని కూడా అంటుంటారు. మనం తినే ఆహారాలు పూర్తిగా సరిగా ఉడికేలా జాగ్రత్త పడాలి. సాధారణంగా మనలో కొందరికి పోర్క్, ఇంకొందరికి బీఫ్‌ తినడం అలవాటు. అలాంటి వారిలో కచ్చాపచ్చాగా ఉడికించి వండిన పోర్క్‌ తినడం వల్ల టీనియో సోలియమ్‌ జీవులు పెరుగుతాయి. అలాగే సరిగా ఉడికించని బీఫ్‌ తినేవారిలో టీనియా సాజినేటా జీవులు వృద్ధి చెందుతాయి. ఈ జీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్‌ను టేప్‌వార్మ్‌/ఫ్లాట్‌వార్మ్‌ ఇన్ఫెక్షన్‌ అని వ్యవహరిస్తుంటారు.

► నులి పురుగు/ ఆస్కారిస్‌ వార్మ్స్‌: ఇవి చిన్నపేగుల్లో తమ ఆవాసం ఏర్పరచుకుంటాయి.  వీటి కారణంగా కడుపునొప్పి, డయేరియా వంటి లక్షణాలు ఉంటాయి. ఈ నులిపురుగులు 5 నుంచి 10 సెం.మీల పొడవు ఉంటాయి. అపరిశుభ్రమైన ఆహారం, నీటి వల్ల ఇవి కడుపులోకి చేరుకుంటాయి.

► పిన్‌ వార్మ్‌ / త్రెడ్‌ వార్మ్‌ / సీట్‌ వార్మ్‌: ఈ క్రిమి కారణంగా మలద్వారం  వద్ద విపరీతమైన దురద వస్తుంది. సాధారణంగా చిన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటుంటారు. వారు ఆటల సమయంలో తమ పిరుదులు, కింది భాగంలో గీరుకోవడం, తర్వాత ఆ వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల ఈ క్రిములు శరీరంలోకి చేరుతాయి. అక్కడి నుంచి జీర్ణవ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. ఈ క్రిములు దాదాపు 2 నుంచి 3 మి.మీ పొడవుంటాయి.

► హుక్‌ వార్మ్‌ (ఎన్‌కైలోస్టోమా, సిస్టోజోమా): ఇవి చర్మం ద్వారా శరీరంలోకి చొచ్చుకుని వెళ్లి రక్తనాళాల్లోకి వెళ్లి రక్తప్రవాహంలో కలుస్తాయి. అలా రక్తం ద్వారా అవి  కాలేయం, మూత్రాశయం వంటి భాగాలలోకి చేరుకుని అక్కడ వృద్ధి చెందుతాయి. ఇవి 1 మి.మీ కంటే తక్కువ పరిమాణంలో ఉండటం వల్ల ఇది కంటికి కనిపించవు. అపరిశుభ్రమైన పరిసరాల వల్ల ఇవి ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తాయి.  

కడుపులో పురుగుల నివారణకూ / బయటపడటానికీ ఆహారనియమాలివి బాగా పుష్కలంగా తినాల్సినవి :
► పురుగులు పేగుల్లో నుంచి బయటపడాలంటే మన దేహంలో కదలికలు చురుగ్గానూ, బాగా ఉండాలి. శారీరకంగా మంచి కదలికలు, శ్రమ ఉండేవారిలో పేగుల కదలికలు కూడా చురుగ్గా ఉండి, మలవిసర్జన సాఫీగా అవుతుంది. అలాంటప్పుడే విరేచనం ద్వారా పురుగులు బయటకు వస్తాయి. కాబట్టి మనం శారీరక శ్రమ / వ్యాయామం చేస్తూ ఉండాలి. అలాగే రోజూ పుష్కలంగా నీళ్లు తాగడంతో పాటు విరేచనం సాఫీగా జరగడానికి తోడ్పడేందుకు ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆకుకూరలూ / కాయగూరలను ఎక్కువగా తీసుకోవాలి.

► మనం తినే టిఫిన్లు, ఉపాహారాలలో దేహానికి ఉపయోగపడే బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే ఇడ్లీ, దోస వంటివి తినాలి. అలాగే ప్రోబయాటిక్స్‌ ఎక్కువగా ఉండే తియ్యటి పెరుగు, మజ్జిగ వంటివి తీసుకోవాలి. పులిసిన పెరుగు/మజ్జిగ వంటివి మళ్లీ యాసిడ్‌ను పెంచి కడుపులో మరింత ఇబ్బందికి కారణమవుతాయి.

► ఆహారం సరిగా జీర్ణం కావడానికి తోడ్పడే ఎంజైమ్‌ల వల్ల చిన్నపేగు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్‌లు వృద్ధి చెందాలంటే విటమిన్‌–సి, జింక్‌ వంటివి ఎక్కువగా ఉండే ఎక్కువగా ఉండే ఆహరం తీసుకోవాలి.

తీసుకోకూడనివి లేదా పరిమితంగా మాత్రమే తీసుకోవాల్సినవి
► కార్బోహైడ్రేట్స్, చక్కెరతో కూడిన ఆహారం, పళ్ళ రసాలు, పాల ఉత్తత్తులు, కొవ్వుపదార్థలు, నూనెలు వంటివి తగ్గించడం మంచిది.

చికిత్స
► కడుపులో పురుగులు పడ్డాయని అనుమానించినప్పుడు డాక్టర్లు మల పరీక్షల వంటి  కొన్ని పరీక్షల ద్వారా వీటిని నిర్ధారణ చేసి… కడుపులో ఉన్న క్రిములను బట్టి మిబెండజోల్‌ వంటి కొన్ని  సాధారణ మందుల ద్వారానే వీటిని నిర్మూలించేలా చికిత్స చేస్తారు.

కడుపులోకి క్రిములు / పురుగులు చేరేదెలాగంటే…
► కడుపులోకి క్రిములు / పురుగులు చేరడానికి ముఖ్య కారణం అపరిశుభ్రమైన నీరు, ఆహారాన్ని తీసుకోవడం. అలాగే సరిగ్గా ఉడికించని మాంసాహారాలతోనూ టేప్‌వార్మ్‌ వంటి జీవులు చేరతాయి. అలాగే మనం రోజూ తినే ఆకుకూరలు, కూరగాయలు సరిగ్గా శుభ్రపరచకుండా తీసుకోవడం వల్ల కూడా క్రిములు పెరిగే అవకాశముంది.

► కాళ్లకు చెప్పుల వంటి రక్షణ ఏదీ లేకుండా మట్టిలో అపరిశుభ్రమైన పరిసరాలలో తిరిగే వాళ్లలో హుక్‌ వార్మ్‌వంటి పురుగులు కడుపులోకి చేరి, అక్కడ వ్యాప్తి చెందుతాయి.

ఆటో ఇన్ఫెక్షన్స్‌ : కొందరు చిన్న పిల్లలు మర్మాంగాల వద్ద, పృష్ట భాగంలో గీరుకుంటూ… అవే వేళ్లను నోటిలో పెట్టుకోవడం వల్ల వారి నుంచి వారికే పురుగులు వ్యాపిస్తాయి.

నివారణ
► కడుపులో పురుగులు రాకుండా, క్రిములు చేరకుండా ఉండాలంటే మొట్టమొదటి సాధారణ సూత్రం పరిశుభ్రమైన నీళ్లు తాగాలి. కలుషితమైన చోట్ల తాగాల్సి వస్తే తప్పక కాచి చల్లార్చి, వడపోసిన నీటిని మాత్రమే తాగాలి.

వ్యాక్సిన్‌ వచ్చేసింది : కో-విన్‌ యాప్ రిజిస్ట్రేషన్‌ ఎలా?

how to register Co-WIN app likely to be used for COVID-19 India vaccine - Sakshi

కరోనా మహమ్మారి  అంతానికి దేశంలో తొలి స‍్వదేశీ వ్యాక్సిన్‌తోపాటు, మరో వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన తరుణంలో మొత్తం టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, రియల్ టైమ్ కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీని పర్యవేక్షించడానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. 

గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘కొ-విన్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులోకి లేదు. ఆరోగ్య అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాత్రమే నమోదుకు అనుమతి.  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్‌ వేస్తారు. టీకా కోసం ఇప్పటికే లక్ష మందికి పైగా  ఆరోగ్య సిబ్బంది నమోదు చేసుకున్నట్టు సమాచారం.  ఆ తరువాది దశలో కో-విన్‌ లో రిజిస్టర్‌ అయిన వారికే టీకా వేస్తారు. ముఖ్యం‍గా 50 ఏండ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి  టీకా లభించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన తరువాత ప్రజలు నమోదు చేసుకునేందుకు  ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు , ఇతర వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తదితరకార్డులను అప్‌లోడ్ చేసి నమోదు చేసుకోవచ్చు. భారత్‌లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.

కో-విన్‌ : ఐదు విభాగాలు
దేశంలో సాధారణ టీకా కార్యక్రమాల కోసం కేంద్రం ‘ఈవిన్‌’ (ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) అని పిలుస్తారు. తాజాగా కొవిడ్‌-19 టీకాను కోట్లాది మంది భారతీయులకు  అందుబాటులోకి తెచ్చేలా అత్యాధునిక ఫీచర్లతో, ఆధునిక సామర్థ్యంతో కో-విన్‌ (కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) యాప్‌ను కేంద్రం తీసుకొస్తోంది.

 • రిజిస్ట్రేషన్‌, అడ్మినిస్ట్రేటర్‌, వ్యాక్సినేషన్‌, బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌, రిపోర్టు అనే ఐదు విభాగాలుంటాయి. 
 • రిజిస్ట్రేషన్‌: ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ వర్కర్స్‌ కానటువంటి సాధారణ ప్రజలు వ్యాక్సినేషన్‌ కోసం ‘కొ-విన్‌’లోని ‘రిజిస్ట్రేషన్‌ విభాగం’లో రిజిస్టర్‌ కావొచ్చు. దీనికి ఫొటో ఐడెంటిటీ అవసరం.
 • అడ్మినిస్ట్రేటర్‌: వ్యాక్సిన్‌ అవసరమైన ప్రజలు యాప్‌లో నమోదు చేసిన సమాచారాన్ని ఈ విభాగంలో అధికారులు పర్యవేక్షిస్తారు.  
 • వ్యాక్సినేషన్‌: వ్యాక్సిన్‌ పంపిణీ ఏ స్థాయిలో ఉన్నది? ఎంత మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు? అర్హుల జాబితా తదితర అంశాలు ఉంటాయి.
 • బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌: టీకా వేసుకున్న లబ్ధిదారుల మొబైల్‌లకు ‘వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు’ ఎస్సెమ్మెస్‌ పంపిస్తారు. క్యూఆర్‌ ఆధారిత ధ్రువపత్రాన్ని కూడా జారీ చేస్తారు. 
 • రిపోర్టులు: ఎన్ని వ్యాక్సిన్‌ సెషన్లు పూర్తయ్యాయి? ఒక్కో వ్యాక్సిన్‌ సెషన్‌కి ఎంత మంది హాజరయ్యారు? ఎంత మంది గైర్హాజరయ్యారు వంటి రిపోర్టులు ఇందులో ఉంటాయి.

‘కో-విన్‌’లో రిజి స్ట్రేషల్‌ ఎలా?
యాప్‌లో రిజిస్ట్రేషన్‌, వివరాల నమోదులో భాగంగా ఫొటో ఐడెంటిటీని (ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పెన్షన్‌ ధ్రువ పత్రం) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయ్యాక.. వ్యాక్సిన్‌ వేసే తేదీ, సమయం, ప్రాంతం వివరాలు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తాయి.

జట్టు రాల‌డం – నివారణ

Here Are 5 Benefits Of Using Curd On Your Hair Does Wonders - Sakshi

ఈ మ‌ధ్య‌కాలంలో  జట్టు రాల‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా చిన్న వ‌య‌సులోనూ జుట్టు తెల్ల‌బ‌డ‌టం, ఎక్కువ‌గా రాలిపోవ‌డం, దుర‌ద‌, చుండ్రు లాంటి అనేక స‌మ‌స్య‌ల‌కు పెరుగు చాలా చ‌క్క‌టి ప‌రిష్కారం అంటున్నారు నిపుణులు. వేల‌కు వేలు పోసి జుట్టుపై కెమిక‌ల్స్ ప్ర‌యోగించినా ఎలాంటి ఫ‌లితం ఉండ‌క‌పోగా దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు, సైడ్ ఎఫెక్స్ వ‌స్తుంటాయి. వీట‌న్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవ‌చ్చు. పెరుగులోని  ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు  జుట్టు ఆరోగ్యంగా పెర‌గ‌డానికి  ఉప‌యోగ‌ప‌డ‌తాయి. పాల నుంచి త‌యార‌య్యే పెరుగులో ఉండే జింక్, బ‌యోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి.

మ‌న శ‌రీర దృఢ‌త్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్య‌మో జుట్టు కూడా ఆరోగ్యంగా పెర‌గ‌డానికి అంతే పోష‌కాలు అవస‌రం.  పెరుగులో ఈ పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్ల‌ను బ‌ల‌ప‌రిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమ‌గా, మృదువుగా ఉంచ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా త‌ల‌స్నానం చేశాక జుట్టుకు కండీష‌నింగ్ చేయ‌డం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చ‌క్క‌టి ప‌రిష్కారం.  పెరుగు గొప్ప కండీష‌న‌ర్‌గా ప‌ని చేస్తుంది. దీంతో మీ జుట్టు ప‌ట్టుకుచ్చులా మెర‌వ‌డం ఖాయం. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం వీకెండ్స్‌లో పార్ల‌ర్లు, స్పాలకు వెళ్ల‌కుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్ర‌య‌త్నించి  ఆరోగమైన కురులకు వెల్‌క‌మ్ చెప్పేయండి.

బెండకాయలు (లేడీ ఫింగర్‌)

Lady Finger Can Prevent Several Diseases - Sakshi

దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూరగాయల రారాజు బెండకాయ(లేడీ ఫింగర్‌)అద్భుతంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బెండలో అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. బెండలో సీ,ఈ, కే, ఏ, విటమిన్‌లు పుష్కలంగా ఉంటాయి. కాగా, అధనంగా ఫైబర్‌, పోటాషియం, యాంటిఆక్సిడెంట్లతో మానవులకు కావాల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి.

బరువు తగ్గడం
బరువు తగ్గాలనుకునే వారికి బెండ సంజీవనిగా పనిచేస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల పోషకాలు లబించడంతో పాటు, బరువు తగ్గడానికి ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు

డయాబెటిస్‌ను అదుపు చేయడం
బెండలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించేది) చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో మధుమేహాన్ని అదుపు చేసే మైరెసిటీన్‌ ఉంటుంది.  కాగా ఇది కండరాల ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపు చేస్తుంది.

గుండె వ్యాధుల నియంత్రణకు
కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాద ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు (ఊబకాయం)తో బాధపడే వారికి బెండ మేలు మరువలేనిది. ముఖ్యంగా పెక్టిన్‌ అనే ఫైబర్‌ గుండె జబ్బులు కలగజేసే చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుందని అధ్యయానాల్లో తేలింది. మరోవైపు బెండలో ఉన్న పాలిఫినాల్స్‌ ఆర్టరీ బ్లాకులను నివారిస్తుంది.

క్యాన్సర్‌ నివారణకు
బెండలో ఉన్న లెక్టిన్‌ రొమ్ము క్యాన్సర్‌ రిస్క్‌ను 65శాతం మేర నివారిస్తుందని ఇటీవలే ఓ బయోటెక్నాలజీ నివేదిక తెలిపింది. మరోవైపు బెండతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంతో పాటు, కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి

అందమైన చర్మం కోసం
బెండలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, కెరటోనాయిడ్స్‌ పదార్థం లభించడం వల్ల వయస్సు తక్కువగా కనిపించడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు చెడు చర్మ గ్రంథులను తొలగించే శక్తి బెండలో ఉన్నాయి

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి
బెండలో ఉన్న డయిటరీ ఫైబర్‌ వల్ల మలబద్దకం, అజీర్ణం లాంటి సమస్యలను నివారిస్తుంది. జీర్ణశక్తికి బెండ ఎంతో మేలు చేస్తున్నట్లు అధ్యయనాలున్నాయి

బెండతో గర్భిణి స్త్రీలకు ఎంతో మేలు
బెండకాయను గర్భిణి స్త్రీలు నిత్యం తినడం వల్ల గర్భిణిలకు అతిముఖ్యమైన ఫోలేట్‌(విటమిన్‌ 9) పోషకం లభిస్తుంది. బెండను నిత్యం తీసుకోవడం వల్ల కొత్తగా జన్మించే శిశువులకు జన్యుపరమైన నరాల జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.

రోగనిరోధక శక్తి పెరుగుదల
బెండను నిత్యం మన ఆహార అలవాట్లలో వాడడం వల్ల మన శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. బెండలో అత్యధికంగా లభించే విటమిన్‌ సీ వల్ల భయంకరమైన వైరస్‌(కరోనా వైరస్‌) లను ఎదుర్కొవచ్చు. రుచి కోసం చూసుకోకుండా బెండను నిత్యం వాడడంతో ఎన్నో భయంకరమైన రోగాలను నివారించవచ్చు

గంజి

❤ ఇంట్లో మజ్జిగ అందుబాటులో లేకపోతే గంజిని అన్నంలో కలుపుకుని తాగండి. కడుపు నిండుగా ఉండటమే కాకుండా శరీరాన్ని కూల్‌గా ఉంచుతుంది.
❤ గంజి తాగడం వల్ల జ్వరం తగ్గుముఖం పట్టేందుకు సహకరిస్తుంది.
❤ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచేందుకు గంజి తోడ్పడుతుంది.
❤ గంజి.. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.
❤ ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండలంటే గంజిని తీసుకోండి.
❤ గంజి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.
❤ గంజి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

❤ నీటిలో కాసింత గంజిని కలిపి స్నానం చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారట.
❤ గంజిలో బోలెడన్ని ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి.
❤ కడుపులో మంటతో బాధపడేవారికి గంజి చాలా మంచిది.
❤ గంజిలోని కార్బోహైడ్రేట్లు శరీరానికి మంచి శక్తినిస్తాయి.
❤ నీరసంగా ఉన్నప్పుడు కాస్త గంజి తాగితే ఉత్సాహం వస్తుంది.
❤ గంజి జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

❤ గంజి మలబద్దకాన్ని దూరం చేస్తుంది.

❤ వాంతులు, విరేచనాలతో బాధపడేవారు గంజిని ఆహారంగా తీసుకుంటే పోషకాలు అందుతాయి.
❤ గంజి డయేరియాను తగ్గించడమే కాకుండా ఉదర సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
❤ గంజిలో అమైనో అమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండలు పెంచేవారికి ఉపయోగపడతాయి.
❤ గంజితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు.
❤ గంజిని తలకు పట్టిస్తే.. జుట్టు పట్టులా మెరుస్తుంది.

❤ గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
❤ గంజిని హెయిర్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల పొడవైన, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతమవుతాయి.
❤ అందమైన జుట్టు రాలే సమస్యను కూడా గంజి అరికడుతుంది.
❤ గంజిలోని అమైనో ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

Lung Cancer / ఊపిరితిత్తుల కేన్సర్

భోజనం చేయకుండా కొద్దిరోజులు జీవించొచ్చు. నీళ్లు తాగకుండా కొన్ని గంటలు గడపొచ్చు. కానీ శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణమైనా నిలవలేం. మన ప్రాణాలు నిలబడటానికి అత్యవసరమైన ఆక్సిజన్‌ అందటం నిమిషం ఆలస్యమైనా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టే వూపిరితిత్తులకు అంతటి ప్రాధాన్యం. ఇవి ప్రకృతి నుంచి లభించే ఆక్సిజన్‌ను శ్వాస ద్వారా లోపలికి తీసుకుంటూ.. దాన్ని రక్తం ద్వారా అన్ని కణాలకు సరఫరా అయ్యేలా చేస్తూ.. అవసరం లేని కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటికి పంపిస్తూ.. మన జీవం, జీవితం సజావుగా సాగటానికి నిరంతరం అలుపెరగకుండా పనిచేస్తుంటాయి. ఇలాంటి వూపిరితిత్తుల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా ఇబ్బందే. అలాంటిది అనుక్షణం శరీరాన్ని కబళిస్తూ.. అహరహం నిర్వీర్యం చేసే క్యాన్సర్‌ ముంచుకొస్తే? పచ్చగా కళకళలాడే చెట్టుకు చీడ సోకితే వాడిపోయినట్టుగానే.. మనకు వూపిరిని అందించే తిత్తులూ వాడిపోవటం మొదలెడతాయి. పైగా వూపిరితిత్తుల క్యాన్సర్‌తో ముప్పేటంటే.. నూటికి 80% మందిలో ఇది బాగా ముదిరిన తర్వాతే బయటపడటం. దీంతో నయం కావటం అటుంచి.. అదుపులో పెట్టుకోవటమే కష్టమవుతోంది. ఒకప్పటి కన్నా ఇప్పుడు మంచి చికిత్సలు అందుబాటులోకి వచ్చినా.. ఇంకా ఇది కొరకరాని కొయ్యగానే సవాల్‌ చేస్తోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఎందుకొస్తుందో కచ్చితంగా తెలియదు. ఎవరికి వస్తుందో తెలియదు. కానీ రావటానికి దోహదం చేసే కొన్ని కారణాలను మాత్రం మనం తప్పకుండా నిలువరించుకోవచ్చు.

This image has an empty alt attribute; its file name is samayam-telugu.jpg


మన ప్రాణానికి, జీవానికి శ్వాస అత్యంత కీలకం. గుండె కొట్టుకోవటం వంటి ఇతర ప్రక్రియలు సజావుగా జరుగుతున్నా.. శ్వాస సరిగా సాగకపోతే శరీరం వెంటనే కుప్పకూలుతుంది. తగినంత ఆక్సిజన్‌ అందక కణాలన్నీ చేతులెత్తేస్తాయి. కాబట్టే వూపిరితిత్తులకు ఎలాంటి సమస్య వచ్చినా భరించటం కష్టం. ఇక క్యాన్సర్‌ వంటి తీవ్ర సమస్యలు ముంచుకొస్తే జీవితం మరింత నరకప్రాయంగా మారుతుంది. మనదేశంలో అతి ఎక్కువగా కనబడే ఐదు రకాల క్యాన్సర్లలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఒకటి. ఒకప్పుడు పురుషుల్లో నోటి క్యాన్సర్‌, గొంతు క్యాన్సర్‌, జీర్ణాశయ క్యాన్సర్లు ఎక్కువగా కనబడుతుండేవి. ఇప్పుడు వూపిరితిత్తుల క్యాన్సర్‌ వీటన్నింటినీ అధిగమించి ప్రథమ స్థానాన్ని ఆక్రమించేసింది. స్త్రీలు, పురుషులు..
ఇద్దరినీ పరిగణనలోకి తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ తర్వాత రెండో స్థానం కూడా దీనిదే కావటం గమనార్హం. మనదేశంలో కొత్తగా బయటపడుతున్న క్యాన్సర్‌ కేసుల్లో 6.9% కేసులు వూపిరితిత్తుల క్యాన్సర్‌కు సంబంధించినవే. క్యాన్సర్ల మూలంగా చనిపోతున్న వారిలో 9.3% మంది వూపిరితిత్తుల క్యాన్సర్‌ బాధితులే. అయినా కూడా మన సమాజంలో దీనిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. దీనిలోనూ క్షయ మాదిరి లక్షణాలు కనబడుతుండటం పొరబడటానికి దారితీస్తోంది. క్షయకు చికిత్స తీసుకుంటున్నా కూడా లక్షణాలు తగ్గుముఖం పట్టకపోయిన సందర్భాల్లోనూ క్యాన్సర్‌ను అనుమానించటం లేదు. అలాగే విచ్చలవిడిగా పెరిగిపోతున్న పొగాకు అలవాట్లు, వాయు కాలుష్యం వంటివీ వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆజ్యం పోస్తున్నాయి.

iStock-1168178985

లక్షణాలేంటి?
వూపిరితిత్తులకు మాత్రమే పరిమితమైన కణితులు, ఇతర భాగాలకు విస్తరించిన కణితులను బట్టి వేర్వేరు లక్షణాలు కనబడుతుంటాయి.
* విడవకుండా దగ్గు
* శ్వాసతీసుకోవటంలో ఇబ్బంది
* కళ్లెలో రక్తం పడటం
* బరువు తగ్గటం
* ఆకలి తగ్గిపోవటం
* గొంతు బొంగురు పోవటం
* ముద్ద మింగటంలో ఇబ్బంది
* ఆయాసం
* బ్రాంకైటిస్‌, న్యుమోనియా
* జ్వరం
* నిస్సత్తువ
* కామెర్లు
* తలనొప్పి, వాంతి
* నాడీ సమస్యలు

1. ప్రపంచవ్యాప్తం గా చాలా మంది బాధ పడేది లంగ్ కాన్సర్ తోటే.
2. భారత దేశం లో ఎక్కువ మంది చనిపోయేది లంగ్ కాన్సర్ తోనే.
3. లంగ్ కాన్సర్ లక్షణాలు తొందరగా బయటపడవు. అంటే, లేటర్ స్టేజెస్ లో తప్ప కాన్సర్ ఉందని కూడా తెలియదు.

4. ఆగకుండా వచ్చే దగ్గు లంగ్ కాన్సర్ కి ఒక లక్షణం. ఈ దగ్గు ఎక్కువౌతూ ఉంటుంది.
5. లంగ్స్ పై భాగం లో ఉండే ట్యూమర్ వలన ముఖానికి సంబంధించిన నరాలు ఎఫెక్ట్ అవుతాయి. అందువల్ల కను రెప్పలు వాలిపోవడం, ముఖంలో ఒక వైపు చెమట పట్టకపోవడం లాంటివి జరుగుతాయి.
6. స్మోకింగ్ లంగ్ కాన్సర్ కి ప్రధాన కారణం. లంగ్ కాన్సర్ వల్ల చనిపోయేవారిలో ఎనభై శాతం మందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది.
7. ఒకప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్న వారు మానేసిన పదిహేను సంవత్సరాల వరకూ ఏడాదికోసారి స్క్రీంగ్ చేయించుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

8. సెకండ్ హాండ్ స్మోక్ కి ఎక్స్పోజ్ అయిన వారికి కూడా లంగ్ కాన్సర్ వచ్చే రిస్క్ ఉంది.
9. చాలా సంవత్సరాలు స్మోక్ చేసినా సరే, మానేయడం వల్ల లంగ్ కాన్సర్ వచ్చే రిస్క్ బాగా తగ్గుతుంది.
10. లంగ్ కాన్సర్ కి రెండవ కారణం రాడాన్ గాస్. ఇది సహజం గా ఉండే గాస్. దీనిని రెగ్యులర్ గా పీల్చడం వలన కూడా లంగ్ కాన్సర్ రిస్క్ ఎక్కువౌతుంది.
11. వయసు పెరుగుతున్న కొద్దీ లంగ్ కాన్సర్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది.
12. లంగ్ కాన్సర్ ని డయాగ్నోస్ చేయడానికి ఎక్స్-రే కానీ, సీటీ స్కాన్ కానీ తీస్తారు. లంగ్స్ లో మాస్ ఉందని తేలితే బయాప్సీ ద్వారా నిర్ధారిస్తారు.

13. ఆ ట్యూమర్ మీద జెనెటిక్ టెస్ట్స్ చేస్తారు. దీని వల్ల టార్గెటెడ్ థెరపీ కి అవకాశం ఉంటుంది.
14. లంగ్ కాన్సర్ కి కీమోథెరపీ, సర్జరీ, రేదియేషన్ థెరిపీ, రేడియో సర్జరీ వంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
15. సర్జరీ చేసినప్పుడు ట్యూమర్ ని మాత్రమే తీసేసే అవకాశం ఉంటుంది. కానీ, ట్యూమర్ చెస్ట్ కి దగ్గరగా ఉన్నప్పుడు మొత్తం లంగ్ ని తీసేయాల్సి రావచ్చు.
16. నాన్-స్మాల్ సెల్ లంగ్ కాన్సర్ ని ట్రీట్ చేయడంలో ఇమ్యూనోథెరపీ కూడా వాడతారు. కాన్సర్ సెల్స్ తో పోరాడే టీ సెల్స్ ని కార్న్సర్ సెల్స్ అడ్డుకుంటాయి. ఇమ్యూనోథెరపీ అలా అడ్డుకోకుండా చేస్తుంది.

17. లంగ్ కాన్సర్ లో మూడు రకాలున్నాయి. నాన్-స్మాల్ సెల్, స్మాల్ సెల్, లంగ్ కార్సినాయిడ్ ట్యూమర్. లంగ్ కాన్సర్ ఉన్న వారిలో ఎనభై ఐదు శాతం మంది నాన్-స్మాల్ సెల్ కాన్సర్ ఉన్న వారే.
18. లంగ్ కాన్సర్ ఉన్న వారిలో ఐదు శాతం కంటే తక్కువ మందికి లంగ్ కార్సినాయిడ్ ట్యూమర్ ఉంటుంది.
19. నాన్-స్మాల్ సెల్ లంగ్ కాన్సర్ కి నాలుగు స్టేజెస్ ఉంటాయి. మొదటి స్టేజ్ లో కాన్సర్ కేవలం లంగ్స్ లోనే ఉంటుంది. నాలుగవ స్టేజ్ లో రెండు లంగ్స్ కీ, లంగ్స్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ కీ, ఇతర అవయవాలకీ పాకుతుంది.
20. స్మాల్ సెల్ కాన్సర్ కి రెండు దశలుంటాయి. ఫస్ట్ స్టేజ్ లొ ఒక లంగ్ మాత్రమే ఎఫెక్ట్ అయి ఉంటుంది. లేదా దగ్గరలో ఉన్న లింఫ్ నోడ్స్ కి కూడా చేరి ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో రెండవ లంగ్ కీ, లంగ్స్ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ కీ, ఇతర అవయవాలకీ కూడా చేరుతుంది.
21. కొలోన్, బ్రెస్ట్, ప్రోస్టేట్ కాన్సర్ వల్ల సంభవించే మరణాలన్నింటి కంటే కూడా లంగ్ కాన్సర్ ఒక్క దాని వల్ల సంభవించే మరణాలు ఎక్కువ.
22. లంగ్ కాన్సర్ నుండి స్త్రీలు, చిన్న వయసులో ఉన్నవారు తొందరగా కోలుకోగలరు.
23. లంగ్ కాన్సర్ లంగ్స్ దగ్గరే ఉన్నప్పుడు కనుక్కోగలిగితే ఐదేళ్లలో 55% సర్వైవల్ రేట్ ఉంటుంది.
24. లంగ్ కాన్సర్ ఇతర అవయవాలకి స్ప్రెడ్ అయితే ఐదేళ్ళలో నాలు శాతం సర్వైవల్ రేట్ మాత్రమే ఉంటుంది.
25. ఆగస్ట్ ఒకటిన వరల్డ్ లంగ్ కాన్సర్ డే ని జరుపుతారు.

దశలను బట్టి చికిత్స
వూపిరితిత్తుల క్యాన్సర్‌లో ఆయా దశలను బట్టి కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యూనో థెరపీల్లో ఎవరికి, ఏది పనికొస్తుందనేది నిర్ణయిస్తారు.
1, 2 దశల్లో..
* మొదటి, రెండో దశ కణితులకు శస్త్రచికిత్స ఉత్తమమైన పద్ధతి. ఇందులో కణితి ఏర్పడిన భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. అవసరమైతే ఒక భాగాన్ని (లోబ్‌), ఒక వూపిరితిత్తి మొత్తాన్ని కూడా తొలగించాల్సి రావొచ్చు. శస్త్రచికిత్సతో కణితిని తొలగించినప్పటికీ.. కంటికి కనిపించని అతి సూక్ష్మమైన క్యాన్సర్‌ కణాలు ఛాతీలోనో, మరెక్కడో ఇంకా లోపలే ఉండిపోవచ్చు. ఇవి పెట్‌ స్కాన్‌లోనూ కనబడనంత చిన్నగానూ ఉండొచ్చు. ఒకవేళ క్యాన్సర్‌ కణాలు లోపల మిగిలిపోతే జబ్బు తిరగబెట్టే ప్రమాదముంది. అందువల్ల బయటకు తీసిన కణితిని పరిశీలించి.. జబ్బు తిరగబెట్టే అవకాశం ఎంత వరకు ఉందనేది అంచనా వేస్తారు. తిరగబెట్టే అవకాశం ఉంటే కీమో థెరపీ, రేడియో థెరపీ చేయాల్సి ఉంటుంది. కణితిని పూర్తిగా తొలగించటం సాధ్యం కానప్పుడు కొంత భాగం లోపలే వదిలేస్తుంటారు. ఇలాంటి వారికి కీమోతో పాటు రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
3వ దశలో..
* వీరికి ఒకే సమయంలో కీమోథెరపీ, రేడియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కొందరికి శస్త్రచికిత్స కూడా చేయాల్సి రావొచ్చు. కణితి ఏర్పడిన చోటు, సైజు, లింఫ్‌ గ్రంథుల ఉబ్బు వంటి వాటిని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. అయితే మూడో దశలో చికిత్స చేసినా క్యాన్సర్‌ నయమయ్యే అవకాశం 30% మాత్రమే. 70% మందిలో జబ్బు పూర్తిగా తగ్గకపోవచ్చు. ఒకవేళ తగ్గినా మళ్లీ తిరగబెట్టొచ్చు. 4వ దశలో..
* నాలుగో దశలో క్యాన్సర్‌ నయం కావటం దాదాపు అసాధ్యం. అందువల్ల రోగికి ఇతరత్రా సమస్యలేవీ లేకుండా.. బతికినంతకాలం ఇంట్లో హాయిగా జీవించేలా చూసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయంలో ‘టార్గెటెడ్‌ థెరపీ’ బాగా ఉపయోగపడుతుంది. కీమోథెరపీ క్యాన్సర్‌ కణాల మీదే కాదు. ఇతర కణాలపైనా ప్రభావం చూపుతుంది. దీంతో జుట్టు రాలటం, వాంతులు, రక్తకణాలు తగ్గటం, రోగనిరోధకశక్తి క్షీణించటం వంటి దుష్ఫలితాలు తలెత్తొచ్చు. అంటే చికిత్సతో ఒనగూడే ప్రయోజనం కన్నా సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముంది. కాబట్టి వీరికి టార్గెటెడ్‌ థెరపీయే మంచిది. ఇందులో క్యాన్సర్‌ వృద్ధి చెందటానికి కారణమవుతున్న ప్రోటీన్‌ను గుర్తించి, అది పనిచేయకుండా చేసే మాత్రలు ఇస్తారు. వీటిని వేసుకుంటూ రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. రెండు వారాల్లో దీని ప్రభావం కనబడుతుంది. పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవు. క్యాన్సర్‌ వృద్ధికి దోహదం చేస్తున్న ప్రోటీన్ల వంటివి కనబడనివారికి కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది.
* రోగనిరోధకవ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్‌ కణాలను నిర్వీర్యం చేసే ‘ఇమ్యూనోథెరపీ’ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఇది గతి తప్పిన కణాలను గుర్తించే, వాటిని నిర్వీర్యం చేసే యంత్రాంగాలను తిరిగి ప్రేరేపితం చేస్తూ.. క్యాన్సర్‌ కణాలను చంపుతుంది.
జీవనకాలం మెరుగు టార్గెటెడ్‌, ఇమ్యూనోథెరపీలు ఆయా రకాలకు, వ్యక్తులకు అనుగుణంగా చికిత్స చేయటానికి బాగా తోడ్పడతాయి. వీటి ద్వారా 60% మందికి కీమోథెరపీని తప్పించే అవకాశముంది. ఇవి చాలాకాలం పనిచేస్తాయి కూడా. వీటి రాకతో జీవనకాలం గణనీయంగా పెరిగింది. గతంలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ బారినపడితే ఆరు నెలల కన్నా ఎక్కువకాలం జీవించేవారు కాదు. ఇప్పుడు దాదాపు 25% మంది ఐదేళ్లకు పైగా జీవిస్తున్నారు! అయితే ఏదో ఒక చికిత్సకు మాత్రమే సరిపోయేవారి కన్నా అన్ని రకాల చికిత్సలకు అనుగుణంగా ఉన్నవారు ఎక్కువకాలం జీవించే అవకాశముంటుంది.
క్షయకు దగ్గరి పోలిక వూపిరితిత్తుల క్యాన్సర్‌, క్షయ..రెండింట్లోనూ దగ్గు, ఆయాసం, బరువు, ఆకలి తగ్గటం, జ్వరం వంటి లక్షణాలు కనబడుతుంటాయి. దీంతో వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా కష్టమవుతోంది. వూపిరితిత్తుల క్యాన్సర్‌ చికిత్స కోసం వచ్చేవారిలో క్షయ చికిత్స తీసుకొని, ఇంకా దగ్గు తగ్గలేదని వచ్చేవారు దాదాపు 15-50% మంది కనబడుతుంటారు. అప్పటికే వీరిలో క్యాన్సర్‌ ముదిరిపోయి ఉంటుంది. అందువల్ల వీలైనంత త్వరగా వీటి మధ్య తేడాను గుర్తించటం చాలా అవసరం. సాధారణంగా క్షయ చికిత్స ఆరంభించిన మూడు, నాలుగు వారాల్లో లక్షణాలు తగ్గుముఖం పట్టాలి. ఆరోగ్యమూ కాస్త మెరుగవ్వాలి. లేకపోతే వెంటనే అప్రమత్తం కావాలి. ఎక్స్‌రే, సీటీస్కాన్‌.. అవసరమైతే బయాప్సీ చేసి వూపిరితిత్తుల క్యాన్సర్‌ ఉందేమో చూడాలి.
ఆలస్యమే.. పెద్ద సమస్య
వూపిరితిత్తుల క్యాన్సర్‌తో పెద్ద చిక్కటేంటంటే చాలా ఆలస్యంగా బయటపడుతుండటం. వూపిరితిత్తి పెద్ద అవయం. దీనిలో కణితి తలెత్తినా కూడా.. అది కీలకమైన భాగాలకు తగిలేంత వరకూ ఎలాంటి లక్షణాలు కనబడవు. అందువల్ల వూపిరితిత్తుల క్యాన్సర్‌ బయటపడేసరికే ముదిరిపోయి ఉంటోంది. ఇతరత్రా జబ్బుల్లో చేసే పరీక్షల్లో యాదృచ్ఛికంగా బయటపడటం తప్పించి.. తొలి దశలో వూపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించటం చాలా అరుదు. సుమారు 70-80% మందిలో ఇది మూడు, నాలుగు దశల్లోనే బయటపడుతోంది. దీన్ని ఒకటో దశలోనే గుర్తించి శస్త్రచికిత్స చేయగలిగితే 90% వరకు నయం చేయొచ్చు. రెండో దశలో 70% వరకు నయం కావొచ్చు. అదే మూడో దశలో నయమయ్యే అవకాశం 30 శాతానికి పడిపోతుంది. ఇక నాలుగో దశలోనైతే నయం కావటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.
నివారణ కీలకం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించటం కష్టం. అందుకే అమెరికా వంటి దేశాల్లో వూపిరితిత్తుల క్యాన్సర్‌కు ముందస్తు పరీక్షలు చేస్తున్నారు. 55 ఏళ్లు పైబడి.. 20 ఏళ్లకు పైగా పొగ తాగే అలవాటున్నవారికి ఏడాదికి ఒకసారి తక్కువ మోతాదు సీటీస్కాన్‌ పరీక్ష చేస్తున్నారు. కానీ మనదేశంలో ఇదంత సులువైన పని కాదు. అందువల్ల నివారణ మీదే దృష్టి పెట్టటం చాలా అవసరం. క్యాన్సర్‌కు దారితీసే పొగాకు జోలికి వెళ్లకపోవటం అన్నింటికన్నా మంచిది. ఒకవేళ పొగ తాగటం, పొగాకు నమలటం అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. మద్యం పరిమితం చేసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అధికబరువు, వూబకాయాన్ని తగ్గించుకోవాలి. పరీక్షలు: మూడు ప్రధానం
వూపిరితిత్తుల క్యాన్సర్‌ను నిర్ధరిచటంతో పాటు అది ఏ దశలో ఉందనేది గుర్తించటమూ చాలా అవసరం. ఎలాంటి చికిత్స చేయాలనేది దీని దశల ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇందుకు ప్రధానంగా మూడు రకాల పరీక్షలు తోడ్పడతాయి.
* ఎక్స్‌రే: వూపిరితిత్తుల క్యాన్సర్‌ను అనుమానిస్తే ముందు ఎక్స్‌రే తీస్తారు. కణితి నీడ ఏదైనా ఉంటే బయటపడుతుంది. నీరు చేరిందా? ఛాతీలో గుండె సరైన స్థానంలో ఉందా? శ్వాసనాళం ఎలా ఉంది? అనేవీ ఇందులో తెలుస్తుంది.
* సీటీ స్కాన్‌: క్యాన్సర్‌ ఉన్నట్టు అనుమానిస్తే, లక్షణాలు కూడా అనుగుణంగానే కనబడుతుంటే సీటీ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. కణితి ఉంటే ఇందులో స్పష్టంగా బయటపడుతుంది.
* బయాప్సీ: కణితి ఉన్నట్టు తేలితే దాన్నుంచి చిన్న ముక్కను బయటకు తీసి (బయాప్సీ) పరీక్షిస్తారు. దీంతో క్యాన్సర్‌ నిర్ధరణ కావటమే కాదు, అది ఏ రకానికి (స్మాల్‌ సెల్‌, నాన్‌ స్మాల్‌ సెల్‌) చెందినదనేదీ తెలుస్తుంది.
* ఇతర పరీక్షలు: అవసరమైతే ఇతరత్రా వివరాల కోసం మరోసారి సీటీ స్కాన్‌, ఎముక స్కాన్‌, పెట్‌ స్కాన్‌ వంటివి చేస్తారు. దీంతో క్యాన్సర్‌ ఏ దశలో ఉంది, ఎక్కడెక్కడికి విస్తరించిందనేది బయటపడుతుంది.
నాలుగు దశలు
వూపిరితిత్తుల క్యాన్సర్‌ 4 దశలుగా కనబడుతుంది.
* స్టేజ్‌ 1: కణితి కేవలం ఒక వూపిరితిత్తిలోనే ఏర్పడటం. లింఫ్‌ గ్రంథులకు విస్తరించకపోవటం.
* స్టేజ్‌ 2: కణితి లింఫ్‌ గ్రంథులకు విస్తరించటం.
* స్టేజ్‌ 3: ప్రధాన శ్వాసనాళం చుట్టూరా ఉండే లింఫ్‌ గ్రంథులకు, ఛాతీ గోడకు, డయాఫ్రంకు కణితి విస్తరించటం.
* స్టేజ్‌ 4: వూపిరితిత్తుల్లో, గుండె చుట్టూ నీరు చేరటం.. కణితి ఇతర భాగాలకు విస్తరించటం.

ఇప్పుడు లంగ్ కాన్సర్ గురించిన కొన్ని అపోహలను చూద్దాం.


1. మీరు స్మోక్ చేయకపోతే మీకు లంగ్ కాన్సర్ రాదు.

లంగ్ కాన్సర్ కి ప్రధాన కారణం స్మోకింగ్ అన్నది నిజమే. కానీ, రాడాన్, ఆస్బెస్టాస్, హానికరమైన కెమికల్స్, ఎయిర్ పొల్యూషన్, సెకండ్ హాండ్ స్మోక్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా లంగ్ కాన్సర్ రావచ్చు. ఫ్యామిలీ లో ఎవరికైనా లంగ్ కాన్సర్ ఉంటే కూడా లంగ్ కాన్సర్ రావచ్చు. ఒక్కొక్కసారి ఎలాంటి రిస్క్ ఫాక్టర్స్ లేకుండా కూడా లంగ్ కాన్సర్ రావచ్చు.

2. మీరు ఒకప్పుడు స్మోక్ చేసి ఉంటే ఇప్పుడు మానేసినా కూడా లంగ్ కాన్సర్ రిస్క్ తగ్గదు.

చాలా సంవత్సరాలు స్మోక్ చేసినా కూడా ఒకసారి మానేసిన తరువాత లంగ్ కాన్సర్ ముప్పు తగ్గుతూ వస్తుంది. లంగ్స్ కి కొంత పర్మనెంట్ డామేజ్ జరిగినా సరే, స్మోకింగ్ మానేయడం వల్ల ఇంకా డామేజ్ జరగకుండా ఉంటుంది. లంగ్ కాన్సర్ తో డయాగ్నోజ్ అయిన తరువాత స్మోకింగ్ మానేసినా సరే, ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అయ్యే చాన్సెస్ పెరుగుతాయి. ఒకప్పుడు స్మోక్ చెసి ఇప్పుడు మానేసి ఉంటే మాత్రం రెగ్యులర్ గా స్క్రీంగ్ చేయించుకోవడం అవసరం.

3. లంగ్ కాన్సర్ ప్రాణాంతకమైనది

లంగ్ కాన్సర్ కి ఎర్లీ స్టేజెస్ లో ఎలాంటి లక్షణాలు ఉండకపోవడంతో దాన్ని తొందరగా కనుక్కోలేం కాబట్టి ఈ వ్యాధి ప్రాణాంతకం గా మారుతుంది. ఒకవేళ కాన్సర్ ని ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోవడం కుదిరితే దాన్ని పూర్తిగా నయం చేయవచ్చు. ఒకవేళ నయం చేయలేకపోతే ట్రీట్మెంట్ వల్ల జీవితకాలం పెరుగుతుంది. రిస్క్ ఫాక్టర్స్ ఉన్న వారు స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండడం మంచిది. దగ్గు తగ్గకుండా పెరుగుతూ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయడం మంచిది.

4. లంగ్ కాన్సర్ ని ఎయిర్ కి ఎక్స్పోజ్ చేసినా, సర్జరీ టైంలో కట్ చేసినా కాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. లంగ్ కాన్సర్ లంగ్స్ లో మిగిలిన భాగాలకీ, లింఫ్ నోడ్స్ కీ, ఇతర అవయవాలకి కూడా పాకుతుంది. అయితే, సర్జరీ వల్ల ఎలాంటి కాన్సర్ అయినా సరే స్ప్రెడ్ అవ్వడం అనేది జరగదు. ఎర్లీ స్టేజ్ లో ఉన్న లంగ్ కాన్సర్ ని సర్జరీ క్యూర్ చేయగలుగుతుంది కూడా.

5. లంగ్ కాన్సర్ వయసులో పెద్ద వారికి మాత్రమే వస్తుంది.

అరవై సంవత్సరాలు దాటినా వారికి లంగ్ కాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. అంత మాత్రాన అరవై లోపు ఉన్న వారికి రాదు అని చెప్పలేం. రిస్క్ ఫాక్టర్స్ ని బట్టి లంగ్ కాన్సర్ వచ్చే ముప్పు కూడా ఉంటుంది.

కరోనా ముప్పును పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్

Pulse Oximeter Helps In COVID-19 Detection - Sakshi

కరోనా ముప్పును ముందుగానే పసిగట్టేందుకు పల్స్‌ ఆక్సిమీటర్‌ కీలకంగా మారింది. ఆస్పత్రుల్లో మాత్రమే కనిపించే పల్స్‌ ఆక్సిమీటర్లు.. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో వెలుగు చూస్తున్నాయి. కరోనా లక్షణాల్లో తీవ్రమైన జ్వరం, పొడి దగ్గు, ఊపిరి సరిగా అందకపోవడం ముఖ్యమైనవి. ఇలాంటప్పుడు వైరస్‌ను పసిగట్టాలంటే చేతిలో పల్స్‌ ఆక్సిమీటర్‌ ఉండాలి. కరోనా వైరస్‌ సోకి హోంక్వారంటైన్‌లో ఉంటున్నవారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోవడానికి పల్స్‌ ఆక్సిమీటర్‌ అత్యవసరమైందని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా ముప్పును ముందుగానే గుర్తించేందుకు ఉపయోగపడే పల్స్‌ ఆక్సిమీటర్‌కు ప్రస్తుతం డిమాండ్‌ పెరిగింది.

హైపోక్సియా అంటే..
కోవిడ్‌ రోగుల్లో ఊపిరి అందకపోవడం అతిపెద్ద సమస్య. రోగుల్లో రక్తంలోకి చేరే ఆక్సిజన్‌ శాతం తగ్గిపోతుంది. ఇలా వేగంగా ఆక్సిజన్‌ శాతం తగ్గిపోవడాన్ని ‘హైపోక్సియా’ అంటారు. ఇది బయటకు కనిపించకపోయినా పల్స్‌ ఆక్సిమీటర్‌ సాయంతో మాత్రం పసిగట్టొచ్చు. కోవిడ్‌ కేసుల్లో రెండు రకాలున్నాయి. ఒకటవది సింప్టమాటిక్‌ కేసు. ఇందులో లక్షణాలు తీవ్రంగా కనిపించి, హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యేవాళ్లు, రెండవది అసింప్టమాటిక్‌ కేసు. అంటే ఒంట్లో వైరస్‌ ఉన్నా కూడా లక్షణాలు ఏవీ బయటపడని వాళ్లు. ఇక్కడ నష్టం ఎక్కువ జరిగేది అసింప్టమాటిక్‌ కేసులతోనే. ఎందుకంటే వీళ్లలో వైరస్‌ ఉన్నా లక్షణాలు కనిపించవు కాబట్టి టెస్ట్‌ చేసేవరకూ వీళ్లకు వైరస్‌ ఉన్నట్టు తెలియదు. దీంతో పక్కవాళ్లకు వైరస్‌ సోకే ప్రమాదముంది. అలాగే వాళ్ల శరీరంలో కూడా వైరస్‌ వల్ల జరిగే నష్టం ఎక్కువ ఉంటుంది. అందుకే లక్షణాలు పైకి కనిపించకపోయినా శరీరంలో ఎలాంటి మార్పులొస్తున్నాయో మనమే కొన్ని పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు టెస్ట్‌ చేసుకుంటూ ఉండాలి. వాటిలో అన్నింటికంటే ముఖ్యమైంది పల్స్‌ ఆక్సిమీటర్‌. 

ముందు జాగ్రత్త కోసం..
కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత సైలెంట్‌గా న్యుమోనియా కలిగిస్తుంది. అంటే పైకి కనిపించకుండానే ఊపిరితిత్తులు న్యుమోనియా వల్ల ఎఫెక్ట్‌ అవుతాయి. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయి వ్యక్తి చనిపోవడానికి కారణమవుతుంది. కొంతమంది రోగుల్లో కోవిడ్‌ న్యుమోనియా లక్షణాలు ముందే బయటపడక పోవచ్చు. లేకుంటే వారం పది రోజుల తర్వాత బయటపడొచ్చు. కానీ ఈలోపు ఊపిరితిత్తులకు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ఈ సైలెంట్‌ న్యుమోనియాను ముందుగానే గుర్తించగలిగితే రోగులను వెంటిలేటర్‌పై ఉంచాల్సిన ఆవసరం రాకుండా ముందస్తు జాగ్రత్తలతో వాళ్ల ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇలా పనిచేస్తుంది..
శరీరంలోని అన్ని భాగాలకు గుండె ఎలా ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందో పల్స్‌ ఆక్సిమీటర్‌ గుర్తిస్తుంది. రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గడం వల్ల వచ్చే సమస్యలను గుర్తించడం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్, ఆస్తమా, న్యుమోనియా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లాంటి వాటిలో ఈ మీటర్‌ ఎక్కువగా ఉపయోగపడుతుంది. పల్స్‌ ఆక్సిమీటర్‌ వాడడం చాలా తేలిక. ఏదో ఒక చేతి వేలి కొనకు ఈ మీటర్‌ను ఉంచి, ఒక్క బటన్‌ నొక్కితే చాలు. కొన్ని సెకన్ల తర్వాత డిస్‌ప్లేలో పల్స్‌ రేట్‌తోపాటు ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ రేటు కనిపిస్తుంది. 

రెండు రకాల రీడింగ్‌..
సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్‌ లెవల్‌ 94 నుంచి 100 శాతం వరకు ఉండాలి. అలాగే పల్స్‌ రేటు 60 నుంచి 100 మధ్యలో ఉండాలి. ఈ రెండు రీడింగ్స్‌.. ఉండాల్సిన దానికంటే తక్కువగా పడిపోయినా, ఎక్కువగా పెరిగినా ప్రమాదమని గుర్తించాలి. పల్స్‌ ఆక్సిమీటర్‌ ధర రూ.1,300 నుంచి రూ.ఐదువేల వరకు ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా లభిస్తున్నాయి. చాలా మంది ప్రాణాలను కాపాడడానికి ఈ పరికరం ఉపయోగపడిందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఇంట్లో అవసరం ఉటుందని భావిస్తున్న వారు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా పల్స్‌ ఆక్సిమీటర్లకు డిమాండ్‌ పెరిగింది.

హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్

అమిత్ షాకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 2) ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు నిర్వహించుకోవడంతో తనకు పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. తనను కలిసిన వారందరినీ అలర్ట్ చేశారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలి, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.

కరోనా తల నుండి కాలివేళ్ల వరకు

How Coronavirus Effect On Human Body - Sakshi

కరోనా అనేది గొంతునూ, ఊపిరితిత్తులనూ ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. కొందరిలో గుండెను మాత్రమే ప్రభావితం చేస్తుందన్న విషయం కొందరికే తెలుసు. కానీ… నిజానికి కరోనా వైరస్‌ తల భాగం మొదలుకుని కాళ్ల వరకు అనేక అవయవాలపై తన ప్రభావం చూపుతుంది. అలాగే తలవెంట్రుకల నుంచి కాలివేళ్ల  వరకు అనేక అంశాలు సైతం అది సోకే తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. అయితే ఇవన్నీ తెలుసుకోవడం భయపడేందుకు కాదు. తెలుసుకొని ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు. దేహం పైభాగం  మొదలుకొని కిందివరకు ఎలా ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. అందుకే జుట్టు మొదలుకొని… కాలి గోటి వరకు అదెలా ప్రభావం చూపుతుందనే అంశాలను తెలుసుకుందాం. అవగాహన పెంచుకుందాం. ఆందోళనను దూరం చేసుకుందాం.   

మెదడు
కరోనా కారణంగా కొందరిలో పక్షవాతం రావడాన్ని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే ఈ లక్షణం చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపించింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ ఉన్నవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల క్లాట్స్‌ ఏర్పడి.. ఇలా జరగడం కనిపించింది. అలాగే కొందరిలో రక్తంలో ఆక్సిజన్‌ తగ్గడం వల్ల మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్‌ అందక మెదడు గాయపడటం కూడా జరిగింది. 

నాలుక – ముక్కు
కోవిడ్‌–19 సోకిన రోగుల్లో వాసనలూ, రుచి తెలియకపోవడం అన్నది ఒక ప్రధానమైన లక్షణం అన్నది ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ లక్షణం తగ్గిందంటే… మన వ్యాధి నుంచి క్రమంగా  బయటపడుతున్నామన్నదానికి ఓ ప్రధాన సంకేతంగా పరిగణించవచ్చు. 

ఊపిరితిత్తులు
కరోనా వైరస్‌ కారణంగా అత్యధికుల్లోనూ, అత్యధికంగానూ ఊపిరితిత్తులే ప్రభావితమవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. లంగ్స్‌లో ఉండే ఏసీఈ–2 రిసెప్టార్స్‌ కారణంగా ఈ పరిణామం సంభవిస్తుంది. అలాగే నిమోనియా లాంటి పరిణామాలూ ఏర్పడుతుండటమూ తెలిసిందే. ఇక వైరస్‌ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తం కడ్డకట్టి క్లాట్స్‌ ఏర్పడి… రక్తప్రవాహంతోపాటు అవి ఊపిరితిత్తుల్లోకి కొట్టుకురావడం… దాని వల్ల గాలిమార్పిడి ప్రక్రియకు అవరోధం కలగడం మనందరికీ తెలిసిందే. 

మూత్రపిండాలు
కోవిడ్‌–19 వ్యాధి కారణంగా కొందరిలో మూత్రపిండాలు దెబ్బతిని ‘అక్యూట్‌ కిడ్నీ డిసీజ్‌’కు దారితీయడాన్ని నిపుణులు గుర్తించారు. ఇక అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెజర్‌ పడిపోవడం, ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా కిడ్నీలు ప్రభావితం కావడం కనిపించింది. రోగులకు వాడే రకరకాల మందులు సైతం కిడ్నీలపై దుష్ప్రభావం చూపడం కూడా కొంత కనిపించింది. ఇక చాలామంది కోవిడ్‌–19 రోగుల్లో మూత్రం ద్వారా ప్రోటీన్‌ పోవడాన్ని వైద్యనిపుణులు తరచూ గమనించడం జరుగుతోంది. 

రక్తనాళాలు
కోవిడ్‌–19 సోకిన వారిలో రక్తనాళాలు చాలా ఎక్కువగా ప్రభావితం కావడాన్ని గుర్తించారు. గతంలో కోవిడ్‌–19ను ప్రధానంగా శ్వాసవ్యవస్థకు చెందిన  వ్యాధిగా పరిగణించేవారు కదా. అయితే ఇటీవలి అధ్యయనాల తర్వాత దీన్ని శ్వాస వ్యవస్థకు చెందిన వ్యాధిగా కంటే… ప్రధానంగా రక్తనాళాలకు చెందిన వ్యాధిగానే ఎక్కువగా గుర్తిస్తున్నారు నిపుణులు. రక్తనాళల్లోని అంతర్గత పొర అయిన ‘ఎండోథీలియమ్‌’ ఎక్కువగా ప్రభావితమై దెబ్బతిన్నట్లుగా, రోగుల్లో మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఇలా రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తపు క్లాట్స్‌… ఏయే అవయవాలకు చేరితే… ఆయా అవయవాలు బాగా దెబ్బతిన్నట్లుగా కూడా నిపుణులు గమనించారు. 

క్లోమగ్రంథి (పాంక్రియాస్‌)
కోవిడ్‌–19 సోకాక కొందరిలో ‘అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌’ కనిపించవచ్చు. కరోనా వల్ల వచ్చే అక్యూట్‌ పాంక్రియాటైటిస్‌లో రక్తంలో షుగర్‌ అధికంగా ఉండటం, దాంతోపాటు లిపిడ్స్‌ అధికంగా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. 

ఎండోక్రైన్‌ సిస్టమ్‌
కరోనా వైరస్‌ సోకిన కొందరిలో రక్తంలోని చక్కెర పాళ్లు అకస్మాత్తుగా పెరగడాన్ని చాలామంది రోగుల విషయంలో డాక్టర్లు గుర్తించారు. గతంలో డయాబెటిస్‌ లేని చాలామంది రోగుల్లోనూ ఈ పరిణామం సంభవించడాన్ని నిపుణులు చూశారు. అదేవిధంగా షుగర్‌ ఉన్న వారిలో కనిపించే ‘డయాబెటిక్‌ కీటో అసిడోసిస్‌’ అనే కాంప్లికేషన్‌ను కూడా కోవిడ్‌–19 రోగుల్లో గుర్తించారు. 

కాలివేళ్ల చివరలు (కోవిడ్‌ టోస్‌)
కొంతమంది రోగుల్లో కాలివేళ్ల చివర్లలో మంట, తిమ్మిర్లు కనిపించాయి. అలాగే అవి ఊదా (పర్పులు) రంగులోకి మారడమూ నిపుణులు గుర్తించారు. ఇలా జరిగే పరిణామానికి ‘కోవిడ్‌ టోస్‌’గా పేరుపెట్టారు. కొందరిలో రక్తపు గడ్డలు కాలివేళ్ల చివరలకు చేరడం వల్ల అవి ఇన్‌ఫ్లమేషన్‌ (మంట, వాపు)లకు గురికావడం కూడా కనిపించింది. 

జుట్టు
మీకో విషయం తెలుసా? కరోనా వైరస్‌ సోకుతున్న క్రమంలో అనేకానేక నిశితమైన పరిశీలనలను బట్టి చూస్తే… మామూలుగా తల నిండా ఒత్తుగా, పూర్తిగా జుట్టున్న వారితో పోలిస్తే బట్టతల (మేల్‌ బాల్డ్‌నెస్‌ పాటర్న్‌) ఉన్న వారిపై ఒకింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే అంశాన్ని మరో రకంగా కూడా చెప్పవచ్చు. బట్టతల వచ్చే అవకాశం పురుషులకే ఎక్కువ కదా. ఇలా బట్టతల ఉన్న పురుషులకే కరోనా ఎక్కువగా సోకడాన్ని వైద్యనిపుణులూ, పరిశోధకులూ ‘గాబ్రిన్‌’ సైన్‌గా పరిగణిస్తున్నారు.

కరోనా వైరస్‌ సోకిన వారికి చికిత్స చేస్తూ మరణించిన తొలినాటి డాక్టర్లలో ఒకరైన డాక్టర్‌ గాబ్రిన్‌ పేరు మీద ఈ అంశాన్ని ‘గాబ్రిన్‌ సైన్‌’గా చెబుతున్నారు. అలాగే కరోనా వైరస్‌ సోకాక విపరీతంగా మానసిక ఒత్తిడికి గురైన వారిలో సైతం జుట్టు విపరీతంగా రాలిపోవడం కూడా పరిశోధకులు గమనించారు. మామూలుగానే మానసిక ఒత్తిడికి జుట్టు రాలిపోవడం సహజం. దానికి తోడు ఈ కరోనా ఒత్తిడి మరింత అధికంగా కావడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మారుతోంది. 

చర్మం
కరోనా ప్రభావంతో చర్మంపై ఎర్రటి దద్దుర్లు, ర్యాష్‌తో పాటు చిన్న పగుళ్లలాంటి గాయాలు, గుల్లలు, మచ్చలు, చర్మం ఎర్రబారడాలు ఇలా ఎన్నెన్నో రూపాల్లో కనిపిస్తాయి.  

గుండె
కొన్నిసార్లు కోవిడ్‌–19 నేరుగా గుండెను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు… కొందరిలో గుండెపోటును పోలిన సిండ్రోమ్‌కు కారణమవుతుంది. అయితే యాంజియోగ్రామ్‌ చేస్తే మాత్రం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ‘క్లాట్‌’ కనపడదు. ఇక మరికొందరిలో ‘టెంపరరీ బెలూనింగ్‌’ కారణంగా ‘బ్రోకెన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌’ వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వైరస్‌ వల్లగానీ లేదా క్లోరోక్విన్‌ వంటి మందులు వాడటం వల్లగానీ గుండె స్పందనల లయ (రిథమ్‌)లో తేడాలు రావచ్చు. ఇక కోవిడ్‌–19 సోకిన కొందరిలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం మనందరమూ చూసిందే. 

జీర్ణవ్యవస్థలో
కోవిడ్‌–19 సోకిన వారిలో అందరిలోనూ కనిపించే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి సాధారణ లక్షణాలతోపాటు మరికొందరిలో నీళ్లవిరేచనాలు కావడం కూడా మామూలే. చాలామంది రోగులకు మలపరీక్ష నిర్వహించినప్పుడు వారు విసర్జించిన మలంలోనూ ‘కరోనా వైరస్‌’ (సార్స్‌ సీవోవీ–2) ఉన్నట్లు గుర్తించారు. 

కాలేయం
కోవిడ్‌–19 సోకిన చాలామంది రోగుల్లో అనేక కాలేయ స్రావాలైన ఎంజైములు చాలా ఎక్కువ మొత్తంలో స్రవించిన దాఖలాలున్నాయి. అన్నట్టు… వైరస్‌ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కాలేయ స్రావాలూ పెరగడాన్ని కూడా గమనించారు.  వైరస్‌ను చంపడానికి ఇచ్చే మందులతో కాలేయం కూడా ఎంతో కొంత ప్రభావితమయ్యే అవకాశాలూ ఉన్నాయి. అందుకే అప్పటికే కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు కోవిడ్‌–19 సోకినట్లయితే… వారు మెరుగుపడే అవకాశాలు మామూలు వారికంటే కాస్తంత ఆలస్యం కావడం నిపుణులు గుర్తించారు. ఇక వైరస్‌ కారణంగా దేహంలోని గాల్‌బ్లాడర్‌ సైతం ప్రభావితం కావడాన్నీ గమనించారు. 

మానసిక ప్రభావాలు
వైరస్‌ సోకిన రోగుల్లో మానసిక ఒత్తిడి పెరగడం, స్పష్టత లోపించడం, అయోమయానికి గురికావడం, మెదడుకు రక్తసరఫరా తగ్గడంతో పాటు అనేక రకాల మానసిక సమస్యలు ఎదురుకావడం చాలా స్పష్టంగా కనిపించింది. 

ప్రత్యుత్పత్తి అవయవాలు
చాలామంది మహిళా రోగుల్లో వారి గర్భం నుంచి బిడ్డకు కోవిడ్‌–19 సోకిన దాఖలాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 

ఇలా మనకు తెలిసిన అవయవాలనే గాక ఇంకా అనేకానేక అవయవాలను ప్రభావితం చేయడం గురించి మనం ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇన్నిన్ని అవయవాలపై ఇన్ని రకాలుగా ప్రభావం చూపినప్పటికీ చాలా తక్కువ మందిలో మాత్రమే… అంటే దాదాపు 90 శాతం రోగుల్లో ఇది ప్రమాదకారి కానేకాదు. అయితే ఇటీవల కొందరు వ్యాధి కంటే అనవసరమైన ఆందోళనలతోనే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇన్ని అవయవాలను అది ప్రభావితం చేసినా… అసలు వ్యాధి కంటే ఆందోళనే ఎక్కువగా ప్రమాదకారి అవుతోందని గుర్తిస్తే… దాని నుంచి ముప్పే ఉండదన్న విషయం మనందరికీ స్పష్టమవుతోంది. అనేక అధ్యయనాల్లోనూ ఇది తేలింది. అందుకే విషయం తెలుసుకోండి. నిర్భయంగా ఉండండి.

మొక్క జొన్న పొత్తు

Image by Cornell Frühauf from Pixabay

❂ మొక్క జొన్న గింజలు శరీరానికి బలం ఇస్తుంది. వీటిలో లినోలిక్ ఆసిడ్, విటమిన్ E, B1, B6, ఫోలిక్ ఆసిడ్, రిబోఫ్లావిన్ నియాసిన్‌లు ఉంటాయి.
❂ మొక్కజొన్నలో ఫైబర్ (పీచు) పుష్కలంగా వుంటుంది. ఇది జీర్ణక్రియకు తోడ్పుడుతుంది.
❂ మొక్క జొన్నలోని ఫైబర్ మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
❂ మొక్క జొన్న పేగు క్యాన్సర్‌‌ను అరికడుతుంది.
❂ మొక్కజొన్నలో బోలెడన్ని మినరల్స్‌ ఉంటాయి.
❂ మెుక్కజొన్నను రోజూ తినేవారిలో హెయిర్ ఫోలీ సెల్స్‌ బలంగా ఉంటాయి.
❂ మొక్క జొన్నలో ఉండే విటమిన్-C, యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల జుట్టుకు కాంతివంతంగా ఉంటుంది.
❂ మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌‌లు ఉంటాయి. దీని వల్ల ఎముకలు గట్టిపడతాయి.
❂ మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.

❂ బాగా ఎండిన మొక్కజొన్న విత్తనాల నూనెను చర్మానికి రాసుకోవచ్చు.
❂ మొక్క జొన్న నూనెలో ఉండే లినోలె యాసిడ్‌ చర్మమంటలను తగ్గిస్తుంది.
❂ మొక్కజొన్నలో ఉండే విటమిన్‌ C, కేరోటియాయిడ్లు, మయో ప్లేవినాయిడ్లు.. చెడు కొలెస్టరాల్‌ నుంచి గుండెను కాపాడుతాయి.

❂ మొక్క జొన్న శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుంది.
❂ మొక్కజొన్న మధుమేహంతో బాధపడే వారికి మేలు చేస్తుంది. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని తినొచ్చు.
❂ మొక్కొజొన్నను నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవడం శరీరానికి మంచిది.
❂ పసుపు రంగులో ఉండే మొక్కజొన్న గింజలలో మినరల్స్ అధికంగా ఉంటాయి.
❂ మొక్కజొన్న కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
❂ మెుక్కజొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వలన అది రక్తహీనతను తగ్గిస్తుంది.

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS)

పాలీ సిస్టిక్ ఓవరి సిండ్రోమ్ (PCOS), అనేది హార్మోన్ ల అసమతుల్యం వల్ల స్త్రీ ల లో కలిగే సర్వ సాధారణమైన సమస్య. 15 నుండి 44 సంవత్సరాల వయస్సులో ఎప్పుడైనా రావచ్చు.

ఆరోగ్యకరమైన రుతుచక్రంలో, అండాశయం, ప్రతి నెలా అండాల్ని తయారు చేసి విడుదల చేస్తుంది. హార్మోన్ల అసమతుల్యం వల్ల, అండాశయం లో మార్పులు సంభవిస్తాయి.అండం పరిపక్వత చెందక పోవడం, లేదా అండం విడుదల లో జాప్యం కలుగుతుంది. ఫలితంగా, రుతుక్రమం తప్పడం లేదా ఆలస్యంగా రావడం జరుగుతుంది. నిర్లక్ష్యం వహిస్తే, అండాశయం లో నీటి తిత్తులు (Cysts), సంతాన లేమి (infertility) వంటి సమస్యలు కలుగుతాయి.

PCOS లక్షణాలు:

 1. నెలసరి తప్పడం, ఆలస్యం అవడం లేదా మరీ ఎక్కువగా రావడం
 2. అవాంఛిత రోమాలు (Hirsutism)
 3. మొటిమలు ( Harmonal acne)
 4. జుట్టు పలచబడటం
 5. బరువు పెరగడం లేదా తగ్గడం
 6. మానసిక సమస్యలు (Mood Swings)

PCOS కారణాలు:

PCOS కి ఖచ్చితమైన కారణం అంటూ లేదు. కొన్ని పరిశోధన ల ప్రకారం క్రింది కారణాలు ఉండవచ్చు.

 1. అధిక మోతాదు లో ఆండ్రోజెన్స్ విడుదల అవడం: ఆండ్రోజెన్స్ ని పురుష హార్మోన్ లు గా కూడా సంభోదిస్తారు. ప్రతి స్త్రీ లోను, కొంత మోతాదు లో, పురుష హార్మోన్ లు విడుదల అవ్వడం సర్వ సాధారణం. కానీ PCOS ఉన్న వారి లో, సాధారణం కన్నా ఎక్కువగా ఆండ్రోజెన్స్ విడుదల అవుతాయి. ఫలితం గా, అండం పరిపక్వత చెందక పోవడం, అండం విడుదల లో జాప్యం, అవాంఛిత రోమాలు, మొటిమలు వంటి సమస్యలు కలుగుతాయ.
 2. ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance): ఇన్సులిన్ అనే హార్మోన్ రక్తం లో చక్కెర నిల్వల్ని క్రమబద్దీకరిస్తుంది. PCOS ఉన్న చాలా మంది స్త్రీ ల లో, ముఖ్యం గా, అధిక బరువు, అనారోగ్యపు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, లేదా వంశ పారంపర్యపు మధుమేహం వల్ల, ఇన్సులిన్ నిరోధకత కలుగుతుంది. తద్వారా, రక్తం లో ఇన్సులిన్ మోతాదు పెరిగి పోతుంది. క్రమేణా అది టైపు-2 మధుమేహం గా మారుతుంది.

PCOS నిర్దారణ మరియు చికిత్స:

ఖచ్చితమైన నిర్దారణ విధానం అంటూ లేదు. స్త్రీ వ్యాధుల నిపుణుల్ని (Gynecologist) ని సంప్రదిస్తే, లక్షణాలు, పెల్విక్ ఎక్షామినేషన్, ఆల్ట్రాసౌండ్ లేదా రక్త పరీక్షల ద్వారా PCOS ని నిర్దారిస్తారు.

చికిత్స లో నెలసరి క్రమం గా రావడానికి, గర్భనిరోధక మాత్రల్ని (Harmonal contraceptives), పురుష హార్మోన్ ల ప్రభావం తగ్గించడానికి, యాంటి ఆండ్రోజెన్స్ ని, ఇన్సులిన్ నిరోధకత కి, ఇంకా ఇతరత్రా PCOS లక్షణాలని తగ్గించడానికి మెట్ఫార్మిన్ (Metformin) లాంటి మాత్రల్ని సూచిస్తారు.

మన ఆరోగ్యం-మన చేతుల్లోనే:

చికిత్స తీసుకోవడం తప్పు కాదు. కానీ, మన జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోనంత వరకు, ఫలితం మాత్రం తాత్కాలికం లేదా శూన్యం. ఆరోగ్యకరమైన జీవన విధానం మరియు ఆహరపు అలవాట్ల వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని అధిగమించవచ్చు.

PCOS నుండి విముక్తి పొందడానికి సహజ సిద్దమైన పద్దతులు:

ఆహారం: PCOS కి సంబందించినంత వరకు, ఆహారానిది ప్రముఖ పాత్ర. సరైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో, సరైన వేళలో తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

అల్పాహారం గా, నాన బెట్టిన బాదం, ఎండు ద్రాక్ష, వాల్నట్స్, మొలకెత్తిన గింజలు, అవిసెలు, తాజా పండ్లు, కూరగాయలు, పులిసిన ఆహారం(ఇడ్లీ లాంటివి) తీసుకోవచ్చు.

మధ్యాహ్నపు భోజనం గా, ఆరోగ్యకరమైన కంచెం పద్దతి (Healthy Plate Method) ని అనుసరించాలి. అంటే, సగం కంచెం లో తాజా కూరగాయలు, మిగతా సగం లో కార్బోహైడ్రేట్ లు, మాంసకృత్తులు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేలా చూసుకోవాలి.

రక్తం లో చక్కెర నిల్వల్ని అదుపు లో ఉంచుకోవడానికి, Low Glycemic Index కలిగిన ఆహారం ని తీసుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు లాంటి చిరు ధాన్యాన్ని ప్రయత్నించవచ్చు.

వేపుడు పదార్థాలు, పచ్చళ్లు, తీపి పదార్థాలు, టీ, కాఫీలు, మైదా, చక్కెర తో చేసినవి, మాంసం వీలైనంత తగ్గిస్తే మంచిది. బదులుగా జీవ క్రియల్ని (Metobolism) మెరుగు పరిచే, గ్రీన్ టీ లాంటివి తీసుకోవచ్చు.

జీర్ణ క్రియ కి సూర్యుడికి సంబంధం ఉందంటారు. అంటే, జఠరాఙి కూడా సూర్యుడితో పాటు పెరుగుతూ, సూర్యాస్తమయానికి తగ్గుతుందని అంటారు. ఆహారం కూడా ఇలా ప్రకృతి నియమాలకు అనుగుణం గానే తీసుకోవాలి. పగలు క్లిష్టమైనవి, రాత్రి వేళ తేలిక గా జీర్ణం అయ్యే ఆహారం తీసుకుంటే మంచిది. రాత్రి భోజనం కూడా వీలైనంత త్వరగా ముగించటం వల్ల, బరువు చాలా వరకు నియంత్రణ లోకి వస్తుంది.

శారీరక శ్రమ: దీనికి నడక, వ్యాయామం లేదా యోగా వీటిలో ఎదో ఒకటి ఎంచుకోవచ్చు. హార్మోన్ల వ్యవస్థ ని, క్రమబద్దీకరించడానికి, కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలు ఉంటాయి. అవి ఎంచుకోవచ్చు. ఎదేమైనా ఖచ్చితంగా రోజుకి ఒక గంట శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.

మరికొంత:

 1. సరైన నిద్ర వేళలు (ఒకే సమయానికి నిద్రించటం మరియు మేల్కొవడం) పాటించటం చాలా ముఖ్యం. ఎందుకంటే స్త్రీ హర్మోన్ల పై, జీవ గడియారం ప్రభావం చాలా ఉంటుంది.
 2. సాధ్యమైనంత వరకు, సేంద్రియ పద్దతి లో పండించిన ఆహారాన్ని తీసుకోవాలి.
 3. వీలైనంత ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. ఎందుకంటే, మనం వాడే ప్లాస్టిక్ వస్తువుల నుండి, రోజుకి కొన్ని లక్షల సూక్ష్మ రేణువులు విడుదలవుతాయి. వాటిలో ఉండే రసాయనం BPA (Bisphonol) హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బ తీస్తుంది.
 4. ఒత్తిడి మరియు PCOS ది అవినాభావ సంభందం. మానసిక సమస్యలు అదనం (Mood Swings). ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. యోగా, ధ్యానం లాంటివి ఉపకరిస్తాయి.
 5. ఇక ఎక్కువ గా బాధించే మరిన్ని సమస్యలు అవాంఛిత రోమాలు మరియు మొటిమలు( Harmonal Acne). ఇవి హార్మోన్ ల అసమతుల్యం వల్ల కలిగేవీ కాబట్టి, పై పూతల వల్ల ప్రయోజనం తక్కువ. సమస్య మూలాలపై దృష్టి సారిస్తే , స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అవాంఛిత రోమాలు తగ్గించుకోవడానికి, తాత్కాలిక మరియు శాశ్వత పద్దతులు ఉంటాయి. ముఖ చర్మం సున్నితం గా ఉంటుంది కాబట్టి నిపుణుల్ని సంప్రదిస్తే మంచిది. వారు సమస్య తగ్గడానికీ మందులు లేదా శాశ్వతంగా తొలగించడానికి లేజర్ లేదా ఎలెక్ట్రోలైసిస్ పద్దతుల్ని సూచిస్తారు.

PCOS తప్పకుండా అదుపు లో కి వస్తుంది.కానీ, సహనం కొల్పో కుండా, క్రమ శిక్షణ తో ప్రయత్నించాలి.