గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్దిష్టమైన అర్థాలు

శాస్త్రంలో సందిగ్ధతకి తావు లేదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో మనం ముఖ్యంగా చేసే పని “పేర్లు పెట్టడం.” అనగా, మన అనుభవ పరిధి లోకి వచ్చిన దృగ్విషయాలకి నిర్ద్వందంగా ఉండేటట్లు పేర్లు పెట్టడం. ఇప్పుడు మనం గాలివాన, తుపాను, టైడల్ వేవ్, సునామీ, ఉప్పెన అన్న పేర్లకి నిర్ధిష్టమైన అర్థాలు నిర్దేశిద్దాం.

గాలివాన, తుపాను, చక్రవాతం

గాలితో వచ్చే వాన గాలివాన (storm or windstorm). ఈ గాలి వేగం ఒక హద్దు (గంటకి 75 మైళ్లు లేదా 120 కిలోమీటర్లు) మీరి ఉంటే అది తుపాను. హిందూ మహాసముద్రంలో పుట్టే తుపానులని “సైక్లోనులు” (cyclones) అంటారు. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుపానులని “హరికేన్” (hurricane) అనిన్నీ, పసిఫిక్ మహాసముద్రంలో – అంతర్జాతీయ తేదీ రేఖకి తూర్పున – పుట్టేవాటిని “టైఫూన్” (typhoon) అనిన్నీ అంటారు. అనగా, మౌలికంగా ఈ మూడు మాటల అర్థాలలోను తేడా లేదు. ఒకొక్క చోట ఒకొక్క మాటని వాడుతున్నారు. (బొమ్మ చుడండి.)

బొమ్మ: తుపానుకి రకరకాల పేర్లు

తుపానులలో వీచే గాలి జోరు ఒక హద్దు (గంటకి 40 మైళ్లు లేదా 65 కిమీ) దాటితే దానికి పేరు పెడతారు. అంటే, అన్ని గాలివానలూ తుపానులు కావు, అన్ని తుపానులకీ పేర్లు పెట్టరు.

కొన్ని చోట్ల వాన ఉన్నా లేకపోయినా కేవలం సుడిగాలి అతి వేగంతో తిరుగుతూ వస్తుంది. గరాటు ఆకారంలో ఉన్న ఆ సుడిగాలి అడుగు భాగం భూమిని తాకుతూ, పై భాగం మేఘాలని తాకుతూ ఉంటుంది. ఆ సుడిగాలి వేగం ఒక హద్దు (సుమారుగా గంటకి 40 మైళ్లు లేదా 65 కిమీ) దాటినప్పుడు దానిని చక్రవాతం (tornado) అంటారు (దిగువ బొమ్మ చూడండి). చక్రవాతానికీ తుపానుకీ ఒక ఉమ్మడి లక్షణం ఉంది; రెండింటి మధ్య ఒక అల్ప పీడన ద్రోణి (low pressure trough) ఉంటుంది.

బొమ్మ: బొమ్మలో ఎడమ పక్క తుపాను, కుడి పక్క చక్రవాతం

సాధారణంగా తుపాను (cyclone) వచ్చినప్పుడు ఆ గాలి తాకిడికి సముద్రంలో పెద్ద కెరటాలు లేస్తాయి. ఈ కెరటాల వల్ల తీర ప్రాంతాలలో ముంపు కలుగుతుంది: ఈ కెరటాలు భూమి లోపుకి ఎక్కువగా చొచ్చుకుని రావు. గాలివాన, తుపానుల వల్ల కలిగే నష్టం ముఖ్యంగా గాలి వల్ల, కొంత వరకు వాన వల్ల; సముద్రపు కెరటాల వల్ల కాదు. హుద్ హుద్ వల్ల విశాఖ ప్రాంతాలకి కలిగిన నష్టం ఇటువంటిదే.

అటు పోట్లు (టైడ్స్)

గాలి వల్ల సముద్రంలో కలిగే చలనం ఒక రకం అయితే సూర్య చంద్రుల ఆకర్షణ వల్ల మరొక రకం చలనం కలుగుతుంది. మనం బీచికి షికారుకి వెళ్లినప్పుడు ఈ రకం చలనం కనిపించదు. కాని సముద్రంలో ప్రయాణం చేసే పడవలకి ఇది ముఖ్యం. ఇంగ్లీషులో ఈ రకం చలనాన్ని టైడ్స్ (tides) అంటారు. టైడ్స్ అంటే సముద్రంలో వచ్చే ఆటుపోటులు. ఇవి కెరటాలు కావు; కెరటాలలా జోరుగా వచ్చి ఒడ్డుకి కొట్టుకోవు. టైడ్ అంటే ఒక రకమైన “పొంగు.” సముద్రం ఇలా పొంగినప్పుడు సముద్ర మట్టం అంతా పైకి లేస్తుంది – పాలు పొంగినట్లు. ఇలా సముద్రం పొంగినప్పుడు దానిని తెలుగులో “పోటు” అంటాం, ఇంగ్లీషులో, ఏకవచనంలో, “టైడ్” (tide) అని కానీ, “ఫ్లో” (flow) అని కాని అంటాం. పుట్టుట గిట్టుట కొరకే అన్నట్లు పైకి లేచిన పొంగు పడి, కిందకి దిగాలి. అలా సముద్ర మట్టం తగ్గడాన్ని “ఆటు” అని కాని “తీత” అని కాని తెలుగులోనూ, “ఎబ్” (ebb) అని ఇంగ్లీషులోనూ అంటారు. అందుకనే ebb and flow అనే పదబంధాన్ని ఆటుపోట్లు అని తెలిగించవచ్చు.

“సముద్రం పొంగుతోంది” అంటే సముద్రపు నీటి మట్టం పైకి లేస్తోంది అని అర్థం. పొంగు అంటే జోరుగా కాకుండా నెమ్మదిగా సముద్రమట్టం లేవడం; భూమి మీద ఉన్న మన సముద్రం రోజుకి రెండు సార్లు లేస్తుంది (పొంగుతుంది). లేచిన మట్టం మళ్లా తరుగుతుంది. ఈ ఆటుపోట్లు ఏ వేళప్పుడు వస్తాయో లెక్క కట్టి చెప్పవచ్చు. ఈ సమాచారాన్ని వాడుకుని రేవులోకి పడవలు ఎప్పుడు వస్తే సదుపాయంగా ఉంటుందో నావికులు నిర్ణయిస్తారు. కనుక సముద్రంలో వచ్చే ఆటుపోట్లు ప్రమాదం కాదు, మనకి ఎంతో ఉపయోగం.

ఆటుపోట్ల వల్ల సముద్రమట్టం లేచినప్పుడు సముద్రం ముందుకి వస్తుంది, పడినప్పుడు వెనక్కి వెళుతుంది. ఇలా ఎంత ముందుకి వస్తుంది, ఎంత వెనక్కి వెళుతుంది అనేది ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమరిక మీద కొంతా, ఆ రోజు పౌర్ణమా, అమావాశ్యా, గ్రహణమా అనే ఖగోళ పరిస్థితుల మీద కొంతా ఆధారపడి ఉంటుంది. ఈ రకం కదలికని ఉపయోగించుకుని విద్యుత్తుని పుట్టించవచ్చు. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే ఈ ఆటుపోట్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు; వీటి రాకపోకలని మనం లెక్క కట్టి చెప్పవచ్చు.

ఉప్పెన (టైడల్ వేవ్)

1960 దశకంలో, అమెరికాలో “టైడల్ వేవ్” అన్న మాటే వాడుకలో ఉండేది. మొదటి సారి సునామీ అన్న మాట పరిశోధన పత్రాలలో 1976 లో చూసేను. జపానీ భాషలో సునామీ అంటే “రేవులని ముంచేసే పెద్ద కెరటం” అని అర్థం. మనకి ఇంగ్లీషు మాటలు వాడటం అంటే ఎంత వ్యామోహమో అలాగే ఇంగ్లీషు మాతృభాషగా ఉన్న వాళ్లకి విదేశీ మాటల మీద మోజు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపానుకీ అమెరికాకి సత్సంబంధాలు, రాకపోకలు పెరగటంతో జపానీతో పరిచయం పెరిగి ఈ “సునామీ” ఇంగ్లీషులో ప్రవేశించడంతో అప్పటివరకు వాడుకలో ఉన్న “టైడల్ వేవ్” కి కొత్తగా వచ్చిన సునామీకి మధ్య తేడా తెలియక కొంత తికమకకి దారి తీసింది.

ఉప్పెన అంటే సముద్రం పోటు పెడుతూన్న సమయంలో తుపాను కారణంగా వచ్చిన ముంపు అని నా నిర్వచనం. బందరు, దివిసీమ – ఈ రెండూ – సముద్రమట్టంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రావడానికి అవకాశం ఎక్కువ. ఈ రకం ముంపుని ఇంగ్లీషులో “టైడల్ వేవ్” అంటారు. ఎందుకుట? సముద్రపు పోటు (tides), తుపానువల్ల వచ్చే కెరటాలు (waves) కలిసిపోయాయి కనుక! ఇలా ఆలోచిస్తే టైడల్ వేవ్ అన్న ఇంగ్లీషు మాటకి ఉప్పెన సమానార్థకమైన తెలుగు మాట – అని నా అభిప్రాయం. అనగా, సముద్రానికి పోటు వచ్చే తరుణంలోనే తుపాను కూడా వస్తే ఆ రెండింటి ప్రభావాన్ని ఉప్పెన (“టైడల్ వేవ్”) అంటారు. “అసలే కోతి, కల్లు తాగింది, నిప్పు తొక్కింది” అన్న సామెతలా పోటుతో పైకి లేచిన సముద్రం వేగంగా వీచే గాలి తాకిడికి భూమి మీదకి చొచ్చుకు వచ్చినప్పుడు గాలి, వానతో పాటు ముంపు కూడా వస్తుంది. ఈ పరిస్థితిని “ఉప్పెన” అని తెలుగు లోనూ, “టైడల్ వేవ్” అని ఇంగ్లీషులోనూ అనొచ్చు.

సునామీ

సునామీ అన్న మాట అజంతం కనుక తెలుగులో తేలికగా ఇమిడిపోతుంది. అందుకని దీనిని యథాతథంగా తెలుగులోకి దింపేసుంటే నాకు అభ్యంతరం లేదు. సముద్ర గర్భంలో, ఎక్కడో, భూమి కంపించడం వల్ల కడలి అడుగున ఉన్న భూమి కదలి పోయిన సందర్భంలో, పరిస్థితులు అనుకూలిస్తే ఒక మహత్తర కెరటం పుట్టుకొచ్చి అది మహా వేగంతో ఒడ్డుని ఢీకొంటుంది. అదీ సునామీ అంటే! అనగా, ఈ మహత్తర కెరటం గాలి వల్ల పుట్టినది కాదు. సునామీ ఒక ఊరికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు; సునామీ వల్ల భౌగోళికంగా చాల ప్రాంతాలు దెబ్బ తింటాయి. సముద్రపు ఆటుపోట్లకీ సునామీకి సంబంధం లేదు.

సముద్రం నౌక లో విద్యుత్

వారాల నుండి నెలల తరబడి సముద్రంలో ప్రయాణించే నౌక లో విద్యుత్ చాలా కీలకమైనది. నౌక యొక్క విద్యుత్ అవసరాలకి అనుగుణంగా, విద్యుత్ ఉత్పాదక వ్యవస్థ నౌకలోనే ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఎక్కువ శాతం నౌకలలో శిలాజ ఇంధనాలని మండించడం ద్వారానే విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది.

అన్ని భారీ నౌకలలోనూ ప్రాథమికంగా, జనరేటర్ మరియూ ప్రైమ్ మూవర్ ఉంటాయి. ప్రైమ్ మూవర్ అంటే ఇంధనాన్ని మండించి, తద్వారా యాంత్రిక శక్తిని సృష్టించే యంత్రం. ఉదాహరణకి డీజిల్ ఇంజిన్ ఒక ప్రైమ్ మూవర్. ఇందులో డీజిల్ ని మండించడం ద్వారా వచ్చే భ్రమణ శక్తిని, జనరేటర్ కి అందించడంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

యుద్ధ నౌకలలో అణు విద్యుత్ తో నడిచే ఏర్పాటు ఉంటుంది. అలాగే కొన్ని నౌకలలో ఆవిరి తో నడిచే టర్బైన్ లు ప్రైమ్ మూవర్ గా ఉంటే, మరికొన్నిటిలో గ్యాస్ టర్బైన్ ప్రైమ్ మూవర్ గా ఉంటుంది.

అయితే సాధారణంగా అన్ని నౌకలలో కూడా రెండు భిన్న వ్యవస్థల కలయికలో విద్యుత్ ఉత్పాదక ఏర్పాటు ఉంటుంది. ప్రధాన వ్యవస్థగా డీజిల్ ఇంజిన్ నడుస్తుంటే, ప్రత్యేక పరిస్థితుల్లో( మరింత వేగంగా వెళ్ళాల్సినప్పుడో, లేక డీజిల్-జనరేటర్ లో లోపం తలెత్తినప్పుడో) వివిధ ప్రైమ్ మూవర్ లను ప్రత్యామ్నాయ వ్యవస్థలుగా ఏర్పాటు చేస్తారు.

నౌకకి అదనంగా షాప్ట్ జనరేటర్ కూడా ఉంటుంది. ఈ జనరేటర్, ప్రధాన ఇంజిన్ లో వృధాగా పోయే శక్తి నుండి విద్యుత్ ని ఉత్పాదన చేయగలదు. అలాగే నౌకకు అవసరమైన సమయంలో చోదక శక్తిగానూ ఉపయోగపడగలదు.

అంతరాయాలు ఏర్పడినప్పుడు, కీలకమైన మరియూ అత్యవసరమైన సేవలకుగాను బాటరీ బ్యాంక్ లు అందుబాటులో ఉంటాయి.

సూర్యుడి వల్ల భూమి వేడెక్కుతున్నప్పుడు, అంతరిక్షం ఎందుకు చల్లగా ఉంటుంది?

మన భూమి ఉపరితలం మీద సగటు ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీలు. ఒక వేళ మనం విమానం ఎక్కి 10KM ఎత్తున ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు బయట ఉండే ఉష్ణోగ్రత సగటు -57 డిగ్రీలు (బయటకు వెళ్తే చలికి చచ్చిపోతాం). అంతరిక్షంలో ఉష్ణోగ్రత సుమారు –273 డిగ్రీల (బ్రతికే ప్రసక్తి ఉండదు). ఇక్కడ మీరు గమనించినట్టు అయితే మన భూమి ఉపరితలం నుండి పైకి (అంతరిక్షంలోకి) వెళ్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరి సూర్యుడి కిరణాల వలన వేడి ఎక్కితే భూమి నుండి అంతరిక్షంలోకి వెళుతున్న కొద్దీ ఉష్ణోగ్రతలు పెరగాలి కదా?

అసలు వాస్తవం ఏమిటంటే, మన వాతావరణంలో ఉన్న ముఖ్యమయిన అణువులు అంటే, కార్బన్ డైఆక్సైడ్ (CO2), ఆక్సిజన్(O2), నైట్రోజన్ (N2) మొదలగు వాయువులు సూర్యుని కిరణాలలో ఉన్న శక్తిని నేరుగా గ్రహించలేవు. సూర్యుని కిరణాల వేవ్ లెంగ్త్ (short wave length) తక్కువుగా ఉండడం వలన కార్బన్ డైఆక్సైడ్ (CO2) లాంటి వాయువులు ఆ కిరణాల్లో ఉండే శక్తిని గ్రహించలేవు.

కానీ సూర్యుడి కిరణాలు మన నేలను తాకి వేడి చేస్తాయి. మన నేల వేడెక్కడం వలన లాంగ్ వేవ్ లెంగ్త్ (long wave length) కిరణాలను, అంటే ఇన్ఫ్రారెడ్ (infrared) కిరణాలను మన నేల విడుదల చేస్తుంది. ఈ కిరణాలలో శక్తిని కార్బన్ డైఆక్సైడ్ (CO2) లాంటి వాయువులు సులువుగా గ్రహించి, మన వాతావరణాన్ని వేడిగా ఉంచుతాయి. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ (green house effect) అంటాం. అందుకనే మన భూమి ఉపరితలం మీద గాలి కింద వేడిగా, పైకి వెళ్ళేటప్పుడు చల్లగా ఉంటుంది. ఇంక అంతరిక్షంలో ఈ కిరణాల శక్తిని గ్రహించడానికి వాయువులు ఉండవు గనుక వేడి అసలు ఉండదు. ఇందుకొరకే , భూమి వేడిగా అంతరిక్షం చల్లగా ఉంటుంది.

విమానంలో ఉండే కిటికీ అద్దాలు

విమానం లో మూడు అద్దాలు ఉంటాయి. బయట ఉన్నది (outer most glass) చాలా గట్టిది. ఇది ఎందుకు అంటే మనం విమానం లో ఉన్నప్పుడు అది గాలిలొ ఉంటే భూమి మీద నుండి 35000ft లు దూరం ఉంటుంది. అంత ఎత్తులో మనం ఊపిరి పీల్చుకోలేము. ఎందుకంటే అక్కడ pressure చాలా తక్కువ ఉంటుంది. ఆ pressure లో సాధారణ మనుషులు ఊపిరి లేక స్పృహ కోల్పోయి క్రమంగా 10–15 నిమిషాల్లో మరణిస్తారు. అంత ఎత్తులో కూడా మనం ఊపిరి పీల్చుకోవాలంటే మన విమానం లో ఊపిరి కి సరిపోయేంత pressure ఉండలి. అందుకోసం విమానం లో high pressure ఉంటుంది. ఒక వేళ విమానం గాలిలొ ఉండగా అద్దం పగిలితే బయట low pressure కి విమానం లోని high pressure కి మధ్య తేడా వల్ల మన విమానం లో ఉన్న సామాను గట్రా బయటికి లాక్కుపోతాయు.

ఆ pressure ఎంత ఉంటుంది అంటే 2018 లో AIR INDIA విమానం లోని WIND SHIELD పగిలి, ఆ పైలెట్ ఆ ప్రెషర్ కి విమానం నుండి బయటికి కొట్టుకుపోయారు. అయితే అదృష్టవశాత్తు ఆయన SEAT BELT ఉంది కాబట్టి అలా గాలిలొ కొట్టుకుంటూ వేలాడారు. అయితే అంతలోనే కో – పైలెట్ విమానాన్ని EMERGENCY LANDING చేశారు.

ఆ తర్వాత మన సీట్ పక్కనే ఉండే అద్దం ‘ SCRATCH RESISTANT’ GLASS. దీన్ని గీతాలు, బలంగా కొట్టినా విరగకుండ చేస్తారు. ఇక ఈ రెండిటి మధ్యలో ఉన్న ( MIDDLE GLASS) ఇది ACRYLIC SOLUTION తో చేసిన ధృడమైన అద్దం. దీనికి 3000 కేజీలు అద్దుకునేంత ధృడంగా ఉంటుంది. ఒక professional బాక్సర్ తన మొత్తం సామర్ధ్యం తో పంచ్ కొట్టినా 1300 కేజీలు దాటదు. 

ఇంద్రధనస్సు

ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?

ఇంద్రధనస్సు బహుళ వర్ణ కాంతి యొక్క వంపు వలె కనిపిస్తుంది. సూర్యకిరణాలు వర్షపు బిందువుల గుండా వెళుతున్నప్పుడు ఇది ఏర్పడుతుంది. తెలుపు రంగులో ఉండే సూర్యకాంతి వాస్తవానికి ఏడు రంగులతో రూపొందించబడింది. ఈ రంగులు వైలెట్, ఇండిగో, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ మరియు ఎరుపు, VIBGYOR గా సంక్షిప్తీకరించబడ్డాయి, ఈ పదం యొక్క ప్రతి అక్షరాలు ఒక రంగును సూచిస్తాయి.

ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది?

సూర్య కిరణ వర్షపు బిందువుల గుండా వెళుతున్నప్పుడు, అది వక్రీభవనం, ప్రతిబింబం మరియు మళ్ళీ వక్రీభవనానికి లోనవుతుంది. ప్రతి వర్ష బిందు కూడా ప్రిజమ్‌గా పనిచేస్తుంది.

సూర్యుడు వృత్తాకారంగా ఉన్నందున ఇంద్రధనస్సు కూడా వృత్తాకారంగా ఉంటుంది.

సూర్యరశ్మి ఏడు రంగులతో తయారైందని మన పూర్వీకులకు తెలుసు. కాబట్టి ఏడు గుర్రాలను సూర్యుడి రథంలో ఉంచారు.

లీనియర్ వెలాసిటీ, ఆంగ్యులర్ వెలాసిటీ మధ్య సంబంధం ఏమిటి?

వెలాసిటీ ని వేగం అందాం. “లీనియర్ వెలాసిటీ” అనేదానిని సరళ వేగం అందాం. అనగా, ఒక సరళ రేఖ వెంబడి వేగం. అనగా ఒక సరళ రేఖ వెంబడి ఒక క్షణంలో ఎంత దూరం కదిలేమో చెబుతుంది. అనగా, వేగం = కదలిన దూరం/జరిగిన కాలం. (ఇక్కడ “/” అంటే “భాగించు” అని అర్థం.) కారు సెకండుకి 10 మీటర్లు కదిలితే దాని సరళ వేగం 10 మీటర్లు/సెకండు (ఇక్కడ “/” అంటే “సెంకడుకి ఇన్ని మీటర్లు” అని అర్థం ). ఇలాంటి సరళ రేఖ వెంబడి వేగాన్ని v అనే అక్షరంతో సూచించి, ఇంగ్లీషులో linear velocity అంటారు.

కారు ముందుకి కదిలినప్పుడు దాని చక్రం గిర్రున గుండ్రంగా తిరుగుతుంది కదా. చక్రం ఎక్కువ జోరుగా తిరిగితే కారు ఎక్కువ జోరుగా ముందుకి కదులుతుంది. కనుక చక్రం యొక్క గుండ్రటి కదలికకీ, కారు నేరుగా ముందుకి జరిగే కదలికకీ ఏదో సంబంధం ఉండాలి కదా.

చక్రపు గుండ్రటి వేగాన్ని (అనగా, angular velocity) “ఒమీగా” (w) అనే గ్రీకు అక్షరంతో సూచించడం రివాజు. అనగా ఒక నియమిత కాలంలో చక్రం ఎంత కోణం (లేదా ఎన్ని చుట్లు) తిరిగిందో “ఒమీగా” చెబుతుంది. అనగా, “ఒమీగా” = తిరిగిన కోణం/జరిగిన కాలం. అందుకనే దీనిని తెలుగులో కోణీయ వేగం అంటారు.

అదే నియమిత కాలంలో కారు ముందుకి ఎంత కదిలిందో చెప్పడానికి “వి” (v) అనే అక్షరాన్ని వాడతారని చెప్పేను కదా. ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని v = rw అనే గణిత సమీకరణం ద్వారా చెబుతాము. ఇక్కడ r అనేది చక్రం యొక్క వ్యాసార్ధం. ఇది సమీకరణం ఎక్కడి నుండి వచ్చింది?

చక్రం చిన్నది అయితే (r=1 అనుకుందాం) అది ఒక చుట్టు తిరిగేసరికి కారు ఆ చక్రం చుట్టుకొలత ఎంత ఉందో అంత (అనగా “2 పై” అంత ) ముందుకి కదులుతుంది కదా. చక్రం పెద్దది అయితే (r=2 అనుకుందాం) అది ఒక చుట్టు తిరిగేసరికి కారు రెట్టింపు (అనగా “4 పై” అంత) ముందుకి కదులుతుంది. ఈ సమాచారాన్నే v = rw అని రాస్తాము.

ఫ్లైట్ పాత్స్ (flight paths)

ప్రపంచ వ్యాప్తంగా విమానాలు కొన్ని స్టాండర్డ్ (standard) మార్గాలలోనే దాదాపుగా ప్రయాణించ వలసి వస్తుంది. ఈ స్టాండర్డ్ మార్గాలను మనం ఫ్లైట్ పాత్స్ (flight paths) అని అనవచ్చు. ఎక్కువ శాతం ఈ మార్గాలలోనే విమానాలు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఇందుకు కొన్ని కారణాలు:

1. ప్రపంచ దేశాల పైనుండి విమానాలు వెళ్ళవలసి ఉన్నందున, వేరు వేరు దేశాల మిలిటరీ స్థావరాలమీద విమానాలను వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు.

2. కొన్ని ముఖ్యమయిన మరియు రహస్య స్థావరాల మీద నుండి విమానాలను వెళ్లనివ్వరు.

3. జెట్ స్ట్రీమ్స్, అంటే ఆకాశం పైన ఎత్తులో కొన్ని వేగంగా వీచే గాలి దిశలను బట్టి ఫ్లైట్ పాత్స్ నిర్ణయిస్తారు.

4. విమానపు రాడార్ కింద నెల మీద ఉండే కొన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ రాడార్ పరిధిలోనే ఉండవలసిన కారణంగా, కొన్ని చెక్ పాయింట్స్ మీద నుండే వెళ్లవలిసి ఉంటుంది.

ఈ కారణం చేత కొన్ని స్టాండర్డ్ ఫ్లైట్ పాత్స్ ను ముందుగా నిర్ణయిస్తారు. అన్ని విమానాలు ఈ ఫ్లైట్ పాత్స్ మీదనే ప్రయాణం చేయవలసి వస్తుంది, అవి ఎలా పడితే అలా వెళ్లే వీలు లేదు. కింద చిత్రములో కొన్ని స్టాండర్ ఫ్లైట్ పాత్స్ మీరు చూడవచ్చు.

పైన చెప్పిన విషయాలతో పాటు మరి కొన్ని నియమాలు ఏమిటంటే , విమానాల మధ్య కనీసం మూడు నుంచి అయిదు మెయిళ్ల దూరం వుండవలసి ఉంటుంది, అలాగే ఒక విమానం పైన గాని కింద గాని ఇంకో విమానం వెళ్ల వలిసి వస్తే కనీసం వెయ్యి ఆడుగులు దూరం ఉండవలసి ఉంటుంది..

కొన్ని సార్లు వాతావరణం అనుకూలించని కారణంగా విమానాశ్రయాల్లో విమానాలు ల్యాండ్ అవ్వడానికి వీలు పడదు. ఇల్లాంటి సందర్భాలలో స్టాండర్డ్ ఫ్లైట్ పాత్స్ లో ట్రాఫిక్ జాం అవ్వడం సాధారణం. ఇలాంటప్పుడు విమానాలుకు గో అరౌండ్ (go around) ఆదేశాలు ఇవ్వబడతాయి. ఆ విమానం కొంత ట్రాఫిక్ క్లియర్ అయ్యేవరకు చూట్టు చక్కర్లు కొట్టాల్సిందే. మరి కొన్ని సార్లు విమానం దిశను మర్చి వేరే ప్రాంతాలకు పంపడం జరుగుతుంది. తుర్బులెన్స్, తూఫాను, బీకరమయిన వర్షపాతం నమోదవినప్పుడు ఈ ట్రాఫిక్ జాంలు అవ్వడం సహజమే. ఎలాంటి ట్రాఫిక్ జాం సందర్భాలలో అయినా ఒక విమానం కు మరో విమానంకు మధ్య కనీస దూర నియమం పాటించవలసి ఉంటుంది.

అంతర్జాతీయ స్పేస్ స్టేషన్

 • 1980లో పూర్తిగా అమెరికా ప్రయత్నంగా “ఫ్రీడం” అనే పేరు మీద ఈ కట్టడం మొదలైనా వ్యయం తగ్గించుకునేందుకు, అంతర్జాతీయంగా వివిధ అంతరిక్ష ఏజెన్సీల ప్రమేయం కల్పించుకునేందుకు “ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్” పేరుతో ఈ విశ్వంలోనే అత్యంత ఖరీదైన మానవ కట్టడం (2010 లెక్కల ప్రకారం సుమారు 150 బిలియన్ డాలర్లు పై చిలుకు)కు నాంది పలికింది.

అంతరిక్షం లో ఈ “స్పేస్ స్టేషన్” సెకనుకు ఐదు మైళ్ళ వేగంతో భూమి చుట్టూ తొంభై నిమషాల కు ఒక మారు చొప్పున మొత్తం ఒక రోజులో పదహారు సార్లు ప్రదక్షిన చేస్తుంది. వ్యోమగాములకు, ప్రయోగశాలలోని జంతువులకు కలిపి మొత్తం స్టేషనుకు గానూ రెండే బాత్రూములు ఉన్నాయి. వారు విసర్జించిన మూత్రాన్నే త్రాగునీరుగా శుద్ధి చేసే ప్రక్రియ కూడా ఉంది. (ఆ రకంగానైనా త్రాగునీరు వాడకం తగ్గుతుందని కాబోలు )

అంతరిక్షంలో ఏకబిగిన ఎక్కువ సమయం గడపడం ద్వారా కండరాల మరియూ ఎముకుల ద్రవ్యశక్తి తగ్గి అవి క్షీణించే అవకాశాలు ఉన్నందుకు రోజూ రెండూ గంటల పాటు వ్యోమగాములు వ్యాయామం చేయుటకు అనుగుణంగా ‘జిం’ ని కూడా కల్పించారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ మొత్తం ఒక అమెరికన్ ఫుట్బాల్ స్టేడియం విస్తీర్ణం కలిగి ఉంటుంది. దాని సోలార్ పేనల్ల ఒక్కో రెక్క పొడవు ఇంచుమించుగా ఒక ఏ380 విమానపు పొడవు కలిగి ఉంటుంది.

మీరు ఉండే ప్రాంతాన్ని బట్టీ నిర్ధిష్ట సమయాల్లో (ముఖ్యంగా తెల్లవారు ఝాముల్లో, మునిమాపు వేళల్లో) ప్రపంచంలో ఎక్కడ నుండైనా మానవ నేత్రంతో దానిని వీక్షించవచ్చును. మీరుండే ప్రాంతం గుండా ఏ ఏ కాలంలో అది ప్రయాణిస్తుందో దాని గమనాన్ని ఏ ఏ సమయాల్లో చూడవచ్చునొ తెలుపుటకు నాసా సంస్థ ఒక వెబ్సైటును నిర్వహిస్తుంది. http://spotthestation.nasa.gov ద్వారా మీరు వివరాలను తెలుసుకోవచ్చు. ఒకే సారి ఆరు అంతరిక్ష నౌకలను ఈ స్పేస్ స్టేషన్‌కు అనుసంధానం చేయవచ్చును.

మనం కదులుతున్నప్పుడు మనతో పాటు, సమానంగా చందమామ కదలుతున్నట్టుగా అనిపించడానికీ, స్థిరంగా ఉన్నప్పుడు కదలనట్టుగా అనిపించడానికీ కారణం

జాగ్రత్తగా గమనిస్తే చంద్రుడు మనతో పాటు కదులుతున్నట్టు అనిపించడు. మనతో పాటు కదులుతున్నాడు అని అనుకోవడానికి కారణం, దూరం మరియు కోణం (angle)! ప్రయాణం మొదలు పెట్టినప్పుడు మనకి చంద్రుడు ఎంత దూరం లో ఎంత కోణం లో కనిపిస్తున్నాడో ప్రయాణం సాగిస్తునపుడు, ప్రయాణం ముగిసినప్పుడు కూడా అంతే దూరం లో అంతే కోణం లో కనిపిస్తాడు. అందువల్ల చంద్రుడు కూడా మనతో పాటే కదులుతున్నాడనే భావన కల్గుతుంది

మనకి చంద్రుడికి దూరం సుమారు 4 లక్షల కి.మీలు. మన ప్రయాణం ‘A నుంచి B వరకు. భూమి మీద మనం చాలా దూరం వెళ్ళాం అనుకున్నప్పటికీ దాని వల్ల కోణం లో వచ్చిన మార్పు (angular difference) చాలా తక్కువ. కచ్చితంగా చెప్పాలంటే చంద్రుడి స్థితి లో మార్పు ఉంటుంది కానీ దాన్ని మనం కేవలం కంటితో గుర్తించలేము. 

శ్రీహరికోట

శ్రీహరికోటను రాకెట్ ప్రయోగ కేంద్రానికి అనుకూలమైన స్థలంగా గుర్తించడానికి గల కారణాలు

రాకెట్ ఎగురడానికి కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. అందులో చాలా ప్రాథమికమైనది- తక్కువ బరువున్న దానిని తక్కువ ఖర్చుతో సులభంగా ఎగురవేయవచ్చు. రాకెట్లు అంత ఎక్కువ బరువు ఉండడానికి కారణం ఇంధనం (అంటే ఇనుము, ఉపగ్రహాలు కాదు). రొకెట్లలో సుమారు 80%-90% బరువు ఇంధనమే ఉంటుంది. అంటే రాకెట్ ను సులభంగా మరియు చవకగా ఎగురవేయాలంటే ఆ ఇంధనం బరువు తక్కువగా ఉంచుకోవాలి. కాబట్టి ఇది ఇంజినీర్లు చింతించే విషయమే. రాకెట్ ను పైకి ఎగురవేయాలంటే ఆ ఇంధనం చాలా ఎక్కువ థృస్ట్ ఫోర్స్ కలిగించాలి. అన్ని ఇంధనాలు దీనిని కావాల్సినంత ఇవ్వవు. తక్కువ బరువున్న ఇంధనం కోసం ఈ థృస్ట్ ఫోర్స్ ని త్యాగం చేయలేరు. కాబట్టి థృస్ట్ ఫోర్స్ మరియు ఇంధనం బరివును ఆదర్శవంతమైన నిష్పత్తి లో ఉండేలా చూస్తారు. రాకెట్ లో ఇంధనం వినియోగం కూడా వీలయినంత సమర్ధవంతంగా చేస్తారు. కాబట్టి రాకెట్ బరువును ఇంతకుమించి తగ్గించడం కుదరదు. కానీ ఇంధన వినియోగాన్ని మాత్రం ఇంకొంచెం తగ్గించే అవకాశం మాత్రం శ్రీహరికోట ప్రాంతం ఇస్తుంది. దీనితో పాటు ఇంకా మిగితా ముఖ్యమైన కారణాలు చెప్తాను.

భౌతికశాస్త్ర పరమైన కారణాలు:

రాకెట్లను దీర్ఘావృత్తాకార కక్ష్య లో ప్రవేశపెట్టాలి. అలా చేయాలంటే వాటిని భూమికి లంభంగా పైకి పంపించి, సరైన ఎత్తుకు వెళ్ళాక అక్కడినుండి వాటి దిశ భూమి ఉపరితలంకు సమాంతరంగా (parallel to spherical surface) మార్చాలి (అంటే తూర్పుకు లేదా పడమరకు). దాని వలన అది కక్ష్యలోకి వెళ్లగలుగుతుంది. ఆ దిశను రాకెట్ బూస్టర్లు సాయంతో మార్చాలి. అప్పటికప్పుడు దాని దిశను మార్చడం దాదాపు అసాధ్యం. కాబట్టి బూస్టర్లు సాయంతో క్రమంగా దానికి గణి శక్తి అందించి దాని దిశ మార్చాలి. దీనికి ఇంధనం ఖర్చవుతుంది.

ఇది ఇలా ఉంటే…

భూమధ్య రేఖ వద్ద భూమి యొక్క సరళ వేగం గంటకు 1670 కి.మీ. భూమి పడమర నుండి తూర్పు కు తిరుగుతుంది (అంటే భూమి వేగం యొక్క దిశ తూర్పు కు ఉందన్నమాట). ఈ తూర్పు దిశ లో రాకెట్లను వదలడం వలన వాటికి తూర్పునకు అదనపు వేగం గంటకు 0.4 కి.మీ. తొడవుతుంది. అంటే భూమి ఉపరితలం నుండి లంభంగా పైకి వెళ్ళేటప్పుడే అది తూర్పుకు లేదా పడమరవైపుకు దిశ మార్చుకునేందుకు భూభ్రమణం దోహదపడుతుంది. దీని వల్ల రాకెట్లకు ప్రారంభంలోనే భూభ్రమణం (earth’s rotation) ద్వారా గణి శక్తి (kinetic energy) లభిస్తుంది. ఇంకోవిధంగా చెప్పాలంటే, రొకెట్లన్నీ భూమి యొక్క భ్రమణ వేగం సహాయంతో బయటికి నెట్టబడతాయి. భూమి వల్ల వాటికి అదనపు వేగం లభించడంతో ఆ వేగాన్ని ఇవ్వడానికై మనం ఇంధనం కర్చుచేయనక్కర్లేదు. అందుకే ప్రపంచంలో దాదాపు అన్ని రాకెట్లు తూర్పుకు ఎగురవేయబడతాయి. దీని వల్ల ఇంధన వినియోగం తగ్గినటున్నటుంది అలాగే కాస్త ఎక్కువ బారువున్న ఉపగ్రహాలను పంపించే అవకాశము లభిస్తుంది.

భూమి యొక్క సరళ వేగం భూమధ్య రేఖ వద్దనే ఎక్కువగా ఉంటుంది. ఆ వేగం ధృవాల(poles) వద్ద సున్నా గా ఉంటుంది. ధృవాల నుండి భూమధ్య రేఖకు చేరుకునేటప్పుడు ఆ వేగం పెరుగుతూ వస్తోంది. వృత్తకార కదలికలో దీనిని ఈ విధంగా చెప్పవచ్చు.

V= సరళ వేగం

W = భ్రమణ వేగం

R= వ్యాసార్ధం.

పై చిత్రంలో- భూమిని ద్విమితీయ ఆకారంలో(2 dimensional) చూస్తే.

V1 = ధృవాల దగ్గరలో ఉండే సరళ వేగం.

V2 = కర్కాట రేఖ వద్ద ఉండే సరళ వేగం

V3 = భూమధ్య రేఖ వద్ద ఉండే సరళ వేగం.

దీనిభట్టి చుస్తే భూమధ్య రేఖ వద్దన ఉండే సరళ వేగంమే ఎక్కువగా ఉంటుంది.

ప్రపంచంలో ఎక్కడైనా రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరలో ఉండాలి. ఎందుకంటే భూభ్రమణ వేగం వ్లల తూర్పునకు అదనపు వేగం గంటకు 0.46 కి.మీ. భూమధ్య రేఖ వద్దనే లభిస్తుంది(కాబట్టి ఇంధనం ఆదా!). భూమధ్య రేఖకు పైన లేదా క్రింద ఈ ఆదనవు వేగం తగ్గిపోతూ వస్తుంది.

ప్రయోగ కేంద్రాలు భూమధ్య రేఖ వద్ద ఉండడం వలన టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం సులువు అవుతుంది. ఎందుకంటే ఇవి భూమధ్య రేఖకు సరిగ్గా పైన ఉండే భౌగోళిక-స్థిర కక్ష్య (Geo-stationary orbit) లో ఉపగ్రహాలను ఉంచడానికి రాకెట్ ఎక్కువ ఇంధనం ఖర్చుచేయనక్కర్లేదు. అలాగే టెలికమ్యూనికేషన్ ఉపగ్రహాలు భూమిపై ఒక ప్రాంతాన్ని అనుసరిస్తాయి. వాటి గమనం కూడా భూభ్రమణకు సమస్థితిలో (synchronous) ఉంటుంది. భూమి తూర్పు దిశకు తోరుగుతుంది కాబట్టి తూర్పునకు ఉపగ్రహాలను వదలడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రయోగ కేంద్రాలు భూమధ్య రేఖ నుండి దూరం ఉంటే, అప్పుడు అక్కడినుండి పంపే ఉపగ్రహాలను భుస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టాలంటే అదనపు ఇంధనం కర్చుజేయాల్సివస్తుంది.

కానీ మనం చూసినట్టాయితే మన దేశం భూమధ్య రేఖకు కాస్త పైకి ఉంది. కాబట్టి దానికి వీలైనంత దగ్గరలో ఉండే ప్రదేశాన్ని ఎంపిక చేయవలసి వస్తుంది. అందుకు తూర్పుతీరాన ఉన్న శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ఇది ప్రధాన కారణం.

శ్రీహరికోట కంటే కిందికి (భూమధ్య రేఖకు దగ్గరగా) ఉన్న ప్రాంతాలు చాలానే ఉన్నాయి. కానీ శ్రీహరికోటను ఎంపిక చేయడానికి గల భౌగోళిక పరమైన కారణాలు:

 1. అది తూర్పు తీరాన ఉండడం. మన తూర్పు తీరాన సువిశాలమైన సముద్రం ఉంది. ఎప్పుడైనా రాకెట్ ప్రయోగం విఫలమైతే దాన్ని ప్రారంభ దశలోనే పేల్చేస్తారు. అప్పుడు ఆ బరువైన శకలాలు సముద్రంలో పడడం వలన ఎటువంటి ప్రాణ నష్టం ఉండదు.
 2. శ్రీహరికోట ఒక బంజరు ద్విపం. ఒకవైపు బంగాళాఖాతం, మిగితా వైపుకు పులికాట్ సరస్సు. కావున దీనికి రక్షణ ఇవ్వడం కాస్త సులువే! ఎందుకంటే ఇతరులు చొరబడకుండా కంచె లేదా గోడ గాని నిర్మించాల్సిన పనిలేదు.
 3. శ్రీహరికోట లాంటి ద్విపం తూర్పు తీరాన రామేశ్వరం తప్ప ఇంకేమి లేవు. వేరే ప్రాంతాల్లో జన సాంద్రత ఎక్కువ. కావున రమేశ్వరాన్ని కనుక తీసుకుంటే అది శ్రీలంక కు దగ్గరలో ఉంది. ప్రయోగం విఫలమైతే శకలాలు ఆ దేశ భూభాగంలో పడే ప్రమాదం ఉంది. కాబట్టి శ్రీహరికోటయే అనువైన ప్రాంతం.
 4. దగ్గరలో చెన్నై వంటి మహానగరం. దీని వల్ల ఇతర దేశాల నుండి బరువున్న పరికారాలని, రాకెట్ విడిభాగలని గాలి, సముద్ర మార్గాన తరలించవచ్చు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీహరికోటకు చేర్చవచ్చు. అలాగే ఇస్రో ప్రధాన కార్యాలయం బెంగళూరు కూడా దీనికి దగ్గరలోనే ఉంది.
 5. శ్రీహరికోటకన్నా ముందు పశ్చిమ తీరాన తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్(TERLS), తిరువనంతపురం వద్ద ప్రయోగాలు జరిగేవి. అక్కడ కేవలం సౌండింగ్ రాకెట్ల (sounding rockets) ప్రయోగాలు మాత్రమే జరిగేవి. అవి భూమి ఉపరితలనికి సుమారు 300–350 కి.మీ. వరకునే ఎగురుతాయి. కాగా ఉపగ్రహాలు పంపేందుకు అంతకన్నా ఎక్కువ ఎత్తు వెళ్లాల్సి ఉంది. ప్రయోగం విఫలమైతే శకలాలు భారత్ భూభాగంలో పడతాయి.

మనదేశం నుండి అన్ని రాకెట్ ప్రయోగాలు తూర్పునకే జరుగుతాయి. అలాగే ప్రపంచంలో చాలా వరకు రాకెట్ ప్రయోగాలు తూర్పునకే.

ఉదాహరణకు:

A) అమెరికా అంతరిక్ష ప్రయోగాలు దాదాపు అన్నీ ఫ్లోరిడా లోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండే జరుగుతాయి.

B) ఐరోప దేశాల అంతరిక్ష సంస్థ(European Space Agency) ప్రయోగాలు అన్నీ దక్షిన అమెరికా లోని ఫ్రెంచ్ గయానా నుండి జరుగుతాయి. ఇది భూమధ్య రేఖకు సమీపంలో ఉండడం వలన ఐరోప దేశాలు దీనిని ఎంచుకున్నాయి.

C) పశ్చిమానకి ప్రయోగాలు జరిపే దేశం ఇజ్రాయెల్.

ఇజ్రాయెల్ తూర్పుకు రాకెట్లను ప్రయోగిస్తే దాని చుట్టూ ఉన్న దేశాలకు ప్రమాదం. కాబట్టి ఇక్కడ పశ్చిమానకి ప్రయోగాలు జరుగుతాయి.

భూభ్రమణానికి వ్యతిరేకంగా రొకెట్లు ప్రయోగించడంతో భూభ్రమణం వల్ల లెభించే 0.46 kmph నుండి ఇది ప్రయోజనం పొందలేదు. కాగా 0.46 kmph అదనపు వేగాన్ని ఇంధనం ఖర్చుతో పొందల్సివుంది. కాబట్టి వీరికి ఇంధనం ఖర్చు ఎక్కువ. దీని వల్ల భారీ ఉపగ్రహలని పంపించడం కష్టమైన పనే!

అందుకే భారత్ లో కూడా పశ్చిమానకి ఉపగ్రహాలు పంపరు.(కాగా ఇజ్రాయెల్ కి కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నయి. కానీ అవి మనకు ప్రతికూలమని కాదు!)

ఏ.పీ.జే అబ్దుల్ కలాం గారి ఆత్మ కథ “వింగ్స్ ఆఫ్ ఫైర్” లో దీని గురించిన ఒక ప్రస్తావన.

చిత్రాల మూలం: గూగుల్ మరియు గూగుల్ మ్యాప్స్.

గ్లేసియర్లు

విశాలంగా ఏర్పడిన మంచు పలకలను మనం గ్లేషియర్స్ అని అనవచ్చు. అధిక మంచు ఒక ప్రాంతంలో కురవడం వలన గ్లేషియర్స్ ఏర్పడతాయి. ఈ గ్లేషియర్స్ చాలా నిదానంగా కదులుతూ ఉంటాయి. గ్లేషియర్స్ను కొన్ని రకాలుగా మనం విభజించవచ్చు.

వ్యాలీ (Valley) గ్లేషియర్స్:

ఇవి ఎక్కువగా పర్వతాలమీద ఏర్పడుతాయి. పర్వతాలు మీద మంచు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ పర్వతాల మీద మంచు పలకలు ఏర్పడతాయి. అలా కొన్ని దశాబ్దాల పాటు ఈ మంచు పేరుకుపోవడంతో కింద ఉన్న మంచు తీవ్రమయిన వత్తిడికి గురి అయ్యి మంచు యొక్క సాంద్రత పెరుగుతుంది. ఈ మంచు పలకలు ఎక్కువ బరువు పెరగడంతో కింద భాగము వత్తిడికి గురి అయ్యి, పర్వతము పైనుండి మంచు కిందకు జారుతుంది. అలా కిందికి జారిన మంచుపలకలు వేడికి కరిగి నదిలా ప్రవహిస్తాయి.

ఉదాహరణకు హిమాలయాల మీద ఏర్పడిన మంచు కరిగి, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదులు ఏర్పడినవి. కింద అమర్చిన చిత్రంలో మీరు గంగా, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ పర్వతాలనుండి ఎలా ఏర్పడినవో చూడవచ్చు.

వాతావరణ మార్పువలన మన హిమాలయ హిoదు కుష్ ప్రాంతములో ఉషోగ్రతలు చాలావరకు పెరుగుతున్నాయి. ఇందువలన ముందు ముందు ఈ గ్లేషియర్స్ కరిగి అంతరించే ప్రమాదం లేకపోలేదు.

కాంటినెంటల్ (continental) గ్లేషియర్స్:

మంచు యొక్క భారీ పలకలు నెల మీద గనుక ఏర్పడితే వాటిని కాంటినెంటల్ గ్లేషియర్స్ అని పిలుస్తాము (తక్కువ ఉషోగ్రతల వలన మంచు కురుస్తుంది). ఉదాహరణకు అంటార్టికా, ఆర్కిటిక్ , గ్రీన్లాండ్ మంచు పలకలను కాంటినెంటల్ గ్లేషియర్స్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాంటినెంటల్ గ్లేషియర్స్ బరువు వలన అంటార్టికా, ఆర్కిటిక్ నెల కిందకు ఇంకిపోవడం జరుగుతుంది. వాతావరణ మార్పువలన ఈ కాంటినెంటల్ గ్లేషియర్స్ తొందరగా కరిగి సముద్రపు నీటిమట్టమును పెంచడం జరుగుతుంది. దీన్ని సి లెవెల్ రైస్ (sea level rise) అని పిలుస్తారు.

చిత్ర మూలం: NASA, గ్రీన్లాండ్ మంచు పలక/గ్లేషియర్స్

సి ఐస్ (Sea-Ice) గ్లేషియర్స్:

సముద్రపు నీరు చల్లని ఉష్ణోగ్రతల వలన మంచు పాలకలుగా ఏర్పడితే వాటిని మనం సి ఐస్ గ్లేషియర్స్ అని అంటాము లేదా సముద్రపు గ్లేషియర్స్ అని అంటాము. సముద్రపు గ్లేషియర్స్ ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్ మహా సముద్రాలలో ఏర్పడతాయి. సముద్రపు గ్లేషియర్స్ శీతాకాలంలో పెరుగుతాయి మరియు వేసవి నెలల్లో కరుగుతాయి, అయితే ఇవి కొన్ని ప్రాంతాలలో ఏడాది పొడవునా ఉంటాయి.

Water salute

A water cannon salute, for those of us who don’t know what it means, is nothing but expelling plumes of water from the Aircraft Rescue and Firefighting (ARFF) trucks to form a series of arches under which the aircraft slowly passes.

It’s a beautiful sight to see & symbolically, the procession looks similar to a bridal party walking under a wedding arch. Usually 3,000 gallons (or 11,300 liters) of water is used by a single ARFF vehicle (or firetruck) for a single water cannon salute in about 2 minutes.

It is usually given as a mark of respect to either the pilot flying the aircraft or the aircraft itself. Categorically these can be:

 • Induction of new aircraft in the fleet.

Pic: Water salute after ETIHAD inducting a new Boeing 787–900 aircraft in their fleet, welcoming the crew & passengers to the airport.

 • Special occasions like Longest commercial flight:

Pic: Qatar Airways welcoming their Boeing 777 after its longest commercial flight between Doha & Auckland, New Zealand.

 • Shutting down of operations

Pic: Last flight of Air Berlin after which they shut down their operations permanently in 2017.

 • Farewell of a retiring captain on his last flight.
 • As pointed out by Akshay Chandrasekar, water salute is also given when the aircraft is carrying a fallen service member.
 • Water cannon salutes are also used to test the fire fighting equipment to ensure everything is working properly, as the use of water cannon is rare.
 • In military environment, after an aircraft flies or hovers over saltwater, water cannon salute is given primarily to wash the aircraft to prevent corrosion.

తుఫాన్లకు పేర్లు

1990 సంవత్సరం బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను మచిలీపట్నంను తాకి అల్లకల్లోలం చేసింది. ఆ తుఫాను పేరు TC 02B.

కాకినాడ తీరమును 1996 సంవత్సరంలో మరో తుఫాను తాకింది. దాని పేరు 07B.

ఈ రెండు తుఫాన్లు మనకు గుర్తులేవు. కాని హుద్ హుద్ (HudHud) తుఫాను లేదా ఫైలిన్ (Phailin) తుఫాను అంటే గుర్తొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంకెలు కన్నా మనకు పేర్లు బాగా గుర్తుంటాయి కనుక.

1990 సంవత్సరం నుండి ప్రపంచ వాతావరణ శాఖ (WMO) తుఫాన్లకు పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంది. వేర్వేరు ప్రాంతాలలో ఉన్న వాతావరణ శాఖలు, ఆయా ప్రాంతాలకు సంబంధించిన పేర్లను ఎంపిక చేసి తుఫాన్లకు పెట్టవలసి ఉన్నది.

ఉదాహరణకు బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రంలో ఉద్భవించిన తుఫాన్లకు ఢిల్లీ తుఫాను వాతావరణ శాఖ (RMSC NEW DELHI) నిర్ణయించాల్సివస్తుంది .

2000 సంవత్సరంలో ఒమాన్ లోని మస్కాట్ లో జరిగిన చర్చలో భాగంగా , బాంగ్లాదేశ్, భారత్ , మాల్దీవ్స్, మయన్మార్ , ఒమాన్ , పాకిస్తాన్, శ్రీలంక , థాయిలాండ్ నుండి వచ్చిన వాతావరణ నిపుణులు కొన్ని పేర్లను ప్రతిపాదించడం జరిగింది. ఆ పేర్ల జాబితా నుండే ఢిల్లీ వాతావరణ శాఖ తుఫాన్ల పేర్లను నిర్ణయిస్తుంది.

కొన్ని ఉదాహరణలు:

భారతదేశం నుండి ఇదివరకు ప్రతిపాదించిన పేర్లు:

అగ్ని , ఆకాష్, బిజిలి , లెహర్, సాగర్, వాయు.

పాకిస్తాన్ నుండి:

నర్గిస్ , లైలా , నీలం , టిట్లి .

థాయిలాండ్ నుండి :

ఫైలిన్ (Phailin)

ఒమాన్ నుండి:

హుద్ హుద్ (Hud Hud)

2018 లో మరో కొత్త జాబితాను తయ్యారుచేసారు. ఇరాన్ , సౌదీ , యెమెన్ , అరబ్ దేశాలు కూడా జాబితా తయారీలో పాలుపంచుకున్నాయి.

ఇకముందు రాబోయే తుఫాన్ల పేర్లు (2020 నుండి):-

భారతదేశం నుండి :

గతి, ఆగ్ , నీర్ , తెజ .

తుఫాన్లకు పేర్లు పెట్టడానికి ముఖ్యమయిన కారణాలు:

 • ఒక వాతావరణ శాఖనుండి మరో వాతావరణశాఖకు తుఫాన్ల పేర్లతో వివరాలు చేరవేయడానికి సులువు కనుక.
 • ఒకవేళ రెండు తుఫాన్లు ఒకసారివస్తే వాటిని గుర్తుంచడానికి వీలుగా పేరులు ఉపయోగపడతాయి.
 • ప్రజలకు సులువుగా తుఫాన్ల పేర్లు గుర్తుఉంటాయి కనుక వారిని అప్రమత్తం చేయడం సులభం.

తుఫాన్ల పేర్లు ఎనిమిది అక్షరాలకు మించకుండా తేలికగా ఎంపికచేయవలిసి ఉంటుంది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పేర్లను నిర్ణయిస్తారు. మతం, రాజకీయంకు దూరంగా ఈ పేర్లు ఉండాలని నియమాలు కూడా ఉన్నవి.

Can we increase air passenger capacity by building larger aircraft? What is the upper limit that is now considered practical?

The primary limitation of building a large aircraft is the aircraft’s structure itself. After achieving a certain threshold weight, the structure, no matter however strong it may be, won’t be able to take its own weight. One may want to reinforce the structure with reinforcing elements but that increases the weight that makes matter even worse. It reaches the level of a paradox when the structural gets crushed by its own weight.

This is called Square–cube law.

The maximum load reached by any aircraft during take off is 640 tons & the aircraft is the mammoth sized An-225 Mriya cargo aircraft (pic above). For passenger aircraft the max weight reached is 575 tons by the Airbus A380. For reference, the maximum takeoff weight of the ultra popular A320 is “just” 78 tons.

A380 vs A320.

Designers worldwide have thought about making an aircraft larger & heavier than the An-225 or the A380 using newer materials which are not only larger but stronger than aircraft grade aluminium. But always have hit the “wall” of the paradox where the structure built is so huge that it crushes itself.

Secondary reason include two points:

 • Runway: Bigger the aircraft, larger is the momentum, longer it takes to gain speed for takeoff, longer is the requirement for the runway. Both the A380 as well as the An-225 need more than 3 km of runway to take off when loaded. Any larger aircraft if at all built would need a longer runway which makes it infeasible to be practically operated.
 • Economy: Airbus A380 is being retired & the production is being stopped only after 2 decades of production because there has been issue with filling all the 575 seats in dual class configuration (pic below) for one single flight. Airliners would have to wait more to fill the seats & sometimes they simply won’t which is a loss to the airliners. Instead the trend is to operate smaller & cheaper aircraft that can fly more frequently, offering a greater flexibility of time to the passengers.

The A380 can carry 850+ passengers in a single class configuration & if the An-225 is ever converted into a passenger airliner, it would carry similar amount & it is safe to believe that is the limit.

kozhikode plane crash on 8th August 2020

HA tabletop runway is like a flat surface over a hill or a plateau with one or both of its ends falling through a steep slope to the surface level. So if a plane overruns during landing then there is is an accident in waiting.

There are 3 such runways in India – in Mizoram Karnataka and Kerala. Last time an accident happened on a tabletop runway was in 2010 in Karnataka. In that case, when the pilots realised they had overrun, they tried to take off the flight before it could fall from the edge. As a result the engine was ON and as soon as the flight fell there was a fire and 158 people died.

However this time the 2 seasoned pilots kept the engine off, preventing any fire after the fall, saving a lot of lives, sacrificing their own. If they had cared about their own lives they would have tried an impossible take off, just like in the previous case. And keeping the engine off, meant a certain death for the two, but saving of the lives of the passengers. And guess what they chose. One of them was a well decorated pilot. We shall remain indebted to their valour and prudence.

Reportedly, after the landing gear failed, Captain Sathe first ensured that remaining fuel was dumped, by circling the airport a few times. Just before landing, he switched off the engines. These measures made sure that the aircraft wouldn’t catch fire at any time. Then he crash landed on a surface, slippery due to excessive rain, knowing it’s a table-top runway, and skidding down the slope would first affect the front portion of the aircraft in case of impact. In other words, him. He saved hundreds of lives by sacrificing his own. Courage, determination, quick thinking, and a sense of putting others before oneself are hallmarks of the armed forces. And Mr. Sathe was a shining example of that.

నీటి కంటే మెరుగ్గా మంటలను ఆర్పే ద్రవం ఏది?

మంటలను 5 రకాలుగా విభజించవచ్చు అవి

మొదటి:

ఇవి సాధారణ మంటలు అంటే చెక్క, కాగితాలు, వస్త్రాలు, రబ్బరు వంటి వాటివల్ల కలిగే మంటలు.

రెండు:

ఇవి త్వరగా మంటలు అంటుకొనే ద్రవాలు వల్ల కలిగే మంటలు అంటే పెట్రోల్, డీజిల్ కిరోసిన్ వంటి వాటి వల్ల కలిగే మంటలు.

మూడు:

ఇవి వాయువుల వల్ల కలిగే మంటలు అంటే యల్పిజి, బ్యూటేన్ వంటివి.

నాలుగు:

విద్యుత్ ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్.

ఐదు:

వంట నూనెలు లేదా నూనెలు, కొవ్వు వంటివాటిల్ల కలిగే ప్రమాదాలు.

మంటలు అర్పటానికి 5 రకాల ఫైర్ ఏక్సటింగిషర్లు వాడతారు వాటిలో రకరకాల పదార్ధాలు వాడతారు అవి

1.నీరు:

సాధారణ నీరు దిన్ని మొదటి రకం మంటలకు వాడతారు.

2.నురుగు:

ఇది నీరు గాలి మరియు నురుగు మిశ్రమం, లేదా ఇతర రకాల రసాయనాలు అంటే సోడియం బై కార్బోనేట్ మరియు అల్యూమినియం సల్ఫేట్ వంటి రసాయనాలు వాడతారు. దీన్ని మొదటి లేదా రెండవ రకం మంటలకు వాడతారు.

3.ఎబిసి పొడి రసాయనాలు(పౌడర్):

ఇందులో మోనోఅమ్మోనియమ్ ఫాస్ఫేట్ వాడతారు.దీన్ని మొదటి నాలుగు రకాల మంటలు ఆర్పడానికి వాడతారు.

4.బోగ్గుపులుసు వాయువు (సిఓ2):

వీటిలో బొగ్గుపులుసు వాయువు వాడతారు. దీన్ని 2 లేదా 4వ రకం మంటలు ఆర్పడానికి వాడతారు.

5.తడి రసాయనాలు:

ఇందులో పొటాషియం వాడతారు. దీన్ని మొదటి లేదా అయిదవ రకం మంటలు ఆర్పడానికి వాడుతారు.

విమాన ప్రయాణాల్లో టర్బులెన్స్ ఎందుకు వస్తుంది? ఇది ప్రమాదకరమైన పరిస్థితులకు సంకేతమా?

ద్రవం (fluid) యొక్క గమనాన్ని రెండు విధాలుగా విభజించవచ్చు.

1. లామినార్ ఫ్లో (Laminar Flow)

2. టర్బులెంట్ ఫ్లో (Turbulent flow)

లామినార్ ఫ్లో యొక్క గమనం చాల స్మూత్ గా, స్థిరముగా ఉంటుంది (smooth and steady). టర్బులెంట్ ఫ్లో యొక్క గణమం స్థిరముగా ఉండదు, చాల గజి బిజిగా (erratic and chaotic) ఉంటుంది. రేయినాల్డ్స్ (Reynolds) అనే పరిశోధకుడు ఈ రెండు ఫ్లోల మధ్య తేడాను గమనించారు. ఒక ఫ్లో లామినార్ లేదా టర్బులెంట్ అని చెప్పడానికి రేయినాల్డ్స్ నెంబర్ (Reynolds number, Re) ను రేయినాల్డ్స్ ప్రతిపాదించాడు. ద్రవం యొక్క గతి శక్తి (kinetic energy) మరియు దాని యొక్క స్నిగ్ధత (viscosity) మీద లామినార్ ఫ్లో లేక టర్బులెంట్ ఫ్లో ఆధారపడి ఉంటుందని గమనించాడు.

Reynolds experiment: ఒక పైప్ లో నీళ్లు వెళ్తున్నాయి అనుకుందాం. ఆ నీళ్లలో ఎరుపు రంగు, ఒక చిన్న పైప్ ద్వారా లోపలి పంపితే, మనకు పైప్ లోపల నీళ్లు ఎలా ప్రయాణిస్తాయో తెలిస్తుంది. కింద నేను వేసిన బొమ్మ చూస్తే మీకు అర్ధం అవుతుంది. కింద చిత్రములో లామినార్ ఫ్లో స్థిరముగా, టర్బులెంట్ ఫ్లో చాల గజి బిజీగా (chaotic) ఉండడం మీరు గమనించ వచ్చు.

విమానం స్థిరముగా ఎగరడానికి మనకు లామినార్ ఫ్లో కావాల్సి ఉంటుంది. లామినర్ ఫ్లో వళ్ళ విమానం యొక్క రెక్కలు తగిన లిఫ్ట్ (Lift) ను సృష్టించి విమానమును గాలిలో ఎగిరే తట్టు చేస్తాయి. టర్బులెంట్ ఫ్లో వళ్ళ విమానం స్థిరత్వాన్ని కోల్పోయి, కిందకి పియికి ఊగుతూ ఉంటుంది. ఈ కింది చిత్రంలో లామినర్ ఫ్లో, టర్బులెంట్ ఫ్లోని మీకు చూపించే ప్రయత్నం చేసాను.

చాల అరుదుగా విమానాలు టర్బులెంట్ ఫ్లో లో ప్రయాణిస్తాయి. Pilots విమానము లో ఏర్పరిచిన పరికరాలను బట్టి (రాడార్ సహాయం తో )టర్బులెంట్ ఫ్లో ని తప్పిస్తారు. విమానవు బరువును మరియు సైజు ని బట్టి కింద చెప్పినట్టు గా టర్బులెన్స్ ని నిర్వచిస్తారు (international flying rules).

 1. Weak turbulence
 2. Moderate turbulence
 3. Heavy turbulence
 4. Extreme turbulence

Weak turbulence సాధారణంగా విమానం స్టడీ స్టేట్ లో ప్రయాణిస్తున్నప్పుడు, సుమారు 20,000-40,000 అడుగుల ఎత్తులో క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ (clear air turbulence) ద్వారా వస్తుంది. ఇది పెద్ద ప్రమాదం కాదు. ఇప్పుడు ఉన్న విమానాల్లో ఏర్పరిచిన ఆధునిక పరికరాలు, ఆటో పైలట్ సహాయంతో స్టెబిలైజ్ (stabilize) చేస్తాయి.

తీవ్రమయిన వాతావరణం లో (తుఫాను, అల్ప పీడనం, క్యూములోనింబస్ మేఘాలు) విమానం ప్రయాణిస్తే, Heavy to Extreme turbulence ను ఎదురుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విమానం యొక్క స్పీడ్ ను తగ్గించి, మల్లి స్టడీ స్టేట్ కు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. కొన్ని అరుదుగా జరిగే సంఘటనలో విమానం అదుపు తప్పే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు 1985 లో డెల్టా ఎయిర్లైన్స్ 191 Extreme టర్బులెన్స్లో చిక్కుకుని కూలిపోయింది.

Image source: Wikipedia

కానీ ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీ తో విమానము Heavy/Extreme turbulence లోకి వెళ్లకుండా pilots చూసుకుంటారు. ఒక వేళ్ళ వెళ్లినా, తిరిగి విమానం స్టడీ స్టేట్ కి రావడానికి తగిన శిక్షణ pilots కి ఉంటుంది. కనుక భయపడవలసిన అవసరం లేదు

విమానం ఎడమ లేదా కుడి వైపు తిరిగేటట్టు ఏది చేస్తుంది?

విమాన గమన స్థితిని మార్చుకోడానికి కొన్ని cockpit లో పరికరాలను పైలట్ ఉపయోగించవలసి వస్తుంది. ముందుగా విమాన స్టడీ స్టేట్ (steady state) గురించి తెలుసుకుందాం.

స్టడీ స్టేట్ (steady state) : విమానం యొక్క వేగం స్థిరంగా ఉండి, అన్ని దిక్కుల యెక్క ఫోర్సెస్ సమానముగా ఉన్నపుడు (sum of all forces equal to zero) విమానం స్టడీ స్టేట్ లో ఉందని అర్ధం. సాదరంగా విమానం స్టడీ స్టేట్ లో ఉన్నపుడు మనకు పానీయం మరియు భోజనం వడ్డిస్తారు.

ఇక్కడ L అంటే లిఫ్ట్ అని అర్ధం (విమానం ఎగరడానికి కావాల్సిన ఫోర్స్, రెక్కల ద్వారా వస్తుంది)

D అంటే డ్రాగ్ అని అర్ధం (విమానమును వెన్నక్కి లగే ఫోర్స్, విమానపు మీద గాలి చూపించే ఫోర్స్ అనమాట)

W అంటే వెయిట్ అని అర్ధం (విమానము ఒక్క మొత్తం బరువు)

T అంటే థ్రస్ట్ అని అర్ధం (విమానమును ముందుకు లాగే ఫోర్స్, ఇంజిన్స్ నుండి వస్తుంది)

స్టడీ స్టేట్ లో ఉన్నపుడు

లిఫ్ట్ మరియు వెయిట్ సమానంగా ఉంటాయి,

థ్రస్ట్ మరియు drag సమానంగా ఉంటాయి.

L = W and T= D

ఒక వేళా పైలట్ విమానము ఒక్క దిశ మార్చలవిసి వచ్చినప్పుడు పైలట్ విమానపు స్టడీ స్టేట్ ని బ్రేక్ చేయాలి. అంటే న్యూటన్ మొదటి సూత్రం ప్రకారం కొంత ఫోర్స్ ని అప్లై చేయాలి.

Newton 2nd Law: “బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది”. ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు (every object will remain at rest or in uniform motion in a straight line unless compelled to change its state by the action of an external force)

ఇప్పుడు విమానం దిశ ఎలా మార్చుకుంటుంది అన్న విషయాన్నీ చూదాం.

 1. రోల్ (Roll)
 2. పిచ్ (Pitch)
 3. య (Yaw)

రోల్ (Roll): విమానం నేను కింద చిత్రములో చూపించేట్టుగా రోల్ చేయడానికి పైలట్ రెక్కలమీద ఉన్న ఎలెర్న్స్ (Ailerons) ను వుపయోగించి రోల్ చేస్తాడు. దీనివల్ల విమానం ఎడమ లేదా కుడి వైపు తిరిగే వీలు ఉంటుంది. పైలట్ కాక్పిట్ లో ఉన్న హేండిల్ ద్వారా ఎలెర్న్స్ ని కదిలించి వచ్చు.

Image Source: NASA

Image source: Google

య (Yaw): విమానం నేను కింద చిత్రములో చూపించేట్టుగా YAW చేయడానికి పైలట్ విమానపు తోక మీద ఉన్న Rudder ను వుపయోగించి ఎడమ లేదా కుడి వైపుకు తిప్పుతారు. పైలట్ కాక్పిట్ లో కాలి దగ్గర Rudder పెడల్ ను నొక్కుతారు.

Image source: Google

ఇలా విమానమును ఎడమ లేదా కుడి వైపుకి కంట్రోల్ చేయవచ్చు.

నేను కొన్ని రోజులు ఫ్లైట్ మెకానిక్స్ (Flight Mechanics) పాఠాలు చెప్పాను. మా విద్యార్థులితో కలిసి ఒక విమానపు నమూనా కూడా తయ్యారు చేసి ఎగరవేశం. ఆ విమానపు నమూనా ఎలా ఎగిరిందో మీరే చూడండి! నా విద్యార్థులు చాల కష్టపడరు (PVP సిద్ధార్థ -విజయవాడ ).

మెరుపుకు, ఉరుముకు మధ్య కొంత సమయం గ్యాప్ ఉండడానికి కారణం ఏమిటి?

మేఘాలలో ఉండే ఐస్ క్రిస్టల్స్ ,గాలి వలన ఒకదాన్నొకటి ఢీకొంటూ ,ఒక పద్ధతి లేకుండా ప్రవహిస్తూ ఉంటాయి.అలా ఢీకొన్నప్పుడు అందులో ఉండే ఎలక్ట్రాన్స్ ఒకదాని నుంచి ఇంకోదానిలోకి పాస్ అవుతాయి.ఈ ప్రక్రియ వలన మేఘంలోని పైన భాగం అనుకూలంగా(పాసిటీవ్గా), మరియు మేఘంలోని కింది భాగం ప్రతికూలంగా(నెగటీవ్గా) ఛార్జ్ అవుతూఉంటాయి.

భూమికి పాసిటీవ్ ఛార్జ్ ఉంటుంది.భూమికి ఉండే పాసిటీవ్ ఛార్జ్ కి ,మేఘాల కింద భాగంలో ఉండే నెగటివ్ ఛార్జ్ ఆకర్షింపబడతుంది(వ్యతిరేక ఛార్జెస్ మధ్య ఆకర్షణ ఉంటుంది ).ఆ పాసిటీవ్ మరియు నెగటీవ్ ఛార్జెస్ కలుసుకోవాలంటే అవి గాలి యొక్క ఇన్సులేటింగ్ లక్షణాలని(Insulating properties) అధికమించాలి. ఒక పరిధి తరువాత మేఘం కింద నెగటివ్ ఛార్జ్ పెరిగి అది గాలి యొక్క ఇన్సులేటింగ్ లక్షణాలని అధికమించేంత బలంగా తయారవుతుంది‌.

అప్పుడు ఈ నెగటివ్ ఛార్జ్ అంతా ఒకేసారి పాసిటీవ్ ఛార్జ్ యొక్క గుంపు(నెగటివ్ ఛార్జ్ ఆకర్షణ వలన పాసిటీవ్ ఛార్జ్ ఒక చోట ఎత్తులో గుంపుగా ఏర్పడుతుంది) వైపు పారతుంది.ఇలా ఇవి రెండు కలిసినప్పుడు మెరుపు వస్తుంది.
ఈ మెరుపు వల్ల దాని చుట్టూ ఉండే గాలి ఒకేసారి బాగా వేడెక్కుతుంది.ఈ తీవ్రమైన వేడి వలన గాలి చాలా వేగంగా విస్తరిస్తుంది.అలా వేగంగా విస్తరించడం వలన షాక్ వేవ్ ఏర్పడి పెద్ద శబ్దం వస్తుంది.ఆ శబ్దమే ఉరుము.

మెరుపు,ఉరుము‌ ఒకేసారి ఏర్పడినా మెరుపు వచ్చిన కాసపటికి ఉరుము వస్తుంది.దానికి కారణం వాటి వేగం.మెరుపు‌ అనేది కాంతి.ఉరుము అనేది శబ్దం.కాంతి యొక్క వేగం గంటకి దాదాపు గంటకి 300000000 మీటర్లు అయితే శబ్ధం యొక్క వేగం గంటకి 1235000 మీటర్లు మాత్రమే.అందుకే శబ్దం యొక్క వేగం, కాంతి వేగం కన్నా తక్కువ ఉండడం వల్ల మెరుపు వచ్చిన కాసేపటికి ఉరుము వస్తుంది.

హబుల్ టెలిస్కోప్

విశ్వంలో అంతుబట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. మనిషి చూడని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూడాలంటే మనిషి కన్ను సరిపోదు. అందుకే శక్తిమంతమైన టెలిస్కో్‌పను తయారుచేసి విశ్వంలోకి అంతరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. హబుల్‌ టెలిస్కో్‌పకన్నా ఎంతో శక్తిమంతమైన టెలిస్కోప్‌ విశేషాలు తెలుసుకుందామా!

 •  400 ఏళ్ల క్రితం గెలిలియో మొట్టమొదటిసారి టెలిస్కో్‌పను తయారు చేశారు. ఇటలీకి చెందిన ఈ శాస్త్రవేత్త అంతరిక్ష అధ్యయనం కోసం టెలిస్కో్‌పను తయారుచేశాడు. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు టెలిస్కో్‌పలు వాడుతూనే ఉన్నారు.
 •  1990లో హబుల్‌ స్పేస్‌ టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపించారు. ఇది ఇప్పటివరకు పదిలక్షలకు పైగా చిత్రాలను పంపించింది. ఈ టెలిస్కోప్‌ జీవితకాలం మరో పదేళ్లు మాత్రమే ఉంది.
 •  తాజాగా హబుల్‌ టెలిస్కోప్‌ కన్నా కొన్ని వందలరెట్లు శక్తిమంతమైన టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిపేరు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌.
 •  ఈ ఏడాది అక్టోబర్‌లో ఫ్రెంచ్‌ గయానాలోని యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ నుంచి ఎరైన్‌ 5 అనే రాకెట్‌ ద్వారా జేమ్స్‌ వెబ్‌ టెలిస్కో్‌పను అంతరిక్షంలోకి పంపాలని చూస్తున్నారు. ఒకవేళ వీలుకాకపోతే 2019 మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో తప్పనిసరిగా ప్రయోగించనున్నారు. ఈ టెలిస్కోప్‌ ద్వారా విశ్వానికి సంబంధించిన మరిన్ని అంశాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.
 •  భూమి వంటి గ్రహాలు మరేమైనా ఉన్నాయో వెతికే పని చేస్తుందీ టెలిస్కోప్‌. ఈ టెలిస్కో్‌పకు ప్రత్యేక కెమెరాను, టూల్స్‌ను అమర్చారు. మనిషి కన్ను చూడలేని వాటిని సైతం

ఈ కెమెరా చూస్తుంది.

 •  ఈ టెలిస్కోప్‌ పనితీరుకు సంబంధించిన పరీక్షలన్నింటిని నాసా పూర్తి చేసింది.
 •  జేమ్స్‌ టెలిస్కో్‌పను 9,30,000 మైళ్ల దూరంలో ఉన్న ఎల్‌2 అనే పాయింట్‌లో ప్రవేశపెట్టనున్నారు. టెలిస్కోప్‌ ఇక్కడికి చేరుకోవడానికి నెల రోజుల సమయం పట్టనుంది.
 •  జేమ్స్‌ ఎడ్విన్‌ వెబ్‌ అనే వ్యక్తి 1961 నుంచి 68 మధ్య కాలంలో నాసా సెకండ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు. ఆయన పేరును టెలిస్కో్‌పకు పెట్టారు.
 •  సోలార్‌ ప్యానెల్స్‌ టెలిస్కో్‌పకు అవసరమైన పవర్‌ను అందిస్తాయి.

ఖగోళ వస్తువులు(సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్) నుంచి వచ్చే ఐఆర్(IR),విజిబిల్(visible) మరియు యూవీ(UV) రేస్ ని సోర్స్ గా చేసుకొని పరిశీలన చేస్తుంది.

ఖగోళ వస్తువుల నుంచి వచ్చే కాంతి హబుల్ ట్యూబ్ గుండా వచ్చి,ప్రైమరీ మిర్రర్(primary mirror) మీద పడుతుంది .ఆ ప్రైమరీ మిర్రర్ దాని మీద పడే కాంతిని సెకండరీ మిర్రర్(Secondary mirror) మీదకి కేంద్రీకరిస్తుంది.సెకండరీ మిర్రర్ మీద నుంచి కాంతి బౌన్స్ అయ్యి ప్రైమరీ మిర్రర్ మధ్యలో ఉండే రంధ్రం గుండా వెళ్ళి ఫోకల్ ప్లేన్ మీద పడుతుంది.ఈ ఫోకల్ ప్లేన్ ఆ కాంతిని‌ మ్యాగ్నిఫై (పరిమాణం పెంచడం) చేస్తుంది.మ్యాగ్నిఫై అయిన తరువాత ఆ కాంతి హబుల్లో ఉండే వివిధ సాంకేతిక సాధనాల ద్వారా ప్రయాణిస్తుంది.

ఇక్కడ ప్రైమరీ మరియు సెకండరీ మిర్రర్ అంటే గిన్న ఆకారం లాగా లోపలికి వంగి ఉండే అద్దం.పైమరీ మిర్రర్ వ్యాసం 7.8 అడుగులు ఉంటే సెకండరీ మిర్రర్ వ్యాసం 30.5 సెంటీమీటర్లు ఉంటుంది.

హబుల్ సాంకేతిక సాధనాలలో ముఖ్యమైనవి రెండు రకాలు

1)కెమెరాలు(camera):-వీటిని టెలిస్కోపులో కనపడే ఖగోళ వస్తువులని ఫోటోలు తీయడానికి వాడతారు.

2)స్పెక్ట్రోగ్రాఫ్స్(spectrographs):-ఇవి కాంతిని విశ్లేషన కోసం, వివిధ రంగులలోకి విడగొడతాయి.

హబుల్ సాంకేతిక సాధనాలు:-

హబుల్లో ఉండే ఒక్కో సాధనం ఒక నిర్ధిష్ట వేవ్లెంత్ పరిధిలో పవిచేయడానికి నిర్మించబడినవి.అందులో కొన్ని కెమరాలుగా,కొన్ని స్పెక్ట్రోమీటర్లుగా ,మరియు కొన్ని రెండు విధాలుగా పనిచేస్తాయి.

విశ్వంని వివిధ రకాలుగా విశ్లేషించడానికి,హబుల్లో మొత్తంగా 6 ముఖ్యమైన సాధనాలు ఉంటాయి.

1)వైడ్ పీల్డ్ కెమెరా 3(wide field camera 3(WFC3)):-

ఇది అల్ట్రావైలట్(UV),విజిబిల్(visible) మరియు ఐఆర్(IR)వేవ్ లెంత్స్ ఉండే కాంతిని సంగ్రహిస్తుంది.దీనికి ఎక్కువ స్పష్టత(Resolution) మరియు విస్తృత క్షేత్ర వీక్షణ(wide filed view) ఉంటాయి.

2)కాస్మిక్ ఓరిజిన్ స్పెక్ట్రోగ్రాఫ్(cosmic origin spectrograph):-

ఈ సాధనం యూవీ(UV) రేడియేషన్స్ వి విశ్లేషించడానికి దానిని భాగాలుగా విభజిస్తుంది.ఇది చాలా దురంలో ఉండే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకోవడానికి అత్యుత్తమ పరికరం.దీనిని గెలాక్సీ ఎవల్యూషన్ ,గ్రహాల‌ అవిర్భావం ఇలాంటి వాటి గురించి తెలుసుకోవడానికి వాడతారు.

3)అడ్వాన్సడ్ కెమెరా ఫర్ సర్వే(Advanced camera for survey(ACS)):-

ఇది డీప్ స్పేస్ నుంచి వచ్చే విజిబిల్(Visible) రీజియన్ లో ఉండే కాంతిని సంగ్రహించటానికి బాధ్యత వహిస్తుంది.దీనికి ఉండే విస్తృత క్షేత్ర వీక్షణ(wide filed view) ,అధిక సెన్సిటివిటీ(sensitivity) కారణంగా దీనిని డార్క్ మ్యాటర్ వ్యాప్తి గురించి,పెద్ద పెద్ద గ్రహాల గురించి,గలాక్సీ క్లస్టర్స్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

4)స్పేస్ టెలిస్కోప్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్(space telescope imaging spectrograph(STIS)):-

ఇది కెమెరాలాగా మరియు స్పెక్ట్రోగ్రాఫ్ లాగా రెండు పనులు చేస్తుంది.దీని ద్వారా సెలెస్టియల్ ఆబ్జెక్ట్ యొక్క ఉష్ణోగ్రత,రసాయన కూర్పు(chemical composition),సాంధ్రత మరియు కదలికిల గురించి తెలుసుకుంటారు.దీనిని క్రిష్ణబిలాలు(black holes) గురించి,నక్షత్రాల చుట్టూ ఉండే వాతావరణం గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు.

5)నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఆండ్ మల్టీ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోమీటర్(Near infrared camera and Multi-object spectrometer(NICMOS)):-

ఇది IR వేవ్ లెంత్ రీజియన్(ప్రాంతం) లో ఉండే కాంతిని సంగ్రహిస్తుంది.దీని ద్వారా ఇన్టర్ స్టెల్లార్ దూలిలో కప్పబడి ఉన్న వస్తువుల గురించి తెలుసుకుంటారు.ఇవి మొత్తం మూడు ఉంటాయి.

6)పైన్ గైడెన్స్ సెన్సార్స్(Fine guidence sensors):-

ఇవి హబుల్లో మొత్తం మూడు ఉంటాయి.ఇందులో రెండు సెన్సార్స్, హబుల్ ఏ వస్తువునైతే పరిశీలించాలో,ఆ వస్తువు ఉండే దిశగా హబుల్ ని పాయిన్ట్ చేసి హోల్డ్ చేస్తాయి.మూడో సెన్సార్ ఆ వస్తువును పరిశీలించి అది ఎంత దూరంలో ఉంది,దాని కదలికల గురించి విశ్లేషిస్తుంది.

విశ్వ పరిణామక్రమాన్ని తెలుసుకునే దిశగా నాసాకు చెందిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ కొత్త తలుపులు తెరిచింది. ఈ టెలిస్కోప్‌ విశ్వంలో సుదూరంలో ఉన్న 15 వేల గెలాక్సీల్లో ఉన్న 12 వేల నక్షత్రాల ఆవిర్భావానికి సంబంధించి సంపూర్ణ ఛాయా చిత్రాలను తీసి పంపింది. నక్షత్రాల పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకునేందుకు ఇవి సహాయపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బిగ్‌బ్యాంగ్‌ విస్ఫోటనం తర్వాత 300 కోట్ల ఏళ్ల కింద, అంటే ఇప్పటికి 11 వందల కోట్ల ఏళ్ల కిందట నక్షత్రాలు ఆవిర్భవించిన తీరును ఈ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చట! హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌లో వాడుతున్న అతినీలలోహిత కిరణాల సహాయంతో విశ్వం గుట్టు విప్పడం సాధ్యం కాకపోవడంతో పరారుణ, గోచర కిరణాల పరిజ్ఞానం కలిగిన ఇతర టెలిస్కోప్‌ల సాంకేతికతను దానికి జోడించారు. అనంతరం ఈ కిరణాలను విశ్వంతరాల్లోకి పంపి నక్షత్రాల సంపూర్ణ ఛాయా చిత్రాలను తీశారు.  

జులై 24న భూమిని దాటనున్న ఆస్టరాయిడ్

NASA warns of huge asteroid approaching earth on july 24 - Sakshi

‘ఆస్టరాయిడ్ 2020ఎన్​డీ’ ఈ నెల 24న భూమిని దాటుతుందని నాసా పేర్కొంది. ఆదివారం 2016 డీవై30, 2020 ఎంఈ3 అనే మరో రెండు ఆస్టరాయిడ్లు భూమిని దాటతాయని వెల్లడించింది.

170 మీటర్లు పొడవైన ఆస్టరాయిడ్​ 2020ఎన్​డీ భూమిని 5.86 లక్షల కిలోమీటర్ల దూరంలో, గంటకు 48 వేల కిలోమీటర్ల వేగంతో దాటుతుందని పేర్కొంది. ఈ ఆస్టరాయిడ్​ ప్రమాదకర జోన్​లో ప్రయాణిస్తుందని చెప్పింది.

2016డీవై30 గంటకు 54 వేల కిలోమీటర్ల వేగంతో, 2020ఎంఈ3 16 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని వెల్లడించింది. 2016డీవై30 రెండు ఆస్టరాయిడ్లలో 15 అడుగుల వెడల్పుతో అతి పెద్దదని తెలిపింది. వీటి వల్ల భూమికి ఎలాంటి అపాయం జరగదని వివరించింది.

వెబ్ సెర్చ్ ఇంజిన్

వెబ్ సెర్చ్ ఇంజన్ సమర్పణ అనేది ఒక వెబ్ మాస్టర్ ఒక వెబ్‌సైట్‌ను నేరుగా సెర్చ్ ఇంజిన్‌కు సమర్పించే ప్రక్రియ. సెర్చ్ ఇంజన్ సమర్పణ కొన్ని సార్లు వెబ్‌సైట్‌ను ప్రోత్సహించే మార్గంగా ప్రదర్శించ బడుతుంది, అయితే ఇది సాధారణంగా అవసరం లేదు ఎందుకంటే ప్రధాన సెర్చ్ ఇంజన్లు వెబ్ క్రాలర్‌లను ఉపయోగిస్తాయి, చివరికి సహాయం లేకుండా ఇంటర్నెట్‌ లో చాలా వెబ్ సైట్‌లను కనుగొంటారు.

వారు ఒకేసారి ఒక వెబ్ పేజీని సమర్పించ వచ్చు, లేదా వారు సైట్ మ్యాప్‌ను ఉపయోగించి మొత్తం సైట్ ‌ను సమర్పించ వచ్చు, కాని సెర్చ్ ఇంజన్లు చక్కగా రూపొందించిన వెబ్‌ సైట్‌ను క్రాల్ చేయ గలగటం వల్ల సాధారణంగా వెబ్‌సైట్ యొక్క హోమ్ పేజీని సమర్పించడం అవసరం. సెర్చ్ ఇంజిన్‌కు వెబ్‌ సైట్ లేదా వెబ్ పేజీని సమర్పించడానికి మిగిలిన రెండు కారణాలు ఉన్నాయి…. సెర్చ్ ఇంజిన్‌ను కనుగొనటానికి వేచి ఉండకుండా పూర్తిగా క్రొత్త వెబ్‌సైట్‌ను జోడించడం మరియు గణనీయమైన పున రూపకల్పన తర్వాత వెబ్‌సైట్ యొక్క రికార్డ్‌ను నవీకరించడం.

కొన్ని సెర్చ్ ఇంజన్ సమర్పణ సాఫ్ట్‌వేర్ వెబ్‌సైట్‌లను బహుళ సెర్చ్ ఇంజిన్‌లకు సమర్పించడమే కాకుండా, వారి స్వంత పేజీల నుండి వెబ్‌సైట్‌లకు లింక్‌లను జోడిస్తుంది. వెబ్‌సైట్ యొక్క ర్యాంకింగ్‌ను పెంచడంలో ఇది సహాయ కరంగా కనిపిస్తుంది, ఎందుకంటే వెబ్‌సైట్ ర్యాంకింగ్‌ను నిర్ణయించే ముఖ్యమైన కారకాల్లో బాహ్య లింక్‌లు ఒకటి. ఏదేమైనా, గూగుల్ ర్యాంకింగ్‌పై ప్రతికూల ప్రభావంతో ఇది “మీ సైట్ కోసం విపరీతమైన అసహజ లింక్‌లకు దారి తీస్తుంది” అని గూగుల్ యొక్క జాన్ ముల్లెర్ పేర్కొన్నారు.
వెబ్ సెర్చ్ ఇంజన్లు సైట్ నుండి సైట్కు వెబ్ క్రాల్ చేయడం ద్వారా వారి సమాచారాన్ని పొందుతాయి. “స్పైడర్” ప్రామాణిక ఫైల్ పేరు robots.txt కోసం తనిఖీ చేస్తుంది. Robots.txt ఫైల్‌లో శోధన సాలెపురుగుల కోసం ఆదేశాలు ఉన్నాయి, ఏ పేజీలను క్రాల్ చేయాలో తెలియజేస్తుంది. Robots.txt కోసం తనిఖీ చేసిన తరువాత మరియు దానిని కనుగొన్న తరువాత లేదా, స్పైడర్ టైటిల్స్, పేజ్ కంటెంట్, జావాస్క్రిప్ట్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ (CSS), హెడ్డింగులు లేదా దాని మెటాడేటా వంటి అనేక అంశాల పై ఆధారపడి కొన్ని సమాచారాన్ని తిరిగి ఇండెక్స్ చేయడానికి పంపుతుంది. HTML మెటా ట్యాగ్‌లు. నిర్దిష్ట సంఖ్యలో పేజీలు క్రాల్ చేసిన తరువాత, డేటా సూచిక మొత్తం లేదా వెబ్‌సైట్‌లో గడిపిన సమయం తరువాత, సాలీడు క్రాల్ చేయడాన్ని ఆపివేస్తుంది
స్పైడర్ సందర్శనల మధ్య, సెర్చ్ ఇంజిన్ వర్కింగ్ మెమరీలో నిల్వ చేయబడిన పేజీ యొక్క కాష్ చేసిన సంస్కరణ (దానిని అందించడానికి అవసరమైన కొన్ని లేదా మొత్తం కంటెంట్) త్వరగా విచారణకర్తకు పంపబడుతుంది. సందర్శన మీరినట్లయితే, సెర్చ్ ఇంజన్ బదులుగా వెబ్ ప్రాక్సీగా పనిచేస్తుంది. ఈ సందర్భంలో పేజీ శోధన పదాల సూచిక నుండి భిన్నంగా ఉండవచ్చు

బ్లాక్ హోల్

కాంతి కూడా తప్పించుకో లేని భారీ వస్తువు ఉంటుందనే ఆలోచనను ఖగోళ మార్గ దర్శకుడు, ఇంగ్లాండు మతాధికారి జాన్ మిచెల్ 1784 నవంబరు లో ప్రచురించిన ఒక లేఖ లో క్లుప్తంగా ప్రతి పాదించాడు. మిచెల్ యొక్క సరళమైన లెక్కల ప్రకారం, అటువంటి వస్తువుకు సూర్యుడి తో సమానమైన సాంద్రతను ఉంటుందని భావించాడు. పెద్ద మాగెల్లానిక్ క్లౌడ్ ముందు ఉన్న బ్లాక్ హోల్ సిమ్యులేషను. గ్రావిటేషనల్ లెన్సింగ్ ప్రభావం వలన క్లౌడ్ బాగా విస్తరించినట్లు, వక్రీకరణ చెందినట్లూ కనిపిస్తోంది. పైభాగంలో, పాలపుంత డిస్క్ ఒక చాపం లాగా వంగి కనిపిస్తోంది.

బ్లాక్ హోల్‌ల విచిత్రమైన లక్షణాన్ని బట్టి చూస్తే, అసలు అలాంటి వస్తువులంటూ ప్రకృతి లో ఉన్నాయా, లేక అవి ఐన్‌స్టీన్ సమీకరణాల్లోంచి పుట్టుకొచ్చే పరిష్కారాలు మాత్రమేనా అని చాలా కాలం పాటు ప్రశ్నలుండేవి. కూలి, కుంచించుకు పోయే వస్తువుల కోణీయ ద్రవ్యవేగం వలన ఒక వ్యాసార్థం వద్ద వాటి చలనం ఆగిపోతుందని, బ్లాక్ హోల్‌గా మారదనీ స్వయంగా ఐన్‌స్టీన్ కూడా తప్పుగా భావించాడు. 1960 ల చివరి నాటికి, ఈవెంట్ హొరైజన్ ఏర్పడడానికి అడ్డంకి ఏమి లేదని ఈ మైనారిటీ వర్గం, మెజారిటీ పరిశోధకులను ఒప్పించింది.
బ్లాక్ హోల్ ఏర్పడిన తర్వాత, అది పదార్థాన్ని తనలో లయం చేసుకుంటూ పెరుగుతూనే ఉంటుంది. బ్లాక్ హోల్ దాని పరిసరాల్లోని వాయువులను, నక్షత్ర ధూళినీ నిరంతరం మింగుతూ ఉంటుంది. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్‌లు ఈ ప్రక్రియ లోనే పెరిగాయని భావిస్తున్నారు.గ్లోబులర్ క్లస్టర్లలో కనిపించే మధ్యంతర స్థాయి బ్లాక్ హోల్ ‌ల ఏర్పాటు కూడా ఇదే విధమైన ప్రక్రియ లోనే జరుగుతుందని భావిస్తున్నారు.
అయితే తిరిగి వెనక్కి రాలేని ఆ ప్రాంతపు సరిహద్దు ఈవెంట్ ఆర్ ఎస్ ఎం అంటారు హారిజన్ అంటారు ఈవెంట్ హరిజనులు దాటిన వస్తువు గతి దాని పరిస్థితులపై ఈవెంట్ హోల్సేల్ విపరీతమైన ప్రభావాన్ని చూసినప్పటికీ స్థానికంగా గుర్తించదగిన లక్షణాలేవి గమనించ లేము అయితే అనేక విధాలుగా కూడా బ్లాక్ హోల్ కూడా ఒక ఆదర్శవంతమైన బ్లాక్ బాడీ లాంటిదే ఇది కూడా అర్జున్ లేకపోతే ఇలాగే కాంతిని ప్రతిబింబించే లేదు ఇదిలా ఉంటే ఇది ఈవెంట్ హార్స్ అండ్ హాకింగ్ రేడియేషన్ విడుదల చేస్తాయని ఊహించింది.
అయితే కాంతిని కూడా తప్పించుకోలేని అంత బలంగా ఉండే గురుత్వాకర్షణ క్షేత్రాల నుంచి 18వ శతాబ్దం లో జాన్ విచ్ ఛానల్ జాన్ మిచెల్ టిఆర్ఎస్ సైమన్ ల్యాబ్ లా ప్లేస్ ను ప్రస్తావించారు 1967లో న్యూట్రాన్ నక్షత్రాలను కనుగొన్న గురుత్వాకర్షణ కారణంగా తమ లోకి తాము కుళ్లిపోయి కుంచించుకు పోయి ఏర్పడే కాంపాక్ట్ వస్తువుల పై ఆసక్తి రేకెత్తించింది

వైరల్‌గా నాసా విడుదల చేసిన సూర్యుడి వీడియో..

NASA Goddard Space Flight Center Shared Video Of Sun - Sakshi

నాసా గొడ్డార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌’ సూర్యునికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. నాసా గొడ్డార్డ్‌ అధికారిక యూట్యూబ్‌ ఖాతాలో గురువారం విడుదలైన ఈ వీడియో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పది సంవత్సరాల కాలంలో సూర్యుడిలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన వీడియో ఇది. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్‌ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించారు. సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలు, చోటు చేసుకున్న మార్పులను ఓ క్రమానుసారంగా వీడియోలో పొందుపరిచారు. పదేళ్లలో ఈ ఫొటోలను తీయటానికి దాదాపు 20 మిలియన్‌ గిగాబైట్ల డేటా ఖర్చయింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇ‍ప్పటి వరకు 6.7లక్షల వ్యూస్‌ను.. 7,800 లైక్స్‌, 450 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వీడియో అద్భుతంగా ఉంది… దీన్ని చూస్తున్నపుడు నాకు తెలియకుండానే నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది… ఈ పదేళ్లలో సూర్యుడిలో మంటలు​ పెరగటం గమనించవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎలాన్ మస్క్

Elon Musk - Education, Tesla & SpaceX - Biography

• రాకెట్లను అంతరిక్షంలోకి పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది. మస్క్ తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి రాకెట్ పంపాలనుకున్నాడు. తన దగ్గర ఉన్న 180 మిలియన్ డాలర్లలో 100 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి స్పేస్ ఎక్స్(SpaceX) అనే‌ కంపెనీ మొదలుపెట్టాడు.

• స్పేస్ ఎక్స్ నిర్మించిన మొదటి రాకెట్ లాంచ్ అయిన 33 సెకండ్ల తర్వాత పేలిపోయింది. గొప్ప శాస్త్రవేత్తలు, నాసా చేయవలసిన పనిని ఒక ప్రైవేట్ కంపనీ ఎలా చేయగలుగుతుంది అని అందరూ అవహేళన చేసారు. ఆ తర్వాత 2007లో రెండో రాకెట్ అంతరిక్షం దాటి ఆర్బిట్ చేరుకుంటున్న సమయంలో ఆగిపోయింది. 2008లో మూడో‌‌ రాకెట్ కూడా ముక్కలయిపోయింది. చివరికి నాల్గవ రాకెట్ విజయవంతం అయ్యింది.

• ఆ తర్వాత‌ నాసా ఇంటర్నేష్నల్ స్పేస్ స్టేషన్‌కి గూడ్స్‌ పంపడానికి స్పేస్ ఎక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నాసాతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి కంపనీగా స్పేస్ ఎక్స్ నిలిచింది.

• మస్క్ పెట్రోల్, డీజిల్ వల్ల వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలనుకున్నాడు. దాని కోసం ఎలక్ట్రిక్ కార్లు తీసుకురావాలనుకున్నాడు.

• కానీ ఎలక్ట్రిక్ కార్లు తయారుచేయడం అంటే మాటలు కాదు. వాటిలో ఉపయోగించే బ్యాటరీ ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. ఛార్జింగ్‌ తక్కువసేపు వస్తుంది‌. కార్ వేగం కూడా తగ్గుతుంది. అప్పటికే ఉన్న టెస్లా అనే ఎలక్ట్రిక్ కార్ కంపనీలో చాలా మొత్తంలో ఇన్వెస్ట్ చేసాడు. అప్పటికి టెస్లా కంపనీ పరిస్థితి ఏం బాలేదు. టెస్లా కంపనీ టెస్లా రోడ్ స్టార్ వన్ అనే మాడల్ని తయారుచేసింది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 360 కి.మీ వెళ్తుందని కంపనీ ప్రకటించింది. కానీ బీబీసీ చానెల్లో వచ్చే ప్రోగ్రామ్లో టెస్లా కార్ టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయంలో 80 కి.మీ వెళ్ళి ఆగిపోయింది. దానివల్ల టెస్లా మీద‌ అందరికీ నమ్మకం పోయింది. కంపనీ బోర్డ్ మీటింగ్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో‌ మస్క్ తన దగ్గర ఉన్న 40 మిలియన్ డాలర్లు, తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా ఇచ్చేసాడు.

• తర్వాత టెస్లా మాములు కార్ కన్నా ఎక్కువ సామర్ధ్యం ఉండేలా, లగ్జరీ కార్స్‌కి ఏమాత్రం తీసిపోకుండా ఒక కార్ తయారు‌ చేసింది.

• అదే టెస్లా మాడల్ ఎస్. ఒకప్పుడు 80 కి.మీ దగ్గర ఆగిపోయిన కారును ఇప్పుడు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1078 కి.మీ నడిచేలా తయారుచేసాడు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (NHTSA) ఈ కారుకి 5కి 5.4 రేటింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆటోమొబైల్ చరిత్రలో ఏ కారుకి దక్కని అరుదైన ఘనత అది.

• ఇప్పుడు టెస్లా నుంచి డ్రైవర్లు అవసరం లేని కార్లు కూడా రాబోతున్నాయి.

• భవిష్యత్తులో ఏఐ(AI) రోబోట్ల వల్ల మానవజాతికి ప్రమాదం ఉందని, దాన్నుంచి మానవులని కాపాడే టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి న్యూరాలింక్(Neuralink) అనే కంపనీ కూడా మొదలుపెట్టాడు.

• మన ఆలోచన ద్వారా బయట ఉన్న‌ వస్తువులను కంట్రోల్ చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాడు.

• మస్క్ హైపర్లూప్స్ మరియు భూమి మీద మనుషులను ఒక చోట నుంచి ఇంకో చోటకి రాకెట్లు ఉపయోగించి చేర్చే టెక్నాలజీ మీద పనిచేస్తున్నాడు. ఇది చివరి దశలో ఉంది.

• హైపర్లూప్ అంటే పెద్ద పెద్ద ట్యూబ్స్ ద్వారా విమానాల కన్నా రెట్టింపు వేగంతో, తక్కువ ఖర్ఛుతో ఒక చోట నుంచి మరో చోటుకి సులభంగా ప్రయాణించే టెక్నాలజీ.

• ఒక రాకెట్‌ను పైకి పంపడం సులభమే కానీ అదే రాకెట్‌ను నిటారుగా కిందకి ల్యాండ్ చేయడం చాలా కష్టం. మస్క్ అది కూడా చేసి చూపించాడు. ఇతన్ని “రియల్ లైఫ్ ఐరన్‌ మ్యాన్” అని అంటారు. నిజానికి మార్వెల్ సినిమాల్లోని ఐరన్ మ్యాన్ పాత్రకి, మస్కే ప్రేరణ.

• మార్స్ మీదకి మనుషులని పంపడానికి స్పేసెక్స్ ప్రయోగాలు కూడా జరుపుతుంది.

మరి ఈ తరంలో టెక్నాలజీ‌ని‌ ఇంత అభివృద్ధి చేసి,ఇంకా చేస్తున్న మస్క్ ని అత్యుత్తమ శాస్త్రవేత్త అని అనడంలో ఏటువంటి తప్పు లేదు.

భూకంపాలు

భుకంపనలకు కారణాలు అనేకము అవి రాళ్ళు బీటలు వారడం వలన, అగ్నిపర్వత చర్యల వలన, పెద్ద పెద్ద బండలు జారి పడటం వలన, (మైన్లు) గనులను పేల్చడం వలన , న్యూక్లియర్ ప్రయోగాల వలన ఇలా అనేక కారణాల వల్ల ఈ భూకంపాలు వస్తాయి. నిజంగా ఈ భూకంపాలు ప్రమాదమే. అక్కడ ఉన్న జీవులు మనుష్యులు ఆ దాటికి తప్పించుకోవడం కష్టం.

ముఖ్యంగా మూడు రకాలయినటువంటి భూమి బీటలు వారడం అనేవి భూకంపాలకు కారణాలు అవుతున్నాయి : అవి సాధారణం, వ్యతిరేకం(త్రస్ట్), , స్ట్రైక్-స్లిప్. సాధారణం , వ్యతిరేకంగా భూమి బీటలు వారడాలు డిప్-స్లిప్‌కి ఉదాహరణలు…

బీటలు వారిన భూమి డిప్ వైపుకి స్థానభ్రంసము చెందివుండునో , నిలువు భాగము చుట్టూ కదలికలు యేర్పడును. సాధారణ భూమి పగుళ్ళు ముఖ్యంగా ఎక్కడైతే భూమి పైపోరలుసాగబడి వుంటాయో అనగా వ్యాప్తి చెందిన సరిహద్దులు దగ్గర సంభవిస్తాయి. భూకంపాలు కూడా తరచుగా అగ్నిపర్వత ప్రాంతాలలో సంభవిస్తుంటాయి, , అగ్ని పర్వతాలలో టెక్టోనిక్(ఫాల్ట్) లోపం లవలన , (మాగ్మా) భూమి లోపల ద్రవీకరించబడిన రాతి పదార్ధాల వలన ఈ భూకంపాలు వొస్తుంటాయి.

భూకంపాల వలన డ్యాములకు హాని కలగితే వరదలు సంభవించును. భుకంపముల వలన ఒక్కొక్కసారి కొండలు విరిగి నదుల వద్ద వున్నా డ్యాముల పై పడడము వలన అవి కూలి పోయి వరదలకు కారణమవుతాయి. నదుల లోని జలము పొంగి భూమిపైకి రావడాన్ని వరద అంటారు. ఒక నది లో కాని చెరువు లో కాని దాని యొక్క సామర్ధ్యానికి మించి నీరు చేరినపుడు, ఆ నీరు దాని మామూలు సరిహద్దు బయట ప్రవహించి వరదలకు కారణమగును.

జాతీయ భూభౌతిక పరిశోధన కేంద్రం (ఎన్‌జీఆర్‌ఐ) పరిశోధకులు ‘న్యూక్లియేషన్‌ టెక్నిక్‌’గా పిలిచే పరిజ్ఞానం తో మహారాష్ట్ర లోని కోయినా ప్రాంతం లో భూకంపాలు సంభవించడానికి ఐదు రోజుల ముందుగానే గుర్తించారు. ఇలా వాళ్ళు ఈ భూకంపాల వంటి సమస్యలని వాళ్ళే కనిపిట్టి చెబుతారు.

భూకంపాలని ఎలా కంట్రోల్ చెయ్యాలి:

మానవ కార్యకలాపాల ద్వారా ప్రేరేపించబడిన భూకంపాలు యునైటెడ్ స్టేట్స్ మరియు ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో నమోదు చేయబడ్డాయి. జలాశయాలు, ఉపరితలం మరియు భూగర్భ త్రవ్వకం, ఉపరితలం నుండి ద్రవాలు మరియు వాయువును ఉపసంహరించుకోవడం మరియు భూగర్భ నిర్మాణాలలో ద్రవాలను ఇంజెక్ట్ చేయడం వంటి అనేక కారణాల వల్ల భూకంపాలు ప్రేరేపించబడతాయి. చాలా ప్రేరేపిత భూకంపాలు చిన్నవి మరియు ప్రస్తుతం ఉన్న చిన్న ప్రమాదం అయితే, పెద్ద మరియు సంభావ్యంగా మానవ నిర్మిత భూకంపాలు గతంలో సంభవించాయి.

మానవ నిర్మిత భూకంపాల వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా లేదా కొన్ని సందర్భాల్లో భూకంపాలు సంభవించే చర్యలను ఆపడం ద్వారా తగ్గించవచ్చు. ఉదాహరణకు, కొలరాడో, ఒహియో మరియు అర్కాన్సాస్‌లలోని లోతైన బావులలో మురుగునీటిని పారవేయడానికి సంబంధించిన భూకంపాలు ఇంజెక్షన్ నిలిపివేయబడిన తరువాత సంభవించాయి.

సహజ భూకంపాలు సంభవించకుండా మేము నిరోధించలేము కాని ప్రమాదాలను గుర్తించడం, సురక్షితమైన నిర్మాణాలను నిర్మించడం మరియు భూకంప భద్రతపై విద్యను అందించడం ద్వారా వాటి ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చు. సహజ భూకంపాలకు సిద్ధపడటం ద్వారా మనం మానవ ప్రేరిత భూకంపాల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.

HUMAN BODY

BRAIN

 1. About 75 percent of the brain is made up of water. This means that dehydration,
 2. even in small amounts, can have a negative effect on the brain functions.
 3. The human brain will grow three times its size in the first year of life. It continues to grow until you’re about 18 years old.
 4. Headaches are caused by a chemical reaction in your brain combined with the muscles and nerves of your neck and head.
 5. Your brain uses 20 percent of the oxygen and blood in your body.
 6. Alcohol effects your brain in ways that include blurred vision, slurred speaking, an unsteady walk, and more. These usually disappear once you become sober again. However, if you drink often for long periods of time, there is evidence that alcohol can affect your brain permanently and not reverse once you become sober again. Long term effects include memory issues and some reduced cognitive function.
 7. During the mummification process, Egyptians would usually remove the brains through the nose
 8. The human brain gets smaller as we get older. This usually happens sometime after middle age.
 9. The human brain begins to lose some memory abilities as well as some cognitive skills by your late 20s.
 10. A brain freeze is really a sphenopalatine ganglioneuralgia. It happens when something you eat or drink something that’s cold. It chills the blood vessels and arteries in the very back of the throat, including the ones that take blood to your brain. These constrict when they’re cold and open back up with they’re warm again, causing the pain in your forehead.
 11. Dreams are believed to be a combination of imagination, phycological factors, and neurological factors. They prove that your brain is working even when you are sleeping.
 12. It is a myth that humans only use 10 percent of our brain. We actually use all of it. We’re even using more than 10 percent when we sleep.
 13. Over the course of human evolution, brain size has tripled.
 14. Your brain uses about the same amount of power as a 15 watt light bulb.
 15. Older brains aren’t slower because they’re weaker, but because they hold more information.
 16. Your brain is only about 2% of your body mass, but uses up to 20% of its blood.
 17. The brain can survive for up to 6 minutes after the heart stops.
 18. Your brain can’t feel pain.
 19. A human brain can do more computations per second than a powerful supercomputer.
 20. If your brain’s cortex were laid out flat, it would be about the size of a newspaper page.

ప్రాచీన కొలతలగురించి

ఆధునిక కాలంలో మనకు దూరాన్ని కొలిచే పద్దతులు మీటరు, మైలు మొదలైనవి ఉన్నాయి…కానీ ప్రాచీన కాలంలో దూరాన్ని ఏవిధంగా కొలిచేవరో ఇప్పుడు చూద్దాం…

3 బెత్తెలు = 1 జేన
2 జేనలు = 1 మూర
2 మూరలు = 1 గజము (1 గజము = 3 అడుగులు / 1 అడుగు = 12 అంగుళాలు)
2 గజాలు = 1 బార
2 బారలు = 1 దండము
1000 దండములు = 1 క్రోసు
5 క్రోసులు = 1 యోజన / 1 ఆమడ (1 – యోజన 9.09 మైళ్లు, 14.62894 కిలో మీటర్లు)
ఇతిహాసాలలో ఈ కొలమనాలని వాడటం జరిగింది, ఉ|| ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని దూకాడు. అంటే సుమారు 1462 కి.మి.
సీతాదేవికి రాముడి గురించి హనుమంతుడు 4 మూరల పొడవు రాముడు అని చెప్తాడు, అంటే 8 అడుగులు(1 అంగుళము అంటే ఆధునిక కొలమానం ప్రకారం 1 ఇంచ్ కాదు 3/4 అంటే 1 ఇంచ్ కన్నా పెద్దది).
అదేవిదంగా విష్ణుపురాణం ఆధారంగా మనకు ఇంకా ఆశ్చర్య కరమైన కొలతలు తెలుస్తాయి. అణువు యొక్క పరిమాణాన్ని కూడా దానిలో చెప్పబండిది.
1 పరమాణు = 1 అణువు
1 పరసూక్ష్మ = 10 పరమాణు
1 త్రాసరేణు = 10 పరసూక్ష్మ
1 మహిరజ (ధూళి కణం) = 10 త్రాసరేణు
1 బాలగ్ర (జుట్టు కొన) = 10 మహిరజ
1 లిఖ్ష = 10 బాలగ్ర
1 యుక = 10 లిఖ్ష
1 యవోదర = 10 యుక
1 యవ = 10 యవోదర
1 అంగుళ = 10 యవ
1 పాద = 6 అంగుళ
1 వితస్తి = 2 పాద
1 హస్త = 2 వితస్తి
1 ధను = 4 హస్త
1 గవ్యతి = 2000 ధను
1 యోజన = 4 గవ్యతి
1 దండ = 2 నరిక = 6 అడుగులు (1.8 m)
1 అంగుళము అంటే ఆధునిక కొలమానం ప్రకారం 1 ఇంచ్ కాదు 3/4 అంటే 1 ఇంచ్ కన్నా పెద్దది.
మన పూర్వికులు వెంట్రుక,ధూళి, అణువు వంటి అతి చిన్న వాటిని కూడా కొలిచేవారు అంటే మనకు ఎంతో గర్వంగా ఉంది కదా

ఇంటర్నెట్

ఇంటర్నెట్ చరిత్రలో గుర్తుపెట్టుకోవల్సిన సంవత్సరాలు
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమంది కమ్యూనికేషన్ అవసరాలను తీరుస్తున్న అంతర్జాలం(ఇంటర్నెట్) గురించి అనేక ఆసక్తికర అంశాలను తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. 1983 జనవరి ఒకటో తేది నుంచి ఇంటర్నెట్ అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. అయితే మొట్టమొదటి ఇంటర్నెట్ ప్రయోగం 1969, మే1వ తేదీనే జరిగింది. తరువాత ఏర్పడ్డ శాటిలైట్, కేబుల్, టవర్ వ్యవస్థలు ఇంటర్నెట్‌ను భూగోళమంతా వ్యాపింపచేసాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇంటర్నెట్ చరిత్రలో చోటుచేసుకున్న మైలురాళ్లను మీ ముందుంచుతున్నాం…
ఏవోఎల్ తక్షణ సందేశ సేవలు, ప్రారంభం 1997:
ఈ కంట్రోల్ వీడియో కార్పొరేషన్‌ను 1983లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలకు ఈ కంపెనీ ఆన్‌లైన్ సర్వీస్‌లను అందిస్తోంది. సంస్థ ప్రధానకార్యాలయం న్యూయార్క్ నగరంలోని 770 బ్రాడ్‌వేలో ఉంది.
గూగుల్ , ప్రారంభం 1998:
సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌ను 1998లో ప్రారంభించారు. లారీ పేజ్, సెర్జీ బ్రిన్‌లు ఈ కంపెనీని స్థాపించారు.
కొత్త కేబుల్ లైన్‌లు, ప్రారంభం 2000:
కమ్యూనికేషన్ విస్తరణలో భాగంగా కొత్త కేబుల్ లైన్‌లు ఏర్పడ్డాయి. వీటిని ఇతర భూభాగంలోకి సముద్ర మార్గం గుండా వ్యాపింప చేశారు. ఈ ప్రక్రియనే సబ్ మెరైన్ కమ్యూనికేషన్ అంటారు. సముద్ర గర్భాల్లో వినియోగిస్తున్న ఆధునిక వర్షన్ కేబుల్స్ ఫైబర్ టెక్నాలజీని కలిగి డిజిటల్, ఇంటర్నెట్ ఇంకా టెలికమ్యూనికేషన్ డేటాను సెకన్లలో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాయి.
వికీపీడియా, ప్రారంభం 2000:
వివిధ అంశాలకు సంబంధించిన డాటా వివిధ భాషల్లో ఇక్కడ లభ్యమవుతుంది. ఈ టాపిక్‌లను ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. అంతర్జాలంలో వికీపీడియాకు గొప్స స్ధానం ఉంది.
ఆన్‌లైన్ ఫైల్ షేరింగ్ :
డిజిటల్ వర్షన్‌లో స్టోర్ చేసిన సమాచారాన్ని ఆన్‌లైన్ ద్వారా షేర్ చేసే ప్రక్రియ 2001లో ప్రారంభమైంది. ఇంటర్నెట్ చరిత్రలో ఇదో గొప్ప మైలురాయిగా భావించవచ్చు.
స్కైప్, 2003:
నెటిజనులు అత్యధికంగా వినియోగించే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో స్కైప్ (skype)ఒకటి, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సర్వీస్ ఇంటర్నెట్ ద్వారా ఉచిత వీడియో చాటింగ్ నిర్వహించుకునేందుకు ఉపకరిస్తుంది. హీన్లా, ప్రిట్, జాన్ తాల్లిన్ అనే ముగ్గురు డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్కైప్‌కు 600 మిలియన్‌ల యూజర్లు ఉన్నారు. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, స్కైప్ ప్లాట్‌ఫామ్‌ను 2011లో $8.5బిలియన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. ఫైల్ ట్రాన్స్‌ఫర్, వీడియో కాన్ఫిరెన్సింగ్ వంటి అదనపు ఫీచర్లను స్కైప్ కలిగి ఉంది.
యూట్యూబ్, 2004:
యూట్యూబ్… ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను అధికారికంగా 2005 నవంబర్‌లో ప్రారంభించారు. సాన్ బ్రూనో ఈ కపెంనీని నెలకొల్పారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్$1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది.
ఫేస్‌బుక్, 2004:
100కోట్ల పై చిలుకు యాక్టివ్ యూజర్లతో సోషల్ నెట్‌వర్కింగ్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఫేస్‌బుక్‌కు గొప్ప చరిత్రే ఉంది. తొలత ఈ సామాజిక సైట్ ‘ఫేస్‌మాష్ డాట్‌కామ్ ‘గా ప్రారంభమైంది. దీని రూపకర్త మార్క్ జూకర్స్ బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన మిత్రులతో కలిసి ఫేస్‌మాష్ కార్యకలాపాలను ప్రారంభించాడు.
యాపిల్ ఐప్యాడ్ ఆవిష్కరణ, 2010:
పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువచేస్తూ యాపిల్ ఐప్యాడ్ పేరుతో సరికొత్త కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌ను ఏప్రిల్3, 2010న ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్లో 4వ తరం ఐప్యాడ్ ఇంకా ఐప్యాడ్ మినీలు లభ్యమవుతున్నా

తుపాన్లు

తుపాన్లు ఎందుకు, ఎలా ఏర్పడతాయి?

సముద్రపు నీరు ఆవిరైనప్పుడు అక్కడి గాలి వేడెక్కుతుంది. వేడెక్కువైన గాలి తేలిక పడి పైకి వెళ్లిపోతుంది. దీంతో అక్కడ ఖాళీ (వ్యాక్యూమ్) ఏర్పడి పీడనం తగ్గుతుంది. అధిక పీడనం ఉన్న చోట నుంచి తక్కువ పీడనం ఉన్న చోటుకు గాలి ప్రవహిస్తుంది. పీడనం తగ్గేకొద్దీ గాలి వేగం పెరుగుతుంది. సముద్ర వాతావరణంలో ఈ అలజడి ఏర్పడినప్పుడు, అక్కడ పీడనం తగ్గిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియను ద్రోణి (టర్ఫ్) అంటారు. ఇది స్థిరంగా ఉండకుండా వందల కిలోమీటర్లు పాకుతుంది. ఇదే తుపానుకు తల్లి.
పీడనం తగ్గే కొద్దీ తీవ్రత పెరుగుతుంది. ఆ పీడనం తగ్గే కొద్దీ దాని పేరు మారుతూ వస్తుంది. ‘ద్రోణి’లో పీడనం తగ్గితే అల్ప పీడనం (లో ప్రెజర్) అవుతుంది. ఆ తరువాత క్రమంగా వాయుగుండం (డిప్రెషన్), తీవ్ర వాయుగుండం (డీప్ డిప్రెషన్), తుపాను (సైక్లోన్), తీవ్ర తుపాను (సివియర్ సైక్లోన్), అతి తీవ్ర తుపాను (సూపర్ సైక్లోన్).. ఇలా పీడనం తగ్గే కొద్దీ తుపాను తీవ్రత పెరిగే కొద్దీ ఈ క్రమంలో పేర్లు ఇస్తారు.
తుపాన్లను ఎవరు గుర్తిస్తారు?
తుపాన్లను ముందుగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు గుర్తిస్తాయి. అవి పంపే ఛాయా చిత్రాలను ఇస్రోలో ఉండే శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖలో ఉండే అధికారులు పరిశీలించి ఏ సముద్రంలో ఏ అక్షాంశం, రేఖాంశం దగ్గర తుపాను కేంద్రం ఉన్నదో, అది ఏ దిశగా, ఎంత వేగంతో కదులుతున్నదో గమనించి మనకు చెబుతారు. డాప్లర్ వెదర్ రాడార్’ అనే వ్యవస్థ తన పరిధిలోని 500 కి.మీ దూరంలో మేఘాల జాడను కనిపెట్టగలుగుతుంది. తుపాన్లు ఈ రాడార్ పరిధిలోకి వచ్చినప్పుడు ఆ సమాచారం కూడా మనకు అందుతుంది.
మేఘాల తీవ్రత, గాలి వేగం ఎంత ఉందో ఈ రాడార్ ద్వారా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు చెన్నై, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఈ రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల ముందుగానే తుపాన్ల గురించి తెలుసుకోవచ్చు. ఎక్కడ పీడనం తగ్గి అలజడి ఏర్పడుతుందో ఆ ప్రాంతాన్ని వాతావరణ శాఖ గుర్తిస్తుంది. అది ఎంత వేగంగా మారుతోందో గమనిస్తూ ప్రకటనలు విడుదల చేస్తారు. చాలా తుపాన్లు ద్రోణి నుంచి తుపానుగా మారడానికి నాలుగు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. కానీ, కొన్ని అతి వేగంగా మారిపోతాయి. అలాంటి సందర్భాల్లో ముందస్తుగా తీవ్రతను అంచనా వేయడం కష్టం అవుతుంది.
తుపాను లోపల ఎలా ఉంటుంది?
మధ్యలో ఖాళీగా ఉండి, చుట్టూ దట్టమైన మేఘాలు అల్లుకుని ఉండే వ్యవస్థను తుపాను అంటారు. అంటే, పై నుంచి చూస్తే మేఘాలతో తయారైన వలయంలా ఉంటుందనుకోవచ్చు. ఆ మధ్యలోని ఖాళీని సైక్లోన్ ఐ (కన్ను) అని పిలుస్తారు. ఆ ఖాళీ చుట్టూ అత్యంత బలమైన భారీ వర్షాలు కురిపించే మేఘాలుంటాయి.
తీరాన్ని తాకడం – తీరం దాటడం
కదులుతూ వెళ్ళడం తుపాను లక్షణం. అది ఎంత పెద్దగా ఉంది, ఎంత వేగంగా కదులుతున్నది అనేది కీలకం. సుముద్రం నుంచి కదులుతూ వచ్చే తుపాను ఎక్కడో ఒక చోట భూమి మీదకు వస్తే దాన్ని ‘తీరం దాటడం’ అంటారు. ఒక భారీ మేఘం ఓ ఊరి మీదకు వచ్చిందనుకుంటే, అది వెంటనే క్షణంలో మాయం అయిపోదు కదా. నెమ్మదిగా కదులుతూ వెళుతుంది. మేఘం వెళ్లగానే నీడ కూడా వెళ్లిపోతుంది. తుపాను కూడా అంతే. తుపాను కేంద్రం అంచులు సముద్రం నుంచి భూమి మీదకు ప్రవేశించగానే ‘తీరాన్ని తాకిన తుపాను’ అంటారు. అది పూర్తిగా భూమి మీదకు వచ్చేస్తే అప్పుడు ‘తీరం దాటిన తుపాను’ అంటారు. తుపాను వ్యాసం 50 కి.మీ నుంచి 500 కి.మీ దాకా ఉండొచ్చు. అంటే, అది ఎంత భారీ తుపాను అయితే, తీరం దాటడానికి అంత ఎక్కువ సేపు పడుతుంది.
ఈ తుపాను సముద్రంలో ఉన్నంతసేపు దానికి బలం ఉంటుంది. తీరం దాటిన తరువాత దాని శక్తి క్రమంగా తగ్గిపోతుంది. సముద్ర నీటి ఉష్ణోగ్రతల వల్ల తుపాన్లకు ఆవిరి చేరి థర్మల్ ఎనర్జీ అందుతుంది. దాంతో అది మరింత బలపడుతుంది. భూమి మీదకు రాగానే ఆ శక్తి అందడం ఆగిపోతుంది. సముద్రంలో తుపాను కదలడానికి ఏ అడ్డంకులూ ఉండవు. కానీ, భూమి మీద చెట్లు, భవనాలు, కొండలు వంటివన్నీ అడ్డంగా ఉంటాయి. అంతేకాదు, సముద్రంలో మాదిరిగా భూమిపై తుపానుకు నీరు అందదు. దీంతో అది క్రమంగా బలహీనపడుతుంది. అప్పుడు క్రమంగా తుపాను తీవ్ర వాయుగుండంగా, తరువాత వాయుగుండంగా, ఆ తరువాత అల్ప పీడనంగా మారిపోతూ ఉంటుంది.
కానీ, ఇదంతా క్షణాల్లో జరిగిపోయేది కాదు. గంటల సమయం పడుతుంది. తుపాను వేగమైన గాలులతో, భారీ వానలతో, దట్టమైన మేఘాలతో భూమి మీదకు వస్తుంది. సముద్రంలో అది ఎంత వేగంగా కదిలినా, ఎంత బలంగా కదిలినా, ఎంత భారీగా వాన కురిసినా ఆ ప్రభావం మనకు తెలీదు. కానీ అది భూమి మీదకు అంతే బలంగా వచ్చినప్పుడు విధ్వంసం సృష్టిస్తుంది. చెట్లు, స్తంభాలు విరిగిపోతాయి. అక్కడి నుంచి అది అలా కదులుతూ పోతూ బలహీనపడుతూ ఉంటుంది.
తుపాను తీవ్రతను బట్టి, అది భూమి మీదకు ప్రవేశించిన ప్రాంతాన్ని బట్టి విధ్వంసం ఆధారపడి ఉంటుంది. అంటే, పట్టణ ప్రాంతంలో వస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఖాళీ ప్రాంతాల్లో అయితే కాస్త తక్కువ నష్టం ఉంటుంది. పంట చేలు, తోటలు ఉన్న చోట మరో రకమైన నష్టం సంభవిస్తుంది. ఇక తుపాను అధిక వ్యాసంతో ఉండి, దట్టమైన మేఘాలతో ఉంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అన్ని తుపాన్లూ మనకు తెలియవు

నిజానికి సముద్రంలో అనేక తుపాన్లు ఏర్పడతాయి. అన్నిటినీ వాతావరణ శాఖ వారు గుర్తించి వాటికి పేర్లు పెడతారు. కానీ, తీరం మీద ప్రభావాన్ని చూపేవి కొన్నే ఉంటాయి. వాటి గురించే ఎక్కువ వార్తలు చూస్తాం. ఇక తీరాన్ని తాకకపోయినా, సముద్రంలో ఉంటూనే తీరానికి దగ్గరగా ఉండడం వల్ల కూడా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులు వస్తుంటాయి. భారత్‌ను ఆనుకుని ఉన్న అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రం, బంగాళాఖాతాల్లో తుపాన్లు ఏర్పడుతుంటాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ ప్రాంతంలో ఎక్కువ తుపాన్లు పుడతాయి.
హెచ్చరికలు
తుపానుకు సంబంధించిన ప్రమాద హెచ్చరికలు ఓడరేవులకు వేరుగా, మామూలు పౌరులకు వేరుగా ఉంటాయి. ఓడరేవులు సముద్రంలో ఉన్న ఓడలకు సమాచారం ఇవ్వడం కోసం, తీరంలో ఆపిన బోట్లకు సంబంధించిన సంరక్షణ కోసం ఈ ఏర్పాటు ఉంటుంది. ఒకే తుపాన్‌కు సంబంధించి, ఒక ఓడరేవుకు ఉన్న హెచ్చరిక ఇంకో ఓడరేవుకు ఉండదు. అలాగే ఒక ప్రాంతంలో రెడ్ ఎలర్ట్ ఉంటుంది. మరో ప్రాంతంలో ఆరెంజ్ ఎలర్ట్ ఉండొచ్చు. తుపాన్‌ తీవ్రతను బట్టి అధికారులు వివిధ రకాల హెచ్చరికలు జారీ చేస్తుంటారు.

1 TMC మరియు 1 క్యూసెక్ అంటే ఏమిటి ?

Image may contain: bridge and outdoor
*1 TMC = one thousand million cubic feet*

= 28,316,846,592 liters of water
*1 Cusec = cubic feet per second*
= 28.317 liters of water per second
చాలా మందికి ఈ అంకెలనుండి ఎంత నీరు వేస్టు అయిందో సరైన అవగాహన కల్గదు. కాని ఈ అంకెలను మనకు తెలిసిన లేదా మన ఊహకు అందే విషయాలతో పోల్చడం వల్ల , చాలా సులభంగా ఎంత నీరు వేస్టు అయిందో అవగాహన కల్గుతుంది.

ఒక టిఎంసి జలం అంటే దాదాపు 15 రోజులపాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న)ఉపయోగించే నీల్ల తో సమానం ·

నాగార్జున సాగర్ డ్యామ్ కెపాసిటి 400 టిఎమ్ సిలు అంటే దాదాపు 17 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి (70 లక్షల జనాభా వున్న) సరిపోయెంత నీరు అని అర్థం ·
ఒక లక్ష క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే నాలుగు న్నర నెలల పాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.
22000 క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే = ఒక నెల పాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.
700 క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే = ఒక రోజు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.

యురేనియం

No photo description available.

యురేనియం ఖరీదు ఒక కేజీ 50 కోట్ల పై మాటే
5% enrich చేసినడయితే ఏకంగా 80 కోట్ల పైనే పలుకుతుంది.
ఉపయోగాలు అందరికీ తెలిసినవే
విద్యుత్ మరియు అణ్వాయుధాలు
సరిగ్గా సరయిన విధంగా వాడకుంటే అనర్థాలు ఎక్కువే మరి అసలే విలువయినది కదా మరి ….
యురేనియం మైనింగ్ చేస్తున్న దేశాలు 20
కానీ మొత్తంలో సగం కేవలం 6 మైనింగ్ ఏరియాలలో మాత్రమే దొరుకుతుంది.
మన దగ్గర నల్లమలలో ఉన్న యురేనియం అత్యంత నాణ్యమయినది, కేవలం మన దేశంలో కాకుండా యింకా కెనడా, ఆస్ట్రేలియా లో మాత్రమే అదీ మనకన్నా చాలా తక్కువ మొత్తంలో ఉంది. మన నల్లమలలో సుమారు తక్కువలో తక్కువ 20,000 టన్నుల నిలువలున్నాయి.
కేజీ 80 కోట్లపై లెక్కన దాని విలువ అంచనా వేసుకోండి. అది మొత్తం నల్లమలలో కాదు, నల్లమల మొత్తం సుమారు 9,500చ.కి., అందులో యురేనియం సర్వే చేసేది 83చ.కి. మాత్రమే. అంటే నల్లమలలో 0.8 శాతం. నిజానికి 45చ.కి. మాత్రమే అవసరం అయినప్పటికీ ముందే 83చ.కి. లకి సర్వే చేస్తున్నారు.

మరి తీయడమేల ?
దీనికీ ఓ లెక్కుంది అదే సిటు లీచింగ్, అండర్ గ్రౌండ్ మైనింగ్
పర్యావరణానికి, మైనింగ్ ప్రాంతానికి ఏమాత్రం డెబ్భతీయకుండా తీసే పద్ధతులు.
IAEA – International Atomic Energy Agency యురేనియం మైనింగ్ మరియు దాన్ని అణువిద్యుత్ కి జాగ్రత్తగా వాడుకునే పద్ధతులపై నిబంధలను విధిస్తుంది పర్యవేక్షిస్తుంది.
మన నల్లమలలో సర్వేకి వాడే పద్ధతి కూడా సిటు లీచింగే మనకు అర్థమయ్యే విధంగా అంటే బోర్ వేసి బయటకి తియ్యడం లాంటిదే, కాబట్టి తీయడంలో మనకు భయం అక్కర్లేదు.
దాని వాడకం అంటారా అది రియక్టర్లలో జాగ్రత్తగా వాడే టెక్నాలజీ మన దగ్గర ఉంది, ఇప్పటికే మన దగ్గర అలా విద్యుత్ ఉత్పత్తి జరుగుతూనే ఉంది.
మన దగ్గర 22 అణు విద్యుత్ కేంద్రాలలో పాక్షికంగా మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు, కారణం అవి IAEA లిస్ట్ లో లేకపోవడమే కాబట్టి వాటికి కేవలం దేశీయ యురేనియం మాత్రమే వాడాలి.
ఇప్పుడు మన దగ్గరున్న మైనింగ్ వల్ల వాటిని పూర్తిస్థాయిలో వాడలేక పోతున్నాం. దీనికి నల్లమల ఓ పరిష్కారం కావచ్చు.
యురేనియం అనగానే అది ఎలా వున్నా రేడియేషన్ అనుకోవద్దు, యురేనియం ఆక్సీడ్ రేడియేషన్ ఓ జెట్ ఫ్లైట్ నుంచి వచ్చే రేడియేషన్ లో సగం,
మీకు తెలియని యింకో నిజం కొన్ని రకాల గ్రానైట్లలో రేడియేషన్ యురేనియం కన్నా ఎక్కువ,
నిజానికి చాలా ప్రాంతాల్లో సిగరేట్ కన్నా ఎక్కువ గ్రనైట్ వల్లే ఎక్కువ కాన్సర్ వల్ల చనిపోతున్నారు.
నిజానికి చాలా మందికి తెలియంది ఏమిటంటే అసలు యురేనియం మైనింగ్ వల్ల ప్రమాదమా లేక దాన్నుంచి విద్యుత్ తీయడంలో ప్రమాదముందా అని.
రెండూ ప్రమాదమయితే దేనికి నిజంగా భయపడాలని ?
తీసేదంతా యురేనియం రూపం కాదు, బయటకి తీసిన ఖనిజాన్ని యురేనియంగా మార్చాలిగా మరి,
బయటకి తీసిన ఖనిజాన్ని శుద్ధి చేసి వేడి చేస్తే యురేనియం ఆక్సీడ్ అవుతుంది… అది ప్రమాదం కాదని పైన చెప్పుకున్నాం, దాన్నీ ఎంరిచ్ చేయాలి అప్పుడది గ్యాస్ రూపంలోకి యురేనియం హెక్సఫ్లోరైడ్ అవుతుంది, అది రెండు రూపాలుగా యు235, యు238.
యు238 ని కొంచం అలాగే వాడొచ్చు కూడా,
ఇప్పుడు దీన్ని ఫ్యూయల్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ లో పౌడర్ చేసి వేడితో దగ్గరగా చేసి ట్యూబ్స్ లో బిగిస్తే ఫ్యూయల్ ట్యూబ్స్ అయితాయి, వీటిని అణువిద్యుత్ కి వాడుతాం.
1 కేజీ బొగ్గుతో 8 కిలో వాట్స్,
1 లీటర్ పెట్రోల్ తో 12 కిలో వాట్స్,
కానీ ఒక గ్రాము యురేనియం తో 24,000 కిలో వాట్స్ కరెంటు ఉత్పత్తి చేయొచ్చు అంటే
1 కిలో యురేనియం తో 2,40,00,000 కిలో వాట్స్ అన్నట్టు.
బొగ్గు మైనింగ్ వల్ల CO2, మిథేన్, ఏరోసోల్స్, NO2 యిలా ఇంకొన్ని ప్రమాదకర వాయువులు మరియు డస్ట్ వస్తుంది.

దీపం ఎందుకు వెలిగించాలి??

దీపం ఎందుకు వెలిగించాలి ? | Why We lighting ...

హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు . అంతేకాక,శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము.
ఈ దీపం ఎందుకు వెలిగించాలి? కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.
మనము జరిపించు కార్యములు సభలూ పూజలూ మొదలగు అన్నియూ విద్యుద్దీప కాంతులలో చేయుచున్నప్పుడు మరల మరో దీపం వెలిగించుట ఎందుకను సందేహము రావలెను గదా!. సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు మన వాసనలకు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్నప్పుడు అందులోని నూనె/నెయ్యి క్రమీణా తరిగిపోయి కొంతసేపు తరువాత
హరించుకు పోవును. అటులనే మన లోని రాగ ద్వేషాలుకూడా హరించునని చెప్పుటయే దీని భావము. నూనె/నేతి దీపం వెలుగునప్పుడు ఆ జ్వాల ఊర్ద్వముఖముగా ఉందును గదా! అటులనే మన జ్ఞానసంపద కూడా పైపైకి పెరగవలెనను సంకేతము కూడా ఇచ్చుచున్నది.
ఒక చిన్న దీపము మరికొన్ని వందల దిపములను వెలిగించగలదు. అటులనే మన జ్ఞానదీపము కూడా మరికొంత మందిని జ్ఞాన వంతులను చేయునని భావము. ఒక దీపము తో ఎన్ని దీపములు వెలిగించినను ఆ దీపము తరిగిపోదు అటులనే ఎంతమందిని విజ్ఞాన వంతులను చేసిననూ మన మేధా శక్తి తరిగిపోదు. మరియు అది మరింత ప్రజ్వరిల్లి నలు దిశలందు వెలుగులు నింపును.
మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావలెనను ఆదర్శమును అందరికీ తెలియజేయుటయే ఈ దీపారాధన ప్రాముఖ్యము భావము.
దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం
ఓం శ్రీ పరమాత్మనే నమః
ॐ దీపం జ్యోతిః పరబ్రహ్మం,దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం,సంధ్యా దీపం నమోస్తుతే
ॐ దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం,
దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది,దీపారాధాన అన్నిటిని ధించిపెడుతుంది.అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం. ॐ ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది.ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు(కంటికి సంబంధించిన వ్యాధి. షుగరు వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.దీనివల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోవచ్చు.దక్షిణ భారత దేశం,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో షుగరు వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువ). ॐ నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు(cataract) రావు.ఆవునేయి,నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి(eye sight)ని మెరుగుపరుస్తాయి.

ॐ అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది.మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి,మనకు మేలు చేస్తాయి.శ్లోకంలో “సర్వ తమోపహం” అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని.ఇక్కడ కూడా చూపూ కోల్పోవడం వల్ల జీవితంలో ఏర్పడే అంధకారాన్ని తొలగిస్తొంది దీపం.
ॐ ఒక గది మధ్యలో ఆవునేతి దీపం వెలిగించి,హృద్రోగులు(heart patients),రక్తపోటు(B.P)తో బాధపడేవారు,ఎక్కువగా ఒత్తిడి(stress)కి లొనయ్యేవారు రోజు 1 గంట సమయం కనుక ఆ దగ్గర కూర్చుని చూస్తే కొద్దిరోజులలోనే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని,రక్తపోటు(B.P) అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది.
ॐ మనం చదువుకున్నాం,కాంతి(light)కి విద్యుత్-అయస్కాంత స్పెక్ట్రం(electro-magnetic spectrum) ఉంటుందని,ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత(temperature) ఆ ప్రాంతంలో ఉన్న కాంతికిరణాల రంగు(color of light rays) మీద ఆధారపడి ఉంటుందని,ఒక్కక్క రంగు కిరణానికి ఒక్కక్క ఫ్రీక్వేన్సి(frequency) ఉంటుందని.అలాగే మనం వెలిగించే దీపపు కాంతికి ఉన్న విద్యుత్-అయస్కాంత శక్తి(electro-magnetic force) ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత మీద,వాతావరణం మీద తన ప్రభావాన్ని చూపించి ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది.గాలిలో మార్పులు తీసువచ్చి,దాని ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి,నాడులను శుభ్రపరచి,వాటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి దానికున్న దోషాలను తీసివేస్తుంది.ఇది చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ(process).
ॐ ఆవునేతి దీపపు కాంతికి,నువ్వుల నూనె దీపపు కాంతికి,మిగితా దీపాల కాంతికి కూడా చాలా సూక్ష్మమైన తేడా ఉంటుంది.అందువల్ల ఒక్కో దీపం ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది.
ॐ కార్తీక దీపాలను చూసిన చెట్లు,జంతువులు,కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వెలిగించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది కదా.అందుకని దీపాలను వెలిగించండి.వెలిగించే అవకాశం లేనప్పుడు కనీసం గాలికి కొండెక్కిన/శాంతించిన దీపాలను తిరిగి వెలిగించండి.కుదిరితే కొంచెం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వెలుగుతున్న దీపపు ప్రమిదలలో పోయండి.

దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం

*మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి.*
*మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను.*
*హార్మోనియంలో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి.*
*మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి.*
*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది.*
*మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును.*
*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును*
*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి.*
*మనిషి చర్మములో 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి.*
*మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును.*
*మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి.*
*ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును.*
*మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి.*
*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి.*
*మానవుని పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు.*
*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు.*
*మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.*
*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది.*
*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది.*
*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము.*
*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి.*
*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది.*
*మానవుని మెదడుకు నొప్పి తెలియదు.*
*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది.*
*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది.*
*మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది.*
*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది.*
*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును.*
*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.*
*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు.*
*రక్తము నీరు కన్నా కూడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది.*
*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును.*
*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి.*
*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది.*
*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన.*
*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది.*
*రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది.*
*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి.*
*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు.*
*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది.*
*మనిషి మెదడులోని కుడి భాగము శరీరములోని ఎడమ భాగమును, మెదడులోని ఎడమ భాగము శరీరములోని కుడి భాగమును అదుపు చేయును.*
*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును.*
*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును.*
*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనును.*
*ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును.*
*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును.*
*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది.*
*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది.*
*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.*
*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉంటే విజయం సాధిస్తాం.*
*ఇప్పుడు చెప్పండి మీలో ఏమి తక్కువగా ఉంది?*
*ఇక నిరాశ, నిస్పృహ వద్దు.*
*గమ్యం చేరే వరకు ప్రయాణించండి.*
*”వచ్చి పోవడానికి రాలేదు. .. ఇచ్చి పోవడానికే వచ్చాము”*

హరిత విప్లవం అంటే ఏమిటి? అది ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది?

లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా, వ్యవసాయశాఖామాత్యులైన సి.సుబ్రహ్మణ్యన్ గారి ఆధ్వర్యంలో ఎమ్.ఎస్.స్వామినాథన్ గారు అమలు పరిచిన వ్యవసాయ విప్లవమే హరిత విప్లవం.
నోబెల్ గ్రహీత, ప్రపంచ హరిత విప్లవ పితామహుడైన నార్మన్ బోర్లాగ్ పర్యవేక్షణలో మొదలైన ఈ మహత్తర పథకం భారతదేశ వ్యవసాయరంగ భవితను తిరగరాసి, ఆహారధాన్యాల కొరతను మరచి, మిగులుపై దర్జాగా కూర్చునేలా చేసింది.
ముందు కాస్త నేపథ్యం చూద్దాం.
స్వాతంత్య్రం సమయానికి దేశంలో 90% జనాభా వ్యవసాయమే జీవనోపాధిగా పల్లెల్లో ఉండేది. పెరుగుత్నున జనాభా, ఏళ్ళుగా మారని సేద్య పద్ధతులు వ్యవసాయంలో తగినంత పురోగతి తేకపోగా దేశవృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేశాయి.
1961లో దేశం ఎదుర్కొన్న క్షామం వల్ల తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. 1964 దాకా వ్యవసాయ రంగానికి తగిన ఊతమివ్వటంలో ప్రభుత్వ విధానాలు సైతం విఫలమయ్యాయి.
మొదటి పంచవర్ష ప్రణాళిక తరువాత ఉపేక్షకు గురైన వ్యవసాయరంగం గురించి నెహ్రూ గారు అన్న మాట:
స్వాతంత్య్రం వచ్చిన పదేళ్ళ తరువాత కూడా వ్యవసాయప్రధాన దేశమైన మనం మనకు తగినంత ఆహారం పండించుకోవటంలో విఫలం అయ్యాం. దేవుడిపైనో, వరదలపైనో, క్షామంపైనో నెపముంచి లాభం లేదు. మన ప్రణాళికలోనే లోపం ఉన్నదన్న విషయాన్ని ఒప్పుకోవాలి.”
అప్పటికే వ్యవసాయంపై మరింత దృష్టి పెట్టాలని అమెరికా చేస్తున్న సూచనను మన నేతలు గూడుపుఠాణి అని ఉపేక్షించటం జరిగింది.
1950ల నుంచే పీ.ఎల్-480 అనే అమెరికన్ చట్ట ప్రకారం వారి నుండి గోధుమలు పెద్ద ఎత్తున భారతదేశానికి దిగుమతి అయ్యేవి (ఈ చట్టం ముఖ్యోద్దేశం అమెరికా స్వప్రయోజనమే). 1960-1964 కాలంలో అత్యధికంగా 16 మిలియన్ టన్నుల గోధుమలు దిగుమతి అయ్యాయి. ఈ దిగుమతుల వల్ల ప్రపంచం భారతదేశాన్నిఒక “బాస్కెట్ కేస్”లా చూడసాగింది[1].
నెహ్రూ గారి తరువాత జూన్ 2, 1964లో ఏకగ్రీవ ఎన్నికతో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధాని అయ్యేప్పటికి దేశంలో:
 • ధాన్యం కొరత
 • ధరల పెరుగుదల
 • వ్యవసాయంలో తిరోగతి
 • పారిశ్రామిక వృద్ధి నెమ్మదించి నిరుద్యోగ సమస్య పెరుగుదల
 • విదేశీ మారక నిల్వలు దాదాపు ఖాళీ
శాస్త్రిగారు వ్యవసాయ సంస్కరణలకు పెద్దపీట వేసి, మేధావి అయిన సి.సుబ్రహ్మణ్యన్ గారిని ఆహార, వ్యవసాయశాఖామాత్యులుగా నియమించారు.
సుబ్రహ్మణ్యన్ గారు నార్మన్ బోర్లాగ్ గురించి, ఆయన మెక్సికోలో విజయవంతంగా పండించిన కొత్తరకం HYV-హై ఈల్డ్ వెరైటీ (తక్కువ-సమయంలో-ఎక్కువ-దిగుబడి) మరగుజ్జు గోధుమ వంగడాల గురించి వాకబు చేసి, వాటి దిగుమతికి ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రత్యేక విమానాల్లో 16000 టన్నుల మరుగుజ్జు గోధుమ విత్తనాలను తెప్పించారు. పెద్దఎత్తున ఎరువుల దిగుమతి, ఎరువుల పరిశ్రమలో విదేశీ ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించారు. ఎమ్.ఎస్.స్వామినాథన్, బి.శివరామ్ గార్ల ఆధ్వర్యంలో దేశం నలుమూలలా ఆ గోధుమల సాగును వ్యాపింపజేశారు.
సాగుకు ఆధునిక పద్ధతుల అవసరం ఉండటంతో ట్రాక్టర్ల వంటి పరికరాలు, పనిముట్ల గిరాకీ పెరిగి ఆ పరిశ్రమకు ఊతం దొరికింది.
అలాగే ఎక్కువ శ్రమ అవసరంతో వ్యవసాయ కూలీలకు తగినంత పని, తద్వారా నిత్యావసర వస్తువుల అమ్మకాలు పెరిగాయి. గ్రామాల్లో ఆదాయవ్యయ స్థాయిల్లో పురోగతి మొదలైంది.
ప్రతిఫలం వేగంగా దక్కింది[2]:
 1. 1967-1977 వరకు గోధుమ పంట ఏటా 5.5% పెరిగింది.
 2. 1973లో సోవియెట్ యూనియన్ వద్ద చేసిన గోధుమల అప్పులో 5,50,000 టన్నులు తీర్చేసాం.
 3. 1979లో వియెత్నాంకు 3,00,000 టన్నులు, ఆఫ్ఘనిస్తాన్‌కు 50,000 టన్నుల గోధుమలు అప్పుగా ఇచ్చాము.
 4. 1984లో ఇథియోపియాకు కరువుసాయంగా ధాన్యం పంపాము.
1950-1951లో 54 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహారధాన్య ఉత్పత్తి కొత్త శతాబ్దంలోకి అడుగుపెట్టేసరికి 200 మిలియన్ టన్నులకు పెరిగింది. అంటే ఏటా 3% వృద్ధి (1905 నుండి 1945 వరకు ఇది 1%గా నమోదయింది).
ఇదే సమయంలో జనాభా పెరుగుదల 2.1%. అలా ఆహారకొరత ఉన్న “బాస్కెట్ కేస్” దేశం నుంచి మిగులు పండించగల స్థితికి ఎదిగాం.
అయితే హరిత విప్లవం తెచ్చిన తంటాలూ ఉన్నాయి:
 • అధిక దిగుబడి రకాల సాగుకు అవసరమైన రసాయనిక ఎరువుల అధిక వాడకంతో ఎన్నో ప్రదేశాల్లో భూసారం స్వభావమే మారిపోయింది.
 • ఆధునిక వ్యవసాయ పద్ధతుల అతివేగ అనుసరణతో సాంప్రదాయ, సేంద్రీయ పద్ధతులకు అర్ధాంతర అవసానం ఏర్పడింది.
 • ఆధునిక పద్ధతులు సన్నకారు రైతులకు అందుబాటులో లేనందున, ఆపై అస్తవ్యస్తంగా అమలైన భూసంస్కరణల వల్ల ఆదాయ, సాంఘిక అసమానతలు పెరిగాయి.
 • హరితవిప్లవానికి ముందు సాగయ్యే ఆహార పంటలెన్నో తరువాత పశుగ్రాస పంటలైపోయాయి. అలాగే ఎన్నో సాంప్రదాయ వరి రకాలు దాదాపు అంతరించిపోయాయి.

గురుత్వాకర్షణ తరంగాలు (గ్రావిటేషనల్ వేవ్స్) అంటే ఏమిటి? వాటిని ఎలా కనుగొన్నారు?

నిశ్చలంగా ఉన్న నీటిలో తెడ్డు వేస్తే ఏ విధంగా అలలు చుట్టూ వ్యాపిస్తాయో- అలాగే అంతరిక్షంలో కూడా ఖగోళ వస్తువుల మధ్య జరిగే విశిష్ట ఘటనల వల్ల, విడుదలయ్యే బ్రహ్మాండమైన శక్తి కంటికి కనిపించని అలలుగా చుట్టూ ప్రయాణిస్తాయి- వీటినే గురుత్వాకర్షణ తరంగాలు అని అంటారు.ఓ నక్షత్రం విస్ఫొటనం చెందినప్పుడో, రెండు ఖగోళ విశేషాలు ఒకదాని కక్ష్యలో మరొకటి తిరుగుతున్నప్పుడో లేదా రెండు కృష్ణ బిలాలు విలీనం అయినప్పుడు- ఇటువంటి భారీ కదలికల వల్ల విడుదలయ్యే శక్తి, స్థానకాల క్షేత్రంలో (space-time) తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది.
భౌతిక మరియూ గణిత శాస్త్రాల అధ్యయనం ద్వారా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందులో భాగంగానే గంట మోగించినపుడు ధ్వని గాలిలో
తరంగాలుగా ప్రయాణించినట్లు, అంతరిక్షంలో విడుదలయ్యే భారీ శక్తి- తరంగాల రూపంలో ప్రసరిస్తుందని ఊహించారు. కానీ ఓ దశలో గురుత్వాకర్షణ తరంగాలు లేకపోవచ్చేమో అని కూడా ఆయన సందేహపడ్డారు. కానీ ఈ రోజు ఐన్‌స్టీన్ ఉండి ఉంటే, గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని చూసి, తన సాపేక్ష సిద్ధాంతం మీద మరింత ఆశాభావం వ్యక్తం చేసేవారేమో!
గురుత్వాకర్షణ తరంగాలు కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. ఈ తరంగాలు పురోగమించే మార్గంలో ఉన్న అన్ని వస్తువుల్ని సంకోచ-వ్యాకోచాలకి గురి చేయగలిగే శక్తిని కలిగి ఉంటాయి.
శాస్త్రీయ పరిశోధన:
భూమి మీద గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం తేలికైన విషయం కాదు. గురుత్వాకర్షణ తరంగాలను సృష్టించే ఈ వస్తువులు భూమి నుండి ఎంత దూరంగా ఉంటే ఈ తరంగాలు భూమిని చేరేప్పటికి అంత బలహీన పడతాయి. అందుకే తగిన సంకేతికతతో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చెయ్యటానికి దాదాపు 80 సంవత్సరాలు పట్టింది.
LIGO (లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్-వేవ్ అబ్జర్వేటరీ) అని పిలవబడే రెండు పరిశోధనా కేంద్రాలని 2002లో వేర్వేరు చోట్ల (లూసియాన, వాషింగ్టన్) నిర్మించారు. రెండిటి మధ్య దూరం దాదాపు 3000 కిలోమీటర్లు. రెండు కేంద్రాల్లోనూ ఈ తరంగాలు గుర్తించబడినప్పుడు మాత్రమే ఆ ప్రభావం గురుత్వాకర్షణ తరంగాలదని అని ధృవపరుస్తారు.
ఒక్కో పరిశోధనా కేంద్రానికి ఎల్ ఆకారంలోని లంభ కోణంలా, చేతులని పోలిన సొరంగాలని రెండు ఏర్పాటు చేశారు. రెండిటి పొడవు సమానం ( 4 కి.మీలు.)
పని చేసే విధానం:
‘ఎల్’ ఆకారంలో రెండు చేతులు కలిసే ప్రదేశం నుండి రెండు లేజర్ కిరణాలను శూన్యంగా ఉండే సొరంగాల్లోకి ప్రసరించేట్లు చేస్తారు. L ఆకారంలోని రెండు కొసలనా లేజర్ కిరణాల్ని ప్రతిబింబించేలా అద్దాలు వుంటాయి.
లేజర్ నుండి వెలువడిన కాంతి తరంగం, రెండు సొరంగాల్లోనూ ఒకే సమయానికి మొదలై, రెండింటిలో చివరన ఉన్న అద్దాలని తాకి , మరల ఒకే సమయానికి వెనక్కి ఎల్ ఆకార సంగమ స్థలానికి ప్రతిబింబించాలి. తిరిగి చేరుకున్న రెండు తరంగాల మధ్య, వాటి ధర్మాల్లో ఏ మాత్రం తేడా లేనప్పుడు, డిటెక్టర్ ఏ తేడాను గమనించదు.
ఒకవేళ గురుత్వ తరంగాలేమైనా విశ్వంలో సంభవిస్తే ఆ తరంగాలు పురోగమించే దిశలో ఉన్న లేజర్ కిరణపు ప్రవర్తనలో మార్పుకు గురిచేస్తుంది. ఈ తేడాని ఎల్ ఆకార మధ్య భాగంలో ఏర్పాటు చేసిన డిటెక్టర్ గుర్తించి, ఆ మార్పుని అధ్యయనం చేయడం ద్వారా గురుత్వాకర్షణ తరంగలని కనుగొంటారు.
అలా లేజర్ కిరణాలని సంవత్సరాల తరబడి అనుక్షణం పంపిస్తూ, గురుత్వాకర్షణ తరంగాలు కోసం వేచి చూస్తారు. 2015లో మొదటి సారి గురుత్వాకర్షణ తరంగాలు గుర్తింపబడ్డాయి. 1.3 బిలియన్ సంవత్సరాల క్రితం రెండు కృష్ణబిలాలు ఒకదానికొకటి ఢీ కొన్నప్పుడు విడుదలయైన శక్తి తాలూకా గురుత్వాకర్షణ తరంగాలు అవి.
భారతదేశంలో కూడా ఈ రకమైన పరిశోధనా కేంద్రాన్ని 2024 కల్లా ఏర్పాటు చెయ్యటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం కోసం Indian Initiative in Gravitational-wave Observations – Wikipedia
 చూడగలరు

ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది

ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్‌ మార్కెట్స్‌ ఇచ్చే డిస్కౌంట్స్‌. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరూ తెలుసుకోండి.

మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేక ఉంది. భారతీయ నెలల పేర్లు చంద్రుని ప్రయాణాన్ని అనుసరించి ఏర్పాటయ్యాయి. చంద్రుడు పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తాడు. కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. వర్షాలు జన జీవనానికి హర్షం. నీరు అనేది అమృత తుల్యం. నీరు లేనిదే పంటలు పండువు. తిండి ఉండదు. అటు వంటి వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఆషాఢ మాసమే. ఈ నెల నుంచే వర్షంతో పాటు వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో పాటు దక్షిణ యాణం వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ నెలలో పాద రక్షలు, గొడుగు, ఉప్పు ధానం చేయాలట. పైగా దక్షిణ యానం పితృ దేవతలకు ప్రీతికరమని అందుకే తర్పణాలు వదిలితే ఎంతో పుణ్యం వస్తుంది.

వధూవరుల వియోగం

పెళ్లయిన నూతన జంటలు ఈ మాసంలో కలిసి ఉండకూదని పెద్దలు చెబుతుంటారు. కొత్తగా పెళ్లయిన కోడలిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢ మాసంలో కోడలు గర్భం దాల్చిదే 9 నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అప్పుడు వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో తల్లీబిడ్డలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోడల్ని కాపురానికి దూరంగా ఉంచుతారు. అందుకే ఈ నెలలో నూతన వధూవరులకు వియోగం పాటిస్తారు. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని కాళిదాసు మేఘసందేశం అనేకావ్యాన్ని రచించారు.

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? దాని ఉపయోగమేమిటి?

మొలతాడు ధరించడం అనేది అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. మగవారికి ఖచ్చితంగా మొలతాడు ఉండాలని పెద్దలు చెప్తారు. అయితే ఎందుకు ఇది ధరించాలి అన్న ప్రశ్నకు భిన్న వాదనలు ఉన్నాయి.
మొలతాడు దిష్టి నుండి వ్యక్తుల్ని రక్షిస్తుందని కొంతమంది నమ్మకం. హెర్నియా వంటి వ్యాధులని నివారించే విధానంగా కూడా కొంతమంది భావిస్తారు(ఇందుకు శాస్త్రీయత సందేహమే). కానీ చాలా వరకు నిజమనిపించే వాదన ఏంటంటే- వదులుగా ఉండే వస్త్రాలని ధరించినపుడు, మనం నేడు వాడుతున్న బెల్ట్ ల మాదిరిగా బిగుతు చేసుకోవడానికి మొలతాడుని వాడేవారు.

రోడ్లపై మ్యాన్ హోల్స్ గుండ్రంగానే ఎందుకుంటాయి?

మన చుట్టు పక్కల రోడ్ల మీద ఎటు చూసిన మ్యాన్ హోల్స్ వృత్తాకారంలోనే ఉంటాయి. దానికి గల కారణాలు:
 • ఒక వేళ అవి చత్రుస, దీర్ఘ చత్రుస ఆకారాల్లో ఉంటే పొరపాటున అవి ఆ కాలువలోకి పడిపోయే అవకాశలు చాలా ఉన్నాయి. దాని వల్ల ఆ కాలువలోంచి మళ్లీ వాటిని తీయడం అనేది జరిగే పని కాదు. ఒక వేళ అవి అందులో పడితే వాటిని తీయడానికి అధిక ధన ఖర్చు, రోడ్డును మళ్లీ పగలగొట్టి పునర్నిర్మించాలి. కానీ వృత్తాకరంలో ఉంటే అది ఎటు తిప్పి కాలువలోకి తోద్దం అని చూసిన అది అందులో వెళ్లదు. వృత్తాకారనికి ఉన్న ప్రత్యేకత అదే అందుకే దాన్ని ఎక్కువగా వాడతారు.
 • మ్యాన్ హోల్ అనేది చాలా బరువుగా ఉంటుంది కాబట్టి అది వృత్తాకారంలో ఉంటే దాన్ని ఒక చోటు నుంచీ మరో చోటుకి తరలించడం చాలా సులభం. గుండ్రంగా ఉంటుంది కాబట్టి దోల్లించుకుంటూ వెళ్లిపోవచ్చు. దాన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు లాంటివి కూడా ఒక కారణమే.
 • వృత్తమే కాదు రీయులక్స్ త్రిభుజాకారం కూడా కాలువలోకి పడకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అది కూడా వాడతారు. కానీ దీన్ని తయారీ ఖర్చు వృత్తనికంటే అధికం.

పోస్టుమార్టం ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? దీని నుంచి ఎలాంటి విషయాలు బయటపడుతూ ఉంటాయి?

పోస్ట్ అంటే ‘తరువాత’. మార్టెమ్ అంటే ‘మృతి’.

పోస్ట్ మార్టెమ్ అంటే ‘మృతి తరువాత’.
నిజానికి ‘పోస్ట్ మార్టెమ్ పరీక్ష’ అనాలి.
సరే, భాషావిశ్లేషణకేమి గాని, వైద్యశాస్త్రంలో ఈ శాఖను ‘ఫారెన్సిక్ విభాగం’ అంటారు.
నేను చదివిన ఆంధ్ర వైద్య కళాశాల ‘పోస్ట్ మార్టెమ్ గది’ కి వెలుపల వరండాలో ఒక బోర్డుండేది.
“మృతదేహం భగవంతుని ఆస్తి” అని.
ఇదొక గొప్ప వాక్యం. దీనిని గురించి తరువాత వివరిస్తాను.
పోస్టుమార్టెమ్ చేసే సందర్భాలు:
భారతదేశంలో నున్న చట్టం ప్రకారం, అన్ని మెడికోలీగల్ కేసులకీ పోస్టుమార్టెమ్ చేస్తారు.
అంటే – ఏ ఏ సందర్భాలలో మృతి అనుమానాస్పదమో, ఆయా కేసులలో.
అంటే – రోడ్డు ప్రమాదాలు, విషం తీసికోవటం, ఆత్మహత్య, హత్య, అగ్నికి ఆహుతి కావటం, నీళ్ళలో మునిగి చనిపోవటం, బాంబు ప్రేలుడులు, వగైరా.
చట్టం:
‘అనుమానాస్పద మృతి’ అన్నాము కదా! అనుమానం ఎవరికి?
అంటే – ఆ మృతదేహాన్ని చూసిన డాక్టరుకు లేదా ఆ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారికి, అనుమానం వస్తే చాలు. ఆ అనుమానం వారి వారి విజ్ఞానాన్ని బట్టి, విజ్ఞతను బట్టి, అనుభవాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, – ఇలా.
‘నీకు అనుమానం ఎందుకు వచ్చింది?’ అని వారిని ఎవరూ అడగకుండానే, వారంతట వారే కేసును ‘మెడికోలీగల్’ చేసే అధికారాన్ని భారత న్యాయవ్యవస్థ వారికిచ్చింది. ఒకసారి మెడికోలీగల్ అయిన కేసు చికిత్స పొందుతూ మరణిస్తే, తప్పనిసరిగా పోస్టుమార్టెమ్ చేయాలి. ప్రస్తుత చట్టం ప్రకారం, ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులకే ఈ అధికారం ఉన్నది. మిగిలిన వైద్యులకు లేదు.
ఒక మెడికోలీగల్ కేసులో పోస్టుమార్టెమ్ చేయనక్కరలేదని నిర్ణయించే అధికారం చాల పై స్థాయిలోగల పోలీస్ అధికారులకు మాత్రమే ఉంటుంది. అయితే, ఆ నిర్ణయం వలన ఉత్పన్నమయ్యే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యమూ, శక్తీ, వాళ్ళకుండాలి. ఉదాహరణకు – రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు కూడ పోస్టుమార్టెమ్ ను నిర్వహించారే తప్ప, ప్రక్కన పెట్టలేదు.
పోస్టుమార్టెమ్ లక్ష్యం:
పోస్టుమార్టెమ్ చేయటమంటే – సత్యాన్ని ఆవిష్కరించటం కోసం.
మృతదేహంలో ఒక సత్యం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయటమే పోస్టుమార్టెమ్.
“ఇంత కర్కశమైన, అసహ్యమైన, ప్రక్రియ ఎందుకండీ? చనిపోయిన వారెలాగూ పోయారు కదా!
ఏం చేస్తే మాత్రం వాళ్ళు తిరిగి వస్తారా?” అనే ప్రశ్నలు భావోద్వేగ నేపథ్యం నుండి వచ్చినవి.
రాజ్యాంగానికీ, చట్టానికీ, భావోద్వేగముండదు, సత్యశోధనాపేక్ష మాత్రమే ఉంటుంది.
అది వాటి బాధ్యత కూడా.
అన్ని చట్టవ్యవస్థల లక్ష్యమూ, సత్యావిష్కారమే!
అందుకే, మన నాలుగు సింహాల బొమ్మ క్రింద ‘సత్యమేవ జయతే’ అని వ్రాసి ఉంటుంది.
ఇక, పోస్టుమార్టెమ్ ప్రక్రియ నేపథ్యం:
మృతిని డాక్టర్ నిర్ధారించాక, ఒక పోలీస్ కానిస్టేబుల్ కు ఆ మృతదేహాన్ని అప్పజెపుతారు. ఆ దేహానికి పోస్టుమార్టెమ్ పూర్తియై, బంధువులకు అది అప్పగించేవరకూ, అతనిదే బాధ్యత. ఒక్కసారి ఊహించండి – అదెంత కష్టమో! మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్ళి, ఫారెన్సిక్ విభాగంలో నుంచి, అక్కడి రికార్డులలో నమోదు చేయాలి. ఒకవేళ ఒక రాత్రి ఆ మృతదేహాన్ని అప్పగించటం జరుగకపోతే, మరునాడు ఆసుపత్రి తీసేవరకూ, మృతదేహమూ, దాని ప్రక్కన తప్పించుకు పోలేని పోలీసు కానిస్టేబులూ! వాస్తవాలెంత కర్కశంగా ఉంటాయంటే – మృతదేహాన్ని వీడి, ఆ కానిస్టేబులు ‘టీ’ త్రాగటానికి, బాత్రూముకు కూడ ధైర్యంగా వెళ్ళలేడు. వెళ్ళివచ్చే లోగా, మృతదేహానికేమైనా అయితే, బాధ్యత అతనిదే!
పోస్టుమార్టెమ్ చేసే విధానం:
పోస్టుమార్టెమ్ పరీక్ష చేసేది ఫారెన్సిక్ లో ఎం.డి. పొందిన డాక్టరు.
ఆ పరీక్ష ఎలా చేస్తారనేవి శాస్త్రవిషయాలు. అవి జనసామాన్యానికి అనవసరం.
నిజానికి ఏ శాస్త్రమూ సకల జనావళికీ తెలియవలసిన అవసరం లేదు. అవి ఒక రకంగా కాన్ఫిడెన్షియల్ అని నా ఉద్దేశ్యం. శాస్త్రానికీ, కళకూ, ఉన్న తేడాలలో ఇది ఒకటి. శాస్త్రంలో చాల కోణాలుంటాయి. శాస్త్రం సత్యాన్ని అపేక్షిస్తుంది. కళ సౌందర్యాన్ని చూపిస్తుంది. ఈ విషయంలో చాల మందికి భయాలు, ఆందోళనలూ, ఉన్నాయి కనుక, ఒక్క విషయం మాత్రం వ్రాస్తున్నాను. అదేమిటంటే – స్థూలంగా పోస్టుమార్టెమ్ లో శరీరాకృతి ఏమీ మారిపోదు.
పోస్టుమార్టెమ్ చేసేటప్పుడు ప్రతి ఎముకనూ, ప్రతి అవయవాన్నీ, డాక్టర్లు పరిశీలిస్తారు. ఆ వివరాలను రికార్డు చేస్తారు. ఒక డాక్టరు పోస్టుమార్టెమ్ చేస్తూంటే, ఇంకో డాక్టరు వ్రాస్తూంటాడు. ఇది వైద్యకళాశాలలున్న ఆసుపత్రులలో. జిల్లా, ఇంకా చిన్న ఆసుపత్రులలో డాక్టరు చేస్తూంటే, ఇంకొక మనిషి వ్రాస్తాడు. ఈ ప్రక్రియకు దాదాపు 1 – 2 గంటల సమయం పడుతుంది. ఆ తరువాత ఒక తాత్కాలిక రిపోర్ట్ ఇస్తారు. శరీరంలో ప్రతి అవయవం నుండీ – చిన్న ముక్కను కత్తిరించి, రసాయనిక పరీక్ష నిమిత్తం సెంట్రల్ ఫారెన్సిక్ లేబొరేటరీకి పంపుతారు. ఆ రిపోర్ట్ రావటానికి దాదాపు పది రోజులు పడుతుంది. ఆ రిపోర్టే ఫైనల్ అవుతుంది.
ఎవ్వరికీ తెలియని దారుణమైన విషయాలు:
ఒక్కక్క బోధనాసుపత్రి ఫారెన్సిక్ విభాగానికీ, రోజుకు 5 – 10 మృతదేహాలు వస్తాయి. రైలు ప్రమాదమో, బాంబు ప్రేలుడో అయితే, ఈ సంఖ్య డజన్లలో ఉంటుంది. అంటే, ప్రతి రోజూ, ఈ విభాగం డాక్తర్లకు దాదాపు 8 8 – 10 గంటలపాటు శవాలను కోయటమే పని. ప్రతి మృతదేహానికీ నంబరు వేసి, పోస్టుమార్టెమ్ నిర్వహించాలి. నీళ్ళలో మునిగిపోయిన దేహాలు కొన్నిరోజుల తరువాత లభిస్తే, వాటి స్థితి ఎలా ఉంటుందో, ఊహించలేము. ఈ బాధలు, కంపు, జుగుప్స – వీటినన్నింటినీ తట్టుకుంటూ, డాక్టర్లు ఈ పని చేయాలి. ఇంకా దారుణమైన విషయం – కొన్ని సార్లు పాతిపెట్టిన మృతదేహాలకు (రీ) పోస్టుమార్టెమ్ నిర్వహించమని కోర్టు ఆజ్ఞాపిస్తుంది. ముక్కూ, నోరూ, మూసుకొని, ఆ పని చేయాలి. ‘చేయను’ అని చెప్పే హక్కు (ప్రభుత్వ) డాక్టర్లకు లేదు.
పోస్టు మార్టెమ్ వలన బాధలు, ఉపయోగాలు:
పోస్టుమార్టెమ్ చేస్తున్న మృతదేహం యొక్క బంధువులకది కచ్చితంగా చాల దారుణమైన, భయంకరమైన, అసహ్యమైన, ఆందోళనకరమైన అనుభవం. అది ఒక మనిషికి సంబంధించిన విషయం. ఆ కుటుంబం బాధ పడుతుంది. వాళ్ళ ఫీలింగ్స్ గాయపడతాయి. కాని, సత్యం ఆవిష్కారమౌతుంది. “మనిషి పోయాక, సత్యం ఎవడికి కావాలండీ?” అంటే – సమాజంలో మారుతున్న మానసిక, హింస, నేర ప్రవృత్తులు బయటపడతాయి. పోస్టుమార్టెమ్ లో బయటపడిన నిజాలు ఆ మనిషిని బ్రతికించలేవు; ఆ కుటుంబానికుపయోగపడవు; కాని, ఆ సమాచారం భవిష్యత్తులో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందటానికీ, నేరనిరోధంలో పోలీసులకూ, ఉపయోగపడుతుంది. లక్షలాది మృతదేహాల నుండి బయటపడిన పరిశీలనల ఆధారంగానే ఫారెన్సిక్ సైన్సు ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందింది. ఇది కాదనలేని సత్యం. ఒక రకంగా, సమాజానికవసరమయ్యే విజ్ఞానానికి వ్యక్తి మరణిస్తూ చేసిన త్యాగం – తన శరీరాన్ని పోస్టుమార్టెమ్ కి ఇవ్వటం.
స్వానుభవం:
ఎమర్జెన్సీ డ్యూటీలో నుండగా వచ్చిన డజన్ల కొద్దీ మెడికోలీగల్ కేసులలో చాల వరకు “మేము మృతదేహాన్ని పట్టుకుపోతామండీ, దయచేసి మెడికోలీగల్ చేయకండి” అంటు బ్రతిమాలే వాళ్ళు, బెదిరించే వాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు, బోలెడు మందిని చూసాను. ఒక కేసులో దాదాపు 200 మంది గుంపుగా వచ్చి, పెద్ద ప్రదర్శన చేసారు. అటువంటి సందర్భాలలోనే డాక్టరుకుండే మానసిక శక్తి, చట్టం పట్ల గౌరవం, ధైర్యం, వ్యక్తమౌతాయి. డ్యూటీలో నుండగా ‘మంచిగా నుంటాను’ అనుకోకూడదు. ‘సరిగ్గానుంటాను’ అనుకోవాలి. ఇందులో రాజకీయ వత్తిడులూ, పెద్దమనుషుల వత్తిడులూ, ఇవన్నీ ఉంటాయి. ఆత్మహత్య హత్యగా నిరూపించబడవచ్చు. ఊహించలేని వ్యాధి బయటపడవచ్చు. మీడియానో, రాజకీయవాదులో ప్రచారం చేస్తే ఏమో గాని, పోస్టుమార్టెమ్ రిపోర్టు బహైర్గతం కాదు. అందుచేత, మృతుని కుటుంబానికి సంబంధించి, వారికి జరిగే సామాజిక హాని ఏమీ లేదు.
నేను చేసినది ప్రభుత్వాసుపత్రి కాదు కనుక, కేసులను మెడికోలీగల్ గా ప్రకటించటమే తప్ప, పోస్టుమార్టెమ్ చేసే అవకాశం నాకు రాలేదు. కాని, కొన్ని కేసులకు పోస్టుమార్టెమ్ జరిగినప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి చూసాను. డాక్టరునైన నాకే ఆ స్థితి చాల జుగుప్సాకరంగా అనిపించింది.
ఫారెన్సిక్ డాక్టర్ల స్థితి:
నిత్యం, రోజుకు దాదాపు 8 – 10 గంటలపాటు అదే పని చేసే ఫారెన్సిక్ డాక్టర్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించటమే కష్టం. ఎంత అలవాటు పడినా, మనం అనుభవించే సుఖాలేవీ అనుభవించే స్థితిలో వాళ్ళ మనస్సుంటుందా? అంటే సందేహమే. వాళ్ళను చూసి జాలిపడాలి. వాళ్ళు ఆపరేషన్ చేసే ఏ రోగీ, లేచి, ‘నా బాధ నయమైంది’ అని చెప్పడు. కృతజ్ఞతలు లేని ఉద్యోగమది. వాళ్ళ కృషిని గుర్తించేది పై వాడొక్కడే!
అందుకే, పోస్టుమార్టెమ్ గది వెలుపల ఉండే
“మృతదేహం భగవంతుని ఆస్తి” అనే వాక్యం గొప్ప భావాన్ని వ్యక్తం చేస్తుంది.

సైన్స్ ప్రకారం ఒక సముద్రం ఎలా తయారయ్యింది? అంత నీరు ఎక్కడ నుండి వచ్చింది?

భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయి అనే దానికి శాస్త్రవేత్తల దగ్గర రెండు జవాబులు వున్నాయి.
1. భూమి ఏర్పడి 4.5 బిలియన్ సంవత్సరాలు అయింది . భూమి ఏర్పడిన మొదట్లో భూమి అంత లావాతో నిండి పోయింది. అంత వేడి వల్ల భూమిమీద వున్న వాటర్ ఆవిరిగా మారిపోయింది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత భూమి చల్లబడి భూమి లోపల వున్న నీరు అగ్నిపర్వతాలు పేలుళ్లు జరిగినపుడు ఆవిరి రూపంలో బయటకి వచ్చి మబ్బులుగా ఏర్పడి వర్షాలు పడటం వల్ల భూమి మీద నీరు ఏర్పడింది కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు ఈ ప్రాసెస్ జరగడం వల్ల సముద్రాలు ఏర్పడ్డాయి.
2. కొన్ని కోట్ల సంవత్సరాల ముందు భూమిని కొన్ని కోట్ల గ్రహశకలాలు డీ కొట్టాయి. ఆస్టెరాయిడ్స్ , కామెట్స్ లో వున్న వాటర్ ఐస్ భూమి మీద పడటం వల్ల భూమి మీద నీరు ఏర్పడింది .
భూమి మీద వున్న సముద్రాలు కొంత భాగం భూమిలోపల నుండి రాగా కొంత భాగం గ్రహశకలాలు డీ కొట్టడం వల్ల ఏర్పడ్డాయి.
సముద్రలోని నీరు హెవీ వాటర్ మరియు నార్మల్ వాటర్ కలిగి వున్నాయి. నీటిలో వేర్వేరు ఐసోటోపులు ఉన్నాయి.
H2O లో వున్న హైడ్రోజన్ అణువు యొక్క న్యూక్లియస్ లో ఒక ప్రోటాన్ ఉంటే అది మాములు నీరు అవుతుంది అదే హైడ్రోజన్ న్యూక్లియస్ లో ఒక ప్రోటాన్ ఒక న్యూట్రాన్ ఉంటే దాన్ని డ్యూటీరియం అంటారు . నీటిలో ఎక్కువ డ్యూటీరియం మొలిక్యూల్స్ ఉంటే దాన్ని హెవీ వాటర్ అంటారు. సముద్రంలో నార్మల్ వాటర్ మరియు హెవీ వాటర్ వున్న కారణంగా భూమి మీద నీరు కొంత భూమిలోపల నుండి , మిగిలిన భాగం గ్రహశకలాల నుండి వచ్చింది అని చెప్తున్నారు.

బిడ్డ పుట్టాక బొడ్డు తాడు కత్తిరించినప్పుడు, తల్లికి జతచేసి ఉన్న ముక్కకు ఏమవుతుంది?

తల్లికి జతచేసి ఉన్న బొడ్డుత్రాడు ముక్క ‘మావి’తో పాటు, (గర్భాశయంచే) విసర్జించబడుతుంది.
వివరము:
తల్లి గర్భాశయంలో మావి (placenta) ఉంటుంది. ఇది తల్లీ-బిడ్డల రక్తసరఫరా వ్యవస్థలకు మధ్యవర్తి.
మావి ఒక పళ్ళెం వలె ఉంటే, దాని చివర ఒక త్రాడు వలె ఉండి, అది బిడ్డ బొడ్డుకు సంధానింపబడి ఉంటుంది.
బిడ్డ పుట్టిన తరువాత కొద్ది నిముషాలలోనే బిడ్డ శరీరంలోని రక్తసరఫరా వ్యవస్థ చైతన్యవంతమౌతుంది. అప్పుడు బొడ్డు తాడులో గల రక్తాన్ని బిడ్డ వైపుకు పిండితే, కొద్దిపాటి రక్తం బిడ్డ శరీరంలోనికి చేరుతుంది. ఆ తరువాత బొడ్డుత్రాడును కత్తిరిస్తారు. అక్కడితో, తల్లీ-బిడ్డలకు గల రక్తసరఫరా బంధం తెగినట్లే!
తల్లి నుండి బిడ్డకు రక్తసరఫరా బంధం బొడ్డు అయినా, బ్లడ్ గ్రూపులు వేరుగా నుండవచ్చు.

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? దాని ఉపయోగమేమిటి?

మొలతాడు ధరించడం అనేది అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం. మగవారికి ఖచ్చితంగా మొలతాడు ఉండాలని పెద్దలు చెప్తారు. అయితే ఎందుకు ఇది ధరించాలి అన్న ప్రశ్నకు భిన్న వాదనలు ఉన్నాయి.
మొలతాడు దిష్టి నుండి వ్యక్తుల్ని రక్షిస్తుందని కొంతమంది నమ్మకం. హెర్నియా వంటి వ్యాధులని నివారించే విధానంగా కూడా కొంతమంది భావిస్తారు(ఇందుకు శాస్త్రీయత సందేహమే). కానీ చాలా వరకు నిజమనిపించే వాదన ఏంటంటే- వదులుగా ఉండే వస్త్రాలని ధరించినపుడు, మనం నేడు వాడుతున్న బెల్ట్ ల మాదిరిగా బిగుతు చేసుకోవడానికి మొలతాడుని వాడేవారు.

ఉప్పు నీటి నుంచి మంచి నీటిని తయారుచేయడం ఎలా?

సాధారణంగా నౌకలో త్రాగే మరియు వాడుక నీరుని సముద్రపు నీరు నుండి ఉత్పత్తి చేయబడుతుంది. ఈ మంచినీరు ఎలా ఉత్పత్తి చేయబడుతుందో లోతుగా కాకుండా క్లుప్తంగా వివరిస్తాను.
మంచినీటిని రెండు పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేయవచ్చు
1. స్వేదనం(Distillation)
2.రివర్స్ ఓస్మోసిస్ (RO)
సాధారణంగా సరుకుల రవాణా నౌక లో(cargo ship) స్వేదనం(distillation) పధ్ధతి ఉపయోగిస్తారు ఎందుకంటే ఇది పరిమాణంలో చిన్నది, ప్రభావంతమైనది మరియు ఖర్చు లేనిది. అయితే RO ఖరీదైనది మరియు పరిమాణంలో కూడా పెద్దది.ముఖ్యంగా ప్యాసింజర్ షిప్‌లో RO ఉపయోగించబడుతుంది, ఇక్కడ పెద్ద మొత్తంలో నీరు వినియోగించబడుతుంది కనుక.
1. స్వేదనం(Distillation) = ఆవిరి + సంక్షేపణం
(Evaporation + Condensation)
ఫ్రెష్ వాటర్ జనరేటర్ (fresh water generator)అనే పరికరం ద్వారా distillation పద్ధతి ద్వారా మంచినీరు ఉత్పత్తి చేసుకోవచ్చు.
పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్నదే ఫ్రెష్ వాటర్ జనరేటర్(shell&tube type). ఇవి ముఖ్యంగా రెండు రకాలు, ప్లేట్ టైపు మరియు షెల్ &ట్యూబ్ టైపు.
మంచినీటిని ఉత్పత్తి చేయడానికి నౌకలో రెండు విషయాలు పుష్కలంగా లభిస్తాయి – సముద్రపు నీరు మరియు వేడి. అందువల్ల ఏదైనా వేడి మూలం నుండి వేడిని ఉపయోగించి సముద్రపు నీటిని ఆవిరి చేయడం ద్వారా మంచినీరు ఉత్పత్తి అవుతుంది. ఆవిరైపోయిన సముద్రపు నీటిని మళ్ళీ సముద్రపు నీటితో చల్లబరుస్తుంది మరియు చక్రం పునరావృతమవుతుంది.
FWG(ఫ్రెష్ వాటర్ జనరేటర్) యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే, చుట్టుపక్కల(shell లో )వాతావరణం యొక్క ఒత్తిడిని తగ్గించడం ద్వారా నీటి మరిగే బిందువును(boiling point) తగ్గించవచ్చు. అల్పపీడనాన్ని(low pressure) నిర్వహించడం ద్వారా, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అంటే 50 డిగ్రీల సెల్సియస్ వద్ద నీటిని మరగబెట్టవచ్చు . FWG యొక్క వేడి మూలం ప్రధాన ఇంజిన్(Main engine) జాకెట్ శీతలీకరణ నీటిచే తిరస్కరించబడిన వ్యర్థ వేడి. సులభంగా చెప్పాలంటే మన కార్స్ లో ఉండే రేడియేటర్ నీరు ఎలాంటిదో Main engine jacket water కూడ అంతే.
ఇలా ఉత్పత్తయిన మంచి నీరు mineralize ప్రాసెస్ తర్వాత త్రాగటానికి ఉపయోగిస్తారు.
2.రివర్స్ ఓస్మోసిస్(RO)
ఇది నీటి వడపోత ప్రక్రియ, ఇది పాక్షిక పారగమ్య పొర(Semipermeable membrane -SPM)పదార్థాలను ఉపయోగిస్తుంది
ఓస్మోసిస్ అనేది సహజంగా నీటిని SPM యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు తరలించే దృగ్విషయం(phenomenon )
రివర్స్ ఓస్మోసిస్ అనేది ఓస్మోసిస్ ప్రక్రియకు విరుద్ధం , అంటే దీనిలో ఉప్పునీరు SPM ద్వారా నిరోధించబడుతుంది.ఈ ప్రక్రియలో సముద్రపు నీరు పంపు ద్వారా ఒత్తిడి చేయబడుతుంది మరియు ఇది SPM గుండా వెళుతుంది. SPM కేవలం స్వచ్ఛమైన/ మంచినీరును వదిలి కలుషితమైన /ఉప్పు వ్యర్ధ content ని అడ్డుకుంటుంది.ముందుగా చెప్పినట్టు RO పద్ధతిని ఎక్కువగా పాసెంజర్ నౌకలో ఉపయోగించబడుతుంది.

Sand box technology in ancient temples.

Ramappa Temple withstood 17th century massive earthquake. Kedarnath Temple suffered no damage from Himalayan boulders that wiped everything around the temple.How did they stand against test of time?
It is said that this is due to sandbox technology present in ancient temples in India and other places
What is sandbox technology? In 1980, Indian archaeological department in association with NIT Warangal started researching on the Kakatiya constructions for the first time ever. That is when this technology first came into notice later it was named as sandbox technology in 1991 in the archaeological department conference.
Ramappa temple
It is situated 65 km from Warangal. It is built during the time of Kakatiya Dynasty. It stands on 6 feet high star-shaped platform. The architecture here is simply amazing.
This technology is used at the level of foundation. In normal constructions we make sure that foundation is strong enough to support the weight of construction. But Kakatiyas used a unique mixture as a foundation material.
This composition is–
Sand +powdered mixture of
1)Granite
2)Jaggery
3)Terminalia Chebala
They used to dig the earth 3m deep and pour this unique sand mixture into this pit forming a box-shaped structure called sandbox. And
into this they built heavy and huge constructions.

Mechanism of working

This sandbox works like a cushion. This sandbox absorbs stress from all sides. So if an earthquake occurs the intensity is greatly reduced at the level of sandbox before it reaches the construction.

What if sandbox couldn’t stop or reduce the intensity of vibrations? The back up plan


In the event of an earthquake , if the vibrations of the earthquake are so high that they passed through this sandbox and reached the construction, in order to keep the stones used in the construction of walls, pillars, rooftops of the temples together from separating, they used Iron dowels. For this purpose, they made small tunnels like holes in all the rocks used for construction and poured melted iron in them. As a result, these dowels hold the rocks together strongly making the total construction fit like a frame and thus act like a metallic skeleton in the flesh of stones.

Source: http://www.sciencebehindindiancultures.com and UNESCO website
A user at the website says:
• Recent past has shown that the Pashupati Nath temple at Kathmandu Nepal stood rock solid on the ground when the Nepal earthquake damaged old city of Bhaktapur Patan in Katmandu.
• Kedarnath temple had no damage from Himalayan boulders that wiped everything around the temple, even Nandi in front of the temple.
• Kutch quake flattened every thing from multi story houses halls to newly built temples of cement and bricks except ancient temples of Kutch including abandoned temples of Lakhpat area in Pakistan bordering Kutch
• world’s largest hindoo brahma vishnu mahesh (later buddha was added)to temple of Ankor Wat in Cambodia built by its hindoo dynasty and builders floating like on water surrounded by man made water canal as temple boundary no earth quake can touch the temple as it automatically aligns to angle and absorbs all vibration even if a atom bomb were to fall close to temple. The massive vibration would absorb causing no damage
• In Karnataka, India at Talakkad Hindoo temple was excavated buried under sand for hundreds of years and today it looks fully preserved including the sculptures around. imagine it got buried how was it 2 be other than some natural phenomenon. archeology dept. of Indian Government has not been able to dig out anything else but the temple.
That’s the wonder of temple civil engineering in ancient World.

Why do Indian women apply turmeric to their feet?

This is  a common question and and the answer is quite obvious. This has something to do with the medicinal properties of turmeric.
I have already said in my previous posts that turmeric acts as an anti-oxidant(Read here)
and it also acts as an anti-cancer agent(Read here-under research). 
Turmeric also has some other cool properties like
 1. It is a powerful antibiotic.
 2. It helps heal wounds faster  and more.

The scenario..

In ancient times women are the ones who work most in the kitchen and Indians don’t have the habit of wearing sandals etc in house. So their feet are exposed to water on floor and they also stand for lot of time on hard floor. Also, their feet are already sensitive. It puts pressure on their feet and lead to cracks on their feet. Here comes the use of turmeric.
 1. Turmeric is an antibiotic. So turmeric kills the microbes on feet( which may enter through cracks on feet) and prevent further infection.
 2. Turmeric itself heals these cracks on feet. Nowadays women apply certain creams to fight with these cracks. Indian women used turmeric to fight them.

What are the white half-moons on your fingernails?

Fingernails and Toenails made their way into mainstream fashion. They get polished with variety of colors, they get clipped, they get shaped into a subtle free curve. So what are those white half-moons on your fingernails? Aren’t you curious to know?

Basic Anatomy


Anatomy of nail @mayoclinic

Fingernails and toenails are made up of several layers of hardened cells. The nail plate (hard part) is less than 1mm thick and transparent, allowing the pink nail bed beneath, with its plentiful of blood supply, to show through.
Only the half moon-shaped area, known as lunula, at the bottom of each nail is white and opaque. This is where the nail root or matrix is located and it is here that new cells are produced continuously. These new cells push forwards, dying as they go, and the stored keratin inside causes them to harden and finally become transparent and thus forms nail plate.

Fingernails grow at a rate of about 1 mm a week, toenails more slowly. The little white half-moons vary in size, being larger on some people and smaller on others. Sometimes the lunulae can’t be seen at all because the matrix is hidden beneath the cuticle and the skin on the fingers.

What could an abnormal nail indicate?


 • A bluish discoloration of the lunula is a sign of a shortage of oxygen due to poor circulation, possibly caused by heart or vascular disease. This is called cyanosis.
 • People with chronic renal failure may produce more melanin which cause your nail bed to turn brown
 • In case of severe renal disease the white lunula may extend upto half the way up and other half turn brown. This is called half-and-half nail
 • Tetracycline medications are used to treat acne and skin infections.Long term use may turn lunulae yellow.
 • It is a myth that small white flecks seen sometimes indicate calcium deficiency.The small, white flecks that are sometimes seen on nails are merely the result of minor injuries and nothing to worry about.
 • Excessive fluoride ingestion may turn lunulae black.

What makes your skin wrinkle in water?

Normal Skin

Normally, most skin is covered by a thin, waterproof film of oily sebum. This substance, secreted by the sebaceous glands, keeps the skin supple and at the same time prevents moisture loss and also prevents water penetration.


What happens in water?


However, when skin is in contact with water for relatively long periods of time in the bath or at the swimming pool for example – this film of sebum dissolves. The process is accelerated by the use of soap or other skin cleansers.

Outer layer consists only of dead, hard skin cells filled with the protein keratin. There is a layer of subcutaneous tissue beneath made up of living cells. This layer is water tight, this means water can’t seep past this layer.

Once the film of sebum has dissolved, water can penetrate the gaps in the outer layer of the skin.As a result, the skin expands and swells up. However, because the outer layer is firmly attached to the water-tight subcutaneous layer beneath, which is made up of living cells, creases form and the skin wrinkles.

A lot of hard skin builds up, especially on the fingers, toes and heels, where everyday activities place additional demands on the skin. The layer of hard skin on these parts of the body can be between five and 20 times thicker than on other parts. This is why these are the areas most prone to water penetration and where the skin wrinkles most noticeably moreover they have less sebaceous glands.

Evolutionary significance:


Some claim that wrinkling confers additional advantage of gripping object when the hands are wet. Clearly there is no disadvantage of wrinkled palm in water over a soft one!

How does it turn back to normal?


Simple! when we get out of the bath or pool, the absorbed water quickly evaporates, the skin becomes smooth again, a new layer of sebum is produced by the underlying sebaceous glands. However this process is slow on soles and palms as these places have relatively less number of sebaceous glands.