పిల్లల వ్యాధులు

పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను

పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది. నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్‌ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది. నట్స్‌: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం …

పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా – తినిపించండి సహజ సిద్ధమైన పదార్థాలను Read More »

బ్రక్సిజం – చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్

చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజం’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణం. ఇది పిల్లల మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య. కొందరు పెద్దవాళ్లలోనూ ఈ సమస్య ఉండవచ్చు. ఇది ఎందువల్ల వస్తుందనేందుకు నిర్ణీతంగా కారణాలు తెలియదు. సాధారణంగా ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటి లక్షణాలున్న పిల్లల్లో ఈ బ్రక్సిజం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ముందుగా పిల్లల్లో ఆందోళన, వ్యాకులత తగ్గించాలి. నిద్రకు ఉపక్రమించే ముందర …

బ్రక్సిజం – చిన్నారులు నిద్రలో పళ్లు కొరికే కండిషన్ Read More »

గ్రహణ మొర్రి

గర్భవతులు గ్రహణం సవుయంలో బయట తిరగడం వల్ల బిడ్డకు ఎలాంటి వైకల్యమూ రాదు. అది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. బిడ్డ పెదవులూ, కొన్నిసార్లు అంగిలి చీరుకుపోయినట్లుగా ఉండేదే ‘గ్రహణం మొర్రి’. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సవుయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు (రెండో నెల సవుయంలో) బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సవుయంలో ఒక్కోసారి బిడ్డలోని …

గ్రహణ మొర్రి Read More »

మిషన్ ఇంద్రధనస్సు – శిశువులకు ఏడు రకాల టీకాలు వేయడం

2014 డిసెంబర్ 25 న శిశువు కు ఏడు రకాల వ్యాక్సిన్లను తప్పనిసరిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది. 1. B.C. G : అనగా బాసిల్లస్ కాలమైన్ గ్వానిన్ శిశువు పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఇస్తారు. ఒకసారి మాత్రమే ఇస్తారు ఈ టీకా క్షయవ్యాధి అనగా టీబీ వ్యాధి రాకుండా శిశువును కాపాడుతుంది. 2. O. P. V, I. P. V: ఓ పి వి అనగా ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇది పోలియో …

మిషన్ ఇంద్రధనస్సు – శిశువులకు ఏడు రకాల టీకాలు వేయడం Read More »

కడుపులో పురుగులు

కడుపులో పురుగులు ఉన్నాయంటే అవి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా మొదలుకొని, ఏకకణ జీవులైన ప్రోటోజోవా నుంచి బద్దెపురుగులూ (ఫ్లాటీహెల్మెంథిస్‌), వానపాముల జాతికి చెందిన నిమటోడ్స్‌ వరకు ఎన్నెన్నో రకాలైనవి ఉండవచ్చు. కడుపులోకి చేరి బాధించే ఏకకణజీవులైన ప్రోటోజోవా వర్గానికీ, ఆ తర్వాతి స్థానాల్లో ఉండే హెల్మింథిస్‌ (ఫ్లాటీ అండ్‌ నిమటీ హెల్మెంథిస్‌) వర్గానికి చెందిన పరాన్నజీవులివి. ► ప్రోటోజోవాకి చెందిన జియార్డియాఇది జీర్ణవ్యవస్థలోని చిన్న పేగుల్లో (డియోడినమ్‌ అనే భాగంలో) ఉండే పరాన్నజీవి. ఇది ఏకకణ జీవి. మైక్రోస్కోప్‌ కింద …

కడుపులో పురుగులు Read More »

Mumps……. గవదబిళ్లలు

ఉన్నట్టుండి జ్వరం పిల్లలకు దవడ వాచిపోయి, గవదబిళ్లలు మొదలైతే …….చూడటానికి చాలా భయంగా ఉంటుంది. నొప్పి వేధిస్తుంది. పెద్దల్లో వస్తే బాధలు కాస్త తీవ్రంగా కూడా ఉంటాయి. అయినా… ఇది మరీ అంత ప్రమాదకరమైన వ్యాధేం కాదు. దీనివల్ల దీర్ఘకాలం మిగిలిపోయే సమస్యలేం ఉండవు. అసలిదీ రాకుండా సమర్ధమైన టీకా ఉంది. చిన్న ప్లిల్లలలో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో గవదబిళ్లలు ఒకటి. దీన్నే ‘మంప్స్‌’ అంటారు. ఆటలమ్మ, పొంగు మాదిరిగానే ఇది కూడా వైరస్‌ కారణంగా వచ్చే …

Mumps……. గవదబిళ్లలు Read More »

శిశువు గుండెలో రంధ్రం

పుట్టుకతో తలెత్తే ఈ సమస్యకు ఒకప్పుడు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండేది కాదు. అయితే గొడుగులా విచ్చుకునే పరికరాల రాకతో పరిస్థితి మారిపోయింది. శస్త్రచికిత్స అవసరం లేకుండా బయటి నుంచే గొట్టం ద్వారా రంధ్రాలను మూసేయటం సాధ్యమైంది. కానీ వీటితో గుండె వేగం తగ్గటం వంటి దుష్ప్రభావాలు పొంచి ఉంటుండటం.. పెద్ద రంధ్రాలకు సరిపడకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని గుర్తించిన వైద్య పరిశోధనా రంగం కొంగొత్త పరికరాల రూపకల్పనపై దృష్టి సారించింది. ఇలా పుట్టుకొచ్చిందే ‘కోనార్‌ఎంఎఫ్‌’. …

శిశువు గుండెలో రంధ్రం Read More »

చిన్న పిల్లల్లో అలర్జీ

ఒకటే దురద. గోకితే దద్దు. తుమ్ము మీద తుమ్ము. ఉక్కిరి బిక్కిరి చేసే ఆయాసం. ఇలా అలర్జీలు తెచ్చిపెట్టే బాధలు అన్నీ ఇన్నీ కావు ప్రస్తుతం మనిషిని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల్లో అలర్జీలదే ప్రథమస్థానం! ఆధునికతతో పాటు ఇవీ పెరుగుతూ వస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సుమారు 50% మంది ఏదో ఒక అలర్జీతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలోనూ 20-30% మంది జీవితంలో ఎప్పుడో అప్పుడు ఏదో ఒక అలర్జీ బారినపడ్డవారే. ఒకరకంగా దీన్ని మన …

చిన్న పిల్లల్లో అలర్జీ Read More »

పిల్లల్లో ఆస్తమా

1, 2, 3, 4, 5, 6…. ఒకటి, రెండు, మూడు… చదువుతుంటే… ఇదేమిటి….? పిల్లల్లా ఒంట్లు లెక్కపెట్టడం ఏమి అనిపిస్తోందా? అదేం కాదు.. ఈ అంకెలు వేరే! వరుసగా ఆరు కూడా లెక్కపెట్టడానికి కూడా ఊపిరి సరిపోనట్లుగా ఆయాసం వస్తుంటే అది ఆస్తమా కావచ్చు. ఆ వ్యాధిలో ఊపిరి అందకపోవడంతోపాటు ఒక్కోసారి పిల్లికూతలతో, ఛాతీ అంతా పట్టేసినట్లుగానూ ఉండవచ్చు. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే కుటుంబానికంతటికీ క్షోభ. కానీ.. కేవలం ఆరంకెలు లెక్కపెట్టేలోపు చదవగలిగే ఆరు …

పిల్లల్లో ఆస్తమా Read More »