Posted in డయాబెటిస్‌

డయాబెటిస్‌ వలన చర్మ సమస్యలు

మన రోజువారీ పనులకు శక్తి కావాలి.మనకు అవసరమైనప్పుడు ఆ శక్తి ఆహారం ద్వారా వస్తుంది. శరీరానికి శక్తి అవసరం అయినపుడు అది చక్కెర రూపంలో రక్తంలోకి వెలువడుతుంది. మనకు శక్తి అవసరం లేనపుడు మనం తీసుకున్న ఆహారం కాలేయంలోనూ, కండరాల్లో, కొవ్వుల రూపంలో నిల్వ ఉంటుంది. మనకు అవసరం లేని సమయాల్లో ఇలా వెలువడే చక్కెరను నియంత్రించడానికే ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ అవసరం. ఈ హార్మోన్ష్‌ లోపించడం వల్ల వచ్చేదే డయాబెటిస్‌. అసలు ఇన్సులిన్‌ ఉత్పత్తి లేకపోవటం వల్ల వచ్చేదే టైప్‌-1 యడయాబెటిస్‌ వ్యాధి, ఇన్సులిన్‌ ఉత్పత్తి క్రమంగా మందగించడం వల్ల వచ్చేది టైప్‌-2 డయాబెటిస్‌. ఇటీవల మనదేశంలో టైప్‌-2 డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టైప్‌-1లో ఇన్సులిన్‌ ఇంజెక్షన్లతోనే చికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే టైప్‌-2లో మలిదశలో ఇన్సులిన్‌ అవసరమైనా తొలిదశలో దీన్ని మందులతో నియంత్రించ వచ్చు.
డయాబెటిస్‌తో సాధారణ దుష్ఫలితాలు :
రక్తంలో చక్కెర ఎక్కువకాలం ఉంటే అది శరీరంలోని అనేక అవయవాలను దెబ్బతీయవచ్చు. అది కళ్ళపై చూపే దుష్ఫ్రభావం వల్ల రెటినోపతి అనే కంటి వ్యాధి రావచ్చు.అది అంధత్వానికి దారితీయవచ్చు. మూత్రపిండాలపై దుష్ఫ్రభావం చూపడం వల్ల నెఫ్రోపతి అనే కండిషన్‌కు దారితీయవచ్చు. నరాలపై డయాబెటిస్‌ ప్రభావం వల్ల న్యూరోపతి అనే సమస్యలు వచ్చి తిమ్మిర్లు, మంటలు రావచ్చు. సాధారణంగా ఇది తొలుత చర్మంపై వచ్చే సమస్యలాగా అనిపించినా అది నరాలకు సంబంధించిన రుగ్మత. కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వులు పెరిగి రక్తనాళాలు దెబ్బతిని మొదడుకు రక్తం చేరకపోతే పక్షవాతం వంటివి రావచ్చు. దీర్ఘకాలంగా గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు దెబ్బతినడంవల్ల గుండెపోటు వచ్చి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.
చర్మంలో మార్పులు డయాబెటిస్ సూచనలు : అన్ని అవయవాలలాగే చక్కెర వ్యాధి చర్మంపై కూడా తన ప్రభావం చూపుతుంది. విపరీతమైన ఆకలి, అతిగా దాహం కావడం చాలామంది డయాబెటిస్‌ లక్షణాలుగా భావిస్తారు. అయితే సాధారణంగా ఎక్కువగా ఉండే ఆకలిని, అతి దాహాన్ని డయాబెటిస్‌కు సూచనగా గుర్తించడంలో చాలామంది విఫలమవుతారు. అయితే చర్మం కూడా డయాబెటిస్‌కు ఒక సూచన. సాధారణంగా చర్మంలో కనిపించే మార్పులతోనూ డయాబెటిస్‌ గుర్తించవచ్చు.
చర్మంపై చూపే దుష్ఫ్రభాలు : చర్మంపై చక్కెర చూపే చెడ్డ ప్రభావాలు రెండురకాలుగా ఉంటాయి.
మొదటిది : చాలామంది మధ్యవయస్కులు, బరువు ఎక్కువగా ఉన్నవారిలో..మెడపై ఉండే చర్మం దళసరిగా మారుతుంది. అది మందం పెరగడమే కాకుండా నల్లగా కూడా అవుతుంది. దీన్నే వైద్య పరిభాషలో అకాంథోసిస్‌ నెగ్రిగాన్స్‌ అంటారు
చాలా మంది ఇలా చర్మం నల్లబారడాన్ని బంగారు ఆభరణాలు వేసుకోవడం కారణంగా వచ్చే అలర్జీగా భావిస్తుంటారు. బంగారు ఆభరణాలు ఒరుసుకుపోవటం వల్లనో, ఎండకు అతిగా ఎక్స్‌పోజ్‌ కావడం వల్లనో అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇలాంటి చాలా సందర్భాలలో అది షుగర్‌ వల్ల కావచ్చునేమో అని అనుమానించాలి.
ఇక మరి కొందరిలో చర్మంపై పులిపిరి కాయల వంటి కనిపిస్తాయి. వీటిని పులిపిరులుగానే పరిగణిస్తుంటారు. ఒకేచోట ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో కనిపించవచ్చు. యుక్తవయస్కుల్లో ఇవి కనిపించినపుడు వాటిని పులిపిరికాయలుగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి చర్మవ్యాధి నిపుణులకు చూపించడం చక్కెర పరీక్ష చేయుంచుకోవడం అవసరం.
రెండోరకం: చక్కెర వ్యాధి వల్ల రక్తనాళాల్లో ప్రమాదకరమైన ప్రోటీన్లు క్రమంగా పోగుపడి రక్తనాళాల చివరలు మందమై చర్మం చివర్లో పుండుగా మారవచ్చు. సాధారణంగా పాదాలకు ఈ పుండ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఈ పుండ్లు క్రమంగా తీవ్రమై గాంగ్రీన్‌గా మారవచ్చు దాంతో ఒక్కోసారి ఆ పుండు తీవ్రమైతే కాలినే తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.
ఇతర ఇన్ఫెక్షన్లు : డయాబెటిస్‌ కారణంగా చర్మంపై ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. ఈ ఇన్పెక్షన్లు మామూలు వ్యక్తులలో కూడా కనిపించినా షుగర్‌ వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధక శక్తి తగ్గడం, చక్కెరపాళ్ళు వల్ల ఇవి ఎక్కువగా కనిపించవచ్చు, అవి:
బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ : స్ట్రెప్టోకాక్సీ, స్లెఫాలోకాక్సీ వంటి బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు వల్ల చర్మంపై గడ్డలు, ఇతర ఇన్ఫెక్షన్లు రావచ్చు. చాలా అరుదుగా సీడోమొనాస్‌ అనే బ్యాక్టీరియా చెవిలోకి వెళ్ళి ప్రమాదకరమైన కండిషన్‌కు దారితీయవచ్చు.
ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ : చాలామందిలో మర్మావయవ ప్రాంతాల్లో కాలివేళ్ల మధ్యన క్యాండియా అనే ఫంగస్‌ వల్ల దురదలు రావచ్చు. చక్కెరవ్యాధి ఉన్న వారిలో ఈ సమస్య తరచూ వస్తుంది. చాలామందిలో కాలిగోళ్లు ముఖ్యంగా బొటనవేలి గోరు రంగు కోల్పోయి మందంగా మారుతుంది. చాలా అరుదుగానే అయినా కొంతమందిలో చక్కెర అదుపులో లేకుండా పోయి రక్తంలో మలినాలు పేరుకుపోయి కండిషన్‌ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో రైనోసెబ్రల్‌ మ్యూకార్‌ మైకోసిస్‌ అనే ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ ముక్కులో మొదలై వేగంగా మొదడుకి వ్యాపించి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.
ఒంటిపై దురదలు : చక్కెరపాళ్ళు పెరగడం అన్నది నేరుగా దురదను కల్పించకపోయినా పెద్ద వయసు వాళ్లలో చక్కెర ఉన్నపుడు దురదలు రావడం మామూలే. వయసు పైబడటం కొలస్ట్రాల్‌ను అదుపు చేయడానికి మందులు వాడుతున్నందున చర్మం పొడిబారిపోవడం కూడా చర్మం దురదలకు కారణం చక్కెర కారణంగా మూత్రపిండాల వ్యాధి మలిదశలో బాగా ముదిరినప్పుడు ఇలా ఒంటిపై విపరీతమైన దురదలు రావచ్చు. స్పర్శజ్ఞానంలో మార్పులు : చక్కెర వ్యాధి వల్ల చర్మం చివర్లలలో రక్తప్రసరణ సరిగా కాకపోవడం వల్ల ఒక్కోసారి స్పర్శలో మార్పులు కూడా సంభవించవచ్చు. విగతా అవయవాలన్నింతో పాటు చర్మంపై కూడా చక్కెర దుష్ఫ్రభావం తగ్గించాలంటే మొదట చేయాల్సింది చక్కెరను నియంత్రించుకోవడమే.
చర్మంపై మార్పులు గుర్తించినపుడు : చర్మంపై దళసరి వల్ల మచ్చలు కనిపించడం, చర్మం బాగా ముడుచుకుపోయినట్లుగా ఉండి పులిపిరి కాయల్లాంటివి కనిపించడాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. రక్తంలో చక్కెరను నియంత్రించే ఇన్సులిన్‌ సక్రమంగా పనిచేయడం లేదనడానికి ఇది ఓ సూచనగా పరిగణించాలి. ఇలా చర్మం మందంగా మారుతున్నపుడు అది రక్తంలో పెరుగుతున్న చక్కెర పాళ్ళకు ఒక సూచనగా భావించి వెంటనే పరీక్షలు చేయించాలి.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s