📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

About Me_Gardening

పున్నమి చంద్రుడు

తక్కువ శ్రద్ధతో, సులువుగా పెంచుకోగలిగిన అందమైన మొక్కల్లో మరొకటి పున్నమి చంద్రుడు. దీన్ని ‘‘మ్యూజికల్ నోట్’’ అనీ, ‘‘మార్నింగ్ కిస్’’ అనికూడా అంటారు. దీని శాస్త్రీయనామం క్లీరో డెండ్రమ్ ఇన్సిజమ్పున్నమి చంద్రుడు 2 నుంచి 3 అడుగుల ఎత్తువరకు పెరగగల చిన్నపొద. పచ్చని ఆకులతో గుబురుగా పెరుగుతుంది. దీని ఆకులు రంపపు పళ్లవంటి అంచులతో ఉంటాయి. ఈ మొక్క ప్రత్యేకత అంతా దీని పూలు, మొగ్గలే. ఈ మొగ్గల సన్నని పొడవాటి కాడల చివర గుండ్రని బిళ్ళల్లాగా […]

పున్నమి చంద్రుడు Read More »

Rose Cactus ………గులాబీ బాల ….ముళ్ళచెట్టు

రోజ్ కాక్టస్…..ఒళ్ళంతా ముళ్ళుండే కాక్టస్ జాతికి చెందినది. కాకపోతే ఇది కాక్టస్ లా ఉండదు. నున్నగా ఉండే కాండం మీద ముళ్ళుంటాయి. దీనికి. ఇది కాక్టస్ జాతికి చెందిన మొక్క అని చేప్పే ఏకైక అంశం ఇదొక్కటే. అది తప్ప దీని ఆకులు, పూలు, కొమ్మలు, దేన్ని చూసినా మనకు అలా అనిపించవు. అంతేకాదు ఆకులతో నిండుగా ఉండే కాక్టస్ రకం కూడా ఇదొక్కటే. అరుదైన ఈ కాక్టస్ శాస్త్రీయనామం పెరెస్కియా బ్లియో. ఆకు కాక్టస్, మైనం

Rose Cactus ………గులాబీ బాల ….ముళ్ళచెట్టు Read More »

Centella … సరస్వతీ ఆకు

సరస్వతీ ఆకును ‘సెంటెల్లా’, ‘గోటుకోలా’, ‘ఫౌంటేన్ ఆఫ్ యూత్’ అని రకరకాలుగా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని మండూక పర్ణి అంటారు. దీని శాస్త్రీయ నామం ‘సెంటెల్లా ఏషియాటికా’. ఇది మన ఆసియా ఖండానికి చెందిన మొక్క.సరస్వతీ ఆకు తడినేలలో పెరిగే బహువార్షికం. నేలమీద పాకే కాండంతో, ప్రతి కణుపు వద్దా వేర్లతో అల్లుకుపోతుంది. ఈ మొక్క తేమగా ఉండే నేలలో, చల్లని వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఇది చిన్నగా ఆరు అంగుళాలు మించని ఎత్తులో నేలమీద నుంచి

Centella … సరస్వతీ ఆకు Read More »

కెలాధియా

కెలాధియా మరాంతాలను, అగ్లోనిమాలను పోలి ఉండి, ఇంట్లో పెంచుకోవడానికి అనువైన అందమై మొక్క కెలాధియా. ఆకుల మీద ఉండే మచ్చలు లేదా చారల వల్ల దీన్ని నెమలిమొక్క, జీబ్రా మొక్క అని కూడా అంటారు. వీటిని సాధారణంగా అందమైన ఆకులకోసం పెంచుతారు. ఈ ఆకులు రకాన్నిబట్టి వివిధ పరిమాణాల్లో ఆకారాల్లో ముచ్చట గొలుపుతాయి. ఏ రకానికదే మనోహరంగా, సహజమైనది కాదు కృత్రిమమైనదేమో అనిపిస్తూ ఎవరైనా చేయి తిరిగిన కళాకారుడి అద్భుతమైన సృష్టేమో అని భ్రమింప చేస్తుంది.రెండడుగుల వరకూ

కెలాధియా Read More »

రంగురంగుల హైడ్రాంజియా

రంగురంగుల హైడ్రాంజియా రంగురంగుల హైడ్రాంజియా ఏడాదంతా పూస్తూ, ముదురాకుపచ్చ ఆకులతో కనువిందు చేస్తుంది హైడ్రాంజియా. ఇది బహువార్షిక పొద. వర్షాకాలం, చలికాలంలో పూత ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణం ఈ పొద పెరగడానికి చాలా అనుకూలం. దీన్ని పెంచే నేల తేమగా, సారవంతంగా, గుల్లగా ఉండాలి. ఇసుక పాలు ఎక్కువగా ఉండే మట్టిలో కంపోస్టు లేదా వర్మీకం పోస్టు, కొంచెం వేపపిండి, కొద్దిగా సూపర్ ఫాస్పేట్ కలిపి నాటుకోవాలి. రెండు మూడు నెలలకొకసారి ఒక టేబుల్ స్పూన్

రంగురంగుల హైడ్రాంజియా Read More »

శంఘుపూల చెట్టు

సీతాకోక చిలుక చెట్టు శంఘుపూల చెట్టు దాదాపు ఐదు నుంచి ఆరు మీటర్ల ఎత్తువరకు పెరగగలదు. దీని పూలు శంఖుపూల మాదిరిగానే ఉన్నా ఇంకా అందంగా, పెద్దగా ఊదారంగులో ఉంటాయి. దీని ఆకులు పెద్దగా అండాకారంలో, ముదురాకు పచ్చ రంగులో మెరూస్తూ కనువిందు చేస్తాయి. పూలతో ఉన్నప్పుడు అద్భుతంగా కనిపించే ఈ చెట్టు పూలు లేనప్పుడు కూడా పచ్చగా ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గొడుగు ఆకృతిలో … శంఖుపూల చెట్టు వేగంగా పెరుగుతుంది. కొద్దిగా సాగినట్లుండే కొమ్మలతో

శంఘుపూల చెట్టు Read More »

రోజ్ మేరీ

sరోజ్ మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద. వంటలలో కొత్తిమీరలాగా దీన్ని ఎక్కువగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటలలో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్ లు, సూపులలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్ టీ కూడా తయారు చేస్తారు.రోజ్ మేరీ శాస్త్రీయనామం రోజ్ మారినస్ అఫిషినాలిస్. బూడిదరంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదులలాంటి సన్నని ఆకులతో సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్నపొద.నీరు

రోజ్ మేరీ Read More »

సైకస్

సైకస్ అలంకరణ మొక్కలలో అత్యంత ఆదరణ పొందినది సైకస్. అతి పురాతనమైనది ఈ మొక్క శాస్త్రీయనామం సైకస్ రెవల్యూటా. దీనినే కింగ్ సాగో పామ్ అని కూడా అంటారు. ఇది కోనిఫర్ జాతికి చెందినది. సుమారు 20 కోట్ల సంవత్సరాల నుండి మొక్క ఉన్నట్లు చెబుతారు. అందుకే సజీవ శిలాజం అంటారు. సైకస్ లోని అనేక రకాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నా తూర్పు ఆసియా ప్రాంతానికి చెందిన సైకస్ రెవల్యూటా మాత్రమే శతాబ్ధాలుగా తోటల రూపకల్పనలో ఉపయోగపడుతుంది. ఏ

సైకస్ Read More »

పోల్కాడాట్

చూడచక్కని పోల్కాడాట్ చూడచక్కని పోల్కాడాట్ గులాబీ, ఎరుపు లేదా తెలుపు మచ్చలూ, చుక్కలతో కూడిన చిత్రపటం లాంటి ఆకులు దీని సొంతం. అందుకే దీన్ని పోల్కాడాట్ అని పిలుస్తుంటారు.పోల్కాడాట్ శాస్త్రీయనామం హైపోస్టెస్ ఫైలోస్టాకియా. ఇది ఏకవార్షికం. ఆరు అంగుళాల నుంచి అడుగున్నర ఎత్తువరకూ పెరిగే ఈ సుకుమారమైన ముచ్చటైన మొక్క కొద్దిపాటి నీడలో చక్కగా పెరుగుతుంది. అయినా ప్రకాశవంతమైన వెలుతురు మాత్రం తప్పనిసరి. పోల్కాడాట్ కు గాలిలోనూ, నేలలోనూ తేమ ఎక్కువగా ఉండాలి. మట్టి మిశ్రమం నీరు

పోల్కాడాట్ Read More »

Parsian Shield-స్ట్రోబిలాంతస్

ఈ మొక్కనే పర్షియన్ షీల్డ్ అనికూడా అంటారు. ఇది అందమైన ఆకులు ఇష్టపడే ప్రతి ఒక్కరి దగ్గరా తప్పక ఉండవలసిన మొక్క. మొత్తని కొమ్మలతో గుబురుగా పెరిగే చిన్నపొద ఇది.అడుగు నుండి రెండడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది. కాండం పలకలుగా ఉంటుంది.ఆకుల చివర్లు సాగి మొనదేలి ఉంటాయి. ఇవి ఆకుపచ్చ, గులాబీ, ఊదా, వెండి రంగుల మిశ్రమంతో లోహపు మెరుపుతో అద్భతంగా కనిపిస్తాయి. ఈ మెరుపు వలనే దీనికి పర్షియన్ షీల్డ్ అన్నపేరు వచ్చింది. పేరులో పర్షియా ఉన్నా

Parsian Shield-స్ట్రోబిలాంతస్ Read More »

Painted Leaf Bigonia – రెక్స్ బిగోనియా

వర్ణచిత్రాలు అనిపించే ఆకులతో అందంగా అలరించేవే రెక్స్ బిగోనియా. పెయింటింగ్ బిగోనియా అని పిలిచే ఇవి తగినంత వెలుతురు కనుక అందితే ఇంటిలోపలా చక్కగా పెరుగుతుంది. కాంతి ధారాళంగాతగిలే ప్రదేశాలైన వరండాలు, బాల్కనీలు, కిటికీల పక్కన పెంచుకోవడానికి బాగుంటుంది. వీటిల్లో అనేక సంకర రకాలు ఉన్నాయి. ఎరుపు, ఊదా, గులాబీ, వెండి వంటి ప్రకాశవంతమైన రంగులు కలిసిన ఆకులతో కంటికింపుగా కనిపిస్తుంది. దీని ఆకులు పెద్దగా పెద్దగా ఉండి చారలు,చుక్కలు, అంచులతో వివిధ ఆకృతుల్లో కనిపిస్తూ కిందకి

Painted Leaf Bigonia – రెక్స్ బిగోనియా Read More »

మోనా లావెండర్ ఇంటికే అందాలు

మోనా లావెండర్ ను 1990లో ఆఫ్రికాలో సృష్టించినా మన దగ్గర వాడకంలో వచ్చింది మూడు, నాలుగేళ్ళ క్రితమే. మోనా లావెండర్ పుదీనా కుటుంబానికి చెందినది. సాధారణంగా ఈ కుటుంబానికి చెందిన మొక్కలన్నింటిని ఆకుల కోసం పెంచుతారు కానీ ఈ మొక్కలను మాత్రం పూల కొరకే పెంచుతారు. ఇది చిన్న పొదలాపెరిగే బహువార్షికం. ఒకటి నుండి రెండడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.అదీ వేగంగా, దీని ఆకులు అండాకారంలో ముదురాకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఆకుల అడుగు భాగం ఊదారంగులో ఉంటుంది.

మోనా లావెండర్ ఇంటికే అందాలు Read More »

Flaming Sword – కత్తిలాంటి పూలు

చూడ చక్కని ఆకృతి, ఆకట్టుకునే రంగుల్లో ఆకులు కొన్ని నెలల పాటు తాజాగా ఉండే పూలూ…ఫ్లేమింగ్ స్వోర్డ్ ప్రత్యేకతలు. బాల్కనీలూ, కిటికీలూ,మెట్ల దగ్గర పెంచుకునేందుకు అనువైన మొక్కలు ఇవి.వీటిలో ఆకు, పువ్వులు,రంగులను బట్టి వందల రకాలున్నవి.ఎర్రని కత్తిలాంటి పుష్పగుచ్ఛం మొక్కకు పూయడం వల్ల ఈ పేరు వచ్చింది. ఇంటి లోపల పెంచుకోవటానికి అనువైనది. సుమారు రెండువందల యాభై రకాలలో లభించే ఈ మొక్క సహజంగా అడవులలో ఇతర మొక్కల మీద ఆధారపడి పెరుగుతుంది. ఇంట్లో పెంచేందుకు ప్రత్యేకమైన

Flaming Sword – కత్తిలాంటి పూలు Read More »

Haricane, Chees Plants, Monsterani Plants…..అందమైన హరికేన్

పెరట్లో నిండుదనం రావాలంటే మాన్ స్టెరాని హరికేన్ మొక్కను పెంచుకోవాల్సిందే. దీనినే చీజ్ ప్లాంట్ అనికూడా అంటారు. ఇతర చెట్లను ఆధారంగా చేసుకుని గాలివేర్ల సాయంతో ఎదుగుతుంది. ఇది ఉష్ణమండలానికి చెందిన మొక్క. ఇంట్లో పెంచుకునే మొక్కలలో దీనిదే ఆగ్రస్థానం.అనుకూల పరిస్ధితులలో 20 మీటర్ల వరకూ పెరుగుతుంది. దీని ఆకులు హృదయాకారంలో, ముదురాకుపచ్చ రంగులో పెద్దగా ఒకటినుండి రెండడుగుల పొడవు, దాదాపు అంతే వెడల్పుతో మెరుస్తూ ఉంటాయి. మధ్యలో తెలుపూ,మరికొన్ని రంగులతో వరిగేషన్ రకాలుగా వస్తున్నవి చాలా

Haricane, Chees Plants, Monsterani Plants…..అందమైన హరికేన్ Read More »

అందమైన జీబ్రా మొక్కలు

మనం సాధారణంగా చూసే మొక్కలలో చాలావరకు పువ్వులు లేకపోతే ఆకులలో ఏదో ఒకటి అందంగా ఉంటుంది. రెండూ అందంగాఉండే మొక్కలు చాలా అరుదు. జీబ్రా మొక్క అలాంటి అరుదైనది. ముదురాకు పచ్చరంగు మీద ప్రస్పుటంగా కనిపించే తెల్లని చారలున్న ఆకులు దీని సొంతం. ఇవి జీబ్రాని తలపిస్తాయి కాబట్టే ఈ మొక్కలకు ఆపేరు. దీని శాస్త్రీయనామం స్వ్కారోజా. అందుకే ఎపిలాండ్రా అనికూడా అంటారు. ఇది నీడలో పెరిగేమొక్క. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోకూడా చక్కగా పెంచుకోవచ్చు. సాధారణంగా

అందమైన జీబ్రా మొక్కలు Read More »

Anti Mosquito Plants……దోమలను దూరంగా ఉంచే మొక్కలు

బంతిమొక్కలు :బంతిమొక్కల ఆకులూ, పూలలో ఉండే పైరిత్రమ్ అనే పదార్ధం ఘూటైన వాసనతో దోమల్ని, కీటకాలను తరిమి కొడుతుందట. వీటిని కుండీలలో పెంచి కిటికీల దగ్గరా, గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు. కానీ వీటికి ఎండ తప్పనిసరిగా తగలాలి.. అంతే కాదు టొమాటో మొక్కలమీద పెరిగే కీటకాలను నిరోధిస్తుంది కనుక టొమాటో తోటలలో కూడా పెంచుకోవచ్చు.అగిరేటమ్ :తెలుపు లేదా ఊదారంగు పూలు పూసే ఈ మొక్కను తెలుగులో కంపురొడ్డ, పోకబంతి అంటారు. గడ్డి మొక్కలు లాగా పెరిగే ఈ

Anti Mosquito Plants……దోమలను దూరంగా ఉంచే మొక్కలు Read More »

Air Freshner Plants …. గాలిని శుద్ధి చేసే మొక్కలు

ఆలోవెరా (కలబంద) మొక్క :ఈ మొక్కలు గాలిలోని హానికారక ఫార్మాల్డి హైడ్, బెంజిన్లాంటి పదార్ధాల శుద్ధికి ఎంతో ఉపయోగ పడుతుంది. కొత్తగా పెయింట్లు వేసిన ఇళ్లకూ ఇది మంచిది. సాధరణ మొక్కలకు భిన్నంగా ఇది రాత్రిపూట కార్పన్ డై ఆక్సైడ్ ను తీసుకొని అధిక మొత్తంలో ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అందువలన పడక గదులలో వీటిని పెట్టుకోవచ్చు.పీస్ లిల్లీలు :ఈ మొక్కలు శ్వాస ఇబ్బందులను కలిగించే ట్రైక్లోరో ఇధిలీన్, అమ్మోనియాలను గాలి నుంచి తొలగించేందుకు సహకరిస్తాయి.క్రిస్మస్

Air Freshner Plants …. గాలిని శుద్ధి చేసే మొక్కలు Read More »

Marigold Plants…ముద్ద బంతులు

బంతి శాస్త్రీయ నామం టాజిటస్. ఇందులో ఆఫ్రికన్, ఫ్రెంచ్ రకాలున్నవి. ఫ్రెంచ్ రకాలంటే మన కారబ్బంతులన్న మాట. బంతి అన్ని రకాల నేలలోనూ పెరుగుతుంది.అందుకు సారవంతమైన నీరు నిలవని మట్టి అవసరం పూర్తి సూర్యకాంతి తప్పనిసరి బంతి మొక్కలు 40 నుండి 45 రోజులలో పూతకు వచ్చి తరువాత రెండు నెలల వరకు పూస్తూనే ఉంటాయి.పూలు చక్కగా రావాలంటే సరైన రకాలను ఎన్నకోవాలి. విత్తనాల ఎంపికలో జాగ్రత్త లు పాటించాలి. విత్తనాలు 1-2 సంవత్సరాలు వాడుకోవచ్చు. తరువాత

Marigold Plants…ముద్ద బంతులు Read More »

Roses…గులాబీలు

గులాబీ రకాలలో సువాసనకు పేరొందినవి డమాస్కస్ గులాబీలు. వీటిని గులాబీ నూనె, రోజ్ వాటర్, గుల్కండ్ వంటివి తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. హెర్బల్ టీలలోనూ వాడతారు. డమాస్కస్ గులాబీలలో జ్వాల, హిమ్రోజ్, హాట్ హిమ్రోజ్ వంటి హైబ్రీడ్ రకాలు ఉన్నాయి. ఈ గులాబీలు చూడడానికి అందంగా ఉంటాయి. చాలా పరిమళాన్ని ఇస్తాయి. ఔషధ గుణాలు కూడా ఎక్కువే.సువాసనతో కూడిన హైబ్రీడ్ టీ గులాబీలూ అందుబాటులోకి వచ్చాయి. వాటీలో ముఖ్యమైనవి షర్బత్, రక్తిమా, అనురాగ్, జవహర్, నూర్జహాన్,

Roses…గులాబీలు Read More »

పరిమళాల జూకామల్లె

జూకామల్లె మనదేశానికి చెందిన లత. పచ్చని ఆకులతో గుబురుగా అల్లుకొని గిన్నెలాంటి చిన్నచిన్న మీగడరంగు పూలతో విరగబూస్తుంది.సాయంకాలాలను తన మనోహరమైన సువాసనతో మరపురానివిగా మార్చేస్తుంది. గిన్నె మాలతికి ఎండ బాగా తగలాలి. కొద్దిపాటి నీడలోనూ ఎదుగుతుంది. ఇది కుండీలలో చక్కగా పెరుగుతుంది. పందిరి మీదికి, కంచెల మీదకి అల్లుకునేలా చేస్తే బాగుంటుంది. పొదలాపెరిగే తత్వం వల్ల ఎక్కువగా తీగలు సాగకుండా, నిండుగా కనిపిస్తుంది. దీన్ని కత్తిరిస్తూ సులభంగా మనకు కావలసినట్లు పెంచుకోవచ్చు.దీనికి సారవంతమైన నేల ఉంటే బాగుంటుంది.

పరిమళాల జూకామల్లె Read More »

లోరె పెటాలమ్

ముదురు గులాబీ రంగు పూలు, అండాకారంలో నిగారింపుతో కనిపించే ఆకులు లోరోపెటాలమ్ ప్రత్యేకత. వీటిలో అనేక రకాలున్నప్పటికీ, ఎక్కవ వాడుకలోకి వచ్చంది లోరోపెటాలమ్ చైనీ సుబ్రం. వీటికి బద్దెల్లాగుండే పూలరెక్కల వలన వీటికి ఆ పేరు వచ్చింది.ఈ మొక్కలు మూడునుండి ఐదుఅడుగుల ఎత్తువరకు పెరిగే పొద. ఆకులు గోధుమ కలిసిన ఎరుపు రంగులో అండాకారంలో కొనదేలి ఉంటాయి.పూలు ముదురు గులాబీ రంగులో కంటికింపుగా కనిపిస్తాయి. ఒకటి రెండు సెంటీ మీటర్లలో బద్దెల్లాగా నాలుగు నుంచి ఆరు రేకలు

లోరె పెటాలమ్ Read More »

మాల్ఫిజియా పూల మొక్కలు

మెరిసే ఆకులు, నక్షత్రాల లాంటి పూలు, పగడాలని గుర్తు చేసే కాయలతో నిండుగా కనిపించే మొక్కలు మాల్ఫిజియా మాల్ఫీజియా మొక్కకు . తెలుపు, గులాబీ రంగుల పూలు ఏడాదంతా పూస్తాయి. ఈ మొక్కల ఆకులు హోలీ మొక్కను పోలి ఉండటం వల్ల దీన్ని సింగపూర్ లేదా డ్వార్ఫ్ హోలీ అని పిలుస్తారు. ఇది ఒకటి నుండి మూడడుగుల ఎత్తలో పెరిగే చిన్నపొద గుబురుగాముళ్లతో ఉండి కత్తిరింపులకు బాగా తట్టుకుంటుంది. దీని చిన్న ఆకులు ముదురాకు పచ్చ రంగులోమెరుస్తూ

మాల్ఫిజియా పూల మొక్కలు Read More »

తంబర్జియా

కంటి కింపైన రంగుల పూలతో పెరిగే తీగజాతి మొక్కలివి. ఈ మొక్కలు మన దేశానికి చెందినవే. నీలి, ఊదా రంగు పూలతో ప్రకాశవంతమైన కాషాయరంగులో నల్లని కంఠం గల పూలతో అలరించే బ్లాక్ ఐడ్ సుశాన్, తెల్లపూలు కలిగిన తంబర్జియా అల్ఫా, ఊదా రంగు పూలతో నీలి తంబర్జియా అన్నీ మనోహరంగాఉంటాయి. ఇవన్నీ ఏడాది పొడవునా పూలు పూస్తూ ఉండే తీగజాతి మొక్కలు. ఈ మొక్కలు చాలా వేగంగా ఎదుగుతాయి. త్వరగా పూయడం మొదలు పెట్టి ఏడాదంతా

తంబర్జియా Read More »

నోలీనా మొక్కలు

ముచ్చటైన ఆకృతితో ఎక్కడైనా పెంచుకునే అవకాశం ఉన్న మొక్కలు నోలినా.నోలినాను ముద్దుగా పోనీటైల్ పామ్, బాటిల్ పామ్,ఏనుగుపాదం మొక్క అని కూడా పిలుస్తారు. కాండం పైన సన్నగా కింద బంతి లాగా, బలంగా వెడల్పుగా ఉంటుంది. ఆహారాన్ని ఇవి కాండంలో దాచుకుంటాయి. మెక్సికో దేశానికి చెందిన ఈ మొక్కలు ఇప్పుడు అన్ని దేశాలలో లభిస్తున్నాయి. .తక్కువ నీటితో ఆరోగ్యంగా పెరుగుతాయి నోలీనా మొక్కలు. వయసు బాగాపెరిగినప్పటి నుండి చిన్న చిన్న కొమ్మలు వస్తాయి. వీటి ఆకులు కొమ్మ

నోలీనా మొక్కలు Read More »

వాడామల్లి

గులాబీలను పోలి ఉండి ఇంటికి కళను తీసుకు వస్తాయి ఈ పూలు. వీటిని గోమ్ ఫెర్నా అంటారు. శివుడికి, కుమారస్వామి బాగా ఇష్టమైన పూలు. ఒకసారి నాటితే ఏడాది వరకూ పూలుపూసే మొక్కలు ఇవి. నేలలోనూ, కుండీలలోనూ పెంచు కోవచ్చు. విండో ప్లాంటర్ల లో పెంచుకోవచ్చు. వెడల్పు మూతి కలిగిన వాటిని ఎంచుకుంటే మంచిది. పూలువాడిన తరువాత అవి తొట్టిలోనే పడి వాటినుంచి విత్తనాలు నేలపై పడి కొత్త మొక్కలు కొన్నివారాలలోనే పెరుగుతాయి.ఒక మొక్క చనిపోయేలోగా దాని

వాడామల్లి Read More »

ఐస్ ప్లాంట్ మొక్కలు

చిన్న చిన్న అందమైన పూలతో ప్రకాశవంతమైన పచ్చని ఆకులతో కనువిందు చేసే మొక్కలు ఐస్ ప్లాంట్ మొక్కలు. ఇంట్లో పెంచుకోవటానికి మరియు లాండ్ స్కేపింగ్ కు అనువుగా ఉంటాయి. సారవంతం కాని, నీటి వసతి లేని భూములలో కూడా చక్కగా త్వరగా, దట్టంగా పెరుగుతాయి. ఎలాంటి పరిస్థితులలై నైనా చక్కగా పెరుగుతాయి.. రెండునుండి నాలుగడుల వరకూ విస్తరించే మొక్కలు ఇవి. వాలులో నాటటానికి, రాక్ గార్డన్ లోనూ, లాన్ల కోసం, కాలి బాటల పక్కన పెంచితే అందమైన

ఐస్ ప్లాంట్ మొక్కలు Read More »

రాక్ క్రీపర్

Rock Kreeper Plants….రాక్ క్రీపర్ఇళ్లపై అందంగా పెరిగే మొక్కే రాక్ క్రీపర్. దీని శాస్త్రీయ నామం పైకస్ ప్యుమిలా లేక పైకస్ రిటర్న్. ఈ మొక్కలను కాంక్రీట్ భవనాలను పచ్చగా మారుస్తాయి. తక్కువ సమయంలో అందమైన టోపియరీలుగా రూపొందించుకునే వెసులుబాటు ఉంది. వీటిని పెంచుకోవటం చాలా సులువు. ఎలాంటి నేలలోనైనా పెరుగుతాయి. ఎక్కువ ఎండలోనూ కొద్దిపాటి నీడలోనూ పెరుగుతాయి. సాధారణంగా రెండు నుంచి ఏడు మీటర్ల ఎత్తులో పెరుగుతాయి.ఇంకా శ్రద్ధ తీసుకుంటే రెండు, మూడు అంతస్తులపైన కూడాపెరిగి

రాక్ క్రీపర్ Read More »

లిల్లీ పిల్లీ మొక్కలు

తెల్లటి పూలు, రంగుల ఆకులతో ఈ చెట్లు నిండుదనంగా ఉంటాయి. వీటి శాస్త్రీయ నామం సిజీయం ఫ్లోరిబండా. వీటి పుట్టుక ఆస్ట్రేలియా, మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం లోనికి వస్తున్నాయి.రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తులో పెరిగే మొక్కలు ఇవి. గుబులుగా నిలువుగా పెరుగుతూ కత్తిరించేందుకు అనుకూలంగా ఉంటాయి. వీటి లేత ఆకులు ముదురు ఎరుపురంగులో ఉండి క్రమంగా ఆకుపచ్చ వర్ణంలోనికి మారి మెరుస్తూ ఉంటాయి. వీటి పూలు చిన్నవిగా, తెలుపు రంగులో ఉండి మంచి వాసన

లిల్లీ పిల్లీ మొక్కలు Read More »

కలుపు మొక్కలు

మొక్కలు బాగా పెరగాలంటే కలుపు మొక్కలు తీసేయాలి. ఎందుకంటే కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తీసెయ్యకపోతే అసలు మొక్కలు త్వరగా పెరగవు. పైగా ఇవి ఎక్కడైనా పెరుగుతాయి. ఆకుకూరల మడిలో, పూలమొక్కల పక్కన, కుండీల్లో, లాన్‌లో…కలుపు మొక్క కనపడని, పెరగని ప్రదేశం లేదు. మనం ఇష్టపడి పెంచుకుంటున్న మొక్కల కంటే ఇవి స్పీడ్‌గా పెరుగుతాయి. దాంతో, మట్టిలోని న్యూట్రియెంట్స్, నీరూ, సూర్యరశ్మి, స్పేస్…అన్నీ అవే లాగేసుకుంటాయి. ఈ కలుపు మొక్కల లక్షణాలు..– మామూలు మొక్కలు, కలుపు మొక్కలకీ తేడా

కలుపు మొక్కలు Read More »

Scroll to Top