📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Yanam Updates 21-02-2026

Google ad
ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు

యానాం నియోజకవర్గ శివారు దరియాలతిప్ప ఆయకట్టుకు సాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని శుక్రవారం ఎమ్మెల్యే గోలపల్లి శ్రీనివాస్ అశోక్ అధికారులకు ఆదేశించారు. వెలాది రూపాయల పంటలు సాగునీటి ఎద్దడితో నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులతో సమావేశమై పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే, వెంటనే కాలువల ప్రక్షాళన, బ్యాంక్ వాటర్ గోడావరిలో వెనుకబడిన క్రాస్‌బండ్లు వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు జోనల్ అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

ఓఎన్‌జీసీ పరిహారం, తదితర డిమాండ్ల సాధన కోసం దరియాలతిప్ప, బాలయోగికాలనీ, సీతారామనగర్, దోమేటివారిపేట గ్రామాలకు చెందిన రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి 130వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దరియాలతిప్పకు చేర్చి ఉన్న ఐలాండ్-5 ప్రాంతంలో 5వేల కిలోల ఓఎన్‌జీసీ గ్యాస్‌పైప్ లీక్ కావడంతో అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు. దీంతో పరిహారం చెల్లించాలని తమ గ్రామ ప్రజలు ఎన్నో రోజులుగా ఆందోళన చేపడుతున్నారని చెప్పారు. ఓఎన్‌జీసీ సంస్థ నుంచి తమ గ్రామాల దత్తత, పరిహారం, జీవన భద్రత అంశాలపై సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Google ad

ఏప్రిల్‌లో జరగనున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇక్కడి చర్రలు చేపడుతున్నట్లు యానాం ఎస్పీ కె. వరదరాజన్ తెలిపారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ట్రాఫిక్ బోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించి మీనాల వెంకన్న కళ్యాణోత్సవాలు, ఎన్నికల ప్రచారాల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రత చర్యలపై చర్చించినట్లు చెప్పారు. యానాం పరిధిలో పది చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల సేత్రాల్లో జరిగే సమావేశాలపై నిఘా ఉంచుతున్నామని తెలిపారు. అదనంగా సీసీటీవీ పర్యవేక్షణ, ప్రత్యేక పోలీస్ బలగాల వినియోగం చేపడుతున్నామని వివరించారు.

Google ad

Google ad
Google ad
Google ad
Google ad
Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading