Logo Raju's Resource Hub

రోజ్ మేరీ

Google ad

sరోజ్ మేరీ పుదీనా కుటుంబానికి చెందిన ఆకర్షణీయమైన చిన్న పొద. వంటలలో కొత్తిమీరలాగా దీన్ని ఎక్కువగా వాడతారు. ప్రధానంగా మాంసాహార వంటలలో సువాసనకు వాడినా, శాకాహార వంటల్లోనూ, బ్రెడ్ లు, సూపులలోనూ కూడా విరివిగా వాడతారు. హెర్బల్ టీ కూడా తయారు చేస్తారు.
రోజ్ మేరీ శాస్త్రీయనామం రోజ్ మారినస్ అఫిషినాలిస్. బూడిదరంగు కొమ్మలు, ఆకుపచ్చని సూదులలాంటి సన్నని ఆకులతో సుకుమారమైన సువాసనగల ప్రకాశవంతమైన నీలిరంగు పూలతో అందంగా ఉంటుంది. దాదాపు మూడు అడుగుల ఎత్తువరకు పెరిగే చిన్నపొద.నీరు నిలవని ఇసుక నేలలో చల్లటి వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. దీనికి ఆరునుంచి ఎనిమిది గంటలపాటు ప్రకాశవంతమైన వెలుతురు అవసరం. అలాని ఎండ తీవ్రత ఎక్కువ ఉండకూడదు. నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. మన దగ్గర సూటిగా ఎండపడని చోట నాటుకుంటే మంచిది. మట్టి మిశ్రమంలో ఇసుక, కోకోపిట్ పాళ్ళు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఎండాకాలంలో కొబ్బరిపీచుతో మొక్క చుట్టూ కప్పితే తేమ ఉండి వేళ్లకు చల్లగా ఉంటుంది.
రెండు రకాల్లో…
రోజ్ మేరీ నెమ్మదిగా పెరుగుతుంది. ఆకు పచ్చిదైనా, ఎండుదైనా కూడా వంటలలో వాడతారు. ఆకు కోసేటపుడు గ్రీవం పైన తుంచుకుంటే చిగుళ్ళు తొందరగా వస్తాయి. దీన్ని నచ్చిన ఆకృతిలో కత్తిరించుకోవచ్చు.
ఒకసారి నాటిన రోజ్ మేరీలోని రెండు రకాలలో అఫిషినాలిస్ పొదలాగా పెరిగితే, ప్రోస్ట్రేటస్ కొద్దిగా సాగుతుంది. ప్రోస్ట్రేటస్ రకం రాక్ గార్డెన్ లోనూ, వేలాడే తొట్లలోనూ పెంచుకోవటానికి కూడా బాగుంటుంది. వంటలలో వాడటానికి మాత్రం రెండూ ఒకేలాగా ఉంటాయి.
సేంద్రియ ఎరువులు వాడితే ….
రోజ్ మేరీ ఆకులు పసుపు పచ్చగా మారుతుంటే, కుండీ మార్చే సమయం దగ్గరపడిందని సంకేతం. ఏడాదికొకసారి కుండీ మార్చుకోవాలి. దీన్ని వంటల్లో వాడతాం కనుక వర్మీకం పోస్టు అవసరం. వేరుసెనగ పిండి వంటి సేంద్రియ ఎరువుని మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. దీనికి రసం పీల్చే పురుగులు, పిండి, పొలుసు పురుగుల బెడద ఎక్కువ. అలాగే బూడిద తెగులు, వేరుకుళ్ళు కూడా ఆశించవచ్చ. నీరు నిలవని మట్టి మిశ్రమంలో నాటి, గాలి సరిగా తగిలేలా చూసుకుంటే మంచిది. వేప, వెల్లుల్లి, మిరపవంటి కషాయాలు చల్లుతూ ఉండాలి. జిగురుగా ఉండే స్టిక్కీ ట్రాపులను (మార్కెట్ లో దొరకుతాయి) మొక్కల మధ్య తగిలిస్తే వీటిని నివారించవచ్చు.
ఔషధ గుణాలు
రోజ్ మేరీకి ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి, జ్వరం, ఒళ్ళు నొప్పుల నివారణకు వాడతారు. ఈ నూనెనను తలకు మర్ధన చేస్తే బట్టతల వచ్చే అవకాశం తగ్గుతుందని అంటారు. రోజ్ మేరీని కలపడం వలన ఒమేగా – 3 ఫ్యాటీ ఆసిడ్లు ఉండే నూనెలు (అవిసె నూనె) వంటివి త్వరగా పాడైపోకుండా ఉంటాయట. దీనిని రూమ్ ఫ్రెషనర్ గా ఫెర్ఫూమ్స్ లోనూ వాడతారు. జ్గ్నాపకానికీ, ప్రేమకు సంకేతంగా భావిస్తారు కూడా రోజ్ మేరీనీ కత్తిరింపుల ద్వారా సులభంగా ప్రవర్ధనం చేయవచ్చు. గింజలతో పెంచడం కొంచెం కష్టం. ఈ మొక్క మన దగ్గర కంటే పూణే, బెంగుళూరు నర్సరీలలో సులువుగా దొరకుతుంది.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading