కంటి కింపైన రంగుల పూలతో పెరిగే తీగజాతి మొక్కలివి. ఈ మొక్కలు మన దేశానికి చెందినవే. నీలి, ఊదా రంగు పూలతో ప్రకాశవంతమైన కాషాయరంగులో నల్లని కంఠం గల పూలతో అలరించే బ్లాక్ ఐడ్ సుశాన్, తెల్లపూలు కలిగిన తంబర్జియా అల్ఫా, ఊదా రంగు పూలతో నీలి తంబర్జియా అన్నీ మనోహరంగాఉంటాయి. ఇవన్నీ ఏడాది పొడవునా పూలు పూస్తూ ఉండే తీగజాతి మొక్కలు. ఈ మొక్కలు చాలా వేగంగా ఎదుగుతాయి. త్వరగా పూయడం మొదలు పెట్టి ఏడాదంతా పూలు పూస్తూనే ఉంటాయి.
పూత అయిపోయిన కొమ్మలతో పాటూ అప్పుడప్పుడూ కింది వరకూ కత్తిరిస్తూ ఉంటే మొక్కలు చక్కగా అదుపులో ఉంటాయి. ఎండ ఎక్కవగా తగిలే ప్రదేశంలో వీటిని నాటుకుంటే మంచిది. కొద్దిపాటి నీడనూ ఇవి తట్టుకోగలవు. వీటికి క్రమం తప్పకుండా నీరు పెట్టాల్సిన అవసరం లేదు. మట్టి మరీ తడారిపోకుండా చూసుకోవాలి.
వీటికి తెగుళ్ళ సమస్య పెద్దగా ఉండదు. కానీ రసం పీల్చే పురుగులు ఆశించే ప్రమాదం ఎక్కువు వేప కషాయాన్ని నెలకొకసారి సమస్య ఎక్కువగా ఉన్నపుడు 15 రోజుల కొకసారి చల్లాలి.
ఎన్ పీ కెలు ఉండే సమగ్ర ఎరువుని నెలకొక సారి వేస్తూ వర్మికం పోస్ట్ ను మట్టి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా చేయడం వలన చక్కని పూలు పూస్తాయి. బ్లాక్ డ్ సుశాన్ నాలుగు నుంచి ఐదు అడుగులు పెరిగి కుండీలలో పెంచటానికి అనువుగా ఉంటుంది. మిగతా రెండురకాలు బలమైన ఆధారం అందిస్తే నలభై నుండి అరవై అడుగుల ఎత్తు వరకు ఎగబాకుతాయి వీటిని గోడలూ, అర్చీల మీదకు ఎక్కిస్తే చక్కగా అల్లుకు పోతాయి. తంబర్జియాల ను సులువుగా విత్తనాలద్వారానే కాకుండా కత్తింపుల ద్వారా వేళ్ళను విడదీసి నాటుకోవచ్చు. నర్సరీల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు.
తంబర్జియా
Google ad
Google ad
Raju's Resource Hub