ఎమరాల్డ్ పామ్ తో ఎన్నో లాభాలు
ప్రస్తుతకాలంలో ఇంట్లో మొక్కలు పెంచుకొనేవారి సంఖ్య బాగా పెరిగింది. అయితే ఎండ లేకపోయినా, నీరు పట్టకపోయినా,
పట్టించుకోకపోయినా అందంగా పెరిగే మొక్క ఉంటే బావుంటుందని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలాంటి వారికి తగినదే ఈ ఎమరాల్డ్
పామ్. దీని శాస్త్రీయనామం జామియో కల్కస్ జామిఫోలియా. ఆఫ్రికాలోని జాంజిబార్ దీని జన్మస్థలం కావడం వల్ల దీన్ని జాంజిబార్
జెమ్ అని కూడా పిలుస్తారు. కార్యాలయాల్లోనూ, ఇళ్లల్లోనూ అలంకరణ మొక్కగా పెంచుకునేందుకు అనువైంది. చూడ్డానికి జామియా పామ్
లాగే కనిపించినా, దానికి పూర్తిగా భిన్నమైన మొక్క ఇది. ఫిలోడెండ్రాన్, స్పాధిఫైలమ్, అగ్లోనిమా దీని జాతికి చెందినవే. ఇది రెండడుగుల
వరకూ పెరుగుతుంది. ఆకులన్నీ ఒకే దగ్గర నుంచి వస్తాయి. ప్రత్యేకంగా కాండం ఉండదు. ఆకుల్లో, కాడల్లో నీరు నిల్వ ఉంచుకుంటుంది. ఒకటి, రెండు నెలల పాటు నీళ్లు పోయక పోయినా కూడా తట్టుకోగలుగుతుంది. ఒకసారి వచ్చిన ఆకులు దాదాపు ఆరునెలలు రాలిపోకుండా ఉంటాయి. ఎమరాల్డ్ పాము చీడపీడలుఆశించే సమస్య దాదాపు తక్కువే. నెలకోసారి 19:19: 19 చొప్పున ఎన్పీకే ఉండే నీటిలో కరిగే సమగ్ర ఎరువును తక్కువ మోతాదులో కానీ, వర్మివాష్ని గానీ పోస్తూ ఉంటే మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది.
Raju's Resource Hub
