ఎంతో ముచ్చటపడి కట్టుకున్న ఇంట్లో ప్రతి ప్లేస్ని అందంగా మలచుకోవాలని అనుకుంటాం. అయితే ఇంట్లోని కొన్ని మూలల్లోని ఖాళీ స్థలాన్ని ఏ వస్తువులతో భర్తీ అర్థం కాదు. అలాగే హాల్, బెడ్రూమ్ మధ్య, బాల్కనీ వైపు స్థలం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా
కిచెన్, బాల్కనీ దగ్గర మూలల్లో స్థలం ఎక్కువగా ఖాళీగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ స్థలాన్ని సిట్టింగ్ ఏరియాగా మార్చేయండి. బాల్కనీ దగ్గర వెలుతురు బాగా ఉంటుంది. కాబట్టి దాన్ని రీడింగ్ ప్లేస్ గా మార్చేయొచ్చు. అక్కడున్న గోడకు అటాచ్మెంట్ సెల్ఫ్ బిగించి, పుస్తకాలు సర్దేయండి. దీని పక్కన ఓ చిన్న కుర్చీ లేదా ఊయల సెట్ చేస్తే సరి. ఆ పక్కనే రెండు పచ్చటి ఇండోర్ ప్లాంట్స్ను పెట్టండి. దీంతో చూడ్డానికి ఆ స్థలం చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ కూర్చుని హాయిగా టీ తాగుతూ, పుస్తకాలు చదువుతూ సేద తీరొచ్చు. ఇంకా వర్కింగ్ టేబుల్, కంప్యూటర్ ఏర్పాటు చేస్తే.. సరైన వెలుతురు రావడం వల్ల మీ పనిని ప్రశాతంగా చేసుకోవచ్చు.
