Introduction:
Allamanda, also known as the Yellow Bell or Golden Trumpet, is a popular ornamental flowering plant admired for its bright, trumpet-shaped yellow blooms. It is a tropical evergreen climber that can add charm to gardens, fences, and pergolas.
Scientific Name: Allamanda cathartica
Family: Apocynaceae
Description:
Allamanda plants are vigorous climbers with glossy green leaves and large, funnel-shaped flowers. They bloom throughout the year in warm climates, with peak flowering in summer and monsoon seasons. Their bright yellow color attracts butterflies and bees, adding life to any garden.
Care & Maintenance:
- Sunlight: Requires full sunlight for best flowering.
- Soil: Well-drained, fertile soil is ideal.
- Watering: Regular watering, but avoid waterlogging.
- Pruning: Prune after flowering to maintain shape and encourage growth.
Uses:
- Decorative plant for fences, trellises, and garden landscapes.
- Enhances aesthetic beauty with vibrant yellow blooms.

పరిచయం:
అల్లమాండా, పసుపు గంట పువ్వు లేదా గోల్డెన్ ట్రంపెట్ అని కూడా పిలుస్తారు. ఇది అందమైన, పసుపు రంగు ట్రంపెట్ ఆకారపు పువ్వుల కోసం ప్రసిద్ధి చెందిన ఒక అలంకార వృక్షం. ఇది ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే ఎప్పటికీ ఆకులు ఉండే వల్లి.
శాస్త్రీయ నామం: Allamanda cathartica
కుటుంబం: Apocynaceae
వివరణ:
అల్లమాండా వృక్షం మెరిసే పచ్చని ఆకులు మరియు పెద్ద, గాజు ఆకారపు పువ్వులతో ఉంటుంది. ఉష్ణమండల వాతావరణంలో ఇది సంవత్సరమంతా పూస్తుంది, ముఖ్యంగా వేసవిలో మరియు వర్షాకాలంలో ఎక్కువ పువ్వులు పూస్తాయి. దీని ప్రకాశవంతమైన పసుపు పువ్వులు తిత్లులను మరియు తేనెటీగలను ఆకర్షిస్తాయి.
పరిరక్షణ:
- సూర్యరశ్మి: పువ్వులు బాగా పూయడానికి పూర్తి సూర్యకాంతి అవసరం.
- మట్టి: నీరు సులభంగా జారే, సారవంతమైన మట్టి ఉత్తమం.
- నీళ్లు: తరచుగా నీరు పోయాలి, కానీ నీరు నిల్వ కాకూడదు.
- కత్తిరించడం: పూవుల తరువాత వృక్షాన్ని కత్తిరించి ఆకృతి మరియు కొత్త పెరుగుదలను ప్రోత్సహించాలి.
వినియోగాలు:
- గోడలు, మేడలు, తోటల అలంకరణకు ఉపయోగపడుతుంది.
- ప్రకాశవంతమైన పసుపు పువ్వులతో తోట అందాన్ని పెంచుతుంది.
Brought this plant for Rs70 on 20-11-2024. I don’t know what happened to my badluck, this plant died after one month.
- Decorative – The yellow bush allamanda is often used for decoration.
- Traditional medicine – In traditional medicine, the leaves and roots are used as a laxative and emetic. …
- Air purification – The plant’s lush foliage helps improve air quality by absorbing pollutants and releasing oxygen.

ఆలమండా మొక్కనే ప్రాంతాన్ని బట్టి బటర్కప్, అల్లెనంద… వంటి అనేక పేర్లతో పిలుస్తారు. అయితే, ఆలమండా అనే పేరుని మాత్రం స్విస్ వృక్షశాస్త్రజ్ఞుడు, వైద్యుడు ఫ్రెడరిక్ లూయిస్ ఆలమండ్ గౌరవార్థం పెట్టారట. ఇది అపోసైనేసియా కుటుంబానికి చెందినది. ఈ ఆర్నమెంటల్ ప్లాంట్స్లో ఎన్నో రకాలున్నాయి. వీటిల్లో పసుపు, ముదురు ఎరుపు రంగు పూల మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఏడాది పొడవునా నిండుగా విరబూస్తాయి. ఇవి సాధారణంగా 2-3 మీటర్ల పొడవులో ఎదుగుతాయి. గుబురుగానే కాదు, తీగలా ఎగబాకుతాయి కూడా. వీటి పాత కొమ్మలు ముదురు గోధుమ వర్ణంలో, కొత్తవి ఆకుపచ్చగా కనిపిస్తాయి. ఆకులు పచ్చగా నిగనిగలాడుతూ కోడిగుడ్డు ఆకృతిలో మెరుస్తాయి. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో పెంచుకోవడానికి అనువైనది.

సంరక్షణ ఎలాగంటే…
ఆల్మండా మొక్కకు కనీసం 6-8 గంటల ఎండ అవసరం. పాక్షికంగా నీడలో పెరిగితే పుష్పాలు తక్కువగా వస్తాయి. దీన్ని నాటుకునే మట్టిలో నీరు నిలవకూడదు. ఇందుకోసం పర్లైట్ కలపండి. సేంద్రియ పద్ధతిలో మొక్క చుట్టూ మల్చింగ్ చేయండి. ఇది తేమను నిలిపి ఉంచుతుంది. వీటిని కొమ్మ కత్తిరింపులతో చిగురించవచ్చు. మట్టి ఉపరితలం ఎండిపోయాకే నీటిని అందించాలి. మొక్క చుట్టూ ఉండే వాతావరణంలో తేమ ఉండేందుకు తరచూ నీళ్లను గాలిలోకి స్ప్రే చేయాలి. 2-3 వారాలకోసారి ఎన్పీకే ద్రవరూప ఎరువుని 10-10-10 నిష్పత్తిలో అందివ్వాలి. ఏడాదికోసారైనా 1-2 కణుపుల వరకూ కత్తిరించాలి. తీగజాతి రకాలకు తప్పనిసరిగా ఆధారం ఇవ్వాలి. తెల్లదోమ, పేనుబంక వంటివి వస్తే సర్ఫ్ వాటర్ లేదా వేపనూనె చల్లితే సరి. పూలు సరిగా రావడం లేదంటే ఎండ తగలడం లేదా? సరిగా ఎరువులు అందడం లేదా అన్న విషయాన్ని చూసుకుని సరిదిద్దుకోవాలి.

Raju's Resource Hub
