ఎప్పుడూ బస్సులో రాకపోకలు సాగించే ప్రభుత్వ వైద్యుడు ఆ రోజు ద్విచక్రవాహనంపై వెళ్లారు. శిరస్త్రాణం ధరించి జాగ్రత్తగా వెళ్తున్నా.. వ్యతిరేక మార్గంలో దూసుకొచ్చిన ఆటో ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పావాదతే వెంకటేశ్వర నాయక్(36) ఆయిదేళ్ల క్రితం యూపీఎస్సీ ద్వారా పుదుచ్చేరి ప్రభుత్వ వైద్య సర్వీసుకు ఎంపిక య్యారు. రెండేళ్ల పాటు పుదుచ్చేరిలో, తర్వాత మూడేళ్లగా యానాం ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తు న్నారు. దంతవైద్యురాలైన భార్య, ఇద్దరు పిల్లలతో
కాకినాడలో నివసిస్తూ రోజూ బస్సులో విధులకు హాజరవుతున్నారు.
శుక్రవారం (17-01-2025) ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వచ్చిన ఆయన రాత్రి ఎనిమిది గంటల తర్వాత విధులు ముగించుకుని కాకినాడ బయలు చేరారు. ఎనిమిదిన్నర గంటల సమయంలో పట పల వద్ద జాతీయ రహదారిపై గూడ్స్ ఆటో వ్యతి దేక మార్గంలో వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయ పడ్డారు.. కాకినాడలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి తర లించగా పరిస్థితి విషమయంగా ఉందని ప్రభుత్వా సుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి తీసు కెళ్లే సరికి మృతిచెందినట్లు వైద్యులు మ్రువీకరిం చారు. గూడ్స్ ఆటో తొలుత వైద్యుడిని తర్వాత తాళ్ళరేవు మండలం సీతా రాంపురానికి చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావును వెంకటేశ్వర నాయక్ కొట్టింది. వ్యాపారి పైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆటో డ్రైవర్ వీరబాబు కోరింగ పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఎస్సై పి.సత్యనా రాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రికి తరలించ మంలో ఆలస్యం జరగడంతో మంచి వైద్యుడిని కోల్పోయామని యానాం ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరె క్టర్ డాక్టర్ బి.రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
తీవ్రగాయాలతో భార్యకు ఫోన్ చేసి..
ప్రమాదం తర్వాత కొద్దిసేపటి వరకు క్షతగాత్రులకు ఎవరూ పట్టించుకోలేదు.. ఆ ప్రాంతం చీకటిగా ఉండటంతో ఆ మార్గంలో వెళ్లేవారూ ఆగలేదు. ఆటో డీకొని తీవ్రంగా గాయపడిన వైద్యుడు వెంకటేశ్వరనాయక్ కాకినాడలో ఉన్న తన భార్యకు ఫోన్లో విషయం చెప్పారు. వెంటనే ఆమె కొంత మందిని ఘటునా స్థలానికి పంపించారు. ఇంతలో మార్గంలో వెళ్లిన కొండరు ఆగి వైద్యుడిని గమనించి ఆటోలో కాకినాడ సంపించారు. అప్పటికే జాప్యం జరగడంతో వైద్యుడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని సహచర వైద్యులు చెబుతున్నారు.
Raju's Resource Hub
