ఇంటీరియర్ డిజైన్లో భాగమైన వెల్నెస్ ఇంటీరియర్స్లో ఒకటే గ్రీన్ వాల్ ఆర్ట్. నిజానికి దీన్ని నాచు, చిన్న చిన్న మొక్కలతో తయారు చేస్తారు. ఇంట్లో సహజ వాతావరణం, పచ్చదనం కోరుకొనే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్. కొంతమంది తమ అభిరుచి మేరకు ఏవైనా ఆకృతులు, లోగో, చిత్రాలను ఏర్పాటు చేయించుకుంటే, మరికొందరు పూర్తి గోడ నే పచ్చదనంతో నింపేస్తున్నారు. వీటి నిర్వహణకు నీరు అవసరం లేదు.అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ మొక్కలు జీవిస్తాయి.
వీటిలో వాల్ హ్యాంగింగ్, క్లాడింగ్, ప్రీ-మౌంటెడ్ వెల్కో అటాచ్మెంట్ వంటి విధాలున్నాయి. వీటిలో ఫ్రేముల్లో వచ్చే ఆర్ట్లు కూడా ఉన్నాయి. వీటిని
గ్లిజరిన్, నాన్- టాక్సిక్ రెసిన్తో సంరక్షించి, చాలా కాలం పాటు మన్నేలా రూపొందిస్తున్నారు. వీటిని పొడి ప్రాంతాల్లో, సూర్యరశ్మి తగిలేలా ఉంచడం వల్ల త్వరగా పాడైపోయే అవకాశాలున్నాయి. వీటికి తగినంత తేమను అందిస్తే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ గ్రీన్ వాల్ ఆర్ట్ని ప్రయత్నించి చూడండి. మీ ఇంటికి, ఆఫీసుకు కొత్త లుక్ని తీసుకురండి.
Raju's Resource Hub
