సురేశ్ నెలకు రూ.70వేల వరకూ సంపాదిస్తున్నారు. రూపాయికి లెక్క చూడాలంటే అతనికి చికాకు. ఖర్చు, లకు డబ్బు ఉంది కదా.. ఇదే ధోరణిలో ఉంటారు. అంతే వేతనం ఆర్జిస్తున్న రమేశ్ ఇందుకు భిన్నం. ప్రతి రూపాయి రాక-పోక తనకు తెలియాల్సిందే. అన్నీ రాసి పెట్టాల్సిందే అని అనుకుంటారు. ఇక్కడ ఇద్దరిలో ఎవరు ఆర్థికంగా క్రమశిక్షణతో ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో మనం ఎలా ఉన్నాం.. సురేష్ లాగ ఉంటే… వెంటనే రమేశ్ పద్ధతిలోకి మారాల్సిందే. బడ్జెట్ వేసుకో కపోతే ఆదాయం, ఖర్చులను లెక్క పెట్టుకోవడం కష్టం అవుతుంది.
దీంతో అధిక వ్యయాలు, అనవసర రుణాలు పెరిగిపో తాయి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం తగినంత పొదుపు, పెట్టుబడుల కేటాయింపులు కష్టమవుతాయి. పిల్లల భవి ష్యత్తు అవసరాలు (చదువు, పెళ్లి), సొంతిల్లు, పదవీ విరమణ తర్వాత జీవితం వీటన్నింటి పైనా ప్రభావం పడుతుంది. దీన్ని నివారించేందుకు మీ ఆదాయం. పెట్టుబడులు, ఖర్చులకు సంబంధించినంత వరకూ కచ్చితమైన బడ్జె టిను వేసుకోండి. ఈ ఏడాది మొత్తం ఏ నెల ఎం చేయాలన్నది వివరంగా ప్రణాళిక ఉండాలి. దీన్ని జాగ్ర త్తగా అనుసరించడం ముఖ్యం, బడ్జెట్ ఎప్పుడూ మిమ్మల్ని ఆర్థికంగా నియంత్రిస్తుంది. ఇది మీకు మంచే చేస్తుంది. ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తుంది.

Raju's Resource Hub
