The Indian Space Research Organisation (ISRO) launched the Space Docking Experiment (SpaDeX) mission, marking a significant milestone in India’s space endeavors. This mission involves two small spacecraft, each weighing approximately 220 kg, designed to demonstrate in-space docking—a critical technology for future missions such as lunar sample returns and the development of a space station.
భారత అంత రిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన ఆంగ్ల సంవత్సరాదికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది.. దేశ ప్రజలందరికీ అద్భుత విజ యంతో ‘హ్యాపీ న్యూఇయర్ చెప్పింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంత రిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ తరహా సాంకేతికతలో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) లో నుంచి సోమవారం రాత్రి 10 గంటల 15 సెకన్లకు పోలార్ శాటి లైట్ లాంచ్ వెహికల్-సీ60 (పీఎస్ఎల్పీ) నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్- 1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి.
ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి. పీఎస్ ఎల్వీ 420 కిలోల బరువుగల స్పేడెక్స్ అత్యా ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్ష లో ప్రవేశ పెట్టింది. పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో పీఎస్-ఆర్బీ టల్ ఎక్స్ పెరిమెంట్ మాడ్యూల్ ఉంది. దీనిని పీవోఈఎంగా పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ వాహక నౌక ప్రయోగం అనంతరం పీఎస్! (నాలుగో దశ)లో కొన్ని పరిశోధనలు చేపట్ట సున్నారు. మూడు నెలల వరకు కక్ష్యలో మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహించడానికి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు.. పీవోఈఎం (పోయమ్)-4లో మొత్తం 24 పేలోడ్లను కక్ష్యలోకి పంపనున్నారు. వీటిలో 14 పేలోడ్లు ఇస్రోకు చెందినవి కాగా, మరో 10 పేలోడ్లు స్టార్టప్లతో కూడిన వివిధ ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి.
On 16-01-2025, ISRO has successfully docked #SpaDeX satellites SpaDeX 01 and SpaDeX 02. This makes Indiathe 4th country after USA, China and Russia to demonstrate docking in space.
Raju's Resource Hub
