
ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గహ్ 1982 సెప్టెంబరు 26 వ తేదీన సిక్కు కుటుంబంలో మన్మోహన్ సింగ్ జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అమృత్ కౌర్, గుర్ముఖ్ సింగ్. దేశవిభజన సమయంలో ఆయన కుటుంబం భారత్ కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ వద్ద పెరిగారు.
మన్మోహన్ పాఠశాల విద్య ఉర్దూ మీడియంలో కొనసాగింది. దీంతో ప్రధాని అయ్యాకా ఆయన తన హిందీ ప్రసంగాలను ఉర్దూలో రాసుకుని చదివేవారు. కొన్నిసార్లు తన మాతృభాష అయిన గుర్ ముఖిలోనూ రాసుకునేవారు.
విభజన తర్వాత హల్ద్వానీకి, తరువాత అమృత్సర్కు మన్మోహన్ కుటుంబం వలస వచ్చింది. అక్కడి హిందూ కళాశాలలో చదివిన ఆయన ఆ
తరువాత పంజాబ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 54లో పీజీ చేశారు. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు.
1982లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. 1985 వరకూ మన్మోహన్ ఆర్ బీఐ గవర్నర్ గా కొనసాగారు. 1985 నుంచి 87 వరకూ ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ గా పని చేశారు. 1987 నుంచి 90 వరకూ స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పని చేసే సౌత్ కమిష న క్కు సెక్రటరీ జనరల్గా పని చేశారు. బైపాస్ సర్జరీ సమయంలో మినహా పదేళ్ల కాలంలో ఎన్నడూ ఆయన సెలవు పెట్టింది లేదు. రోజుకు కనీసం 300 ఫైళ్లను పరిష్కరించేవారు.
ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ జీవితం మరో మలుపు తిరిగింది. దేశాన్ని సంస్కరణల పథంలో పరుగెత్తించాలనే ఉద్దేశంతో పీవీ ఆయనను కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. దీంతో 1991 జూన్లో మన్మోహన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయేతర వ్యక్తిని ఆర్థిక మంత్రిగా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆయన తన పనితీరుతో అందరికీ సమాధానం చెప్పారు.
డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న మాజీ ప్రధాని, గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన్ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఢిల్లీలో చేర్చారు.




Raju's Resource Hub
