Logo Raju's Resource Hub

ఏటీఎం కార్డు వల్ల ఉపయోగాలు

Google ad

బ్యాలెన్స్ ఎంక్వైరీ: ఏటీఎం కార్డు ఉపయోగించే మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండానే.. ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయం తెలుసుకోవచ్చు. అంతే కాకుండా లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్‌మెంట్‌ కూడా తీసుకోవచ్చు.

ఫండ్ ట్రాన్స్‌ఫర్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ప్రకారం.. మీరు డెబిట్ కార్డును ఉపయోగించి, ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు రోజుకు రూ. 40,000 ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనికి ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జెస్ విధించదు.

క్రెడిట్ కార్డ్ చెల్లింపు: క్రెడిట్ కార్డ్ చెల్లింపులను కూడా ఏటీఏం ద్వారా చెల్లించవచ్చు. దీనికి మీ డెబిట్ కార్డు, పిన్ నెంబర్ వంటివి అవసరమవుతాయి.

బీమా ప్రీమియం చెల్లింపు: ఏటీఎం ఉపయోగించి బీమా ప్రీమియంలను చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ వంటివి బ్యాంకులతో టై-అప్‌లను కలిగి ఉన్నాయి. కాబట్టి ఏటీఎంలోనే ప్రీమియం చెల్లించవచ్చు.

Google ad

చెక్‌బుక్ రిక్వెస్ట్: చెక్ లీఫ్‌లు అయిపోయినా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఏటీఎం వీడరనే కొత్త చెక్‌బుక్‌ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. చిరునామా అక్కడ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఆ చిరునామాకే చెక్‌బుక్‌ (Checkbook) వస్తుంది.

బిల్ పేమెంట్స్: ఏటీఎం ద్వారా యుటిలిటీ బిల్లులను చెల్లించవచ్చు. అయితే ముందుగా బిల్లింగ్ కంపెనీ ఏటీఎం నెట్‌వర్క్‌కి లింక్ చేయబడిందో లేదో చెక్ చేసుకోవాలి. డబ్బు పంపే ముందు, బ్యాంకు వెబ్‌సైట్‌లో చెల్లింపుదారు వివరాలను నమోదు చేసుకోవాలి.

మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేషన్: బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మొబైల్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ వంటివి యాక్టివేట్ చేస్తారు. అయితే మీరు ఏటీఎం ఉపయోగించి కూడా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు లేదా డీయాక్టివేట్ చేసుకోవచ్చు.

ఏటీఎం పిన్ చేంజ్: ఏటీఎం ఉపయోగించే.. పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. అనుమానం వచ్చినప్పుడు ఏటీఎం పిన్ నెంబర్ మార్చుకోవడం మంచిది. కాబట్టి బ్యాంకుకు వెళ్లకుండానే.. ఏటీఎంలోనే పిన్ నెంబర్ మార్చుకోవచ్చు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading