Google ad
కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ – 200 గ్రా. (జొన్నరవ్వ ఇప్పుడు సూపర్ బజార్లలలో అమ్ముతున్నారు)
ఆవాలు – 1 చెంచా
మినపపప్పు – 1 చెంచా
పచ్చిమిర్చి – 6
అల్లం – కొద్దిగా
నూనె – 2 టేబుల్ స్పూన్
ఉప్పు – తగినంత
నీరు – 4 గ్లాసులు
కరివేపాకు -4 రెమ్మలు
తయారు చేసే విధానం:
జొన్న రవ్వ ఉడకబెట్టడానికి ఎక్కువ నీరు, సమయం అవసరం. కాబట్టి రవ్వను నీరు పోసి ముందుగానే ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం చిన్న ముక్కలుగా తరగాలి. నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు మినపపప్పు తరిగిన ముక్కలు వేసి వేయించాలి. వేగిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న జొన్న రవ్వ, ఉప్పు వేసి కలిపి పొయ్యి మీద నుండి దించాలి. నిమ్మరసం కలిపి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.
Google ad
Raju's Resource Hub