Google ad
కావలసినవి
బార్లీ – ఒక కప్పు
నీళ్లు – ఐదు కప్పులు
నిమ్మ రసం – ఒక టీ స్పూను
తేనె – ఒక టేబుల్ స్పూను
వెల్లుల్లి రెబ్బలు – 2
దాల్చిన చెక్క పొడి – చిటికెడు
అల్లం ముక్క – చిన్నది
తయారు చేసే విధానం
బార్లీని శుభ్రంగా కడిగి ఐదు కప్పుల నీళ్లు, వెల్లుల్లి రెబ్బ, దాల్చిన చెక్కపొడి జత చేసి, సన్నని మంట మీద సుమారు అరగంట సేపు మూడు వంతులు అయ్యేవరకు మరిగించి, దింపి చల్లారాక వడబోయాలి. చల్లారిన తరవాత నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్చు.
Google ad
Raju's Resource Hub