అడ్డ‌స‌రం మొక్క – లాభాలు

అడ్డరసం ఆకులను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకు మూడు సార్లు తాగితే రక్త విరోచనాలు, వాంతులో రక్తం పడటం తగ్గుతాయి. జ్వరం, వైరల్ ఫీవర్, మొండి జ్వరాలు అన్నీ తగ్గుతాయి. గోరువెచ్చగా ఉన్న ఈ కషాయాన్ని గజ్జి, తామర, దురద ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గుతాయి. అన్ని రకాల చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కషాయాన్ని రాస్తే త్వరగా తగ్గుతుంది. ఈ మొక్క లోని అన్ని భాగాలు నిన్ను పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

చర్మంపై గజ్జి, దురద, తామర ఉన్నవారు ఈ ఆకులకు పసుపు, గోమూత్రం కలిపి ముద్దగా నూరు కోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రాసి బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అన్ని రకాల చర్మ సమస్యలకు ఈ మిశ్రమం చక్కగా పని చేస్తుంది. పుండ్లు, గాయాలు ఉన్నచోట ఈ మిశ్రమాన్ని రాస్తే గాయాలు త్వరగా మానిపోతాయి. కఫా, శేష్మ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసం కి సమాన మోతాదులో అల్లం రసం కలిపి రోజుకు మూడు సార్లు తాగుతూ ఉంటే గొంతులో అడ్డుపడే కఫం అంతా కరిగిపోయి, శ్లేష్మ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. క్షయ దగ్గు ఉన్నవారు ఈ ఆకుల రసంలో ఒక చెంచా తేనె కలిపి రోజుకు రెండు సార్లు తాగితే త్వరగా క్షయ దగ్గు తగ్గిపోతుంది.

అడ్డరసం ఆకులను దంచి రసం తీసుకోవాలి. రెండు కిలోల అడ్డరసం ఆకుల రసానికి రెండు కిలోల నువ్వుల నూనె, అరకిలో త్రిఫలాలు దంచి రసం తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక బాండీలో వేసుకొని నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. నూనె మాత్రమే మిగిలిన తరువాత ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె తలకు పట్టిస్తే జుట్టు కుదుళ్లు తయారవుతాయి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య తగ్గుతుంది. తలలో పుండ్లు, దద్దుర్లు, కురుపులు, పేలు ఉంటే పోతాయి. జుట్టు నల్లగా తయారవుతుంది.

Leave a Reply

%d bloggers like this:
Available for Amazon Prime