అయోధ్య సరయు నది ఒడ్డున ఉన్న హిందువుల ప్రఖ్యాత పుణ్య క్షేత్రం. విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన శ్రీ రాముడి జన్మస్థలం కూడా. రామాయణం ప్రకారం శ్రీ రాముడు జన్మించిన అయోధ్య రఘు వంశీకుల యొక్క రాజధాని. హిందూమతంతో పాటు అయోధ్యలో బౌద్ధమతం, జైనమతం మరియు ఇస్లాం మతం జాడలు కూడా కనిపిస్తాయి. జైన్ తీర్థంకరు లలో అయిదుగురు ఇక్కడే జన్మించారని నమ్ముతారు. మొదటి తీర్థంకరుడు అయిన రిషబ్ దేవ్ కూడా ఇక్కడే జన్మించారని అంటారు.
అయోధ్య అనగానే శ్రీరాముడు గుర్తుకు వస్తాడు. కానీ భారతీయుల దురదృష్టం కొద్దీ 1527లో శ్రీ రాముడి జన్మ స్థలంగా పరిగణించబడిన ప్రాంతంలో మొఘల్ చక్రవర్తి బాబ్రీ మసీదును నిర్మించాడు. 1992లో ఈ మసీదు కొందరి చేత కూలగొట్టబడింది. ఆ తరువాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి.
శ్రీ రాముడి కుమారుడు కుశుడి చేత నిర్మించబడిన నాగేశ్వరనాథ్ ఆలయం మరియు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. తులసీదాస్ యొక్క జ్ఞాపకార్ధం భారత ప్రభుత్వం చేత నిర్మించబడిన తులసీ స్మారాక్ భవన్ ఇక్కడే ఉంది.
బంగారపు కిరీటాలు ధరించిన సీతారాముల చిత్రాలని కనక భవన్ లో గమనించవచ్చు. హనుమాన్ గర్హి అనే భారీ నిర్మాణాన్ని కూడా చూడవచ్చు. శ్రీ రాముడి తండ్రికి చెందిన దశరధ భవన్ ని ఇక్కడ చూడవచ్చు. ట్రేటా కే ఠాకూర్ అనే ప్రదేశం లోనే శ్రీ రాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడని అంటారు.
రామ జన్మభూమి ఆలయానికి సమీపంలో సీతాకి రసోయి ఉంది. శ్రీ రాముడితో వివాహం తరువాత సీతాదేవి మొట్ట మొదటి సారి ఇక్కడే వంట చేసిందని అంటారు. సరయు నది వద్ద ఉన్న రామ్ కి పైది అనే స్నానపు ఘాట్ ఉంది. ఆ తరువాత, మని పర్బాత్ అనే బౌద్ధుల విహార ప్రదేశంకూడా ఇక్కడే ఉంది. ఆ తరువాత ఇది హిందువుల ఆలయంగా మార్చారు.
సయోధ్యకు అంకురార్పణ
అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగి తీరాలంటూ అలుపెరగని రీతిలో దశాబ్దాలుగా పోరాడు తున్నవారి స్వప్నం ఈడేరబోతోంది. బుధవారం ఆ నగరంలో మూడు గంటలపాటు జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీసహా 174మంది ఆహ్వానితులు పాల్గొంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి పంజా విసిరిన పర్యవసానంగా ఇలా తక్కువమందితో నిరాడంబరంగా ఆ కార్యక్ర మాన్ని ముగిస్తున్నారు. లేనట్టయితే ఇవాళ్టి రోజున అయోధ్య లక్షలాదిమంది జనసందోహంతో హోరె త్తిపోయేది. బాబ్రీ మసీదు వున్న ప్రాంతం రామ జన్మభూమి అని, దాని స్థానంలో రామమందిరం నిర్మించాలని జన్‌సంఘ్‌గా వున్నప్పటి నుంచి బీజేపీ రాజకీయంగా పోరాడుతూ వుంది. అంతకు చాన్నాళ్లముందే… అంటే 1885 డిసెంబర్‌లో వలసపాలకుల హయాంలోనే తొలిసారి సివిల్ కేసు దాఖలైంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1949 చివరిలో అయోధ్య అదనపు నగర మేజిస్ట్రేట్ కోర్టులో ఈ వివాదంపై విచారణ జరిగింది. ఈ వ్యాజ్య పరంపర ఇలా కొనసాగుతుండగానే న్యాయ స్థానాల వెలుపల ఇరువర్గాలమధ్యా సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నించినవారు కూడా లేకపోలేదు.


1990లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్న చంద్రశేఖర్, 1992లో అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు, 2003లో నాటి ప్రధాని వాజపేయి ఈ మార్గంలో ప్రయత్నించారు. ఇతర ప్రయత్నాల సంగతలా వుంచి పీవీ హయాంలో ఆయన సలహాదారుగా పనిచేసిన పీవీఆర్‌కే ప్రసాద్, తాంత్రికుడు చంద్రస్వామి పీఠాధిపతులతో, హిందూ మత పెద్దలతో, ముస్లిం సంఘాలతో మాట్లాడారు. ఆ సంభా షణలు కొంతవరకూ ఫలించిన దాఖలాలు కూడా కనబడ్డాయని, కానీ చివరకు అది కాస్తా మూలన పడిపోయిందని చెబుతారు. నిరుడు మార్చిలో సుప్రీంకోర్టు సైతం ఇలాంటి మధ్యవర్తిత్వ ప్రయత్నం చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఫకీర్ మహ మ్మద్ ఇబ్రహీం కలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ అన్ని పక్షాలతో చర్చించి ఒక ఒప్పందాన్ని రూపొందించింది. అయితే కొన్ని పక్షాలు మాత్రమే దానికి అంగీకరించాయి. ఆ పక్షాలు కూడా షరతులు విధించాయి. అయితే మధ్యవర్తిత్వాలు సర్వ సాధారణంగా ఆస్తుల పంపకాలు, స్థల యజమానుల మధ్య వుండే సరిహద్దు తగాదాలు వగైరాల్లో చెల్లుబాటవుతుంది. పరస్పరం తలపడేవారు ఏదో ఒక దశలో కోర్టు వివాదాలతో విసిగిపోయి కొంద రిని పెద్దమనుషులుగా అంగీకరించి, వారి తీర్పునకు తలొగ్గుతారు. కానీ రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం మౌలికంగా మతపరమైన మనోభావాలతో, విశ్వాసాలతో ముడిపడి వున్న సమస్య. అక్కడ అంతక్రితం వున్న రామమందిరాన్ని బాబర్ ధ్వంసం చేయించి, దానిపై మసీదు కట్టాడన్నది రామ మందిరం నిర్మించాలని పోరాడినవారి వాదన. ఈ వివాదం రాజకీయంగా మాత్రమే కాదు… సామాజికంగా కూడా కల్లోలం సృష్టించింది.
తన మధ్యవర్తిత్వ ప్రయత్నం ఫలించలేదని గ్రహించాక సుప్రీంకోర్టు నిరుడు నవంబర్ 9న తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించా లని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆదేశించింది. ఒక ట్రస్టు ఆధ్వర్యంలో మందిర నిర్మాణం పనులు జరగాలని నిర్దేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించా లని కేంద్రాన్ని ఆదేశించింది. దేశంలో విద్వేషపూరిత పరిణామాలకు దారితీసిన ఒక సంక్లిష్ట సమస్య సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో పరిసమాప్తమైంది. అన్ని వర్గాలూ ఈ తీర్పును స్వాగతిం చాయి. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చొరవ, పట్టుదల వల్లే ఈ చిక్కుముడి వీడింది. చివరి దశలో కూడా ఇది యధాప్రకారం వాయిదా పడేలా చూడాలని కొన్ని పక్షాలు ప్రయత్నించాయి. 40 రోజులపాటు నిర్నిరోధంగా సాగిన వాదప్రతివాదాల క్రమంలో ఉద్వే గాలు చోటుచేసుకున్నాయి. కోపతాపాలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పువల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న భయాందోళనలు అందరిలోనూ ఉన్నాయి. బాబ్రీ మసీదు విధ్వంçసం అనంతరం ఎన్నో విషాదకర పరిణామాలు చూసి ఉండటం వల్ల అవి సహజమే. కానీ ఏళ్లు గడుస్తున్నకొద్దీ అందరిలోనూ పరిణతి వచ్చింది. పరస్పర ఘర్షణల వల్ల ఒరిగేదేమీలేదన్న అవగాహన ఏర్పడింది. అందుకే ఎక్కడా ఆగ్రహావేశాలు కట్టుదాటలేదు. అంతా ప్రశాంతంగా గడిచిపోయింది.
కాలం మారేకొద్దీ ఎలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియాలంటే రామ జన్మభూమి ఉద్యమాన్ని చూడాలి. తన రథయాత్రతో ఆ ఉద్యమానికి ఆయువు పోసి, అది దేశవ్యాప్తమయ్యేందుకు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అడ్వాణీ కారకులు. ఆ రథయాత్రవల్లే బీజేపీ దేశం నలుమూలలా బలపడింది. కానీ ఇప్పుడు జరిగే భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన తన ఇంట్లో టెలివిజన్ సెట్‌లో వీక్షించవలసి వస్తోంది. కరోనా కారణంగా 90 ఏళ్లు పైబడి వయస్సున్నవారిని అనుమతించరాదని నిర్ణయించినందువల్లే ఆయనను ఆహ్వానించలేదని నిర్వాహకులు చెబుతున్నారు. అప్పట్లో ప్రధాన పాత్రధారులైన నేతలు మురళీ మనోహర్ జోషి, కల్యాణ్‌సింగ్, ఉమాభారతిలకు ఆహ్వానం అందినా వారు నిరాకరించడం ఆసక్తికరమైన విషయం. ఉమాభారతి అయోధ్య వెళ్తున్నా, కార్యక్రమానికి హాజరుకాబోనని ఇప్పటికే చెప్పారు. అడ్వాణీ రథయాత్ర గుజరాత్ వచ్చినప్పుడు ఆ కార్యక్ర మానికి నిర్వాహకుడిగా ఉండి పెద్దగా వార్తలకెక్కని నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రధాని హోదాలో భూమి పూజలో కీలక భూమిక పోషించబోతున్నారు. మన దేశంలో రామకోవెల లేని ఊరు, వాడా వుండదు. రాముడు కోట్లాదిమంది హిందువులకు ఆరాధ్యుడు కావొచ్చుగానీ, రామాయణం చాటి చెప్పిన విలువలు కాలావధుల్ని దాటి పరివ్యాప్తమయ్యాయి. కులాలు, మతాలు, జాతులకు అతీ తంగా అందరికీ ఆదర్శనీయమైనవిగా నిలిచాయి. అయోధ్యలో నిర్మాణం కాబోయే రామ మందిరం సైతం ఆ విలువల స్ఫూర్తికి అద్దం పట్టేలా రూపుదిద్దుకుంటుందని ఆశించాలి.
What is Ram Mandir and Babri Masjid’s history?
- Started in the 1500s: King Babur, founder of the Islamic Mughal Empire, ordered one of his generals to construct a mosque in Ayodhya, to be known as Babri Masjid (“Babur’s mosque”).
- The mosque was built on a hill known as “Rama’s fort,”a shrine to Ramasite was demolished to make way for it.
- Since then, local Hindu group started to make demand to build a temple at that place, but it was denied by the colonial Government.
- In 1859, the British colonial administration separated the places of worships by a wall to avoid dispute between Hindus and Muslims. Muslims were allowed to use the inner part and Hindus were allowed to use the outer part.
- The first case was filed in Court in January 1885, by Mahant Raghubir Das (a Hindu priest) for seeking permission to build a canopy on the Ramchabutra (a raised platform) outside the mosque. The faizabad district Court rejected that plea.
- On 16th December 1992 the Central government set up a commission named Liberhan Commission, to investigation.
- In 1990, BJP leader Lal Krishna Advani began a rath yatra to Ayodhya in order to generate public support, the main purpose of the rath yatra was to erect ram mandir in the place of Babri Masjid.
- This yatra begun from Somnath, it resulted communal riots in many cities as a result L K Advani was arrested by the Government of Bihar when the yatra passed through the Bihar.
- On 6th December, 1992 Vishwa Hindu Parishad and its association BJP organized a rally involving 150,000 VHP and BJP kar sevak at the site of mosque. They began with speeches of L.K. Advani, Murli Monohar Joshi and Uma Bharati. During the speech communal riots arose in various cities like Mumbai, Delhi, Hyderabad, and Bhopal etc. and almost 2000 people died in these riots.
- December 6, 1992 – Babri Masjid is demolished.
- 1992 – LIBERHAN COMMISSION is formed
- In September 30, 2010 a Bench of Allahabad High court consisting Justice S.U Khan, Justice Sudhir Agarwal and Justice D.V Sharma had ruled that the disputed land of Ayodhyaa should be divided into three parts. Two third to Hindu plaintiffs and one third to the Muslim Sunni Wakf Board.
- 2011 – Supreme Court suspends the high court decision.
- 2017 – Supreme Court calls for “out of setlement” ( An agreement reached between the parties in a pending)
- November 2019 – Supreme Court decides that a temple will be built at the disputed Ayodhya sie. An alternate site was given to the sunni Waqf Board
- February 2020 – The Uttar Pradesh Central Waqf Board accepts Five acres of land allotted to it by the state govy. for building a mosque.
- AUGUST 5, 2020 – BHOOMI PUJA AT THE RAM TEMPLE SITE IN AYODHYA
Despite delays due to the pandemic as well as clashes with China, the temple is ready to be consecrated on Wednesday.
This brings us to Times Square and the efforts of Indian American and Hindu American groups to displaying images of Rama and the temple on the day of its opening. Opponents of the billboards have sent letters to New York City Mayor as well as to other elected officials to request that this not take place.
And ,
The approximate cost of the construction of Ram Mandir in Ayodhya
- Ram Temple in Ayodhya will be 161 feet tall.
- Temple will have five domed mandap and one shikhar
- Number of pillars 360
- Total number of floors will be 3
- Width of the stairs will be 16 feet.
- Nagar style Temple has been designed by keeping in mind Shilpa Shastra specifications.
- 4 more smaller Temples will surround the main structure.
- 2 lakh brick with Shri Ram inscribed to form the foundation of the Temple
- Stones from Banshi mountains in Rajasthan will be used
- Construction will take 3.5 years
Estimated cost of construction is Rs 300 crore.
మూడున్నరేళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిరం ఇలా ఉండబోతుంది..
మూడున్నరేళ్లు పడుతుంది..

ఆర్కిటెక్ట్ ప్రాజెక్టు ప్రకారం ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తికావడానికి మూడున్నర సంవత్సరాలు పడుతుంది. ఈ మందిరం మూడో అంతస్తులతో ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మితమవనుంది. రామ్ లల్లా గర్భగుడి ఎక్కడైతే నిర్మిస్తారో దాని పైభాగంలో మాత్రమే ఆలయ ప్రధాన గోపురం ఉండనుంది. రామాలయం ఎత్తు 33 అడుగులు పెరగనుంది. ఈ కారణంగా మరో అంతస్తును పెంచాల్సి ఉంది. రామాలయం పాత నమూనా ప్రకారం 268 అడుగుల 5 అంగళాల ఎత్తు ఉంది. అయితే తాజాగా 280 నుంచి 300 అడుగుల వరకు ఆలయం ఎత్తు పెరిగే అవకాశముంది.
ఆలయంలో 5 గోపురాలు ఉంటాయి..

రామ్ లల్లా గర్భగుడి ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆలయ ప్రధాన గోపురం నిర్మిస్తారు. ఇది కాకుండా ఈ మందిరంలో ఐదు గోపురాలు ఉంటాయి. పాత నమునాలో కేవలం రెండు గోపురాలు మాత్రమే ఉన్నాయి. కానీ కొత్త నమునాలో ఆలయ వైభవాన్ని పెంచేందుకు 5 గోపురాలు నిర్మించనున్నారు. రామ మందిరం దిగువ భాగంలో ఈ ఐదు గోపురాలు నెలకొననున్నాయి. ఇందులో సింహ ద్వారం, నృత్య మండపం, రంగ మండపాలను నిర్మిస్తారు. భక్తులు వివిధ పూజా కార్యక్రమాలు చేసేందుకు గాను తగినంత స్థలం ఉంటుంది.
ఆలయం గోపురం 161 అడుగులు..

ఆలయం ప్రధాన గోపురం ఎత్తు 161 అడుగులకు పెంచారు. దీంతో గోపురాల సంఖ్య మూడు నుంచి ఐదుకి పెరిగాయి. ఆలయానికి చెందిన భూమి పరిమాణం కూడా పెంచారు. రామ మందిరం ఐదు గోపురాల దిగువన నాలుగు భాగాలు ఉంటాయి. సింహ ద్వారం, నృత్య మండపం, రంగ మండపాలను నిర్మిస్తారు. భక్తులు వివిధ పూజా కార్యక్రమాలు చేసేందుకు గాను తగినంత స్థలం ఉంటుంది. ఆలయ గోపురం ఎత్తు 161 అడుగుల ఎత్తు ఉంటుంది.
20 నుంచి 25 అడగుల లోతు పునాది..

మట్టి పరీక్ష నివేదిక ఆధారంగా ఆలయానికి పునాదిని తవ్వుతారు. ఈ పునాది 20 నుంచి 25 అడుగుల లోతు ఉంటుంది. వేదిక ఎంత ఎత్తులో ఉండాలనేది రామ మందిరం ట్రస్టు నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 12 నుంచి 14 అడుగుల ఎత్తు వరకు ఉండాలని చర్చిస్తున్నారు. రామ మందిరం కొత్త నమునా ప్రకారం మొత్తం ఆలయంలో 318 స్తంభాలు ఉంటాయి. ఆలయ ప్రతి అంతస్తులో 106 స్తంభాలు నిర్మించనున్నారు.