
వైద్యనాధేశ్యరుడు
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే,, సదా వసంతం గిరిజాసమేతమ్,
నురాసురారాధిత పాదపద్మం, శ్రీవైద్యనాథం తమహం నమామి
లంకాధిపతి అయిన రావణుడు మహఆశిభక్తుడు. అతడు కోరినపుడలు కైలాసమునకు వెళ్ళి శివదర్శన భాగ్యము పొందేటంతటి గొప్పవాడు. ఒకసారి శివుని ఆత్మలింగం పొందగోరి ఘోరతపస్సచేసి శివుని దర్శనం పొందిన తరువాత శివుని ఆత్మలింగాన్ని కోరతాడు. . శివుడు తన ఆత్మలింగాన్ని ఇస్తూ దీనిని నీ లంకారాజ్యంలో ప్రతిష్టించు కానీ మార్గమధ్యమున ఈ ఆత్మలింగాన్ని నేలపై ఉంచరాదు. అలా ఉంచిన ఆత్మలింగం అక్కడే ప్రతిష్టమవుతుంది. దానిని కదిలించడం నావల్ల కూడా కాదు. అని హెచ్చరించాడు.
రావణుడు సంతోషంతో ఆత్మలింగాన్ని దోసిట్లో ఉంచుకొని లంకకు బయలు దేరతాడు. దారిలో అఘుశంక తీర్చుకోవలసిన అవసరం వచ్చింది. రావణనికి సమీపంలో గోవులను మేపుకుంటున్న ఒక బాలకుడు కన్పిస్తాడు.
రావణుడు ఆ బాలుని పిలచి కొంతసేపు ఆత్మలింగాన్ని పట్టుకోవాల్సిందిగా కోరతాడు. ఆ బాలుడు ముమ్మారు పిలుస్తాను. రాకపోతే శివలింగాన్ని కింద పెడతాను అంటాడు. రావణుడు ఆత్మలింగాన్ని బాలకునికి అప్పగించి లఘుశంక తీర్చుకోవటానికి వెళతాడు. కాని ఆ బాలకుడు వెంటనే మూడు సార్లు రావణుని పిలచి వెంటనే ఆ శివలింగాన్ని భూమిపై ఉంచుతాడు.
రావణుడు ఆ లింగాన్ని లేపటానికి ప్రయత్నించగా ఆ శివలింగం పాతాళం దాకా పెరిగి కూరుకుపోతుంది. రావణుడు ఇది శివుని చర్యగా భావించి వెనుతిరిగి లంకకు వెళతాడు. రావణాసురుడికి ఆత్మలింగం లభించటం ఇష్టం లేక దేవతల కోరిక మేరకు వినాయకుడే గొల్లవాని రూపం ధరించి రావణునికి ఆత్మలింగం దక్కకుండా చేస్తాడు. దేవతలు, వినాయకుడు కోరిక మేరక శివుడు వైద్యనాధేశ్వరుడు గా జ్వోతిర్లింగంగా వెలుస్తాడు.
జార్ఘండ్ లోని ధియోగర్ లోని జ్యోతిర్లింగాన్ని కూడా వైద్యనాథ్ జ్వోతిర్లింగంగా కొందరు భావిస్తారు.
ఎలా వెళ్లాలి ? వైద్యనాధేశ్యర దేవాలయం మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ్ పట్టణంలో ఉన్నది. పర్లి హైదరాబాద్ – మన్మాడ్ రైల్వే లైన్లోని పారబ్బాని రైల్వే స్టేషన్ కు దగ్గరలో కలదు.
వసతి సౌకర్యాలు ఇక్కడ బసచేయుటకు ధర్మశాలలు, వసతి గృహాలు, హోటళ్లు కలవు
Raju's Resource Hub
Pingback: Dwadasa Jyothirlingalu – E-knowledge hub