రామతులసి (india mart image)
ఇందులో రామ తులసి భారతదేశంలో ఇంటింటా కనపడే రకం ,భక్తి పూర్వకంగా కొలవబడుతుంది. ఆకుపచ్చని ఆకులతో ఘాటైన వాసన కలిగి ఉంటుంది. రెండవది కృష్ణ తులసి ఇది ఎరుపు ఆకులతో, కాండంతో ఉంటుంది. ఇది కాక వన తులసి , అడవులలో, మైదానాలలో పెద్దఆకులతో కనిపిస్తూ పెద్ద కాండంతో ఉంటుంది.
కృష్ణ తులసి-శ్యాం తులసి (నెట్ చిత్ర)
వన తులసి (నెట్ చిత్రం)
ఇక చివరగా మీరు అడిగిన సబ్జా . దీన్ని కొందరు స్వీట్ బేసిల్ అని పిలుస్తారు. ఆకులను వంటలలో వాడతారు. కామ కస్తూరి, కమ్మ గగ్గరాకు, రుద్రజడ వంటి పేర్లతో దీన్ని పిలుస్తారు.
సబ్జా -కామకస్తూరి (rkkichidi చిత్రం )
దీని ఆకులు కూడా సువాసనతో ఉంటాయి. అయితే దీని గింజ లని నీటిలో వేస్తే ఉబ్బి చిన్న చిన్న నూగుతో చిక్కగా జిగతగా ఉండేలా తయారవుతుంది. దీన్ని షర్బత్, ఫలూడా ,ఐస్ క్రీమ్, జ్యూస్ లలో వాడతారు. వేడి తగ్గించి చలవ చేస్తుందని పానీయాల్లో, పళ్ళ రసాల్లో, పాల లో కలుపుకుని తాగే అలవాటు మనకి ఉంది.
Raju's Resource Hub