📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Sri Lakshmi Narasima Swamy, Antervedi / అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి

తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలంలో, వశిష్ఠగోదావరి మరియు సముద్రతీరానికి దగ్గరలో ఉన్నది. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుడి పట్ల చేసిన అపరాధాకు ప్రాయశ్ఛిత్తంగా రుద్రయాగం చేయాలని తలపెడతాడు. యాగానికి ఈ ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. అందువలనే ఈ ప్రదేశానికి అంతర్‌ వేదిక అంతర్వేదిగా పేరువచ్చింది.

ఈ ఆలయం చక్కని నిర్మాణ శైలిలో రెండు అంతస్తులుగా కట్టబడినది. ప్రాకారము కూడా రెండు అంతస్తులుగా నిర్మించబడి యాత్రికులు పైఅంతస్తుకు వెళ్ళి ప్రకృతి అందాలు తికించుటకు వీలుగా నిర్మించారు.ఆలయానికి దూరముగా వశిష్టా నదికి దగ్గరగా విశామైన స్థలమునందు కళ్యాణమండపం నిర్మించారు. ఈ ఆలయం క్రీ॥శ 300 కు పూర్వమే నిర్మించబడినదని చెబుతారు. పూర్వాలయం శిధిం కాగా ప్రస్తుత ఆలయం పెద్దపురం జమిందారు కుటుంబీకుడైన శ్రీ కొపనాతి కృష్ణమ్మగారి విరాళాలు, కృషి ద్వారా జరిగింది.

ఉత్సవాలు : భీష్మ ఏకాదశికి ఉత్సవాలు జరుగును. (సాధారణంగా జనవరి-ఫిబ్రవరిలో భీష్మఏకాదశి వస్తుంది) దశమి రోజున స్వామివారి కళ్యాణం మరియు ఏకాదశి రోజున స్వామివారి రథయాత్ర జరుగును.ఈ కళ్యాణోత్సవాలు దశమిరోజు ప్రారంభమై పౌర్ణమి రోజు దాకా జరుగుతాయి.
వశిష్టాశ్రమం : అంతర్వేది దేవాలయానికి కొంచెం దూరంగా సముద్రానికి దగ్గరగా ఈ ఆశ్రమం నిర్మించబడినది.ఈ ఆశ్రమాన్ని వికసించిన కమలం మాదిరిగా 4 అంతస్తులలో నిర్మించారు. చుట్టూ సరోవరం మధ్యలో ఆశ్రమం అద్భుతంగా ఉంటుంది. దీనికి దగ్గరగా ధ్యానమందిరం, పఠనాశాల, యాగశాల, విశ్రాంతి మందిరం మొదగునవి కలవు. యాత్రికుల విశ్రాంతి కోసం పర్ణశాలవంటి అందమైన కట్టడాలు కలవు.

దీపస్తంభము : దేవాలయానికి దక్షిణంగా సముద్రతీరంలో ఉన్నది. ఇది బ్రిటీష్‌ వారిచే కట్టబడినదిని చెబుతారు. ఇక్కడకు యాత్రికులే కాక పిక్నిక్‌కు వనభోజనాలకు వచ్చేవారితో కళకళలాడుతుంది.
ఇంకా ఇక్కడ అశ్వరూఢాంబిక (గుర్రాలక్క) ఆలయం,అన్నా చెల్లెళ్ళ గట్టు ఉన్నాయి. సముద్రతీరంలో విహరించవచ్చు.

Google ad
Advertisement
Google ad
Google ad

Leave a Reply

Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading