Logo Raju's Resource Hub

Talupulamma Talli, Lova / తలుపులమ్మ తల్లి, లోవ

Google ad

తలుపుమ్మ దేవాలయం రమణీయమైన ప్రకృతి అందాల మధ్య కనువిందు చేస్తుంది. అమ్మవారు స్వయంభువు అని చెబుతారు.ఈ ఆలయం దారకొండ మరియి తీగకొండల మధ్యన వున్న కొండపై ఉన్నది. గోదావరి జిల్లా వారు నూతన వాహనాలను కొన్నతరువాత పూజకు తప్పకుండా ఇక్కడకు వస్తారు. తలుపులమ్మ తల్లి వాహన ప్రమాదాల నుండి కాపాడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

అమ్మవారికి ఇక్కడ కోళ్ళు, మేకలు, గొర్రెలను బలి ఇచ్చే ఆచారం ఉంది. ఇక్కడే వర్తకులు కోళ్ళు, మేకలు అమ్ముతారు. బలి తరువాత మాంసాహారం వండుకునే వారికి అన్ని సౌకర్యాలను ఇక్కడి వర్తకులే కల్పిస్తారు. మిగిలిన వంటలకాను భక్తులు ఇళ్ళకు తీసుకు వెళ్ళరు. స్థానికంగా ఉండేవారికి ఇస్తారు. తలుపులమ్మ దేవాలయం సాయంత్రం 06-00 గంటకే మూసివేస్తారు. కారణం కొండపై సంచరించే క్రూరమృగాల వలన భక్తులకు ప్రమాదాలు జరుగుతాయని. ఆదివారం, మంగళవారం, బుధ, గురువారాలో మరియు పండగ రోజులో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

స్థల పురాణం : పూర్వం అగస్త్యముని ఇక్కడ ప్రకృతి రమణీయతకు సంతోషపడి ఇక్కడ తపమాచరించాడని ప్రతీతి. ఇక్కడ చెట్ల ఫలాలు తింటూ ఇక్కడ కొండమీద నుండి వచ్చే నీటిని త్రాగేవాడని చెబుతారు. ఇక్కడి కొండకు దారకొండ, తీగకొండని పేరు పెట్టాడంటారు. దారకొండ మీద నుండి అన్ని కాలాలో వచ్చే జలధారను చూడవచ్చు.

ఉత్సవాలు : ప్రతి సంవత్సరం చైత్రమాసం (మార్చ్‌, ఏప్రియల్‌) బహుళ విదియ తదియ నుండి 15 రోజలపాటు ఉత్సవాలు జరుగుతాయి. ఆషాఢమాసంలో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
వసతి సౌకర్యాలు: తలుపులమ్మ తల్లి దేవస్ధానం వారిచే యాత్రికుల కొరకు 28 గదులు కట్టించబడినవి. వేరే అతిధిగృహాలు లేవు. సాధారణంగా భక్తులు ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతారు.

Google ad

ప్రయాణ సదుపాయాలు : శ్రీ తలుపుమ్మ తల్లి దేవస్ధానం తూర్పుగోదావరి జిల్లా, తుని మండలం, లోవలో ఉన్నది. తుని రైల్వే స్టేషన్‌ నుండి 8 కి.మీ. దూరంలో కలదు ఇక్కడ నుండి బస్సులో వెళ్ళవచ్చు. కాకినాడకు 70 కి.మీ. దూరంలో కలదు. రాజమండ్రి నుండి 106 కి.మీ.దూరంలో ఉన్నది. దగ్గరలోని రైల్వే స్టేషన్లు తుని మరియు అన్నవరం.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading