ఒడిషా (ఒరిస్సా)లోని కోణార్క దేవాలయం భారతదేశంలో ప్రముఖ సందర్శనా స్ధలాలలో ఒకటి. ఈ దేవాలయం పూరీ జగ్నన్నాధాలయం నుండి 35 కి.మీ. దూరంలో ఉంది. క్రీ.శ. 13వ శతాబ్ధంలో (1236-64) గంగవంశపు రాజైన నరసింహునిచే నిర్మించబడినది. యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించబడినది.
ఆలయ విశేషాలు : సూర్యుని రథం ఆకారంలో నిర్మించబడిన ఈ ఆలయం అద్భుత శిల్పకళా నిలయం. 12 జలత అలంకృత చక్రాలతో, ఏడు గుర్రాలతో లాగబడుచున్న పెద్ద రథం ఆకారంలో కట్టబడినది. ఆలయ నిర్మాణానికి నల్లగ్రనైట్ రాతిని ఉపయోగించారు. సంవత్సరానికి 12 మాసాలు 12 రాశులు వీటికి అనుగుణంగా మరియు సూర్యగమనానికి అనుగుణంగా ఈ ఆలయం నిర్మించబడినది.
కోణార్క దేవాలయం చూసిన తరువాత ఇక్కడకు 3 కి.మీ. దూరంలో ఉన్న కోణార్క్ బీచ్‌ను సందర్శించవచ్చు. బీచ్ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఇంకా ప్రపంచ ప్రసిద్ధి పొందిన పూరీ జగ్నన్నాధాలయం కూడా ఇక్కడకు సుమారు 35 కి.మీ. దూరంలో ఉంటుంది.
కోణార్క్ ఓడిశా ఆలయం యొక్క నిర్మాణ సౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది. కోణార్క్ నగరం యొక్క అందం రాతి పై చెక్కబడినది. అంతేకాకుండా, ఈ ప్రాంతాన్ని మానవుడి భాషని ఓడించే రాతి భాష గా అభివర్ణిస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన అధ్బుతమైన స్మారక కట్టడాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.
కోణార్క్ లో ఇంకా చుట్టు పక్కల పర్యాటక ఆకర్షణలు
ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులని ఆకర్షించే ఎన్నో ఆకర్షణలు కోణార్క్ పర్యాటకం సొంతం. ఈ పట్టణం అద్భుతమైన నిర్మాణం కలిగిన సన్ టెంపుల్ కి ప్రసిద్ది. నిజానికి కోణార్క్ అనే పేరు కోణ అనబడే సంస్కృత పదం నుండి వచ్చింది. కోణ అంటే కోణము అర్క అంటే సూర్యుడు. సూర్యుడికి అంకితమివ్వబడిన ఆలయం అందమైన ఆలయం తో ఈ పేరు వచ్చింది.
ఈ సన్ టెంపుల్ సముదాయం లో మాయాదేవి మరియు వైష్ణవ టెంపుల్ మందిరాలు కలవు. కోణార్క్ లో ని అందమైన ప్రసిద్ది చెందిన ఆలయాల సందర్శనని పర్యాటకులు ఆనందించవచ్చు. కోణార్క్ ప్రధాన దైవం కి అంకితమివ్వబడిన ఆలయం రామచండి టెంపుల్. ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ ఇది.
సన్ టెంపుల్

కోణార్క్ లో ఉన్న సన్ టెంపుల్ అత్యంత ఆకర్షణీయమైనది. కోణార్క్ కి నడి బొడ్డులో ఉన్న ఈ ఆలయం ఓడిశా ఆలయ నిర్మాణ శైలి కి అత్యుత్తమ ఉదాహరణ. రాతి తో చెక్కబడిన అధ్బుత కట్టడం ఇది.
ఈ నిర్మాణ అద్భుతాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులు తరలి వస్తారు. ఈ ఆలయం 13 వ శతాబ్దం లో నరసింహదేవ చేత నిర్మించబడింది.

కనిపించే ఈ శిల్పం.. భారతదేశంలో ఎన్ని నృత్యరీతులను చూపుతుందొ మనకే తెలియదు.. ఈ కుడ్యం(గోడ)లోని ఒక్కొక్క శిల్పం ఒక నృత్య రీతిని సూచిస్తుంది… ఇది ఒక ఆలయం మాత్రమే అని చెప్పడానికి వీలు లేదు… ఇలాంటివి సంగీతం, వీరం, మల్లయుద్ధం, లాంటి కళలు, ఎన్నో జంతుజాలాల శిల్పాలు, శృంగార శిల్పాలు.. ఇలా ఒక్కొక్క గోడ మీద.. ఒక్కొక్క రీతిలో ఆలయం మొత్తం.. ఉంటాయి… అందుకే ఈ ఆలయమును కేవలం ఆలయం అని మాత్రమే చెప్పలేము… ఇది ఏకాలనికైనా ఒక running Encyclopedia అని చెప్పవచ్చు..
ఈ శిల్పం కోణార్క దేవాలయానికి సంబంధించినది… కోణార్క సూర్యదేవాలయం… 13 వ శతాబ్థంలో నరసింహదేవల వారు కట్టించారు… అప్పుడు చెక్కబడిన శిల్పంలో జిరాఫీను.. ఆఫ్రికా జాతికి చెందిన నీగ్రో వారు మనకు కనిపిస్తారు… జిరాఫీను అప్పటి ఓడలలో భారతదేశానికి తేవడం కష్టం… మరియు.. నీగ్రో వారిని చూడడం కూడా కష్టమే… అయితే ఒకేసారి ఏ రెండిటిని శిల్పి ఎలా చూసి ఉంటారు.. ఇది ఒక ప్రశ్న…
ఎప్పుడో 15 వ శతాబ్థంలో వాస్కోడిగామా ఇండియాను(భారతదేశాన్ని కాదు) కనిపెట్టానని గొప్పగా వ్రాసుకున్నారు… వారి తర్వాతే పారిశ్రామిక విప్లవం వచ్చింది అని చెప్పుకున్నారు… అది వాస్తవం కాదు… మన ఓడల వెంటబడి… వాస్కొడీ గామా వచ్చారు… మన చాళుక్యులు చోళులు ఖండాంతర వాణిజ్యం చేసేవారు.. అప్పట్లోనే మన బంగారు జరీ చీరలు… ఆభరణాలు చాలా పేరుగాంచేవి… అలా ఓడలలోనే శిల్పులు కూడా ఉండేవారేమో నని అనిపిస్తుంది… మరియు… జిరాఫీ పట్టే ఓడలు మనకు ఉండేవి… ఈ శిల్పాన్ని చూస్తే రాజుకు నీగ్రోలు జిరాఫీను కానుకగా సమర్పిస్తున్నట్లు మనకు తెలుస్తుంది(నీగ్రోల ముఖకవళికలు, హావభావాలు, శరీరాకృతి వస్త్రధారణ లాంటి చిన్న చిన్న విషయాలను కూడా మనం గమనించవచ్చు…
ఈ ఆలయం లో ఇరవై నాలుగు చక్రాలు కలిగి ఏడు గుర్రాలతో నడపబడుతున్న రధం ఆకృతి కలదు. ఈ రథం సూర్యుని వాహనంగా వ్యవహరిస్తుంది. కోణార్క్ లో ని ఆకర్షణలు అన్నింటిలోకి ఈ అధ్బుతం అత్యంత ఆకర్షనీయంగా ఉంటుంది.
1984 లో ఈ సన్ టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ హోదా ని సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ కోణార్క్ డాన్సు ఫెస్టివల్ వైభవంగా జరుగుతుంది.
ఈ ఆలయం లో ని కొన్ని భాగాలు నాశనం అయినప్పటికీ, పర్యాటకులని ఆకర్షించడం లో ఈ ప్రాంతం ముందు ఉంటుంది.

త్రవ్వకాలలో వెలికితీయబడిన బుద్ధుడి విగ్రహం కలిగిన బౌద్ధ విహారం కురుమ. పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రదేశం. ప్రాచి నది ఒడ్డున ఉన్న కాకతాపూర్ మంగళ టెంపుల్ ఝాము యాత్ర అనబడే ప్రసిద్దమైన వేడుకల వల్ల అనేకమంది పర్యాటకులని ఆకర్షిస్తుంది. చౌరాసి లో ఉన్న బరాహి టెంపుల్ లో ఉన్న విశిష్టత మాతృ దేవత యొక్క విగ్రహం. అష్టరంగా వద్ద విశాల దృశ్య వీక్షణం అధ్బుతంగా ఉంటుంది.
కోణార్క్ మఠ్ కూడా ప్రసిద్ది చెందిన పర్యాటక ఆకర్షణ. వైభవోపేతమైన స్మారక చిహ్నాలు అలాగే ఆధ్యాత్మిక ఆకర్షణలతో పాటు కోణార్క్ లో మంత్ర ముగ్ధుల్ని చేసే బీచ్ పర్యాటకులని కట్టిపడేస్తుంది. ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇందులో సన్ టెంపుల్ సముదాయం లో నుండి సేకరించిన ఎన్నో అవశేషాలు ఉన్నాయి.
కోణార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం
అక్టోబర్ నుండి మార్చ్ వరకు కోణార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. శీతాకాల వాతావరణం ఈ ప్రాంత పర్యటనకు అనువుగా ఉంటుంది.
వసతి సౌకర్యాలు : కోణార్క్‌లో బస చేయగోరినవారు ఇక్కడ వున్న యాత్రినివాస్, పంత్‌నివాస్‌లో లేక కోణార్కలో ఉన్న హోటల్స్‌లో బసచేయవచ్చు.
ప్రయాణ సౌకర్యాలు : కోణార్క్‌కు దగ్గరలో ఉన్న విమానాశ్రయం భువనేశ్వర్ ఇక్కడ నుండి కోణార్క్ 64 కి.మీ. దూరంలో ఉంటుంది. పూరి నుండి 35 కి.మీ దూరంలో ఉన్న కోణార్క్‌కు రైలు ద్వారా కూడా వెళ్ళవచ్చు. పూరీ మరియు భువనేశ్వర్ నుండి కోణార్క్‌కు బస్‌లో కూడా వెళ్ళవచ్చు.భువనేశ్వర్ నుండి 65 కిలోమీటర్ల దూరం లో ఉన్న కోణార్క్ స్మారక కట్టడాలు కలిగిన అందమైన పట్టణం. మనోహరమైన బే ఆఫ్ బెంగాల్ సముద్రతీరం కి ఎదురుగా ఉన్న ఈ చిన్న పట్టణంలో భారత దేశం యొక్క అత్యధ్బుతమైన నిర్మాణ సౌందర్యాలను వీక్షించవచ్చు.