📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

బర్డ్ ఫ్లూ

Google ad
బర్డ్ ఫ్లూ

పక్షులకు ఈ వైరస్ ఎలా సోకుతుంది?

హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది.

ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది.

Google ad

పక్షుల రెట్టల నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు… అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి.

Google ad

కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే వీటి వల్ల ఇతర పక్షులకు వైరస్ వ్యాపించే ముప్పు ఉంటుంది. వలస పక్షుల వల్ల ఇవి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంటాయి.

Google ad
Google ad
బర్డ్ ఫ్లూ

మనుషులకు ఎలా సోకుతుంది?

ఈ వైరస్ సోకిన పక్షులకు సమీపంలో ఎక్కువ సేపు గడిపినప్పుడు ఎక్కువగా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసేవారికి ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా బర్డ్ ఫ్లూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.

వైరస్

అయితే, ఏదో ఒకరోజు ఈ వైరస్ కూడా జన్యు పరివర్తన చెంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధించొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1918లో లక్షల మంది మరణాలకు కారణమైన స్పానిష్ ఫ్లూ ఇలానే పక్షుల నుంచి మనుషులకు సంక్రమించిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

తాజా కోవిడ్-19 వైరస్ కూడా జన్యుపరివర్తన చెందడంతో మనుషుల మధ్య వ్యాపించగలిగే సామర్థ్యాన్ని సంపాదించగలిగింది.

బర్డ్ ఫ్లూ

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, జలుబు, వణుకు లాంటి లక్షణాలతో మనుషుల్లో బర్డ్ ఫ్లూ మొదలవుతుంది.

సాధారణ ఫ్లూ లక్షణాలే బర్డ్ ఫ్లూ సోకినప్పుడూ కనిపిస్తాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి.

చికిత్స ఏమిటి?

లక్షణాలు తగ్గేందుకు యాంటీవైరల్ ఔషధాలను వైద్యులు సూచిస్తారు. పారాసిటమాల్ లాంటి నొప్పి నివారిణులను కూడా ఇస్తుంటారు.

బర్డ్ ఫ్లూ

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎలాంటి ఫ్లూలు విజృంభిస్తున్నప్పుడైనా.. తరచూ చేతులు కడుక్కోవడం; దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు గుడ్డలు అడ్డుపెట్టుకోవడం లాంటి చర్యలతో ముప్పును తగ్గించుకోవచ్చు.

ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించేటప్పుడు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలు కనిపించే వారి నుంచి సామాజిక దూరం పాటించాలి.

కోళ్లు, బాతులకు మీరు ఆహారం వేయొచ్చు. అయితే ఆహారం వేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చనిపోయిన, జబ్బు పడిన పక్షుల దగ్గరకు పోకూడదు.

చికెన్ తినొచ్చా?

శుభ్రంగా వండితే వైరస్ చనిపోతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు.

చికెన్, గుడ్లు శుభ్రంగా, పూర్తిగా వండేలా జాగ్రత్తలు తీసుకునేంత వరకు వీటి నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు.

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading