Logo Raju's Resource Hub

electric Shock ….ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ (ఈసీటీ) అది షాక్‌ కొట్టదు

Google ad

వైద్యపరమైన కరెంటు షాక్‌ అనగానే ….అమ్మో…అనుకుంటారు. సినిమాల్లో సైతం దాన్ని భయంకరంగా చూపిస్తారు. నిజానికి అది ఎంతమాత్రమూ భయంగొలిపేది కాదు. మానసిక వైద్యులు మొదటిసారి రోగి బంధువుకు ఎలక్ట్రిక్‌ షాక్‌ థెరపీ అనగానే వచ్చే సమాధానంతో వాళ్లు భయపడుతున్నట్లు తెలుస్తుంది. మన ప్రచార సాధనాల్లో సినిమాలు, టెలివిజన్‌లో చూపించే హాస్య సన్నివేశాల్లో ఎలక్ట్రిక్‌ షాక్‌ (ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ) ని చాలా భయంకరంగా చూపిస్తారు. ఇది ఏమాత్రం భయంకరం కాదు. ప్రమాదకరమైనదీ కాదు. ఈ ప్రక్రియను ఏడెమినిది దశాబ్ధాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది అనేక మంది ప్రాణాలు కాపాడింది. ఇంకా కాపాడుతోంది. దీనిపై అవగాహనతో పాటు దానిపై ఉన్న అపోహలు తొలగించడానికి ఈ వివరణ
మానసిక వ్యాధితో బాధపడుతున్న అనేకమంది తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ ఎంతో ఉపయోగకరం. ప్రతి ఏటా దాదాపు లక్షమందికి పైగా ఈ చికిత్సను పొందుతున్నారు.
చరిత్ర : కరెంటు షాక్‌ ద్వారా కొన్ని మానసిక వ్యాధులు నయమవుతాయని ఎలా తెలుసుకోగలిగారన్నది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. 1934 లో డాక్టర్‌ మెడూనా అనే శాస్త్రవేత్త క్యాంఫర్‌ను రోగులకు ఇంజక్షన్‌ రూపంలో ఇవ్వడం వలన రోగికి మూర్ఛ (ఫిట్స్‌) ను కలిగించి, మానసిక సమస్యను నయం చేయడానికి ప్రయత్నించారు. సైకోసిస్‌ సమస్యతో బాధపడే రోగులకు మూర్ఛ కలిగించినప్పుడు వారి మానసిక లక్షణాలు తగ్గడం గమనించి, ఫిట్స్‌ కలిగితే సైకోసిస్‌ తగ్గుతుందని దా.మెడూనా తెలుసుకున్నారు.క్యాంఫర్‌ తో ఆ పరిస్ధితిని కలిగించే చికిత్స చేశారు. దాంతో 13 మందికి వ్యాధినయమైంది.
అయితే క్యాంఫర్‌ వలన దుష్ప్రభావాలు కలిగిన కారణంగా, ఇతర పద్దతుల ద్వారా ఫిట్స్‌ను కలిగించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నంలో ఎలక్ట్రో కన్వలిన్సివ్‌ థెరపీ లేదా కరెంటు షాక్‌తో చికిత్స మొదలు పెట్టారు. 1938 లో బి ని, సెరెలెట్టి అనే శాస్త్రవేత్త పరిమిత ఓల్టేజిలో కరెంటును పంపడం ద్వారా మూర్ఛ కలిగించవచ్చని కనుగొన్నారు. తలకు రెండువైపులా ఎలక్ట్రోడ్స్‌ను ఉపయోగించి షాక్‌ ఇచ్చినప్పుడు దాని ప్రభావం మెదడుపై మాత్రమే ఉండి గుండె తదితర భాగాలపై పడకపోవడాన్ని వారు పరిశోధనలో తెలుసుకున్నారు. ఆ కాలంలో సైకోసిస్‌ వంటి మానసిక సమస్యలకు మందులు లేకపోవడంతో ఈసీటీని విరివిగా వాడారు.
తొలినాళ్లలో ఈ ప్రక్రియను రోగికి మత్తు మందు ఇవ్వకుండా చేయడం వ్ల మూర్ఛు కలిగినప్పుడు గాయాు కావడం, ఒళ్లునొప్పు రావడం, ఎముకు గాడితప్పడం, ముఖ్యంగా దవడ ఎముక (జాడిజ్‌ లొకేషన్‌)వంటివి జరగడం ఎక్కువగా ఉండేవి. 1940 లో బెనెట్‌ అనే శాస్త్రవేత్త మత్తుమందు ఇచ్చి ఈ సమస్యలు ఏవీ రాకుండా చికిత్స చేయవచ్చని కనుగొన్నాడు.
శాస్త్రవిజ్ఞానం ఎంతో పెరిగిన ప్రస్తుత దశలో రోగికి మత్తుమందు ఇవ్వకుండా కండరాలకు తగిన విశ్రాంతి కలిగించే మందు ఇచ్చి ఈసీటీ చేయడం వలన రోగికి అసలు ఏమీ జరగలేదనేలా 15 నుంచి 20 నిమిషాలో ఈ ప్రక్రియను చేయడం సాధ్యమవుతుంది. నిద్రలోకి వెళ్లి మళ్లీ లేచినపుడు మాత్రమే రోగికి ఏదో చికిత్స చేశారనే విషయం తెలుస్తుంది. కాని ఎలాంటి బాధ ఉండదు. ఈసీటీ ఇచ్చిన తరువాత సుమారు రెండు గంటల పాటు రోగిని వైద్యులు తమ పర్యవేక్షణలోనే ఉంచుకొని (మత్తుమందు ప్రభావం పోయేంతవరకు) ఆ తరువాత ఇంటికి పంపిస్తారు. అంటే ఈసీటీకి ప్రస్తుతం అత్యంత సులువైన ప్రమాదరహితమైన అవుట్‌పేషెంట్‌ పద్దతి అని తెలుస్తుంది.
ఈ ప్రక్రియ ఎలా పనిచేస్తుంది: మానసిక సమస్యు వాటి కారణాల గురించి తక్కువ అవగాహన ఉంది. మన శరీరంలో ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానానికి ఇంకా అంతుచిక్కనిది లేదా అని తక్కువగా తెలిసింది మెదడు గురించే. ఇది మెదడు తాలూకా సంక్లిష్టతను తెలియజేస్తుంది. మానసిక సమస్యలు గురించి కారణాలు తెలుసుకోవడం అందుకే చాలా కఠినమైన విషయం. మానసిక సమస్యలకు కారణాలు తెలుసుకోవడం అన్నది కూడా సంక్లిష్టమైనది. ఇప్పుడిప్పుడు మెదడుకు సంబంధించిన రహస్యాలు కొద్దికొద్దిగా తెలుస్తున్నాయి.
ఈసీటీ మెదడులో అనేక మాలిక్యులార్‌ బయోకెమికల్‌, ఎండోక్రైన్‌, స్ట్రక్చరల్‌, జెనటిక్‌ స్ధాయిల్లో మార్పును కలుగజేస్తుంది. ఇది వ్యాధి నయం కావడానికి దోహదం చేస్తుంది.
ఈసీటీ ఎవరికి వాడాలి
1.తీవ్రమైన వ్యాకులత ఉన్నవారికి
2.ఆత్మహత్య చేసుకోవాలని తీవ్రంగా కోరుకోవడం, ఆత్మహత్యకు ప్రయత్నించడం.
3. ఆహారాన్ని తిరస్కరించడం
4.మందుతో వ్యాధి నయం కానప్పుడు
5.సైకోటిక్‌ డిప్రెషన్‌ వంటి వ్యాధులకు
6. బైపోలార్‌ డిప్రెషన్‌కు
7. కెటటోనియా : ఈ పరిస్థితిలో రోగి ఉలకకుండా పలకకుండా శిలాప్రతిమలా బిగుసుకుని ఉండిపోతాడు.అది అనేక మానసిక వ్యాధులు కలిగే స్థితి. కెటటోనియా స్థితి నుంచి రోగిని మామూలు స్థితికి తీసుకురావడానికి షాక్‌థెరపీ బాగా ఉపయోగపడుతుంది.
8. స్కీజోఫ్రెనియా
9.మందులు మార్చడం కన్నా ఈసీటీతో మంచి ఫలితాలు ఉంటాయి. అయితే మెదడులో సెరిబ్రోస్పినల్‌ ఫ్లూయిడ్‌ కలిగించే ఒత్తిడి ఉన్నప్పుడు ఈసీటీ వాడకూడదు.
10. ఈసీటీ అన్నది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియ
11.ఈసీటీ వలన కలిగే ప్రయోజనాలే ఇటీవ ట్రాన్స్‌క్రేనియల్‌ మాగ్నెటిక్‌ స్టిమ్యులైజేషన్‌తో కలుగుతాయని కొత్త పరిశోధనలో తేలింది. కాబట్టి ఈసీటీనే అధునాతనంగా ఇవ్వడంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈసీటీపై అపోహలు, వాస్తవాలు….
అపోహ : ఈసీటీ మెదడును గాయపరుస్తుంది.
వాస్తవం : పరిశోధనల్లో ఈసీటీవలన మెదడు నిర్మాణానికి ఎలాంటి గాయాన్ని గాని, ప్రమాదకరమైన మార్పుకు గాయం కలుగజేయదని తెలుస్తోంది.
అపోహ : ఈ సీటీ వలన మతిమరుపు కలుగుతుంది.
వాస్తవం : ఈసీటీవలన జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం చాలా తక్కువ. అయితే ఈసీటీకి ఇచ్చే సమయంలో తాత్కాలికంగా మత్తు మందు ఇస్తారు. కాబట్టి దాంతో కలిగే అయోమయ స్థితివలన ఇలాంటి అభిప్రాయం కలుగుతుంది. అయితే అతి కొద్దిమందిలో ఈసీటీ ఇచ్చినప్పుడు కొంతకాలం తాత్కాలికంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అది 6 నుంచి 8 వారాలు మాత్రమే. ఈసీటీ వలన శాశ్వతమైన జ్ఞాపకశక్తి లోపం చాలా అరుదు.
అపోహ : ఈసీటీ వలన ఒక్కొక్కసారి ప్రమాదకరమైన రీతిలో మెదడులో కరెంటు ప్రవహించవచ్చు.
వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. అప్పుడున్న అధునాతన పరికరా వలన ఇది పూర్తిగా ప్రమాదరహితమైన వైద్యం. ఈసీటీ కు వాడే ఓల్టేజీ కూడా చాలా స్వ్పమైనది. దాంతో మెదడులో కరెంటు ప్రవహించే అవకాశం లేదు. ఆ తక్కువ ఓల్టేజి వలన ఎలాంటి హాని జరుగదు.
అపోహ : ఇది ప్రమాదకరమైనది.
వాస్తవం : ఇది పూర్తిగా ప్రమాదరహితం. అయితే ఈసీటీ వాడే సమయంలో కలిగే అనస్థీషియా వలన ఇతర శస్త్రచికిత్సలలో ఉండే రిస్క్‌ తప్ప దీనితో రిస్క్‌ ఉండే అవకాశాలు లేవు. అనస్థీషియా ఇచ్చేందుకు తగిన ఫిట్‌నెస్‌ ఉందో లేదో చూసుకోవాలి. గుండెజబ్బు, ఇతర శారీరక సమస్యలు ఉన్నయేమో గుర్తించాలి. అప్పుడే అనస్థీషియాతో వచ్చే సమస్యను గుర్తించి నివారించవచ్చు. ఈసీటీ ఇచ్చే సమయంలో ఫల్స్‌ ఆక్సీమీటర్‌ అనే సాధనంతో గుండె, ఊపిరితిత్తులు మొదలైన శారీరక వ్యవస్ధను గమనిస్తు వుంటే ఇతర శారీరక సమస్యలపై పడే ప్రమాదాలను నివారించవచ్చు.
అపోహ : మెదడు దెబ్బతిని మానసిక వ్యాధి కలుగవచ్చు.
వాస్తవం : ఇది పూర్తిగా అవాస్తవం. కరెంటు పెట్టడం వలన ఎలాంటి మానసిక వ్యాధులు రావు. వున్న వ్యాధులు తగ్గుతాయేతప్ప పెరగవు.

Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading