📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

World Tuberculosis Day – 24th March

Google ad

ఒకప్పుడు దీన్ని పేదల సమస్యగా భావించేవారు గానీ ఇది ప్రస్తుతం సంపన్న వర్గాల్లోనూ ఎక్కువగానే కనబడుతుండటం. మనదేశంలో ప్రతి 10 మందిలో నలుగురిలో క్షయ కారక మైకోబ్యాక్టీరియమ్‌ ట్యుబుర్‌క్యులోసిస్‌ సూక్ష్మక్రిమి ఉంటుందని నిపుణుల అంచనా. అయినా కూడా మన శరీరంలో రోగనిరోధకశక్తి ఈ క్రిమిని సమర్థంగా ఎదుర్కొని నియంత్రణలోనే ఉంచుతుంది. సుమారు 10% మందిలో మాత్రం జీవితంలో ఎప్పుడో అప్పుడు ఇది విజృంభించి సమస్యాత్మకంగా పరిణమించొచ్చు. శరీరంలో ఏ భాగానికైనా క్షయ రావొచ్చు. కాకపోతే ఊపిరితిత్తుల క్షయ కేసులే ఎక్కువ. కాబట్టి దీనిపై అప్రమత్తంగా ఉండటం అవసరం. ముందు సూచనలు రెండు వారాలకు మించి విడవకుండా దగ్గు వస్తుండటం. దగ్గినపుడు కళ్లెలో రక్తం పడుతుండటం. దగ్గినపుడు, శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీలో నొప్పిగా ఉండటం. అకారణంగా బరువు తగ్గిపోతుండటం. ఆకలి మందగించటం. నిస్సత్తువ. జ్వరం. రాత్రిపూట చెమటలు పట్టటం.
TB … టి.బి. / క్షయ డా. రఘోత్తమ్‌ రెడ్డి, ఛాతీవైద్య నిపుణులు, యశోదా హస్పటల్‌, హైదరాబాద్‌.
టిబి. / క్షయ టిబి అని సంక్షిప్తంగా పిలిచే ఈ వ్యాధికి ట్యూబర్క్యులోసిస్‌ బ్యాసిల్లస్‌ అనే బ్యాక్టీరియా కారణం. ఈ సూక్షజీవి ప్రతివారి శరీరంలోనూ ఉంటుంది. అయితే వ్యాధి నిరోధకశక్తి తగ్గిన వారిలో మాత్రం వ్యాధి రూపంలో బయటపడుతుంది. ఈ వ్యాధి రెండు రకాలుగా కనిపిస్తుంది.
పల్మోనరి టిబి: వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి ఊపిరితిత్తులను నివాసం చేసుకుని ఈ వ్యాధి బయటపడితే దాన్ని పల్మోనరీ ట్యూబర్క్యులోసిస్‌ అంటారు.
లింఫానాయిడ్స్‌ టి.బి, ఊపిరితిత్తుల బయటి పోరలో నీరు చేరడం, సంతానం లేని మహిళల్లో గర్భాశయంలో టి.బి. అన్నవి ఎక్సా పల్మోనరీ టిబిల్లో ప్రధాన రకాలు.
ఇవే గాక… వెన్నెముక, ఎముక, మొదడు భాగాలకు కూడా టిబీ. వస్తుంది. గతంలో దాదాపు 95 శాతం కేసుల్లో పల్మోనరీ కేసులు కేవలం 5 శాతం మాత్రమే కనిపించేవి.అయితే ఇప్పుడు రకరకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి రావటంతో దాదాపు 40 శాతం మందిలో ఈ ఎక్స్రటా పల్మోనరీ కేసులు కనిపిస్తున్నాయి.
వ్యాప్తి ఇలా : ఊపిరితిత్తులకు వచ్చే పల్మోనరీ టి.బి మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. తుమ్ములు, దగ్గు వంటి కారణాలతో ఈ సూక్ష్మజీవి గాలిలోకి చేరి ఒకరి నుంచి వ్యాపిస్తుంది. ఎక్స్టా పల్మోనరి రోగులనుంచి ఇతరులకు సంక్రమించదు. వ్యాధి నిరోధకశక్తి తగ్గడం వలన సూక్ష్మజీవి బలపడి ఈ వ్యాధి బయటపడుతుంది. ఇదీగాక ఇటీవల మారిన జీవనశైలిలో ఒత్తిడి, నిద్రలేమి, పనిభారం, కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం పెరిగినందువల్ల ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
వ్యాధి లక్షణాలు : టి.బి. బ్యాక్టీరియా మన శరీరంలో నివాసం ఉండే స్థానాన్ని బట్టి వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అది ఊపిరితిత్తుల్లో ఉంటే ఎడతెరపిలేకుండా దగ్గు రావడం, కళ్ళె పడటం, దగ్గినపుడు రక్తం పడటం, ఆకలి, బరువు తగ్గడం, నీరసించిపోవటం వంటి లక్షణాలు ఉంటాయి. ఎక్స్ టా పల్మోనరీ టి.బీల్లో కొన్ని ఇతర లక్షణాలతో పాటు బరువు తగ్గుతుండటం, జ్వరం, నీరసం వంటి లక్షణాలు ఉంటాయి.
నిర్థారణ పరీక్షలు : సాధారణంగా ఎక్స్‌-రే, కళ్ళె పరీక్షలతో 60% నుంచి 70% శాతం కేసుల్లో టిబీని నిర్థారించవచ్చు. వీటితో నిర్థారణ కాకపోతే అపుడు టి.బి. సెరోలజీ, పిసిఆర్‌, వంటి పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇవేగాక అవసరాన్ని బట్టి సిటిస్కాన్‌, బోన్‌స్కాన్‌, బయాప్సీ వంటి పరీక్షలు చేయించాలి.
చికిత్స : ఒకప్పుడు టి.బి. అంటే ఏదో పెద్ద జబ్బు అనుకునేవారు ఇప్పుడు దీన్ని పూర్తిగా తగ్గించడానికి నిర్థిష్టమైన మందులు ఉన్నాయి. 1) ప్రైమరీ డ్రగ్స్ : వీటిని ఆరు నెలలనుండి ఏడాది పాటు వాడితే టిబిని పూర్తిగా నయం చేయవచ్చు. రోగి బరువును బట్టి మందుల మోతాదు నిర్ణయిస్తారు. అయితే ఏదైనా కారణాల వల్ల పూర్తికాలం పాటుమందు వాడకపోయినా, తగిన మోతాదుల్లో తీసుకోకపోయినా వ్యాధి క్రిములు మందులకు లొంగకుండా మొండిగా తయారవుతాయి.
ఒక్కోసారి డాక్టర్‌ పర్యవేక్షణ లేకుండా టిబీ. మందులను కొనుగోలు చేసి ఇష్టానుసారం వాడటం వల్ల కూడా వ్యాధి లొంగకుండా ముదరవచ్చును. అలా ముదిరిన ఆ వ్యాధిని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టి.బీగా పిలుస్తారు.
2) సెకండ్‌ లైన్‌ డ్రగ్స్ : మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టి.బి. ఉన్నవారికి ఇచ్చే మందులను రిజర్వ్‌ డ్రగ్స్ లేదా సెకండ్‌ లైన్‌ మందులుగా పేర్కొంటారు. నిజానికివి టి.బి. మందులు కావు. అనేక రకాల యాంటీబయాటిక్స్‌తో ఈ మందులను రూపొందిస్తారు. ఖరీదు కూడా ఎక్కువే. దుష్ప్రభావాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) కూడా ఎక్కువే.
3) నివారణ: ప్రతివారిలో టిబీ. బ్యాక్టీరియా తేలిగ్గా ప్రవేశించి శరీరంలో ఆశ్రయం తీసుకుంటుంది. ఇలా జరగటాన్ని నివారించలేము. అయితే శరీరంలో ఆ వ్యాధి పొడ చూపకుండా ఉండాలంటే మన వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే చేయాల్సింది కూడా చాలా సులువు. క్రమబద్ధమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండేలా చూసుకోవాలి. సమయానికి భోజనం చేయడం. భోజనంలో సమతుల ఆహారం అంటే ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉండే గుడ్లు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు వంటివి తీసుకోవాలి. ఒత్తిళ్ళు లేకుండా ఉండాలి. పొగత్రాగడం పూర్తిగా మానేయాలి. ఆల్కహాల్‌ అలవాటును పూర్తిగా వదిలేయాలి.
4) వ్యాధిని వీలైనంత మందుగా గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలి. సరిగ్గా మందులు వాడటం కూడా ఇతరులకు వ్యాధి రాకుండా నివారించడమే అవుతుంది.
5) డాట్స్ చికిత్స : ప్రభుత్వం టి.బీ రోగులకు చికిత్స అందించే కార్యక్రమంలో ఒక భాగమే డాట్స్. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ వాలెంటీర్లు రోగులకు ఉచితంగా మందులు ఇవ్వడమే కాకుండా స్వయంగా దగ్గరుండి మందులు తీసుకునేలా చూస్తారు. వ్యాధి తీవ్రతను బట్ట రోగులను మూడు రకాలుగా విభజించి వారు ఈ మందులు పూర్తి కోర్సు వాడేలా జాగ్రత్త తీసుకుంటారు. దీన్నే డాట్స్ అంటారు.
6) ఇటీవల సెకండ్‌ లైన్‌ మందులను కూడా ఈ కార్యక్రమం కింద ఉచితంగా ఇస్తున్నారు. బాల్యంలో ఇచ్చే బి.సి.జీ వ్యాక్సిన్‌ టిబీని పూర్తిగా అరికట్టలేదు. అయితే దీని తీవ్రత పెరగకుండా చేయగలదు. బి.టి ఎండిఆర్‌ దశకు చేరాక మందులు వాడటం కంటే ప్రైమరీ మందులతో తగ్గించుకోవటం తేలిక. అలా నయం చేసుకోవటమే మంచిది

Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading