మారేడు, బిల్వవృక్షం చెట్లను ఇండియన్ క్విన్స్గోల్డెన్ యాపిల్ స్టోన్ యాపిల్ వుడ్, యాపిల్ అంటూ రకరకాల పేర్లూ ఉన్నాయి. ఎగెల్ మార్మలోస్ దీని శాస్త్రీయనామం(Aegle Marmelos). రూటేసి కుటుంబానికి చెందిన చెట్టు ఇది. సిట్రస్ జాతులైన బత్తాయి, నిమ్మ చెట్లు ఈ జాతివే.
ఆధ్యాత్మికంగానూ, ఔషధగుణాలపరంగానూ ఈ వృక్షానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అందుకే శివరాత్రి రోజున శివుణ్ణి, వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మారేడు ఆకులతో పూజిస్తారు. ఈ మారేడు దళాలు అంటే మహాదేవుడికి ఇష్టం. హిందువులంతా పవిత్ర వృక్షంగా భావిస్తుంటారు. అందుకే చాలా ఆలయాల్లో మారేడు మొక్కల్ని పెంచుతుంటారు. రుగ్వేదంలో ఈ చెట్టు ప్రస్తావన ఉంది
ఈ వృక్షానికి భారత దేశంతో పాటు, శ్రీలంక, నేపాల్ మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్ని పుట్టిళ్లుగా చెబుతారు. థాయ్‌లాండ్ ఆలయాల్లోనూ ఈ చెట్లు కనిపిస్తాయి. దాదాపుగా అన్ని రకాల వాతావరణాల్లోనూ, నేలల్లోనూ పెరుగుతుంది.
సుమారుగా 40 నుంచి 50 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇవి నెమ్మదిగా ఎదిగే చెట్లు. వీటి ఆకులు ఒకే తొడిమకు మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఈ మారేడులోనే మరో రకం ఏకబిల్వం. ఈ చెట్టుకు ఒకే తొడిమకు ఒకే ఆకు ఉంటుంది. అయితే ఈ మూడు పత్రాలూ కలిసే ఉంటాయి.
పువ్వులేమో ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇవి కమ్మని వాసనను వెదజల్లుతాయి. బెరడు పాలిపోయిన గోధుమ రంగులో కనిపిస్తుంది. మారేడు కాయలు గట్టిగా కాస్త వెలగ పండ్లని పోలి ఉంటాయి. పండు లోపల గుజ్జుతోపాటు విత్తనాలుంటాయి
వేల సంవత్సరాల క్రితం నుంచే మారేడు చెట్టు భాగాల్ని ఆయుర్వేదంలో, సంప్రదాయ వైద్యవిధానాల్లో ఉపయోగిస్తున్నారు.
వేసవిలో ఈ పండు రసం తాగితే చాలా మంచిదంటారు. శరీరంలో వేడి పోవడంతో పాటు తక్షణశక్తి వస్తుందంటారు. అందుకే పశ్చిమబెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో ఈ పండ్ల షర్బత్‌లు చేసుకుంటారు. ఒడిశా రకపు మారేడు పండ్లు గుమ్మడికాయంత పరిమాణంలో పెద్దగా ఉంటాయి. బిల్వ ఫలాల్లో ప్రోటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, క్యాల్షియం, పొటాషియం, పీచు, ఇనుము ఎక్కువగా ఉంటాయి.
Indian Bael Tree … మారేడు చెట్టు
Google ad
Google ad
Raju's Resource Hub