📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

అమర్ నాథ్ – ప్రధాన యాత్రా స్థలం

Google ad
శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన “శివ లింగం”,ఇక్కడి ముఖ్య ఆకర్షణ. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు.

హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యం తో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు.హిమాలయాలకు వెళ్ళే దారిలో, పరమశివుడు తన తలపై ఉన్న చంద్రున్నిచందన్వారి వద్ద, తన వృషభం నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని ప్రతీతి. పిదప, శివుడు, తన తనయుడు, గజ దేవుడైన గణేశునిమహగుణాస్ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్ నాగ్ వద్ద విడిచి పెట్టాడు. తర్వాత, మహా శివుడు, పంచ భూతాలని పంచ్ రత్ని వద్ద వదిలి గుహ లోకి వెళ్ళాడని నమ్మిక.

Google ad

అప్పడు శివుడు, తన మాటలను ఎవరూ వినకుండా ఉండేందుకు గానూ, గుహ లో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు. అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న రెండు పావురం గుడ్లకి మాత్రం ఎటు వంటి హాని జరగలేదు. ఆ రెండు గుడ్లు, శివుడు రహస్యాన్ని వివరిస్తూ ఉండగా,నిశ్శబ్దంగా పొదిగి,మాటలను దొంగ చాటుగా వినేసాయి.

Google ad

అమర్ నాథ్ యాత్ర



Google ad
Google ad
అమర్‌నాథ్‌ యాత్ర ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో అంతకు మించిన క్లిష్టతతో కూడుకున్న ప్రయాణం ఇది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. హిమాలయాల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున, చుట్టూ ఆవరించిన మంచు పర్వతాల మధ్య నెలకొన్న గుహాలయం ఇది. దాదాపు నలభై మీటర్ల ఎత్తులో ఉండే గుహలో హిమరూపంలో పరమశివుడు దర్శనమిస్తాడు. ఏడాదిలో కొంతకాలం తప్ప మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పి ఉంటుంది. ఆ ప్రాంతంలో మే నుంచి ప్రారంభమయ్యే వేసవి కాలంలో మాత్రమే అక్కడికి చేరుకోగలరు. వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. అమర్‌నాథ్‌ యాత్ర చేస్తున్నవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలివి.
గుర్తింపు వివరాలు
యాత్రకు మీరు అనుమతి పొందినట్టు ధ్రువీకరించే రిజిస్ట్రేషన్‌ కార్డు తీసుకువెళ్ళడం మరచిపోవద్దు. ఈ కార్డు లేకపోతే యాత్రకు అనుమతించరు. అలాగే మీ ఐడి ప్రూఫ్‌ కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు, చిరునామా, యాత్రలో మీతోపాటు పాల్గొంటున్న వారి వివరాలు, మీ కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు కాగితం లేదా చిన్న పుస్తకంలో రాసి మీతో పాటు ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నప్పుడు వాటి అవసరం ఉండొచ్చు.
ఆరోగ్య పరీక్షలు
13 ఏళ్ల లోపు బాలబాలికలనూ, 75 ఏళ్లు దాటిన వారినీ ఈ యాత్రకు అనుమతించరు. యాత్రకు వెళ్లే భక్తులు పూర్తి స్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే గుండె సంబంధిత ఈసీజీ, 2డి-ఎకో తదితర పరీక్షలను వయసును బట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాపీలను యాత్ర సమయంలో దగ్గర ఉంచుకోవాలి.
బీమా ……..
ఇది ప్రమాదకరమైన యాత్ర. కాబట్టి బీమా తీసుకోండి. సుమారు మూడు లక్షల రూపాయల వరకూ గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ను అమర్‌నాథ్‌ యాత్ర బోర్డు అందిస్తోంది. తగినంత నగదు: దారిలో ఆహారం, అవసరమైన పరికరాలు కొనుక్కోవడానికీ, బస చేయడానికీ అవసరమైన నగదు తీసుకువెళ్ళండి.
మార్గంలో మన కోసం…
ఆహారం: బిస్కట్లు, మిల్క్‌ పౌడర్‌, చక్కెర, డ్రైఫ్రూట్స్‌, గ్లూకోజ్‌, ఇతర తినుబండారాలూ మీతో పాటు తీసుకువెళ్ళండి. సీసాతో నీళ్ళు, గ్లాసు, స్పూన్లు, ఒక ప్లేట్‌ మీ కిట్‌లో చేర్చుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. మార్గమధ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సరుకుల దుకాణాలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే రెస్టారెంట్లు, టీ దుకాణాలు ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా ఆహారాన్నీ, దారిపొడుగునా మంచి నీటినీ అందిస్తున్నాయి. ఖాళీ కడుపుతో ప్రయాణం చెయ్యకూడదు. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
హెలీ సేవలు
యాత్రికుల కోసం వివిధ సంస్థలు హెలికాఫ్టర్‌ సేవలు అందిస్తున్నాయి. నీల్‌గ్రాత్‌ (బల్తాల్‌) నుంచి పంచ్‌తరణి వరకూ ఒక వైపు ప్రయాణానికి రూ. 1,600, పహల్గామ్‌ నుంచి పంచ్‌తరణి వరకూ ఒకవైపు ప్రయాణానికి రూ. 2,751 ఛార్జీలుగా నిర్ణయించారు.(2018)
నో ప్రీపెయిడ్‌:
జమ్మూ-కాశ్మీర్‌లో, యాత్ర జరిగే ప్రాంతంలో ఇతర రాష్ట్రాల ప్రీపెయిడ్‌ సిమ్‌ కార్డులు పని చెయ్యవు. భక్తులు తమ బృందంలో ఒక్కరికైనా పోస్ట్‌ పెయిడ్‌ ఫోన్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎ్‌సఎన్‌ఎల్‌ వారి కనెక్షన్‌ ఉన్న ఫోన్‌ను వెంట ఉంచుకోవడం ఉత్తమం. లేదంటే బల్టాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌ల వద్ద ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డుల్ని కొనుక్కోవచ్చు. ఏ సేవకు ఎంత మొత్తంలో చెల్లించాలో అమర్‌నాథ్‌ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ వివరాలతో బోర్డులు ఉంటాయి. ఆ మేరకు మాత్రమే చెల్లించండి.
ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్
వేసలైన్‌, కోల్డ్‌ క్రీమ్‌, మోశ్చరైజర్‌, లిప్‌ బామ్‌, సర్జికల్‌ కాటన్‌, నొప్పి నివారణ మాత్రలు, స్ర్పేలు, చిన్న చిన్న గాయాలు, ఆరోగ్య ఇబ్బందులకు అత్యవసరంగా ఉపయోగపడే మందులతో ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌ మీతో ఉంటే మంచిది. కర్పూరం కూడా తీసుకువెళ్ళండి. శ్వాసకోశ సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.
ఇతర పరికరాలు:
దారి మిట్టపల్లాలుగా ఉంటుంది. సుమారు మూడు కిలోమీటర్లకు పైగా మంచు మీద నడవాల్సి ఉంటుంది. కనుక ఊత కోసం పొడవైన కర్ర లేదా వాకింగ్‌ స్టిక్‌ తీసుకు వెళ్ళండి. టార్చిలైట్‌ కూడా దగ్గర ఉంచుకోండి.
దుస్తులు
అమర్‌నాథ్‌ మంచు ప్రదేశం. చలి ఎముకలు కొరికేస్తూ ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచడంతోపాటు వెచ్చదనాన్ని అందించే దుస్తులు ఈ యాత్రకు తప్పనిసరి. కాబట్టి ఊలుతో చేసిన స్వెట్టర్లు, ఫ్యాంట్లు, మంకీ క్యాప్‌లు, చేతి తొడుగులు ధరించండి. బయటి నుంచి గాలి శరీరాన్ని తాకకుండా జాగ్రత్త పడండి. రైన్‌ కోట్‌, స్లీపింగ్‌ బ్యాగ్‌, చలిని బాగా తట్టుకోగలిగే రగ్గులు, గొడుగు తీసుకువెళ్ళండి. సాధారణమైన చెప్పులు, షూస్‌ వేసుకోకండి. మంచులో నడవాల్సి ఉంటుంది కనుక వాటర్‌ ప్రూఫ్‌ బూట్లు ధరించండి. స్లిప్పర్లతో, కాళ్ళకు ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా నడవకూడదు. చెవుల్లోకి చలి గాలి వెళ్ళకుండా దూది పెట్టుకుంటే మేలు.
మహిళలు చీరలు ధరించకపోవడం మంచిది. ఫ్యాంట్లు బెస్ట్‌. లేదంటే సల్వార్‌ సూట్లు వేసుకోవచ్చు. ధోవతీల్లాంటివి వద్దు.
వసతి
యాత్ర జరిగే సమయంలో జమ్మూ-కాశ్మీర్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ దారి పొడుగునా గుడారాలు ఏర్పాటు చేస్తుంది. వీటిలో వివిధ సౌకర్యాలుంటాయి. ప్రైవేటు వసతి కూడా అందుబాటులో ఉంటుంది. బేస్‌ క్యాంపుల వద్ద వీటిని బుక్‌ చేసుకొవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయాణం……...
డోమెల్‌, చందన్‌వారీల వద్ద ప్రవేశ ద్వారాలు సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ తెరుస్తారు. ఆ సమయానికల్లా గేట్‌ దగ్గరకు యాత్రికులు చేరుకోవాలి. గేట్లు మూసిన తరువాత యాత్రికులు ప్రయాణానికి అనుమతించరు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత పంచ్‌తరణి క్యాంప్‌ నుంచి గుహాలయం వైపు ప్రయాణించకండి. సాయంత్రం 6 గంటల తరువాత దర్శనానికి అనుమతించరు.
రాత్రిపూట గుహల దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. ఆక్సిజన్‌ బాగా తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి చీకటి పడకముందే వెనక్కి బయలుదేరడం మంచిది.
తొందరగా వెళ్తామన్న ఆలోచనతో ఇతరుల్ని ఓవర్‌టెక్‌ చెయ్యడం, ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించడం లాంటివి చేయకూడదు. మీరు ప్రయాణించేది ప్రమాదకరమైన మార్గం. రెప్పపాటు పొరపాటు జరిగినా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ప్రయాణం చేయాలి.
అమరనాథ్‌ ఆలయ బోర్డు గుర్రాలు, డోలీల నిర్వాహకులకు లైసెన్స్‌ కార్డులు ఇస్తుంది. అధికారికంగా నమోదైన వ్యక్తుల సేవలు మాత్రమే వినియోగించుకోండి. వారు మీతో పాటే వచ్చేలా చూసుకోండి. వారిని వదిలి దూరంగా వెళ్ళకండి. వారి పేరు, వివరాలు ఉన్న కార్డులు తీసుకోండి.
యాత్ర అధికారులు ఎప్పటికప్పుడు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. యాత్ర సమయంలో అమరనాథ్‌ ఆలయ బోర్డు సిబ్బంది, పోలీసులు, పర్యాటక, ఆరోగ్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళను అడిగి తెలుసుకోండి.
డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ కప్పులూ, ప్లేట్లను వినియోగించకండి. పాలిథిన్‌ వాడకం జమ్మూ-కాశ్మీర్‌లో నిషేధం. చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పడేయండి.

హిందూ వినాశన దైవం (లయకారుడు) అయిన మహా శివుని భక్తులు అమర్ నాథ్ యాత్ర కు పూనుకుంటారు. ఈ యాత్రను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 5వ హిందూ మాసం అయిన శ్రావణం లోనిర్వహిస్తుంది. అమర్ నాథ్ యాత్రికులు సాధారణంగా కఠినమైన వాతావరణ పరిస్థితులు, ఏటవాలు అధిరోహక బాటలు లాంటి అనేకానేక బాధలను ఎదుర్కొంటారు.
ఈ కష్టతరమైన యాత్ర,పహల్గాం పట్టణం నుంచి మొదలవుతుంది. అమర్ నాథ్ గుహ కి వెళ్ళే దారిలో ఎదురయ్యే పరిసరాల అందం, యాత్రికులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. జూన్, జూలై, ఆగష్టు నేలలను తప్పించి మిగతా కాలమంతా చుట్టు పక్క ప్రాంతాన్ని అంతటినీ మంచు కప్పివేస్తుంది. అందువల్ల, ఆలయం కేవలం ఈ నెలలలో మాత్రమే తెరవబడి ఉంటుంది.

అమర్ నాథ్ గుహ చేరుకోగానే, యాత్రికులు పావురాల జంటను చూడవచ్చు. వ్యాప్తి లో ఉన్న నమ్మకం ప్రకారం, శివుని రహస్యం చాటుగా విన్న ఆ రెండు పావురాలు, మరల మరల జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే అవి అమర్ నాథ్ గుహను తమ నిత్య నివాసం గా చేసుకున్నాయి.
6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన, నీలమాత పురాణం లో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు. ఈ పురాణం కాశ్మీరీల కర్మకాండ ను మరియు వారి సాంస్కృతిక జీవన శైలులను వివరిస్తుంది. క్రీ. పూ 34 లో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజ తో కూడా అమర్ నాథ్ ముడిపడి ఉంది. కాలక్రమంలో ఈ రాజు, తన రాచరిక హక్కును విసర్జించాడు. వేసవుల్లో అతను ఇక్కడికి చేరుకొని సహజ రీతిన మంచుతో తయారయినశివ లింగాన్ని పూజించాడని నమ్ముతారు. రాజతరంగిణి లో కూడా అమర్ నాథ్ అమరేశ్వర గా పేర్కొనబడింది. 1420 మరియు 1470 ల మధ్య జరిగిన తన అమర్ నాథ్ యాత్రా కాలం లో సుల్తాన్ జైన్లబిదిన్, షా కోల్ అనే కాలువ నిర్మించాడు.
అమర్ నాథ్ యాత్రలో, ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్ నాథ్ గుహను తప్పక చూడాలి. ఈ గుహ లో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు “శివ లింగం” ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివ లింగం పెరగటం తరగటం జరుగుతుంది. మే నుంచి ఆగష్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది.ఈ గుహ 5000 ఏళ్ల నాటిదిగా చెప్పబడుతుంది.ఇది శివుడు పార్వతి దేవి కి అమరత్వ రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతుంది.

అమరనాథ్ గుహ


గణేశునికి,పార్వతి దేవి కి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి. భారతీయ సైన్యం, భారతీయ పారామిలటరీ దళాలు, సి.ఆర్.పి.ఎఫ్, ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి. అందువల్ల, అమర్ నాథ్గుహ ను సందర్శించాలంటే ఉన్నత అధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి.

శేష్ నాగ్ సరస్సు

అమర్ నాథ్ లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ. ఇది పహల్గాం కి 27 కి.మీ ల దూరంలో ఉంది. ఈ సరస్సు, సముద్ర మట్టానికి 3658 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల, జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. హిందూ పురాణాలలోని ఏడ తలల సర్ప రాజు శేష్ నాగ్ నుంచి వచ్చింది. దీని చుట్టుతా 7 శిఖరాలు ఉండటం కూడా విశేషం. ప్రయాణికులు పహల్గాం నుంచి రెండు రోజుల కాలి నడకన ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ సరస్సు, శీతాకాలం మొత్తం, జూన్ నెల దాకా మంచు తో కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో అమర్ నాథ్ యాత్రికులు , పర్యాటకులు ఈ సరస్సు కి భారీ సంఖ్యలో వస్తారు.

అమర్ నాథ్ సందర్శించేవారు, విమానం లో గానీ రైలు లో గానీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి అత్యంత దగ్గరలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం. ఇది ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తో చక్కగా అనుసంధానించబడింది. అమర్ నాథ్ ని రైలు లో చేరగోరే వారు జమ్మూ రైల్వే స్టేషన్ కు చేరుకోవచ్చు. ఇక్కడికి దేశం లోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి రైళ్లు ఉన్నాయి.

వేసవి లో సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. అయితే, శీతాకాలం విపరీతమైన చలిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత -5 డిగ్రీల దాకా పడిపోతుంది. అమర్ నాథ్ సాధారణంగా నవంబర్ నుంచి మార్చి/ఏప్రిల్ దాకా మంచు తో కప్పబడి ఉంటుంది. ఏడాది లో ఏ సమయంలోనైనా వర్షాలు పడవచ్చు. వర్షాలు అమర్ నాథ్ యాత్రకు అడ్డంకి గా మారతాయి. అమర్ నాథ్ దర్శించడానికి మే నుంచి అక్టోబర్ మధ్యనెలలు సరైన సమయం.




Google ad
Google ad
Google ad
Google ad

Leave a Reply

Advertisement
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading