Logo Raju's Resource Hub

గురువాయూర్ – భగవంతుడి రెండవ నివాసం

Google ad

గురువాయూర్ పట్టణం కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం విష్ణు మూర్తి అవతారమైన శ్రీక్రిష్ణుడి నివాసంగా భావిస్తారు. గురువాయూర్ కేరళలో ప్రసిద్ధి చెందిన పర్యాటక స్ధలం.
గురువాయూర్ పేరులో మూడు పదాల కలయిక కలదు. గురు అంటే గురువు బ్రిహస్పతి, వాయు అంటే వాయు దేవుడు, ఊర్ అంటే మళయాళంలో ప్రదేశం అని అర్ధం. ఈ ప్రదేశం ఒక పురాణం మేరకు ఏర్పడింది. కధనం మేరకు బ్రిహస్పతి కలియుగం మొదటిలో శ్రీక్రిష్ణుడి విగ్రహం ఒక దానిని కనుగొన్నాడని, దానిని వాయుదేవుడితో కలసి ఆవిష్కరించాడని కనుక దీనికి గురువాయూర్ గా పేరు వచ్చిందని చెపుతారు.

గురువాయూర్ ఆకర్షణలలో ఈ క్రిష్ణుడి విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ. విగ్రహానికి నాలుగు చేతులలోను శంఖం, సుదర్శన చక్రం, కౌముదకి మరియు ఒక పద్మం ఉంటాయి. ఈ దేవాలయం అక్కడకు వచ్చే భక్తుల సంఖ్యను బట్టి దేశంలో నాలుగవ పెద్ద దేవాలయంగా చెపుతారు. ఈ దేవాలయం భూలోక వైకుంఠమని ఇక్కడ విష్ణు మూర్తి నివసిస్తాడని విశ్వసిస్తారు. హిందూయేతర ప్రజలను అనుమతించనప్పటికి, వారు దేవాలయం బయటనుండి చూడవచ్చు.
పున్నత్తూర్ కొట్టలో ఏనుగుల శిబిరం కలదు. ఈ ప్రదేశం గురువాయూర్ లో ప్రధాన ఆకర్షణ. ఇక్కడకల చౌవల్లూర్ బీచ్ లో మీరు విహరించి అందమైన పరిసరాలను ఆస్వాదించవచ్చు. దేవస్వామ్ మ్యూజియం కూడా దర్శించదగిన స్ధలమే. ఇక్కడ కుడ్య చిత్రాల లేఖన శిక్షణ ఉంటుంది.
గురువాయురప్పన్ దేవాలయం



గురువాయురప్పన్  దేవాలయం ఇండియాలో ప్రసిద్ధిచెందినది. ప్రతి రోజూ వేలాది భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ గుడి ని భూలోక వైకుంటం అంటారు. ఈ దేవాలయంలో దేముడు బాల గోపాలన్ కృష్ణుడి శిశువు . దేవాలయం వివిధ రకాల కుడ్య చిత్రాలతో కృష్ణుని లీలలను చూపుతూ అందంగా అలంకరించ బడి వుంటుంది. దేవాలయం కర్ణాటక సంగీతం మరియు అనేక సాంప్రదాయక నృత్య శిక్షణలను నేర్పిస్తోంది. ప్రతిరోజూ భక్తులకు రోజుకు రెండు మార్లు ఉచిత భోజనాలను పెడతారు. పెళ్ళిళ్ళు జరుగాతాయి. ఈ దేవాలయంలో ఏనుగులతో జరిగే శివేలి ఉత్సవాన్ని తప్పక చూడాలి. గురువాయూరప్పన్ దేవాలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం.

ఏనుగుల శిబిరం


ఏనుగుల శిబిరం గురువాయురప్పన్ దేవాలయంకి సుమారు ౩ కి.మీ. దూరంలో పున్నతుర్ కొట్టలో కలదు. ఈ ఏనుగుల శిబిరం ఇండియాలోనే అతి పెద్దది. ఇది పున్నత్తూరు రాజులకు చెందినది. ఈ శిబిరం సుమారు పది ఎకరాలలో వుంది సుమారు 60 ఏనుగులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ శిబిరం లోని ఏనుగులు గురువాయురప్పన్ దేవాలయంకు భక్తులచే ఇవ్వబడ్డాయి .ప్రసిద్ధిచెందిన గురువాయుర్ పద్మనాభన్ మరియు గురువాయుర్ కేసవన్ లు ఈ శిబిరానికి చెందినవే. ఇవి అధిక సంఖ్యలో జనాలను ఆకర్షిస్తాయి. దేవాలయ పండుగలలో మరియు ఊరేగింపులలో దేవతలను మోస్తాయి. అంతేకాకఈ ఏనుగులు దేవాలయం నిర్వహించే పందేలలో పాల్గొంటాయి. రేసులో గెలిచిన ఏనుగును గురువాయురప్పన్ విగ్రహాన్ని మోయటానికి వినియోగిస్తారు.

గురువాయూర్ లో అనేక పండుగలు, ఉత్సవాలు ఎంతో ఉల్లాసంగా జరుగుతాయి. హిందూ నెల కుంభ లో పదిరోజుల ఉత్సవం పండుగ జరుగుతుంది. కేరళ ప్రజలకు విష్ణు కొత్త సంవత్సరంలో మొదటి రోజు. కొత్త సంవత్సరం రోజున గురువాయూర్ దర్శన శుభసూచకంగా భావిస్తారు. అష్టమి రోహిణి మరో పండుగ. ఇది క్రిష్ణుడి పుట్టిన రోజు. ఎంతో భక్తితో ఆచరిస్తారు. దీనినే జన్మాష్టమి అని కూడా అంటారు. మండలం, కుచేల డే, చెంబై మ్యూజిక్ పండుగ, ఏకాదశి, వైశాఖ మరియు నారాయణీయం రోజులు, ఇతర పండుగలు.

గురువాయూర్ వాతావరణం వేడి అయినప్పటికి సంవత్సరంలో ఏ సమయంలో అయినా సరే దర్శించవచ్చు. మీరు పండుగలు, ఉత్సవాలు ఆసక్తి కలవారైతే, మీ పర్యటన ఆగస్టు నుండి నవంబర్ వరకు ప్రణాళిక చేయండి. లేదా శీతాకాలంలో పర్యటించండి.
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading