Logo Raju's Resource Hub

రుద్ర ప్రయాగ – రుద్రుడి పవిత్ర నివాసం

Google ad

రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఒక చిన్న పట్టణం. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత కొంత భాగం తీసుకొనబడి ఏర్పరచబడినది. ఆ జిల్లాలు చమోలి, పౌరి మరియు తెహ్రి జిల్లాలు. ఈ జిల్లాను 16 సెప్టెంబర్ , 1997 లో ప్రకటించారు. ఈ టవున్ మందాకినీ మరియు అలకనంద నదుల సంగమంలో కలదు.

పర్యాటకులు మరొక ప్రసిద్ధ ఆకర్షణ అయిన జగదంబ టెంపుల్ కూడా రుద్రప్రయాగ్ టెంపుల్ సమీపంలో చూడవచ్చు.అగస్త్యముని టవున్ లో కల అగస్తేశ్వర్ మహాదేవ టెంపుల్ ను కూడా పర్యాటకులు దర్శిస్తారు. అగస్త్య మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసాడని చెపుతారు. రుద్రప్రయాగ్ లో దేవోరియ సరస్సు ఒక ప్రసిద్ధ ఆకర్షణ. సముద్ర మట్టానికి 2438 మీటర్ల ఎత్తున కల ఈ సరస్సు చౌఖంబ శ్రేణులతో పాటు ఇక్కడే కల గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ, యమునోత్రి మరియు నీల కంట శిఖరాలను చూపుతుంది. ఇక్కడ బర్డ్ వాచింగ్, బోటింగ్ మరియు యాన్గ్లింగ్ లు ఆనందించవచ్చు.



ఇక్కడ కల త్రియుగినారాయన్ అనే చిన్న గ్రామంలో హవన్ కుండ్ అనే నిరంతరం వెలిగే జ్యోతిని కూడా చూడవచ్చు. స్థానికుల నమ్మకాల మేరకు ఈ గ్రామం హిమవత్ రాజ్య రాజధాని అని ఇక్కడ ఈ జ్యోతి సమక్షంలో పార్వతీ పరమేస్వర్లు వివాహం చేసుకున్నారని చెపుతారు. రుద్ర ప్రయాగ్ లో ఇంకనూ చూడవలసినవి గుప్తకాశి, ఉఖి మట్ , వాసుకి తాల్, జఖోలి మరియు తుంగనాత్ వంటివి కలవు. టూరిస్టులు కలిమాట్, కార్తిక్ స్వామీ టెంపుల్, ఇంద్రసాని మానస దేవి టెంపుల్, చంద్రశిల, మా హరియాలి దేవి టెంపుల్, కోటేశ్వర్ టెంపుల్ మరియు, మాడ మహేశ్వర్ గుళ్ళు చూడవచ్చు.

రుద్రప్రయాగ్ వాయు, రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి వుంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.
Google ad

Leave a Reply

Google ad
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading