బొంగు చికెన్
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొండారెడ్డి గిరిజన తెగకు చెందిన వారు బొంగు చికెన్‌ను మొట్టమొదటగా తయారు చేసినట్లు చెబుతారు. ఈ వంటకాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలోని మల్టీ క్విజీన్ రెస్టారెంట్లలో సర్వ్ చేస్తున్నారు. ‘‘ఈ ప్రాంతంలో ఉన్న అందమైన సెలయేళ్లు, వెదురు బొంగు చికెన్ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

ఇలా తయారవుతుంది…
ప్రత్యేకమైన వెదురు బొంగును ఎంచుకుని, మ్యారినేట్ చేసిన చికెన్‌ను ఇందులో స్టఫ్ చేస్తారు. బొగ్గుల మంట మీద ఈ వెదురు బొంగును ఉంచి, లోపలి చికెన్ కాలేలా చూస్తారు. ఇందులో ఒక్క చుక్కనూనె కూడా ఉపయోగించరు. వెదురు బొంగులోకి వెళ్లే ఆవిరి ద్వారానే లోపల ఉన్న చికెన్ కాలుతుంది. ఈ విధానంలోనే వెదురు షూట్ కర్రీ, వెదురు చట్నీ కూడా తయారుచేస్తారు. విదేశీయులు సైతం బొంగు చికెన్‌ను ఇష్టంగా తింటున్నారు.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని కొండారెడ్డి గిరిజన తెగకు చెందిన వారు బొంగు చికెన్‌ను మొట్టమొదటగా తయారు చేసినట్లు చెబుతారు. ఈ వంటకాన్ని హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలోని మల్టీ క్విజీన్ రెస్టారెంట్లలో సర్వ్ చేస్తున్నారు. ‘‘ఈ ప్రాంతంలో ఉన్న అందమైన సెలయేళ్లు, వెదురు బొంగు చికెన్ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.

ఇలా తయారవుతుంది…
ప్రత్యేకమైన వెదురు బొంగును ఎంచుకుని, మ్యారినేట్ చేసిన చికెన్‌ను ఇందులో స్టఫ్ చేస్తారు. బొగ్గుల మంట మీద ఈ వెదురు బొంగును ఉంచి, లోపలి చికెన్ కాలేలా చూస్తారు. ఇందులో ఒక్క చుక్కనూనె కూడా ఉపయోగించరు. వెదురు బొంగులోకి వెళ్లే ఆవిరి ద్వారానే లోపల ఉన్న చికెన్ కాలుతుంది. ఈ విధానంలోనే వెదురు షూట్ కర్రీ, వెదురు చట్నీ కూడా తయారుచేస్తారు. విదేశీయులు సైతం బొంగు చికెన్‌ను ఇష్టంగా తింటున్నారు.
చికెన్ బిర్యానీ
![]()
చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్స్ అందరికీ ఇష్టమే. ఈ వంటకం మనకు ఎప్పటి నుంచో ఉంది. మనదేశంలో చాలా మంది ఫంక్షన్స్ లేదా ఇతర సందర్భాల్లో ఎక్కువగా ప్రియార్టీ ఇచ్చే వంటంకం కూడా ఇదే. సరే ఈ వంటకాన్నీ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
చికెన్ – ఒక కిలో, బాస్మతి బియ్యం – ఒక కిలో, గరం మసాలా – రెండు టీ స్పూన్లు, అల్లం ముద్ద – ఒక టేబుల్ స్పూను, నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను, పెరుగు – ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు, పచ్చిమిరపకాయలు – ఐదు, ఎండు మిరపకాయలు – ఆరు, పసుపు – చిటికెడు, కొత్తిమీర – ఒక కట్ట, ఉప్పు – తగినంత, నూనె – సరిపడంతా తీసుకోవాలి.
తయారుచేయు విధానం: ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టాలి. బియ్యాన్ని కడిగి ఆర బెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతులు నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి. స్టౌ మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా వేసి దానిపైన సగం ఉడికిన అన్నాన్ని వేయాలి. మళ్లీ ఒక పొర మిగతా మాంసాన్ని వేయాలి. దానిపై మిగిలిన అన్నాన్ని వేసి మూతపెట్టాలి. ఆవిరి బయటికి పోకుండా ఉండటానికి మూత అంచుకి మెత్తగా కలిపిన మైదా పిండిని పెట్టాలి. పిండి మొత్తం ఆరిపోయి పెచ్చులుగా వచ్చేసే వరకూ ఉడికించి దించేయాలి. ఘుమఘుమలాడే బిర్యాని తయారయినట్టే. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలతో అలంకరించుకోవాలి.
చికెన్ పులావ్
రెస్టారెంట్ లలో ఎక్కువగా చికెన్ బిర్యానీనే కనిపిస్తుంది… పులావ్ తిందామంటే అన్ని చోట్లా ఉండదు. నిజానికి బిర్యానీ కన్నా కూడా చికెన్ పులావ్ చేయడం చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం – రెండు కప్పులు, చికెన్ ముక్కలు – అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు టీ స్పూనులు, ఉల్లిముక్క – ఒకటి (పెద్దది), యాలకులు – మూడు, లవంగాలు – మూడు, పలావు ఆకు – మూడు, స్టార్ అనిస్ – రెండు, దాల్చిన చెక్క – ఒకటి, పచ్చి మిరపకాయలు – మూడు, గరం మసాలా పొడి – ఒక టీస్పూను, కారం- ఒక టీస్పూను, పసుపు – ఒక టీ స్పూను, పెరుగు – రెండు టీ స్పూనులు, ఉప్పు – సరిపడినంత, నూనె – సరిపడినంత
తయారు చేసే విధానం
చికెన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి నీరు వార్చి ఒక బౌల్ లో ఉంచాలి. బౌల్ లో కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, ఒక టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి చికెన్ లో బాగా కలిపి ఒక పక్కన అరగంట పాటూ ఉంచేయాలి. అరగంట తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి, అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక పలావు ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ అనిస్ వేసి వేయించాలి. తరువాత నిలువునా కోసిన పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగాక మారినేట్ చేసిన చికెన్‌ను వేసి బాగా కలపాలి. కాసేపు చికెన్ కుక్ చేయాలి. ఇప్పుడు రెండు కప్పుల పెరుగును వేసి బాగా కలపాలి. చికెన్ ముక్కలు హాఫ్ బాయిల్ అయ్యే దాకా అలా ఉడికించాలి. అనంతరం కడిగిన బియ్యం వేసి కలపాలి. బియ్యం ఉడికేందుకు నాలుగు కప్పుల నీళ్లు వేయాలి. అందులో చిటికెడు పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు వేసి కలపాలి. అన్నం ఉడికాక దించేముందు ఒకసారి గరిటెతో కలపాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయింది.
నాటుకోడి కూర
కావాల్సిన పదార్థాలు:
నాటుకోడి -1 కేజీ, జీడిపప్పు- 100 గ్రా, నూనె-100గ్రా, పచ్చిమిర్చి -50గ్రా, టమాటాలు -1/4 కేజి
ఉల్లిపాయలు -100గ్రా, అల్లం వెల్లుల్లి పేస్ట్-50 గ్రా, పసుపు-చిటికెడు, ఉప్పు-తగినంత
ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి-చిటికెడు, కొత్తిమీర-2 టీ స్పూన్లు
తయారుచేసే విధానం :
- మాంసం ముక్కలకు కారం, పసుపు, ధనియాల పొడి పట్టించాలి.
- జీడి పప్పులో కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించి చల్లారిన తర్వాత ముద్ద చేయాలి.
- స్టౌపై ఒక మందపాటి గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తర్వత టమాటా ముక్కలు, కోడి మాంసం వేసి ఉడికించాలి.
- ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముద్ద వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలిపి ఉడికిం చాలి.
- దించే ముందు కొత్తిమీర టమాటా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
పుదీనా చికెన్
![]()
‘చికెన్’… ఈ పేరు వింటేనే చాలు… నోరూరని మాంసాహార ప్రియులు ఉండరనే చెప్పాలి. ముఖ్యంగా ఆదివారం సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు… చిన్నా, పెద్ద తేడా లేకుండా సుష్టుగా చికెన్ లాగించేస్తారు. చికెన్‌తో కూరలు, బిర్యానీలే కాదు మంచి స్నాక్స్ కూడా తయారుచేసుకోవచ్చు. శరీరానికి చలువనిచ్చి… ఆరోగ్య ప్రదాయినిగా ఉపయోగపడే… పుదీనాతో చికెన్ వంటకం ఎంత రుచిగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
కావాల్సిన పదార్థాలు:

* చికెన్: అరకిలో
* పుదీనా: 2 కప్పులు
* కొత్తిమీర: కప్పు
* అల్లం ముక్క: కొద్దిగా
* వెల్లుల్లి: 5 రెబ్బలు
* పచ్చిమిర్చి: 5
* పెరుగు: అరకప్పు
* గరం మసాలా: టీ స్పూను
* పసుపు: అర స్పూను
* ఉప్పు: రుచికి తగినంత
* చికెన్: అరకిలో
* పుదీనా: 2 కప్పులు
* కొత్తిమీర: కప్పు
* అల్లం ముక్క: కొద్దిగా
* వెల్లుల్లి: 5 రెబ్బలు
* పచ్చిమిర్చి: 5
* పెరుగు: అరకప్పు
* గరం మసాలా: టీ స్పూను
* పసుపు: అర స్పూను
* ఉప్పు: రుచికి తగినంత
* నూనె: అర కప్పు
* నిమ్మకాయలు-1
* జీడిపప్పు: అవసరమైనన్నీ.
తయారీ విధానం:
మొదట పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి తగినంత ఉప్పు, పసుపు, పెరుగు, గరంమసాలా కలిపి గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఒక బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత… జీడిపప్పులు వేసి వేయించాలి. కాసేపాగి చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ అన్నివైపులా చక్కగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. చివరలో నిమ్మరసం, కొత్తిమీర వేసి కాసేపు అలాగే ఉంచాలి.
ఇక సాయంత్రంలో తినడానికి యమ్మీ యమ్మీగా… ఉండే పుదీనా చికెన్ రెడి అయినట్లే… మరెందుకికా ఆలస్యం…. వెంటనే ట్రై చేద్దాం. అన్నట్లు… ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండోయ్…
గోంగూర చికెన్ ఫ్రై
కావలసిన పదార్థాలు
గరం మసాలా – పావు టీస్పూను, కరివేపాకు – 2 రెమ్మలు, జీలకర్ర – చిటికెడు, గోంగూర – 1 కప్పు
నూనె – 1 టీస్పూను, నెయ్యి – చికెన్ వేయించటానికి సరిపడా, మారినేషన్ కోసం:చికెన్ – 300 గ్రా
ఉల్లి ముద్ద – అర కప్పు, నిమ్మరసం – అర టే.స్పూను, నెయ్యి – 1 టీస్పూను, ఉప్పు – తగినంత
కారం – పావు టీస్పూను, ధనియాల పొడి – పావు టీస్పూను, అల్లంవెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూను
Google ad
తయారు చేయు విధానం
మసాలదినుసులను పట్టించిన చికెన్‌ను అర గంటపాటు పక్కనుంచాలి. బాండీలో 1 టీస్పూన్ నూనె వేసి గోంగూర వేసి ఉడికేదాకా వేయించి తీయాలి. ఉడికిన గోంగూరకు పచ్చిమిర్చి చేర్చి మిక్సీలో ముద్ద చేసుకోవాలి. చికెన్ ముక్కలకు ఉప్పు చేర్చి ఉడకబెట్టుకోవాలి. బాండీలో నెయ్యి వేసి కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.చికెన్ ముక్కలు, గరం మసాలా వేసి పొడిగా తయారయ్యేవరకూ వేయించాలి. గోంగూర ముద్ద వేసి చికెన్ ముక్కలకి పట్టి పొడిగా తయారయ్యేవరకూ వేయించుకోవాలి. ఏమాత్రం తడిలేకుండా పొడి పొడిగా తయారయ్యాక మంట తీసి పేట్‌లోకి తీసుకోవాలి.
చికెన్ టిక్కా
మాంసాహార వంటకాలు ఎన్ని ఉన్నా… చికెన్ అంటేనే ఎక్కువమంది మక్కువ చూపుతారు. చికెన్ వంటకాల్లో చాలా సులభంగా వండుకునే వాటిల్లో చికెన్ టిక్కా ఒకటి. నూనె అవసరం లేకుండానే దీన్ని వండుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు: ఎముకల్లేని చికెన్ ముక్కలు – అరకేజీ, కారం – చెంచా, మిరియాలపొడి – అరచెంచా, గరంమసాలా – అరచెంచా, పసుపు – పావుచెంచా, ఉప్పు – రుచికి తగినంత, ధనియాలపొడి – అరచెంచా, కసూరీమేథీ – ముప్పావుచెంచా, బిర్యానీ మసాలా – అరచెంచా, సెనగపిండి – ఒకటిన్నర టేబుల్‌స్పూను , నిమ్మరసం – టేబుల్‌స్పూను, పెరుగు – కప్పు.
తయారీ విధానం: మొదటగా ‘చికెన్ టిక్కా’ తయారీకి కావాల్సిన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఓ గిన్నెలో చికెన్ తీసుకొని… నిమ్మరసం కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి సెనగపిండి, కారం, పసుపు, మిరియాలపొడి, గరం మసాల పొడి, బిర్యానీ మసాల, రుచికి తగినంత ఉప్పు, మిగిలిన ఇతర పదార్థాలను కలపాలి. చివరగా ఈ మిశ్రమానికి పెరుగు కలిపి అరగంట నుంచి గంట వరకు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత బయటకు తీసి చికెన్ ముక్కలను ఇనుప చువ్వలకు గుచ్చుకొని… నిప్పులమీద కాల్చాలి. అన్ని వైపులా కాలేలా… చువ్వలను తిప్పుతూ ఉండాలి. అవసరమైతే కాల్చే సమయంలో ముక్కలపై బటర్ కానీ, కొద్దిగా ఆయిల్ గాని వేసుకొని కాల్చుకోవచ్చు. వీటిని పుదీనా పెరుగు పచ్చడితో తింటే మంచి రుచిగా ఉంటుంది. సులభంగా కూడా జీర్ణమవుతుంది.
పుదీనా పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు: పుదీనా – కప్పు, కొత్తిమీర – అరకప్పు, పచ్చిమిర్చి – 5, నిమ్మరసం – టీ స్పూన్, చాట్ మసాలా – టీ స్పూన్, బ్లాక్ సాల్ట్, సాల్ట్ – తగినంత, పెరుగు – ఒక కప్పు. అవసరాన్ని బట్టి పదార్థాల పరిమాణాన్ని పెంచుకోవచ్చు.
తయారీ విధానం: మొదటగా పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా కడిగి ఉంచుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో తీసుకోవాలి. వీటికి తగినంత పరిమాణంలో నిమ్మరసం, ఉప్పు, బ్లాక్ సాల్, పెరుగు కలపాలి. మిక్సీలో రుబ్బుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని, చికెన్ టిక్కా లేదా ఏదైనా స్నాక్స్‌తో లొట్టలేసుకుంటూ తినొచ్చు.
రుచికరమైన చికెన్ సమోసా
సమోసా.. ఈ పదం వింటేనే పిల్లలకు నోట్లో నీరూరుతుంటాయి. అలా బయటికి వెళ్లి వేడి వేడి సమోసాలను తినడానికి మారాం చేస్తుంటారు. కాని బయట దొరికే సమోసాల వల్ల అనారోగ్యం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలా జరగకూడదంటే.. ఇంట్లోనే సమోసాలను తయారుచేసుకోవడమే ఉత్తమం, ఆరోగ్యం కూడా. అందులోనూ చికెన్ అంటే అమితంగా ఇష్టపడే పిల్లలకు..
సమోసా చేసిపెడితే .. ఆరోగ్యానికి ఆరోగ్యం… ఆనందానికి ఆనందం. రుచికరమైన, నోరూరించే చికెన్ సమోసాను తయారుచేయడం కూడా చాలా సులభం.
ముందుగానే అన్ని సిద్దంగా చేసుకుంటే చాలు.. చివరి నిమిషంలో జస్ట్ ఫ్రై చేసి, వేడి వేడిగా చట్నీ లేదా సాస్‌తో తింటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. మరి చికెన్ సమోసాను ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..
కావల్సిన పదార్థాలు…
* చికెన్ (కీమా) – 1 కప్పు (లేదా) అవసరాన్ని బట్టి పరిమాణం పెంచుకోవచ్చు
* కారం పొడి- 2 స్పూన్లు
* గరం మసాల – స్పూను
* పసుపు – అర స్పూను
* సోంపు పౌడర్ – స్పూను
* ఉప్పు – తగినంత
* మిరియాల పొడి – అరస్పూను
* ఉల్లిపాయలు – 3 (సన్నగా తరిగినవి)
* నూనె – వేయించడానికి సరిపడా
* అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 2 స్పూన్లు
* పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి)
* గుడ్డు – 1
* గోధుమపిండి – కప్పు
* మైదాపిండి – 2 కప్పులు
* ధనియాల పొడి – 2 స్పూన్లు
* నిమ్మకాయ -1
* నీళ్లు – సరిపడా
* కొత్తిమీర – కొద్దిగా,
తయారీ విధానం..
* ముందుగా కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ మిన్స్‌ను (సన్నగా తరిగిన చికెన్ లేదా చికెన్ కీమా) జోడించాలి. తర్వాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
* తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో.. గోధుమ పిండి, మైదాపిండి, గుడ్డు, చిటికెడు ఉప్పు వేసి మెత్తగా కలిపి 15 నిమషాలు అలాగే పెట్టాలి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్నచిన్న చపాతీల మాదిరిగా చేసుకోవాలి. వాటి మధ్యలో ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని నింపి.. సమోసాల మాదిరిగా ఒత్తుకోవాలి. అదనపు రుచికోసం మిశ్రమంలో నిమ్మరసం, కొత్తిమీర వేసుకోవచ్చు.
*ఈ విధంగా తయారుచేసుకున్న సమోసాలను.. నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకూ గోలించుకోవాలి.తర్వాత తీసిన సమోసాలను వేడి వేడిగా సాస్‌తో కలిపి తింటే.. అదిరిపోదూ..
Google ad
