గోదావరి చేపల పులుసు

కావల్సినవి: కొరమీను చేప – కేజీ (మీడియమ్ సైజులో ముక్కలు చేయాలి); చింతపండు – 150 గ్రా.లు (నీళ్లలో నానబెట్టి రసం తీయాలి); టొమాటోలు – పావుకేజీ (ముక్కలుగా కట్ చేయాలి); ఉల్లిపాయలు – పావుకేజీ (సన్నగా తరగాలి); పచ్చిమిర్చి – 5 (నిలువుగా చీరాలి); మెంతులు – 2 టీ స్పూన్లు; ఆవాలు – టీ స్పూన్; కారం – తగినంత; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – 2 టీ స్పూన్లు; ఎండుకొబ్బరి – 2 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; నూనె – తగినంత.
తయారీ: ∙వెడల్పాటి పాన్‌లో నూనె వేసి కాగాక మెంతులు, ఆవాలు వేయించి ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలపాలి. అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేగాక సరిపడా కారం, చింతపులుసు, ఉప్పు కలిపి ఉడికించాలి ∙రసం చిక్కబడ్డాక చేప ముక్కలు వేసి మూత పెట్టాలి ∙5 నిమిషాల తర్వాత మూత తీసి కొత్తిమీర చల్లి దించాలి lగరిటెతో కలిపితే ముక్కలు విరిగిపోతాయి కనుక జాగ్రత్తగా తీసుకోవాలి.
మునక్కాయ చేపల కూర
కావలసినవి: కొరమీను చేప ముక్కలు – అరకేజీ; కారం – నాలుగు టీ స్పూన్లు; ధనియాల పొడి – రెండు టీ స్పూన్లు; చింతపండు గుజ్జు – అర కప్పు; కొబ్బరి పేస్ట్ – అర కప్పు; పచ్చిమిర్చి – 10 (కచ్చాపచ్చాగ దంచాలి); మునక్కాయలు – 2 (చిన్న ముక్కలుగా కట్ చేయాలి); నూనె – అర కప్పు,; జీలకర్ర పొడి – టీ స్పూన్; ఎండుమిర్చి – 5, కరివేపాకు – రెమ్మ; పసుపు – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత.
తయారీ:
►చేపముక్కలను శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి
►స్టౌ మీద పాన్ పెట్టి రెండు టీ స్పూన్ల నూనె వేసి వేడెక్కాక అందులో కొబ్బరి పేస్ట్, పచ్చిమిర్చి, ధనియాలపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి
►తర్వాత రెండు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టాలి
►ఈ మిశ్రమం కాస్త చిక్కపడ్డాక అందులో కట్ చేసిన మునక్కాయ ముక్కలు, చింతపండు గుజ్జు పోసి సన్నటి సెగ మీద ఉంచాలి
►ఇది ఉడుకుతుండగా మధ్యలో చేప ముక్కలను కూడా జత చేసి మూతపెట్టాలి
►ఈ మిశ్రమమంతా చిక్కబడుతుండగా దించి వేరొక పాన్‌లో మిగిలిన నూనె వేయాలి
►అది వేడెక్కాక అందులో జీలకర్రపొడి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టాలి
►వేయించిన తాలింపును ఉడికించిన కూరలో కలిపి గిన్నెలోకి తీసుకోవాలి.
ఫిష్ బిర్యానీ

కావల్సినవి: చేపముక్కలు – అర కేజీ; అల్లం వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; కారం – అర టీ స్పూన్; బిర్యానీ మసాలా/ గరం మసాలా – అర టీ స్పూన్; పసుపు – కొద్దిగ; నిమ్మరసం – ఒకటిన్నర టేబుల్ స్పూన్; ఉప్పు – తగినంత; టొమాటొ – 1; ఇతర పదార్థాలు; బిర్యానీ ఆకు – 1 ; బిర్యానీ పువ్వు – 2 ; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 6; పచ్చ యాలకులు – 3; సాజీరా – అర టీ స్పూన్.
గ్రేవీ కోసం: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఉల్లిపాయల స్లైసులు – కప్పు; అల్లం –వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర కప్పు; గరం మసాలా పొడి – టీ స్పూన్; ధనియాల పొడి – అర టీ స్పూన్; కారం – అర టీ స్పూన్; పెరుగు – కప్పు; పుదీనా తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు – తగినంత; పాలు – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత;
బిర్యానీ రైస్: బాస్మతి బియ్యం – 1 1/2 కప్పు; ఉప్పు – తగినంత; నూనె – 1 టీ స్పూన్.
తయారీ: ∙చేపలు కాకుండా మిగతా పదార్థాలన్నీ ఒక పాత్రలో వేసి కలిపి పక్కన ఉంచాలి. ఉప్పు, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. దీంట్లో చేప ముక్కలు వేసి కలపాలి ∙విడిగా గోరువెచ్చని పాలలో కుంకమపువ్వు వేసి కలిపి పక్కనుంచాలి ∙బాస్మతి బియ్యం కడిగి అరగంట నీళ్లలో నానబెట్టాలి. తర్వాత జల్లెడలో పోసి వడకట్టాలి ∙ఒక గిన్నెలో 6 కప్పుల నీళ్లు పోసి టీ స్పూన్ నూనె, ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి మరిగించాలి ∙వడకట్టిన బియ్యం మరుగుతున్న నీళ్లలో వేసి ఉడికించాలి. అయితే, ఆఫ్ బాయిల్ కాగానే వడకట్టి పక్కనుంచాలి. మరొక గిన్నెలో కొద్దిగా నూనె వేసి చేప ముక్కలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేయించి తీయాలి ∙దాంట్లోనే మరికొద్దిగ నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. ∙దాంట్లోనే మిగతా అన్ని దినుసులు వేసి కొద్దిగా వేయించాలి ∙అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక టొమాటో ముక్కలు ఉడికించాలి. గరం మసాలా, ధనియాలపొడి, కారం వేసి వేగాక పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడేలా ఉడికించాలి. ∙ఒక మందపాటి పెద్ద గిన్నెలో అడుగున కొద్దిగా గ్రేవీని ఒక లేయర్‌గా వేయాలి. దాని మీద సగం ఉడికిన అన్నాన్ని మరొక లేయర్‌గా వేసి ఆ పైన పుదీనా, కొత్తిమీర చల్లాలి. ఆ పైన వేయించిన చేప ముక్కలు కొన్ని ఉంచాలి. వాటి మీదుగా మళ్లీ అన్నం.. దాని మీద కొత్తిమీర–పుదీన– ఉల్లిపాయలు, కుంకుమపువ్వు పాలు.. ఆ పైన మళ్లీ చేప ముక్కలు.. ఆ పైన అన్నం.. ఇలా అన్ని లేయర్లు పూర్తి చేయాలి.
►గిన్నె పైన మందపాటి మూత పెట్టి గోధుమపిండి ముద్దతో సీల్ చేయాలి. మంట పెంచి 2 నిమిషాలు ఆ తర్వాత మంట బాగా తగ్గించి 10 నుంచి 15 నిముషాలు ఉంచాలి ∙మంట ఆర్పేసి మరో పది నిమిషాలు ఉంచి మూత తీయాలి. వడ్డించడానికి ఫిష్ బిర్యానీ రెడీ. సన్నని స్లైసులుగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పెరుగు లేదా రైతాతో వడ్డించాలి.
చేప కుర్మా.
చేపముక్కలు కడిగి పసుపు, కారం,అరచెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి కలిపి అరగంట పాటూ పక్కన పెట్టాలి. ఇప్పుడు కళాయిలో కాస్త నూనె వేసి చేప ముక్కల్ని బాగా వేయించాలి. వాటిని తీసి పక్కన పెట్టాలి. బాణలిలో మరికొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర, కారం, టమాటా ముక్కలు వేసి బాగా ఉడకబెట్టాలి. అందులో రెండు కప్పుల నీళ్లు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉడికించాలి. ఆ సమయంలో చింతపండు రసం కూడా వేసేయాలి. నీళ్లు తగ్గి ఇగురులా అవుతున్నప్పుడు ముందుగా వేయించిన చేపల్ని అందులో వేయాలి. చేపముక్కలకి ఇగురు అంటేలా ఒక్కో ముక్కని కలపాలి. పైన కాస్త మెంతి పొడి, మసాలా చల్లి మళ్లీ కలపాలి. దించేముందు కొత్తి మీర చల్లాలి. వేడివేడి చేపల కుర్మా తినడానికి రెడీ అయినట్టే.
చేప మసాలా ఫ్రై
లావుగా ఉండే చేపకన్నా బల్లపరుపుగా ఉండే చేపలు ఇలాంటి ఫ్రైకు పనికొస్తాయి. చందువా చేపైతే ఇంకా బాగుంటుంది.
చేప – ఒకటి, ఎండుమిర్చి – నాలుగు, లవంగాలు – మూడు, దాల్చిన చెక్క – రెండు (చిన్నవి), యాలకులు – అయిదు, జీలకర్ర – పావు చెంచా, మిరియాలు – పావు చెంచా, అల్లం తరుగు – ఒక చెంచా, వెల్లుల్లి రెబ్బలు – అయిదు, ఉల్లిపాయ – ఒకటి, ఉప్పు సరిపడినంత, నూనె – సరిపడినంత, వెనిగర్ – టీ స్పూను
చేపల వేపుడు

కావల్సినవి: చేప ముక్కలు – 6; కారం – అర టీ స్పూన్; మొక్కజొన్న పిండి – టీ స్పూన్; ఉప్పు – తగినంత; నిమ్మరసం – అర టీ స్పూన్; గుడ్డు – 1; ఉల్లిపాయలు – 1 (సన్నగా తరగాలి); నూనె – తగినంత; ధనియాల పొడి – టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; జీలకర్ర – అర టీ స్పూన్; కొత్తి మీర – టీ స్పూన్.
తయారీ: ∙గిన్నెలో చేప ముక్కలు వేసి కారం, మొక్కజొన్నపిండి, ఉప్పు, నిమ్మరసం, గుడ్డు, ధనియాల పొడి, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం వేసి కలిపి అరగంట పక్క నుంచాలి ►కడాయిలో నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లిపాయలు వేయించాలి.
►అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కరివేపాకు వేసి కలిపి తర్వాత చేప ముక్కలు వేసి వేయించాలి
►తర్వాత కొత్తి మీర చల్లి దించాలి.
కరకరలాడే… బటర్ ఫిష్ ఫ్రై
అమృత్‌సర్ మచ్చి

కావల్సినవి: వంజరం చేప గుండ్రటి ముక్కలు – 600 గ్రా.లు; శనగపిండి – కప్పు; కారం – టేబుల్ స్పూన్; వాము (ఓమ) – టీ స్పూన్; అల్లం ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్ స్పూన్లు; నిమ్మరం – టేబుల్ స్పూన్; నూనె – వేయించడానికి తగినంత; గుడ్డు – 1; చాట్ మసాలా – టీ స్పూన్ ; నిమ్మ ముక్కలు (చక్రాల్లా కోసినవి) – 2.
తయారీ: ∙బాగా కడిగిన చేప ముక్కలు ఒక గిన్నెలో వేసి, అందులో కారం, ఉప్పు, వాము, అల్లం, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, శనగపిండి వేసి కలిపి పక్కనుంచాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి ∙మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, కలిపి, చేప ముక్కలను అందులో ముంచి కాగిన నూనెలో వేసి రెండువైపులా గోధుమరంగులోకి మారేంతవరకు వేయించుకోవాలి ∙పేపర్‌నాపికిన్ (అబ్‌సార్బెంట్ పేపర్) మీద వేయించుకున్న ముక్కలు వేయాలి. ఇలా చేస్తే అదనపు నూనె పేపర్ పీల్చుకుంటుంది. వడ్డించే ముందు వీటిని మరోసారి వేయించి, వెంటనే అందిస్తే చేప ముక్కలు కరకరలాడుతూ బాగుంటాయి ∙చేప ముక్కలను వేసే ప్లేట్ అడుగున అబ్‌సార్బెంట్ పేపర్ వేసి, ముక్కల పైన చాట్ మసాలా చల్లి, కట్ చేసుకున్న నిమ్మముక్కలతో అలంకరించాలి.
చేప ఆవకాయ

కావల్సినవి: ఆవకాయ – 100 గ్రా.లు; చేప ముక్కలు (ముల్లు తీసినవి) – 200 గ్రా.లు; నూనె – వేయించడానికి తగినంత; మైదా – కప్పు; మొక్కజొన్న పిండి – కప్పు; ఉప్పు – తగినంత; కారం – టీ స్పూన్; మిరియాల పొడి – టీ స్పూన్; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; పచ్చిమిర్చి – 4; అల్లం–వెల్లుల్లి ముద్ద– టీ స్పూన్; అల్లం–వెలుల్లి తరుగు– 2 టేబుల్ స్పూన్లు; గుడ్డు – 1; ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి).
తయారీ: ∙ముందుగా చేపలను శుభ్రం చేసి, ఒక గిన్నెలో వేసి అందులో గుడ్డు సొన, ఉప్పు, మిరియాలపొడి, కారం, అల్లం–వెల్లుల్లి ముద్ద, మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి.
►కడాయిలో నూనె పోసి కాగాక ఈ చేప ముక్కలను పకోడీల మాదిరి వేయించి తీసి పక్కన పెట్టాలి ∙తరువాత మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అల్లం–వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవకాయ వేసి కలపాలి
►దీంట్లో వేయించిన చేప ముక్కలను వేసి బాగా కలపాలి. తరువాత కొత్తిమీర తరుగు చల్లి సర్వ్ చేయాలి.