📧 yanamtakshashila@gmail.com
YanamTakshashila
☰ Menu

Yanam(India) Daily Updates 24-02-2026

దేశానికి స్వర్ణపతకాలు అందించిన యానాం క్రీడాకారులు

అంతర్జాతీయ బాల్ బాడ్మింటన్ క్రీడా పోటీలలో యానాంకు చెందిన ఇద్దరు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు…

జనవరి 1 నుంచి 5 వరకు నేపాల్ దేశంలో జరిగిన ఇండియా-నేపాల్ బాల్ బాడ్మింటన్ పోటీలు, అలాగే ఈ నెల 14 నుంచి 19 వరకు ఇండోనేషియాలో జరిగిన ఇండియా-ఇండోనేషియా బాల్ బాడ్మింటన్ పోటీలలో యానాం బాల్ బాడ్మింటన్ క్లబ్‌కు చెందిన చోడే గుణశ్యామ్, ఎడ్ల రవికుమార్‌లు స్వర్ణ పతకాలు సాధించారు.

ఈ పోటీలు బాల్ బాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. క్రీడాకారులను శిక్షణ ఇచ్చిన పీఈటీ బొట్టా శ్రీనివాస్, రాయవరపు విజయ్‌లను క్లబ్ అధ్యక్షుడు కాపగంటి పవన్ కుమార్, కార్యదర్శి కాపగంటి ఆదర్శ శేషుసుమన్ అభినందించారు.

Google ad

పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు క్రీడాకారులను శాలువాతో సత్కరించారు.

యానాం పరివాలనాధికారి ఆకస్మిక బదిలీ

యానాం పరివాలనాధికారి అంకితకుమార్‌ను కేంద్రపాలిత ప్రాంతం మాహేకు బదిలీ చేశారు…

ఆయన స్థానంలో శివరాజ్ మీనాను నియమించారు. గతంలో కూడా యానాం పరివాలనాధికారిగా సమర్థంగా పనిచేశారు.

పుదుచ్చేరి వ్యాప్తంగా 14 మంది పీసీఎస్ అధికారులను తక్షణం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పరిహారం పై నిర్ణయం తీసుకోవాలి

దరియాలతిప్ప దీవి వద్ద జరిగిన ఓఎన్‌జీసీ పైపులైన్ పేలుడు ఘటనలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లింపు పై వారంలో నిర్ణయం తీసుకోవాలని సీఎం రంగసామి సూచించారు.

కాకినాడ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

క్రీడా వసతుల అభివృద్ధికి చర్యలు

యానాం పట్టణం మరియు గ్రామాల్లో మినీ ఇండోర్ స్టేడియంలలో చెక్క ఫ్లోరింగ్, బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

దరియాలతిప్ప ఇండోర్ స్టేడియంలో 30 జట్లు పాల్గొంటున్న పోటీలు జరుగుతున్నాయి.

Yanam Players Win Gold Medals for the Nation

Two sportspersons from Yanam won gold medals in international Ball Badminton tournaments.

Chode Gunashyam and Edla Ravikumar of Yanam Ball Badminton Club secured gold medals in the India–Nepal tournament held in Nepal from January 1 to 5 and in the India–Indonesia tournament held from 14 to 19 of this month in Indonesia.

The tournaments were conducted under the Ball Badminton Federation of Asia. Club President Kapaganti Pawan Kumar and Secretary Kapaganti Adarsha Seshusuman congratulated the players and their coaches PET Botta Srinivas and Rayavarapu Vijay.

Delhi Special Representative of Puducherry Government Malladi Krishnarao honoured the players with shawls.

Sudden Transfer of Yanam Administrator

Yanam Administrator Ankita Kumar has been transferred to Mahe in the Union Territory.

Shivraj Meena has been appointed in his place. He previously served effectively as Yanam Administrator and is currently serving as Director of Puducherry Port and DIG of Prisons.

Orders were issued transferring 14 PCS officers across Puducherry.

Decision on Compensation Should Be Taken

Regarding compensation to victims of the ONGC pipeline explosion at Dariyalatippa island, Chief Minister Rangasamy urged that a decision be taken within a week.

A committee under the Kakinada Collector involving Yanam officials and ONGC representatives will take an appropriate decision.

Measures for Development of Sports Infrastructure

Efforts are being made to provide wooden flooring in mini indoor stadiums and construct courts for badminton, volleyball, and basketball in Yanam town and villages.

Thirty teams are participating in competitions currently being held at the Dariyalatippa Indoor Stadium.

Advertisement
Google ad
Scroll to Top

Discover more from YANAMTAKSHASHILA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading