Google ad
ఒంటిమిట్ట లో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం ఉన్నది. ఇక్కడున్న రామాలయాన్ని కోదండరామ స్వామి రామాలయం అంటారు. ఒంటిమిట్ట కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ క్షేత్రం కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి నుండి 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
ఒంటిమిట్ట లోని శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం దాని విశిష్టతకు, మహిమలకు పేరుగాంచినది. ఇక్కడ ప్రచారంలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయ మహత్యం గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగకమానదు. ఈ క్షేత్రానికి గల మరోపేరు ఏకశిలానగరం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టని ‘ఆంధ్రా భద్రాచలం’ గా పిలుస్తున్నారు ప్రజానీకం. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తారు.

రైలు మార్గం
ఒంటిమిట్ట లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇక్కడి నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రధాన ఆలయానికి సులభంగా కాలినడకన గానీ లేదా షేర్ ఆటోలో గానీ ఎక్కి చేరుకోవచ్చు. అలాగే భాకరపేట్ రైల్వే స్టేషన్ (7 కి.మీ), కడప రైల్వే స్టేషన్ (25 కి.మీ) మరియు తిరుపతి రైల్వే స్టేషన్ (106 కి.మీ) లు ఒంటిమిట్ట కు చేరువలో ఉన్నాయి.
Google ad
Raju's Resource Hub