Google ad

ఈ ఆలయం 800 నుండి 900 సంవత్సరాలకు పూర్వం నిర్మించారు.ఒక ఆలోచనతో శివ ఆలయం నుండి మహారాజ గణపతి ఆలయం ,కాకతీయ సామ్రాజ్యానికి ఉండేలా నిర్మించారు.గణపతి రాజు తన శిల్ప కళాకారుడైన రామప్ప తో ఎక్కువకాలం ఉండేలాగా ఒక దేవాలయాన్ని నిర్మించాలని అడిగితే అందుకు రామప్ప ఎంతో కాలం శ్రమించి, అద్భుతమైన కళాకారులతో ఈ దేవాలయాన్ని నిర్మించారు.అది ఎంతో సుందరంగా ఉండడం తో రాజు సంతోషించి ఆ దేవాలయానికి #రామప్ప దేవాలయం గా పేరు పెట్టారు.ప్రపంచం లో ఇది మొదటి దేవాలయం ముందుగా శిల్పి పేరుతో దేవాలయం పేరు రాయడం అనేది.
కొన్ని ఏండ్ల క్రితం ప్రజలు గమనించింది ఏంటంటే ఇది పాత దేవాలయం అని,అయినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఎలా ఉంది అని.ఈ విషయం పురావస్తు వారికి తెలిసి వెంటనే పాలంపేట్ కు వెళ్లి వాటిని పరీక్షించగా దేవాలయం ఇంకా చాలా గట్టిగా ,చెక్కు చెదరకుండా ఉందని తేల్చారు.ఎన్ని పరీక్షలు చేసిన కూడా ఆ గట్టితనానికి ఏం వాడారో కనుక్కోవడానికి ఆ రహస్యం మాత్రం ఇప్పటికీ కనుక్కోలేకపోయారు.ఆ రాళ్ళల్లో నుండి ఒక చిన్న ముక్కను పగలకొట్టి తీసుకెళ్లి పరీక్ష చేయగా ఆ రాయి చాలా తేలికగా ఉంది అని కనుక్కొన్నారు. ఆ ముక్కను నీటిలో వేయగా అది నీటిలో తేలుతుంది,దీనినిబట్టి ఇక్కడ ఆర్కేమేడీస్ సూత్రం విఫలం అయింది అని చెప్పవచ్చు.చివరగా తెలుసుకొన్న విషయం ఏంటంటే అన్ని దేవాలయాలు కూడా బరువైన రాళ్లతో నిర్మించారు కానీ రామప్ప ఆలయం మాత్రం చాలా తేలికైన రాళ్లతో కట్టడం వలన అది ఇంకా కూలిపోకుండా ఉంది అని.
ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అర్ధం కాని విషయం ఏంటి అంటే ఆ తేలికైన రాళ్లను రామప్ప ఎక్కడనుండి తెచ్చాడు అని.ప్రపంచం లో ఇలా నీటిపై తేలే రాళ్లను కనుకొవడం చాలా కష్టము,అసాధ్యం.800 ఏండ్ల క్రితం స్వయంగా తానే వీటిని తయారు చేశాడా???ఒకవేల అదే నిజం అయితే ఏ టెక్నాలజీ ని వాడారు??అదికూడా 800,900 ఏండ్ల కింద!!!
ఈ దేవాలయం పలామ్ పేట,వరంగల్ నుండి70 కిలోమీటర్ ల దూరం లో ఉంది.ఈ ఆలయం 6 ఫీట్ ల ఎత్తు ఉన్న వేదిక పైన నిర్మించారు.
Google ad
Raju's Resource Hub