అనిల్ కు ఒక ప్రైవేటు బ్యాంకులో పొదుపు ఖాతా ఉంది. ఎప్పుడో ఆరేడేళ్ల క్రితం ప్రారంభించిన ఖాతా అది. పేరుకు ఖాతా ఉంది కానీ, అందులో ఎలాంటి లావాదేవీలూ చేయలేదు. కనీస నిల్వా లేదు. దీంతో బ్యాంకు రుసుములు విధించడం ప్రారంభించింది. ఒక రోజు బ్యాంకు నుంచి నోటీసు వచ్చింది. వెంటనే రూ.15,000 చెల్లించాల్సిందిగా లేకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీకున్న అన్ని బ్యాంకు ఖాతాలనూ పరిశీలించుకోవడం ముఖ్యం. అవసరం లేనివి ఉంటే, రద్దు చేసుకోవాలి. దాని సారాంశం. చాలామంది ఇలాంటి అనుభవాలను ఎదుర్కొనే ఉంటారు. అందుకే, ఒకసారి ఒక ఖాతాలకు సంబంధించి కొత్తగా కొన్ని నిబంధనలూ ఈ నెల 1 జనవరి 2025 నుంచే అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం..
• రెండేళ్లకు మించి ఎలాంటి లావాదేవీలూ లేని ఖాతాలను వెంటనే బ్యాంకులు రద్దు చేస్తాయి. ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆలోచనే ఈ నిర్ణయానికి కారణం. మీకు ఇలాంటి ఖాతాలుండి, అవి అవసరం అనుకుంటే వెంటనే బ్యాంకును సంప్రదించండి.
• 12 నెలలపాటు ఎలాంటి లావాదేవీలూ లేకపోతే.. వాటిని నిష్క్రియా ఖాతాలుగా పరిగణిస్తారు. వీటిని తొందరగా ‘యాక్టివేట్’ చేసుకోకపోతే, ఈ ఖాతాలనూ బ్యాంకులు నిలిపివేస్తాయి.
• కొన్ని పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కాకుండా ఎక్కువ కాలంపాటు సున్నా నిల్వ ఉన్న ఖాతాలనూ బ్యాంకులు రద్దు చేస్తాయి.
మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి (కేవైసీ) నిబంధనలు సరిగా లేని ఖాతాలకూ ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఒకసారి మీకు ఉన్న బ్యాంకు ఖాతా వివరాలన్నీ చూసుకోండి. అవసరమైతే బ్యాంకును సంప్రదించి, మీ ఖాతాలన్నీ సరిగ్గానే ఉన్నాయా లేదా తెలుసుకోండి.
Raju's Resource Hub
