బీట్రూట్ కూర
బీట్రూట్లను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
1 ఉల్లిపాయను తరిగి పెట్టుకోండి. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోండి. పెసరపప్పును అరగంట నాన్న పెట్టుకోండి.
తయారి విధానం:
స్టవ్ ఆన్ చేసుకుని, బాండి పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ పోసుకోండి, నూనె వేడి ఎక్కాక, కొద్దిగా ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడే , జిలకర్ర కరివేపాకు వేసుకోండి. తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలును కూర కి సరిపడా సాల్ట్ వేసుకుని వేయించుకోండి.
ఉల్లిపాయ ముక్కలు వేగాక, నానబెట్టుకున్న పెసరపప్పు, బీట్రూట్ ముక్కలను వేసుకుని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గి చుకోండి. పదినిమిషాల తర్వాత మూత తీసి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఒక్క నిమిషం వేయించుకుంటే కూర అయిపోతుంది.
పెరుగుతో బీట్‌రూట్ కూర
కావలసినవి
బీట్‌రూట్ తురుము: 2 కప్పులు
కొబ్బరి తురుము: కప్పు
పచ్చిమిర్చి: ఆరు
కరివేపాకు: 4 రెబ్బలు
కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు
నూనె: 4 టీస్పూన్లు
తిరగమాత గింజలు : టీస్పూను
పెరుగు: 2 కప్పులు
పసుపు : అరస్పూను
ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
కొబ్బరితురుము, పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీలో వేసి పేస్టులా చేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక ఎండు మిర్చి రెండు, తిరగమాత గింజలు వేసి వేయించాలి. బీట్‌రూట్ తురుము వేసి కాస్త వేగాక మూతపెట్టి ఓ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొబ్బరి-పచ్చిమిర్చి మిశ్రమం వేసి బాగా కలిపి, మూతపెట్టి సిమ్‌లో పది నిమిషాలు ఉడికించాలి. తరవాత ఉప్పు, కొత్తిమీర తురుము వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించిన తరువాత పెరుగు వేసి బాగా కలపాలి.